 

వినాయకుడు 'విలేజ్ లో వినాయకుడు'చిత్రాలతో సైలెంట్ హిట్ లు కొట్టేసిన దర్శకుడు   సాయికిరణ్ అడవి త్వరలో 'కేరింత' పేరుతో ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించడానికి ముందుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. స్నేహం, ప్రేమ అంశాలతో రూపొందే ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తారు. ఇందులో నటించే నటీనటుల వివరాలు త్వరలో తెలుస్తాయి. దిల్ రాజు ప్రస్తుతం వెంకటేష్, మహేష్ బాబు సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా తో బిజీ గ వున్నారు  
 
 
 
 
      
    
  
 
 
 
Post a Comment