'అందం' కోసం విదేశాలకి వర్మ RAMGOPAL VARMA ANDHAM IN FOREIGN COUNTIES

 
 రాంగోపాల్ వర్మ ప్రస్తుతం అందాన్ని వెతికే పనిలో పడ్డారు. అసలైన అందాన్ని అన్వేషిస్తూ ఆయన త్వరలో విదేశాలకి వెళ్లనున్నారు. 'అందం' సినిమాని మరింత అందంగా చూపించడం కోసం ఆయన ఈ ప్రయాణం కడుతున్నారు. దగ్గుబాటి రానా - నతాలియాకౌర్ జంటగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం విదేశాలలో జరపనున్నారు. ఇంతవరకూ తాను మురికివాడలను ... ఇరుకు సందులను ... చీకటి గదులను లోకేషన్స్ గా ఎంచుకున్నాననీ, ఈ సినిమా అందుకు పూర్తి భిన్నంగా ఉంటుందని వర్మ చెబుతున్నారు. తన చిత్రాల్లో దెయ్యాలు ... భూతాలు ... రక్తపాతాలు చూసిన ప్రేక్షకులకి, ఈ సినిమా ఓ అందమైన కానుకలా ఉంటుందని ఆయన అన్నారు. ఇంతకు మునుపెన్నడూ షూటింగ్ చేయని లోకేషన్స్ లో ఈ సినిమా చిత్రీకరణ జరపాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. వర్మ మనసు హఠాత్తుగా అందం వైపు ... అందమైన లోకేషన్స్ వైపు మళ్లడంతో ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి.   

Post a Comment

Previous Post Next Post