Latest Post

Simbaa Pre Release Event Held Grandly

 ఆగస్ట్ 9న రాబోతోన్న ‘సింబా’ అందరినీ మెప్పిస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సంపత్ నంది



అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంపత్ నంది అందించిన  ఈ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎమ్మెల్యే విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.


సంపత్ నంది మాట్లాడుతూ.. ‘ఈ మూవీ మొదలవ్వడానికి కారణం ఉదయభాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఉదయభాను నన్ను ఛాలెంజ్ చేసింది. ఆ తరువాత సంతోష్ గారు, కేసీఆర్ గారు తలపెట్టిన హరితహారం గురించి తెలుసుకున్నా. అలాంటి టైంలోనే ఈ కథ విన్నా. అందరికీ కనువిప్పు కలిగేలా, ఎంటర్టైన్ చేసేలా, మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది. నేను మా నిర్మాత రాజేందర్ రెడ్డికి మంచి మాస్ కమర్షియల్ కథలు చెప్పా.. లాభాలు వస్తాయని చెప్పా. కానీ మా నిర్మాత మాత్రం సింబా కథను ఎంచుకున్నారు. సమాజానికి మంచి చేయాలనే, ఏదైనా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రం చేశారు. అలాంటి మంచి వ్యక్తి కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. సినిమా నిర్మాణంలో సాయం చేసిన పూర్ణ, రాఘవ గారికి థాంక్స్. సైంటిఫిక్‌గా హెల్ప్ చేసిన కిషోర్ గారికి, స్క్రిప్ట్ ఐడియా ఇచ్చిన విజయ్ గారికి థాంక్స్. ఈ చిత్రం ఆగస్ట్ 9న రాబోతోంది. ఏ ఒక్కర్నీ నిరాశపర్చదు. అందరినీ మెప్పిస్తుంది. ఈ సినిమాను చూస్తే వందకు వంద మార్కులు వేస్తారు’ అని అన్నారు.


మురళీ మనోహర్ మాట్లాడుతూ.. ‘సింబా చాలా కొత్త కథ, కొత్త పాయింట్‌తో రాబోతోంది. సంపత్ నంది గారు అద్భుతంగా కథ రాశారు. నేను దర్శకత్వం వహించాను. ఇంత మంచి ప్రాజెక్ట్‌ను రాజేందర్ గారు నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఆయన విజన్‌కు హ్యాట్సాఫ్. ఎల్లప్పుడూ మా వెంట ఉండి సహకారం అందించారు. నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన నా ఫ్యామిలీకి థాంక్స్. జగపతి బాబు గారి డెడికేషన్ చూసి నేను ఇన్ స్పైర్ అయ్యాను. అనసూయ గారి నటన చూసి షాక్ అయ్యాను. నాకు సహకరించిన టీంకు థాంక్స్. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.


నిర్మాత రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వనజీవి రామయ్య గారు కోటికి పైగా మొక్కలు నాటారు. స్కూల్ పుస్తకాల్లో వీరి మీద పాఠాలున్నాయి. వీళ్లని చూసి ఇన్‌స్పైర్ అయి ఈ కథను రాసుకున్నాం. ప్రకృతి లేకపోతే మనం ఉండలేం. ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. మా గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టబోతోన్నాం. ఆగస్ట్ 22న చిరంజీవి గారికి పుట్టిన రోజున కొన్ని వేల మొక్కల్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మా సినిమా నుంచే లాభాల్ని కూడా మొక్కల రూపంలోనే ఖర్చు పెట్టాలని అనుకుంటున్నాం. మా కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇండియన్ స్క్రీన్ మీద సినిమా రాలేదు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.


అనసూయ మాట్లాడుతూ.. ‘ఆడియెన్స్ ప్రశంసలు, అభిమానం వల్లే నేను ఇలాంటి చిత్రాలు చేయగలుగుతున్నాను. సింబా అందరినీ ఆకట్టుకుంటుంది. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన సంపత్ నంది గారికి, మురళీ గారికి, రాజేందర్ గారికి థాంక్స్. ఇంత మంచి టీంతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. కస్తూరీ మేడం, గౌతమి మేడం, జగపతి బాబు వంటి వారితో నటించడం ఆనందంగా ఉంది. డీఓపీ గారు మా అందరినీ చక్కగా చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ మంచి ఆర్ఆర్, పాటలు ఇచ్చారు. మా ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మీ అందరినీ గర్వపడేలాంటి పాత్రలే చేస్తాను. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.


జగపతి బాబు మాట్లాడుతూ.. ‘సింబా అనేది డాక్యుమెంటరి కాదు. వృక్షంతో కనెక్ట్ చేసి తీసిన చిత్రం. ఈ కాన్సెప్ట్ అందరికీ నచ్చుతుంది. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.


మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ‘సినిమా ఈవెంట్‌కు వచ్చాం.. వెళ్లాం.. అని కాకుండా.. అందరూ మొక్కలు నాటండి. రాజేందర్ గారు మంచి సందేశాన్నిచ్చే చిత్రాన్ని తీశారు. ఇలాంటి చిత్రాలు పెద్ద సక్సెస్ అవ్వాలి. సింబా సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.


భానుచందర్ మాట్లాడుతూ.. ‘రాజేందర్ నాకు మిత్రుడు. కమర్షియల్ గురించి ఆలోచించకుండా ఇంత మంచి సందేశంతో ఉన్న సినిమాను నిర్మించిన నా మిత్రుడు రాజేందర్‌కు ఆల్ ది బెస్ట్. కేవలం సందేశం కాకుండానే ఇంకా ఏదో ఉందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ట్రైలర్ చూస్తే సినిమాను చూడాలన్న ఆసక్తి ఏర్పడింది. ఆగస్ట్ 9న ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ.. ‘సంపత్ నంది ఈ స్థాయికి ఎదగడం మాకు గర్వంగా ఉంది. రాజేందర్ రెడ్డి, సంపత్ నంది కలిసి ఇంత మంచి చిత్రాన్ని నిర్మించారు. ప్రకృతి గొప్పదనం చెప్పేలా, ప్రకృతి పరిరక్షణ గురించి చెప్పేలా తీసిన ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలి. ప్రభుత్వాలు ఈ గ్రీన్ ఛాలెంజ్, హరితహారం అనే కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ చిత్రం పెద్ద హిట్ నిర్మాతలకు లాభాలు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘మా ప్రాంతానికి చెందిన రాజేందర్ ఇంత మంచి చిత్రాన్ని నిర్మించినందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అయి మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. మంచి సందేశంతో రాబోతోన్న ఈ చిత్రంలో నటించిన అందరికీ ఆల్ ది బెస్ట్. వృక్షో రక్షితి రక్షిత: అనే సూక్తిని అందరూ పాటించాలి’ అని అన్నారు.


సమ్మి రెడ్డి మాట్లాడుతూ.. ‘మా ఊరి నుంచి వచ్చిన రాజేందర్ రెడ్డి ఇంత మంచి సినిమా తీయడం ఆనందంగా ఉంది. హరితహారం మీద ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి. నాటే మొక్కల కంటే.. కొట్టేసే మొక్కలే ఎక్కువగా ఉన్నాయి. ప్రతీ ఒక్కరూ మొక్కలు పెంచాలి. ఇలాంటి సందేశాన్ని ఇస్తూ తీసిన చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’ అని అన్నారు.


రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కేవలం కమర్షియల్‌గా ఆలోచించకుండా.. మంచి సందేశాన్ని ఇచ్చేందుకు సింబా చిత్రాన్ని తీశారు. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలి. ఆడియెన్స్ తప్పకుండా ఇలాంటి సినిమాలను ఆదరించాలి. ప్రకృతి చాలా గొప్పది. ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుందో చూస్తున్నాం. ఉపధ్రవాలు సంభవించుకుండా ఉండాలంటే ప్రకృతిని కాపాడుకోవాలి. ఇలాంటి సినిమాను తీసిన టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.


రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సంపత్ నందికి ఓ ప్యాషన్ ఉంది. ప్రకృతి మీద ప్రేమతో, ప్రకృతిని ఎలా కాపాడాలనే ఉద్దేశంలో సినిమాను తీశారు. ఆయన గొప్ప సంకల్పానికి నేను అండగా నిలబడాలని అనుకున్నాను. మా సంస్థ నుంచి లక్ష మొక్కల్ని నాటాం. కేవలం నాటడమే కాదు.. వాటిని కాపాడుతూ వచ్చాం. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలి. అందరూ ఇలాంటి సినిమాలను ఆదరించాలి’ అని అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ మాట్లాడుతూ.. ‘ఈ కథ చెప్పినప్పుడు నేను ముందుగా సింబా థీమ్ ఇచ్చాను. అలా మా ప్రయాణం ప్రారంభం అయింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రంలో ప్రతీ పాత్రకు ఓ డిఫరెంట్ థీమ్ క్రియేట్ చేశాం. ఆగస్ట్ 9న అందరూ థియేటర్లో మా సినిమాను చూడండి’ అని అన్నారు.


దివి మాట్లాడుతూ.. ‘సింబాలో నాకు ఛాన్స్ ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్. పేపర్ బాయ్ టైంలో మురళీ గారిని కలిస్తే మూడేళ్ల తరువాత ఛాన్స్ వచ్చింది. ఇంత మంచి చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా మస్త్ ఉంటుంది.. అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.


శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ.. ‘ప్రతీ ఒక్కరూ మొక్కని నాటి సోషల్ మీడియాలో నాకు ఫోటోలు పంపండి. సినిమా టికెట్లు నేను పంపిస్తాను. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.


కస్తూరీ శంకర్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నేను జగపతి బాబుతో కొన్ని సీన్లు చేశాను. మిగతా టీంను ఇక్కడే కలిశాను. ఇలాంటి చిత్రానికి ప్రభుత్వం నుంచి సహకారం అందాలి. ఈ మూవీకి పన్నుని మినహాయించాల’ని కోరారు.

Cult blockbuster Baby bagged 5 awards out of 8 Nominationsat the 69th Filmfare Awards

ఐదు అవార్డ్స్ తో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో సత్తా చాటిన కల్ట్ బ్లాక్ బస్టర్ "బేబి"



ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి మరో హిస్టారిక్ ఫీట్ చేసింది. తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ లో బేబి సినిమాకు 5 అవార్డ్స్ దక్కాయి. 8 నామినేషన్స్ లో 5 అవార్డ్స్ గెల్చుకుంది బేబి.

బేబి సినిమాలో  ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చిన వైష్ణవి చైతన్య బెస్ట్ యాక్ట్రెస్ గా, క్లాసిక్ ఇమేజ్ తో పాటు కమర్షియల్ సక్సెస్ సాధించి 100 కోట్ల గ్రాసర్ గా నిలిచినందుకు బెస్ట్ ఫిల్మ్ గా, తన మ్యూజిక్ తో బేబికి ప్రాణం పోసిన విజయ్ బుల్గానిన్ బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ గా, ఓ రెండు మేఘాలిలా పాటతో టైటిల్స్ నుంచే సినిమాలో ప్రేక్షకుల్ని లీనం చేసేలా సాహిత్యాన్ని అందించిన అనంత్ శ్రీరామ్ కు బెస్ట్ లిరిసిస్ట్ గా, ఈ పాట అందంగా పాడిన శ్రీరామ చంద్ర బెస్ట్ సింగర్ గా అవార్డ్స్ దక్కాయి.

బేబి సినిమాకు ప్రేక్షకుల రివార్డ్స్ తో పాటు ప్రతిష్టాత్మక అవార్డ్స్ దక్కుతున్నాయంటే ఆ ఘనత ఈ ప్రేమ కథను హృద్యంగా తెరపై ఆవిష్కరించిన డైరెక్టర్ సాయి రాజేష్ కే దక్కుతుంది. ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్, డైరెక్టర్ సాయి రాజేష్ కాంబినేషన్ లో బాలీవుడ్ లో బేబి సినిమా రీమేక్ కు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి.

 

Deadpool & Wolverine Reigns Supreme At The Box Office, Crossing The 100 Crore Mark By Grossing Rs 113.23 Crore In Week 1

 ఇండియాలో తన మార్క్ ని చాటుకున్న 'డెడ్ పూల్ & వోల్వరిన్'.. మొదటి వారంలోనే 113.23 కోట్ల వసూళ్లు.. 



మర్వెల్ సినిమాలంటే ఇండియాలో  క్రేజ్ మామూలుగా ఉండదు. కాని ఎండ్ గేమ్ వరుకు అన్ని అవెంజేర్స్ క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయిన మర్వెల్ ఫాన్స్. ఎండ్ గేమ్ తరవాత కొంచం మక్కువ తగ్గించారు. కానీ అవెంజేర్స్ తరహాలో మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ ఇప్పుడు 'డేడ్ పూల్ & వోల్వరిన్' తోనే సాధ్యం అయ్యింది. 


రిలీజ్ అయిన మూడు రొజులలోనే ప్రపంచ వ్యాప్తంగా 3670 కోట్లను కాలేచ్ట్ చేసి మళ్ళీ మర్వెల్ పాత లెగసీని వెనక్కి తీసుకుని వచ్చింది. ఇండియాలో కూడా మొదటి వారంలోనే 100కోట్ల క్లబ్ ని సునాయాసంగా క్రాస్ చేసి 113.23 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికీ అంతే సక్సెస్ ఫుల్ గా ప్రపంచవ్యాప్తంగా ధియేటర్ రన్ ఉంది. రెండు ఫేవరెట్ క్యారెక్టర్స్ ని ఒకే స్క్రీన్ మీద ఒకే కథలో భాగంగా చ చూస్తున్న వోల్వరిన్ ఐనా డెడ్ పూల్ అభిమానులకు ఇదొక కన్నులపండుగా ఉంది. అందులోనో తెలుగు డబ్బింగ్ కి డెడ్ పూల్ క్యారెక్టర్ కి సర్రిగా సరిపోయింది. తెలుగులో డెడ్ పూల్ డైలాగ్స్ కి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.  


ఇండియాలో ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తమిళ్ ఇంకా తెలుగు భాషలలో రిలీజ్ అయ్యింది.

Thandel Team Wished DSP a Very Happy birthday

 రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కు బర్త్ డే విషెస్ అందించిన 'తండేల్' టీం- త్వరలోనే మ్యూజిక్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్



యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ "తండేల్". ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.


రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బర్త్ డే సందర్భంగా 'తండేల్' టీం ఆయనకు విషెస్ తెలియజేసింది. హీరో నాగ చైతన్య, డైరెక్టర్ చందూ మొండేటి, నిర్మాత బన్నీవాసు, దేవిశ్రీని కలిసి బర్త్ డే విషెస్ అందించారు. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


'తండేల్'లో మ్యూజిక్ ఒక మేజర్ హైలెట్ గా వుండబోతుంది. సినిమా కోసం చార్ట్ బస్టర్ అల్బమ్ కంపోజర్ చేశారు దేవిశ్రీ. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సెన్సేషనల్ గా వుండబోతున్నాయి. తర్వలోనే మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేస్తారు.


'తండేల్' లో నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ తమ కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇందులో డి-గ్లామర్  అవతార్‌లలో కనిపిస్తారు.


మ్యాసీవ్ బడ్జెట్‌తో గ్రాండ్ స్కేల్ లో రూపొందుతున్న ఈ మూవీ ఇండస్ట్రీలో న్యూ టెక్నికల్ బెంచ్‌మార్క్‌లను సెట్ చేయనుంది. దర్శకుడు చందూ మొండేటి పాత్రల గెటప్‌లు, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్, లోకల్ స్లాంగ్ అథెంటిక్ గా ఉండేలా చాలా కేర్  తీసుకుంటున్నారు.


ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. షామ్‌దత్ సినిమాటోగ్రాఫర్‌ కాగా, నేషనల్ అవార్డ్ విన్నర్  నవీన్ నూలి ఎడిటర్‌. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డిపార్ట్మెంట్ ని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం  విజువల్ గా మ్యూజికల్ గా ప్రేక్షకులు మెస్మరైజింగ్ సినిమాటిక్ ఎక్సపీరియన్స్ ని అందించబోతోంది.


నటీనటులు: నాగ చైతన్య, సాయి పల్లవి

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: చందూ మొండేటి

సమర్పణ: అల్లు అరవింద్

నిర్మాత: బన్నీ వాసు

బ్యానర్: గీతా ఆర్ట్స్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

ఎడిటర్: నవీన్ నూలి

డీవోపీ: షామ్‌దత్

ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో

Adivi Sesh Reveals Six Stunning Moments from the Highly Anticipated Spy Thriller Sequel #G2

 గూఢచారి 6వ యానివర్సరీ సందర్భంగా మోస్ట్ యాంటిసిపేటెడ్ స్పై థ్రిల్లర్ సీక్వెల్ #G2 నుంచి ఆరు స్టన్నింగ్ మూమెంట్స్ ని రివిల్ చేసిన హీరో అడివి శేష్



హీరో అడివి శేష్ తన సెన్సేషనల్ స్పై థ్రిల్లర్ గూఢచారి 6వ యానివర్సరీ సందర్భంగా ఫ్యాన్స్ కోసం ట్విట్టర్ లో థ్రిల్లింగ్ అనౌన్స్ మెంట్స్ చేశారు. స్టన్నింగ్ మూమెంట్స్ తో ఫ్యాన్స్ ని థ్రిల్ చేశారు.  


గూఢచారి కి సీక్వెల్ గా రూపొందుతున్న G2 ఫ్రాంచైజీని న్యూ హైట్స్ కు ఎలివేట్ చేస్తోంది. ఇప్పటికే 40% షూటింగ్ పూర్తి కావడంతో, మేకర్స్ సినిమాని ఇంటర్నేషనల్ స్కేల్ లో ప్రజెంట్ చేస్తూ ఆరు స్టైలిష్ యాక్షన్ మూమెంట్‌లను రిలీజ్ చేశారు. G2లోని ఈ మూమెంట్స్ ఇండియాలోనే కాకుండా గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రత్యేకంగా నిలిచే స్పై థ్రిల్లర్‌ను ప్రజెంట్ చేస్తున్నాయి.


2025 సెకండ్ హాఫ్ లో గ్రాండ్‌గా విడుదల కానున్న G2 అన్ని ప్రధాన భారతీయ భాషల్లో అవైలబుల్ గా ఉంటుంది. ఇది వైడ్ రేంజ్ లో  ప్రేక్షకులకు రీచ్ అవుతోంది. ఈ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహించారు. శేష్‌తో కలిసి రైటర్ గా కూడా ఉన్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.


ఈ సందర్భంగా శేష్ మాట్లాడుతూ.. "గూఢచారి సినిమా చాలా ప్రత్యేకమైనది. గత 6 సంవత్సరాలుగా ఈ సినిమా గురించి ప్రశంసలు వింటూనే వున్నాను. G2 బిగ్గర్ అండ్ ఇంటర్ నేషనల్ స్కేల్ లో వుంటుంది. గూఢచారి అభిమానులందరికీ G2 ఒక మ్యాసీవ్ విజువల్ ట్రీట్ అవుతుంది' అన్నారు.


దర్శకుడు సిరిగినీడి మాట్లాడుతూ, "ప్రస్తుతం 40% షూటింగ్ పూర్తి చేశాం.  సినిమా అద్భుతమైన క్యాలిటీతో వస్తోంది. సినిమా రూపుదిద్దుకుంటున తీరుపై చాలా నమ్మకంగా, ఉత్సాహంగా వున్నాం. విజువల్ వండర్ క్రియేట్ చేయడంపై దృష్టి పెట్టాం. థ్రిల్లింగ్ సెట్ పీస్ లు,  డైనమిక్ యాక్షన్ సీక్వెన్స్‌ లు ఇలా ప్రతి ఎలిమెంట్ ప్రేక్షకులను గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తోంది. యాక్షన్ డ్రామా జానర్‌లోని అభిమానులందరికీ ఈ చిత్రం గొప్ప అనుభూతిని ఇస్తుంది' అన్నారు.  


నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ, " పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఒక మైల్ స్టోన్ గా నిలిచిన "గూఢచారి" చిత్రం 6వ యానివర్సరీ జరుపుకుంటున్నాము. "G2" 40% షూటింగ్‌ అద్భుతంగా పూర్తి చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఈ సీక్వెల్ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడమే కాకుండా అంచనాలకు మించి వుంటుంది. మొత్తం బడ్జెట్‌కు ఎంత ఖర్చవుతుందో అంత ఖర్చుతో కూడిన యాక్షన్ సీక్వెన్స్ ని ఇటీవలే చిత్రీకరించాము.  కొత్త బెంచ్‌మార్స్, అభిమానులు, ప్రేక్షకులకు క్యాలిటీ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంపై దృష్టి పెట్టాం, అడివి శేష్  పెర్ఫార్మెన్స్, మా టీం డెడికేషన్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఆకట్టుకుంటుంది. ఇది మునుపెన్నడూ చూడని థ్రిల్లింగ్ అడ్వెంచర్' అన్నారు


నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ, "మా అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో జి2 ఒకటి. ఇంటర్ నేషనల్ స్కేల్ ప్రొడక్షన్ తీసుకురావడానికి శేష్, వినయ్, టీం చాలా కష్టపడుతున్నారు. సినిమా గ్రాండియర్ గా వుంటుంది. ఇటివలే ఒక యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేశాం. ఈ  ఒక్క సీక్వెన్స్ బడ్జెట్ మొత్తం గూఢచారి బడ్జెట్ కంటే ఎక్కువ' అన్నారు  


G2 టీం అథెంటిక్, బ్రెత్ టేకింగ్ స్పై థ్రిల్లర్‌ను అందించడానికి రెడీ అవుతోంది. ఇది గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులని ఆకట్టుకునే చిత్రాన్ని రూపొందించడమే లక్ష్యంగా టీం పని చేస్తోంది.


నటీనటులు : అడివి శేష్, ఇమ్రాన్ హష్మీ, మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధుశాలిని

సిబ్బంది:

దర్శకత్వం: వినయ్ కుమార్ సిరిగినీడి

రచన - అడ్వి శేష్ & వినయ్ కుమార్ సిరిగినీడి

డైలాగ్స్ & స్క్రిప్ట్ గైడెన్స్: అబ్బూరి రవి

సినిమాటోగ్రఫీ: అజీమ్ మహ్మద్

మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల

ఎడిటర్ : కోదాటి పవన్ కళ్యాణ్

ప్రొడక్షన్ డిజైనర్: మనీషా దత్

కాస్ట్యూమ్ డిజైనర్: రేఖ బొగ్గరపు

నిర్మాతలు : టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర

Yuvan Mark-U Spark-U, 3rd Single From The GOAT Unveiled

 దళపతి విజయ్, వెంకట్ ప్రభు, AGS ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ 'The GOAT' నుంచి స్పార్క్ సాంగ్ రిలీజ్ 



దళపతి విజయ్, వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ చార్ట్ బస్టర్ నోట్ లో స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ సింగిల్ విజిలేస్కో, సెకండ్ సింగిల్ నిన్ను కన్న కనులే చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. 


ఈ రోజు మేకర్స్ స్పార్క్ సాంగ్ ని రిలీజ్ చేశారు. యువన్ శంకర్ రాజా ఈ పాటని థంపింగ్ బీట్స్ తో వైరల్ ట్యూన్ గా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అందించి లిరిక్స్ చాలా క్యాచిగా వున్నాయి. యువన్ శంకర్ రాజా, వృష బాలు ఎనర్జిటిక్ గా పాడారు. ఈ సాంగ్ లో విజయ్ డ్యాన్స్ మూమెంట్స్ మెస్మరైజ్ చేశాయి. విజయ్, మీనాక్షి చౌదరి మాగ్నటిక్ కెమిస్ట్రీని షేర్ చేసుకున్నారు. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది. 


విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్ అమీర్, మీనాక్షి చౌదరి, వైభవ్, యోగి బాబు, ప్రేమి అమరెన్, యుగేంద్రన్ వాసుదేవన్, అఖిలన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ అందించారు.


పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేయనుంది.

National Crush Rashmika Mandanna generously donates Rs. 10 lakhs to Wayanad Landslide Relief Efforts in Kerala

 కేరళ వయనాడ్ బాధితుల సహాయార్థం రూ.10 లక్షల విరాళం ప్రకటించిన స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న



బ్లాక్ బస్టర్ మూవీస్ తో పాన్ ఇండియా క్వీన్ గా పేరు తెచ్చుకుంది రశ్మిక మందన్న. సోషల్ ఇష్యూస్ పై స్పందించే రశ్మిక పలు సందర్భాల్లో తన వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఆమె మరోసారి తన మంచి మనసు చాటుకుంది. కేరళ వయనాడ్ లో ఇటీవల కొండచరియలు విరిగిపడి సృష్టించిన విషాధం పట్ల రశ్మిక మందన్న తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. బాధితులను ఆదుకునేందుకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది.


ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలంతా ధైర్యంగా ఉండాలని ఆమె పేర్కొంది. రశ్మిక మందన్న ప్రస్తుతం "పుష్ప 2" ది రూల్ సినిమాతో పాటు బాలీవుడ్ మూవీ "సికిందర్" లో నటిస్తోంది. ఆమె ఖాతాలో "ది గర్ల్ ఫ్రెండ్" అనే ఇంట్రెస్టింగ్ మూవీ కూడా ఉంది.


Director Sam Anton Interview About Buddy

 "బడ్డీ" థియేటర్ లోనే ఎంజాయ్ చేయాల్సిన సినిమా - డైరెక్టర్ శామ్ ఆంటోన్




అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "బడ్డీ". గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించగా..శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "బడ్డీ" రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో "బడ్డీ"కి వర్క్ చేసిన ఎక్సీపిరియన్స్ షేర్ చేసుకున్నారు డైరెక్టర్ శామ్ ఆంటోన్.


- "బడ్డీ" మూవీకి అన్ని చోట్ల నుంచీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా బాగుందని, తమకు నచ్చిందని పిల్లలు, పెద్దలు చెబుతుండటం సంతోషంగా ఉంది. మార్నింగ్ షోస్ నుంచే సినిమా హిట్ అనే మౌత్ టాక్ మొదలైంది. "బడ్డీ" మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయడం మా టీమ్ అందరికీ హ్యాపీగా ఉంది. "బడ్డీ"లోని కామెడీ, ఎమోషన్, యాక్షన్ తో పాటు టెడ్డీ బేర్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తోంది.


- మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారితో రెండేళ్ల క్రితమే "బడ్డీ" గురించి డిస్కషన్ జరిగింది. తమిళ్ మూవీ టెడ్డీని రీమేక్ చేయాలనే ప్రస్తావన వచ్చింది. అయితే టెడ్డీలోని ఒక లైన్ మాత్రమే తీసుకుని కంప్లీట్ గా కొత్త కథతో "బడ్డీ" రూపొందించాలని అనుకున్నాం. అలా ఈ సినిమా మొదలైంది. ఈ మూవీకి ఒక యంగ్ హీరో అయితే బాగుంటుందని  అల్లు శిరీష్ ను అప్రోచ్ అయ్యాం. ఆయన నాకు చాలాకాలంగా పరిచయం. నా మూవీస్ చూసి ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. మేము సినిమా చేయాలని గతంలోనే అనుకున్నాం. "బడ్డీ" కథ చెప్పగానే శిరీష్ కు నచ్చి ప్రాజెక్ట్ బిగిన్ చేశాం.


- ఇవాళ ప్రేక్షకులు థియేట్రికల్ ఎక్సీపిరియన్స్ ఇచ్చే మూవీస్ కు మాత్రమే థియేటర్స్ కు వెళ్తున్నారు. "బడ్డీ" థియేటర్ కోసమే చేసిన సినిమా. ఇందులో టెడ్డీకి ఎక్స్ ప్రెషన్స్ తీసుకురావడం మెయిన్ టాస్క్ గా  భావించాం. సీజీ వర్క్ బాగా చేయించి ఆ ఫీల్ తీసుకొచ్చాం. యాక్షన్, అడ్వెంచర్ కథలో ఉన్నా.ఇది మెయిన్ గా లవ్ స్టోరీ. ఏటీసీలో వర్క్ చేసే అమ్మాయి, పైలట్ కు మధ్య జరిగే ప్రేమ కథ.


"బడ్డీ" కోసం రాజమౌళి ఈగ రిఫరెన్స్ తీసుకున్నా. ఆ సినిమాలో వర్కవుట్ అయిన ఎమోషన్ మనకూ వర్కవుట్ అవుతుందని చెప్పా. అది విలన్ క్యారెక్టర్ అయినా, లవ్ అయినా, టెడ్డీ బేర్ క్యారెక్టర్ అయినా ఎమోషన్ వర్కవుట్ అవుతుందని నమ్మకం ఉండేది.  ఖైదీ, విక్రమ్, కల్కిలా ఎపిసోడ్స్ లా "బడ్డీ" సినిమాను చేసుకుంటూ వెళ్లాం. క్లైమాక్స్ లో ఫ్లైట్ లో జరిగే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్ గా ఉంటుంది. హిప్ హాప్ తమిళ చేసిన మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. హిప్ హాప్ ఆది హీరోగా నెక్ట్ మూవీ చేయబోతున్నా.


- నాకు తెలుగు మూవీస్ ఇష్టం. రెగ్యులర్ గా తెలుగు మూవీస్ చూస్తుంటా. స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలనే ప్లాన్స్ ఉన్నాయి. దర్శకుడిగా ఒక జానర్ కు రెస్ట్రిక్ట్ కాలేను. కామెడీ, యాక్షన్, లవ్ స్టోరి ఇలా ఏ జానర్ అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నా.

AAY Trailer Launch at Pitapuram on August 5th

 ఆగస్ట్ 5న పిఠాపురంలో ప్రముఖ నిర్మాణ సంస్థ GA2 పిక్చర్స్, బన్నీవాస్, విద్యా కొప్పినీడి, నార్నే నితిన్, అంజి కె.మణిపుత్ర కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’  ట్రైలర్ విడుదల



కడుపుబ్బా న‌వ్వుకునే కామెడీ సినిమాలు రావ‌టం అరుదుగా మారుతున్న త‌రుణంలో, కుటుంబ‌మంతా క‌లిసి న‌వ్వుకునేలా, న‌వ్వుల పండుగ‌ను ‘ఆయ్’ చిత్రంతో ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి సిద్ధ‌మైంది ప్రెస్టీజియ‌స్ బ్యాన‌ర్ GA2 పిక్చర్స్.  ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.


ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఆయ్’ సినిమాను స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న  వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో ఈ సినిమా అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ‘ఆయ్’ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. సోష‌ల్ మీడియాలో రీల్స్‌, షార్ట్స్ రూపంలో తెగ వైర‌ల్ అయ్యాయి. దీంతో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచేలా మేక‌ర్స్ ఆగ‌స్ట్ 5న పిఠాపురంలో ‘ఆయ్’ మూవీ ట్రైలర్‌ను విడుద‌ల చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే హీరో నార్నే నితిన్‌, హీరోయిన్ న‌య‌న్ సారిక గోదావ‌రిలో చెరో ప‌డ‌వ‌లో సేద తీరుతూ ప్ర‌కృతిని ఆస్వాదిస్తున్నారు. చిన్న‌పాటి న‌వ్వుల స్నానానికి ఆగ‌స్ట్ 5న సిద్ధం కండి అంటూ క్యాప్ష‌న్ ఇవ్వ‌టం ద్వారా మేక‌ర్స్ సినిమా ఎంత ఫ‌న్నీగా ఆక‌ట్టుకోనుంద‌నే విష‌యాన్ని చెప్పారు.


ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఆయ్‌’ నుంచి రెగ్యుల‌ర్‌గా మూవీ అప్‌డేట్స్‌ను ఇస్తున్నారు. గోదావ‌రి బ్యాక్‌డ్రాప్‌తో ఆయ్ సినిమా రూపొందింది. ఈ ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో నార్నే నితిన్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటారు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ  సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు.  



GA2 పిక్చర్స్:

 ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో రూపొందాయి.


Director K Vijaya Bhaskar Happy with Ushaparinayam Success

 క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉషాపరిణయం అందర్ని ఆకట్టుకోవడం ఆనందంగా వుంది: సక్సెస్‌ఫుల్‌ దర్శకుడు కె.విజయ్‌భాస్కర్‌




నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.విజ‌య్‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తాజాగా రూపొందిన మ‌రో ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఉషా ప‌రిణ‌యం  ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. కె.విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీ‌క‌మ‌ల్‌, తాన్వీ ఆకాంక్ష‌, సూర్య ముఖ్య‌తార‌లు. ఆగస్టు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్రం అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ సక్సస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత విజయభాస్కర్‌ మాట్లాడుతూ 'చాలా రోజుల తరువాత ఒక క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చూశామని ప్రేక్షకులు అంటుంటే ఆనందంగా వుంది. నువ్వు నాకు నచ్చావ్‌ తరహాలో వినోదంతో పాటు నువ్వేకావాలి లాంటి టీనేజ్‌ లవ్‌స్టోరీ ఈ చిత్రంలో వుందని అందరూ అంటున్నారు. చిత్రాన్ని అందరూ ఎంజాయ్‌ చేస్తున్నారు. మౌత్‌టాక్‌తో ఇది మరింత మందికి చేరువ అవుతుందని నమ్మకం వుంది. కలెక్షన్లు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఇలాంటి చిన్న సినిమాలను ఆదరిస్తే మరిన్ని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు వస్తాయి. ఈచిత్రంతో హీరో, హీరోయిన్లకు నాకంటే ఎక్కువ పేరు వచ్చింది' అన్నారు. హీరో శ్రీకమల్‌ మాట్లాడుతూ సినిమా చూసిన అందరూ నా నటన, డ్యాన్సుల గురించి మాట్లాడుతున్నారు. అందరం ఎంతో కష్టపడి సినిమా చేశాం. ఈ రోజు ఫలితం చూస్తుంటే ఎంతో ఆనందంగా వుంది. కలెక్షన్లు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నాం' అన్నారు. హీరోయిన్‌ తాన్వీ ఆకాంక్ష మాట్లాడుతూ సినిమా ప్రివ్యూ చూసిన అందరి నుండి చాలా పాజిటివ్‌ స్పందన వచ్చింది. ఓ మంచి చిత్రంలో హీరోయిన్‌గా నటించినందుకు సంతోషంగా వుంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు విజయ్‌భాస్కర్‌ గారికి థ్యాంక్స్' అన్నారు. సినిమా చూసిన తరువాత చాలా రోజుల తరువాత మంచి సంగీతంతో కూడిన పాటలు చూశామని ఎమోషన్‌గా చెబుతుంటే నాకు ఎంతో గర్వంగా వుంది. ఈచిత్రంలో ప్రతి పాటకు చక్కని సాహిత్యం, ట్యూన్స్‌ కుదిరాయి. నా కెరీర్‌లో ఇదొక మరుపురాని చిత్రంగా నిలుస్తుందని సంగీత దర్శకుడు ఆర్‌.ఆర్‌.ధ్రువన్‌ తెలిపారు.


Melody Song From Devara to be Unveiled on August 5th

 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, కొరటాల శివ భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ నుంచి మెలోడీ పాట ఆగస్ట్ 5న విడుదల



మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవర గ్లింప్స్, ఫియర్ సాంగ్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.

మ్యూజికల్ ప్రమోషన్‌లను కొనసాగిస్తూ ఈ చిత్రం నుంచి రెండో పాటను ఆగస్టు 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ మేరకు ఇచ్చిన అప్డేట్‌ కోసం డిజైన్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. దేవర పూర్తి రొమాంటిక్ మోడ్‌లో మారినట్టుగా కనిపిస్తోంది. జాన్వీ కపూర్ అందాలు స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా కనిపిస్తోంది.

ఈ మెలోడీకి 'పఠాన్','వార్','ఫైటర్' వంటి చిత్రాలలో వైరల్ స్టెప్పులకు పేరుగాంచిన బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ కొరియోగ్రఫీ చేశారు. ఈ మ్యాజికల్ మెలోడీ కోసం అభిమానులెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ, ఎన్టీఆర్ అసాధారణమైన స్టెప్పులతో ఈ పాట అందరినీ ఆకట్టుకోనుంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ బ్యానర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

VD12 to Release on 28th March 2025

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కలయికలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న "VD12" మార్చి 28, 2025న విడుదల



- "VD12" విడుదల తేదీని ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

- ఈ ఆగస్టు నెలలోనే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్


అభిమానులు రౌడీ అని అభిమానంతో పిలుచుకొనే విజయ్ దేవరకొండ, తన అద్భుతమైన నటనా నైపుణ్యంతో స్టార్‌గా ఎదగడమే కాకుండా, దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులకు చేరువయ్యారు. విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టి ఉంటుంది. అలాంటి విజయ్, 'మళ్ళీరావా', 'జెర్సీ' చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు, జాతీయ అవార్డు విజేత గౌతమ్ తిన్ననూరితో చేతులు కలిపారు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంతో అందరినీ థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు.


'VD12' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో 'VD12' పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా మలుస్తున్నారు. థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా, ఎక్కడా రాజీ పడకుండా ఎంతో శ్రద్ధతో, అవిశ్రాంతంగా పని చేస్తోంది చిత్ర బృందం.


ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ శ్రీలంకలోని సుందరమైన ప్రదేశాల్లో జరిగింది. ఇప్పటిదాకా 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ క్రమంలో చిత్ర విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. 2025, మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఈ ఆగస్టులో ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు.


సంచలన స్వరకర్త, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకులు గిరీష్ గంగాధరన్, జోమోన్ టి జాన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.


అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ తో పాటు, ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను నిర్మాతలు త్వరలో వెల్లడించనున్నారు.


రచన, దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి

సంగీతం: అనిరుధ్ రవిచందర్

ఛాయాగ్రహణం: గిరీష్ గంగాధరన్, జోమోన్ టి జాన్

కూర్పు: నవీన్ నూలి

కళా దర్శకుడు: అవినాష్ కొల్లా

నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య

నిర్మాణ సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌

విడుదల తేది: మార్చి 28, 2025


Telangana Film Chamber Extend Support For Gaddar Awards-Prathani Ramakrishna Goud

"గద్దర్ అవార్డ్స్"కు 'తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్' తరుపున పూర్తి సహకారాన్ని అందిస్తాం - చైర్మన్ డా:ప్రతాని రామకృష్ణ గౌడ్ 



రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు తలపెట్టిన గద్దర్ అవార్డ్స్ చేయాలని సినీ ప్రముఖులు అందరితో కలిసి గద్దర్ అవార్డ్స్ ని చేయడానికి తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ముందుకు వస్తుందని తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత చాలా రోజుల నుండి ప్రభుత్వం అవార్డ్స్ చేయలేదు కాబట్టి దీన్ని గమనించి సినీ పరిశ్రమలో ఉన్న ప్రొడ్యూసర్స్ కి క్యారెక్టర్స్ కి అలాగే 24 గ్రాఫ్స్ లో ఉన్న నిపుణులైన టెక్నీషియన్స్ అందరికీ ఈ గద్దర్ అవార్డు ఇయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం చాలా గొప్ప విషయం గద్దర్ లాంటి ఒక ప్రజానాయకుడు ప్రజా గాయకుడు వారి పేరు పైన అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం దీన్ని తప్పకుండా మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున కూడా మేము సపోర్ట్ చేస్తూ అందర్నీ కలుపుకొని ఈ అవార్డు ఫంక్షన్ చేయడానికి మేము ముందుంటాం దీనికి శ్రీపద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు,తమ్మారెడ్డి భరద్వాజ గారు కూడా సంతోషాన్ని వ్యక్తపరిచారు ఇంత మంచి కార్యక్రమాన్ని రూపొందించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మా ధన్యవాదాలు చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్,వైస్ చైర్మన్స్ జేవియర్, గురురాజ్,సెక్రటరీ సాగర్ అడ్వైజర్ ఏ ఎం రత్నం 

Priyadarshi As M.Chanikya Varma in 35 Chinna Katha Kaadu

 రానా దగ్గుబాటి ప్రౌడ్లీ ప్రెజెంట్స్ - నివేతా థామస్, గౌతమి, భాగ్యరాజ్, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ "35-చిన్న కథ కాదు" లో లెక్కల మాస్టారు M. చాణక్య వర్మ గా ప్రియదర్శి



నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్."35-చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్.  


ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్  లెక్కల మాస్టారు M. చాణక్య వర్మ గా యాక్టర్ ప్రియదర్శిని పరిచయం చేస్తూ ఒక స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. లెక్కలు మాస్టారు గా ప్రియదర్శి క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగా వుంది. లుక్, పెర్ఫార్మన్స్ చాలా నేచురల్ గా వున్నాయి. ఈ గ్లింప్స్ ప్రియదర్శి క్యారెక్టర్, సినిమా క్యూరియాసిటీ ని పెంచింది.


స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా సిద్ధమైంది.


పెళ్లి చూపులు, సమ్మోహనం, అంటే సుందరానికీ తదితర చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఆకాశం నీ హద్దు రా, అంటే సుందరానికి, సర్ఫీరా, కుబేర తదితర చిత్రాలకు గ్రేట్ విజువల్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న నికేత్ బొమ్మి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. విజువల్ అప్పీల్‌ ని యాడ్ చేస్తూ ప్రొడక్షన్ డిజైన్‌ను లతా నాయుడు నిర్వహిస్తున్నారు. టి సి ప్రసన్న ఎడిటర్.


"35-చిన్న కథ కాదు" ఆగస్టు 15న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో  ఒకేసారి విడుదల కానుంది.


నటీనటులు : నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: నంద కిషోర్ ఈమాని

నిర్మాతలు: రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి

బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్

సంగీతం: వివేక్ సాగర్

డీవోపీ: నికేత్ బొమ్మి

ఎడిటర్: టి సి ప్రసన్న

డైలాగ్స్: నంద కిషోర్ ఈమాని, ప్రశాంత్ విఘ్నేష్ అమరావతి

ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు

పబ్లిసిటీ డిజైనర్: శక్తి గ్రాఫిస్ట్, అనీష్ పెంటి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్ సౌమిత్రి

క్రియేటివ్ ప్రొడ్యూసర్: శివాని దోభాల్

లిరిక్స్: కిట్టు విస్సాప్రగడ, భరద్వాజ్ గాలి

కాస్ట్యూమ్ డిజైనర్: ప్రిన్సి వైద్

లైన్ ప్రొడ్యూసర్: విన్సెంట్ ప్రవీణ్

పీఆర్వో: వంశీ-శేఖర్

డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా


Natural Star Nani Power Packed Look From Saripodhaa Sanivaaram

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ, డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం' నుంచి నాని పవర్ ప్యాక్డ్ యాక్షన్ పోస్టర్ రిలీజ్  



నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం' ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా రిలీజైన నాట్ ఏ టీజర్ వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే సినిమాలోని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ రిలీజ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


తాజాగా సరిపోదా శనివారం మేకర్స్ ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ నాని పవర్ ప్యాక్డ్ లుక్ లో ఆదరగొట్టారు. రగ్గడ్ లో లుక్ లో చేతిలో వెపన్ పట్టుకుని పవర్ ఫుల్ ఇంటెన్స్ యాక్షన్ మోడ్ లో కనిపించారు. మూవీలో హైఆక్టేవ్ యాక్షన్ వుండబోతోందని ఈ పోస్టర్ చూస్తే అర్ధమౌతోంది.  

 

ఈ చిత్తాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు.

 

ఈ పాన్ ఇండియా అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌కు కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.


ఆగస్ట్ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.  


నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ

నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి

బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్

సంగీతం: జేక్స్ బిజోయ్

డీవోపీ: మురళి జి

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

ఫైట్స్: రామ్-లక్ష్మణ్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్

 

Mega Supreme Hero Sai Durgha Tej Sparkles in a New look

 Mega Supreme Hero Sai Durgha Tej sparkles in a new look.



Hero Sai Durgha Tej (Sai Dharam Tej) is currently shooting for his next high budget Pan Indian flick #SDT18 bankrolled by Primeshow Entertainment.

The project is estimated to be made with a heavy budget of around 100 Crore, being the costliest film in his career.


As per sources, Sai Durgha Tej is sculpting his body and looks for this novel story and rustic character. It is pretty evident from his recent public appearance as he had graced the Pre-release Event of Usha Parinayam, Directed & Produced by Blockbuster Director Vijaya Bhaskar.

He has sported an uber stylish long beard look, put down a lot of weight and looked absolutely fit raising eyebrows.


The actor has recently helped veteran artist Pavala Shyamala Garu who is in dire financial crisis through the Journalist Association for which he has donated 5 Lakh rupees.


Earlier, he has also taken front foot to help whenever possible in various instances,

from helping a Allu Arjun fan for his college fees on Twitter to establishing a water plant in Siddipet to renovating an old-age home in

Vijayawada.


The actor has also earned a huge applause for responding against online child abuse for which both Telangana & Andhra Pradesh governments responded swiftly and the offenders were arrested immediately.

Hero Allu Sirish Interview About Buddy

 "బడ్డీ" క్లాస్, మాస్ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది - హీరో అల్లు శిరీష్




అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "బడ్డీ". గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 2న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలను తెలిపారు హీరో అల్లు శిరీష్.



- "బడ్డీ" మూవీని లాస్ట్ ఇయర్ మార్చి లో మొదలుపెట్టి జూలైలో సినిమా కంప్లీట్ చేశాం. డిసెంబర్ లోనే రిలీజ్ కు తీసుకురావాలని అనుకున్నాం.  నా మూవీస్ కు గ్యాప్ వస్తోంది. ఫాస్ట్ గా చేసి డిసెంబర్ 31 సక్సెస్ పార్టీ చేసుకోవాలని నేనూ నిర్మాత జ్ఞానవేల్ గారూ అనుకున్నాం. అయితే ఈ సినిమాలో 3 వేలకు పైగా సీజీ షాట్స్ ఉన్నాయి. బడ్డీ ఫేస్ ను యానిమేట్ చేయాలి. వాటిని పర్పెక్ట్ గా చేయాలంటే డబ్బుతో పాటు ఆర్టిస్టులకు టైమ్ ఇవ్వాలి. దాంతో లేట్ అయ్యింది. సమ్మర్ అనుకున్నది ఆగస్టుకు పోస్ట్ పోన్ అయ్యింది. బొమ్మకు ప్రాణం వస్తే ఎలా ఉంటుందనే కీ పాయింట్ మీదే సినిమా ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు తగ్గకుండా సీజీ వచ్చింది.


- డైరెక్టర్ శామ్ ఆంటోనీ ఈ కథతో నా దగ్గరకు వచ్చి టెడ్డీ బేర్ పాయింట్ తో ఉంటుందని చెప్పారు. టెడ్డీ మూవీ తమిళంలో వచ్చింది, అలాగే ఇంగ్లీష్ లోనూ ఇలాంటి సినిమా ఉందని చెప్పాను. మీరు కథ వినండి మీకు కొత్తగా అనిపిస్తుంది, స్టోరీ విన్నాక మల్లీ ఓటీటీలో టెడ్డీ మూవీ చూడండి అన్నారు శామ్ ఆంటోనీ. అలా కథ విన్నాను. టెడ్డీ బేర్ కు ప్రాణం రావడం అనే ఒక్క పాయింట్ ను మాత్రమే దర్శకుడు టెడ్డీ సినిమా నుంచి తీసుకున్నాడు. మిగతాదంతా కొత్త కథ. హీరోయిన్ కు విలన్ కు ఉండే కాన్ ఫ్లిక్ట్, హీరో క్యారెక్టరైజేషన్, కథకు ఇచ్చిన జస్టిఫికేషన్స్ అన్నీ బాగా స్క్రిప్టింగ్ చేశాడు.  "బడ్డీ"  కథ వింటునప్పుడు కొత్తగా అనిపించింది. నేనూ రోజు కథలు వింటా...ఒక వెరైటీ పాయింట్ ఏ కథలో దొరుకుతుందా అని వెతుకుతుంటా. ఆ కొత్తదనం  "బడ్డీ" కథలో ఫీల్ అయ్యా. నేను ఫస్ట్ టైమ్ పైలట్ గా కనిపించబోతున్నా. నా క్యారెక్టర్ ఇంటెన్స్ గా ఉంటుంది.


- "బడ్డీ" పోస్టర్ రిలీజ్ నుంచి ఇది రీమేక్ కదా అని కామెంట్స్ వచ్చాయి కాదు స్ట్రైట్ ఫిల్మ్ అని చెప్పడమే మాకు పెద్ద సవాల్ గా మారింది. ఎంత చెప్పినా ఇది రీమేక్ అనే కామెంట్స్ రాసేవారు. అలాంటి వాళ్లను మనం మార్చలేం, వారికి మొత్తం సినిమా చూపెట్టి ప్రూవ్ చేయలేం కదా. సినిమా రిలీజ్ అయ్యాక వాళ్లకే తెలుస్తుంది "బడ్డీ" స్ట్రైట్ ఫిలిం అని. "బడ్డీ" క్లాస్, మాస్ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది.


- తెలుగు ఆడియెన్స్ మూవీ లవర్స్. వాళ్లు ఇప్పటికీ థియేటర్స్ లోనే సినిమా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటారు. అందుకే మన దగ్గర థియేటర్స్ లో పుట్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి. సింగిల్ స్క్రీన్స్ లోనూ బాగా సినిమాలు చూస్తుంటారు. అదే నార్త్ లో అలా ఉండదు. వాళ్ల జనాభాకు థియేటర్స్ కు వెళ్లే వారి సంఖ్య చూస్తే చాలా తక్కువ. సెకండ్ వీక్ సినిమాకు వెళ్తామనే ఫ్రెండ్స్ ను చూశాను. అందుకే అందరికీ అందుబాటు ధరల్లో మా  "బడ్డీ"  సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం.


-  "బడ్డీ" లో లవ్ స్టోరీ ఉంటుంది కానీ చాలా తక్కువ పార్ట్ ఉంటుంది. కథకు ఎంత కావాలో అంతే ఉంచాడు దర్శకుడు శామ్. లవ్ స్టోరీ ఎక్కువ ఉంటే కథ డీవీయేట్ అవుతుందని ఆయన భావించాడు.  "బడ్డీ"  సినిమా రన్ టైమ్ కూడా చాలా క్రిస్ప్ గా ఉంటుంది. 2 గంటల 8 నిమిషాలు రన్ టైమ్ ఉంది. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ కు ఎక్కువ లెంగ్త్ ఉంటే బాగుండదు. అలా మ్యాజిక్ చేస్తున్నట్లు కథ ఫాస్ట్ గా వెళ్లాలి.  "బడ్డీ" కి డైరెక్టర్ శామ్ అదే ప్రయత్నం చేశాడు.


-  "బడ్డీ" లో నాలుగు మేజర్ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. వాటిని చాలా న్యాచురల్ గా ఉండేలా డిజైన్ చేయమని మా యాక్షన్ కొరియోగ్రాఫర్స్ కు చెప్పాను. నేను చెప్పే ముందే వాళ్లే ఇలా న్యాచురల్ గా చేద్దాం సార్ అన్నారు. నేను సర్ ప్రైజ్ అయ్యాం. మా అందరికీ ఒకేలా ఆలోచిస్తున్నాం అనిపించింది.


- ప్రొడక్షన్ పరంగా మూవీ చాలా రిచ్ గా ఉంటుంది. స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా గారు సినిమాను రాజీ పడకుండా నిర్మించారు. ఒక పాత విమానం కొని దాన్ని మూవీ కోసం ఆర్ట్ వర్క్ చేసి అందులో షూట్ చేశాం. క్లైమాక్స్ ఫైట్ కూడా అందులోనే ఉంటుంది. సినిమాకు  కావాల్సింది ఇస్తాను కానీ తక్కువ డేస్ లో షూటింగ్ చేయండని ప్రొడ్యూసర్ చెప్పేవారు. రెండు షిఫ్టుల్లో సినిమాను కంప్లీట్ చేశాం.


- హిప్ హాప్ తమిళ చేసిన మ్యూజిక్, బీజీఎం అదిరిపోతుంది. మేము  "బడ్డీ"  చూసినప్పుడు బీజీఎం సూపర్బ్ గా ఉందనిపించింది. స్పెషల్ షోస్ వేసినప్పుడు కూడా ప్రేక్షకుల నుంచి మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హిప్ హాప్ థమిళ చేసిన తని ఓరువన్, ధృవ లాంటి మూవీస్ పాటలు నాకు ఇష్టం.


- అలీ గారితో నేను గతంలో శ్రీరస్తు శుభమస్తు సినిమా చేశాను. ఈ సినిమాలో మరోసారి కలిసి నటించాను. అలాంటి సీనియర్ యాక్టర్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో కో పైలట్ క్యారెక్టర్ లో అలీ గారు కనిపిస్తారు.


- ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడాన్ని ఇష్టపడను. ఒక సినిమా తర్వాతే మరొకటి. అందుకే నా మూవీస్ లేట్ అవుతున్నాయి. సాధారణంగా చిన్నా, పెద్దా ఏ సినిమా అయినా అనుకున్న టైమ్ కు చేయలేం. ఖచ్చితంగా ఎంతో కొంత ఆలస్యమవుతూనే ఉంటుంది.


Hero Varun Sandesh Interview About Viraaji

 "విరాజి"లో నేను చేసిన ఆండీ క్యారెక్టర్ మనమంతా గర్వపడేలా ఉంటుంది - హీరో వరుణ్ సందేశ్




మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం "విరాజి". ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు హీరో వరుణ్ సందేశ్.


- "విరాజి" మూవీలో నా లుక్ కొత్తగా ఉండేలా మా డైరెక్టర్ ఆద్యంత్ హర్ష డిజైన్ చేశారు. రెండు డిఫరెంట్ కలర్స్ లో వెరైటీగా హెయిర్ స్టైల్, ముక్కు పుడక, టాటూస్ తో ఒక కొత్త మేకోవర్ చేయించారు. నాకు కథ కంటే ముందు నేను ఈ సినిమాలో చేసిన ఆండీ క్యారెక్టర్ లుక్ ఎలా ఉంటుందో డైరెక్టర్ వివరించారు. సినిమా కంప్లీట్ అయ్యాక ఇప్పుడు ప్రమోషన్ కోసం మళ్లీ ఆ లుక్ లోనే కనిపిస్తున్నా. మీకు త్వరగా రిజిస్టర్ అయ్యి రీచ్ అవ్వాలంటే కొత్తగా కనిపించాలి.


- "విరాజి" ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. మెంటల్ ఆస్పత్రి దగ్గర కొద్దిమంది ఉంటారు. వారి దగ్గరకు ఆండీ వస్తాడు. అతను వచ్చాక గందరగోళం మొదలవుతుంది. అదేంటి అనేది తెరపై చూడాలి. ఈ కథలో అంతర్లీనంగా సోషల్ మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాలో నా లుక్ చూసి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి. కానీ వాటికి ఈ సినిమానే సమాధానం చెబుతుంది. "విరాజి" సినిమా చూశాక నేను ఎందుకు ఈ మేకోవర్ లో ఉన్నాను అని తెలుసుకుంటారు. ఈ సినిమా చూశాక ఆండీ క్యారెక్టర్ పట్ల గర్వపడతారు.


- "విరాజి" కథలో చాలా టిస్టులు టర్న్స్ ఉంటాయి. ఒక మంచి మూవీ చేశామని మేమంతా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈ సినిమాలో వర్క్ చేస్తున్నప్పుడు మేకోవర్ కోసమే ఎక్కువ కష్టపడ్డాను. హెయిర్ కలరింగ్ కోసం 7 అవర్స్, అలాగే టాటూస్ కోసం దాదాపు గంట సమయం పట్టేది. ప్రతి రోజూ ఒక స్నేక్ టాటూ వేసేవాళ్లం.


- "విరాజి" సినిమా చూశాక ఎమోషనల్ అయ్యాను. చివరలో హార్ట్ టచింగ్ గా అనిపించింది. నా వైఫ్ వితిక కూడా సినిమా చూసి అలాగే ఫీలయ్యింది. ఈ సినిమాలో సగం తెలుగు సగం ఇంగ్లీష్ మాట్లాడుతుంటా. ఇది నా బాడీ లాంగ్వేజ్ కు కంఫర్ట్ గా అనిపించింది. ప్రతి సినిమాకు, క్యారెక్టర్ కు నేనెంతవరకు అడాప్ట్ అవగలనో అంతవరకు ప్రయత్నిస్తుంటాను.


- నా గురించి, నా సినిమాల గురించి, నా కెరీర్ గురించి ఎవరైనా ఏదైనా అంటే నేను భరిస్తాను. నటుడిగా నా కెరీర్ లో విమర్శలు కూడా ఒక భాగం. కానీ నా వైఫ్ వితిక ఫైర్ బ్రాండ్. అందుకే తను నా కెరీర్ గురించి స్పందిస్తూ మాట్లాడింది. వితిక లాంటి భార్య ఉండటం నా అదృష్టం. 18 ఏళ్లప్పుడు హ్యాపీడేస్ చేశాను. 17 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. చాలా ఎక్సీపిరియన్స్ లు చూశాను. అందుకే మరొకరి అభిప్రాయాల పట్ల స్పందించను. ప్రతి ఒక్కరికీ ఒక్కో ఒపీనియన్ ఉంటుంది. ఈ మూవీ కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ చేశాం. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎబనెజర్ పాల్ "విరాజి"కి అద్భుతమైన బీజీఎం ఇచ్చాడు. సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఆయన ఇప్పుడు మరో మూడు బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్స్ సైన్ చేశాడు.


- ఏపీలో "విరాజి" టూర్ చేశాం. ఆ టూర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టూర్ విశేషాలు ఇన్ స్టా లో షేర్ చేసుకున్నా. చీకట్లో ఉన్న వారికి వెలుగు పంచే వాడు విరాజి. ఇదే టైటిల్ జస్టిఫికేషన్. సస్పెన్స్ , థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్, డ్రామా, ఎమోషన్ వంటి అన్ని అంశాలు కథలో కలిపి రూపొందించారు దర్శకుడు ఆద్యంత్ హర్ష.


- మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మా "విరాజి" మూవీ రిలీజ్ కావడం సంతోషంగా ఉంది. ఫస్ట్ వాళ్లను నేనే అప్రోచ్ అయ్యాను. మంచి మూవీ చూడమని చెప్పాను. వాళ్లు చూసి మేము రిలీజ్ చేస్తామని ముందుకొచ్చారు.


- ఇవాళ ప్రేక్షకులు సినిమాలో ఏదో కొత్తదనం ఉంటేనే ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు కోరుకునే అలాంటి కొత్తదనం ఉన్న సినిమా "విరాజి".  ఈ కథ చెప్పేటప్పుడే దర్శకుడు ఆద్యంత్ హర్ష చాలా డీటెయిల్డ్ గా బీజీఎం రిఫరెన్స్ లతో చెప్పాడు. సినిమాను అంతే పర్పెక్ట్ ప్లానింగ్ తో రూపొందించాడు.  ఏ సీన్ లో ఏం ఏం అవసరమో అవన్నీ పేపర్ మీద వర్క్ చేసి పక్కాగా ఉండేలా చూసుకున్నాడు.


- ఈ వారం ఓ పదీ పన్నెండు సినిమాలు రిలీజ్ కు వస్తున్నాయి. వాటిలో మా "విరాజి" మూవీ కనిపిస్తుందంటే దానికి మా ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ కూండ్ల గారు చేయిస్తున్న ప్రమోషనే కారణం. ఆయనకు సినిమా పట్ల ప్యాషన్ ఉంది. ఈ కథను అలాంటి ప్రొడ్యూసర్ మాత్రమే నిర్మించగలరు.


- కథ బాగుండి, క్యారెక్టర్ నచ్చితే ఏ సినిమా అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. మంచి స్టోరీ ఉంటే వెబ్ సిరీస్ ల్లోనూ నటించాలని ఉంది. మైఖేల్ సినిమాలో విలన్ గా కనిపించాను. నాకు ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలనే పరిమితులు ఏవీ లేవు. "విరాజి" ఒక మంచి సినిమా. దీనికి మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా.

Telugu Film Chamber of Commerce President Bharat Bhushan met Telangana CM Revanth Reddy

 తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన అధ్యక్షుడు భరత్ భూషణ్



తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనందున భరత్ భూషణ్ గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి పుష్పగుచ్చం అందించి తెలుగు సినీ ఇండస్ట్రీ సమస్యలు మరియు గద్దర్ అవార్డ్స్ గురించి చర్చించారు.


ఈ సందర్భంగా తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్ గారు మాట్లాడుతూ : ఎంతో బిజీ షెడ్యూల్ ఉండి కూడా కలవడానికి అవకాశం ఇచ్చి ముచ్చటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం నుంచి ఎప్పుడు సహాయం అందుతుందని ఆయన చెప్పడం చాలా ఆనందంగా ఉంది.


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ : తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు భరత్ భూషణ్ గారికి అభినందనలు. నా అమెరికా పర్యటన తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో మీటింగ్ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు. 


Nikkhil Advani's ‘Vedaa’ Trailer Unveiled

 జీ స్టూడియోస్, ఎమ్మాయ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, జె.ఎ.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్‌పై జాన్ అబ్ర‌హం, శ‌ర్వారి ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నిఖిల్ అద్వానీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘వేద’ ట్రైలర్ విడుదల

ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న రిలీజ్ అవుతున్న సినిమా

 


జాన్ అబ్ర‌హం, శ‌ర్వారి ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నిఖిల్ అద్వానీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘వేద’. జీ స్టూడియోస్, ఎమ్మాయ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, జె.ఎ.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్‌పై రూపొందిన ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న విడుద‌ల‌వుతుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.


‘వేద’ అనే అమ్మాయి జీవితాన్ని తెలియ‌జేసే చిత్ర‌మే ఇది. న్యాయం కోసం ఆమె చేసే పోరాటాన్ని చూపించే సినిమా ఇది. మ‌నిషి అనుకుంటే సాధించ‌లేనిది ఏదీ లేదు అని చెప్పే ధృఢ‌మైన మ‌న‌స్త‌త్వాన్ని, ఎదురు తిరిగి పోరాడే త‌త్వాన్ని ఈ క‌థ ద్వారా తెలియ‌చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో వేదకు తోడుగా, ర‌క్ష‌ణ క‌వ‌చంగా ఓ మాజీ సైనికుడు నిల‌బ‌డ్డాడు. అత‌ని అండతో ఆమె ఎంత వ‌ర‌కు పోరాడిందో తెలియ‌జెప్పే క‌థాంశ‌మే ఈ మూవీ.


‘వేద’ ట్రైలర్ చూస్తుంటే రొమాలు నిక్కబొడిచేంత యాక్ష‌న్ స‌న్నివేశాలున్నాయ‌ని అర్థ‌మ‌వుతుంది. సినిమాలో హై యాక్ష‌న్, ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. న్యాయం కోసం ప్ర‌మాద‌క‌ర‌మైన మార్గంలోకి వేద అనే అమ్మాయి ప్ర‌యాణాన్ని ప్రారంభించిన‌ప్పుడు ఆమెకు ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను సినిమా మ‌న‌కు ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంది.

బాలీవుడ్ స్టార్ జాన్ అబ్ర‌హం పేరు విన‌గానే మ‌న‌కు ఆయ‌న పోషించిన అద్భుత‌మైన యాక్ష‌న్ పాత్ర‌లు గుర్తుకు వ‌స్తాయి. ఈ చిత్రంతో మ‌రోసారి ఆయ‌న త‌న‌దైన పంథాలో మెప్పించార‌ని ట్రైల‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. ‘‘వేద’ లాంటి సినిమాలో భాగం కావటం నాకెంతో ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తోంది. మంచి వైపు నిల‌బ‌డాల‌ని, పోరాటం చేయాల‌నే అంద‌రినీ ప్రేరేపించే క‌థాంశంతో సినిమా తెర‌కెక్కింది ’ అన్నారు జాన్ అబ్ర‌హం.


చిత్ర ద‌ర్శ‌కుడు నిఖిల్ అద్వానీ మాట్లాడుతూ ‘‘సినిమా అంటే కేవలం వినోదాన్ని అందించే మాధ్యమం మాత్రమే కాదు. మంచి సందేశాన్ని కూడా అందిస్తుందని నేను నమ్ముతాను. రేపు వేద సినిమా చూసిన తర్వాత చాలా మంచి ప్రేక్ష‌కుల‌కు మ‌న‌సుల్లో గుర్తుండిపోతుంద‌ని గ‌ట్టిగా విశ్వ‌స్తున్నాను’’ అన్నారు.


ఉమేష్ కె.ఆర్‌.బ‌న్సాల్‌, సీబీఓ, జీస్టూడియోస్ మాట్లాడుతూ ‘‘వేద’ అనేది బలమైన పాత్రలతో కూడిన శక్తివంత‌మైన క‌థ‌. ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌కు హ‌త్తుకునే సినిమా అవుతుంద‌ని న‌మ్ముతున్నాం’’ అన్నారు.


ఎమ్మాయ్ ఎంట‌ర్‌టైన్మెంట్ మ‌ధు బోజ్వానీ మాట్లాడుతూ ‘‘‘వేద’వంటి సినిమాను ప్రేక్ష‌కుల‌కు అందించ‌టం మా అంద‌రికీ ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది. సాధికారిత‌త‌ను తెలియ‌జేస్తూ స్ఫూర్తినింపేలా ఈ చిత్రాన్ని చేయ‌టం అనేది సినిమాపై మాకున్న ప్రేమ‌ను తెలియ‌జేస్తుంది. దీన్ని ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేస్తుండ‌టం మాకెంతో గ‌ర్వ కార‌ణంగా అనిపిస్తోంది’’ అన్నారు.


జాన్ అబ్రహం, శర్వారి ప్రధాన పాత్రల్లో నటించిన ‘వేద’ చిత్రంలో అభిషేక్ బెనర్జీ కీలక పాత్రను పోషించారు. తమన్నా భాటియా స్పెషల్ అప్పియరెన్స్‌లో అల‌రించ‌బోతున్నారు. అసీమ్ అరోరా రైట‌ర్‌గా వ‌ర్క్ చేసిన ఈ చిత్రాన్ని నిఖిల్ అద్వానీ తెర‌కెక్కించారు. జీ స్టూడియోస్‌, ఉమేష్ కె.ఆర్‌.బ‌న్సాల్, మోనిషా అద్వానీ, మ‌ధు బోజ్వానీ, జాన్ అబ్ర‌హం నిర్మించిన ఈ చిత్రానికి మీనాక్షి దాస్ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. జీ స్టూడియోస్, ఎమ్మాయ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, జె.ఎ.ఎంట‌ర్‌టైన్మెంట్ స‌మ‌ర్ప‌ణలో రూపొందిన ‘వేద’ సినిమా ఆగ‌స్ట్ 15న రిలీజ్ అవుతుంది.


జీ స్టూడియోస్ గురించి:

ముంబైలో ఉండే జీ స్టూడియోస్ సంస్థ సినిమా నిర్మాణంతో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. వెబ్ సిరీస్‌లు, సినిమాలకు సంబంధించిన స్ట్రీమింగ్‌, టెలివిజ‌న్ కంటెంట్ డెవ‌ల‌ప్‌మెంట్‌, నిర్మాణం, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూష‌న్ రంగాల్లో 2012 నుంచి ఈ సంస్థ త‌న ప్రత్యేక‌త‌ను చాటుకుంటూనే ఉంది. ది క‌శ్మీర్ ఫైల్స్‌, గ‌ద్ద‌ర్ 2, టువెల్త్ ఫెయిల్ వంటి చిత్రాల నిర్మాణంలో కీల‌క భూమిక పోషించిన జీ స్టూడియోస్ ప‌లు భాష‌ల్లో త‌న గ్లోబ‌ల్ ఆడియెన్స్ బ‌ల‌మైన క‌థ‌ల‌ను అందించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ప‌లు ఇండియ‌న్ లాంగ్వేజెస్‌లోనూ సినిమాల‌ను అందిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌శంస‌ల‌ను అందుకున్న సైర‌త్‌, మామ్‌, సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌, మ‌ణిక‌ర్ణిక‌, మిసెస్ ఛ‌ట‌ర్జీ వెర్స‌స్ నార్వే, ది తాష్కెంట్ ఫైల్స్, కిస్మ‌త్ 2, బంగార్రాజు, తునివు, గాడ్ డే గాడ్ డే ఛా వంటి సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించి ప్రపంచ వ్యాప్తంగా జీ స్టూడియోస్ త‌న ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకుంది.


ఎమ్మాయ్ ఎంట‌ర్‌టైన్మెంట్‌:

2011, ముంబైలో ప్రారంభ‌మైన ఎమ్మాయ్ ఎంట‌ర్‌టైన్మెంట్ అండ్ మోష‌న్ పిక్చ‌ర్స్ ఎల్ఎల్‌పి వైవిధ‌మ్యైన కంటెంట్‌ను అందించే సంస్థ‌గా రాణిస్తోంది. మోనీషా అద్వానీ , మ‌ధు బోజ్వానీ, నిఖిల్ అద్వానీ ఈ సంస్థ‌ను స్థాపించారు. ఈ సంస్థ సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్‌ల‌ను నిర్మిస్తోంది. 12 ఏళ్లలో ఇప్ప‌టి వ‌ర‌కు 30 సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌ను ఈ సంస్థ నిర్మించింది. డీ డే, ఎయిర్ లిఫ్ట్‌, బాట్లా హౌస్‌, బాజార్, పి.ఒ.డ‌బ్ల్యు-బందీ యుద్ క, స‌త్య‌మేవ జ‌య‌తే, ముంబై డైరీస్‌, ది ఎంపైర్‌, అదూరా,, మిసెస్ ఛట‌ర్జీ వెర్సెస్ నార్వే వంటి సినిమాలో ఈ సంస్థ ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది.


జె.ఎ.ఎంట‌ర్‌టైన్‌మెంట్:

డిఫ‌రెంట్ సినిమాలు, ఎవ‌రూ చేయ‌లేని క‌థాంశాల‌తో సినిమాలు చేయ‌టానికి ఆస‌క్తి చూపే సంస్థ‌లో జె.ఎ.ఎంట‌ర్‌టైన్‌మెంట్ ముందుంటుంది. 2008 ప్రారంభమైన ఈ సంస్థ విక్కీ డోన‌ర్ వంటి విల‌క్ష‌ణ‌మైన క‌థాంశంతో తెర‌కెక్కిన చిత్రంతో ప్ర‌యాణాన్ని ప్రారంభించింది.ఈ సినిమా ప్ర‌ధాన క‌థాంశం వివాదాస్ప‌ద‌మైన‌ప్ప‌టికీ మేక‌ర్స్ ఎక్క‌డా వెనుక‌డుగు వేయ‌లేదు. సినిమా బ‌డ్జెట్‌కంటే ప‌దిహేను రెట్లు క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయంటే సినిమా ఆడియెన్స్‌కి ఎంత బాగా రీచ్ అయ్యిందో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌ద్రాస్ కేఫ్ వంటి కాంట్ర‌వ‌ర్సియ‌ల్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌ను రూపొందించింది. మాజీ ప్ర‌ధాని  శ్రీలంక సివిల్ వార్‌లో ఎలా భాగ‌మ‌య్యారు. దాని వ‌ల్ల ఎలాంటి పరిస్థితులు ఇక్క‌డ నెల‌కొన్నాయనే క‌థాంశంతో  సినిమా రూపొందింది. సినిమా బ‌డ్జెట్ కంటే మూడు రెట్లు రాబ‌ట్టడ‌మే కాకుండా వివ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను కూడా అందుకుందీ చిత్రం. అలాగే బాట్లా హౌస్, పర్మాను: ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్, ఎటాక్, ఫోర్స్ 2 వంటి అనేక విజయవంతమైన చిత్రాలను ఈ సంస్థ నిర్మించింది.