మంచు మనోజ్ హీరోగా ... కృతి కర్బందా - సనా ఖాన్ కథానాయికలుగా నటించిన 'మిస్టర్ నూకయ్య' చిత్రం నిన్నవిడుదలైన సందర్భంగా, ఈ సినిమా దర్శక నిర్మాతలు ఈ రోజు ఉదయం ప్రసాద్ లాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సినిమాని 400 థియేటర్స్ లో రిలీజ్ చేశామనీ, డూప్ లేకుండా మనోజ్ పాల్గొన్న భారీ యాక్షన్ సీన్స్ కి ... అతను చేసిన డాన్స్ కి ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోందని చెప్పారు. ముఖ్యంగా కృతి కర్బందా - సనా ఖాన్ అందచందాలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హీరో మనోజ్ మాట్లాడుతూ ... తొలుత 'మిస్టర్ నోకియా'గా తెర కెక్కిన ఈ సినిమా, ఆ తరువాత నోకియా సంస్థ నుంచి వచ్చిన అభ్యంతరాల కారణంగా 'మిస్టర్ నూకయ్య'గా ప్రేక్షకుల ముందుకి వెళ్లిందని అన్నారు. అయినా ఆ సంస్థ వారు హైదరాబాద్ లోని 'ఐనాక్స్' ... 'సినీమాక్స్' థియేటర్స్ లో ఈ సినిమా ప్రదర్శనని నిలిపేశారంటూ ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేశారు. ఇక నైనా ఆ సంస్థ వారు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పారు. ఇలా వినోదానికి ... వివాదానికి మధ్య ప్రయాణాన్ని ప్రారంభించిన 'మిస్టర్ నూకయ్య' ఎంత వరకూ సక్సెస్ ని చేరుకుంటాడనేదే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

Post a Comment