కెమెరామెన్ గంగతో బయలుదేరిన రాంబాబు


 

పవన్ కళ్యాన్ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో 'కెమెరా మెన్ గంగతో రాంబాబు' చిత్రం రూపొందనుందనే విషయం ప్రేక్షకులకి విదితమే. ఈ సినిమా షూటింగ్ ని ఈ రోజు ఉదయం పూరీ జగన్నాథ్ ఆఫీసులో లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. 'గబ్బర్ సింగ్' షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాన్, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరౌతున్నారు. ఈ సినిమాకి డీవీవీ దానయ్య  నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'గబ్బర్ సింగ్' షూటింగ్ పూర్తి అయిన తరువాత పవన్ కళ్యాన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని అంటున్నారు. గతంలో పవన్ కళ్యాన్ - పూరీ జగనాథ్ కాంబినేషన్ లో వచ్చిన 'బద్రి' చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అందువల్ల ఇప్పుడీ సినిమా పై కూడా అంచనాలు బాగానే వున్నాయి. మరి ఈ అంచనాలను చేరుకునేందుకు ఈ సూపర్ హిట్ కాంబినేషన్ ఏం చేస్తుందనేదే ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయంశమైపోయింది.

Post a Comment

Previous Post Next Post