
ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 'గబ్బర్ సింగ్' అనేక సంచలనాలను సృష్టిస్తూనే వస్తున్నాడు. ఈ సినిమా ఆడియో వేడుక ఈ నెల 15 న నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విభిన్నంగా ప్లాన్ చేస్తోన్న ఈ ఆడియో వేడుకలో చిరంజీవి ... రామ్ చరణ్ ... అల్లు అర్జున్ ... నాగబాబు తదితరులు పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాన్ హీరోగా చేసిన 'పంజా' ఆడియో రిలీజ్ కి చిరు ఫ్యామిలి నుంచి ఎవరూ రాకపోవడంతో, అందుకు కారణం కుటుంబం లోని కుమ్ములాటలేననే ప్రచారం జోరుగా జరిగింది.
ఇక రీసెంట్ గా జరిగిన 'రచ్చ' ఆడియో వేడుకలో పవన్ కళ్యాన్ కనిపించక పోవడంతో ఫ్యాన్స్ గోల చేశారు. చరణ్ అందుకు గల కారణం చెప్పినప్పటికీ, అది వాళ్లకి పెద్దగా సంతృప్తి కలిగించలేదు. పైగా అందరి అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలో 'గబ్బర్ సింగ్' ఆడియో ఫంక్షన్ కి మెగా ఫ్యామిలీ రావడమనేది ఖాయమైందని ఆ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. తమ మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవనీ ... అంతా కలిసికట్టుగా ఉన్నామని అభిమానులకి తెలియజేప్పెందుకే మెగా ఫ్యామిలీ వస్తోందని అంటున్నారు.
Post a Comment