Latest Post

Krishnamma breakeven done within a week: Career best collection of Satyadev

 సత్యదేవ్ కెరీర్‌లోనే బెస్ట్ కలెక్షన్స్‌తో తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కృష్ణమ్మ’  



సూపర్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ తాజా చిత్రం ‘కృష్ణమ్మ’తో మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ చిత్రంగా ‘కృష్ణమ్మ’ మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను రిలీజ్ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని విడుదల చేశాయి. సత్యదేవ్‌లో నటుడిని కొత్త కోణంలో ఈ చిత్రం ఆవిష్కరించింది. రగ్డ్ పర్సనాలిటీ, రస్టిక్ యాక్షన్ సన్నివేశాలతో సత్యదేవ్ ఆడియెన్స్ మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.


కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి ‘కృష్ణమ్మ’ తొలి రోజునే బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే తొలి 5 రోజుల్లో రూ. 5.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించటంతో సత్యదేవ్ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది ‘కృష్ణమ్మ’. తొలి ఆట నుంచే ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల నుంచి మంచి టాక్ సంపాదించుకున్న ఈ మూవీ తన విజయయాత్రను కొనసాగించింది.

.

యాక్షన్ మూవీగా ‘కృష్ణమ్మ’ మూవీ ఆడియెన్స్‌ను చక్కగా ఎంగేజ్ చేస్తూ థియేటర్స్‌లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.


సత్యదేవ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో లక్ష్మణ్ మీసాల, రఘుకుంచె, అతీరా రాజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో అలరించారు. వి.వి.గోపాలకృష్ణ సినిమాను డైరెక్ట్ చేశారు. కాలభైరవ సినిమాకు సంగీతాన్ని, సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీని అందించారు.

Love Me If You Dare Trailer Launch Event Held Grandly

 ‘లవ్ మీ’ ఆడియెన్స్‌కి నచ్చి పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నా.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దిల్ రాజు



యంగ్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోయి‌న్‌గా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న రిలీజ్ చేస్తున్నారు. గురువారం నాడు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్రయూనిట్ మాట్లాడుతూ..


దిల్ రాజు మాట్లాడుతూ.. ‘అరుణ్, నాగ ఈ చిత్రానికి బలం. ఇంత వరకు నేను దర్శకుల్ని పరిచయం చేశాను. మొదటి సారి నాగను నిర్మాతగా పరిచయం చేస్తున్నాను. ట్రైలర్ చూస్తే టీం పడ్డ కష్టం తెలుస్తుంది. ఇది న్యూ ఏజ్ లవ్ స్టోరీ కానుంది. ఆడియెన్స్‌కు నచ్చితేనే సినిమా హిట్ అవుతుంది. మే 25న ఈ సినిమా ప్రేక్షకులను నచ్చి పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. సినిమా టీం అందరికీ థాంక్స్.  యంగ్ టీం అంతా కలిసి కొత్త కథతో కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు వస్తున్నారు’ అని అన్నారు.


అరుణ్ భీమవరపు మాట్లాడుతూ.. ‘ఈ మూవీతో ఓ దర్శకుడి పుట్టుకను చూడబోతోన్నారు. సీతమ్మ, సతీదేవీ ఇలా అందరూ చనిపోయి దేవతలు అయ్యారు. దివ్యవతి చనిపోయి దెయ్యం ఎందుకు అయింది అంటూ అర్జున్ చేసే ప్రయాణమే ఈ చిత్రం. శివ పార్వతులు, సతీ దేవీ, గంగా దేవీల్లాంటి పాత్రలు ఈ చిత్రంలో ఉంటాయి. ఆర్జున్ అనే పాత్రలో ఆశిష్ కనిపిస్తాడు. అర్జున్ కారెక్టర్‌లో శివుడి రిఫరెన్సులు కనిపిస్తాయి. యుద్దం చేయడం కంటే ప్రేమించడానికే ఎక్కువ గట్స కావాలి. మనిషి ప్రేమించాలంటేనే ఎంతో ధైర్యం,గట్స్ఉండాలి.. అలాంటిది దెయ్యాన్ని ప్రేమించాలంటే ఇంకెంత గట్స్ ఉండాలి. ఈ పాత్రను ఆశించే ఎంతో ఇష్టంగా పోషించారు. గంగాదేవీ లాంటి పాత్రను వైష్ణవి పోషించారు. ఈ ప్రపంచాన్ని ప్రేమే నడుస్తోంది. వై? అనే క్వశ్చన్స్ లేకుండా వావ్ అని సినిమాను చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.


వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ‘లవ్ మీ ఇఫ్ యు డేర్ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. ఇదొక డార్క్ లవ్ స్టోరీ. షాకింగ్ ఎలిమెంట్స్, ప్రేమ, రొమాన్స్, థ్రిల్స్ ఇలా అన్ని అంశాలుంటాయి. పీసీ శ్రీరామ్ గారి విజువల్స్, కీరవాణి గారి మ్యూజిక్, అవినాష్ గారి అద్భుతమైన సెట్స్ అన్నీ ఆశ్చర్యపరుస్తాయి. ఈ మూవీలో డిఫరెంట్‌గా, టఫ్‌గా ఉండే కారెక్టర్‌ను పోషించాను. లోలోపలే బాధపడుతుండే పాత్రను చేశాను. ఆశిష్ కారెక్టర్ ఎంతో మొండిగా ఉంటుంది.  ఆయనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. దర్శకుడు చాలా మంచి డైలాగ్స్ రాశారు. నాపై నమ్మకంతో నాకు పాత్రను ఇచ్చిన దిల్ రాజు గారికి, హర్షిత్, హన్షితకు థాంక్స్. మే 25న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.


ఆశిష్ మాట్లాడుతూ.. ‘ఇంత మంచి స్క్రిప్ట్‌ను నాకు ఇచ్చిన అరుణ్, నాగలకు థాంక్స్. మా చిత్రానికి మేజర్ అస్సెట్‌ అయిన పీసీ శ్రీరామ్, కీరవాణి గార్లకు థాంక్స్. టీజర్, ట్రైలర్ బాగుంటే సినిమాను చూస్తారు. కథ బాగుంటే ఆడియెన్స్ మూవీస్ చూస్తారు. మా చిత్రంతో మళ్లీ థియేటర్లకు కళ వస్తుంది. సింగిల్స్ స్క్రీన్స్ నిండిపోతాయి. చీకటి రూం అంటేనే నాకు భయం. అలాంటి నన్ను స్మశానంలోకి తీసుకెళ్లారు. వైష్ణవి, రవి అందరితో షూటింగ్ చేయడం ఆనందంగా ఉంది. మా నిర్మాతలు హర్షిత్ అన్న, హన్షిత అక్క, దిల్ రాజు గార్లకు థాంక్స్. మే 25న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.


సిమ్రన్ చౌదరి మాట్లాడుతూ.. ‘స్కల్ రీకన్‌స్ట్రక్షన్ ఆర్టిస్ట్ పాత్రలో ఈ చిత్రంలో కనిపిస్తాను. దిల్ రాజు గారి ప్రొడక్షన్‌లో పని చేయడం ఆనందంగా ఉంది. నాకు మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. ఈ మూవీకి తక్కువ రోజులే పని చేసినా వైష్ణవి, ఆశిష్‌లు ఫ్యామిలీ మెంబర్స్‌‌‌లా మారిపోయారు. మే 25న చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.


రవికృష్ణ మాట్లాడుతూ.. ‘విరూపాక్ష చేసిన టైంలో ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఈ మూవీకి చేసినప్పుడు కూడా అలాంటి ఫీలింగే కలిగింది. ఇంత మంచి చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. వైష్ణవి, ఆశిష్‌లతో పని చేయడం ఆనందంగా ఉంది. మే 25న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.


Raju Yadav Releasing on May24

 గెటప్‌ శ్రీను, కృష్ణమాచారి.కె, సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ 'రాజు యాదవ్‌' ను ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్న సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్- మే 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్



బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ 'రాజు యాదవ్' తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు.


ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఏపీ, తెలంగాణలో విడుదల చేయబోతున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ బ్యాకింగ్ తో రాజు యాదవ్ చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. మే 24న రాజు యాదవ్ విడుదల కానుంది.    


 స్టార్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్  ఈ చిత్రానికి అద్భుతమైన ఆల్బమ్ అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.  


రాజు యాదవ్.. లవ్, కామెడీతో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో  అలరించనుంది.  


సాయిరామ్ ఉదయ్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్.  

 

నటీనటులు: గెటప్ శ్రీను, అంకిత ఖరత్, ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్ కల్వచెర్ల, శ్రీరామ్, కళ్యాణ్ భూషణ్, శ్రీమణి, పవన్ రమేష్, ఉత్తర ప్రశాంత్, తదితరులు..


సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: కృష్ణమాచారి. కె

నిర్మాతలు: ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి

ఏపీ, తెలంగాణ రిలీజ్: బన్నీ వాస్

బ్యానర్లు: సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్

డీవోపీ: సాయిరామ్ ఉదయ్ D.F.Tech

సాహిత్యం: చంద్రబోస్, కాసర్ల శ్యామ్

ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి

ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగేళా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విప్లవ్

గాయకులు: చంద్రబోస్, రామ్ మిరియాల, రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ, యసస్వి కొండేపూడి

కొరియోగ్రఫీ: జిత్తు మాస్టర్

పీఆర్వో:  వంశీ - శేఖర్

సోషల్ మీడియా: హ్యాష్‌ట్యాగ్ మీడియా

Preminchoddhu Teaser Launched Grandly

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం.. ‘ప్రేమించొద్దు’ -  టీజర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్



శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందుతోంది. బ‌స్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథాంశమిది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.  పాన్ ఇండియా చిత్రంగా 5  భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని  జూన్ 7న  విడుదల చేస్తున్నారు..అలాగే  తెలుగు లో విడుదల చేసిన తర్వాత, త్వరలో త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌టానికి కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా గురువారం నాడు మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్ మాట్లాడుతూ..


సూపర్ వైజింగ్ ప్రొడ్యూసర్ నిఖిలేష్ తొగరి మాట్లాడుతూ.. ‘నేను సినిమాను చూశాను. శిరీన్ ఏడ్పించేశాడు. ఆయన సినిమాను తీయలేదు.. ఎమోషన్‌ను తీశాడు. స్టార్టింగ్‌లో ఓ తమిళ్ సినిమాలా అనిపించింది. తెలుగులో ఆ తమిళ్ ఫ్లేవర్‌ను నేచురల్‌గా తీశాడు. ఒక్కో పాత్ర అద్భుతంగా ఉంటుంది. కారెక్టర్ నేమ్స్‌తోనే ఆర్టిస్టులు గుర్తుండిపోతారు. అనురూప్ అద్భుతంగా నటించారు. ప్రతీ ఒక్క ఫీమేల్ కారెక్టర్‌ అద్భుతంగా ఉంటుంది. థియేటర్లో ఈ సినిమాను అందరూ చూడండి. చూసిన ప్రతీ ఒక్కరికీ మూవీ నచ్చుతుంది. మన జీవితాల్లోంచే ఈ పాత్రలు వచ్చినట్టుగా కనిపిస్తాయి. మూడు గంటల పాటు కంటి రెప్ప వేయకుండా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ప్రతీ తల్లిదండ్రులు పిల్లలకు చూపించేదే కాదు.. ప్రతీ పిల్లవాడు తల్లిదండ్రులకు చూపించే చిత్రంగా ఉంటుంది. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. జూన్ 7న మా సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.


దర్శక నిర్మాత శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘మేం ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో తెరకెక్కించాం. ఏ భాషలో స్క్రీనింగ్ చేసినా కూడా స్ట్రెయిట్ ఫిల్మ్‌ అనేలా ఉందని ప్రశంసించారు. నాకు ఎంతగానో సహకరించిన టీంకు థాంక్స్. మా టీం అంతా తెరపై కనిపించనట్టుగా ఉండరు. చాలా కామ్‌గా ఉంటారు. మా సినిమా జూన్ 7న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.


హీరో అనురూప్ రెడ్డి మాట్లాడుతూ.. ‘బంధూక్, శేఖరం గారి అబ్బాయి అనే సినిమాలు చేశాను. నాకు ఇది మూడో చిత్రం. ఎన్నో కష్టాలు పడి సినిమాను తీశాం. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. ప్రతీ తల్లిదండ్రులు వారి పిల్లలకు దగ్గరుండి మరీ చూపించే సినిమా అవుతుంది. ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను అందరూ ఆదరించాలి. శిరీన్ అన్న ఇంతకు ముందు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీశారు. మూడేళ్లు కష్టపడి ఆయన ఈ మూవీని తీశారు. ఎంతో రియలిస్టిక్‌గా ఉంటుంది. మా సినిమాను ఆడియెన్స్ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.


నటి సంతోషి మాట్లాడుతూ.. ‘మూవీ చాలా బాగా వచ్చింది. నాకు మంచి కారెక్టర్‌ను ఇచ్చారు. హీరో, దర్శక నిర్మాతలు ఎంతో సహకరించారు’ అని అన్నారు.


నటి సోనాలి గర్జె మాట్లాడుతూ.. ‘నాకు ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం. హీరోయిన్‌గా నటించడమే కాకుండా దర్శకత్వ శాఖలో పని చేశాను. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా మూవీ ఉంటుంది. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు.


నటి మానస మాట్లాడుతూ.. ‘షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినిమాల్లోకి వచ్చాను. నాకు ఈ చిత్రంలో మంచి కారెక్టర్‌ను ఇచ్చారు. మెచ్యూర్డ్ అమ్మాయి, కష్టాల్లో తోడు ఉండే స్నేహితురాలి పాత్రలో కనిపిస్తాను. మా చిత్రం జూన్ 7న రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.


నటీనటులు:


అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తాళ్ల, సోనాలి గర్జె, లహరి జులురి, శ్రద్ధా సాయి, వల్లీ శ్రీగాయత్రి, లక్ష్మీకాంత్ దేవ్ తదితరులు


సాంకేతిక వర్గం:


రచన, ఎడిటింగ్, నిర్మాత, దర్శత్వం - శిరిన్ శ్రీరామ్, మ్యూజిక్ ప్రోగ్రామింగ్ - జునైద్ కుమార్, బ్యాగ్రౌండ్ స్కోర్ - కమ్రాన్, సాంగ్స్ కంపోజింగ్ - చైతన్య స్రవంతి, సినిమాటోగ్రఫీ అండ్ కలర్ - హర్ష కొడాలి, స్క్రీన్ ప్లే - షిరిన్ శ్రీరామ్, రాహుల్ రాజ్ వనం, అసోసియేట్ డైరెక్టర్ - సోనాలి గర్జె, పబ్లిసిటీ డిజైన్ - అజయ్(ఏజే ఆర్ట్స్), వి.ఎఫ్.ఎక్స్- వి.అంబికా విజయ్, లొకేషన్ సౌండ్ - మహేష్ పాశం, డబ్బింగ్ ఇంజనీర్ - అనూప్ చౌదరి, సూపర్‌వైజింగ్ ప్రొడ్యూస‌ర్‌:  నిఖిలేష్ తొగ‌రి, పి.ఆర్.ఒ - చంద్ర వట్టికూటి, మోహన్ తుమ్మల.

 

Inayana Sultana Navarathnalu Releasing on May 17th

Big boss ఇనయ సుల్తానా నటించిన నటరత్నాలు మే 17న ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన విడుదల

    


ఇనయ సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్ మరియు తాగుబోతు రమేశ్ పాత్రల్లో నటించిన చిత్రం నటరత్నాలు. ఎన్నో హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు కూడా ఈ సినిమాలో యాక్టర్లుగా యాక్ట్ చేయడం జరిగింది. చందనా ప్రొడక్షన్ సమర్పణలో ఎవరెస్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన “నటరత్నాలు” క్రైం కామెడీ థ్రిల్లింగ్ నేపథ్యంలో దర్శకుడు శివనాగు తెరకెక్కించిన చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ కు చాలా మంచి స్పందన లభించింది. 'నటరత్నాలు' మే 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.


దర్శకుడు శివనాగు మాట్లాడుతూ : సినిమా అంటే నాకు ప్రాణం సినిమానే నా జీవితం. సినిమా కోసం పుట్టాను సినిమాతోనే ప్రాణం వదులుతాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీయాలి అనే వాళ్ళు ఎలా విఫలమవుతున్నారు? ఎలా సఫలమవుతున్నారు? ఏం చేస్తున్నారు అనే కథగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నాకు ఎంత సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ అలాగే టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా మే 17న మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమాను మంచి సక్సెస్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాత చంటి యలమాటి గారు మాట్లాడుతూ : మంచి హిట్లు ఇచ్చిన డైరెక్టర్లను యాక్టర్లుగా మార్చిన సినిమా నటరత్నాలు. సూర్యకిరణ్ లో ఒక నటుడిని చూస్తారు. డైరెక్టర్ శివ నాగు నాకు ఈ నటరత్నాలు కథ చెప్పడం జరిగింది. ఈ కథ సినిమాలో సినిమా లాంటిది. ఇండస్ట్రీకి వచ్చి ఏదో సాధించాలని హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అవ్వాలని కలగని యువత చాలామంది ఉన్నారు. డైరెక్టర్ శివ నాగు గారు డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్  పైన మంచి స్పందన లభించింది. మే 17న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది అన్నారు.


నటీనటులు :

ఇనయ సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్, తాగుబోతు రమేష్, అర్జున్ తేజ్, అర్చన, సుమన్ శెట్టి, సూర్యకిరణ్, ఏ. ఎస్ రవికుమార్ చౌదరి మరియు టైగర్ శేషాద్రి.


టెక్నీషియన్స్ :

నిర్మాణం : చందన ప్రొడక్షన్స్ మరియు ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్

నిర్మాతలు : చంటి యలమాటి, డాక్టర్ దివ్య

సహ నిర్మాతలు :  ఆనందాసు శ్రీ మణికంఠ, కోయి సుబ్బారావు

మ్యూజిక్ : శంకర్ మహదేవ్

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : నర్రా శివనాగు

డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం

పిఆర్ఓ : మధు VR 

Mr V Suranna cineArt Director Memorial pickle Ball Court Inauguration at FNCC

 ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో నూతన శ్రీ వి. సూరన్న (సినీ ఆర్ట్ డైరెక్టర్) మెమోరియల్ పికిల్ బాల్ కోర్ట్ గ్రాండ్ ఓపెనింగ్



ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో నూతనంగా పికిల్ బాల్ కోర్ట్ ఓపెనింగ్  ఘనంగా జరిగింది. శ్రీ వి. సూరన్న ( సినీ ఆర్ట్ డైరెక్టర్) మెమోరియల్ పికిల్ బాల్ కోర్ట్ గా పేరు పెట్టి నేడు ఘనంగా ఓపెన్ చేశారు. FNCC లో యాక్టివిటీస్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు ఈ పికిల్ బాల్ కోర్ట్ ఓపెనింగ్ తో ఇంకా ముందు ముందు మరిన్ని టోర్నమెంట్స్, ఆక్టివిటీస్ ఏర్పాటు చేయనున్నారు. ఈ పికిల్ బాల్ కోర్ట్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథులుగా సినీ దర్శకులు శ్రీ పి. సాంబశివరావు గారు, FNCC ఫార్మర్ ప్రెసిడెంట్ శ్రీ డా. కే. ఎల్. నారాయణ గారు, ఆనంద్ సినీ సర్వీస్ శ్రీ పి. కిరణ్ గారు పాల్గొన్నారు. వీరితోపాటు FNCC ప్రెసిడెంట్ శ్రీ జి. ఆదిశేషగిరిరావు గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ టి. రంగారావు గారు, సెక్రటరీ శ్రీ ముళ్లపూడి మోహన్ గారు, ట్రెజరర్ శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ పెద్దిరాజు గారు, మరియు కమిటీ మెంబర్స్ శ్రీ కాజా సూర్యనారాయణ గారు, శ్రీమతి శైలజ జూజల గారు, శ్రీ ఎ.గోపాలరావు, శ్రీ ఏడిద సతీష్ (రాజా) గారు, శ్రీ సామ ఇంద్రపాల్ రెడ్డి గారు, డోనర్ శ్రీ వి. నిరంజన్ బాబు గారు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Satyabhama 3rd Single Vethuku Vethuku Unveiled

'క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ "సత్యభామ" సినిమా మ్యూజికల్ ఈవెనింగ్ ఈవెంట్ లో థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు..' రిలీజ్




'క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. “సత్యభామ” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు హైదరాబాద్ లో  “సత్యభామ” సినిమా మ్యూజికల్ ఈవెనింగ్ ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు..' పాట రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో గర్ల్స్, బాయ్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల, అండ్ టీమ్ తమ పాటలతో హుషారెత్తించారు. లైవ్ ఆర్కెస్ట్రాలో సింగర్స్ పాడిన సాంగ్స్ ను ఈవెంట్ కు వచ్చిన ఆడియెన్స్ ఎంజాయ్ చేశారు. ఈ మ్యూజికల్ ఈవెంట్ లో స్పెషల్ కాంటెస్ట్ నిర్వహించి విజేతలకు గిఫ్ట్స్ అందజేశారు. ఈ సందర్భంగా


హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ - "సత్యభామ" మ్యూజికల్ ఈవెనింగ్ ఈవెంట్ జరుపుకోవడం హ్యాపీగా ఉంది. 'వెతుకు వెతుకు..' నా సోలో సాంగ్. ఈ పాట చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేశాం. సత్యభామగా నటించడం ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్ నా కెరీర్ లో చేయడం తొలిసారి. మా సినిమాలో ఎమోషన్, డ్రామా, పవర్ ఫుల్ నెస్ అన్నీ ఉన్నాయి. "సత్యభామ" మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమా నా కెరీర్ లో ఓ స్పెషల్ ప్రాజెక్ట్ గా భావిస్తున్నా. సినిమా రిలీజ్ కోసం ఎగ్జైటెడ్ గా ఉన్నాను. నేను బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చేసిన మూవీ ఇది. ఈ సబ్జెక్ట్ చాలా పర్పస్ ఫుల్ గా, రిలవెంట్ గా అనిపించింది. అమ్మాయిలు తప్పకుండా ఈ మూవీ చూడాలి. అమ్మాయిలు షీ సేఫ్ యాప్ ను ఎలా ఉపయోగించి సేఫ్ గా ఉండాలో మా మూవీలో చూపించాం. ఈ అంశం గురించి సినిమాలో వివరంగా తెలుసుకుంటారు. మన అమ్మాయిలు క్షేమంగా ఉండాలనే పాయింట్ ఈ కథలో నన్ను ఆకట్టుకుంది. మహిళలు కూడా ఎంతో శక్తిమంతులు అని చూపిస్తున్నాం. సత్యభామ క్యారెక్టర్ శక్తి కండబలంతో పాటు బుద్ధిబలంలోనూ ఉంటుంది. సత్యభామ చూసి మీ స్పందన తెలియజేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.


'వెతుకు వెతుకు..' పాటను ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పాడటం విశేషం. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. అమ్మాయిలపై జరుగుతున్న హత్యాయత్నాల నేపథ్యంలో..బాధిత యువతులను చూసి చలించిపోతుంది పోలీస్ ఆఫీసర్ సత్యభామ. ఆ నేరస్తులను పట్టుకోవడానికి సిద్ధమవుతుంది. ఆ సందర్భంలో వచ్చే పాట ఇది. 'వెతుకు వెతుకు వెతుకు వెనకాడకుండ వెతుకు, వెతుకు వెతుకు వెతుకు ఆశ కొరకు నిరాశలోనే వెతుకు. కాంతి కొరకు నిశీధిలోనే వెతుకు...' అంటూ ఇన్ స్పైర్ చేసేలా సాగుతుందీ పాట.



నటీనటులు - కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, తదితరులు


టెక్నికల్ టీమ్


బ్యానర్: అవురమ్ ఆర్ట్స్

స్క్రీన్ ప్లే, మూవీ ప్రెజెంటర్ : శశి కిరణ్ తిక్క

నిర్మాతలు : బాబీ తిక్క,  శ్రీనివాసరావు తక్కలపెల్లి

కో ప్రొడ్యూసర్ - బాలాజీ

సినిమాటోగ్రఫీ - బి విష్ణు

సీఈవో - కుమార్ శ్రీరామనేని

సంగీతం: శ్రీ చరణ్ పాకాల

పీఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

దర్శకత్వం: సుమన్ చిక్కాల 

Lorry Chapter-1 First Look Launched

 లారి చాప్టర్ -1 ఫస్ట్ లుక్ విడుదల 



కింగ్ మేకర్ పిక్చర్స్ పతాకంపై శ్రీకాంత్ రెడ్డి ఆసం హీరో గా నటిస్తూ కథ, స్టాంట్స్, సంగీతం, దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం "లారి చాప్టర్ -1". చెన్నై లొయోల కాలేజీ లో డైరెక్షన్ కోర్స్ చేసి హైదరాబాద్ వచ్చి పలు చిత్రాల్లో వివిధ శాఖలలో పని చేసి ప్రావీణ్యం పొందాడు. తర్వాత యూట్యూబ్ లో తన వీడియోలతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుని మంచి పాపులారిటీ సంపాదించి ఇప్పుడు "లారి చాప్టర్ -1" అనే చలన చిత్రం తో వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రం లో హీరోయిన్ గా చంధ్ర శిఖ నటించగా రాఖీ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.

అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క మొదటి పోస్టర్ ను విడుదల చేసారు.

ఈ సందర్భంగా  శ్రీకాంత్ రెడ్డి ఆసం మాట్లాడుతూ "చెన్నై లొయోల కాలేజీ లో డైరెక్షన్ కోర్స్ చేసిన మొదట యూట్యూబ్ లో నా కెరీర్ ప్రారంభించాను. యూట్యూబ్ లో మంచి వీడియోలు చేశాను, చాలా వ్యూస్ వచ్చాయి, మంచి పాపులారిటీ వచ్చింది. అలాగే చాలా సినిమాలకు వివిధ శాఖలలో పని చేశాను. ఇప్పుడు "లారి చాప్టర్ -1" అనే సినిమా తో మీ ముందుకు వస్తున్నాను. ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్. తెలుగు తో పాటు తమిళం, కన్నడ, హిందీ మరియు బెంగాలీ భాషలో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాను.

ఈరోజు నా చిత్రం లోని మొదటి పోస్టర్ ను విడుదల చేస్తున్నాను. సినిమా ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. త్వరలో విడుదల చేస్తాను. నా మొదటి సినిమా అందరికీ నచ్చుతుంది" అని తెలిపారు.


చిత్రం పేరు : లారి చాప్టర్ -1 (Lorry Chapter-1)

నటి నటులు : శ్రీకాంత్ రెడ్డి ఆసం, చంధ్ర శిఖ, రాఖి సింగ్, తదితరులు

బ్యానర్ : కింగ్ మేకర్ పిక్చర్స్ (King Maker Pictures)

కెమెరా మాన్ : తాడిపత్రి నాగార్జున

పి ఆర్ ఓ : పాల్ పవన్

నిర్మాత :  ఆసం వెంకట లక్ష్మి

కథ, స్టాంట్స్, ఎడిటర్, సంగీతం, దర్శకత్వం : శ్రీకాంత్ రెడ్డి అసం

Purushottamudu Movie Teaser Launch Event

ఘనంగా రాజ్ తరుణ్ "పురుషోత్తముడు" మూవీ టీజర్ లాంఛ్




రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న న్యూ మూవీ పురుషోత్తముడు. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. ఆకతాయి, హమ్ తుమ్ చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన పురుషోత్తముడు సినిమాను రూపొందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో


హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ - మా మూవీ టీజర్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చిన మీడియా, గెస్టులకు థ్యాంక్స్. పురుషోత్తముడు మూవీ గురించి మాట్లాడాలంటే ముందు మా ప్రొడ్యూసర్ డా. రమేష్ గారి గురించి చెప్పాలి. ఆయన సినిమాకు కావాల్సినంత ఖర్చు పెట్టి మూవీ బాగా వచ్చేలా చూసుకున్నారు. మా డైరెక్టర్ రామ్ భీమనతో నాకు మంచి అండర్ స్టాండింగ్ ఉంది. మేమిద్దరు ఒక్క చూపుతో సీన్ ఎలా ఉండాలో కన్వే చేసుకునేవాళ్లం. మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు. ఆయన రేపు పెద్ద డైరెక్టర్ అయ్యాక కూడా నాతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. మా టీమ్ అందరికీ థ్యాంక్స్. అందరూ బాగా వర్క్ చేశారు. జూన్ 6న పురుషోత్తముడు రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాక డేట్ అనౌన్స్ చేస్తాం. మా మూవీని థియేటర్స్ లో చూసి ఎంకరేజ్ చేయండి. అన్నారు.


నిర్మాత ప్రకాష్ తేజావత్ మాట్లాడుతూ - పురుషోత్తముడు సినిమా టీజర్ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. త్వరలో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నాం. మీ అందరి సపోర్ట్ మా చిత్రానికి ఉంటుందని కోరుకుంటున్నా. థియేటర్స్ లో కలుద్దాం. అన్నారు.


యాక్టర్ రచ్చ రవి మాట్లాడుతూ - మంచి కథా కథనాలతో, ప్యాడింగ్ ఆర్టిస్టులతో పురుషోత్తముడు సినిమా మీ ముందుకు రాబోతోంది. మా ప్రొడ్యూసర్స్ చాలా మంచి వాళ్లు. వాళ్లకు సంచుల నిండా డబ్బులు ఈ సినిమాతో మిగలాలని కోరుకుంటున్నా. రాముడు, భీముడు కలిస్తే ఎలా ఉంటాడో అలాగే మా డైరెక్టర్ రామ్ భీమన ఉంటారు. సెట్ లో ఎవరినీ కష్టపెట్టకుండా వర్క్ చేయించుకున్నారు. చాక్లెట్ బాయ్ రాజ్ తరుణ్ కు పురుషోత్తముడు మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.


నటుడు ఆకెళ్ల గోపాలకృష్ణ మాట్లాడుతూ - పురుషోత్తముడు మంచి విందు భోజనం లాంటి సినిమా. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, బ్రహ్మానందం లాంటి పెద్ద నటీనటులతో మాలాంటి వాళ్లు కలిసి నటించే అవకాశం ఈ సినిమా కల్పించింది. మనసున్న నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. వారికి, హీరో రాజ్ తరుణ్ కు పురుషోత్తముడు బిగ్ సక్సెస్ ఇవ్వాలి. అన్నారు.


లిరిసిస్ట్ బాలాజీ మాట్లాడుతూ - ఈ సినిమాలో పాటలు రాసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ రామ్ భీమన గారికి థ్యాంక్స్. సినిమా షూటింగ్ టైమ్ లో ఆయనకు యాక్సిడెంట్ జరిగింది. అయినా పట్టుదలతో ఈ సినిమాను పూర్తి చేశారు. అందరికీ నచ్చేలా సినిమాను రూపొందించారు. రాజ్ తరుణ్ గారు ఈ కథలోని ఎమోషన్స్ ను వెయ్యింతలు తీసుకెళ్లారని రామ్ భీమన గారు చెబుతుండేవారు. టీమ్ అందరికీ ఈ మూవీ పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.


డైరెక్టర్ వీరశంకర్ మాట్లాడుతూ - రామ్ భీమనతో మాట్లాడితే పెద్ద విద్యావేత్తలా అనిపిస్తాడు. పురుషోత్తముడు టీజర్ చూస్తే రామ్ భీమన బీ, సీ సెంటర్స్ ఆడియెన్స్ కు కూడా రీచ్ అయ్యేలా ఈ సినిమాను రూపొందించాడని తెలుస్తోంది. రాజ్ తరుణ్, రామ్ భీమన ఇద్దరి కెరీర్ లకు ఈ సినిమా నెక్ట్ స్టెప్ లాంటి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.


యాక్టర్ రాజా రవీంద్ర మాట్లాడుతూ - డైరెక్టర్ రామ్ భీమన గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు ఇంప్రెస్ అయ్యాను. షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా డైరెక్టర్ చాలా కూల్ గా ఉండేవారు. మార్నింగ్ ఎలా ఉండేవారు సాయంత్రం వరకు అదే ఎనర్జీతో వర్క్ చేశారు. చాలా పెద్ద ప్యాడింగ్ ఈ మూవీలో ఉంది. సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. అన్నారు.


హీరోయిన్ హాసినీ సుధీర్ మాట్లాడుతూ - ఈ మూవీలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రామ్ భీమన గారికి థ్యాంక్స్. రాజ్ తరుణ్ షూటింగ్ టైమ్ లో బాగా సపోర్ట్ చేశారు. తెలుగు డైలాగ్స్ చెప్పడంలో హెల్ప్ చేశారు. మంచి ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. అన్నారు.


నిర్మాత డా.రమేష్ తేజావత్ మాట్లాడుతూ - సినిమా నిర్మించాలని 30 ఏళ్ల కిందట అనుకున్నాను. పురుషోత్తముడు సినిమా కథను దర్శకుడు రామ్ భీమన గారు చెప్పగానే వెంటనే నచ్చి ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. తెరపై నా పేరు ఉంది గానీ నా సోదరుడు ప్రకాష్, నా సతీమణి, పిల్లలు అంతా ప్రొడక్షన్ చూసుకున్నారు. పెద్ద ఆర్టిస్టులను మాట్లాడటం దగ్గర నుంచి అన్నీ పనులు వాళ్లే చేశారు. మా సినిమా వరకు పురుషోత్తముడు అంటే మా డైరెక్టర్ రామ్ భీమన. ఆయన ఈ సినిమానే జీవితంగా గడిపారు. యాక్సిడెంట్ జరిగినా షూటింగ్ కు వచ్చి అంతా చూసుకున్నారు. మా హీరోయిన్ ఫస్ట్ సినిమాకే ఇంత డెడికేషన్ చూపించడం ఆశ్చర్యం వేసింది. ఆమెకు 102 డిగ్రీస్ జ్వరం ఉన్నా షూటింగ్ చేసింది. రాజ్ తరుణ్ గారు బాగా సపోర్ట్ చేశారు. ఒక మంచి మూవీ చేశామని బిలీవ్ చేస్తున్నాం. థియేటర్స్ లో మీ ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. అన్నారు.


దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ - ఒక సినిమా అనేక ఇబ్బందులు దాటుకుని రిలీజ్ వరకు రావడం సంతోషకరమైన విషయం. మా మూవీ టీజర్ లాంఛ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. కరోనా లాంటి పాండమిక్ మాలాంటి అప్ కమింగ్ రైటర్స్, డైరెక్టర్స్ ను చాలా ఇబ్బందిపెట్టింది. రెండు సినిమాలు చేసి మూడో సినిమా పెద్ద కాన్వాస్ లో డిజైన్ చేసుకున్నప్పుడు పాండమిక్ వచ్చి మొత్తం మార్చేసింది. అలాంటి టైమ్ లో కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు..ఇద్దరు గంధర్వుల్లాంటి ప్రొడ్యూసర్స్ రమేష్ గారు, ప్రకాష్ గారు వచ్చారు. నాకు వాళ్లు ఇంద్రుడు, చంద్రుడు. నిర్మాతలకు నాలుగు కథలు చెబితే మంచి టేస్ట్ తో ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్లు సినిమాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. బడ్జెట్ గురించి ఆలోచించలేదు. అడిగిన పెద్ద ఆర్టిస్టులను ఇచ్చారు. గోపీసుందర్, పీజీ విందా, మార్తాండ్ కె వెంకటేష్ ఇలా..ఒక్కొక్కరు మా టీమ్ కు యాడ్ అవుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. రాజ్ తరుణ్ తో పనిచేసి ఆయనకు ఫ్యాన్ అయ్యా. మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు గానీ హీరోయిన్ తో రాజ్ తరుణ్ కెమిస్ట్రీ కంటే సెట్ లో రాజ్ తరణ్ తో నా కెమిస్ట్రీ ఎక్కువగా ఉండేది. రాజ్ తరుణ్ గారిని కొత్తగా తెరపై ప్రెజెంట్ చేసే చిత్రమిది. మీకు ప్రామిస్ చేస్తున్నా పురుషోత్తముడుతో ఒక ఐ ఫీస్ట్ లాంటి సినిమాను చూడబోతున్నారు. అన్నారు.


నటీనటులు - రాజ్ తరుణ్, హాసినీ సుధీర్, ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, విరాన్ ముత్తంశెట్టి, ముకేష్ ఖన్నా, ప్రవీణ్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, సత్య తదితరులు

 

టెక్నికల్ టీమ్ - ఎడిటింగ్ - మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ - పీజీ విందా, మ్యూజిక్ - గోపీ సుందర్, సాహిత్యం - చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, చైతన్య ప్రసాద్, బాలాజీ, పూర్ణాచారి, పబ్లిసిటీ డిజైనర్ - ధని ఏలే, బ్యానర్ - శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్, నిర్మాతలు - డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్, పీఆర్ ఓ- సురేష్ కొండేటి, రచన, దర్శకత్వం - రామ్ భీమన




Tremendous Response For Vidya Vasula Aham Trailer

 విద్య వాసుల అహం ట్రైలర్ కు అనూహ్య స్పందన



ఏటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్, మహేష్ దత్తా, లక్ష్మి నవ్య నిర్మాతలుగా వస్తున్న విద్య వాసుల అహం మే 17న ఆహలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి మనికాంత్ గెల్లి దర్శకత్వం వహించారు. రాహుల్ విజయ్, శివాని వీరిద్దరూ విద్య వాసులుగా ఏ మాత్రం వారి అహాన్ని తగ్గించుకోకుండా ఎలా పెళ్ళైన కొత్త కాపురాన్ని లీడ్ చేస్తున్నారు, చివరికి ఆ ఈగోస్ నుండి ఎలా బయటకి వచ్చారు అనే కథతో, ఇంటరెస్టింగ్ టైటిల్ తో “విద్య వాసుల అహం” వివాహం అని క్రియేటివ్ గా వచ్చేలా టైటిల్ డిజైన్ చేశారు, కాప్షన్ కూడా లాంగ్ లాంగ్ ఈగో స్టొరీ అని కథలో క్యారక్టర్లకి తగట్టుగా పెట్టి మన ముందుకు వచ్చి, ట్రైలర్ విడుదల చేశారు, అనూహ్యమైన స్పందన లభించింది. రాహుల్, శివాని పెర్ఫ్ర్మన్స్ అని అందరూ మెచ్చుకుంటున్నారు, సమ్మర్ లో మంచి రిలాక్సేషన్ ఇచ్చే సినిమాలా ఉంది అని, హాట్ సమ్మర్ లో కూల్ హిట్ అని నేటీజనులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయ సమహవేశంలో  


డైరెక్టర్ మనికాంత్ గెల్లి మాట్లాడుతూ: కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. వెంకీ స్క్రిప్ట్ రాయడం వలెనే నేను సినిమా చెయ్యగలిగాను, అందరికన్నా ఎక్కువ సపోర్ట్ నాకు కళ్యాణీ మాలిక్ గారు ఇచ్చారు, అయనే హీరోయిన్ ని సజెస్ట్ చేశారు, విష్ణు మూర్తి రోల్ కి అవసరాల శ్రీనివాస్ ని కూడా ఆయనే సజెస్ట్ చేశారు. ఈ సినిమాకి సోల్ మొత్తం మ్యూజిక్, కళ్యాణీ మాలిక్ గారు 4 పాటలని నాలుగు విధాలుగా కంపోస్ చేశారు. స్పెషల్లీ పెళ్లి తరవాత పాట నాకు చాలా ఇష్టం. నా డైరెక్షన్ డిపార్టుమెంటుకి థాంక్స్ అండి, నాదేముంది షూట్ చేసి వెళ్ళిపోతాను, మిగతా అన్ని వర్క్స్ వాళ్ళే చూసుకుంటారు. ఈ మే 17th న మీరు థియేటర్స్ కి వెళ్ళాలిసిన అవసరం లేదు అండి, ఎటువంటి అహం లేకుండా మేమే మీ ఇంటికి వస్తున్నాం, ఆహా లో తప్పకుండా చూడండి.  


హీరో రాహుల్ మాట్లాడుతూ: ఇదొక చిన్న క్యూట్ ఈగోస్ ఉండే ఫన్ ఫిలిం. సరదాగా హాయిగా సమ్మర్లో ఇంట్లో AC వేసుకుని ఆహలో హ్యాపీగా ఫ్యామిలీతో చూసే సినిమా. కొత్తగా వచ్చే ప్రతి యాక్టర్ కి లైఫ్ లో కొన్ని సినిమాలు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అలా నాకు కూడా వెంకటేష్ గారిలా ఫ్యామిలీ స్టోరీస్ చెయ్యాలని ఉంటుంది, ఒక రోజు ఫ్లైట్ లో ఉన్నప్పుడు, మనికాంత్ కాల్ చేసి, పీడిఎఫ్ సెండ్ చేశాడు, టైటిల్ చాలా గమ్మత్తుగా అనిపించింది. అప్పటికప్పుడు చదివి కథ నచ్చి ఒకే చెప్పేశాను. 


శివాని మాట్లాడుతూ: 2 సంవత్సరాల నుండి ఈ టీంతో అనుబంధం ఉంది, ఆహాలో ఆల్రెడీ కోట బొమ్మాలి వచ్చింది. ఇప్పుడు నా విద్య వాసుల అహం కూడా ఆహా లోనే వస్తుంది, నాకు నిజంగా ఆహ ఒక లక్కీ ప్లాట్ఫారం. నాకు మనికాంత్ కథ చెప్పినప్పుడు హీరో ఎవరని అడిగాను రాహుల్ విజయ్ అన్నారు, రాహుల్ నాకు చిన్నప్పటి నుండి తెలుసు, రాహుల్ మంచి రైటర్ కూడా, రాహుల్ ఒకే చేసాడు అంటే కథ బాగుంటుంది అని అర్ధమైంది, నేను కూడా ఒకే చేశాను, ఈ కథ ఒప్పుకున్న 6 డేస్ కి కోట బొమ్మాలి ఒకే అయ్యింది, అలా లాస్ట్ రెండు సంవత్సరాలుగా రహుల్తోనే వర్క్ చేశాను. ఏ మాత్రం ఈగో లేని వ్యక్తి రాహుల్.

Allu Sirish's "BUDDY" first single "Aa Pilla Kanule" song out now

 అల్లు శిరీష్ "బడ్డీ" సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ 'ఆ పిల్ల కనులే..' రిలీజ్



అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "బడ్డీ". గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.


ఈ రోజు "బడ్డీ" సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'ఆ పిల్ల కనులే..' రిలీజ్ చేశారు. హిప్ హాప్ తమిళ ఈ పాటను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. సాయి హేమంత్ లిరిక్స్ అందించగా హిప్ హాప్ తమిళ తో కలిసి సంజిత్ హెగ్డే, ఐరా, విష్ణు ప్రియ రవి పాడారు. 'ఆ పిల్ల కనులే, చూశాక తననే ఊహల్లో ఎగిరే మైకంలో మునిగే , మైకంలో తేలే, మబ్బులు తాకే, ఇద్దరి కథ ఇక మొదలాయే, నింగి నేల కలిశాయో, ఊసులేవో పలికాయో..' అంటూ మంచి రొమాంటిక్ నెంబర్ గా సాగుతుందీ పాట.


చిత్రీకరణ పూర్తి చేసుకున్న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు.


నటీనటులు - అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, తదితరులు


టెక్నికల్ టీమ్


మ్యూజిక్ - హిప్ హాప్ తమిళ

బ్యానర్ - స్టూడియో గ్రీన్ ఫిలింస్

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

కో ప్రొడ్యూసర్ - నేహా జ్ఞానవేల్ రాజా

ప్రొడ్యూసర్ - కేఈ జ్ఞానవేల్ రాజా, అధన్ జ్ఞానవేల్ రాజా

రచన, దర్శకత్వం - శామ్ ఆంటోన్




Director Buchi Babu Sana Hails 'Dhakshina' Trailer as Terrifying and Trendsetting

 దక్షిణ ట్రైలర్ టెర్రిఫిక్ గా ఉంది : డైరెక్టర్ బుచ్చి బాబు 



మంత్ర , మంగళ సినిమా ల తో తెలుగు చలన చిత్ర రంగం లొ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఓషో తులసిరామ్ మళ్ళీ "దక్షిణ " మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు . కల్ట్ కాన్సెప్ట్స్ మూవీ బ్యానర్ నిర్మాణం లొ అశోక్ షిండే నిర్మాత గా కబాలి ఫేమ్ సాయి ధన్షిక కథనాయాకి గా మహాభారత్ మర్డర్స్ ఫేమ్ రిషవ్ బసు మరొక ముఖ్య పాత్రలో నటించారు. 


ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర గ్లిమ్స్ కు విశేష స్పందన లభించింది, లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు బుచ్చిబాబు విడుదల చేసారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ... ఈ మధ్య కాలం లొ నన్ను బయపెట్టిన ట్రైలర్ ఇదే అని మళ్ళీ తులసి రామ్ గారు టాలీవుడ్ కి మరో ట్రెండ్ సెట్టర్ సైకో థ్రిల్లర్ ని దక్షిణ సినిమాతో ఇవ్వబోతున్నారు అంటూ అభినందించారు.


ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతల తో పాటు చిత్ర బృందం పాల్గొన్నది. దక్షిణ సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేవుతోందని  త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర నిర్మాత అశోక్ షిండే తెలిపారు.




DiMAAKIKIRIKIRI Teaser Of Ustaad Ram Pothineni Double ISMART Is Out Now

 విట్నెస్ డబుల్ డోస్ ఆఫ్ యాక్షన్ & ఎంటర్‌టైన్‌మెంట్: ఉస్తాద్ రామ్ పోతినేని, సంజయ్ దత్, పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్, పూరీ కనెక్ట్స్ క్రేజీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ 'డబుల్ ఇస్మార్ట్' దిమాకికిరికిరి' టీజర్ విడుదల  



ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తమ మ్యాసీవ్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌తో అలరించబోతున్నారు. టైటిల్ సూచించినట్లుగా 'డబుల్ ఇస్మార్ట్' చిత్రం ప్రీక్వెల్‌కు రెట్టింపు మ్యాడ్ నెస్ గా  ఉండబోతోంది. డైనమిక్ స్టార్ రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్'  దిమాకికిరికిరి టీజర్ విడుదల చేశారు.


హైదరాబాద్‌లోని ఒక ల్యాబ్‌లో ఉన్న హీరో పాత్రను తన చుట్టూ ఉన్న కొంతమంది శాస్త్రవేత్తలతో వివరించే  వాయిస్‌ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. రామ్ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్‌గా అదరగొట్టారు. అతను కిరాక్ అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తాడు, ఖతర్నాక్ బీట్ కోసం అడుగులు వేస్తాడు. కావ్యా థాపర్‌ కథానాయికగా పరిచయమైంది. సంజయ్ దత్ బిగ్ బుల్ గా పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు. క్లైమాక్స్ అద్భుతంగా వుంది.  ఇస్మార్ట్ శంకర్ మాదిరిగానే, డబుల్ ఇస్మార్ట్ కూడా స్పిర్చువల్ టచ్  కూడిన మ్యాసీవ్, యాక్షన్-ప్యాక్డ్ క్లైమాక్స్ సీక్వెన్స్‌ లు ఉండబోతున్నాయి. అద్భుత శివలింగం,  క్లైమాక్స్ ఫైట్ జరిగే భారీ జనసమూహం గూస్‌బంప్‌లను తెప్పించింది.


టీజర్ ఖచ్చితంగా డబుల్ ఇంపాక్ట్‌తో ఇస్మార్ట్  మ్యాడ్ నెస్ ని రగిల్చింది. ప్రేక్షకులకు డబుల్ డోస్ యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, మాస్ ఉల్లాసాన్ని ఆస్వాదించారు. పూరి జగన్నాధ్ మరోసారి తన హీరోని బెస్ట్ స్టైలిష్, మాస్ , యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో ప్రజెంట్ చేశారు. యూనిక్  హైదరాబాదీ యాసలోని వన్-లైనర్లు ఆద్యంతం అలరించాయి. అతని టేకింగ్ చాలా స్టైలిష్‌గా ఉంది. కంటెంట్ డబుల్ యాక్షన్, డబుల్ ఎనర్జీ ,డబుల్ ఫన్‌తో టైటిల్‌కు అనుగుణంగా వుంది. రామ్ డబుల్ ఇస్మార్ట్‌ని రెట్టింపు నైపుణ్యంతో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. అతని ఎనర్జిటిక్ యాక్టింగ్, ఆన్ స్క్రీన్ చరిష్మా ఎక్స్ ట్రార్డినరీ గా వుంది.


సంజయ్ దత్ స్టైలిష్ గెటప్ ఉన్నప్పటికీ డెడ్లీ  విలన్ పాత్రను పోషిస్తున్నారు. కావ్య థాపర్ గ్లామర్‌గా కనిపించింది. అలీని ఫన్నీ రోల్‌లో చూడటం డేజావు ఫీలింగ్ కలిగించింది. పూరీ, అలీ లది హిలేరియస్ కాంబినేషన్.


సామ్ కె నాయుడు, జియాని గియాన్నెలీల విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. వారి కలర్స్ ఛాయిస్ ని అభినందించాలి. మణిశర్మ నేపథ్యం మూడ్‌ని ఎలివేట్ చేస్తుంది. స్టెప్పా మార్,  కిరి కిరీ సౌండ్స్ మాస్ హిస్టీరియాను పెంచుతాయి, చివరి భాగంలో శివ సౌండ్ డివోషనల్ టచ్ ఇచ్చింది. పూరి కనెక్ట్స్ ప్రొడక్షన్ డిజైన్ రెట్టింపు గ్రాండ్‌నెస్‌గా ఉంది.


 పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్ర దిమాకికిరికిరి టీజర్ సినిమా పట్ల ఉత్సాహాన్ని పెంచింది. డబుల్ ఇస్మార్ట్  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల  కానుంది.


ఫస్ట్ ప్రమోషనల్ మెటీరియల్ మన మనసులను కదిలించింది. రామ్ బర్త్ డే కి అభిమానులకు, ఆడియన్స్ కు ఇది సరైన విందు. ఈ ప్రోమోతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. టీజర్ అత్యంత బ్లాస్ట్ గా ఉండడంతో థియేటర్లలో ఎలాంటి మాస్ హిస్టీరియా కనిపిస్తుందో మనం ఊహించుకోవచ్చు.


టీమ్ రెగ్యులర్ అప్‌డేట్‌లతో రాబోతోంది.


తారాగణం: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను తదితరులు.


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్

నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్

బ్యానర్: పూరి కనెక్ట్స్

సీఈఓ: విషు రెడ్డి

సంగీతం: మణి శర్మ

సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు,  జియాని జియాన్నెలి

స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్

పీఆర్వో: వంశీ-శేఖర్

Saripodhaa Sanivaaram Huge Climax Shoot In Aluminium Factory

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ, డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం' అల్యూమినియం ఫ్యాక్టరీలో హ్యుజ్ క్లైమాక్స్ షూటింగ్



నేచురల్ స్టార్ నాని తన అప్ కమింగ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోద శనివారం'లో సూర్య పాత్రలో మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ పవర్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ అడ్రినలిన్‌తో కూడిన యూనిక్ అడ్వంచర్ ని భారీ కాన్వాస్‌పై హై బడ్జెట్‌తో డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


తాజాగా చిత్ర బృందం క్లైమాక్స్‌ షూటింగ్‌ను ప్రారంభించింది. ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో హ్యుజ్ సెట్‌ను నిర్మించారు.


ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా, ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. మురళి జి డివోపీగా పని చేస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.


ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.


నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ

నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి

బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్

సంగీతం: జేక్స్ బిజోయ్

డీవోపీ: మురళి జి

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

ఫైట్స్: రామ్-లక్ష్మణ్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్

 

Director Krishnama Chari Interview About Raju Yadav

'రాజు యాదవ్' రియలిస్టిక్ ఎంటర్ టైనర్. కథ, క్యారెక్టరైజేషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది: డైరెక్టర్ కృష్ణమాచారి  



బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ 'రాజు యాదవ్' తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజుయాదవ్ మే 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు  కృష్ణమాచారి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


మీ నేపధ్యం గురించి చెప్పండి?

-మాది మహబూబ్ నగర్. 15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చాను. నీది నాది ఒకే కథ, విరాటపర్వం చిత్రాలకు దర్శకుడు వేణు ఉడుగుల గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశాను. దీంతో పాటు ఒక స్పానిస్ ఫిల్మ్, మరిన్ని కొన్ని చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశాను. దర్శకుడిగా 'రాజు యాదవ్' నా తొలి చిత్రం.


'రాజు యాదవ్' కాన్సెప్ట్, స్మైల్ క్యారెక్టరైజేష్ గురించి ?

-దాదాపు 90శాతం మనుషుల్లో ఎదో ఒక చిన్న లోపం వుంటుంది. ఈ కథకు ఒక లోపం వున్న పాత్ర కావాలి. ఈ తరహాలో కొత్త క్యారెక్టరైజేషన్ చెప్పాలని భావించాను. అలాంటి సమయంలో రాజేంద్రప్రసాద్ గారు, అలీ గారు నటించిన ఓ సినిమాలో కోటి రూపాయిలు లాటరీ టికెట్టు తగిలితే నవ్వుతూనే చనిపోయిన ఓ సీన్ వుంటుంది. సినిమా అంతా అలా నవ్వుతూనే ఉంటాడు. అది నా మైండ్ లో బాగా రిజిస్టర్ అయ్యింది. అలాగే ప్రముఖ క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీకి చిన్నప్పుడు ఎదో సర్జరీ జరిగింది. దాని కారణంగా ఆయన మొహం ఎప్పుడూ నవ్వుతూవున్నట్లే కనిపిస్తుంది. తన నవ్వు వెనుక వున్న రహస్యాన్ని ఓ సందర్భంలో ఆయనే చెప్పారు. ఇలాంటి లోపంతో క్యారెక్టరైజేషన్ రాసుకుంటే బావుంటుందనిపించింది. చాలా ఫన్ జనరేట్ అయ్యే పాత్ర ఇది.  


ఈ కథకి ఏదైనా సినిమాల స్ఫూర్తి ఉందా ?

-ముందుగా చెప్పినట్లు క్యారెక్టరైజేష్ లో స్ఫూర్తి తప్పితే ఈ కథకి సంబధించి ఏ సినిమాని స్ఫూర్తిగా తీసుకోలేదు. సహజత్వం కూడకున్న సినిమాలంటే ఇష్టం. రాజు యాదవ్ కూడా రియలిస్టిక్ గా వుంటుంది. అన్నీ రియల్ లోకేషన్స్ షూట్ చేశాం.


రాజు యాదవ్ కోసం గెటప్ శ్రీను ని తీసుకోవడానికి కారణం ?

- రాజు యాదవ్ వెరీ పెర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్. కథ రాసుకున్న తర్వాత ఒకరిద్దరి హీరోలతో వర్క్ షాప్ నిర్వహించాం. ఎందుకో నాకు నమ్మకం కుదరలేదు. పాత్రలో జీవిస్తున్నట్లు అనిపించలేదు. ఒక మంచి ఆర్టిస్ట్ కోసం వెదకడం మొదలుపెట్టాను. అప్పుడు గెటప్ శ్రీను గారు ఈ పాత్రకు పర్ఫెక్ట్ అనిపించారు. తను ఇప్పటివరకూ కామెడీ కోణంలోనే కనిపించారు కానీ.. నిజానికి ఆయన చాలా ప్రతిభావంతుడైన నటుడు. అన్ని రకాల పాత్రలని చేయలడు. ఈ సినిమా చూసిన తర్వాత తను సౌత్ ఇండియా లో ఒక బెస్ట్ యాక్టర్ అని ప్రేక్షకులు చెబుతారు. ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో వుంటుంది. రాజు యాదవ్  గెటప్ శ్రీను కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ పాత్రలో ఆయన జీవించారు. ఇది మన స్నేహితుడి కథ, మన కథలా సహజంగా వుంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యే కథ.  


చంద్రబోస్ గారి రాసి పాడిన పాటకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది కదా..  దాని గురించి ?

-ఈ కథలో రాసినప్పుడు ఆ సిట్యువేషన్ కి చంద్రబోస్ గారితో ఎలాగైనా పాట రాయించాలని అనుకున్నాం. ఆయన అద్భుతంగా రాశారు. లిరిక్స్ స్వయంగా పాడి వినిపించారు. నాకు, సంగీత దర్శకుడు హర్షవర్షన్ రామేశ్వర్ కి బోస్ గారు పాడింది చాలా బావుందనిపించింది. ఆయనతోనే పాడించాలని అనుకున్నాం. అయితే ఆయన మాత్రం సాహిత్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తారు. నా వాయిస్ సరిగ్గా కుదరకపొతే వేరే సింగర్ తో పాడించాలని చెప్పారు. ఫైనల్ గా ఆయన పాడింది రికార్డ్ చేశాం. అవుట్ పుట్ పై ఆయన చాలా ఆనందం వ్యక్తం చేశారు. లిరిక్స్ లోని ఎమోషన్ ఆయన గొంతులో చాలా అద్భుతంగా పలికింది.


హర్ష వర్ధన్ రామేశ్వర్ వుండగా.. సురేష్ బొబ్బిలి గారితో నేపధ్య సంగీత చేయడానికి కారణం ?

-హర్ష వర్ధన్ రామేశ్వర్  గారు చాలా అద్భుతమైన పాటలని స్వరపరిచారు. యానిమల్ కి ముందే పాటలన్నీ ఇచ్చేశారు. యానిమల్ విడుదలైన తర్వాత ఆయన చాలా బిజీ అయ్యారు. సురేష్ బొబ్బిలి కూడా నాకు మంచి స్నేహితుడు. ఆయనతో నేపధ్య సంగీతం చేయించాం. ఆయన నేపధ్య సంగీతం ఎమోషన్ ని మరోస్థాయికి తీసుకెళుతుంది.


గెటప్ శ్రీను గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

-గెటప్ శ్రీను గారు డైరెక్టర్స్ ఆర్టిస్ట్. చాలా డౌన్ టు ఎర్త్ వుంటారు. ఈ సినిమాతో ఆయన మరో స్థాయికి వెళ్తారు.


హీరోయిన్ పాత్ర గురించి ?

ఇందులో హీరోది అండర్ రేటెడ్ పాత్ర. హీరోయిన్ పాత్ర గ్లామరస్ గా వుంటుంది. తను చాలా చక్కని నటన కనపరిచారు.


నిర్మాతల గురించి ?

ప్రశాంత్ రెడ్డి గారు, రాజేష్ కల్లెపల్లి గారు చాలా సపోర్ట్ చేశారు. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు.  

ఫస్ట్ కాపీ చూశాం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. టీం అందరం హ్యాపీగా వున్నాం.  


భవిష్యత్ లో ఎలాంటి కథలు చేయాలనుకుంటున్నారు ?

-సహజత్వంతో కూడుకున్న కథలే ఇష్టం. తెరపై చూస్తున్నపుడు ఇది మన కథే అని ప్రేక్షకులు ఫీలయ్యేలా కథలు చేయాలని వుంది.


కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?

-కొన్ని కథలు వున్నాయి. అయితే ప్రస్తుతం నా ద్రుష్టి ఈ సినిమా విడుదలపై వుంది.


ఆల్ ది బెస్ట్

-థాంక్ యూ

Aa Pilla Kanule From Allu Sirish Next Film Buddy Releasing Tomorrow

అల్లు శిరీష్ "బడ్డీ" సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ 'ఆ పిల్ల కనులే..' రేపు రిలీజ్



అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "బడ్డీ". గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న బడ్డీ సినిమా నుంచి ఈ రోజు ఫస్ట్ సింగిల్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు.


రేపు ఉదయం 10 గంటలకు ఈ మూవీ ఫస్ట్ సింగిల్ 'ఆ పిల్ల కనులే..'ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. హిప్ హాప్ తమీజా ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న బడ్డీ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు.


నటీనటులు - అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, తదితరులు


టెక్నికల్ టీమ్


మ్యూజిక్ - హిప్ హాప్ తమిళ

బ్యానర్ - స్టూడియో గ్రీన్ ఫిలింస్

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

కో ప్రొడ్యూసర్ - నేహా జ్ఞానవేల్ రాజా

ప్రొడ్యూసర్ - కేఈ జ్ఞానవేల్ రాజా, అధన్ జ్ఞానవేల్ రాజా

రచన, దర్శకత్వం - శామ్ ఆంటోన్ 

Super Star Rajinikanth wraps Vettaiyan

 ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై టి.జె. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వేట్టయాన్’ షూటింగ్ పూర్తి చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్



సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో జై భీమ్ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే చిత్రం రూపొందుతోంది. ప్యాన్ ఇండియన్ రేంజ్‌లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ భారీ ఎత్తున ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో  అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది.


తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. రజినీకాంత్ ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. తన పాత్రకు సంబంధించిన షూట్‌ను పూర్తి చేయడంతో చిత్రయూనిట్ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో ట్వీట్ వేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. యూనిట్ సభ్యులు అంతా కలిసి రజినీకాంత్‌కి గ్రాండ్‌గా వీడ్కోలు పలికారు.


https://twitter.com/LycaProductions/status/1790004129185570956


ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయన్న సంగతి తెలిసిందే.  వేట్టయాన్ మూవీని ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్.ఆర్. కతీర్ ఐ.ఎస్.సి సినిమాటోగ్రఫర్‌గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.


తారాగాణం : రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్,  జీఎం సుందర్, రోహిణి, అభిరామి, రావు రమేష్, రమేష్ తిలక్, రక్షణ, సాబుమోన్ అబుసమద్, సుప్రీత్ రెడ్డి తదితరులు


సాంకేతిక బృందం.


బ్యానర్:  లైకా ప్రొడక్షన్స్

ప్రొడ్యూసర్:  సుభాస్కరన్

రచయిత & దర్శకుడు: టీ.జే. జ్ఞానవేల్

సంగీతం: అనిరుధ్ రవిచందర్

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ:  ఎస్.ఆర్. కతీర్ ఐ.ఎస్.సి

ప్రొడక్షన్ డిజైనర్: కె. కధీర్

యాక్షన్ డైరెక్టర్: అన్బరివ్

ఎడిటర్: ఫిలోమిన్ రాజ్

క్రియేటివ్ డైరెక్టర్: బి కిరుతిక

ఆర్ట్ డైరెక్టర్: శక్తి వెంకట్ రాజ్

మేకప్: బాను బి - పట్టాణం రషీద్

కాస్ట్యూమ్ డిజైన్: అను వర్ధన్ - వీర కపూర్ - దినేష్ మనోహరన్ - లిజి ప్రేమన్ - సెల్వం

స్టిల్స్: మురుగన్

పబ్లిసిటీ డిజైన్: గోపీ ప్రసన్న

VFX పర్యవేక్షణ: లవన్ - కుసన్

టైటిల్ యానిమేషన్: ది ఐడెంట్ ల్యాబ్స్

సౌండ్ డిజైన్: సింక్ సినిమా

సౌండ్ మిక్సింగ్: కన్నన్ గణపత్

రంగు: రఘునాథ్ వర్మ

DI: B2H స్టూడియోస్

DIT: GB రంగులు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుబ్రమణియన్ నారాయణన్

హెడ్ అఫ్  లైకా ప్రొడక్షన్స్: G.K.M. తమిళ కుమరన్

లేబుల్: సోనీ మ్యూజిక్

పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)

Miral Releasing on 17 May

మే 17న రానున్న భరత్, వాణి భోజన్‌ హారర్ చిత్రం  ‘మిరల్’



ప్రేమిస్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భరత్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్‌ మూవీ ‘మిరల్’తో మే 17న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భరత్ హీరోగా, వాణి భోజన్ హీరోయిన్‌గా విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కించిన ‘మిరల్’ మూవీని  సీహెచ్ సతీష్ కుమార్ నిర్మించారు. హారర్, సస్పెన్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి ఎం శక్తివేల్ దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్ అందరినీ ఎంతగా భయపెట్టిందో అందరికీ తెలిసిందే. ట్రైలర్‌తో ఒక్కసారిగా మిరల్ మూవీ మీద అంచనాలు పెరిగాయి.

Miral Official Telugu Trailer | Bharath, Vani Bhojan, K.S.Ravikumar | Vigneswara Entertainments - 


శ్రీమతి. జగన్మోహిని & జి డిల్లి బాబు సమర్ఫణలో రాబోతోన్న ఈ సినిమాను మే 17న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ మేరకు వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమా కథ ఏంటి? ఏ పాయింట్ చుట్టూ తిరుగుతుంది? ప్రధాన పాత్రలు ఏంటి? అన్నది కూడా ఈ పోస్టర్‌లోనే చూపించారు. ట్రైలర్‌లోనూ ఓ వింత మాస్క్ హైలెట్ అయింది. ఇప్పుడు ఈ పోస్టర్‌లోనూ ఆ మాస్క్‌ను చూపించారు. అసలు ఆ మాస్క్ కథ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్, పోస్టర్‌ను డిజైన్ చేశారు.


ఈ చిత్రానికి ప్రసాద్ ఎస్ ఎన్ సంగీతాన్ని అందించారు. సురేష్ బాలా సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. ఎడిటర్‌గా కలైవానన్ ఆర్ వ్యవహరించారు.


నటీనటులు : భరత్, వాణి భోజన్, K.S.రవికుమార్, మీరాకృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులు


సాంకేతిక బృందం

బ్యానర్: విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ & యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ

సమర్పణ : శ్రీమతి. జగన్మోహిని & జి డిల్లి బాబు

నిర్మాత : సిహెచ్ సతీష్ కుమార్

దర్శకుడు: ఎం శక్తివేల్

కథ-స్క్రీన్ ప్లే: ఎం శక్తివేల్

మ్యూజిక్ కంపోజర్: ప్రసాద్ ఎస్ ఎన్

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సురేష్ బాలా

ఎడిటర్: కలైవానన్ ఆర్

ఆర్ట్ డైరెక్టర్: మణికందన్ శ్రీనివాసన్

యాక్షన్ కొరియోగ్రఫీ : డేంజర్ మణి

కాస్ట్యూమ్ డిజైనర్: శ్రీదేవి గోపాలకృష్ణన్

కాస్ట్యూమర్: M మొహమ్మద్ సుబియర్

మేకప్: వినోద్ సుకుమారన్

VFX సూపర్‌వైజర్: కిరణ్ రాఘవన్ (రెసోల్ FX)

ఆడియో : థింక్ మ్యూజిక్ 

PRO : నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా) 

The Lord of the Rings: The Rings of Power Teaser Trailer

ప్రైమ్ వీడియో వారి ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ అధికారిక టీజర్ ట్రెయిలర్ డెబ్యూ మరియు కీలక ఆర్ట్ తో సీజన్ రెండుతో తిరిగి వచ్చింది

సీజన్ రెండు ప్రైమ్ వీడియో పై ఆగస్ట్ 29, 2024 న తొలిసారి ప్రసారం అవుతుంది.

ఈ కొత్త సీజన్, మిడిల్-ఎర్త్ సెకండ్ ఏజ్ ను చీకటిలోకి నెట్టివేసే జే.ఆర్.ఆర్. టోల్కీన్ యొక్క ప్రముఖ ప్రతినాయకుడు, సౌరాన్ కొరకు ఒక వేదిక కానుంది.



లింక్ - 



ముంబై, ఇండియా - మే 15, 2024 — ఈ ఉదయం ప్రైమ్ వీడియో తన రాబోయే  హిట్ సీరీస్ ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ యొక్క రెండవ సీజన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసినప్పుడు న్యూయార్క్ నగరములో అమెజాన్ యొక్క ప్రారంభోత్సవ ముందస్తు ప్రదర్శనకు హాజరు అయినవారు తిరిగి మిడిల్-ఎర్త్ కు తిరిగి పంపించబడ్డారు. ఈ సీరీస్ మొదటి సీజన్ ఊహించని ప్రపంచవ్యాప్త విజయం సాధించింది మరియు ప్రైమ్ వీడియో కొరకు ఉత్తమ ఒరిజినల్ సీరీస్ లో ఒకటిగా నిలిచి, ప్రపంచము అంతటా 100 మిలియన్ లకు పైగా ప్రేక్షకులచే వీక్షించబడింది మరియు ఈనాటి వరకు ఇతర కంటెంట్ కంటే దీని ప్రారంభ విండో సమయములో ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ సైన్-అప్స్ ఎక్కువగా జరిగాయి.

సీజన్ రెండు ప్రపంచవ్యాప్తంగా గురువారం, ఆగస్ట్ 29, 2024 నాడు 240 లకు పైగా దేశాలు మరియు భూభాగాలలో అనేక భాషలలో తొలిసారి ప్రసారం అవుతుందని ప్రైమ్ వీడియో ప్రకటించింది.


 ఈరోజు ప్రపంచములోనే అతిపెద్ద సాహిత్య విలన్లలో ఒకరైన సౌరాన్ మిడిల్-ఎర్త్ కాపురస్థులను మోసగించుటలో తనకు సహాయం చేసే ఒక కొత్త రూపములో కనిపిస్తారు. ఈ పాత్రలో చార్లీ వికర్స్ మళ్ళీ నటించిన అద్భుతమైన సీజన్ రెండు కీ ఆర్ట్ కూడా విడుదల చేయబడింది.


డెబ్యూ టీజర్ ట్రెయిలర్ ప్రేక్షకులను జే.ఆర్.ఆర్. టోల్కీన్ యొక్క సెకండ్-ఏజ్ కు తిరిగి ఒక యాక్షన్-ప్యాక్డ్ ప్రయాణములోకి తీసుకెళ్తుంది మరియు సంపూర్ణ అధికారము కొరకు తన ప్రతీకార అన్వేషణను కొనసాగించడముతో సౌరాన్ యొక్క పెరిగే చెడు ఉనికి చూపుతుంది. ఈ సీరీస్ ప్రసిద్ధి చెందిన సినిమా వైభవాన్ని చూపుతూ మరియు గాలాడ్రీల్, ఎల్రాండ్, ప్రిన్స్ డ్యూరిన్ ఐవి, అరోండిర్ మరియు సెలెబ్రింబోర్ తో సహా ఫ్యాన్స్ కు ఇష్టమైన అనేక పాత్రలు తిరిగి రావడాన్ని ప్రకటిస్తూ, ఈ ఫస్ట్-లుక్ మరిన్ని రింగ్స్ యొక్క ఎంతగానో-ఎదురుచూడబడుతున్న సృష్టిని కూడా వెల్లడిస్తుంది.

ది రింగ్స్ ఆఫ్ పవర్ యొక్క సీజన్ రెండులో, సౌరాన్ తిరిగి వచ్చాడు. గాలాడ్రీల్ చే బయటకు నెట్టివేయబడి, సైన్యము లేదా మిత్రుడు లేకుండా, పెరుగుతున్న చీకటి ప్రభువు ఇప్పుడు తన బలాన్ని పునర్నిర్మించుకొనుటకు తన సొంత చాకచక్యం పైనే ఆధారపడవలసి ఉంటుంది మరియు రింగ్స్ ఆఫ్ పవర్ యొక్క సృష్టిని పర్యవేక్షించాలి, ఇది మిడిల్-ఎర్త్ యొక్క ప్రజలందర్నిని తన చెడు సంకల్పానికి కట్టిపడేసే వీలు కలిగిస్తుంది. సీజన్ ఒకటి ఐతిహాసిక పరిధి మరియు ఆశయం పై నిర్మించబడి, ఈ కొత్త సీజన్ తన ప్రియమైన మరియు హాని కలిగించే పాత్రలను ఉవ్వెత్తున ఎగసే చీకటి అలల్లోకి తోస్తూ, ప్రతి ఒక్కరిని విపత్తు అంచులలో ఉండే ఒక ప్రపంచములో తమ స్థానాన్ని కనుక్కునే సవాలు విస్తురుతుంది. దయాలు మరియు మరుగుజ్జులు, ఆర్క్స్ మరియు పురుషులు, తాంత్రికులు మరియు హార్పుట్స్…స్నేహాలు కృత్రిమమై, రాజ్యాలు పగులుబారుతుండగా, మంచి శక్తులు తమకు కావలసిన అంశాలపై నిలిచి ఉండేందుకు మరింత పరక్రమంగా పోరాడుతారు….ఒకరితో ఒకరు.

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ అఫ్ పవర్ సీజన్ రెండు ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషలలో ప్రైమ్ వీడియో పై ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది.

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ రెండు టీజర్ ట్రెయిలర్ మరియు కీలక ఆర్ట్ ఆస్తులను వీక్షించుటకు మరియు డౌన్లోడ్ చేసుకొనుటకు, అలాగే సీరీస్ గురించి అదనపు సమాచారము కొరకు, దయచేసి సందర్శించండి   Amazon MGM Studios press site

Sangeet Movie Launched Grandly

 లహరి ఫిల్మ్స్, పి.బి. స్టూడియోస్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం "సంగీత్" ఘనంగా ప్రారంభం



లహరి ఫిలిమ్స్, ఆర్.బి. స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న "సంగీత్" చిత్రం ఈరోజు పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. పలువురు సినీ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. నిహారిక కొణిదెల చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించగా, శౌర్య కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు షాట్‌కు ఎస్‌.ఎస్‌. కార్తికేయ క్లాప్‌ కొట్టారు.


'హంబుల్ పొలిటీషియన్ నోగ్‌రాజ్'తో ఎంతగానో గుర్తింపు పొందిన రచయిత-దర్శకుడు సాద్ ఖాన్ "సంగీత్" చిత్రానికి దర్శకత్వం వహిసున్నారు. ఈ సినిమా కోసం ఆకట్టుకునే కథాంశాన్ని ఎంచుకున్న ఆయన.. తెర మీద సరికొత్త అనుభూతిని పంచడం కోసం ప్రతిభగల టీంతో రాబోతున్నారు.


ప్రేమ, కుటుంబ బంధాలు, జీవితంలోని మధురానుభూతుల మేళవింపుతో "సంగీత్" చిత్రం తెరకెక్కుతోంది. సమర్థ్ పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. సమర్థ్ పాత్రలో యువ ప్రతిభావంతుడు నిఖిల్ విజయేంద్ర సింహ కనువిందు చేయనున్నారు. తన సోదరుడి వివాహ వేడుకలో సమర్థ్ జీవితం ఎలాంటి ఊహించని మలుపు తిరిగింది అనేది వినోదాత్మకంగా చూపించబోతున్నారు.


సోషల్ మీడియా ద్వారా ఎందరో అభిమానులను సంపాదించుకున్న నిఖిల్ విజయేంద్ర సింహాను "సంగీత్" చిత్రం ద్వారా లహరి ఫిల్మ్స్ పరిచయం చేస్తోంది. నిఖిల్ కి జోడిగా తేజు అశ్విని కనిపించనుంది. 


"సంగీత్" చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా నిఖిల్ విజయేంద్ర సింహా మాట్లాడుతూ.. "ఈరోజు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. 'సంగీత్' నా హృదయానికి దగ్గరగా ఉన్న కథ. కథానాయకుడిగా సమర్థ్ పాత్రలోని భావోద్వేగాలను చూపించడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రం ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. ఇందులో భాగమైనందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను. దర్శక నిర్మాతలకు, చిత్ర బృందానికి నా కృతఙ్ఞతలు." అన్నారు.


"సంగీత్"లో స్వర అనే అందమైన పాత్రలో నటిసున్న తేజు అశ్విని మాట్లాడుతూ.. "ఈ చిత్రం బాంధవ్యాల గురించి, జీవితంలోని మధురానుభూతుల గురించి ఉంటుంది. ఎంతో ప్రతిభగల చిత్ర బృందంతో కలిసి పని చేయనుండటం సంతోషంగా ఉంది. స్వర పాత్రలో నటించడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను." అన్నారు.


చిత్ర దర్శకుడు సాద్ ఖాన్ మాట్లాడుతూ.. "పెళ్లి సమయంలో ఓ కుటుంబంలో జరిగే సంఘటనలను వినోదభరితంగా చూపిస్తూ ప్రేక్షకులను నవ్వించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలుగా తమదైన ముద్ర వేసిన నవీన్, చంద్రు, శ్రవంతి గార్లతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. నిర్మాతలు ఇచ్చిన స్వేచ్ఛతో, చిత్ర బృందం సహకారంతో అద్భుతమైన చిత్రాన్ని అందిస్తామని నమ్మకంగా ఉన్నాము." అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాజ్ ఖాన్ నేతృత్వంలోని రైన్‌షైన్ కంపెనీ ఫస్ట్‌యాక్షన్‌తో కలిసి "సంగీత్" చిత్రాన్ని నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, శ్రవంతి నవీన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్‌ఎస్‌డి టీచర్, నటుడు విక్రమ్ శివ, సూర్య గణపతి, హాస్యనటుడు హర్ష చెముడు తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.


"సంగీత్" చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందని చిత్ర బృందం హామీ ఇచ్చింది.


తారాగణం: నిఖిల్ విజయేంద్ర సింహ, తేజు అశ్విని, విక్రమ్ శివ, సూర్య గణపతి, హర్ష చెముడు

రచన, దర్శకత్వం: సాద్ ఖాన్

సంగీతం: కళ్యాణ్ నాయక్

సమర్పణ: జి. మనోహరం, ఎల్. బాలకృష్ణ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మాజ్ ఖాన్

బ్యానర్స్: లహరి ఫిలిమ్స్, ఆర్.బి. స్టూడియోస్

నిర్మాతలు: నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, శ్రవంతి నవీన్

మార్కెటింగ్: పీఆర్ జోన్

పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

డిజిటల్ పీఆర్: హరీష్, దినేష్