'దరువు' వేసే టైమొచ్చింది ! its time for daruvu


 
     తెలుగు తెర పై సోషియోఫాంటసి చిత్రాలు దాడి చేయనున్నాయి. చాలా మంది కథానాయకులు ఈ సోషియో ఫాంటసి చిత్రాలతోనే బిజీ బిజీగా వున్నారు. 'దరువు' సినిమాతో రవితేజా కూడా ప్రస్తుతం ఇదే బాటలో నడుస్తున్నాడు. శివ దర్శకత్వంలో తెర కెక్కుతోన్న ఈ సినిమాలో రవితేజా జోడీగా తాప్సీ పండుగ చేయనుంది. ఈ సినిమాకి సంబంధించిన 'ఫస్ట్ లుక్' రీసెంట్ గా బైటికొచ్చింది. అప్పుడే అభిమానులతో టక టకా మార్కులు వేయించుకుంటూనేవుంది.
       విభిన్న మైన కథ - కథనంతో వినోదాల విందు చేసే ఈ చిత్రంలో, సీనియర్ యముడిగా కైకాల సత్య నారాయణ ... యంగ్ యమ ధర్మరాజుగా తమిళ నటుడు ప్రభు అలరించనున్నట్టు తెలుస్తోంది. 'యమదొంగ' ... 'యమజాతకుడు' సినిమాల తరహాలో ఈ సినిమా కొనసాగుతుందని దర్శకుడు శివ అన్నారు. స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ కీలకమైన పాత్ర పోషించే ఈసినిమాలో రవితేజా అల్లరి ... తాప్సీ అందం చూసి తీర వలసిందేనన్నఅభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తోన్న ఈ సినిమాని మే మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. 'నిప్పు' సినిమా ఫ్లాప్ తో నిరాశకి లోనైన రవితేజా అభిమానులకి ఈ సినిమా అయినా ఊరట కలిగిస్తుందో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post