Socia-Fantasy Movies Trend Started In Tollywood
తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి. పౌరాణికాలు తీస్తే తెలుగువారే తీయాలి. అవును... ఇది పచ్చినిజం. పౌరాణికాలు తీయడంలో మనను కొట్టేవారే లేరనేది జగద్విదితం. మనవాళ్లు ఎన్నుకున్న కథాంశాలు కానీ, తీసిన విధానం కానీ నభూతో నభవిష్యతే అని చెప్పాలి. అసలు పౌరాణికాలతోనే మన తెలుగు సినిమా నడక మొదలైంది. డెబ్భైల చివరివరకూ పౌరాణికాలు విపరీతంగా వచ్చాయి. పౌరాణికాలతో పాటు జానపదాలు, చారిత్రకాలు, సాంఘికాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచిపెట్టాయి. అయితే మారిన కాలమాన పరిస్థితుల ఫలితంగా మిగతావన్నీ తెరమరుగైపోయి, సాంఘికమే ఘీంకరిస్తూ కూర్చుంది. ఆ సాంఘికాల్లో కూడా అంతా మాస్ మసాలా, యాక్షన్ చిత్రాల హవా సాగింది, సాగుతోంది. అడపాదడపా జానపద, చారిత్రక, పౌరాణిక ప్రయత్నాలు జరిగినా, ఆనాటి ప్రమాణాలు కనబడలేదు.
ఇక పౌరాణికాలు గతకాలపు జ్ఞాపకాల్లా మిగిలిపోతాయనుకుంటున్న సమయంలో చిత్రాతి చిత్రంగా తెలుగునాట మళ్లీ పౌరాణికాల గాలి వీస్తోంది. ఒక్క పౌరాణికమనే కాదు... చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యంలో పలు చిత్రాల రూపకల్పనకు సన్నాహాలు జరగడం కొత్త పరిణామంగా కనిపిస్తోంది. ఇంకో చిత్రమేమిటంటే ఇవన్నీ కూడా ప్రముఖ కథానాయకులు, దర్శకుల నేతృత్వంలో రూపుదిద్దుకుంటుండటం విశేషం. పౌరాణికాలకు పెట్టని కోట అయిన తెలుగునాట దాదాపు దశాబ్దంన్నరకాలంలో ఒక్క పౌరాణికం కూడా రాకపోవడం బాధాకరం. పౌరాణిక పునరుత్తేజానికి కొత్త చివుళ్లు వేసిన సినిమా ‘శ్రీరామరాజ్యం’. యాభై ఏళ్ల నాటి కళాఖండం ‘లవకుశ’ ప్రేరణతో బాపు తీసిన ఈ చిత్రం నవతరం ప్రేక్షకుల్లో కొంగొత్త ఆసక్తిని రేకెత్తించింది.
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి పౌరాణిక పాత్రలకు పేటెంట్ అనదగ్గ ఎన్టీఆర్ తరహాలోనే బాలకృష్ణ శ్రీరాముని పాత్రను రంజింపచేసే ప్రయత్నం చేశారు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి వీరోచిత పాత్రల్లో అలరించిన బాలకృష్ణలో ‘శ్రీరామరాజ్యం’ సరికొత్త దృక్కోణాన్ని ఆవిష్కరించిందనే చెప్పాలి. మొదటినుంచీ కూడా పౌరాణికాలు, జానపదాలు, చారిత్రకాలు అంటే ప్రాణం పెట్టే బాలకృష్ణ భవిష్యత్తులో ఆ తరహా చిత్రాలు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. గతంలో తన దర్శకత్వంలో మొదలుపెట్టి ఆపేసిన ‘నర్తనశాల’ను ఎలాగైనా వెండితెరపై తీసుకురావాలని బాలకృష్ణ ప్రయత్నిస్తున్నారు. అందుకు సంబంధించి తెరవెనుక ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట.
కాస్మోపాలిటన్ హీరో ఇమేజ్ కలిగిన నాగార్జున ‘అన్నమయ్య’ చేయడం అప్పట్లో చాలా పెద్ద రిస్కే. ఆ ప్రయత్నం విజయవంతం కావడంతో నాగ్ ఆ తర్వాత ‘శ్రీరామదాసు’గానూ అలరించారు. అలాగే ఇటీవల చారిత్రక నేపథ్యంలో ‘రాజన్న’ చేశారు. తాజాగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆయన ‘శిరిడి సాయి’గా కనిపించబోతున్నారు. ఇందుకోసం తన గెటప్‌ను కూడా మార్చేసుకున్నారు. సాయి పాత్రలో పూర్తిగా లీనమై నటిస్తున్నట్టుగా యూనిట్ వర్గాల సమాచారం. ఇక, గోపీచంద్, నయనతార కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో సినిమా తీస్తున్న జై బాలాజీ రియల్ మీడియా సంస్థ ‘విప్రనారాయణ’ను రీమేక్ చేయబోతున్నట్లుగా ఇటీవలే ప్రకటించింది. ‘విప్రనారాయణ’ అంటే ఏఎన్నార్, భానుమతి నటించిన భరణీవారి క్లాసిక్. భక్తి, శృంగారం కలగలిసిన ఆ సినిమా రీమేక్ కానుంది. ‘విప్రనారాయణ’గా నాగార్జున నటిస్తారని ఫిలింనగర్ ఊహాగానం. ఇక భానుమతి పోషించిన దేవదేవి పాత్రకు బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, విద్యాబాలన్ పరిశీలనలో ఉన్నారు.
‘యమదొంగ’లో యమధర్మరాజుగా అదరగొట్టిన మోహన్‌బాబు ‘రావణబ్రహ్మ’గా కనిపించబోతున్నారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని చేయనున్నారు.
వెంకటేష్‌లో అధ్యాత్మిక భావాలు మెండు. సినీ ప్రపంచంలో తామరాకు మీద నీటిబొట్టులా ఉన్నట్టు కనిపించే వెంకీకి స్వామి వివేకానంద అంటే చాలా ఇష్టం. తన బోధనలతో యువతరంలో వ్యక్తిత్వ వికాసం నింపిన వివేకానందున్ని వెండితెరపై తీసుకురావాలన్నది ఆయన కల. ఇందుకు సంబంధించి ఏడాదిన్నరకు పైగానే ఏర్పాట్లు చేస్తున్నారు. బాలీవుడ్‌లో స్థిరబడిన మన తెలుగు దర్శకుడు మణిశంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ‘షాడో’ పూర్తికాగానే వెంకీ ‘వివేకానంద’కు ఉపక్రమిస్తారు.
అన్నమయ్య, శ్రీరామదాసు, మంజునాథ చిత్రాలకు స్క్రిప్ట్ నందించిన జేకే భారవి స్వీయ దర్శకత్వంలో ‘జగద్గురు ఆదిశంకర’ చేస్తున్నారు. హిందూ ధర్మ ప్రాశస్త్యాన్ని, ఆధ్యాత్మిక విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పిన ఆదిశంకరాచార్యుని స్ఫూర్తిని ఈ తరానికి కూడా అందించాలనే ఈ సినిమా చేస్తున్నానని భారవి చెబుతున్నారు. నాగార్జున, మోహన్‌బాబు, జయప్రద, శ్రీహరి, మీనా లాంటి ప్రముఖ తారలంతా ఇందులో అతిథి పాత్రలు పోషిస్తుండడం విశేషం.
అంతా బాలతారలతో ‘రామాయణం’ తీసిన గుణశేఖర్‌కు వీరనారి ‘రుద్రమదేవి’ కథను తీయాలనేది ఓ రకంగా డ్రీమ్ ప్రాజెక్ట్. ఎప్పటినుంచో తన కల గురించి చెబుతూ వచ్చిన గుణశేఖర్ ఎట్టకేలకు ఆ ప్రయత్నంలో పడ్డారు. అత్యాధునిక త్రీడి పరిజ్ఞానంతో ‘రుద్రమదేవి’ తీయబోతున్నారాయన. టైటిల్ రోల్‌కు అనుష్కను ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తి చేసిన ఆయన త్రీడి, స్పెషల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించి సాంకేతిక నిపుణులతో చర్చలు నిర్వహిస్తున్నారు.
యేసుక్రీస్తు కథాంశంతో సింగీతం శ్రీనివాసరావు ఒక బృహత్తర ప్రాజెక్టును గత ఏడాది ప్రారంభించారు. తెలుగు, తమిళ, మలయాళ, ఆంగ్ల భాషల్లో ఇది రూపొందుతోంది. ఇందులో పవన్‌కళ్యాణ్ కీలక పాత్ర చేస్తుండటం విశేషం. కొండా కృష్ణంరాజు దీనికి నిర్మాత.
‘ఈగ’ తర్వాత రాజమౌళి ప్రభాస్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. పూర్తిస్థాయి చారిత్రక కథాంశంతో ఈ చిత్రం తయారవ్వనుందని సమాచారం. కె.రాఘవేంద్రరావు నిర్మాత. యాభై కోట్లకు పైనే నిర్మాణ వ్యయమవుతుందని అంచనా. ఎన్టీఆర్ మూడు పాత్రలు చేసి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘దానవీరశూరకర్ణ’ అప్పుడూ ఇప్పుడూ ఓ సంచలనమే. ఈ చిత్రాన్ని ఎప్పటికైనా రీమేక్ చేస్తానని జూనియర్ ఎన్టీఆర్ సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతున్నారు.
‘అన్నమయ్య’ తీసిన వి.దొరస్వామిరాజు మీనా ప్రధాన పాత్రలో ‘శ్రీ వాసవి వైభవం’ తీస్తున్నారు. ఆదిపరాశక్తి అంశ రూపమైన వాసవిదేవి మహిమలను ఈ సినిమాలో చూపిస్తున్నారు. అలాగే శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వంలో ‘శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర’ తయారవుతోంది. ప్రతినాయకునిగా పేరు తెచ్చుకున్న స్వర్గీయ రామిరెడ్డి షిర్డీసాయిబాబాగా నటించిన ‘గురువారం’కు బాబా చరిత్ర ఆధారం. ఏది ఏమైనా లవ్, మాస్‌వంటి రొటీన్ సినిమాలతో విసిగిపోతున్న ప్రేక్షకులకు ఈ తరహా సినిమాలు మనసుకు ఆహ్లాదాన్ని నింపుతాయనే చెప్పాలి. ఒకే మూసలో సాగిపోతున్న సినీ సీమకు ఓ రకంగా ఇది ఓ రీచార్జ్ వంటిది. అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మొదలయ్యే ఈ కొత్త ట్రెండ్ మరింతగా పరవళ్లు తొక్కాలనేది అందరి ఆకాంక్ష.
ముక్తాయింపు: తమిళంలోనూ ఇదే ట్రెండ్ పుంజుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ‘రోబో’ తర్వాత రజనీకాంత్ చేస్తున్న ‘కొచ్చడయ్యాన్’ చారిత్రక నేపథ్యంతోనే రూపొందుతోంది. ‘అవతార్’ తరహాలో మోషన్ కేప్చరింగ్ విధానంలో త్రీడిలో తెరకెక్కడం విశేషం!
బాలకృష్ణ ‘నర్తనశాల’.... మోహన్‌బాబు ‘రావణబ్రహ్మ’... నాగార్జున ‘శిరిడి సాయి’... వెంకటేష్ ‘స్వామి వివేకానంద’... అనుష్క ‘రుద్రమదేవి’... అన్నీ సంచలనపాత్రలే! ఇవి ఎవ్వరూ ఊహించని సినిమాలే. నిజంగానే తెలుగుతెరపై ఇది సరికొత్త పరిణామం. ఇన్నాళ్లూ మమమాస్... అంటూ కత్తులు పట్టి, తొడలు కొట్టిన మన కథానాయకులు తమ పంథా మార్చుకుంటున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమాను స్వర్ణయుగంలో నిలిపిన పౌరాణిక, జానపద, చారిత్రక, ఆధ్యాత్మిక కథాంశాలతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. లవ్, మాస్, సెంటిమెంట్ అంటూ తన చుట్టూ ఓ గిరిగీసుకున్న తెలుగు సినిమా... వైవిధ్యపు గోవర్థనగిరి ఎత్తడానికి సిద్ధమవుతోంది.

Post a Comment