.jpg)
.jpg)
గోపీచంద్ హీరోగా చంద్ర శేఖర్ ఏలేటి ఓ యాక్షన్ చిత్రాన్నరుపొందిస్తున్నారు వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి. బ్యానర్ పై నిర్మించబడుతోన్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజు ప్రారంభమయింది ముహూర్తపు షాట్ కి ఫైనాన్షియర్ సత్య రంగయ్య క్లాప్ కొట్టగా ... హీరో గోపీచంద్ స్విచాన్ చేశారు. తొలిషాట్ ని దేవుడు పటాల పై చిత్రీకరించారు. ఈ సందర్భంగా చంద్ర శేఖర్ ఏలేటి మాట్లాడుతూ ... గతంలో 'ఐతే' ... 'అనుకోకుండా ఒక రోజు' ... 'ఒక్కడున్నాడు' ... 'ప్రయాణం' వంటి చిత్రాలను తెరకెక్కించిన తనకి ఇది ఐదో చిత్రమనీ, కథా పరంగా ఈ సినిమా షూటింగ్ జోర్డాన్ - రాజస్థాన్ - లడక్ ప్రాంతాల్లో ప్లాన్ చేశామని చెప్పారు. హీరో గోపీ చంద్ మాట్లాడుతూ ... చంద్రశేఖర్ దర్శకత్వంలో తాను చేస్తోన్న రెండో సినిమా ఇదనీ, భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం తనకి వుందని అన్నారు. ఇక నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ ... విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా, ఏప్రిల్ మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందనీ ... సెప్టెంబర్ చివర్లో విడుదల చేసే అవకాశం వుందని అన్నారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్య అతిధి గ హాజరైయారు
Post a Comment