Latest Post

Odela 2 Climax Shoot Underway In Massive Odela Mallanna Set With 800 Artists

 తమన్నా భాటియా, అశోక్ తేజ, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్  హై బడ్జెట్ మల్టీ లింగ్వల్ మూవీ ఒదెల 2- ఓదెల మల్లన్న మ్యాసీవ్ సెట్‌లో, 800 మంది ఆర్టిస్టులతో జరుగుతున్న  క్లైమాక్స్ షూటింగ్

 


తమన్నా భాటియా మోస్ట్ ఎవైటెడ్  సీక్వెల్ ఒదెల-2 కోసం మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌తో కలిసి ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా వున్నారు. 2021 బ్లాక్‌బస్టర్ హిట్ ఒదెల రైల్వే స్టేషన్‌ సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీని విజనరీ అశోక్ అశోక్ తేజ డైరెక్టర్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, షెడ్యూల్డ్ వర్కింగ్ వీడియోకి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది, సీక్వెల్‌పై ఎక్సయిట్మెంట్ ని పెంచింది.



ప్రస్తుతం, ఈ హైబడ్జెట్ మల్టీ లింగ్వల్ మూవీ  హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలోని ఓదెల మల్లన్న టెంపుల్ లో ఇంటెన్స్ క్లైమాక్స్ షూటింగ్‌తో జరుగుతోంది. అత్యంత కీలకమైన మ్యాసీవ్ టెంపుల్ సెట్ ని హై బడ్జెట్‌తో నిర్మించారు. తమన్నా, ఇతర నటీనటులతో పాటు 800 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.


హైదరాబాద్ బోనాలు ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. చీర కట్టుకుని, తమన్నా భాటియా తలపై బోనం మోస్తూ అద్భుతంగా కనిపించింది. కోఇన్సీడెంట్ గా, బోనాల సంబరాలు జరుగుతున్నప్పుడు బోనాల ఎపిసోడ్‌ను షూట్  చేస్తున్నారు.


తమన్నా భాటియా అద్భుతమైన పెర్ఫార్మెన్  అందించడానికి ఇంటెన్స్ ట్రైనింగ్, రిహార్సల్స్‌ తీసుకున్నారు. యాక్షన్ సన్నివేశాలను పర్ఫెక్ట్ గా చేయడంలో ఆమె డెడికెషన్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తాయి.


ఆకట్టుకునే కథాంశంతో ఇంటెన్స్ యాక్షన్‌ని బ్లెండ్ చేయడంలో పేరున్న దర్శకుడు సంపత్ నంది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని సూపర్ విజన్ చేస్తున్నారు. అతని గైడెన్స్ లో, 'ఓదెల 2' ఎమోషన్స్, థ్రిల్స్, అడ్రినలిన్-పంపింగ్ యాక్షన్ సన్నివేశాల రోలర్-కోస్టర్ రైడ్‌ను అందించడానికి రెడీ అవుతోంది.


ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్‌రాజన్ డీవోపీ కాగా రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్.


నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి


సాంకేతిక సిబ్బంది:

నిర్మాత: డి మధు

క్రియేటెడ్ బై: సంపత్ నంది

బ్యానర్లు: మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్

దర్శకత్వం: అశోక్ తేజ

డీవోపీ: సౌందర్ రాజన్. ఎస్

సంగీతం: అజనీష్ లోక్‌నాథ్

ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో


Kya Lafda From Double ISMART Released

 రొమాంటిక్ మెలోడీ ఆఫ్ ది సీజన్- ఉస్తాద్ రామ్ పోతినేని, కావ్య థాపర్, పూరి జగన్నాధ్, సంజయ్ దత్, ఛార్మీ కౌర్, పూరీ కనెక్ట్స్ డబుల్ ఇస్మార్ట్ నుంచి క్యా లఫ్డా సాంగ్ రిలీజ్



డబుల్ ఇస్మార్ నుంచి మొదటి రెండు సింగిల్స్ ఆడియన్స్ ని అద్భుతంగా అలరించి వైరల్ హిట్స్ అయ్యాయి. లీడ్ పెయిర్ రామ్ పోతినేని, కావ్య థాపర్‌ ల థర్డ్ సింగిల్ క్యా లఫ్డా విడుదలతో ఈ మాన్‌సూన్ మరింత రొమాంటిక్ మారింది.


క్యా లఫ్డా ఒక అద్భుతమైన ట్రాక్, డిఫరెంట్ అండ్ యూనిక్ కంపోజిషన్ తో ఇన్స్టంట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. డైనమిక్ వోకల్స్ తో   పెర్ఫార్మెన్స్  టెక్నో బీట్‌లను అద్భుతంగా  బ్లెండ్ చేశారు సంగీత దర్శకుడు మణి శర్మ. ఈ పాట ఇన్స్టంట్ గా లిజినర్స్ కు ఎనర్జీ ఇస్తుంది. వెరీ లైవ్లీ మూడ్ లో అలరించింది.

 

ట్రాక్ బ్యాలెన్స్ హుక్ లైన్‌ను కలిగి ఉంది, ప్రోగ్రామింగ్ సూపర్ కూల్ ఫ్లెయిర్‌తో వుంది. పాట మొత్తం చార్మ్ ని యాడ్ చేసింది. క్యా లఫ్డా  ఎంజాయ్ బుల్ మాత్రమే కాకుండా మెమరబుల్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తోంది.


ధనుంజయ్ సీపాన, సింధూజ శ్రీనివాసన్ రొమాంటిక్ టచ్‌తో తమ వోకల్స్ అందించారు. శ్రీ హర్ష ఈమాని సాహిత్యం కూడా అంతే ఆకట్టుకుంది. ఈ సీజన్‌లో రొమాంటిక్ మెలోడీగా 'క్యా లఫ్డా' రామ్, కావ్యా థాపర్ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీని ప్రజెంట్ చేసింది. వారి కెమిస్ట్రీ పాటకు విజువల్ ఎట్రాక్షన్ యాడ్ చేసింది.


టీజర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి, విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లు, ప్రమోషన్‌లతో దూకుడు పెంచారు.


పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మించిన ఈ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రంలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.


ఈ చిత్రానికి సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ అందించారు.


డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.  


నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను తదితరులు.


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్

నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్

బ్యానర్: పూరి కనెక్ట్స్

వరల్డ్ వైడ్ రిలీజ్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ (నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి)

సీఈఓ: విషు రెడ్డి

సంగీతం: మణి శర్మ

సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి

స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Sangitha as Rathnamma in Paradha

 అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, ప్రవీణ్ కాండ్రేగుల, ఆనంద మీడియా మూవీ 'పరదా' నుంచి రత్నమ్మ గా సంగీత ఫస్ట్ లుక్ రిలీజ్

 


"సినిమా బండి"సినిమాతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తన రెండవ చిత్రం 'పరదా'తో మరో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతున్నారు. లేడి ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెరీ ట్యాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్, వెర్సటైల్ దర్శన రాజేంద్రన్, ప్రముఖ నటి సంగీత లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.


ఇప్పటికే విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ రత్నమ్మ గా సంగీత క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. హోమ్లీగా కనిపించిన సంగీత ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది


శ్రీనివాసులు పివి,  శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మాతలుగా ఆనంద మీడియా ఈ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది.  

 

ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కొన్ని గ్రామాలలోని అద్భుతమైన ప్రదేశాలలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది.  


గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటర్.  


తారాగణం: అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత


సాంకేతిక విభాగం:

బ్యానర్: ఆనంద మీడియా

దర్శకత్వం: ప్రవీణ్ కాండ్రేగుల

నిర్మాతలు: విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రోహిత్ కొప్పు

సంగీతం: గోపీ సుందర్

సాహిత్యం: వనమాలి

రచయితలు: పూజిత శ్రీకాంతి, ప్రహాస్ బొప్పూడి

స్క్రిప్ట్ డాక్టర్: కృష్ణ ప్రత్యూష

డీవోపీ: మృదుల్ సుజిత్ సేన్

ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల

సౌండ్ డిజైన్: వరుణ్ వేణుగోపాల్

ఆర్ట్ డైరెక్టర్: శ్రీనివాస్ కళింగ

కాస్ట్యూమ్ డిజైనర్: పూజిత తాడికొండ

పీఆర్వో: వంశీ-శేఖర్

పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను

Music Shop Murthy Success Meet Celebrated Grandly

కథను నమ్మి డబ్బులు పెట్టిన నిర్మాతలకు హ్యాట్సాఫ్.. మ్యూజిక్ షాప్ మూర్తి సక్సెస్ మీట్ లో అజయ్ ఘోష్ 



అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రముఖ పాత్రల్లో నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రానికి థియేటర్లో మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లో సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. బరువెక్కిన గుండెతో థియేటర్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా ప్రతినిధుల సమక్షంలో ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శకనిర్మాతలతో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది. 


 ఈ సందర్భంగా నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. 'ప్రతి మనిషి జీవితంలో జరిగే కథనే ఇది. సక్సెస్ అయిన వారెవరైనా ఎన్నో కష్టాలు దాటుకొని వచ్చి ఉంటారు. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు పేరు పేరునా కృతజ్ఞతలు. ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ ఎంతో కో-ఆపరేటివ్ గా పని చేశారు. ఓ ఫ్యామిలీలా అందరం కలిసి ఈ సినిమాను రూపొందించాం. నన్ను తెలుగు తెరపై చూపించిన మొదటి దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు ఈ సినిమా చూసి నాకు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయని చెప్పారు. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఈ సినిమా కథను నమ్మి డబ్బు పెట్టిన నిర్మాతలకు సెల్యూట్. శివ సినిమాను బాగా రూపొందించారు. ఈ సినిమాలోని చాలా సీన్స్ నా నిజ జీవితంలో జరిగినవే. డైరెక్షన్ స్టాఫ్ మొత్తానికి కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం పని చేసిన ఇన్‌ఫ్లుయన్సర్లు, పీఆర్ఓ సతీష్ గారికి కృతజ్ఞతలు' అన్నారు.


 మరో నటుడు నాని మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ సినిమాలో డీజే సీన్ చాలా బాగా వచ్చిందని' అన్నారు. 


 హీరోయిన్ చాందినీ చౌదరీ మాట్లాడుతూ.. 'ఈ రోజు విచ్చేసిన మీడియా వాళ్లందరికీ, తమ్మారెడ్డి భరద్వాజ గారికి థాంక్యూ. ఈ సినిమా కథ విన్నప్పుడే దీనిపై నమ్మకం ఉంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. బాగా ట్రెండ్ అవుతోంది. ఆడియన్స్ అందరికీ థ్యాంక్యూ. ఈ సినిమా ప్రతి ఏజ్ గ్రూప్ కి కనెక్ట్ అయ్యే సినిమా అవుతుందని ముందే ఊహించాం. అదే జరిగింది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి వస్తున్న వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. డైరెక్టర్ శివ గారితో పాటు ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. త్వరలోనే ఈ సినిమా మిగితా భాషల్లో కూడా రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పీఆర్ఓ సతీష్ పాత్ర గొప్పది. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ మంచి సంగీతం అందించారు. నేను ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో కంటే చాలా బాగా కనిపించానని అంతా అంటున్నారు. అందుకు గాను డీఓపీ గారికి స్పెషల్ థ్యాంక్స్' అన్నారు.


 ముఖ్య అతిధిగా వచ్చిన దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా ట్రైలర్ చూశా. ఈ అజయ్ ఘోష్ ని పెట్టి సినిమా తీసుకున్నారు. వీళ్ళ పని అయిపోనట్లే అనుకున్నా. మొన్న మిడ్ నైట్ మెలకువ రావడంతో ఈ సినిమా చూశా. 40 నిమిషాల సినిమా చూశాక మతిపోయింది. చివరలో అయితే ఈ సినిమా సీన్స్ చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయా. ఈ సినిమాను చాలా డిఫరెంట్ గా రూపొందించారు. కష్టాలు, కన్నీళ్లు కాదు మంచితనంతో కొట్టారు. మంచివాళ్ళు కూడా ఏడిపించారు. ప్రతి క్యారెక్టర్ జస్టిఫికేషన్ తో కూడి ఉంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చింది. మౌత్ పబ్లిసిటీతో సినిమా సక్సెస్ అవుతోంది. సినిమా సక్సెస్ అయింది కానీ ఈ సినిమాతో వీళ్ళకు డబ్బులు వచ్చాయని అయితే నేను నమ్మను. మంచి సినిమాను ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాలకు మీడియా వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఇలాగే సపోర్ట్ చేయండి' అన్నారు.


 డైరెక్టర్ శివ మాట్లాడుతూ.. 'నా మొదటి సినిమా ఇది. ఈ సినిమా తీశాక సినిమా ఎలా తీయాలి. కష్టనష్టాలు ఏంటి అనేది ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ముందు ముందు ఇంకా మంచి సినిమాలు తీస్తా' అని అన్నారు.

ఈ సినిమాలో ఆమని, అమిత్ శర్మ, భాను చందర్ మరియు దయానంద్ రెడ్డి ముఖ్యమైన పాత్రలను పోషించారు. శ్రీనివాస్ బెజుగం సినిమాటోగ్రఫీ, పవన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇతర ప్రధాన ఆకర్షణలు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా పని చేశారు. 

Introducing Madhubala as Pannaga From Kannappa

కన్నప్ప మూవీ నుంచి మధుబాల లుక్ రిలీజ్



డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, మధుబాల వంటి వారు నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో భాగమవుతున్నారు. ఇక ఈ సినిమా నుంచి బయటకొస్తున్న ఒక్కో అప్ డేట్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. 


ఈ క్రమంలోనే తాజాగా కన్నప్ప సినిమా నుంచి మధుబాల లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. చెంచుల వీరత్వాన్ని తెలిపేలా ఉన్న ఈ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ మేరకు పోస్టర్ పై రాసిన పదాలు వీరనారి తెగువను తెలుపుతున్నాయి. తాజాగా వదిలిన ఈ పోస్టర్ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేసింది.  మూవీ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్‌తో కన్నప్ప మీద అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అనేక మంది పాన్ ఇండియా స్టార్స్ ఉండటం వల్ల అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్ మీద పడింది.


"కన్నప్ప" సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా రాబోతోంది.  ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా మల్చుతున్నారు. కన్నప్ప అచంచలమైన విశ్వాసం తరతరాలుగా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉంది.  ఎంతో అంకితభావంతో విష్ణు మంచు ఈ పాత్రను పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు.  ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలను పెంచనున్నారు. 

Ashwin Babu 'Shivam Bhaje' censored U/A

గంగా ఎంటర్టైన్మెంట్స్ 'శివం భజే' సెన్సార్ పూర్తి చేసుకుని ఆగస్టు 1న గ్రాండ్ విడుదల!!



గంగా ఎంటర్టైన్మంట్స్ 'శివం భజే' చిత్రం 2 గంటల 6 నిమిషాల నిడివితో నేడు సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది.


పాటలు, ట్రైలర్ మరియు ఇతర వాణిజ్య అంశాల వల్ల మార్కెట్ లో మంచి బజ్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు నిర్మాత మహేశ్వర రెడ్డి మూలి.


న్యూ ఏజ్ కథ-కథనాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉండబోయే ఈ చిత్రంలో వికాస్ బడిస నేపథ్య సంగీతం, శివేంద్ర విజువల్స్, హీరో అశ్విన్ నటన, గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు హైలైట్ అవ్వనున్నాయి.


తారాగణం:

అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

 

ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్,

ప్రొడక్షన్ డిజైనర్ : సాహి సురేష్,

మ్యూజిక్ డైరెక్టర్ : వికాస్ బడిస

ఫైట్ మాస్టర్: పృథ్వి, రామకృష్ణ

డీ ఓ పి: దాశరథి శివేంద్ర

పి ఆర్ ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫని కందుకూరి (బియాండ్ మీడియా)

మార్కెటింగ్: టాక్ స్కూప్

నిర్మాత : మహేశ్వర్ రెడ్డి మూలి

దర్శకత్వం : అప్సర్. 

The RajaSaab Fan India Glimpse Unveiled

 రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబో మోస్ట్ అవేటెడ్ మూవీ "రాజా సాబ్" ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ రిలీజ్, వచ్చే ఏడాది ఏప్రిల్ 10న మూవీ విడుదల




రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ "రాజా సాబ్" ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ అందరినీ థ్రిల్ చేస్తోంది. ప్రభాస్ వింటేజ్ లుక్ లో ఛార్మింగ్ గా కనిపించారు. "రాజా సాబ్" సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూఛిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో "రాజా సాబ్" సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తున్నారు. "రాజా సాబ్" సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయబోతున్నట్లు ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు.



బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీస్ తో సక్సెస్ కు కేరాఫ్ గా మారిన ప్రెస్టీజియస్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ "రాజా సాబ్" సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేస్తోంది. "రాజా సాబ్" సినిమా తమ సంస్థలో ఒక మెమొరబుల్ మూవీగా మిగిలిపోయేలా నిర్మిస్తోంది. "రాజా సాబ్" సినిమా షూటింగ్ 40 పర్సెంట్ పూర్తయింది. ఆగస్టు 2వ తేదీ నుంచి మరో భారీ షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రభాస్ ను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నారు డైరెక్టర్ మారుతి.



నటీనటులు - ప్రభాస్, తదితరులు


టెక్నికల్ టీమ్


ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు

సినిమాటోగ్రఫీ - కార్తీక్ పళని

మ్యూజిక్ - తమన్

ఫైట్ మాస్టర్ - రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్

వీఎఎఫ్ఎక్స్ - ఆర్.సి. కమల్ కన్నన్

ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్

క్రియేటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ కేఎన్

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా, వంశీ కాకా

కో ప్రొడ్యూసర్ - వివేక్ కూచిభొట్ల

ప్రొడ్యూసర్ - టీజీ విశ్వప్రసాద్

రచన, దర్శకత్వం - మారుతి




MP Bhupathi Raju Srinivasa Varma was felicitated by FNCC Working committee

 ఏపీ పార్లమెంట్ సభ్యులు, ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారిని ఘనంగా సత్కరించిన ఎఫ్ ఎన్ సి సి కార్యవర్గం



సౌత్ లోనే నెంబర్ వన్ స్థానంలో నిలబడి ఎన్నో మంచి కార్యక్రమాలు, నిర్వహిస్తున్న సంస్థ ఎఫ్ ఎన్ సి సి. ఈ ఆదివారం సాయంత్రం ఏపీ పార్లమెంట్ సభ్యులు, ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారిని ఘనంగా సత్కరించిన ఎఫ్ ఎన్ సి సి కార్యవర్గం   సెక్రెటరీ ముళ్ళపూడి మోహన్ గారు, జాయింట్ సెక్రెటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు గారు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి గారు, జే. బాలరాజు గారు, ఏడిద రాజా గారు, సామా ఇంద్రపాల్ రెడ్డి గారు,మరియు ఎఫ్ . న్.సి.సి ఫార్మర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు .


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ నటులు మాగంటి మురళీమోహన్ గారు, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ కె.ఎల్. దామోదర్ ప్రసాద్ గారు, తెలుగు నిర్మాతల మండలి సెక్రెటరీ టి. ప్రసన్నకుమార్ గారు మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా నర్సాపూర్ పార్లమెంట్ సభ్యులు, ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు మాట్లాడుతూ :  సౌత్ లోనే నెంబర్ వన్ క్లబ్ గా ఫిల్మ్ నగర్ క్లబ్ కి పేరు వుంది.


ఎఫ్ ఎన్ సి సి ఎప్పుడు మంచి కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. నేషనల్ గేమ్స్ మరియు  ప్రోగ్రామ్స్ చేస్తూ క్రీడాకారులను, కళాకారులను ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సంస్థ ఇలాగే అంచలంచెలుగా ఇంకా ఎదగాలని కోరుకుంటూ నా వంతు సహాయం ఎప్పుడు కావాలన్న క్లబ్ కి అందిస్తానని తెలియజేసుకుంటున్నాను అన్నారు.


ఎఫ్ ఎన్ సి సి సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ గారు మాట్లాడుతూ : ప్రజా సేవలో ఎంతో బిజీగా ఉండి కూడా అడగగానే ఒప్పుకొని మా ఈ సత్కారాన్ని స్వీకరించినందుకు మంత్రివర్యులు శ్రీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి కృతజ్ఞతలు. ఎఫ్ ఎన్ సి సి తరఫున చేసే కార్యక్రమాలను ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు. ఇదేవిధంగా అందరూ ఇలానే సపోర్ట్ చేస్తే ముందు ముందు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలతో ఎఫ్ ఎన్ సి సి ని ఇండియా లోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టే విధంగా మా కార్యవర్గం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటుంది అన్నారు. 


Allu Sirish's "Buddy" Reduces Ticket Rates Ahead of Its Grand Theatrical Release

 అల్లు శిరీష్ "బడ్డీ" సినిమా టికెట్ రేట్ల తగ్గింపు, ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ




అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "బడ్డీ". గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 2న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.


ఈ నేపథ్యంలో "బడ్డీ" సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తున్నట్లు మేకర్స్ ఈరోజు ప్రకటించారు. సింగిల్ స్క్రీన్స్ లో 99 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 125 రూపాయిలు మాత్రమే టికెట్ రేట్స్ ఉండబోతున్నాయి. "బడ్డీ" సినిమాకు మరింత ఎక్కువ మంది ఆడియెన్స్ ను ఆకర్షించేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఒక కొత్త అటెంప్ట్ గా "బడ్డీ" సినిమా ఉండబోతోంది. ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ అందించిన సాంగ్స్ ఇప్పటికే రిలీజై ఛాట్ బస్టర్స్ అయ్యాయి. "బడ్డీ" సినిమా ట్రైలర్ కొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇచ్చి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆగస్టు 2న రిలీజ్ కాబోతున్న "బడ్డీ" సినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.



నటీనటులు - అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా రాజేశ్ సింగ్, ముఖేష్ కుమార్, అలీ తదితరులు



టెక్నికల్ టీమ్

ఎడిటర్ - రూబెన్

సినిమాటోగ్రఫీ - కృష్ణన్ వసంత్

ఆర్ట్ డైరెక్టర్ - ఆర్ సెంథిల్

మ్యూజిక్ - హిప్ హాప్ తమిళ

బ్యానర్ - స్టూడియో గ్రీన్ ఫిలింస్

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

కో ప్రొడ్యూసర్ - నేహా జ్ఞానవేల్ రాజా

ప్రొడ్యూసర్ - కేఈ జ్ఞానవేల్ రాజా, అధన్ జ్ఞానవేల్ రాజా

రచన, దర్శకత్వం - శామ్ ఆంటోన్

Usha Pariyanam Pre Release Event Held Grandly


ఉషా పరిణయం' చిత్రాన్ని అందరూ థియేటర్‌కు వెళ్లి చూసి సక్సెస్‌ చేయాలి: ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మెగా సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్‌



నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.విజ‌య్‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తాజాగా మ‌రో ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంది. ఉషా ప‌రిణ‌యం అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. కె.విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో శ్రీ‌క‌మ‌ల్‌, తాన్వీ ఆకాంక్ష‌, సూర్య ముఖ్య‌తార‌లు. ఆగస్టు 2న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా కె.విజయ్‌భాస్కర్‌ మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలివి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా

సాయి దుర్గ తేజ్‌ మాట్లాడుతూ 'తన్వీ ఆకాంక్షకు అన్నయ్యగా ఈ ఫంక్షన్‌కు వచ్చాను. విజయ్‌భాస్కర్‌ దర్శకత్వలో నేను ప్రేమకావాలి అనే సినిమా చేయాల్సింది అది మిస్‌ అయ్యింది. ఆది సాయికుమార్‌ నా రేయ్‌ చేయాలి.. ఆది ప్రేమకావాలి చేశాడు. నేను రేయ్‌ చేశాను. అలా మారిపోయింది. కమల్‌ నాకు జిమ్‌లో పరిచయం మంచి హార్డ్‌వర్కర్‌. ఈ రోజు హీరోగా చేయడం హ్యపీగా వుంది. ఆర్‌.ఆర్‌.ధ్రువన్‌ సంగీతం చాలా బాగుంటుంది. ఆల్‌ దబెస్ట్‌ . నాకు ఎంతో ఆప్తుడు అయిన సతీష్‌ అన్న కూతురు ఈ చిత్ర హీరోయిన్‌ తన్వీ. తన్వీ కూడా మా రికమండేషన్‌తో ఈ సినిమా చేయడం లేదు. ఎంతో కష్టపడి షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసి ఈ అవకాశం పొందింది. కొత్తవాళ్లతో చేస్తున్న ఈ సినిమా థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తే..ఇలాంటి కొత్త సినిమాలు మరిన్ని వస్తాయి. విజయ్‌భాస్కర్‌ గారికి మంచి విజయా చేకూరాలి' అన్నారు.

దర్శకుడు విజయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ 'సాయి ద రియల్‌హీరో.. సాయి దుర్గ తేజ్‌ హీరోగానే కాకుండా సమాజం గురించి కూడా ఆలోచిస్తాడు. పద్నాలుగేళ్ల తరువాత సాయిను చూస్తున్నాను. సాయిని 14 ఏళ్ల క్రితం పవన్‌కల్యాణ్‌ గారి నిర్మాణ సారథ్యంలో నేనే హీరోగా ఇంట్రడ్యూస్‌ చేయాలి కానీ కుదరలేదు. ఆ రోజు ఎంత వినయంగా, సంస్కారంతో వున్నాడో.. ఈ రోజు అలాగే వున్నాడు, చిరంజీవి గారి దగ్గర వున్న ప్రేమ సాయిలో కనిపించింది. మమ్ములను టీమ్‌ను ఎంకరైజ్‌ చేయడానికి వచ్చినందుకు ఆనందంగా వుంది. నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఫ్యామిలీ సపోర్ట్‌తో ఈ సినిమా నిర్మించాను. ఈ చిత్రానికి ధ్రువన్‌ చాలా మంచి సంగీతం ఇచ్చాడు. మా ఇద్దరికి ట్యూన్‌ అయ్యింది. సతీష్‌ ఫోటోగ్రఫీ ఈసినిమాకు ఎంతో ప్లస్‌ అయ్యింది. తన్వీ స్వీటెస్ట్‌ గర్ల్‌. చాలా కంఫర్టబుల్‌ హీరోయిన్‌. నో ప్రాబ్లెమ్‌ గర్ల్‌. కాశ్మీర్‌లో ఎంత ఇబ్బంది అయినా అంత చలిలో కూడా ఎంతో సహకరించింది. సినిమాలో టెక్నిషియన్స్‌, ఆర్టిస్ట్‌ కూడా ఎంతో ఓన్‌ చేసుకుని ఈ సినిమా చేశారు' అన్నారు.

హీరో శ్రీకమల్‌ మాట్లాడుతూ 'అందరి పూర్తి సహకారంతో ఓ మంచి సినిమాను అందిస్తున్నాం. అనుకున్న టైమ్‌ కంటే ముందే షూటింగ్‌ను పూర్తిచేశాను. సాయి దుర్గ తేజ్‌కు నేను అభిమానిని. ఆయన రావడం ఎంతో మధురానుభూతి. సాయి అన్నరావడం నా జీవితంలో మరిచిపోలేను. ఈ సినిమాను అందరూ థియేటర్‌లో చూసి మమ్ములను ఎంకరైజ్‌ చేయాలని కోరుకుంటున్నాను. నాన్న గారు నాకు దేవుడు. ఆయన పేరు నిలబెట్టడానికి ప్రయత్నిస్తాను. తాన్వీ ఆకాంక్ష.. చాలా మంచిగా పెంచారు. చాలా కంఫర్టబుల్‌ నో ప్రాబ్లమ్‌ గర్ల్‌. ఆమెతో మళ్లీ మళ్లీ పనిచేయాలని కోరుకుంటున్నాను. మా చెల్లి, బావ ఈ సినిమా నిర్మాణంలో ఎంతో సహకరించారు. అందరికి సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

హీరోయిన్‌ త్వాన్వీ ఆకాంక్ష మాట్లాడుతూ 'సాయి దుర్గ తేజ్‌ అన్న రావడం చాలా సంతోషంగా వుంది. నేను సక్సెస్‌ అవుతుంటే ఆనందపడే వ్యక్తుల్లో సాయి అన్న ఒకరు. అన్న అంటే నాకు చాలా గౌరవం. నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పడు నాన్న మొదట సాయి అన్నకే చెప్పాడు. మీరు చాలా సంతోషపడ్డారని తెలిసింది. విజయ్‌భాస్కర్‌ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్‌ యూ. సినీ పరిశ్రమలోకి రావాలన్న నా కోరిక ఈ సినిమా తీరింది. సినిమా పట్ల ఆయన ఎంతో అంకితభావం వున్న వ్యక్తి. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు అందరూ నువ్వు చాలా లక్కీ అన్నారు. కమల్‌తో పనిచేయడం చాలా కంఫర్ట్‌గా వుంది. కమల్‌లో మంచి నటుడు,డ్యాన్సర్‌ వున్నాడు. ఈ సినిమా చూస్తున్నప్పుడు అందరూ చాలా ఎంజాయ్‌ చేస్తారు. ఈ సినిమాకు పనిచేసిన అందరికి ఎంతో థ్యాంక్స్‌. కాస్ట్యూమ్‌ ఈ రోజు అంత అందంగా వున్నయాంటే దానికి కారణం శామ్‌ అక్క. తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చుతుందని
నాకు నటిగా మంచి గుర్తింపు ఇస్తుందనే నమ్మకం వుంది' అన్నారు.

కాస్ట్యూమ్‌ డిజైనర్‌ శాన్వి మాట్లాడుతూ సాయి దుర్గ తేజ్‌ వచ్చినందుకు ఎంతో సంతోషంగా వుంది. మీ మదర్‌ నేమ్‌ మీ పేరులో యాడ్‌ చేయడం రియల్లీ గ్రేట్‌. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారు. కమల్‌ మంచి నటుడు. రేపు సినిమా విడుదల తరువాత అందరికి తెలుస్తుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది అన్నారు.  


నటుడు రవిశివ తేజ మాట్లాడుతూ 'విజయ్‌భాస్కర్‌ గారు ఆర్టిస్ట్‌ ఎవరైనా సరే పాత్రకు సరిపోతే వాళ్ల నుంచి నటనను రాబట్టుకుంటాడు. దటీజ్‌ ఆయన గ్రేట్‌నెస్‌. ఆ కాన్ఫిడెన్స్‌తోనే అందరూ కొత్తవాళ్లతో ఉషా పరిణయంను తీశాడు. సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌ అయ్యే అన్ని ఎలిమెంట్స్‌ వున్నాయి. ఈ సినిమా కోసం నా భార్య శాన్వి ఎంతో కష్టపడింది. తన నాన్న విజయ్‌భాస్కర్‌ ఇబ్బంది పడకూడదని ప్రొడక్షన్‌లో అన్నీ తానై చూసుకుంది. శాన్వీ నా వైఫ్‌ అయ్యినందుకు ఎంతో గర్వంగా వుంది. ఈ సినిమాలో నేను కూడా ఓ మంచి పాత్ర చేశాను. హీరోగా కమల్‌ ఇరగదీశాడు. ఇంతమంది కష్టపడి చేసిన ఈ సినిమా తప్పకుండా సక్సెస్‌ సాధిస్తుందనే విశ్వాసం వుంది అన్నారు.
 ఈ కార్యక్రమంలో సీనియర్‌ నటుడు శివాజీ రాజాతో ఫణి, సంగీత దర్శకుడు ఆర్‌.ఆర్‌.ధ్రువన్‌, కెమెరామెన్‌ సతీష్‌ ముత్యాల, కో-డైరెక్టర్‌ కాళీ తదిరులు పాల్గొన్నారు.

Deadpool & Wolverine Smashes The Global Box-office

 అభిమానుల్ని దిల్ ఖుష్ చేస్తున్న డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్ తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్



మూడు రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 3670 కోట్లు కలెక్ట్ చేసిన డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్


సూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తో విజ‌యవంతంగా డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్ తెలుగునాట థియేట‌ర్లలో సందడి చేస్తుంది. అత్యంత భారీ అంచ‌నాలు మ‌ధ్య ప్ర‌పంచ‌వ్యాప్తంగా జూలై 26న విడుద‌లైన ఈ సినిమాను మార్వెల్ స్టూడియోస్ వారు నిర్మించారు. ర‌య‌న్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ ముఖ్య పాత్ర‌లుగా తెర‌కెక్కిన ఈ సినిమా విడుద‌లైన మూడు రోజుల్లోనే ప్ర‌పంచ మూవీ బాక్స్ ఫీస్ ని షేక్ చేస్తుంది. దాదాపుగా మూడు రోజుల్లో 3670 కోట్లు క‌లెక్ట్ చేసి కాసుల వ‌ర‌ద సృష్టించింది. ఇండియాలో కూడా డెడ్ పుల్ అండ్ వాల్విరిన్ క‌లెక్ష‌న్ల హ‌వా కొన‌సాగుతుంది. మరీ ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాకు మార్వెల్ మూవీ అభిమానుల అద‌ర‌ణ ద‌క్కింది. తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్ లో ఉన్న టైమ్లీ డైలాగులు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. డెడ్ పుల్ పాత్ర‌దారు ర‌య‌న్ రెనాల్డ్స్ ప‌లికిన ప్ర‌తి సంభాష‌ణ‌కి సంబంధించిన తెలుగు డ‌బ్బింగ్ ఆద్యంతం హాస్యాన్ని పండించింది. దీంతో ఈ సినిమాకు విడుద‌లైన రోజు నుంచి తెలుగులో విశేషాద‌ర‌ణ ల‌భిస్తుంది.

Mythri Movie Makers LLP to release 'Shivam Bhaje' in Nizam on August 1st

 గంగా ఎంటర్టైన్మెంట్స్ 'శివం భజే' కి నైజాం ఏరియాలో గ్రాండ్ రిలీజ్ ఇవ్వనున్న మైత్రి మూవీ మేకర్స్ ఎల్. ఎల్. పి!!




ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న విడుదలకి సిద్ధంగా ఉన్న గంగా ఎంటర్టైన్మంట్స్ 'శివం భజే' చిత్రాన్ని నైజాం ఏరియాలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు 'మైత్రి మూవీ మేకర్స్'.


ఇటీవల విడుదలైన పాటలకి, ట్రైలర్ కి ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో అనూహ్యమైన స్పందన లభిస్తుండడంతో మార్కెట్ లో అంచనాలు భారీగా పెరిగాయి.


దాంతో నైజాం ఏరియాలో గ్రాండ్ రిలీజ్ చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ ఎల్. ఎల్. పి లాంటి పెద్ద సంస్థ ముందుకొచ్చింది.


ట్రైలర్ లో చూపించినట్టుగా ఇంటర్నేషనల్ క్రైమ్, మర్డర్ మిస్టరీ, సీక్రెట్ ఏజెంట్, శివుడి ఆట లాంటి అనేక అంశాలతో న్యూ ఏజ్ కథనాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని అర్థమైంది. వికాస్ బడిస నేపథ్య సంగీతం, శివేంద్ర విజువల్స్, హీరో అశ్విన్ నటన, గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు, అప్సర్ దర్శకత్వం ఇలా ఎన్నో హైలెట్స్ తో తెరకక్కనున్న ఈ న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో అశ్విన్ సరసన, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటించారు.


అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

 

ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్,

ప్రొడక్షన్ డిజైనర్ : సాహి సురేష్,

మ్యూజిక్ డైరెక్టర్ : వికాస్ బడిస

ఫైట్ మాస్టర్: పృథ్వి, రామకృష్ణ

డీ ఓ పి: దాశరథి శివేంద్ర

పి ఆర్ ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫని కందుకూరి (బియాండ్ మీడియా)

మార్కెటింగ్: టాక్ స్కూప్

నిర్మాత : మహేశ్వర్ రెడ్డి మూలి

దర్శకత్వం : అప్సర్.


Sangharshana Set for August 9 Theatrical Release

ఆగస్ట్ 9న థియేటర్స్ లో "సంఘర్షణ" 




మహీంద్ర పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీ సంఘర్షణ. చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వల్లూరి.శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 9న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది.


ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయినా ఇందులో లవ్, ఫ్యామిలీకి సంబందించిన అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. చైతన్య పసుపులేటి, రషీద భాను మెయిన్ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమాకు సుధాకర్ అండ్ కేవీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


వన్ మీడియా ద్వారా పార్థు రెడ్డి సంఘర్షణ సినిమాను థియేట్రికల్ విడుదల చేస్తున్నారు. ఆదిత్య శ్రీ రామ్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ప్రేక్షకులకు నచ్చే సినిమాతో రావడం సంతోషంగా ఉందని నిర్మాత వల్లూరి.శ్రీనివాస్ రావ్ తెలిపారు. 

AAY Paid Premieres on August 15th Independence Day

 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగ‌స్ట్ 15న జీఏ 2 పిక్చ‌ర్స్‌, బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి, నార్నే నితిన్‌, అంజి కె.మ‌ణిపుత్ర బినేషన్‌లో రూపొందుతోన్న ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’  పెయిడ్ ప్రీమియర్స్



సక్సెస్‌ఫుల్ నిర్మాణ సంస్థ‌ GA2 పిక్చర్స్ బ్యానర్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో ఈ సినిమా అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.


ఇప్ప‌టికే ఆయ్ సినిమా నుంచి విడుద‌లైన పాట‌లు చార్ట్ బ‌స్ట‌ర్స్‌గా ప్రేక్ష‌కుల నుంచి అదర‌ణ‌ను పొందాయి. అలాగే సోష‌ల్ మీడియాలో రీల్స్‌, షార్ట్స్ బాగా వైర‌ల్ అయ్యాయి. తాజాగా మేక‌ర్స్ ఈ చిత్రాన్ని స్వాతంత్య్రదినోత్స‌వ సంద‌ర్భంగా వ‌ర‌ల్డ్ వైడ్ ఆగ‌స్ట్ 15న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.


గోదావ‌రి బ్యాక్ డ్రాప్‌లో హృద‌యానికి హ‌త్తుకునేలా మ‌న‌సారా న‌వ్వుకునేలా ఈ సీజ‌న్‌లో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను ఆయ్ చిత్రం మెప్పించ‌టానికి సిద్ధ‌మైంది. నార్నే నితిన్ ఆడియెన్స్‌ను అల‌రించ‌బోతున్నారు.


 ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ  సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు.  



GA2 పిక్చర్స్:

 ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో రూపొందాయి.


Deeksha movie in Post production Works

 పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న "దీక్ష" మూవీ



ఆర్‌.కె. ఫిలింస్‌, స్నిగ్ధ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిమ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దీక్ష’. పినిశెట్టి అశోక్‌ కుమార్‌ నిర్మాత. కిరణ్‌కుమార్‌, అలేఖ్యరెడ్డి  జంటగా నటిస్తున్నారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర ప్రోగ్రెస్ ను తెలిపారు దర్శక నిర్మాత ఆర్ కే గౌడ్. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్, నటుడు జేవీఆర్, నటి తులసి, అనూష పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆర్‌.కె.గౌడ్‌ మాట్లాడుతూ - మా ‘దీక్ష’సినిమా షూటింగ్ పూర్తయింది. గ్రాఫిక్ వర్క్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. "దీక్ష" ఉంటే ఏదైనా సాధించగలం అనే పాయింట్ తో మూవీని తెరకెక్కించాం ఈ మూవీలో హీరో కిరణ్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ఆయనకు హీరోగా మంచి పేరు తెచ్చే చిత్రమిది. అలాగే జేవీఆర్ గారు ఓ కీ రోల్ చేశారు. ఆయనకు ధర్మవరపు సుబ్రహ్మణ్యం లాంటి ఇమేజ్ వస్తుంది. తులసి, అనూష ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. అందంగా తెరపై కనిపిస్తారు. వారికి కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. కిరణ్ , జేవీఆర్ గారు మా నెక్ట్ మూవీ మహిళా కబడ్డీ సినిమాలనూ నటించబోతున్నారు. ‘దీక్ష’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మహిళా కబడ్డీ సినిమాను లాంఛ్ చేస్తాం. అన్నారు


హీరో కిరణ్ మాట్లాడుతూ - ‘దీక్ష’ మూవీలో హీరోగా నటించే అవకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్ అన్నగారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఆయన ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించారు. ‘దీక్ష’ చిత్రంతో హీరోగా నాకు మంచి పేరొస్తుంది ఆశిస్తున్నా. ఈ సినిమాలో ఒక నిమిషం పాటు ఉండే సంస్కృత డైలాగ్ ఒకటి నాతో చెప్పించారు.  ఆ డైలాగ్ కు సినిమాకు హైలైట్ అవుతుంది. నెక్ట్ ఆర్కే గౌడ్ గారితో చేస్తున్న మహిళా కబడ్డీ లో పూర్తిగా డిఫరెంట్ గా కనిపించబోతున్నా. త్వరలోనే మా ‘దీక్ష’సినిమా మీ ముందుకు రాబోతోంది. మీరంతా తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.


నటుడు జేవీఆర్ మాట్లాడుతూ  - ప్రొడ్యూసర్ గా, దర్శకుడిగా మంచి అనుభవం ఉన్న ఆర్ కె గౌడ్ గారు ఈ సినిమాను అందరికీ నచ్చేలా రూపొందించారు. ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. ‘దీక్ష’ మూవీతో హీరో కిరణ్ కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. అలాగే తులసి, అనూష గుర్తింపు తెచ్చుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను అలరించే అంశాలు ‘దీక్ష’ మూవీలో ఉన్నాయి. అన్నారు.


నటి అనూష మాట్లాడుతూ - ‘దీక్ష’ సినిమాలో హీరో, హీరోయిన్ కాంబినేషన్ లో నా క్యారెక్టర్ ఉంటుంది. ఇలాంటి మంచి క్యారెక్టర్ లో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాతో నాకు నటిగా గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నా. త్వరలో రిలీజ్ అవుతున్న ‘దీక్ష’ సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.


నటి తులసి మాట్లాడుతూ - ఈ సినిమాలో హీరో కిరణ్, హీరోయిన్ అలేఖ్యరెడ్డి తో పాటు మరో లీడ్ రోల్ లో నేను నటించాను. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్ గారికి థ్యాంక్స్. నటిగా నాకు గుర్తింపు తెచ్చే చిత్రమవుతుంది. ‘దీక్ష’సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.


Star Hero Vijay Devarakonda Attends Darshaka Sanjeevani Mahotsavam Event as Chief Guest

 స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా ఘనంగా దర్శక సంజీవని మహోత్సవం కార్యక్రమం




తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ తమ సభ్యులకు హెల్త్ ఇన్సురెన్స్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని దర్శక సంజీవని మహోత్సవం పేరుతో ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, ఉపాధ్యక్షులు సాయి రాజేశ్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో పాటు దర్శకుల సంఘం సభ్యులు, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ హెల్త్ కార్డులను స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు గారి పేరు మీద దాసరి హెల్త్ కార్డుగా సభ్యులకు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో


దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ - మా డైరెక్టర్స్ అసోసియేషన్ కమిటీగా మేము ఎన్నికయ్యాక సంక్షేమ కార్యక్రమాలపై దృష్టిసారించాం. మా సంఘంలో సభ్యుడికి ఏదైనా ఇబ్బంది కలిగితే గతంలో 25 వేల రూపాయలు ఇచ్చేవారు. ఆ తర్వాత అది లక్ష రూపాయలకు పెంచారు. అయితే చాలా మంది సభ్యులు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తే బాగుంటుందని అడిగేవారు. మేము ఈసారి ఎలక్షన్స్ లో అవసరమైన సభ్యులకు ఉచితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాం. అది కూడా అసోసియేషన్ మూలధనం ముట్టుకోకుండా బయట నుంచి ఫండ్స్ సేకరించి అందిస్తామని హామీ ఇచ్చాం. హామీ ఇచ్చినట్లే ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఉచిత హెల్త్ కార్డ్స్ అందిస్తుండటం సంతోషంగా ఉంది. దీనంతటికీ కర్త, కర్మ, క్రియ మా సాయి రాజేశ్. సంఘంలోని 720 మంది అవసరమైన వారు ఈ హెల్త్ కార్డులకు అప్లై చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 1920 మందికి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాం. ఈ రోజు మా ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, ఇతర పెద్దలంతా అతిథులుగా పాల్గొనడం ఆనందంగా ఉంది. అన్నారు.


దర్శకుల సంఘం ఉపాధ్యక్షులు సాయిరాజేశ్ మాట్లాడుతూ - అసోసియేషన్ సభ్యులు హెల్త్ కార్డ్ లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలియగానే మా కమిటీలో మొదటి ప్రాధాన్యత కింద ఆ అంశాన్ని చేర్చాం. హెల్త్ కార్డుల విషయం చెప్పగానే చిత్ర పరిశ్రమలోని ఎంతమంది స్పందించి ఆర్థిక సాయం చేశారు. ప్రభాస్ గారు 35 లక్షలు ఇచ్చారు. నా ఫ్రెండ్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ 10 లక్షలు, బన్నీ వాస్ గారు, యూవీ వంశీ గారు ఇలా చాలా మంది ఆర్థిక సాయం అందించారు. మంచి హెల్త్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేయడం కోసమే కొంత టైమ్ పట్టింది. హీరో విజయ్ దేవరకొండ మా కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. ఆయన తన ఫౌండేషన్ ద్వారా వందలాది మందికి హెల్ప్ చేశారు. మీలో ఎవరికీ ఈ హెల్త్ కార్డ్ అవసరం రావొద్దని కోరుకుంటున్నా. అన్నారు


హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - ఈ రోజు దర్శకుల సంఘం నిర్వహిస్తున్న ఈ మంచి కార్యక్రమంలో భాగమవడం సంతోషంగా ఉంది. మీరంతా డ్రీమర్స్. డ్రీమర్స్ కష్టాలు ఎలా ఉంటాయో నేను హీరోగా ఎదగకముందు చూశాను. స్థిరమైన ఆదాయం ఉండదు, భవిష్యత్ మీద భరోసా ఉండదు. కానీ మీ కలను సాకారం చేసుకోవడంలో ముందుకు సాగుతుంటారు. ఈ అసోసియేషన్ సభ్యులు నా దగ్గరకు వచ్చి కలిసినప్పుడు ఈ కమిటీలో ఒక ఎనర్జీ కనిపించింది. తమ సభ్యులకు ఏదో మంచి చేయాలనే తపన కనిపించింది. మధ్యాహ్నం భోజనం పెట్టడం అలాగే ఉచిత హెల్త్ కార్డ్స్ ఇవ్వడం మంచి ఆలోచన. ఈ ప్రయత్నంలో భాగమైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నా. ఈ అసోసియేషన్ కు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అన్నారు.


Actress Tamannaah-Sampath Nandi Launched Revu Release Date Poster

ఓదెల 2 సెట్స్ లో తమన్నా-సంపత్ నంది లు లాంచ్ చేసిన  రేవు రిలీజ్ డేట్ పోస్టర్



వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రేవు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాతలు డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ పర్యవేక్షకుడిగా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు.. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేవు సినిమా ఆగస్టు 9 న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. 

డైనమిక్ డైరెక్టర్ సంపత్ నంది, మిల్కి బ్యూటీ తమన్నా, హీరో వసిష్ఠ సింహ, మధు క్రియేషన్స్ అధినేత మధు.డి, డైరెక్టర్ అశోక్ తేజ, సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ ల సమక్షంలో ఓదెల 2 సెట్స్ లో ఆగష్టు 9 న విడుదలవుతున్న రేవు రిలీజ్ డేట్ పోస్టర్ ను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. రేవు సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ని లాంచ్ చేసినందుకు సంతోషంగా ఉంది, రేవు రిలీజ్ డేట్ పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది, ఈ సినిమా సక్సెస్ సాధించి నిర్మాతలు డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి లకు మంచి లాభాలు తెచ్చిపెట్టాలని, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, పర్వతనేని రాంబాబు కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. 

డైరెక్టర్ సంపత్ నంది మట్లాడుతూ.. నా మిత్రులైన డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి లకు నా సహకారం ఎప్పుడు ఉంటుంది. రేవు రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ చెయ్యాలని అడిగినప్పుడు ఓదెల 2 కి సంబందించిన పెద్దపల్లి జిల్లా, ఓదెల గ్రామం మల్లిఖార్జున దేవాలయం షూటింగ్ సెట్ కి వారిని ఆహ్వానించి తమన్నా తో ఆగష్టు 9 న రిలీజ్ అవుతున్న రేవు పోస్టర్ లాంచ్ చేయించడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా విజయం సాధించాలని టీమ్ అందరికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.  

ఈ కార్యక్రమంలో రేవు హీరో వంశీ, హేమంత్, ప్రముఖ పారిశ్రామిక వేత్త పారుపల్లి అనీల్, BDL నగేష్ పాల్గొన్నారు. 


రేవు చిత్రం ఆర్టిస్టులు: వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి, గురు తేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి, తదితరులు.

సాంకేతిక నిపుణులు: డి ఓ పి - రేవంత్ సాగర్ నేపథ్య సంగీతం- వైశాఖ్ మురళీధరన్ పాట- జాన్ కె జోసెఫ్ ఎడిటర్ - శివ శర్వాని కళ- బాషా సాహిత్యం - ఇమ్రాన్ శాస్త్రి, నిర్మాణ పర్యవేక్షణ జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత పర్వతనేని రాంబాబు, నిర్మాతలు డా॥ మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి రచయిత దర్శకుడు - హరినాథ్ పులి. 

The Explosive Teaser Of Mass Maharaja Ravi Teja Mr Bachchan Unleashed

 హీరో క్యారెక్టరైజేషన్, టేకింగ్, విజువల్స్, మ్యూజిక్ పరంగా మిరపకాయ్ కంటే మిస్టర్ బచ్చన్ హండ్రెడ్ టైమ్స్ బావుటుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్  



మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'మిస్టర్ బచ్చన్' ఎక్సప్లోజివ్ టీజర్ లాంచ్


మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్' పై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. షోరీల్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది, మొదటి రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. రిలీజ్ డేట్ సమీపిస్తున్న కొద్దీ మేకర్స్ ప్రమోషన్స్ లో దూకుడు పెంచారు. ఈరోజు టీజర్‌ను లాంచ్ చేశారు.


80, 90s లో TDK 120 నిమిషాల క్యాసెట్‌ల నాస్టాల్జిక్ ని గుర్తు చేస్తూ టీజర్ ప్రారంభమవుతుంది. రవితేజ భాగ్యశ్రీ బోర్స్‌ల స్వీట్ అండ్ డిలైట్ ఫుల్ రొమాంటిక్ సీక్వెన్స్‌ మెస్మరైజ్ చేస్తుంది. తర్వాత టీజర్ రవితేజ ఫోకస్ చేస్తూ, అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ తన టీంతో, పవర్ ఫుల్ వ్యక్తిపై రైడ్ కి లీడర్షిప్ వహించే ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా అద్భుతంగా ప్రజెంట్ చేసింది.  


పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ నాస్టాల్జిక్ చార్మ్ గా మలిచారు. క్యారెక్టర్స్, రొమాంటిక్ మూమెంట్స్, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు,  ప్రతి ఎలిమెంట్ కంప్లీట్ ఎంటర్ టైన్మెంట్ ని ప్రామిస్ చేస్తోంది.


రవితేజ యూత్ ఫుల్ ఎనర్జీ, చార్మ్ తో స్క్రీన్ పై అద్భుతమైన మార్క్ వేశారు. భాగ్యశ్రీ బోర్స్ సంప్రదాయ దుస్తుల్లో అలరించింది, లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ టీజర్ ఫస్ట్ హాఫ్ లో కీలకంగా నిలిచింది. తరువాతి పార్ట్ రవితేజ, జగపతి బాబుల మధ్య జరిగిన ఘర్షణను ప్రజెంట్ చేసింది. జగపతి బాబు పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్‌ పాత్రలు హ్యుమర్ కి హింట్ ఇస్తున్నాయి.


అయనంక బోస్ సినిమాటోగ్రఫీ పిరియడ్ సెట్టింగ్ ఎసెన్స్ ని అద్భుతంగా చూపించాయి. మిక్కీ J మేయర్ మెస్మరైజింగ్ స్కోర్ మ్యజికల్ లేయర్ ని యాడ్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉంటూ అద్భుతమైన అనుభూతిని అందించాయి.


రోమాన్స్, యాక్షన్ , ఎంటర్ టైన్మెంట్ బ్లెండ్ తో  మిస్టర్ బచ్చన్ మెమరబుల్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ నిఅందించడానికి సిద్ధంగా ఉన్నారని టీజర్ సూచిస్తుంది. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ సినిమా ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్‌. టిజి విశ్వ ప్రసాద్ గ్రాండ్‌గా నిర్మించిన 'మిస్టర్ బచ్చన్' ఆగస్ట్ 15న విడుదల కానుంది.


టీజర్ లాంచ్ సందర్భంగా జరిగిన Q &A ప్రెస్ మీట్ లో మిస్టర్ బచ్చన్ టీం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.


హరీష్ గారు.. మీరు చేసే రీమేక్స్ లో చాలా మంచి మార్పులు చేస్తారు.. ఇందులో ఎలాంటి యాడ్ ఆన్స్ వుంటాయి ?

- 80, 90s మధ్య జరిగేకథ ఇది. కొంచెం పొయిటిక్ గా చెప్పాలంటే ల్యాండ్ లైన్స్, క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు, చేతక్ స్కూటర్లు, కుమార్ షాను పాటలు ఇవన్నీ కలిపితే మిస్టర్ బచ్చన్. ఫస్ట్ హాఫ్ లో చాలా నోస్టాలజిక్ మూమెంట్స్ వుంటాయి.


హరీష్ గారు.. మీ డైలాగ్స్ మీ యాటిట్యూడ్ కి రిలేట్ అయ్యేలా వుంటాయి కదా .. ఇలా ముందే అనుకుంటారా ?

- ఎవ్వరైనా పొద్దున్న లేచి అద్దం చూసుకొని 'నేను హీరో' అనే బయలుదేరుతారు కదా (నవ్వుతూ)


హరీష్ గారు ఇందులో గెస్ట్ అప్పీరెన్స్ చేశారా ? ఇందులో రవితేజ గారిని అమితాబ్ ఫ్యాన్ గా ఎలా చూపించబోతున్నారు?  


-చేశాను. అది పోస్టర్ వరకే పరిమితం(నవ్వుతూ)    

- ఇందులో బచ్చన్ గారిని భెస్ చేసుకొని చాలా మంచి ఐటమ్స్ వున్నాయి. అవి స్క్రీన్ మీద చూస్తే బావుటుంది.


హరీష్ గారు.. మిరపకాయ్ లో రవితేజ గారిని చాలా అద్భుతంగా చూపించారు. మిస్టర్ బచ్చన్ దానికంటే అద్భుతంగా ఉంటుందా?

-నిన్న చేసిన సినిమా కంటే ఈ రోజు చేసిన సినిమా బెటర్ గా వుండాలని ఎవరైనా కోరుకుంటాం. అప్పటికి ఇప్పటికి నాకు చాలా ఎక్స్ పీరియన్స్ వచ్చింది. ఈ సినిమా టేకింగ్ పరంగా, విజువల్,  మ్యూజిక్, హీరో క్యారెక్టరైజేషన్ పరంగా మిరపకాయ్ కంటే మిస్టర్ బచ్చన్ హండ్రెడ్ టైమ్స్ బెటర్ గా వుంటుంది.


- నా కెరీర్ ఫాస్టెస్ట్ సినిమా ఇది. దీనికి కారణం మా నిర్మాత విశ్వప్రసాద్ గారు. 78 రోజుల షూటింగ్ లో ఏ రోజు ఇబ్బంది పడలేదు. మేము అడిగినదాని కంటే ఎక్కువ ఇచ్చారు.


మిస్టర్ బచ్చన్ టైటిల్ పెట్టడానికి కారణం మీరు, రవితేజ గారు అమితాబ్ ఫ్యాన్ కావడమేనా ?

- చాలా మందికి ఫ్యాన్స్ గా వుంటాం, అన్ని పేర్లుపెట్టలేం కదా. కథపరంగా చిన్న పిట్టకథ వుంటుంది, అందుకు ఈ టైటిల్ పెట్టాం. ఈ టైటిల్ పెట్టింది కూడా రవితేజ గారే.


హరీష్ గారు.. రవితేజ మీ కాంబినేషన్ అంటే అంచనాలు వుంటాయి ? ఆ అంచనాలని మిస్టర్ బచ్చన్ అందుకునేలా ఉంటుందా ?

- ఆ అంచనాలుని అందుకోవడానికి చాలా కష్టపడ్డాం. సినిమా చూసిన తర్వాత ఆ అంచనాలని దాటేసాం అని మీరే అంటారు. ఎంటర్ టైన్మెంట్ చాలా ఎక్కువ వుంటుంది.


విశ్వప్రసాద్ గారు.. ఆగస్ట్ 15కి రావడం ఎలా అనిపిస్తుంది ?

- ఐదు రోజుల హాలీడేస్ కి రెండు పెద్ద సినిమాలు వస్తున్నాయి. మరో తమిళ్ సినిమా, చిన్న సినిమా కూడా వస్తున్నాయి. మన థియేటర్ సిస్టం ఈ అన్నీ సినిమాలని సపోర్ట్ చేయగలదు.


విశ్వప్రసాద్ గారు... కంటిన్యూ గా సినిమాలు చేయాలనే ఇంట్రస్ట్ మీకు ఎలా వస్తుంది ?

-మేము బిజినెస్ స్టార్ట్ చేసిందే ఫ్యాక్టరీ మోడల్ కాన్సెప్ట్ తోనే. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అన్నీ బ్యాలెన్స్ చేస్తున్నాం.


భాగ్యశ్రీ బోర్సే గారు వెల్ కం టు టాలీవుడ్ .. తెలుగు సినిమా పరిశ్రమ ఎలా అనిపించింది ?

-  తెలుగు సినిమా చాలా నచ్చింది. ఇక్కడ ప్రజలు వెల్కమింగ్ గా, గౌరవంగా వుంటారు. ఇది నాకు హోంలానే అనిపిస్తుంది.


హరీష్ శంకర్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?

- నా కెరీర్ లో హరీష్ గారికి స్పెషల్ ప్లేస్ వుంటుంది. ఆయన నా ఫస్ట్ తెలుగు మూవీ డైరెక్టర్. నాపై చాలా నమ్మకం ఉంచారు. ఆయనకి ధన్యవాదాలు.


అయనంక బోస్ గారు.. హరీష్ శంకర్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

-మేము బ్రదర్స్ లా వుంటాం. మా మధ్య అమెజింగ్ రిలేషన్షిప్ వుంది. తనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్.


నటీనటులు: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్, తదితరులు


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: హరీష్ శంకర్

నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్

సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల

బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

సమర్పణ: పనోరమా స్టూడియోస్ & T-సిరీస్

సంగీతం: మిక్కీ జె మేయర్

డీవోపీ: అయనంక బోస్

ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి

ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో

మేకప్ చీఫ్: ఐ శ్రీనివాసరాజు


Kubera Team Unveiled Dhanush’s Birthday Special A New & Striking Poster

 హీరో ధనుష్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసిన శేఖర్ కమ్ముల కుబేర టీం  



నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ముల, సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ కుబేర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ డిఫరెంట్ పోస్టర్లు , గ్లింప్స్ ద్వారా సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు.


ఈరోజు ధనుష్ పుట్టినరోజు. శేఖర్ కమ్ముల కుబేర టీం ధనుష్ పుట్టినరోజునుఅద్భుతమైన పోస్టర్ తో సెలబ్రేట్ చేసుకుంది. పోస్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. ఇదివరకూ ఎన్నడూ చేయని క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు ధనుష్‌. ఇందులో ధనుష్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్ లో వుండబోతోంది.


అద్భుతమైన స్టార్ కాస్ట్, టాప్ నాచ్ టెక్నికల్ టీంతో శేఖర్ కమ్ముల కుబేరు హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. హై బడ్జెట్ సోషల్ డ్రామా రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, జిమ్ సర్భ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.


శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న కుబేర తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మల్టీలాంగ్వేజ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది

SRT Entertainments Mechanic Rocky Glimpse is Unveiled

 మెకానిక్ రాకీ' మంచి రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్. చాలా ఎంటర్ టైన్ చేస్తుంది. దీపావళి క్రాకర్ అవుతుంది: గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్



విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ మెకానిక్ రాకీ ఎంటర్టైనింగ్ యాక్షన్-ప్యాక్డ్ గ్లింప్స్ లాంచ్


టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'గా ఆలరించబోతున్నారు. ఈ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌ను నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్ ఈరోజు లాంచ్ చేశారు.


విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్  ట్రయాంగిల్ లవ్ ట్రయాంగిల్‌ను ప్రజెంట్ చేస్తూ..  సినిమాలోని కీలక పాత్రలను రివిల్ చేసేలా ఫస్ట్ గేర్ డిజైన్ చేశారు. ఈ గ్లింప్స్ ఎట్రాక్టివ్ ఎంటర్ టైన్మెంట్, డైనమిక్ యాక్షన్ సన్నివేశాలతో అదిరిపోయింది.


మెకానిక్ రాకీ గా విశ్వక్ సేన్ మ్యాసీవ్, ఇంటెన్స్ గా కనిపించారు. విశ్వక్ సేన్ చెప్పిన “ఛోటే చోటే బచ్చో కో పూరోన్ కి మై జవాబ్ దేథూ...”హిందీ డైలాగ్ అదిరిపోయింది, బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే “డేంజర్ కే లైసెన్సు వీడు” అనే డైలాగ్ కూడా పవర్ ఫుల్ గా వుంది.


మీనాక్షి చౌదరి ఎత్నిక్ వేర్ లో కూల్ గా కనిపించింది. శ్రద్ధా శ్రీనాథ్ అర్బన్ లేడీ క్యారెక్టర్ లో ఆకట్టుకుంది. L బోర్డ్ సీక్వెన్స్ హిలేరియస్ గా వుంది. సునీల్, నరేష్,  రోడీస్ రఘు రామ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించారు.


రవితేజ ముళ్లపూడి అన్ని ఎలిమెంట్స్ తో కూడిన సబ్జెక్ట్‌ని ఎంచుకుని విశ్వక్ సేన్ పాత్రను అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు. మనోజ్ కటసాని కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది, జేక్స్ బెజోయ్ ఫంకీ BGM ఎంటర్టైమెంట్ ని ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్  వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి ఫస్ట్ గేర్ సినిమాపై  క్యురియాసిటీని పెంచింది. ఈ చిత్రానికి అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్,  విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. మెకానిక్ రాకీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది.


గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. అందరికీ బోనాలు పండగ శుభాకాంక్షలు. ఇది జస్ట్ గ్లింప్స్ మాత్రమే. ఈ ఏడాది చాలా స్పెషల్. మూడో సినిమా కూడా రాబోతోంది. మెకానిక్ రాకీ అవుట్ పుట్ ఇంత గ్రాండ్ గా రావడానికి కారణం నిర్మాత రామ్ తాళ్లూరి గారు. ఆయన లేకపోతే ఇంత పాజిబుల్ అయ్యేది కాదు. రవితేజ చాలా ట్యాలెంటెడ్. సినిమా మీద పాషన్ తో వచ్చారు. సినిమాని చాలా అద్భుతంగా తీశారు. మనోజ్ ఇండియాలో టాప్ డీవోపీ అవుతాడు. శ్రద్దా కెరీర్ లో ఇది బెస్ట్ లుక్ అనిపించింది. మంచి క్యారెక్టర్. ఇది బ్యూటీఫుల్ ట్రైయాంగిల్ లవ్ స్టొరీ. మీనాక్షి వండర్ ఫుల్ కో స్టార్. తనకి గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది. జేక్స్ బిజోయ్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ప్రతి సాంగ్ బ్లాక్ బస్టర్ అయ్యే ఆల్బం ఇచ్చాడు. చాలా న్యూ ఏజ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇది గ్లింప్స్ మాత్రమే. ముందుముందు చాలా రాబోతున్నాయి. మలక్ పేట్ బ్యాక్ డ్రాప్ వుండే కథ ఇది. నా క్యారెక్టర్ చాలా కనెక్టింగ్ వుంటుంది. చాలా మంచి కామెడీ టైమింగ్ వుంటుంది. మెకానిక్ రాకీ రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్. మెట్రో మాస్ అనుకోవచ్చు. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా ఎంటర్ టైన్ చేస్తుంది. ఇది దీవాళి క్రాకర్ అవుతుంది. అందరూ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. అందరికీ థాంక్ యూ' అన్నారు.


నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. మెకానిక్ రాకీ మంచి మాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అక్టోబర్ 31న మీ ముందుకు వస్తున్నాం. మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. రవితేజ కొత్త  దర్శకుడైన చాలా గొప్పగా తీశాడు. విశ్వక్ గారి ఎనర్జీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంచి రోల్ చేస్తున్నారు. మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు  


హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. మీ అందరికీ ప్రేమకి థాంక్ యూ. మీ అందరికీ గ్లింప్స్ నచ్చడం చాలా ఆనందంగా వుంది. ఇది జస్ట్ గ్లింప్స్ మాత్రమే. ఇంకా అద్భుతమైన కంటెంట్ రాబోతోంది. ఇందులో సాంగ్స్ సూపర్బ్ గా వుంటాయి. ఈ సినిమా తప్పకుండా మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. ఇందులో నేను చేస్తున్న క్యారెక్టర్ చాలా రిలేటబుల్ గా వుంది. మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు' అన్నారు.


డైరెక్టర్ రవితేజ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీ అందరికీ గ్లింప్స్ నచ్చిదని భావిస్తున్నాను. జేక్స్ బిజోయ్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రామ్ తాళ్లూరి , హీరో విశ్వక్ గారికి థాంక్ యూ.  మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్,  నరేష్, సునీల్ గారు చాలా అద్భుతమైన యాక్టర్స్ వున్నారు. అందరికీ థాంక్ యూ' అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.


తారాగణం: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి

నిర్మాత: రామ్ తాళ్లూరి

ప్రొడక్షన్ బ్యానర్: SRT ఎంటర్‌టైన్‌మెంట్స్

సంగీతం: జేక్స్ బిజోయ్

డీవోపీ: మనోజ్ కటసాని

ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం

ఎడిటర్: అన్వర్ అలీ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సత్యం రాజేష్, విద్యాసాగర్ జె