'CM' తో నాకు సంబంధంలేదు YVS SAY NO TO CM

  ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడుగా 'CM' టైటిల్ తో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయంటూ ఇటీవల మీడియాలో విపరీతంగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. మరో దర్శకుడు వైవీయస్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు కూడా వార్తలొచ్చాయి. అయితే, ఈ వార్తలని దర్శక నిర్మాత చౌదరి ఈ రోజు ఖండిస్తూ ప్రకటన ఒకటి ఇచ్చాడు. ఆ ప్రాజక్టుతో తనకి కానీ, తన బొమ్మరిల్లు బ్యానర్ కి గానీ ఎటువంటి సంబంధమూ లేదని ఆయనఫై  ప్రకటనలో పేర్కొన్నాడు. అయితే, ఈ చిత్రం కోసం చౌదరి ప్లాన్ చేసిన మాట వాస్తవమేననీ, మరి ఇంతలోనే ఏమైందో తెలియడం లేదని మరోపక్క టాలీవుడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏది ఏమయినా CM సినిమా వస్తుందా రాదా  అన్నది మాత్రం ఇప్పటికి  సస్పెన్సే గానే వుంది 

Post a Comment

Previous Post Next Post