పవర్ స్టార్ 'గబ్బర్ సింగ్' సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన పోరాట సన్నివేశాలను ఈ నెల 23 న గుజరాత్ లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ గుజతాత్ బయల్దేరుతోంది. సినిమాలో ఫైట్ సీన్ తోనే పవన్ కళ్యాన్ ఎంట్రీ ఉండడంతో, ఈ పోరాట సన్నివేశాలు మరింత ప్రత్యేకతని సంతరించుకున్నాయి. అందువల్ల ఫైట్ మాష్టర్స్ రామ్ - లక్ష్మణ్ ఈ పోరాట దృశ్యాలను కంపోజ్ చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాన్ మార్క్ గా రానున్న ఈ సినిమాకి హరీష్ శంకర్ టేకింగ్ ... దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ... ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ కి కావాల్సిన అన్ని రకాల మసాలాలను దట్టించి, మేలో విడుదల చేయనున్నట్టు నిర్మాత గణేష్ చెప్పారు. ఈ సినిమాపై పవన్ తో పాటు అతని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి వాళ్ల ఆశల్నిఈ సినిమా ఎంత వరకూ నేరవేరుస్తుందో చూడాలి.

Post a Comment