Latest Post

#LifeStories is Grand Releasing on September 14th

సామాన్య జీవితాలకు దగ్గరగా ఉండే సినిమా#లైఫ్ స్టోరీస్ సెప్టెంబర్ 14న బ్రహ్మాండమైన విడుదల



అక్జన్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో వస్తున్న సినిమా #లైఫ్ స్టోరీస్. జీవితంలోని చిన్న, రోజువారీ క్షణాల్ని మనసుకు హత్తుకునే విధంగా చిత్రీకరణతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీసిన ఒక సంకలన చిత్రం. సెప్టెంబరు 14న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేమ, స్థితిస్థాపకత మరియు అనుబంధం యొక్క చిన్న చిన్న విషయాలను ప్రతిబింబించే వివిధ వయసుల వ్యక్తుల నుండి విభిన్న కథలను  తీసుకుని తీసిన సినిమా. సాంప్రదాయక కథనాలలా కాకుండా, #లైఫ్ స్టోరీస్ సింప్లిసిటీగా ఉండే సాధారణ విషయాలలో అందాన్ని కనుగొంటుంది, సాధారణ సంఘటనలు మన జీవితాలపై ఎలా తీవ్ర ప్రభావం చూపగలవో చూపిస్తుంది. యానిమేటర్ నుంచి లైవ్-యాక్షన్ ఫిల్మ్ మేకింగ్‌లో తన నైపుణ్యాన్ని చూపిస్తూ ఉజ్వల్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దృశ్యమాన కథనాన్ని భావోద్వేగ లోతుతో మిళితం చేసింది. జీవితంలోని నిశ్శబ్దమైన ఇంకా ముఖ్యమైన అంశాలపై దాని ప్రత్యేక దృష్టితో, #లైఫ్ స్టోరీస్ అన్ని వయసుల ప్రేక్షకుల జీవితాలకు దగ్గరగా తీసిన చిత్రం. ప్రతి ప్రేక్షకుడి సినిమాతో కనెక్ట్ అవుతారు.


నటీనటులు : సత్య కేతినీడి, షాలిని కొండేపూడి, దేవియాని శర్మ, ఎం. వివాన్ జైన్, లక్ష్మీ సుంకర, రాజు గొల్లపల్లి,

హ్యారీ - గోల్డెన్ రిట్రీవర్, ప్రదీప్ రాపర్తి, గజల్ శర్మ, శరత్ సుసర్ల, స్వర్ణ డెబోరా, రాహుల్  


రచన, దర్శకత్వం & నిర్మాత : ఉజ్వల్ కశ్యప్

బ్యానర్ : అక్జన్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్

నిర్మాత : MM విజయ జ్యోతి

సంగీత దర్శకుడు : విన్ను

పాటలు : రామ్ ప్రసాద్, సుపర్ణ వొంటైర్, బెంట్ ఆఫ్ మైండ్, సింజిత్ యర్రమిల్లి

బి జి ఎం : విన్నూ

డి ఓ పి : ప్రణవ్ ఆనంద

ఎడిటర్ : వినయ్

డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం

పి ఆర్ ఓ : మధు VR  

Committee Kurrollu Pre Streaming Celebrations

సెప్టెంబర్ 12న ఈటీవి విన్ లో మా 'కమిటీ కుర్రోళ్ళు’ రీరిలీజ్ అవుతోంది. థియేటర్స్ లో ఎలా అయితే జాతరలా ఎంజాయ్ చేశారో ఇక్కడ కూడా అలా ఆదరిస్తారని కోరుకుంటున్నాను: ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ లో నిహారిక కొణిదెల



నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శకత్వం వహించారు. ఆగస్ట్ 9న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 12నుంచి ఈటీవి విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా 'కమిటీ కుర్రోళ్ళు’ టీం ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించింది.

 

ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ లో ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కి మరోసారి థాంక్ యూ సో మచ్. నా ఇండస్ట్రీ జర్నీ ఈటీవీ డీ జూనియర్స్ షో తో స్టార్ట్ చేశాను. నన్ను ఆడియన్స్ కి పరిచయం చేసిన ఈటీవీకి థాంక్ యూ సో మచ్. ఈటీవిలో వచ్చే కంటెంట్ మీ మా మన అనుకునేలా వుంటుంది.'కమిటీ కుర్రోళ్ళు’ అలాంటి సినిమానే. మీ సినిమాలా అనుకొని తీశాం. ఈ సినిమా ఈటీవీలో రావడం మేము తీసుకున్న బెస్ట్ డెసిషన్. సెప్టెంబర్ 12న ఈటీవి విన్ లో మా 'కమిటీ కుర్రోళ్ళు’ రీరిలీజ్ అవుతుంది. థియేటర్ లో ఎలా అయితే పండగ, జాతరలా ఎంజాయ్ చేశారో, ఈటీవీ విన్ లో కూడా  చూసి అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను' అన్నారు.  


డైరెక్టర్ యదు వంశీ మాట్లాడుతూ..‘కమిటీ కుర్రోళ్ళు’ని ప్రేక్షకులు వోన్ చేసుకున్నందుకు థాంక్ యూ సో మచ్. మీ అందరికీ రుణపడి వుంటాను. ఈ సినిమాలో నటించిన అందరూ గొప్ప నటులుగా కెరీర్ లో ముందుకు వెళ్తారు. ఈ అవకాశం ఇచ్చిన నిహారిక గారికి, రమేష్ గారికి ధన్యవాదాలు. ఒక మెమరనీ బంధించి , అందరి బయోపిక్ గా సినిమాని మీ ముందుపెట్టాం. ఈ సినిమా ఈటీవి విన్ లో రావడం చాలా ఆనందంగా వుంది. ఇది పక్కా తెలుగు సినిమా. ఇలాంటి సినిమా ఈటీవీ విన్ లో వుండాలి. ఈ సినిమాని ప్రోత్సహించి నిహారిక గారికి, ఈటీవి విన్ కి ధన్యవాదాలు. 12న ఈ సినిమా ఈటీవీ విన్ లో వస్తుంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలి' అని కోరారు.


‘కమిటీ కుర్రోళ్ళు' గా నటించిన యాక్టర్స్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమా విడుదలై నెల రోజులౌతుంది. కానీ ఈ రోజే రిలీజైన ఫీలింగ్ వుంది. చూసిన ప్రతి ఒక్కరి నుంచి ప్రసంశలు అందుతూనే వున్నాయి. మంచి కంటెంట్ ఇస్తే కొత్త పాత చూడకుండా థియేటర్స్ కి వచ్చి హిట్ చేస్తారని మా తెలుగు ఆడియన్స్ మరోసారి ప్రూవ్ చేశారు. మాకు ఒక గుర్తింపు ఇచ్చారు. ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మంచి కంటెంట్ వున్న సినిమాలు చేస్తాం. మా సినిమా ఈటీవీ విన్ లో రావడం చాలా ఆనందంగా వుంది. సెప్టెంబర్ 12న ఈ సినిమా ఈటీవీ విన్ లో వస్తుంది. అందరూ చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలి' అని కోరారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ మాట్లాడుతూ.. ఈటీవిన్ లో మా సినిమా రావడం చాలా ఆనందంగా వుంది. మయూరీ, మౌనరాగం లాంటి కంటెంట్ వుండే సినిమాలు తీసే సంస్థలో మా సినిమా రావడం గౌరవంగా వుంది. ఈటీవి విన్ ద్వారా ఈ సినిమా మ్యాగ్జిమమ్ ఆడియన్స్ కి చేరుతౌతుందని కోరుకుంటున్నాం' అన్నారు.


ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ మాట్లాడుతూ.. కమిటీ కుర్రోళ్ళు టీం కి థాంక్ యూ. చాలా బ్యూటీఫుల్ గా తీశారు. వంశీ చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. ఈ సినిమాని ఈటీవీ విన్ కి ఇచ్చిన నిహారిక గారికి ధన్యవాదాలు. ఈ రోజుల్లో సినిమాలకి థియేటర్, ఓటీటీ రిలీజుకు ఉంటున్నాయి. థియేటర్ రిలీజ్ కంటే ఎక్కువ రెస్పాన్స్ ఓటీటీ రిలీజ్ తర్వాత వుంటుంది నమ్ముతున్నాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ బ్రైట్ ఫ్యూచర్ వుండాలని కోరుకుంటున్నాను' అన్నారు. సినిమా యూనిట్ సభ్యులంతా ఈ వేడుకలో పాల్గొన్నారు.

 

Devara Epic Theatrical Trailer Unveiled in a grand launch event at Mumbai

 ముంబైలో గ్రాండ్‌గా రిలీజైన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’ థియేట్రికల్ ట్రైలర్



మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అభిమానులు స‌హా అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై  మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ ఆర్‌.ర‌త్న‌వేలు, ఎడిట‌ర్ శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబు శిరిల్ వంటి స్టార్ టెక్నీషియ‌న్స్ ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తున్నారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు.


ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా నుంచి విడుద‌లైన మూడు సాంగ్స్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం మేక‌ర్స్ ‘దేవర’ మూవీని థియేట్రికల్ ట్రైలర్‌ను ముంబైలో ఘ‌నంగా నిర్వ‌హించారు. నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌, అనిల్ త‌డాని స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు వేడుక‌కు హాజ‌ర‌య్యారు. 2 నిమిషాల 35 సెక‌న్లున్న ఈ ట్రైల‌ర్  మాస్ ఎలిమెంట్స్ ప్యాక్డ్‌గా ఉంది. ఎన్టీఆర్ అభిమానుల‌కు, యాక్ష‌న్ మూవీ ల‌వ‌ర్స్ కోరుకునే అంశాల‌తో నిండి ఉంది. ఈ మూవీ కోసం ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ క్రియేట్ చేసిన ప్ర‌త్యేక‌మైన ప్ర‌పంచం, ఆయ‌న విజ‌న్ అద్భుతంగా ఉన్నాయి. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే ప్ర‌కాష్ రాజ్ గంభీర‌మైన వాయిస్ ఓవ‌ర్‌తో ప్రారంభ‌మైంది. తీర‌ప్రాంతంలో ఎలాంటి భ‌యాలు లేని ప్ర‌జ‌లు నివ‌సిస్తుంటారు. అక్క‌డ ఉండే భైరా (సైఫ్ అలీఖాన్‌) ఓ క్రూర‌మైన గ్యాంగ్‌తో ఆకృత్యాల‌కు పాల్ప‌డుతుంటాడు. ఆ ముఠా అక్క‌డ‌కొచ్చే ఓడ‌ల‌ను దోచుకోవ‌ట‌మే కాకుండా, కోస్ట్ గార్డుల‌ను కూడా చంపేస్తూ ర‌క్త‌పాతాన్ని సృష్టిస్తుంటారు. ఇలాంటి కొంత మంది కరుడుగట్టిన గ్రామ‌స్థుల‌కు భ‌యాన్ని ప‌రిచయం చేస్తాడు ‘దేవర’ (ఎన్టీఆర్‌) . ఆ గ్రామాన్ని పెను ప్ర‌మాదం నుంచి ర‌క్షించే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో ఎన్టీఆర్ పాత్ర మ‌న‌కు ప‌రిచ‌యం అవుతుంది.



ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజ‌న్స్‌, అద్భుత‌మైన డైలాగ్ డెలివ‌రీ, ఆశ్చ‌ర్య‌ప‌రిచే ఎలివేష‌న్ స‌న్నివేశాల‌ల‌తో ఉన్న ఈ ట్రైల‌ర్ అంద‌రిలో సినిమాపై ఉన్న అంచనాల‌ను మ‌రింత‌గా పెంచుతోంది. ఎన్టీఆర్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. భ‌యానికి అర్థం చెప్పే ప్ర‌తిరూప‌మైన పాత్ర ఒక‌టైతే.. భ‌య‌ప‌డుతూ ఉండే మ‌రో పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు. భైరా అనే అనే భ‌యంక‌ర‌మైన పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ క‌నిపించారు. ఎన్టీఆర్‌, సైఫ్ మ‌ధ్య ఉన్న స‌న్నివేశాల‌ను చూస్తుంటే సినిమా నెక్ట్స్ లెవ‌ల్ అనేంత‌గా అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, అజ‌య్, గెట‌ప్ శీను త‌దిత‌రులను మ‌నం ట్రైల‌ర్‌లో చూడొచ్చు.


జాన్వీక‌పూర్ ఇందులో తంగం అనే ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో క‌నిపించింది. ఆమె లుక్స్ చూప‌రుల‌ను ఇట్టే ఆక‌ట్టుకుంటున్నాయి. ఎన్టీఆర్‌, జాన్వీ మ‌ధ్య ఉన్నచ‌క్క‌టి కెమిస్ట్రీతో స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయ‌నిపిస్తుంది. అనిరుద్ ర‌విచంద‌ర్ అద్భుత‌మైన సంగీతంతో పాటు యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు ఆయ‌న అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ వింటుంటే అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. గూజ్‌బ‌మ్స్ వ‌స్తున్నాయి. ట్రైల‌ర్‌లో కొన్ని సీన్స్ అయితే క‌ళ్ల‌కువిందుగా ఉన్నాయి. ట్రైల‌ర్ చివ‌ర‌లో ఎన్టీఆర్ షార్క్‌పై ఉండి రైడ్ చేసే సీన్ నెక్ట్స్ రేంజ్‌లో ఉంది.  


గ్రాండ్ లెవ‌ల్లో దేవ‌ర చిత్రాన్ని అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. ప్ర‌తి సీన్ వావ్ అనిపిస్తుంది. ట్రైల‌ర్‌లో ఆక‌ర్ష‌ణీయంగా అనిపిస్తోన్న ఈ స‌న్నివేశాలు సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆస‌క్తిని అంద‌రిలోనూ క్రియేట్ చేస్తోంది. దేవ‌ర ప్ర‌పంచాన్ని ఈ ట్రైల‌ర్ ప‌రిచ‌యం చేసిన తీరు ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 27న  దేవ‌ర చిత్రం తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

Pratani Ramakrishna Goud Elected as TFCC President

 తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడిగా  6వ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రతాని రామకృష్ణ గౌడ్



తెలంగాణ ఫిలింఛాంబర్ ఎన్నికలు తాజాగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ప్రతాని రామకృష్ణ గౌడ్. ఆయన తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడిగా వరుసగా ఆరోసారి బాధ్యతలు చేపడుతున్నారు. 16 వేల మంది ఈ అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ ఫిలింఛాంబర్ ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా


తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ - తెలంగాణ ఫిలింఛాంబర్ ఏర్పాటు చేసి 12 ఏళ్లవుతోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను ఆరోసారి వరుసగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. నాపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు. రెండేళ్లు ఈ పదవీ కాలం. ఈ రెండేళ్లలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మొత్తం 24 క్రాప్టుల్లో కలిపి తెలంగాణ ఫిలింఛాంబర్ లో 16వేల మంది ఉన్నారు. నిర్మాతలే వెయ్యి మంది ఉన్నారు. ఇప్పటిదాకా మా అసోసియేషన్ నుంచి 200కు పైచిలుకు సినిమాలు సెన్సార్ అయ్యాయి. ఈ ఏడాది 70 సినిమాలు సెన్సార్ చేశాం. సినిమా ఔట్ డోర్ షూటింగ్ ల సమయంలో యూనిట్ సభ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు, చిన్న చిత్రాలకు రాయితీలు వంటివి ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. నాతో పాటు వివిధ పోస్టులకు ఎన్నికైన నా మిత్రులకు శుభాకాంక్షలు చెబుతున్నా. అన్నారు.


ఉపాధ్యక్షుడు డి. కోటేశ్వరరావు మాట్లాడుతూ - తెలంగాణ ఫిలింఛాంబర్ కు ఉపాధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కల్పించిన సభ్యులకు, తన పూర్తి సహకారం మాకు అందిస్తున్న ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. వచ్చే రెండేళ్లలో మంచి కార్యక్రమాలు మా సభ్యుల కోసం చేపట్టబోతున్నాం. మాకు పర్మినెంట్ ఆఫీస్, విద్యార్థులకు స్కాలర్ షిప్ లు వంటి వాటి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవనున్నాం. అలాగే సీరియల్స్, సినిమాల్లో తెలంగాణ నటీనటులకు, టెక్నిషియన్స్ కు అ‌కాశాలు వచ్చేలా మా వంతు ప్రయత్నం చేస్తాం. అన్నారు.


సెక్రటరీస్ విద్యాసాగర్, కాచం సత్యనారాయణ మాట్లాడుతూ - తెలంగాణ ఫిలింఛాంబర్ కు సెక్రటరీగా ఎన్నికవడం సంతోషంగా ఉంది. మాకు సపోర్ట్ గా నిలబడిన ప్రతి ఒక్క సభ్యుడికి థ్యాంక్స్ చెబుతున్నాం. మా అసోసియేషన్ మెంబర్స్ సినిమాలకు సెన్సార్ సమస్యలు వచ్చినప్పుడు వాళ్లతో పాటు వెళ్లి సమస్యలు పరిష్కరించాం. అలాగే నెంబర్ వన్ అసోసియేషన్ గా తెలంగాణ ఫిలింఛాంబర్ ను భవిష్యత్ లో తీర్చిదిద్దుతాం అన్నారు.


టీ మా ప్రెసిడెంట్ రశ్మి ఠాకూర్ మాట్లాడుతూ - తెలంగాణ ఫిలింఛాంబర్ లో ఏకగ్రీవంగా ఇదే కమిటీని ఎన్నుకోవడం ఇది వరుసగా మూడోసారి. దీంతోనే మా అసోసియేషన్ లో ఎంత ఐక్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. కోవిడ్ టైమ్ లో రామకృష్ణ గౌడ్ గారు ఎంతోమందికి హెల్ప్ చేశారు. ఇకపైనా మా సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా హెల్ప్ చేసేందుకు ఈ కమిటీ సిద్ధంగా ఉంటుంది. అన్నారు.


 టి. మా సెక్రటరీ స్నిగ్ధ మాట్లాడుతూ సెక్రెటరీ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యలందరికి కృతజ్ఞతలు. అవకాశం కల్పించిన మా తెలంగాణ ఛాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ గారికి థాంక్స్ అన్నారు.


కె.ఎల్.ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ నేను టీ మా వైస్ చైర్మన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది కారకులైన డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి అలాగే  మెంబర్స్ అందరికీ చాలా చాలా థాంక్స్. తప్పకుండా ఆర్టిస్ట్ అసోసియేషన్ అలాగే ఛాంబర్ డెవలప్మెంట్ కోసం మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అలాగే మినిస్టర్  ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మినిస్టర్ పొన్నం ప్రభాకర్  గారిని కలిసి తప్పకుండా ప్రభుత్వ సహకారం తీసుకోవడానికి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారితో వెళ్లి ప్రభుత్వ సహకారం తీసుకొని చాంబర్ డెవలప్మెంట్ కు తప్పకుండా కృషి చేస్తాను అన్నారు.


ఫైట్ మాస్టర్ రవి  మాట్లాడుతూ కొత్తగా ఫైట్ మాస్టర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి ధన్యవాదాలు. నన్ను చైర్మన్ గా, కన్నా గౌడ్  గారిని సెక్రెటరీగా, కృష్ణ గారిని ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేశారు. నూట ఎనిమిది దేశాలలో నాంచాక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన రవి  ఫైట్ మాస్టర్. కరాటేకు సంబంధించి హీరో సుమన్ గారు కూడా మాకు పూర్తి సహకారం అందిస్తారు. వారికి కూడా ఈ సందర్భంగా థాంక్స్ చెప్తున్నాను. అలాగే డాక్టర్ ప్రతాని  రామకృష్ణ గౌడ్ గారికి కూడా చాలా చాలా థాంక్స్ అన్నారు.


తెలంగాణ ఫిలింఛాంబర్ ఉపాధ్యక్షులుగా ఏ గురురాజ్, డి.కోటేశ్వరరావు, జి. వరప్రసాద్ ఎన్నికయ్యారు.జనరల్ సెక్రెటరీస్ గా జె.వి.ఆర్, విద్యాసాగర్, కాచం సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రెటరీస్ గా పినిశెట్టి అశోక్ కుమార్, పి. వరప్రసాద్ రావ్, వై.శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీస్ గా సోమిరెడ్డి, ఎం. బిందు, ట్రెజరర్ గా డా.పి ప్రకాష్ ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా  12 మంది ఎన్నికయ్యారు. అలాగే టి. మా ప్రెసిడెంట్ గా రేష్మి ఠాగూర్, వైస్ ప్రెసిడెంట్స్ గా కె.ఎల్.ఎన్. ప్రసాద్, బి. కిషోర్ తేజ, ఎన్. లక్మి సామ్రాజ్యం, జనరల్ సెక్రటరీస్ గా ఎస్. స్నిగ్ధ మద్వాని, బి. రమేష్ యాదవ్, జాయింట్ సెక్రటరీస్ గా ఎల్. వెంకన్న, బి. ప్రేమ సాగర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీస్ గా డా.ఆకుల రమేష్, చింతల శ్రీ శ్రీనివాస్, ఈసి మెంబర్ గా జి. సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఇంకా తెలంగాణ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గా డా. టి రమేష్ నాయుడు, డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గా ఎస్. వంశీ ప్రతాప్ గౌడ్,  ఫైట్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గా వి. రవి, తెలంగాణ ఫిల్మ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గా జి. రాజ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఈసీ మెంబెర్స్, మరియు ఛాంబర్ సభ్యులు పాల్గొన్నారు. త్వరలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు.

Rajath Rajanikanth won many awards with the movie The Survivor

 సర్వైవర్ సినిమాతో ఎన్నో అవార్డులను గెలుచుకున్న రజత్ రజనీకాంత్



రజత్ రజనీకాంత్ లీడ్ యాక్టర్, రైటర్, డైరెక్టర్, మరియు ఎడిటర్ గా చేస్తూ ఎన్నో ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డులు అందుకుని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అందులో తనకు గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా సర్వైవర్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు జియో సినిమాలో అందుబాటులో ఉన్న ఈ సినిమాకి మంచి స్పందన లభించింది. కేన్స్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ లో బెస్ట్ ట్రైలర్ మరియు బెస్ట్ యాక్షన్ ఫిలిం కి యవార్థ అందుకున్న సినిమా సర్వైవర్. రజత్ రజనీకాంత్ ఎంచుకున్న కథ, యాక్షన్ ఎపిసోడ్స్, ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ అన్ని బాగున్నాయి. అదేవిధంగా రజత్ పర్ఫామెన్స్ కి మూడు ఇంటర్నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ అందుకున్నారు. సినిమా మీద  పాషన్ తో 2018 నుంచి మూడు సినిమాలు చేశారు. చేసిన ప్రతి సినిమాకి అవార్డు అందుకుంటున్నారు. కానీ సర్వైవర్ సినిమా ద్వారా ఎక్కువ గుర్తింపు పొందారు. ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు రజత్ పర్ఫామెన్స్ గురించి మాట్లాడుతున్నారు. కచ్చితంగా ముందు ముందు ఇంకా మంచి సినిమాలు చేస్తారని ఆశిస్తున్నారు. 

Director VN Aditya and Producer Dr. Meenakshi Anipindi Unveil Birthday Special Poster for Catherine Tresa

 డైరెక్టర్ వీఎన్ ఆదిత్య, ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్ మూవీ నుంచి బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరీన్ ట్రెసా బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్



టాలీవుడ్ కు పలు సూపర్ హిట్ చిత్రాలను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై, ఏయు & ఐ సమర్పణ  లో డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరీన్ ట్రెసా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు కేథరీన్ ట్రెసా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కేథరీన్ ట్రెసా అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.


ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలతో స్ట్రాంగ్ కంటెంట్ తో ఈ సినిమాను దర్శకుడు వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఎంతోమంది దేశ, విదేశాల కొత్త నటీనటులకు అవకాశం కల్పిస్తున్నారు. అమెరికన్స్‌, స్పానిష్‌ పీపుల్‌, ఆఫ్రికన్స్‌, యూరోపియన్స్‌, ఏషియన్స్‌, తమిళ్‌, కన్నడ, తెలుగు ఆర్టిస్టులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాను యూఎస్ లోని డల్లాస్‌లో చిత్రీకరిస్తారు. త్వరలో ఈ థ్రిల్లర్ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.



నటీనటులు - కేథరీన్ ట్రెసా, తదితరులు

టెక్నికల్ టీమ్

బ్యానర్ - ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్

సమర్పణ - ఏయు & ఐ

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

నిర్మాత - డాక్టర్ మీనాక్షి అనిపిండి

రచన - పద్మావతి మల్లాది

స్క్రీన్ ప్లే, దర్శకత్వం - డాక్టర్ వీఎన్ ఆదిత్య

Simbu becomes first Tamil star to donate for flood relief in Telugu States

వరద బాధితులకు అండగా నిలిచిన తొలి తమిళ హీరో శింబు, తన వంతుగా 6 లక్షల విరాళం ప్రకటించిన శింబు



ఆపదలో వున్న వారికి ఆపన్నహస్తం అందించడానికి బాషా పరిమితులు, ప్రాంతీయ భేదాలు వుండవు. కష్టాల్లో వున్న వారిని ఆదుకోవాలనే మంచి హృదయం వుంటే చాలు. ఇప్పుడు అలాంటి కోవలోకి వస్తాడు తమిళ కథానాయకుడు శింబు. గతంలో కూడా పలుసార్లు తన మంచితనాన్ని సహృదయతను చాటుకున్న ఈ తమిళ కథానాయకుడు మరోసారి తన ఉదారతను చాటాడు.  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరద ముంపులో చిక్కుక్కుని సహాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితులకు కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అహార్నిశాలు శ్రమిస్తూ వారిని ఆదుకుంటున్నారు. ఇక వారి వరద వల్ల సర్వం కోల్పోయిన బాధితుల కోసం హీరో శింబు  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి తన వంతు సహాయంగా ఆరు లక్షల  విరాళం ప్రకటించారు. వరదల వల్ల త్రీవంగా నష్టం పోవడం తనకు ఎంతో భాదను కలిగిస్తుందని, అందరూ త్వరితగతిన ఈ విపత్తను నుండి బయటపడాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నానని తెలిపారు శింబు. 

Heroine Regina Cassandra Interview About Uthsavam

'ఉత్సవం' అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న రూటెడ్ స్టొరీ. డెఫినెట్ గా అందరికీ నచ్చుతుంది: హీరోయిన్ రెజీనా కసాండ్రా



దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా 'ఉత్సవం'. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్ , నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోహిస్తున్నారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ తో ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ 13న సినిమా ప్రేక్షుకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ రెజీనా కసాండ్రా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.


'ఉత్సవం'లో మిమ్మల్ని ఆకట్టుకున్న ఎలిమెంట్స్ ఏమిటి ?,

-డైరెక్టర్ అర్జున్ సాయి గారు ఈ కథ నెరేటివ్ చేసినప్పుడు వెరీ బ్యూటీఫుల్ గా అనిపించింది. ఈ కథలో సోల్ వుంది. నాటక రంగం గురించి ఆయన చాలా రిసెర్చ్ ఈ కథని రాసుకున్నారు. అలాగని ఇది సందేశాత్మక చిత్రం కాదు. అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న రూటెడ్ స్టొరీ ఇది. అది నాకు చాలా నచ్చింది.


-అర్జున్ సాయి సెన్సిబుల్ డైరెక్టర్. ఆడియన్స్ కి థియేటర్స్ కి తీసుకురావడానికి ఎలిమెంట్స్ కావాలో తెలిసిన డైరెక్టర్. చాలా అద్భుతమైన నటులు ఇందులో వున్నారు. అలాగే డీవోపీగా రసూల్ గారు, మ్యూజిక్ అనూప్ రూబెన్స్.. ఇలా అన్నీ చక్కగా కుదిరాయి.


ఇందులో మీ క్యారెక్టర్ ఎలా వుండబోతోంది?

-ఇందులో నేను కార్పోరేట్ ఎంప్లాయ్ గా కనిపిస్తాను. తనకి లవ్ మీద పెద్ద ఇంప్రెషన్ వుండదు. చాలా ఇండిపెండెంట్. నా క్యారెక్టర్ ఇండిపెండెంట్ విమెన్ రిలేట్ చేసుకునేలా వుంటుంది. కథలో చాలా కీలకంగా వుంటుంది. ఈ క్యారెక్టర్ చేయడం చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది.  


మీరు చిన్నప్పడు స్టేజ్ ప్లేస్ చేసేవారా?

-నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ ప్లేస్ ఇష్టం. స్కూల్, కాలేజ్ డేస్ లో ప్లేస్ చేశాను.


-ఈ సినిమాలో రంగస్థలం నటులు గురించి చాలా అద్భుతమైన సన్నివేశాలు వున్నాయి. అవన్నీ ఆడియన్స్ ని హత్తుకునేలా వుంటాయి.


దిలీప్ ప్రకాష్ గురించి ?

-దిలీప్ హార్డ్ వర్కింగ్ యాక్టర్. చాలా పాజిటివ్ సోల్. ఎప్పుడూ పాజిటివ్ మైండ్ సెట్ తో వుంటారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తనతో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. తనకి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను.


-ఈ సినిమాలో పని చేసిన అందరూ చాలా సిన్సియర్ గా పని చేశారు. ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు థియేటర్స్ నుంచే వచ్చారు. వారితో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. చాలా నేర్చుకున్నాను.


మైత్రీ మూవీ మేకర్స్ సినిమాని రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తుంది ?

-ఇది చాలా మంచి సినిమా. డైరెక్టర్ అర్జున్ సాయి తన తొలి సినిమాగా ఇలాంటి గొప్ప కథని చెప్పాలని అనుకున్నారు. దీనికి మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ సపోర్ట్ చేయడం, వారు తెలుగులో గ్రాండ్ గా విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది.


షార్ట్ టైం గోల్స్ ఉన్నాయా?

-నా ఫస్ట్ సినిమా ఎస్ఎంఎస్ చేసినప్పుడే  వెర్సటైల్ యాక్టర్ గా వుండాలని భావించాను. అది నా నుంచి ఎప్పుడూ దూరం కాకుండా ఇన్నాళ్ళు పాత్రలు చేసుకుంటూ వచ్చాను. నేను చేయగల అన్ని రకాల పాత్రలు చేయడమే నా గోల్.


నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ?

గోపిచంద్ మలినేని, సన్నీ డియోల్ గారి సినిమా చేస్తున్నాను. హిందీలో ఇంకో రెండు ప్రాజెక్ట్స్ వున్నాయి. అవి మేకర్స్ అనౌన్స్ చేశారు.


ఆల్ ది బెస్ట్

-థాంక్ యూ

Hide N Seek Releasing on September 20th

తిరుపతి ఎస్ఐటీ కాలేజీలో ఘనంగా హైడ్ న్ సిక్ ట్రయిలర్ లాంచ్



సహస్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిశాంత్, ఎంఎన్ఓపీ సమర్పణలో.. నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి, దర్శకుడు బసిరెడ్డి రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం హైడ్ న్ సిక్ ట్రయిలర్ విడుదల అయింది. తిరుపతి ఎస్ఐటీ కాలేజీలో ఘనంగా హైడ్ న్ సిక్ ట్రయిలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. కాలేజీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చిత్రం కాస్ట్ అండ్ క్రూ, కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి మాట్లాడుతూ.. ఇంత మంచి అవకాశం ఇచ్చిన కాలేజీ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలిపారు. చిత్రం అందరిని అలరించే ఓ సస్పెన్స్ అవుతుందని.. అందరూ కచ్చితంగా సెప్టెంబర్ 20 న థియేటర్లో ఆదరించాలని పేర్కొన్నారు.




హీరోయిన్ శిల్పా మంజునాథ్ మాట్లాడుతూ.. హైడ్ న్ సిక్ చిత్రం విద్యార్థుల నుంచి పెద్దవారి వరకు అందరిని థ్రిల్ కు గురిచేస్తుందని, ఖచ్చితంగా థియేటర్లో ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా ట్రయిలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.




హీరోయిన్ రియా సచ్దేవ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 20th ఈ చిత్రం థియేటర్లోకి రాబోతుందని, అందరూ కచ్చితంగా చూసి ఆదరించాలని కోరారు. ఈ చిత్రం మీ అందరిని కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక కాలేజ్ స్టూడెంట్స్, టీచర్స్, హైడ్ న్ సిక్ మూవీ కాస్ట్ అండ్ క్రూ కి స్పెషల్ థాంక్స్ చెప్పారు.




థియేటర్ లో చూసే ప్రేక్షకులను ఆధ్యాంతం కట్టి పడేసే అద్భుతమైన కథతో హైడ్ న్ సిక్ చిత్రం రూపొందిందని.. ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా అలరిస్తుందని, సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే ఎన్నో సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయని డైరెక్టర్ బస్సు రెడ్డి రానా తెలిపారు. ఈ సందర్భంగా ఇంత మంచి అవకాశం ఇచ్చిన కాలేజీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే చిత్ర నటీనటులకు, టెక్నీషియన్స్ కు, నిర్మాతకు శుభాకాంక్షలు చెప్పారు.


 


హీరో విశ్వంత్ మాట్లాడుతూ.. హైడ్ న్ సిక్ చిత్రంతో మీ ముందుకు వస్తున్నాము అని, ఇలాంటి ఎనర్జీనే ఈ చిత్రానికి అవసరం అని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. ఎక్కడ చూసినా చిత్రం పట్ల చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని, ఆ వైబ్ తోనే సెప్టెంబర్ 20th థియేటర్లో కలుద్దామని.. ఈ సందర్భంగా దర్శకుడు బాసిరెడ్డి రానా, నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి, అలాగే కాలేజీ మేనేజ్ మెంట్ కు కృతజ్ఞతలు తెలిపారు.




ట్రయిలర్ తో అందరిని ఆకట్టున్నాడు డైరెక్టర్ బాసిరెడ్డి రానా. ఓ కంప్లీకేటెడ్ మర్డర్స్ కేసులను పోలీసులు ఎలా సాధిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ప్రతీ సీన్ అద్భుతంగా ఉంది. నటీనటులచే అద్భుతమైన యాక్టింగ్ రాబట్టుకున్నట్లున్నారు అనిపిస్తుంది. మంచి క్రైం సస్పెన్క్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హైడ్ న్ సిక్ చిత్రం ఈ సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబు అవుతోంది.




చిత్రం : హైడ్ న్ సిక్


నటీనటులు: విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్దేవ్, శ్రీధర్ తదితరులు


దర్శకత్వం: బసిరెడ్డి రానా


నిర్మాత: నరేంద్ర బుచ్చిరెడ్డిగారి


బ్యానర్: సహస్ర ఎంటర్ టైన్మెంట్స్


సమర్పణ: ఎంఎన్ఓపీ


సంగీత దర్శకుడు: లిజో కె జోష్


సినిమాటోగ్రాఫర్: చిన్న రామ్


ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల


లిరిసిస్ట్ : సుద్దాల అశోక్ తేజ


ఆర్ట్ : నిఖిల్ హస్సన్


పీఆర్ఓ: హరీష్, దినేష్

Lyca Productions "Vettaiyan-The Hunter" first single 'Manasilayo' offers mass feast

 సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘వేట్టైయాన్ - ది హంట‌ర్‌’ నుంచి ‘మనసిలాయో..’ లిరికల్ సాంగ్ రిలీజ్



మెరుపై వచ్చిండే.. మడత పెట్ట వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే.. అంటూ ప‌క్కా మాస్ బీట్‌తో అమ్మాయి పాడే పాట వింటుంటే అంద‌రూ స్టెప్పులేయాల‌నిపిస్తోంది. ఇంత‌కీ అంత‌లా అంద‌రినీ మ‌డ‌త పెట్టేలా వ‌చ్చిందెవ‌రో తెలుసుకోవాలంటే ‘వేట్టైయాన్ - ది హంట‌ర్‌’ సినిమా చూసేయాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా భారీ బ‌డ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘వేట్టైయాన్ - ది హంట‌ర్’.





‘వేట్టైయాన్ - ది హంట‌ర్‌’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 10న భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నారు.  టి.జె.జ్ఞాన‌వేల్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు 2.0, ద‌ర్బార్‌, లాల్ స‌లామ్ వంటి చిత్రాల త‌ర్వాత ర‌జినీకాంత్, లైకా ప్రొడ‌క్ష‌న్ష్ క‌ల‌యిక‌లో రాబోతున్న నాలుగో సినిమా ‘వేట్టైయాన్- ది హంట‌ర్‌’.


పేట‌, ద‌ర్బార్‌, జైల‌ర్ చిత్రాల‌కు పుట్ స్టాపింగ్ ట్యూన్ అందించి మెప్పించిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ ర‌విచంద‌ర్ నాలుగోసారి ర‌జినీకాంత్ వేట్టైయాన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ‘మనసిలాయో..’ అంటూ సాగే ఈ పాట వింటుంటే ఎన‌ర్జిటిక్ బీట్‌తో సాగుతుంది. ర‌జినీకాంత్, మంజు వారియ‌ర్ మ‌ధ్య వ‌చ్చే పాట అని తెలుస్తుంది. అలాగే ఇందులో మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ సైతం స్టెప్పులేస్తూ క‌నిపించ‌టం విశేషం. సూప‌ర్ స్టార్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు ఆయ‌న అభిమానులు స‌హా అంద‌రినీ దృష్టిలో పెట్టుకుని అనిరుధ్ మ‌రోసారి త‌న‌దైన పంథాలో బాణీల‌ను అందించిన‌ట్లు ‘మనసిలాయో..’ అనే పాట‌ను వింటుంటే తెలుస్తోదిసినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. శ్రీనివాస మౌళి రాసిన ఈ పాట‌ను న‌క‌ష్ అజీజ్‌, అరుణ్ కౌండిన్య‌, దీప్తి సురేష్ పాడారు. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌య‌మేమంటే ఈ పాట త‌మిళ వెర్ష‌న్ కోసం లెజెండ్రీ ప్లే బ్యాక్ సింగ్ మ‌లేషియా వాసుదేవ‌న్ వాయిస్‌ను ఏఐలోక్రియేట్ చేసి ఇందులో ఉప‌యోగించటం విశేషం.


ర‌జినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.  ఇంకా ఈ చిత్రంలో మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్, రానా ద‌గ్గుబాటి, రితికా సింగ్‌, దుష‌రా విజ‌య‌న్, రోహిణి, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆడియెన్స్‌కు స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వ‌టానికి సిద్ధ‌మ‌వుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ భాషల్లో రిలీజ్ కానుంది.


తెలుగు రిలీజ్ హ‌క్కుల‌ను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. సోనీ మ్యూజిక్ ద్వారా పాట‌లు విడుద‌ల‌వుతున్నాయి.

 

న‌టీన‌టులు:

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్‌, రానా ద‌గ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్‌, దుషరా విజ‌య‌న్ త‌దిత‌రులు

న‌టీన‌టులు:

బ్యాన‌ర్‌:  లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, సుభాస్క‌ర‌న్‌, టి.జె.జ్ఞాన‌వేల్‌, మ్యూజిక్‌: అనిరుద్ ర‌విచంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీ:  ఎస్‌.ఆర్‌.క‌దిర్‌, ఎడిట‌ర్‌:  ఫిలోమిన్ రాజ్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  కె.క‌దిర్‌, యాక్ష‌న్‌:  అన్బ‌రివు, కొరియోగ్ర‌ఫీ:  దినేష్‌,  హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌:  జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌,  పి.ఆర్‌.ఒ:  నాయుడు సురేంద్ర కుమార్‌- ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా).

'Gorre Puranam' set to hit the screens on September 20th

సెప్టెంబర్ 20 న విడుదల అవుతున్న గొర్రె పురాణం 



మంచి కాన్సెప్ట్ కథలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్న హీరో సుహాస్. కలర్ ఫోటో చిత్రంతో హీరో గా తన ప్రస్థానం మొదలు పెట్టాడు. వరుసగా రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న విధానం లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ చిత్రం తో సెప్టెంబర్ 20 న మన ముందుకు వస్తున్నాడు సుహాస్. 



ఫోకల్ వెంచర్స్ పతాకం పై సుహాస్ హీరో గా బాబీ దర్శకత్వం లో ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న వినూత్న కథ చిత్రం "గొర్రె పురాణం". ఈ చిత్రం నుంచి ఇటీవలే విడుదల అయిన టీజర్ కి మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 20 న విడుదల అవుతుంది. 


ఇది ఒక గొర్రె కథ, ఒక గ్రామంలో హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టిన ఒక గొర్రె కథ. కథ చాలా కొత్తగా ఉంటుంది. మంచి కథ కథనం  తో సోషల్ మెసేజ్ ఉన్న వినూత్న కథ. సుహాస్ చాలా బాగా నటించాడు. పవన్ సి హెచ్ స్వరపరిచిన పాటలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. 'భలే భలే' మరియు ఓ రారే రారే లిరికల్ పాటలు విడుదలై  గొర్రె పురాణం చిత్రం మీద అంచనాలు పెంచాయి. ఈ చిత్రం లో గొర్రె కి దర్శకుడు నటుడు తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.


మా చిత్రం అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 20న విడుదల అవుతుంది" అని దర్శక నిర్మాతలు తెలిపారు 

Dhoom Dhaam Postponed due Floods in the Telugu states

తెలుగు రాష్ట్రాల్లో వరదల పరిస్థితి దృష్ట్యా "ధూం ధాం" సినిమా విడుదల వాయిదా, త్వరలోనే కొత్త డేట్ వెల్లడి




చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. "ధూం ధాం" సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. 


"ధూం ధాం" సినిమా నెల 13న విడుదల కావాల్సింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయడం సరికాదని మేకర్స్ భావించారు. అందుకే "ధూం ధాం" సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.


"ధూం ధాం" సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన కంటెంట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. గోపీసుందర్ స్వరపర్చిన 'మల్లెపూల టాక్సీ..', 'మాయా సుందరి..', 'టమాటో బుగ్గల పిల్ల..', 'కుందనాల బొమ్మ..' 'మనసున మనసు నువ్వే..' సాంగ్స్ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. "ధూం ధాం" సినిమా హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా త్వరలోనే థియేటర్స్ లోకి రాబోతోంది.



నటీనటులు - చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు


టెక్నికల్ టీమ్


డైలాగ్స్ - ప్రవీణ్ వర్మ

కొరియోగ్రఫీ - విజయ్ బిన్ని, భాను

లిరిక్స్ - సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి

ఫైట్స్ - రియల్ సతీష్

పబ్లిసిటీ డిజైనర్స్ - అనిల్, భాను

ఆర్ట్ డైరెక్టర్ - రఘు కులకర్ణి

ఎడిటింగ్ - అమర్ రెడ్డి కుడుముల

సినిమాటోగ్రఫీ - సిద్ధార్థ్ రామస్వామి

మ్యూజిక్ - గోపీ సుందర్

స్టోరీ స్క్రీన్ ప్లే - గోపీ మోహన్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - శివ కుమార్

పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ - శ్రీనివాస్)

ప్రొడ్యూసర్ - ఎంఎస్ రామ్ కుమార్

డైరెక్టర్ - సాయి కిషోర్ మచ్చా

Janaka Aithe Ganaka Releasing on October 12th As Dasara Special

ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 12న సుహాస్‌, దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ ‘జనక అయితే గనక’ రిలీజ్‌



వెర్సటైల్ యాక్ట‌ర్ సుహాస్‌, సంగీర్త‌న హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై  హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు.  వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్‌ హీరోగా నటించారు. సందీప్‌ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు.  ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ద‌స‌రా సంద‌ర్భంగా ‘జనక అయితే గనక’ చిత్రాన్ని అక్టోబ‌ర్ 12న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఇంట్రెస్టింగ్ వీడియో క్రియేట్ చేసి రిలీజ్ చేశారు.

వీడియో గ‌మ‌నిస్తే..‘జనక అయితే గనక’ ఓవ‌ర్‌సీస్ హ‌క్కులు సొంతం చేసుకున్న హీరో సుహాస్‌కి అంద‌రూ ఫోన్ చేసి సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడ‌ని అడుగుతుంటారు. వీరి గోల భ‌రించ‌లేక‌.. నిర్మాత దిల్ రాజుకి సుహాస్ ఫోన్ చేసి రిలీజ్ డేట్ గురించి అడ‌గ‌టం.. ఆయ‌న దానికి మాట్లాడుతూ మ‌న సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యే స‌బ్జెక్ట్ కాబ‌ట్టి ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 12న ‘జనక అయితే గనక’ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలియ‌జేశారు. ఈ సంభాష‌ణ‌ను ఫ‌న్నీగా ఉంటూనే.. రిలీజ్ డేట్ అక్టోబ‌ర్ 12 అని రిజిష్ట‌ర్ అయ్యేలా ఉంది.

 

నటీనటులు:

సుహాస్‌, సంగీర్తన, రాజేంద్రప్రసాద్‌, గోపరాజు రమణ తదితరులు


సాంకేతిక బృందం:

బ్యానర్‌: దిల్‌రాజు ప్రొడక్షన్స్, సమర్పణ: శిరీష్‌, నిర్మాతలు: హర్షిత్‌ రెడ్డి, హన్షితా రెడ్డి, రచన - దర్శకత్వం: సందీప్‌ బండ్ల, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, డీఓపీ: సాయి శ్రీరామ్‌, ఎడిటర్‌: కోదాటి పవన్‌ కల్యాణ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అరసవిల్లి రామ్‌కుమార్‌, కాస్ట్యూమ్ డిజైనర్‌: భరత్‌ గాంధీ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అకుల్‌, పీఆర్ఓ: వంశీకాకా. 

Keerthy Suresh's 'Raghu Thatha' Makes its World Digital Premiere from September 13th on ZEE5

 జీ5లో సెప్టెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానున్న మహానటి కీర్తి సురేష్ ‘రఘు తాత’



మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రఘు తాత. హోంబళే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రానికి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ఆడియెన్స్ థియేటర్లో మంచి రెస్పాన్స్‌ను ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 13 నుంచి ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన ఈ తరుణంలో


కీర్తి సురేశ్‌ మాట్లాడుతూ.. ‘నమ్మిన దాని కోసం నిలబడే ఓ ధైర్యశాలి పాత్రను రఘు తాత చిత్రంలో పోషించడం ఆనందంగా ఉంది.  ఆ పాత్రకు జీవం పోయడం ఓ సవాలుగా అనిపించింది. ZEE5లో ఈ ఆకర్షణీయమైన కథనం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ అవుతుండటం సంతోషంగా ఉంది’ అని అన్నారు.


RaghuThatha Telugu Trailer - 


 


హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ.. ‘‘రఘుతాత’ ప్రపంచ డిజిటల్ ప్రీమియర్ కోసం ZEE5తో భాగస్వామి అయినందుకు మాకు సంతోషంగా ఉంది. విజువల్ ట్రీట్, ఎమోషనల్ జర్నీగా సాగే రఘు తాత చిత్రం ఈ ZEE5 ద్వారా అందరి వద్దకు చేరుతోంది. 'రఘుతాత' అనేది మాకు ఒక ప్రత్యేక ప్రాజెక్ట్. ఇది సున్నితత్వం, హాస్యంతో ఉండటమే కాదు సామాజిక సమస్యలను తెలియజేస్తుంది’ అని అన్నారు.


దర్శకుడు సుమన్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రఘుతాత’ సినిమా మా జీవితంలో ఓ మరుపురాని ప్రయాణంగా నిలుస్తుంది. ఈ చిత్రం భాషా, ప్రాంతం అన్న తేడా లేకుండా అందరినీ అలరించగలిగింది. ఇక ZEE5లో ప్రపంచ డిజిటల్ ప్రీమియర్ కోసం ఎదురు చూస్తున్నాను’ అని అన్నారు.


ZEE5 గురించి...


జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది.


The Countdown To Venom: The Last Dance Begins



The Countdown To Venom: The Last Dance Begins

The final trailer drops on 12 September 2024.


Following a jaw-dropping first trailer, expectations have reached hyperbolic proportions for Tom Hardy’s return as Eddie Brock in Venom: The Last Dance, set to release in 3D and IMAX 3D. The countdown begins as the final trailer of the much anticipated third instalment of the Venom Franchise drops on 12th September 2024.


 



In Venom: The Last Dance, Tom Hardy returns as Venom, one of Marvel’s greatest and most complex characters, for the final film in the trilogy. Eddie and Venom are on the run. Furiously hunted by both of their worlds and with the net closing in, the duo are compelled into a devastating decision that would bring the curtains down on Venom and Eddie's last dance.

 

The film stars Tom Hardy, Chiwetel Ejiofor, Juno Temple, Rhys Ifans, Peggy Lu, Alanna Ubach and Stephen Graham. The film is directed by Kelly Marcel from a screenplay she wrote, based on the story by Hardy and Marcel. The film is produced by Avi Arad, Matt Tolmach, Amy Pascal, Kelly Marcel, Tom Hardy and Hutch Parker.


Sony Pictures Entertainment India will exclusively release Venom: The Last Dance in Indian cinemas on 25th October 2024, in English, Hindi, Tamil and Telugu. 

Akshay Kumar From Team Kannappa Pre-look Unleashed

‘కన్నప్ప’ నుంచి అక్షయ్ కుమార్‌ బర్త్ డే స్పెషల్‌గా ప్రీ లుక్ పోస్టర్


బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 9) సందర్భంగా కన్నప్ప టీం స్పెషల్‌గా సర్ ప్రైజ్ చేసింది. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

అక్షయ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని.. అక్షయ్ కుమార్ పోషించిన శివుని పాత్రకి సంబంధించిన ప్రీ లుక్‌ను రిలీజ్ చేశారు. రుద్రాక్ష మాలతో అలంకరించబడిన చేతిని చూపించారు. ముల్లోకాలను ఏలే పరమేశ్వరుడు.. భక్తికి మాత్రం దాసుడు అంటూ శివుని తత్త్వం గురించి చెప్పే డైలాగ్ పోస్టర్ మీద పెట్టారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారాగణం ఉంది. విష్ణు మంచు తనయుడు అవ్రామ్ భక్త మంచు తిన్నడు పాత్రతో వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.డిసెంబర్‌లో ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే.

ZEE5 Brings the Jeethu Joseph's Laugh Riot 'Nunakkhuzhi' in Telugu, Kannada and Malayalam this Onam

 ఓనం స్పెషల్‌గా జీ5లోకి సెప్టెంబర్ 13న రాబోతోన్న జీతూ జోసెఫ్ ‘నూనక్కళి’



మలయాళంలో జీతూ జోసెఫ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. ఈ మధ్య బసిల్ జోసెఫ్ చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జీతూ జోసెఫ్ దర్శకుడిగా, బసిల్ జోసెఫ్ హీరోగా వచ్చిన ‘నూనక్కళి’ సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో రాబోతోంది. సెప్టెంబర్ 13న ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రం జీ5లో అందుబాటులో ఉండనుంది. ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించిన ఈ క్రమంలో..


దర్శకుడు జీతూ జోసేఫ్ మాట్లాడుతూ.. ‘‘జీవితంలో ఎదురయ్యే అనూహ్య మలుపులను, నవ్వులతో అందంగా మల్చిన చిత్రం నూనక్కళి. ‘ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే అతి తక్కువ దూరం నవ్వు’ అని, ఈ సినిమాతో కుటుంబ సభ్యులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. బసిల్ జోసెఫ్, గ్రేస్ ఆంటోనీ తమ తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఓనమ్ పండుగ సమయంలో విడుదలవుతుండటంతో వీక్షకులు ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆస్వాదించగలరని ఆశిస్తున్నాము.  థియేటర్‌లలో పొందిన ప్రేమ మా అంచనాలకు మించినది. ఇక ఇప్పుడు ZEE5 ద్వారా మన అందరి వద్దకు రాబోతోంది. కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, మన దైనందిన జీవితంలో అంతర్లీనంగా ఉన్న హాస్యాన్ని కూడా గుర్తు చేసేలా ఉంటుంది’ అని అన్నారు.


బసిల్ జోసెఫ్ మాట్లాడుతూ.. ‘రోజువారీ మలయాళీ యువతను ప్రతిధ్వనించే పాత్రలను పోషించేందుకు నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటాను -  నూనక్కళితో మరోసారి అలాంటి ఓ పాత్రను పోషించాను. ఇందులో నేను ఎప్పుడూ అబద్ధాలు చెబుతూ, ఏదో ఒక చిక్కుముడి సమస్యతో ఉంటాను. థియేటర్లలో మాకు ఆడియెన్స్ మంచి విజయాన్ని అందించారు. ఇక ఇప్పుడు మా చిత్రం ZEE5లో ప్రీమియర్ అవుతున్నందుకు సంతోషిస్తున్నాను’ అని అన్నారు.


https://x.com/ZEE5Telugu/status/1832253909295100043


ZEE5 గురించి...


జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది.


Thummalapalli Announced Movie With Famous writer Yandamoori veerendranadh

యండమూరి "అంతర్ముఖం"

ఆవిష్కరిస్తున్న తుమ్మలపల్లి



శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తన 67 వ పుట్టినరోజు సందర్బంగా ప్రఖ్యాత రచయిత - దర్శకులు  యండమూరి వీరేంద్రనాధ్'తో ఓ చిత్రం ప్రకటించారు. యండమూరి రాసిన నవలల్లో అగ్ర తాంబూలం అందుకునే "అంతర్ముఖం"ను వెండితెరపై ఆవిష్కరించనున్నారు. భీమవరం టాకీస్ పతాకంపై 117వ చిత్రంగా యండమూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సీనియర్ ఛాయాగ్రాహకులు మీర్ కెమెరామెన్. "యు అండ్ ఐ", మహేష్, యు.ఎస్, "వర్చ్యువల్ ఒన్" సంస్థలు ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి. త్వరలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంతోపాటు... ప్రముఖ దర్శకుడు - నంది అవార్డు గ్రహీత అల్లాణి శ్రీధర్, జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది దర్శకత్వంలోనూ చిత్రాలు నిర్మించేందుకు తుమ్మలపల్లి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ!!

Hero Dilip Prakash Interview About Utsavam

 'ఉత్సవం' మనందరం గర్వపడే సినిమా. ఆడియన్స్ కొరుకునే అన్నీ ఎలిమెంట్స్ వుంటాయి: హీరో దిలీప్ ప్రకాష్



దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా 'ఉత్సవం'. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్ , నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోహిస్తున్నారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ తో ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ 13న సినిమా ప్రేక్షుకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో హీరో దిలీప్ ప్రకాష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.


ఉత్సవం ఎలా బిగైన్ అయ్యింది ? మీ జర్నీ గురించి చెప్పండి ?

-స్కూల్స్ డేస్ నుంచే సినిమాల పట్ల ఆసక్తి వుండేది. చిన్నప్పుడు స్కూల్ లో నాటకాలు రాయడం, ప్రదర్శించడం జరిగేది. ఎంబీఏ పూర్తి చేశాను. మధ్యలో ఓ సినిమాలో చిన్న రోల్ చేసే ఆఫర్ వచ్చింది. తర్వాత క్రేజీ బాయ్ అనే కన్నడ సినిమా చేశాను. ఆ సినిమా సక్సెస్ మీట్ లోనే డైరెక్టర్ అర్జున్ సాయి ని కలిశాను. ఆరేళ్ళ జర్నీలో ఆయన ఉత్సవం కథ చెప్పారు. ఇది చాలా రెస్పెక్టబుల్ సబ్జెక్ట్ చాలా గర్వంగా చెప్పుకునే సినిమా.



ఉత్సవం లో మీకు ఆకట్టుకున్న అంశాలు ఏమిటి ?

-చాలా అద్భుతమైన కథ. ఇందులో కథనే హీరో. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం గారు ఇలా చాలా మంది అద్భుతమైన యాక్టర్స్ వున్నారు. ఇది వండర్ ఫుల్ జర్నీ. వారందరినుంచి చాలా నేర్చుకున్నాను.


రెజీనా గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

-రెజీనా స్వీట్ కో యాక్టర్. చాలా హెల్ప్ చేశారు. తననుంచి చాలా నేర్చుకున్నాను. చాలా కంఫర్ట్ బుల్ గా యాక్ట్ చేశాను.


ఉత్సవం ఎలా వుండబోతోంది ?

-రంగస్థల కళాకారుల మీద తీసిన సినిమా ఇది. సురభి నాటక సమాజం స్ఫూర్తి వుంది. సినిమా వచ్చిందే నాటకాల నుంచి. మన రూట్స్ ని గుర్తు చేసేలా వుంటుంది. ఇందులో మంచి ఫ్యామిలీ డ్రామా, రోమాన్స్ కూడా వుంటుంది. అనూప్ రూబెన్స్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆడియన్స్ ని అలరించే అన్ని ఎలిమెంట్స్ ప్యాకేజ్ లా వుంటుంది. చాలా గొప్పనటులు ఇందులో వున్నారు. సినిమా చూసిన కొందరు '' ఫీల్ గుడ్ సినిమా, లైట్ హార్ట్ సినిమా' అని ప్రశంసించారు.  


ప్రకాష్ రాజ్ గారి లాంటి సీనియర్ యాక్టర్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

-ప్రకాష్ రాజ్ గారు లాంటి వెర్సటైల్ యాక్టర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం వెరీ ఛాలెంజ్. ఈ ప్రాసెస్ ని చాలా ఎంజాయ్ చేశాను. ప్రకాష్ రాజ్ గారు నా నటన చూసి 'గుడ్ జాబ్'అని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.


మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తెలుగులో రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తోంది ?

-మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ శశి గారు ఈ సినిమా చూశారు. ఆయనకి కంటెంట్ చాలా నచ్చింది. అలా హోంబలే వారు కర్ణాటక లో రిలీజ్ చేస్తున్నారు. నార్త్ లో సినీ పోలీస్ రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రముఖ సంస్థలు సినిమాని విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాం.


ఈ సినిమాలో సందేశం వుంటుందా?

-ఇందులో హీరోది నాటకాలకి మళ్ళీ తీసుకొచ్చే క్యారెక్టర్. అయితే ఇదంతా సందేశం చెప్పేలా కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ విధానంలోనే చూపించాం. ఇందులో తెలుగు కల్చర్, ట్రెడిషన్ చాలా అద్భుతంగా చూపించాం.


అనూప్ రూబెన్స్ మ్యూజిక్ గురించి ?

-నా మొదటి సినిమాలోనే ఇంత అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. ఈ విషయంలో అనూప్ కి థాంక్స్ చెబుతున్నాను.


-అనంత్ శ్రీరామ్, భాస్కర భట్ల, వనమాలి వండర్ ఫుల్ లిరిక్స్ రాశారు.  


-ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి గారు ప్రతి డిటెయిల్ తీసుకొని చాలా అద్భుతంగా ఆర్ట్ వర్క్ చేశారు. కథ కోసం అందరూ సినిమాని వోన్ చేసుకొని పని చేశారు.


నిర్మాత సురేష్‌ పాటిల్‌  గురించి ?

-ఆయనకి స్పెషల్ గా థాంక్స్ చెబుతున్నా. ఆయన వలనే ఈ సినిమా పాజిబుల్ అయ్యింది.


మీరు తెలుగు బాగా మాట్లాడుతన్నారు కదా ?

-నాన్న సైడ్ తెలుగు. హిందూపూర్. అమ్మ సైడ్ కన్నడ. జై బాలయ్య( నవ్వుతూ)    

 

మీ ఫేవరేట్ జోనర్ ఏంటి ?

-నాకు యాక్షన్ సినిమాలు ఇష్టం. నేను చేయబోయే నెక్స్ట్ సినిమా యాక్షన్ జోనర్ లో వుంటుంది.  


ఆల్ ది బెస్ట్

-థాంక్ యూ

Kaantha Movie Shoot Started

రానా దగ్గుబాటి , దుల్కర్ సల్మాన్, సెల్వరాజ్, స్పిరిట్ మీడియా & వేఫేరర్ ఫిలింస్ మల్టీలింగ్వల్ ఫిల్మ్ 'కాంత'- ఈరోజు షూటింగ్ ప్రారంభం



రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్‌ కొలాబరేషన్లో మోస్ట్ ఎవైటెడ్ మల్టీ లింగ్వల్ ప్రాజెక్ట్ “కాంత” హైదరాబాద్‌లోని రామా నాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. విక్టరీ వెంకటేష్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు.


ఈ కొలాబరేషన్ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరిరియన్స్ ని అందించదానికి రెండు క్రియేటివ్ పవర్‌హౌస్‌లను ఒకచోట చేర్చింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కు జోడిగా భాగ్యశ్రీ నటిస్తున్నారు. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఈరోజు చిత్రీకరణ కూడా ప్రారంభమౌతోంది.


1950 మద్రాస్‌ బ్యాక్ డ్రాప్ లో హ్యూమన్ రిలేషన్స్, సోషల్ చైంజెస్ ని ఎక్స్ ఫ్లోర్ చేసే గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ గా ఈ సినిమా వుండబోతోంది.  


రానా దగ్గుబాటి మాట్లాడుతూ..కాంత కోసం వేఫేరర్ ఫిల్మ్స్‌తో భాగస్వామ్యం కావడం ఈ ప్రాజెక్ట్‌కి కొత్త డైమెన్షన్ ని యాడ్ చేసింది. క్యాలిటీ సినిమా పట్ల మా విజన్ ఒకేలా వుంటుంది. సురేశ్ ప్రొడక్షన్స్ 60వ యానివర్సరీని పురస్కరించుకుని, స్పిరిట్ మీడియాతో కొత్త శకానికి నాంది పలికేందుకు పర్ఫెక్ట్ మూవీ 'కాంత''. అన్నారు


హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. " స్పిరిట్ మీడియాతో 'కాంతా'తో ఈ జర్నీ ప్రారంభించడం పట్ల ఉత్సాహంగా ఉన్నాను. ఇది మానవ భావోద్వేగాల లోతులను ఆవిష్కరించే అందమైన లేయర్డ్ కథ. ఒక నటుడికి పెర్ఫార్మెన్స్ చేయడానికి చాలా స్కోప్ ఇస్తుంది. ఈ సినిమాకి ప్రాణం పోసినందుకు నేను థ్రిల్ అయ్యాను' అన్నారు


డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ మాట్లాడుతూ"ఇటువంటి ప్రతిభావంతులైన నిర్మాతలు, క్రియేటివ్ టీంతో  కలిసి పనిచేయడం ఆనందంగా వుంది. కాంతతో, మేము ప్రేక్షకులను గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని లక్ష్యంగా పని చేస్తున్నాం' అన్నారు

   

ప్రశాంత్ పొట్లూరి, రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ , జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టెక్నికల్ గా టాప్ లెవల్ లో వుండబోతోంది.  డాని శాంచెజ్ లోపెజ్  సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాను సంగీతం సమకూరుస్తున్నారు. రామలింగం ఆర్ట్ డైరెక్టర్, రైటర్ తమిళ్ ప్రభ. లెవెల్లిన్ ఆంథోనీ గొన్సాల్వేస్ ఎడిటర్.


ఈ చిత్రం తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. త్వరలోనే ప్రాజెక్ట్ కి సంబధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు మేకర్స్.


తారాగణం: దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే


సాంకేతిక సిబ్బంది:

దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్

బ్యానర్లు: స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్

నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సాయికృష్ణ గద్వాల్

లైన్ ప్రొడ్యూసర్ - శ్రవణ్ పాలపర్తి

DOP - డాని శాంచెజ్ లోపెజ్

ఆర్ట్ డైరెక్టర్ - రామలింగం

రైటర్ - తమిళ్ ప్రభ

సంగీతం- జాను

ఎడిటర్ - లెవెల్లిన్ ఆంథోనీ గోన్సాల్వేస్

కాస్ట్యూమ్ డిజైనింగ్: పూజిత తాడికొండ, సంజన శ్రీనివాస్

పీఆర్వో: వంశీ-శేఖర్