శ్రీమన్నారాయణ' షూటింగులో బాలకృష్ణ
బాలకృష్ణ కథానాయకుడుగా రవి చావలి దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్రీమన్నారాయణ' చిత్రం రెండో షెడ్యులు షూటింగు మొదలైంది. హైదరాబాదు గచ్చిబౌలి లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో బాలకృష్ణ, ఫైటర్లపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పార్వతి మెల్టన్ కథానాయికగా నటిస్తున్న ఈచిత్రం తొలి షెడ్యులు షూటింగు కొన్ని రోజుల క్రితం హైదరాబాదులోనే జరిగిన సంగతి తెలిసిందే. ఆమధ్య 'మిరపకాయ్' చిత్రాన్ని నిర్మించిన రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో బాలకృష్ణ జర్నలిస్టుగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంచితే, బాలకృష్ణ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణ ఇటీవల కేరళలోని పలు అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. మంచు మనోజ్, దీక్షా సేథ్ ఇందులో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Post a Comment