వర్మకి కౌంటర్ గా టైటిల్ రిజిష్ట్రేషన్! COUNTER ON RGV REDDYGARU POYARU



 'రెడ్డి గారు పోయారు' పేరుతో రామ్ గోపాల్ వర్మ ఓ చిత్రాన్నితెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే  అయితే ఈ టైటిల్ పై రెడ్డి సామాజిక వర్గం తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ సినిమా పేరు మార్చని పక్షంలో తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని హెచ్చరించింది. అయినా వర్మ తన పని తాను కానిచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ... వర్మ ధోరణి పట్ల ఓసీ వెల్ఫేర్ అసోషియేషన్ ప్రెసిడెంట్ జి.కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తమ కులాన్ని టార్గెట్ చేసి రామ్ గోపాల్ వర్మ సిన్మా తీస్తుండటం పట్ల తీవ్రమైన వ్యతిరేకతని వ్యక్తం చేశారు. 'రెడ్డి గారు పోయారు' టైటిల్ కి కౌంటర్ గా 'వర్మ పోయారు పిచ్చాసు పత్రికి' అనే టైటిల్ ని రిజిష్టర్ చేయిస్తున్నట్టు చెప్పారు. వర్మ ఆ సినిమా షూటింగ్ మొదలు పెట్టగానే, తాము కూడా ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని అన్నారు. ప్రస్తుతం ఈ విషయం పట్ల వర్మ ఎలా స్పందిస్తాడా? అనే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, వర్మ దీనిని లైట్ తీసుకోవచ్చని అంటున్నారు     
 
 

Post a Comment

Previous Post Next Post