TOLLYWOOD TOP 4 టాలీవుడ్‌ టాప్‌ ఫోర్‌ !


తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతితరంలోనూ నలుగురు అగ్ర హీరోలుండటం ఆనవాయితీగా వస్తోంది. ఆ కాలంలో ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు ఇండిస్టీకి నాలుగు స్థంభాలుగా నిలిచారు. ఆ తర్వాతి తరంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ తర్వాతే ఎవరిపేరైనా ప్రస్తావనకి వచ్చేది. వీరు ఫాంలో ఉండగా మరికొందరు టాప్‌కి ఎదిగినా కానీ వీరి సీనియారిటీ ప్రకారం టాప్‌-4 కోటాలో వీరినే చూపేవారు.


ఇప్పుడా తరం హీరోలు పాతబడిపోవడం, వారికి వయస్సు పైబడటంతో నయా టాప్‌-4 ఎవరనేది తేలిపోయింది. ఇప్పుడున్న హీరోల్లో క్రేజ్‌ ప్రకారం, రేంజ్‌ ప్రకారం పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్‌, ప్రభాస్‌ మిగతావారి కంటే చాలా ముందున్నారు. వీరిలో ఎవరు నెంబర్‌వన్‌ అనే చర్చ పక్కనపెడితే ఈ నలుగురూ ప్రస్తుతం మన చిత్ర సీమలో టాప్‌-4 హీరోలు అనడానికి సంశయించనక్కర్లేదు.


ఫ్లాపులతో సంబంధం లేకుండా తమ తదుపరి చిత్రాలకు బిజినెస్‌ చేయగల సత్తా వీరి సొంతం. యావరేజ్‌ కంటెంట్‌తో బాక్సాఫీస్‌ని షేక్‌ చేయగల కెపాసిటి వీరికుంది. ఇక వీరిలో నంబర్‌వన్‌ అనేది మాత్రం ప్రస్తుతానికి డిబేటబుల్‌ పాయింట్‌. అది తేలాలంటే వీరింతా నిలకడగా హిట్స్‌ కొట్టి తమ సత్తా చాటుకోవాలి.

Post a Comment

Previous Post Next Post