Latest Post

Dhanush’s first look poster of Sir/Vaathi on his birthday eve leaves his fans in a tizzy

Dhanush’s first look poster of Sir/Vaathi on his birthday eve leaves his fans in a tizzy



National award-winning actor Dhanush’s Telugu-bilingual Sir/Vaathi, written and directed by Venky Atluri, is nearing completion. S Naga Vamsi and Sai Soujanya are bankrolling the prestigious project under Sithara Entertainments, Fortune Four Cinemas. Srikara Studios presents the film. Samyuktha Menon plays the female lead.


A title reveal video of the bilingual, calling the film an ambitious journey of a common man caught the attention of many, hinting at a unique, intriguing campus tale. The title posters contributed to the excitement of Dhanush’s fans. On the eve of Dhanush’s birthday, the makers of Sir/Vaathi released the first look of the film.


In the first look poster, Dhanush, surrounded by a pile of books across various shelves, is burning the midnight oil, sporting an intense expression while working on an important assignment. This look featuring Dhanush as a lecturer has only enhanced the curiosity surrounding the film’s teaser, set to release tomorrow at 6 pm (on Dhanush’s birthday). 


Here’s what the director Venky Atluri has to say about it.“Dhanush will be seen as a lecturer in Sir. The film revolves around the education system and is simultaneously being made in Tamil and Telugu. Dhanush’s unflinching support on the sets is indeed unbelievable. GV Prakash’s music and Yuvraj’s cinematography are among the major highlights of the film,” he added.


Sir is set to release in October. More details about the much-anticipated Telugu-Tamil bilingual will be announced shortly.


CAST : 

Dhanush, Samyuktha Menon,Sai Kumar,Tanikella Bharani,Samuthirakani,Thotapalli Madhu, Narra Srinivas, Pammi Sai, Hyper Aadhi, Shara, Aadukalam Naren, Ilavarasu,Motta Rajendran,Hareesh Peradi,Praveena etc 


CREW: 

Production Designer: Avinash Kolla

Editor: Navin Nooli

DOP: J Yuvraj

Music: G. V. Prakash Kumar

Action Choreographer - Venkat

Presentes: Srikara Studios

Producers: Naga Vamsi S - Sai Soujanya

Written & Directed By : Venky Atluri

Banners: Sithara Entertainments - Fortune Four Cinemas 

Pro: Lakshmi Venugopal

Director Samudra Launched Hero Vijayakrishna Govinda Bhaja Govinda Movie Glimpse

 ద‌ర్శ‌కుడు స‌ముద్ర చేతుల మీదుగా హీరో విజ‌య‌కృష్ణ "గోవింద భ‌జ గోవింద" సినిమా గ్లింప్స్ రిలీజ్




డాలీ నిహారిక ప్రెజెంట్స్ విజ‌య‌శ్రీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న చిత్రం 'గోవింద భ‌జ గోవింద‌". ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్, డైరెక్ట‌ర్ గా  సూర్య‌ కార్తికేయ  వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క‌థ‌ని కూడా ఆయ‌నే అందించారు. దుర్మార్గుడు ఫేమ్ విజ‌య‌కృష్ణ‌ హీరోగా, హీరోయిన్ ప్రియా శ్రీనివాస్ న‌టిస్తున్నారు. ఈ చిత్ర గ్లింప్స్ ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిధులుగా గ‌ణా మూవీ డైరెక్ట‌ర్  రాజ్  తాళ్లూరి..ప్ర‌ముఖ ఎడిట‌ర్ నంద‌మూరి హ‌రి, నిర్మాత ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా 


*ద‌ర్శ‌కుడు సూర్య మాట్లాడుతూ*....ఇది నా మొద‌టి సినిమా.  ఆద్యంతం హాస్య‌భ‌రితంగా ఉంటుది. ప్రేక్ష‌కులు కడుపుబ్బా న‌వ్వుతార‌ని హామీ ఇస్తున‌్నాము. అన్నారు.


*హీరో విజ‌య‌కృష్ణ మాట్లాడుతూ*....గోవింద భ‌జ గోవింద చిత్రం నాకు రెండ‌వ చిత్ర‌ం. నేను హీరోగా న‌టించిన మొద‌టి చిత్రం "దుర్మార్గుడు" ఫుల్ యాక్ష‌న్ మూవీగా ఆకట్టుకుంది. రెండో చిత్రం ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమాతో మీ ముందుకు వ‌స్తున్నా. మా సొంత బ్యానర్ లో గ‌ణా మూవీ షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్  ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని  రిలీజ్ చేస్తాము. అన్నారు. 


"గోవింద భ‌జ గోవింద" చిత్రానికి డీఓపీ కొల్లి మ‌నోహ‌ర్..మ్యూజిక్ ని ఆర్.జె.చ‌క్ర‌వ‌ర్తి అందించారు. కో డైరెక్ట‌ర్ శివ‌. ఈ చిత్రం త్వరలో రిలీజ్ కి సిద్ధమవుతోంది.

Actress Samyuktha Menon Interview About Bimbisara

 ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో ‘బింబిసార’లో చేసిందే బెస్ట్ క్యారెక్టర్ - సంయుక్తా మీనన్



వైవిధ్యమైన చిత్రాల్లోనటిస్తూ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఈ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆగస్ట్ 5న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సంయుక్తా మీనన్ ఇంటర్వ్యూ విశేషాలు..



- నేను తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నానంటే కార‌ణం.. సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తోన్న తాజా చిత్రం కార‌ణ‌మ‌ని చెప్పాలి. సుకుమార్‌స‌హా మంచి టెక్నీషియ‌న్స్ ఆ సినిమాలో భాగ‌మై ఉన్నారు. ఆ సినిమాలో నా పాత్రకు చాలా ప్రాధాన్య‌త ఉంది. నేను ఇప్పటి వ‌ర‌కు చేసిన సినిమాల్లో అదే బెస్ట్ క్యారెక్టర్ అని చెప్ప‌వ‌చ్చు. నేను చేసిన పాత్ర‌కు మ‌రొక‌రు డ‌బ్బింగ్ చెప్ప‌ట‌మ‌నేది నాకు ఇష్టం లేదు. రేపు నా పాత్ర‌ను నేను స్క్రీన్‌పై చూసుకున్న‌ప్పుడు దాన్ని ఓన్ చేసుకోగ‌ల‌గాలి. భాష తెలియ‌కుండా న‌టిస్తే ఆ పాత్ర‌తో ఉన్న క‌నెక్ష‌న్‌లో యాబై శాతాన్ని కోల్పోతాన‌ని భావించాను నా క్యారెక్ట‌ర్స్ విష‌యంలో నేను స్వార్థ‌ప‌రురాలిన‌నే చెప్పుకోవాలి. నా పాత్ర‌ల‌ను నేను అంతగా ప్రేమిస్తాను. అందుక‌నే నేను తెలుగు నేర్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాను. మ‌నం తెలుగులో మాట్లాడిన‌ప్పుడు మ‌న‌తో ఇత‌ర యూనిట్ సభ్యుల‌కు తెలియ‌ని ఓ అనుబంధం ఏర్ప‌డుతుంది.  ఆ విషయాన్ని నేను బ‌లంగా న‌మ్ముతాను. అందుక‌ని ప్రత్యేకంగా ట్యూట‌ర్‌ని పెట్టుకుని లాక్ డౌన్ స‌మయంలో తెలుగు నేర్చుకున్నాను.


- నేను యాక్ట‌ర్ కావాల‌ని ఎప్పుడూ అనుకోలేదు. చ‌దువు పూర్త‌యిన త‌ర్వాత జాబ్ చేయాల‌ని భావించాను. అయితే న‌టిగా అవ‌కాశం వ‌చ్చింది. తెలుగులో న‌టించ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. చాలా మంది ఎందుక‌ని తెలుగులో చేయ‌టం లేద‌ని కూడా అడిగారు. అయితే నిజానికి రెండు, మూడు సినిమాల‌కు ఆడిష‌న్ జ‌రిగినా అవి వ‌ర్క‌వుట్ కాలేదు.


- లాక్ డౌన్ త‌ర్వాత తెలుగు సినిమా నుంచి వ‌చ్చిన అవ‌కాశం బింబిసార‌. సినిమాను రెండు భాగాలుగా చేయ‌బోతున్నామ‌ని డైరెక్ట‌ర్ వ‌శిష్ట చెప్పారు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ 15వ చిత్రంలో అవకాశం వచ్చింది. తర్వాత భీమ్లా నాయక్ సినిమా ఛాన్స్ వచ్చింది. ఒకే రోజు రెండు సినిమాలు (భీమ్లా నాయ‌క్‌, ధ‌నుష్ మూవీ సార్‌ ) సైన్ చేశాను. ఎవ‌రూ ఊహించ‌లేదు. మా అమ్మ‌గారైతే ఆశ్చ‌ర్య‌పోయారు.


- బింబిసార టైమ్ ట్రావెల్ మూవీ. ఇందులో ఫ్లాష్ బ్యాక్‌, ప్ర‌స్తుతం సాగే క‌థ అని రెండు భాగాలుంటాయి. అందులో ప్రెజంట్ అంటూ సాగే స్టోరిలో నా పాత్ర క‌నిపిస్తుంది. కాస్త మోడ్ర‌న్‌గా కనిపించే పాత్ర‌.


- నాకు పీరియాడిక్ సినిమాలంటే చాలా ఇష్టం. డైరెక్ట‌ర్ వ‌శిష్ట ఈ క‌థ చెప్ప‌గానే నాకు అందులో పాత్ర చేయాల‌నిపించింది. అది డ్రీమ్ కూడా. ఆ విష‌యంలో కాస్త బాధ‌గా కూడా అనిపించింది.


- క‌ళ్యాణ్‌రామ్‌గారి క‌ళ్ల‌లో చాలా ప‌వ‌ర్ ఉంది. ఆయ‌న మాట‌ల కంటే ముందు క‌ళ్ల‌తోనే మాట్లాడుతారు. ఆయన్ని బింబిసారుడి పాత్ర‌లో చూడ‌గానే న‌చ్చేశారు. గంభీరంగా క‌నిపించారు. చాలా మంచి వ్య‌క్తి. షూటింగ్ అంతా పూర్త‌యిన తర్వాత న‌న్ను ప్ర‌త్యేకంగా క‌లిసి మీరు మా సినిమాలో భాగ‌మైనందుకు చాలా ఆనందంగా ఉంద‌ని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నాకెవ‌రూ అలా చెప్ప‌లేదు.


- మ‌ల‌యాళంలో సినిమాల‌ను చ‌క‌చ‌కా పూర్తి చేసేస్తుంటారు. ఈ ఏడాది నేను చేసిన భీమ్లా నాయ‌క్‌, బింబిసార, క‌డువా, సార్‌.. నాలుగు చిత్రాల్లో 20 రోజుల చొప్పున వ‌ర్క్ చేశాను. నాకు ఖాళీగా ఉండ‌టం ఇష్టం ఉండ‌దు. సినిమాలు చూస్తాను. లేదా పెద్ద స్టార్స్ ఇంట‌ర్వ్యూలు చూస్తుంటాను. స‌క్సెస్‌ఫుల్ ఎలా అయ్యార‌ని ఆలోచిస్తుంటాను. సినిమాలంటే అంత ప్యాష‌న్ నాకు.


- తెలుగు ప్రేక్ష‌కులు చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంటారు. సినిమాలను చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎమోష‌న్స్‌ను చ‌క్క‌గా చూపెడ‌తారు. మాస్ సినిమాల్లో అరిచి గోల పెడుతారు. యాక్ట‌ర్స్‌ను ఓన్ చేసుకుంటారు.


- గ్లామ‌ర్‌ను డ్రెస్‌తో క‌నెక్ట్ చేసి చూడ‌టం త‌ప్పు అనేది నా భావ‌న‌.


- ఇలాంటి పాత్ర‌లే చేయాల‌ని ముందుగా ఆలోచించ‌లేదు. న‌టిగా మంచి పాత్ర‌ల‌తో గుర్తుండిపోవాల‌ని అనుకుంటున్నాను.


- డైరెక్ట‌ర్ వ‌శిష్ట ఎన‌ర్జీ న‌చ్చుతుంది. ఖాళీగా కూర్చోరు. సెట్ అంతా తిరుగుతుంటారు. క‌రెక్ష‌న్స్ చెబుతుంటారు.


- మ‌ల‌యాళంలో ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్నాను. ఆ వివ‌రాల‌ను ఇప్పుడే చెప్ప‌లేను. తెలుగులో సార్ సినిమా చేస్తున్నాను. ఓ సాంగ్ మిన‌హా నా పాత్ర‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది.


Parampara 2 Creats Record With Digital Views

 డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో 250 మిలియన్ మినిట్స్ వ్యూస్ తో 'పరంపర' 2 వెబ్ సిరీస్ రికార్డ్



డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో లేటెస్ట్ సెన్సేషన్ అవుతోంది 'పరంపర 2' వెబ్ సిరీస్. ఈ నెల 21న స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ వెబ్ సిరీస్ కు ఓటీటీ లవర్స్, క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. కథను ఎమోషనల్ గా డ్రైవ్ చేయడంలో దర్శకులు ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ సక్సెస్ అయ్యారు. నిర్మాతలుగా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని అభిరుచి మరోసారి విజయాన్ని అందుకుంది. 


పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'పరంపర 2' వెబ్ సిరీస్ కు ఇప్పటిదాకా 250 మిలియన్ మినిట్స్ వ్యూస్ రావడం ఒక రికార్డ్ గా చెబుతున్నారు. మూడు జెనరేషన్స్ కి సంబంధించిన కథతో రూపొందిన పరంపర 2... మొదటి సీజన్ సక్సెస్ ను మరో మెట్టుకు తీసుకెళ్లింది. ఈ సెకండ్ సీజన్ లోని  స్ట్రాంగ్ ఎమోషన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. పది సినిమాలకు కావాల్సినంత స్టఫ్ ఈ వెబ్ సిరీస్ లో ఉంది అని టీమ్ చెబుతూ వస్తున్న మాటలు ఇవాళ నిజమయ్యాయి.

Vikrant Rona will become Blockbuster like Baahubali and RRR -Akkineni Nagarjuna

బాహుబ‌లి, RRRలా ‘విక్రాంత్ రోణ’ పెద్ద సూప‌ర్ హిట్ అవుతుంది :  ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అక్కినేని నాగార్జున‌




శాండిల్ వుడ్ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ’. జూలై 28న ఈ త్రీడీ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. కిచ్చా సుదీప్ న‌టించిన ఈ చిత్రాన్ని అనూప్ భండారి డైరెక్ట్ చేశారు. ఇంకా ఈ చిత్రంలో జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్‌, నిరూప్ భండారి, నీతా అశోక్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. స‌ల్మాన్ ఖాన్ ఫిలింస్ స‌మ‌ర్ప‌ణ‌లో జీ స్టూడియోస్‌, కిచ్చా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఉత్త‌రాదిన రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని షాలిని ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై జాక్ మంజునాథ్ నిర్మించారు. ఇన్‌వెనియో ఆరిజ‌న్స్ బ్యాన‌ర్‌పై అలంకార్ పాండియ‌న్ ఈ సినిమాకు స‌హ నిర్మాతగా వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో..


అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘‘కిచ్చా సుదీప్, అనూప్ అందరూ నా పాత సినిమాలను గుర్తు చేశారు. సుదీప్.. కన్నడ అబ్బాయి కాదు తెలుగువాడే. తను హైదరాబాద్‌లోనే ఉంటాడు. సుదీప్ ఇప్ప‌టికే హిందీ, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ భాష‌ల్లో న‌టించేశారు. అంద‌రికీ సుదీప్ న‌టుడిగా సుప‌రిచితుడు. ఇప్పుడు విక్రాంత్ రోణ అనే ఒకే చిత్రంతో అన్ని భాష‌ల ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నారు. సాధార‌ణంగా ఇక్క‌డ ఈ సినిమా తీశారు అని గ‌ర్వంగా ఫీలై పెద్ద పెద్ద పోస్ట‌ర్స్ పెడ‌తాం. ఇంత‌కు ముందు బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ పెట్టాం. విక్రాంత్ రోణ ట్రైల‌ర్‌ రిలీజ్ త‌ర్వాత చూసి అన్న‌పూర్ణ‌లో పెద్ద పోస్ట‌ర్ పెట్టేస్తార‌నిపించింది. ట్రైల‌ర్ అదిరిపోయింది. సినిమాను త్రీడీలో తీశార‌ని అంటున్నారు. క‌చ్చితంగా ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. మా తెలుగు ఆడియెన్స్‌కు చాలా మంచి మ‌న‌సు. ఎందుకంటే మా వాళ్ల‌కు సినిమా న‌చ్చిందంటే తీసుకెళ్లి అక్క‌డ (పైకి చూపెడుతూ) పెడ‌తారు. విక్రాంత్ సినిమాతో ఆ ఎక్స‌పీరియెన్స్‌ను మ‌రోసారి చూడ‌బోతున్నారు. సినిమా సూప‌ర్ హిట్ అవుతుంది’’ అన్నారు.


కిచ్చా సుదీప్ మాట్లాడుతూ ‘‘నేను చూసిన తొలి చిత్రం రాముడు భీముడు. మా అంకుల్ టీవీ కొన్నాడని తెలియగానే అదెలా ఉంటుందో చూడాల‌నే ఉత్సాహంతో బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన‌ప్పుడు రాముడు భీముడు సినిమా చూశాను. థియేట‌ర్‌లో నేను చూసిన తొలి చిత్రం శివ‌. నాకు భాష రాక‌పోయినా రెండు రోజుల్లోనే మూడు షోస్ చూశాను. సైకిల్ చైన్‌తో మ‌రొక‌రిని కొట్ట‌వ‌చ్చున‌ని అప్ప‌టి వ‌ర‌కు నాకు తెలియ‌లేదు. అది అప్పుడు స్ట‌యిల్‌గా మారింది. నేను చేసిన ఒక ఫోన్ కాల్‌తో నాగార్జున‌గారు ఈరోజు ఇక్క‌డ‌కు రావ‌టం  ఎంతో ఆనందంగా అనిపించింది. విక్రాంత్ రోణ సినిమాకు హైద‌రాబాద్‌తో మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే 65-70 శాతం సినిమా షూటింగ్‌ను హైద‌రాబాద్‌లోనే చిత్రీక‌రించాం. అందులో ఎక్కువ భాగం అన్న‌పూర్ణ స్టూడియోలోనే చిత్రీక‌రించాం. 500-600 మంది అన్న‌పూర్ణ స్టూడియోస్ 7 ఏక‌ర్స్‌లో ఉన్నాం. మూడు నెల‌లు అక్క‌డ షూటింగ్ చేసినా ఒక క‌రోనా కేస్ కూడా రాలేదు. ఆర్ట్ డైరెక్ట‌ర్ శిబు లేకుండా ఉండుంటే అనూప్ ప్ర‌పంచాన్ని క్రియేట్ చేసుండ‌లేడు. అలాగే అజ‌నీష్ త‌న మ్యూజిక్‌తో సినిమాను ప‌ది మెట్లు పైకి తీసుకెళ్లాడు. నిర్మాత జాక్ మంజు లేక‌పోతే స‌క్సెస్‌ఫుల్‌గా జ‌ర్నీని పూర్తి చేసేవాళ్లం కాదు. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌. విక్రాంత్ రోణ చిత్రంతో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ 3డీ ఎక్స్‌పీరియెన్స్ ఫీల్ అవుతార‌ని ప్రామిస్ చేస్తున్నాను. జూలై 28న సినిమా త్రీడీ, 2డీ టెక్నాల‌జీలో సినిమా రిలీజ్ అవుతుంది’’ అన్నారు.


చిత్ర దర్శకుడు అనూప్ భండారి మాట్లాడుతూ ‘‘విక్రాంత్ రోణ అనేది నా 20 ఏళ్ల కల. సుదీప్‌గారితో ప‌ని చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాను. నా ఫ‌స్ట్ స్క్రిప్ట్ సుదీప్‌గారి కోస‌మే రాశాను. ఇప్పుడు ఆయ‌న‌తో సినిమా చేశాను. నాకు గ‌ర్వంగా ఉంది. అక్కినేని ఫ్యామిలీతో నాకు మంచి అనుబంధం ఉంది. గీతాంజ‌లి సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశాను. ఆయ‌న ఈ సినిమాకు వ‌ర్క్ చేస్తున్న‌ప్పుడు ప్ర‌త్యేకంగా పిలిచి మ‌రీ అభినందించారు. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది. 2డీ, త్రీడీల్లో విక్రాంత్ రోణి జూలై 28న రిలీజ్ అవుతుంది’’ అన్నారు.


నిరూప్ భండారి మాట్లాడుతూ ‘‘తెలుుగలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ఇంత మంచి సినిమాలో న‌న్ను భాగం చేసిన సుదీప్‌గారికి థాంక్స్‌. ఆయ‌న నుంచి చాలా విష‌యాలు నేర్చుకున్నాను. విక్రాంత్ రోణ ప్ర‌పంచాన్ని క్రియేట్ చేసి అందులో నాకొక మంచి పాత్ర‌ను ఇచ్చిన అనూప్‌కి ధ‌న్య‌వాదాలు.నిర్మాత జాక్ మంజుగారికి థాంక్స్‌’’ అన్నారు.

జానీ మాస్ట‌ర్ మాట్లాడుతూ ‘‘అనూప్ భండారిని చూస్తుంటే నన్ను ఎంక‌రేజ్ చేసిన రాజ‌మౌళిగారు గుర్తుకు వ‌స్తుంటారు. ప్ర‌తి చిన్న విష‌యాన్ని చూసుకుని ప్లాన్‌చేసుకుని ముందుకు వెళుతుంటారు. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. కోవిడ్ స‌మ‌యంలో అన్ని చోట్ల షూటింగ్స్ ఆగిపోయాయి. కానీ నిర్మాత మంజునాథ్‌గారి వ‌ల్ల ఈ సినిమా షూటింగ్ నిర‌వ‌ధికంగా జ‌రిగింది. ఆయ‌న ఎంత క‌ష్ట‌ప‌డ్డా పైకి క‌న‌ప‌డనీయ‌కుండా ముందుండి ప్యాష‌న్‌తో న‌డిపించారు. విజ‌య్ మాస్ట‌ర్ కంపోజ్ చేసిన ఫైట్స్ అదిరిపోయాయి. నిరూప్ భండారితో ఇది వ‌ర‌కే క‌లిసి ప‌ని చేశాను. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారికి ఎలాగైతే అన్న అని మ‌న‌స్ఫూర్తిగా పిలుస్తానో.. కిచ్చా సుదీప్‌ని అలాగే పిలుస్తాను, ప్రేమిస్తాను. మ‌నిషికి ఎంత వేల్యూ ఇవ్వాలి, ప‌ని ఎలా చేయాలి అని చాలా విష‌యాల‌ను నేర్చుకున్నాను’’ అన్నారు.


ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ ‘‘కొంత మందితో పని చేస్తుంటే కొన్ని విషయాలను నేర్చకుంటుంటాం. అలాంటి వారిలో కిచ్చా సుదీప్ ఒకరు. టెక్నీషియ‌న్స్‌కు ఆయ‌న చాలా విలువ ఇస్తారు. మా నుంచి చాలా మంచి ఔట్‌పుట్ రాబ‌ట్టుకుంటారు. ఒక్కొక్క డైరెక్ట‌ర్‌ది ఒక్కో స్టైల్ ఉంటుంది. ఒక్కొక్క‌రి నుంచి విష‌యాన్ని నేర్చుకున్నాం. అలాగే అనూప్ నుంచి కూడా కొత్త విష‌యాలు నేర్చుకున్నాం. ఈ సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రికీ మ‌న‌స్ఫూర్తిగా అభినంద‌న‌లు. సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని నిర్మాత మంజుగారికి అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాం’’ అన్నారు.


నీతూ మాట్లాడుతూ ‘‘సినిమా రిలీజ్‌కి ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. చాలా ఎగ్జ‌యిటింగ్‌గా వెయిట్ చేస్తున్నాం’’ అన్నారు. 

First Day First Show Nee Navve Lyrical Song Launched

 శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్స్- మిత్ర వింద మూవీస్- 'ఫస్ట్ డే ఫస్ట్ షో' నుండి సెకండ్ సింగల్ 'నీ నవ్వే' లిరికల్ వీడియో విడుదల



ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో నిర్మిస్తున్న చిత్రం`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.


సరికొత్త కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆసక్తికరమైన ప్రమోషన్స్ కంటెంట్ తో క్యూరియాసిటీని పెంచుతోంది. ఇప్పటికే విడుదల ఫస్ట్ సింగల్, టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రాధన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి సెకండ్ లిరికల్ వీడియో 'నీ నవ్వే' పాటని తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం.


హీరో తన ప్రేయసి ప్రేమ ఊహల్లో తేలుతున్న ఈ పాట విన్న వెంటనే ఆకట్టుకుంది. ఈ పాటకు రాధన్ కంపోజ్ చేసిన ట్యూన్ చాలా యూత్ ఫుల్ గా వుంది. రామ్ మిరియాల పాడిన ఈ పట హుషారుగా సాగింది.


♪♪కొత్తగా ఊపిరందుకుంది ఊపిరి

సూటిగా సాగిపొమ్మని

ఆశగా తెల్లవారుతుంది రాతిరి

నిండుగా రేపు నాదని

నీ నవ్వే నీ చిరునవ్వే

నే కోరే వెన్నెల

ఏదైనా సాధిస్తాలే

తోడుంటే నువ్విలా

సాహసం చేయనా... నీ కోసం

దించనా నీ కోసం... అందని ఆకాశం♪ ♪

రామజోగయ్య శాస్త్రి పాటకు అందించిన సాహిత్యం మళ్ళీ మళ్ళీ పాడుకునేలా వుంది. లిరికల్ వీడియోలో చూపించిన షూటింగ్ విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. శ్రీకాంత్ రెడ్డి కూల్ ఫెర్ఫార్మెన్స్, సంచితా బషు క్యూట్ స్మైల్ అలరిస్తున్నాయి.    


వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, మాధవ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.


తారాగణం: శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సివిఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్,  సాయి చరణ్ బొజ్జా


సాంకేతిక విభాగం

సమర్పణ: ఏడిద శ్రీరామ్

కథ: అనుదీప్ కెవి

నిర్మాత: శ్రీజ ఏడిద

దర్శకత్వం: వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పి

స్క్రీన్ ప్లే: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్, కళ్యాణ్

డైలాగ్స్: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్

సంగీతం: రాధన్

డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి

ఎడిటర్: మాధవ్

పీఆర్వో : వంశీ-శేఖర్

Ditector Sarath Mandava Interview About Ramarao on Duty

 'రామారావు ఆన్ డ్యూటీ' లార్జర్ దెన్ లైఫ్ యూనిక్ థ్రిల్లర్ : శరత్ మండవ ఇంటర్వ్యూ 



మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ'.  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు సిద్ధమౌతున్న నేపధ్యంలో దర్శకుడు శరత్ మండవ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్ర విశేషాలివి.


రవితేజ ఏం డ్యూటీ చేయబోతున్నారు ? 

'రామారావు ఆన్ డ్యూటీ' రవితేజ లాంటి మాస్ స్టార్ చేస్తున్న లార్జర్ దెన్ లైఫ్ ఇన్వెస్ట్ గేటివ్ థ్రిల్లర్. ఒక మిస్సింగ్ కేసుని పోలీసులు, లేదా క్రైమ్ డిపార్ట్మెంట్ డీల్ చేస్తుంది. కానీ సివిల్ ఆఫీసర్ గా రామారావు ఈ కేసుని ఎందుకు డీల్ చేశాడనేది ఇందులో చాలా యునిక్ పాయింట్. 


కథలో ఇసుక మాఫియా కీలకంగా ఉంటుందా ?

ప్రత్యేకంగా ఇసుక మాఫియా అని లేదు. కలెక్టరేట్ తో ముడిపడిన విభాగాలన్నీటికీ చాలా వ్యవస్థలపై ప్రత్యేక అధికారాలు వుంటాయి. కోర్టులు పని చేయనప్పుడు కలెక్టరేట్ కు ఆదేశాలు ఇచ్చే హక్కు వుంటుంది. కథలో ఆ సీన్ కి సంబధించిన అంశం వచ్చినపుడు దాని గురించి కొంత చెప్పడం వుంటుంది.


రామారావు ఆన్ డ్యూటీ కథ ఎప్పటినుండి మీ ఆలోచనలో వుంది ? 

కథలు ఎప్పుడూ మనసులో తిరుగుతూనే వుంటాయి. కొన్ని పరిణితి చెందుతుంటాయి. ఏదో ఒక హుక్ పాయింట్ దొరికినప్పుడు పూర్తిగా రాసేస్తాం. ఇది కూడా నాలుగేళ్ల క్రితం నుండి వున్న ఆలోచన. రవితేజ గారు కథ లోకి వచ్చిన తర్వాత ఆయన ఇమేజ్ కి తగ్గకొన్ని మార్పులు చేయడం జరిగింది.


ట్రైలర్ చూస్తుంటే యాక్షన్ ఎక్కువగా వుంది. కానీ రవితేజ గారు అంటే ఆడియన్స్ ఎంటర్ టైన్మెంట్ అని ఆశిస్తారు.. ఇందులో అది ఎంత శాతంలో వుంటుంది ?

ఎంటర్ టైన్మెంట్ అంటే కామెడీ అని నేను అనుకోవడం లేదు. ఆడియన్స్ ని యంగేజ్ చేయడమే ఎంటర్ టైన్మెంట్. ఇందులో ఫన్ ఫ్యాక్టర్ కూడా వుంటుంది. 


రవితేజ సినిమా అంటే మాస్ ఎంటర్ టైన్మెంట్.  అందులో కూడా కొత్తదనం కోరుకుంటారు ఆడియన్స్. రామారావు ఆన్ డ్యూటీ లో వున్న కొత్తదనం ఏమిటి? 

కథ చాలా యునిక్ గా వుంటుంది. పాత్ బ్రేకింగ్ కథ అని చెప్పను కానీ చాలా డిఫరెంట్ గా వుంటుదని మాత్రం చెప్పగలను. రవితేజ గారి గత సినిమాల ఛాయలని రిపీట్ కాకుండా ఉండటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. 


2016 లో వచ్చిన మీ మొదటి సినిమా కేఓ 2 తర్వాత ఇంత విరామం రావడానికి కారణం ? 

కేఓ 2 తర్వాత కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే పెద్ద హీరోలకు ఎప్పుడూ ఒక లైనప్ వుంటుంది. ఆ లైన్ లో ఏదైనా డ్రాప్ అయితే మన సినిమా ముందుకు వస్తుంది. మధ్యలో విశాల్ గారితో ఒక ప్రాజెక్ట్ చర్చలు జరిగాయి. తర్వాత కరోనా వచ్చింది.   రామారావు ఆన్ డ్యూటీ కూడా చాలా రోజుల క్రితమే రవితేజ గారి చెప్పాను.


'' రామారావు ఆన్ డ్యూటీ '' టైటిల్ గురించి చెప్పండి ? 

 రామారావు అనేది పవర్ ఫుల్ పేరు. ఆ పేరుకి పరిచయం అవసరం లేదు. పెద్దాయన లేకపోయినా ఒక సర్వే పెడితే నెంబర్ వన్ తెలుగు పర్సనాలిటీ గా ఆయన పేరు వచ్చింది.  తర్వాత అదే పేరుతో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గారు బిగ్ హీరో. అలాగే కేటీఆర్ గారు కూడా గ్రేట్ లీడర్. ''రామారావు' అనేది ఒక స్ఫూర్తిని నింపే వ్యక్తిత్వం. అందుకే ఈ పాత్రకు రామారావు అని పేరు పెట్టాను.


వేణు తొట్టంపూడి గారు ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు? 

ఇందులో చాలా కీలకమైన సిఐ పాత్ర వుంది. ఈ పాత్రకు ఎవరైతే బావుంటుదని ఆలోచిస్తున్నప్పుడు వేణు గారు స్ట్రయిక్ అయ్యారు. ఆయన సినిమాలు, వీడియోలు ఇప్పటికీ చాలా పాపులర్. సోషల్ మీడియాలో కనిపిస్తూనే వుంటాయి. స్వయంవరం లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన హీరో వేణు గారు. ఈ పాత్రకు ఆయన అయితే బావుంటుదని వెళ్లి ఆయన్ని కలిశాను. లక్కీగా ఆయన ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు. ఎమోషన్స్ ని అద్భుతంగా పడించే నటుడాయన. రామారావు ఆన్ డ్యూటీలో ఆయన పాత్ర చాలా ఇంటరెస్టింగ్ గా వుంటుంది. 


నిర్మాతల సహకారం ఎలా వుంది ? 

సుధాకర్ చెరకూరి, శ్రీకాంత్ గారు అద్భుతమైన నిర్మాతలు. మంచి సినిమా చేయాలనే తపనతో వుంటారు. కరోనా లాంటి ప్రతికూల పరిస్థితిలో కూడా ఈ సినిమాని ఇంత గ్రాండ్ గా ప్రేక్షకులు ముందుకు తీసుకురావడం వారి గొప్ప సంకల్పం వలనే సాధ్యమైయింది. సినిమాని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు.  


ఇది యధార్ధ సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన చిత్రమా ? 

అవును.. కొన్ని యధార్ధ సంఘటనలు ఆధారంగా సినిమా రూపొందించాం. అందులో ఒక సంఘటన నా అనుభవంలో కూడా వుంది. 


రజిషా విజయన్ ని తీసుకోవాలని ఎలా అనిపించింది ? 

మాళిని పాత్రకు గ్లామర్ కంటే ఎమోషనల్ కోషియంట్ ఎక్కువ వుండే ఒక యునిక్ నటి కావాలనిపించింది. రజిషా విజయన్ ఆ పాత్రకు సరిగ్గా నప్పుతుందని అనిపించింది. మొదట ఆమె ఒప్పుకోలేదు. కథ పూర్తిగా చెప్పిన తర్వాత ఆమెకు చాలా నచ్చింది. చేసిన తర్వాత నా పాత్రకి సంబధించిన సీన్లు ఏమైనా డిలిట్ చేస్తారా అని అడిగింది. అలాంటిది ఏమీ వుండదని హామీ ఇచ్చాను( నవ్వుతూ) 


ఇందులో ఐదు మంది స్టంట్ మాస్టర్లని పెట్టడానికి కారణం ? 

ఇందులో ఫైట్లు అన్నీ కథలోనే వస్తాయి. నిజానికి పెద్ద స్టంట్ మాస్టర్లు మల్టిఫుల్ ఒప్పుకోరు. కానీ నేను రిక్వస్ట్ చేశాను. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లని డిజైన్ చేశారు.


సంగీత దర్శకుడు సామ్ సిఎస్ గురించి ? 

విక్రమ్ వేద లో సామ్ సిఎస్ వర్క్ అద్భుతంగా వుంటుంది., ఖైదీ సినిమా చూసిన తర్వాత నే రవితేజ గారికి ఫోన్ చేసి సామ్ సిఎస్ ని అనుకుంటున్నాని చెప్పాను. రవితేజ గారికి కూడా సామ్ అంటే అప్పటికే గురి వుంది. సామ్ ని ఇక్కడి పిలించి ప్రాజెక్ట్ గురించి చెప్పాను. మేము మొదట లాక్ చేసిన టెక్నిషియన్ సామ్ సిఎస్.  


సీసా పాట గురించి ? 

సీమ ప్రాంతంలో 'కులుకు భజన' చాలా పాపులర్. ఈ కాన్సెప్ట్ ని పెట్టాలని భావించాను. దానిని ఇంకా కాస్త వినోదాత్మకంగా ఉండేలా కొన్ని ట్యూన్స్ అనుకున్నాం. చంద్రబోస్ గారిని కలిసి ఈ కాన్సెప్ట్ ని చెప్పా. ఆయన కొంత సమయం తీసుకొని సీసా పాటని రాశారు. 


2 గంటల30 నిమిషాల రన్ టైమ్ వచ్చింది. ఆడియన్స్ ని యంగేజ్ చేయగలరని భావిస్తున్నారా ? 

కథని బలంగా నమ్ముతాను. కథ నుండి పక్కకు వెళ్ళను. నా వరకూ కథ ఒక దేవాలయం లాంటింది. దానికంటూ ఒక నిర్మాణం వుంటుంది. లెజండరీ దర్శకులు దాసరి నారాయణ రావు గారి మాటలు నాకు స్ఫూర్తి. ''ఒక కథ రాసేటప్పుడు ఆ కథే తనకు కావాల్సిన అన్ని సమకూర్చుకుని పూర్తి చెసుకుంటుంది. హిట్, ఫ్లాప్ మన చేతిలో లేదు, మంచి చెడు మాత్రం మన చేతిలో వుంటుంది'' దాసరి గారు చెప్పిన ఈ మాటలు లైఫ్ టైం పాటిస్తాను. నేను టీం వర్క్ ని నమ్ముతాను. ఈ చిత్రంలో అద్భుతమైన టీమ్ వర్క్ వుంది.


సోషల్ మీడియాపై ఘాటు వ్యాఖ్యలు చేయడయానికి కారణం ? 

నా అభిప్రాయాన్ని చెప్పాను. సినిమా అనేది వందలాది మంది సమిష్టి కృషి. సినిమాని పూర్తి గా చూసి అర్ధం చేసుకొని విశ్లేషించుకొని దాని గురించి రాయడంలో ఎలాంటి ఆభ్యంతరం లేదు. రివ్యూలు వుండాలి. రివ్యూలు చదివి చాలా నేర్చుకున్నా. చాలా మంది మంచి రివ్యూ రైటర్స్ తెలుగులో వున్నారు. కానీ సినిమా జరుగుతుండగానే స్క్రీన్ షాట్ తీసి ఫస్ట్ సాంగ్, ఫస్ట్ ఫైట్ అని రివ్యూలు ఇచ్చే విధానం మాత్రం సరికాదు. ప్రోడక్ట్ అనేది వినియోగదారుడికి చేరకముందే ఇంత నెగిటివిటీ ఎందుకు ? అనే బాధతోనే నా అభిప్రాయం చెప్పాను.


''రామారావు ఆన్ డ్యూటీ ' కి సీక్వెల్ ఉంటుందా ? 

ప్రస్తుతానికి సీక్వెల్ ఆలోచన లేదు. ఐతే ఇది బర్నింగ్ ఇష్యూ. దిన్ని కంటిన్యూ చేద్దామని ఆసక్తితో ఎవరైనా వస్తే .,. నా ఆలోచనలు పంచుకోవడానికి రెడీగా వుంటాను.


ఏ జోనర్ లో మీకు బలం ఎక్కువని భావిస్తున్నారు ? 

నా బలం ఏమిటో తెలీదు కానీ.,.నా బలహీనత తెలుసు. శేఖర్ కమ్ముల గారి లాంటి సినిమాలు చేయలేను. లైటర్ వెయిన్ ఎమోషన్స్ ని డీల్ చేయడం నా వరకూ కష్టం.  యాక్షన్, థ్రిల్లర్స్ చేయగలను. ఒక ఫైట్ లేకుండా కూడా యాక్షన్ సినిమా చేయొచ్చు. రాజ్ కుమార్ హిరాణీ తరహాలో ఒక కథ రాసుకున్నా. 


కొత్తగా చేయబోయే సినిమాలు ? 

ఇంకా ఏదీ అనుకోలేదు. ప్రస్తుతం '' రామారావు ఆన్ డ్యూటీ 'పైనే నా దృష్టి

Nithiin 'Macherla Action Dhamki' Released

 Nithiin, Sreshth Movies’ Macherla Niyojakavargam 'Macherla Action Dhamki' Released



Macherla Niyojakavargam starring the versatile star Nithiin is carrying exceptional buzz, thanks to all the impressive promotional material. All the three songs released so far by the team got tremendous response. As the release date is approaching, the team decided to step on the peddle and released the Macherla Action Dhamki.


It is a small cut of a popular action sequence that ticks of all positives of a Perfect Mass Entertainer. It has a good dialogue, excellent action, and mindblowing background score.


The dialogue - 'Mahabharatamlo Dharamanni Kaapadatam kosam Lakshaladhi mandhi thama samadhulanu punadhuluga vesaru.. Macherla Niyojakavargamlo Dharmanni kapadataniki naa samadhini punadhiga veyyadaniki... nenu siddham' not only establishes the hero's character of N Siddharth Reddy IAS but also adds right buildup to the film.


Even before the audience come out of the mass mania created by the Action Dhamki, the team is releasing the theatrical trailer on 30th of this month at a massive Public event in Guntur. Produced by Sudhakar Reddy and Nikitha Reddy on Sreshth Movies banner and presented by Rajkumar Akella, the team is helmed by MS Raja Shekhar Reddy.


Krithi Shetty and Catherine Tresa are the heroines in the movie, where actress Anjali will be seen sizzling in a special number Ra Ra Reddy.


Mahati Swara Sagar has rendered soundtracks. Prasad Murella is the camera man, while Mamidala Thirupathi has provided dialogues and Sahi Suresh is the art director. Kotagiri Venkateswara Rao is the editor.


Macherla Niyojakavargam is gearing up for a grand release worldwide on August 12th.


Cast: Nithiin, Krithi Shetty, Catherine Tresa, Samuthirakani, Anjali (special song) and others


Technical Crew:

Written & Directed by: MS Raja Shekhar Reddy

Producers: Sudhakar Reddy, Nikitha Reddy

Banner: Sreshth Movies

Presents Rajkumar Akella

Music: Mahati Swara Sagar

DOP: Prasad Murella

Editor: Kotagiri Venkateswara Rao

Line Producer: G Hari

Dialogues: Mamidala Thirupathi

Art Director: Sahi Suresh

Fights: Venkat

PRO: Vamsi-Shekar

Ariana Viviana Entering in to TFI as Singers

 "జిన్నా" చిత్రంలో అనూప్ స్వరపరచిన స్నేహం మీద సాగే  పాట ద్వారా సింగర్స్ గా పరిచమైన అరియనా, వివియనా 



సంగీతం పరబ్రహ్మ స్వరూపం! అని అంటారు.అనూప్ మ్యూజిక్ హిస్టరీకి ఒక ప్రత్యేక శైలి, స్థానం ఉన్నాయి. ఫాస్ట్ బీట్, మెలొడీ, ఇన్ స్పైరింగ్ సాంగ్స్, పేట్రియాటిక్, ఫోక్ సాంగ్స్..ఇలా పాటల కంపోజిషన్ లో అనూప్ టచ్ చేయని జానర్ లేదు, మెప్పించని తరహా లేదు. అప్పట్లో క్యాసెట్ల అమ్మకాల్లో ట్రిపుల్ ప్లాటినం ఫంక్షన్లు చూసిన అనూప్..డిజిటల్ యుగంలో వందల మిలియన్ వ్యూస్ పాటలను అందించి మారిన ట్రెండ్ లోనూ మారని తన మ్యూజిక్ టాలెంట్ ను చూపిస్తున్నారు. "జై" సినిమాతో మొదలైన అనూప్ స్వర ప్రస్థానం పద్దెనిమిదేళ్లుగా తనదైన బాణీ పలికిస్తూ తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో కొనసాగుతూ అటు స్టార్ కథానాయకుల చిత్రాలకు ఇటు నవతరం సినిమాలకు స్వరాలు అందిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు అనూప్ రూబెన్స్.


జై, ధైర్యం నుంచి మొదలైన అనూప్ రూబెన్స్ కెరీర్ విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రేమకావాలి’ చిత్రం ద్వారా మరో మలుపు తీసుకుంది.ఈ సినిమాతోనే ఆది సాయికుమార్ హీరోగా పరిచయం అయ్యాడు.ఈ చిత్ర విజయంతో అనూప్ పై ఎంతోమంది పేరున్న దర్శక, నిర్మాతలు తమ చిత్రాలకు సంగీతం చేసేందుకు ఎర్రతివాచీ పరచి ఆయనను ఆహ్వానించారు. ఇష్క్’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన నితిన్ తన ‘గుండె జారి గల్లంతయ్యిందే’ కు కూడా అనూప్ నే ఎంచుకున్నారు. ఆ తరువాత లవ్ లీ, సునీల్ పూలరంగడు భీమవరం బుల్లోడు,నటసింహ నందమూరి బాలకృష్ణతో పైసా వసూల్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,విక్తరీ వెంకటేష్ లు నటించిన గోపాల గోపాల…మళ్ళీ పవర్ స్టార్ తో కాటమరాయుడు, అఖిల్ తొలి చిత్రం ‘అఖిల్’, రానా ‘నేనే రాజు- నేనే మంత్రి’ వంటి జనరంజక చిత్రాలకు అనూప్ రూబెన్స్ బాణీలు దన్నుగా నిలిచాయి. ఈ సినిమాలన్నీ మంచి విజయం సాధించడంతో కింగ్ అక్కినేని నాగార్జున ‘మనం’కు స్వరకల్పన చేసే అవకాశం అనూప్ కు ఇచ్చారు .కింగ్ అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల స్టార్ హీరోస్ నటించిన ఏకైక చిత్రం ‘మనం’కు సంగీతం సమకూర్చడం నిజంగా అనూప్ కు లభించిన అదృష్టమనే చెప్పాలి. హార్ట్ ఎటాక్, పిల్లా నువ్వు లేని జీవితం,యంగ్ టైగర్ చిత్రం టెంపర్, 90 Ml, హెలో, అఖిల్, సీత, మహానుభావుడు, మంచి రోజులు వచ్చాయి, విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం 2 చిత్రాలు వరుసగా విజయం సాధించడం తో అనూప్ బాణీలకూ జనం జేజేలు పలికారు. అనూప్ నేపద్య సంగీతంమూ ఎంతో ఆహ్లాదాన్ని పంచేలా ఉంటుంది. ప్రతి పాటకీ చాలా తక్కువగా పాశ్చాత్య వాయిద్య పరికరాలను వినియోగిస్తూ చాలా సహజమైన వాయిద్యాలతో సంగీతం అందించే ప్రయత్నం చేస్తూ అచ్చు స్వచ్ఛమైన పల్లెటూరి అనుభూతిని కలిగిస్తుంటాడు అనూప్. "30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?" చిత్రంలోని నీలి  నీలి ఆకాశం 274 మిలియన్ వ్యూస్ సాధించి, పాండమిక్ లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. "మనం" తర్వాత నటనిర్మాత నాగార్జున తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుతూ "సోగ్గాడే చిన్ని నాయనా" వంటి క్లాస్ హిట్స్ ఇవ్వడం అనూప్ కే సాధ్యమైంది. దీని సీక్వెల్ గా వచ్చిన  బంగార్రాజు చిత్రాన్ని కూడా మ్యూజికల్ హిట్ గానూ మలిచారు అనూప్.ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజశేఖర్, జీవిత ల సినిమా "శేఖర్" చిత్రం లోని పాటలు సైతం ప్రేక్షకుల మదిని దోచాయి. డైనమిక్ స్టార్ మంచు విష్ణు నటిస్తున్న "జిన్నా" కు  అనూప్ స్వరాలు సమాకూర్చాడు. ఈ సినిమా ద్వారా మంచు విష్ణు కూతుళ్లు అరియనా, వివియానాలు సింగర్స్ గా పరిచయం అవుతుండడం విశేషం. తన కూతుళ్లు ఆలపించిన స్నేహం మీద సాగే ఈ పాటను మంచు విష్ణు తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ పాట ప్రేక్షకులనుండి మంచి స్పందన లభించడమే కాక  ప్రస్తుతం మంచి ట్రెండింగ్ లో ఉంది. సామాజిక అనుసంధాన వేదిక ప్రభావం మొదలయ్యాక సినిమా సంగీతం ఒక కొత్త ట్రెండ్ ను చూస్తుంది. ఒక్కొక్క పాట ఒక్కొక్కసారి విడుదల అవుతూ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతుంది.ఈ ట్రెండ్ మంచి పరిణామం.ఇది వరకు సి. డీ లు పెట్టుకొని మొత్తం పాటలు వినేవారు. ఇప్పుడు ఒక్కొక్క పాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ అశ్వాదిస్తున్నాము. ప్రతి పాట శ్రోతల్ని ఎదో సందర్భంలో సృశిస్తూ సినిమాను చూడాలనే ఆసక్తి పెంచడంలో ఇటీవల పాటలు కీలక పాత్ర పోసిస్తాయని చెప్పచ్చు. ఇప్పుడున్న ట్రెండ్ లో పాటలు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతూ ఎంతో ప్రజాధరణ పొందుతున్నాయి. ప్రస్తుతం డైనమిక్ స్టార్ మంచు విష్ణు నటిస్తున్న "జిన్నా" సినిమాతో పాటు మరి కొన్ని సినిమాలు జనం ముందుకు రావలసి ఉన్నాయి. ఇప్పటికీ తన దరికి వచ్చిన చిత్రాలకు న్యాయం చేయాలనే పరి తపిస్తుంటారు అనూప్. భవిష్యత్ లోనూ తన బాణీలతో సంగీత ప్రియుల్ని అనూప్ మురిపిస్తూనే ఉంటారని ఆశిద్దాం.

ZEE5 announces 'Hello World' streams from August 12

 ZEE5 announces 'Hello World', a new Original



The 8-episode series streams from August 12


Hyderabad, 25th July, 2022: ZEE5 has been relentlessly dishing out a wide variety of content in various formats in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Marathi, Gujarathi, Bengali and other languages. ZEE5 has made a name for itself nationwide as a prominent streaming platform since its inception. The streaming giant has been streaming 'Roudram Ranam Rudhiram' to a blockbuster response. On the web series front, ZEE5 has been spectacular. After presenting the comedy-drama 'Oka Chinna Family Story' from Pink Elephant Pictures, 'Loser 2' from Annapurna Studios stable, 'Gaalivaana' from BBC Studios and NorthStar Entertainment, it most recently came out with 'Recce' and 'Maa Neella Tank'.


And ZEE5 is gearing up to present a new web series now. This time, the streaming giant is coming out with an office drama. Workplace dramas are rare to come by and this 8-episode web series promises to be slice-of-life and relatable. What is 'Hello World' about? "It is the story of eight youngsters who step into a large IT company hoping that their struggles are all behind them, only to find that life has a lot more in store than they had imagined," says director Sivasai Vardhan Jaladanki, who has previously made 'Geetha Subramanyam'.


'Hello World' is expected to explore the psyche of young techies who step into the corporate world with a twinkle in their eyes. Surely, this is something ZEE5's patrons are going to love.


The series will start streaming from August 12.   


Cast:


ARYAN RAJESH as RAGAV

SADAA as PRARDHANA

RAM NITIN as SIDDARTH

NAYAN KARISHMA as MEGHANA

SUDHARSAN GOVIND as VARUN

NITYA SHETTY as PRAVALLIKA

NIKIL V SIMHA as RAHUL

APOORVA RAO as VARSHA

GEELA ANIL as SURESH

SNEHAL S KAMAT as AMRUTHA

RAVI VARMA as DEBASHISH

JAYAPRAKASH as ANAND



Crew:


DIRECTOR: SIVASAI VARDHAN JALADANKI

SCRIPT WRITER: SIVASAI VARDHAN JALADANKI

CINEMATOGRAPHER: EDUROLU RAJU

MUSIC DIRECTOR: PK DHANDI

EDITOR: PRAVEEN PUDI

PRODUCTION DESIGNER: SHIVA KUMAR MACHA

COSTUME DESIGNER: AANSHI GUPTA

EXECUTIVE PRODUCER: MANYAM RAMESH

Deepika has a fierce role in Pathaan that will blow everyone’s mind!’ : Siddharth Anand

 ‘Deepika has a fierce role in Pathaan that will blow everyone’s mind!’ : Siddharth Anand



Motion Poster: https://youtube.com/shorts/u2ORovK6kPk


Yash Raj Films has closely guarded every single element of their marquee tentpole Pathaan, starring Shah Rukh Khan, Deepika Padukone and John Abraham. The Siddharth Anand directorial has been riding on tremendous buzz and anticipation and the makers decided to release the first look of SRK in and as Pathaan on June 25, that incidentally marked 30 glorious years of the actor’s incredible career. Today, on July 25th, which marks six months to Pathaan, YRF has released a glimpse of the leading lady of Pathaan and Deepika Padukone is looking fierce in it!


Director Siddharth Anand says, “Deepika Padukone is a massive, massive star (I have to say it twice) and her presence in Pathaan makes our film even more exciting and grand. No one has yet seen her look in Pathaan and we are thrilled to present a glimpse of her in our action spectacle. Deepika has a fierce role that will blow everyone’s mind.”


Siddharth claims that Deepika will have a magnetic aura in Pathaan. He says, “I have worked with her very early in her career and have seen her evolve over the years into a completely different and hungry actor. The first look of Deepika Padukone in Pathaan hints at her magnetic aura that people will be a witness to.”


Siddharth feels Deepika is a true pan India superstar and her presence in Pathaan makes the project supremely exciting.


He says, “Deepika is a rare actor with a pan Indian appeal like no other and having her in a film, looking the way she is, is a huge USP. We wanted to cast someone who has an appeal across gender and age and there is no bigger star in India today than Deepika Padukone. We can’t wait to unveil her character in the film when it releases only on the big screen on Jan 25th, 2023.”


SRK and Deepika is one of the biggest all-time on-screen pairings, given their blockbusters Om Shanti Om, Chennai Express, and Happy New Year. They recently sizzled in Spain as leaked photos from the sets of Pathaan took the internet by storm. The glamourous duo shot a hugely mounted song in Mallorca as SRK was papped flaunting an eight-pack and DP in her perfect bikini bod.


Pathaan is set to release on January 25, 2023, in Hindi, Tamil, and Telugu! 


Laalsinghchaddha Press meet Held Grandly

 మెగాస్టార్ చిరంజీవి గారు అవకాశం ఇస్తే తెలుగులో నటిస్తా..బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్



మెగాస్టార్ చిరంజీవి సమర్పణ (తెలుగు) లో వయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ పతకంపై మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య నటీనటులుగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "లాల్ సింగ్ చెడ్డా". ఇందులో టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య బాలరాజుగా  కీలక పాత్రలో అమీర్ ఖాన్ తో కలిసి సైనికుడిగా కనిపిస్తున్నారు .ఇప్పటికే బాలీవుడ్ లో విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడం విశేషం .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా  హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో జరిగిన పాత్రికేయుల సమావేశం లో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగచైతన్యలు పాల్గొన్నారు.


మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్  మాట్లాడుతూ... 'ఇదివరకు తెలుగు డబ్బింగ్ సినిమాలకు తక్కువ మార్కెట్ ఉండేది.అయితే ఇప్పుడు తెలుగు సినిమాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.అందుకే  తెలుగులో మా సినిమాను రిలీజ్ చెయ్యడానికి చిరంజీవిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సల్మాన్ ఖాన్ చిత్రంలో చిరంజీవి నటిస్తున్నాడు. చిరంజీవి నాకు కూడా అవకాశం ఇస్తే నేను తనతో నటించడానికి సిద్ధంగా ఉన్నానని' తెలిపారు.



మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. 'అమీర్ ఖాన్  ఈ సినిమా ప్రీమియర్ చూడమంటే సుకుమార్, రాజమౌళి, కింగ్ నాగార్జునతో చూశాను. చూసిన తరువాత తేరుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. అమీర్ ఖాన్ పెర్ఫార్మన్స్ ఎక్సట్రార్ధినరీ గా ఉంది. అమీర్ ఖాన్ పాత్రతో పాటు .. చైతన్య పాత్ర కు బాగా ఎమోషనల్ అయ్యాను. ఇలాంటి సినిమాలు ఎక్స్పరమెంటల్ తో పూర్తి డెడికేటెడ్ సినిమాలు తియ్యాలి అంటే అమీర్ ఖాన్ వల్లే అవ్వాలి. నేనైతే ఇలాంటి సినిమాలు తియ్యలేను. సినిమా బాగుందని అమీర్ ఖాన్ కు చెప్పడంతో  హ్యాపీ ఫిల్ అయ్యాడు. తను తెలుగులో విడుదల చేయడానికి హెల్ప్ అడగడంతో సినిమా కూడా బాగుండడంతో తెలుగులో ఈ సినిమాను   సమర్పిస్తున్నాను. తెలుగులో కూడా ప్రేక్షకుల మన్ననులు అందుకుంటుందని' అన్నారు.



అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ.. 'ఈ సినిమా నా కేరెర్ కు హెల్ప్ అవుతుందనే లెక్కలతో ఈ సినిమా చెయ్యలేదు. అమీర్ ఖాన్ లాంటి వారితో నటించడం గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఇందులో నా పాత్ర నిడివి 30 నిముషాలు ఉంటుంది. ఈ సినిమా విడుదల అయిన తరువాత  నా పాత్రను బాలీవుడ్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని' అన్నారు.


న‌టీన‌టులు –

ఆమిర్ ఖాన్, క‌రీనా కపూర్, నాగ చైత‌న్య త‌దిత‌రులు


సాంకేతిక నిపుణులు

స‌మ‌ర్ప‌ణ – మెగాస్టార్ చిరంజీవి

బ్యాన‌ర్లు – వయకామ్ 18 స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్

నిర్మాత‌లు – ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే

ద‌ర్శ‌క‌త్వం – అద్వైత్ చంద‌న్

సంగీతం – ప్రీతిమ్

భార‌తీయ చిత్రానుక‌ర‌ణ – అతుల్ కుల్ క‌ర్ణి

పి.. ఆర్. ఓ(తెలుగు) : ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Nara Rohit Birthday Celebrations Held Grandly

 ఘనంగా హీరో నారా రోహిత్ జన్మదిన వేడుకలు ...  



                                                                            

                       ఈ రోజు జులై 25న హీరో నారా రోహిత్ జన్మదినం సందర్భంగా బంధు మిత్రులతో పాటు సన్నిహితులు అభిమానులు ఆనందంగా బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు రెండు తెలుగు రాష్టాల అభిమానులు ఉదయం నుండి దేవాలయాలలో నారా రోహిత్ పేరు మీద ప్రత్యేక పూజలు అలాగే అనాధశరణాలయాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు, హైదరాబాద్ లోని కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు హీరో నారా రోహిత్ పాల్గొని కేక్ కట్ చేసారు,ఈ కార్యక్రంలో  "నచ్చింది గర్ల్ ఫ్రెండ్ " హీరో ఉదయ్ శంకర్, నిర్మాత అట్లూరి నారాయణరావు , నారా రోహిత్ స్నేహితుడు తాడికొండ సాయి కృష్ణ , రోహిత్ అభిమాన సంఘ నాయకులు వీరపనేని శివ చైతన్య ,రాజా నరేంద్ర , గుంటూరు శివ , గాలి సృజన తతరులు పాల్గొని నారా రోహిత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.  

Samayanike Video Song From Aadi Saikumar's Tees Maar Khan is out

Samayanike Video Song From Aadi Saikumar's Tees Maar Khan is out



Team Tees Maar Khan is leaving no stoned unturned in promoting the movie. They are also making sure; every promotional stuff will impress larger sections. Teaser, trailer and second teaser have received massive response. As part of promotions, the film’s romantic song Samayanike was dropped.


While the teasers and trailer showed the mass and action side of the movie, the song shows the romantic side. Aadi Saikumar went shirtless and flaunted his abs, wherein Payal Rajput is a stunner. The actress looked glamorous with her skin-show. In fact, their romance on the beach is scorching.


Sai Kartheek has scored a perfect song and his composition is laudable. Shruti’s vocals add enchanting factor, while Rakendu Mouli’s lyrics are too good for the song of the genre. The superb composition, wonderful singing, catchy lyrics and sizzling chemistry of the lead pair make it one of the best romantic songs in recent times. Cinematography is by Bal Reddy.


Director Kalyanji Gogana is presenting Aadi Saikumar in a never seen before mass and action-packed avatar in Tees Maar Khan which is gearing up for its theatrical release on August 19th.


Produced by Popular Businessman Nagam Tirupathi Reddy under Vision Cinemas, Manikanth is the editor of the movie.


Cast: Aadi Saikumar, Payal Rajput, Sunil, Poorna and others.


Crew:

Banner: Vision Cinemas

Director: Kalyanji Gogana 

Producer: Nagam Tirupathi Reddy

Executive Producer: Tirumal Yella

Music: Sai Kartheek

Editor: Manikanth

Cinematographer: Bal Reddy

PRO: Sai Satish, Parvataneni Rambabu 

Rajahmundry Rose Milk Title Song released

 Rajahmundry Rose Milk Title Song released 



Rajahmundry Rose Milk is a feel good entertainer with lots of slice of life moments and heart warming music. It has been almost a decade since a good film in this genre entertained our Telugu audiences. The team has released their second song, the mian title song today. “Nuvve Mudduga, Navvey Navaga

Undey Ninduga, First day First show chusinattuga” The lyrics are penned by Chandrabose, sung by Anurag Kulkarni and composed by Ajay Arasada. The lyrics and music will defintely provoke nostalgia for everyone. 


Saregama Telugu is the music label bringing it to audiences across all major platforms such as Youtube, Spotify, JioSaavn, Wynk, Gaana, etc. The film is produced by Suresh Productions & Introupe Films. Naani Bandreddi is the director of the film.


Handpicked & beautifully curated words that describe love at first sight of a teenager whose heartbeat skips  and tunes to every sound from nature by seeing the smile of the girl. This song will reach to each and every heart leaving a smile on their face.


Cast: Jai Jasti, Ananthika, Vennela Kishore, Praveen, Darahas, Venkata Ganesh, Hemanth, Madhu, etc


Crew: 

Writer - Praneeth Prattipati

Lyrics - Chandrabose, Anantha Sriram, Shreemani

Production Designer - Abhishek Raghav

Editor - Karthika Srinivas

DOP - Shakthi Arvind

Music - Govind Vasantha, Bharatt-Saurabh, Ajay Arasada and Yashwanth Nag

Producers - D Suresh Babu, Pradeep Uppalapati

Director - Naani Bandreddi

Ramarao On Duty Pre Release Event Held Grandly

'రామారావు ఆన్ డ్యూటీ' నాకు చాలా డిఫరెంట్ మూవీ: 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ



మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం  జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు కానుంది. వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. విజయవంతంగా జరిగిన వేడుకకు నేచురల్ స్టార్ నాని, స్టార్ దర్శకుడు బాబీ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.  రవితేజ, శరత్ మండవ, నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ , వేణు తొట్టెంపూడి,  రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్, అన్వేషి జైన్, సామ్ సిఎస్, సత్యన్ సూర్యన్, ప్రవీణ్ , కళ్యాణ చక్రవర్తి తదితరులు ఈవెంట్ లో పాల్గొన్నారు.


ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాస్ రవితేజ మాట్లాడుతూ.. 'రామారావు ఆన్ డ్యూటీ' నాకు చాలా డిఫరెంట్ మూవీ. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. ఇంతకుముందు ఎప్పుడూ చేయనిది. దర్శకుడు శరత్ చాలా అద్భుతమైన సినిమా తీశాడు. నిర్మాత సుధాకర్ నాకు మంచి స్నేహితుడు. కూల్, పాజిటివ్ పర్శన్. అలాంటి వారితో ఎన్ని సినిమాలైన చేయడానికి నేను రెడీ. సుధాకర్, శ్రీకాంత్ లకు అల్ ది బెస్ట్. ఈవెంట్ కి వచ్చిన దర్శకుడు బాబీకి థాంక్స్. నాని అంటే నాకు చాలా ఇష్టం. సౌత్ ఇండియాలోనే నాని మంచి నటుడు. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ లు బ్యూటీఫుల్ గా వుంటారు. సీసా పాటలో అన్వేషి జైన్ అలరిస్తుంది. ఈ పాట చాలా బాగా వచ్చింది. వేణు తొట్టెంపూడితో నేను స్వయంవరం సినిమా చేయాలి. కానీ మిస్ అయ్యింది. మళ్ళీ కలిశాం. ఇంక గ్యాప్ ఇవ్వద్దు. ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ 95 లుక్ ని అద్భుతంగా తీసుకొచ్చారు.  ఎడిటర్ ప్రవీణ్ మంచి వర్క్ ఇచ్చారు. డివోపీ సత్యన్ సూర్యన్ వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారు. ఆయనతో మళ్ళీ పని చేయాలనీ వుంది. ఈ సినిమాకి సౌండ్ చాలా ముఖ్యం. దీనికి వందశాతం న్యాయం చేశాడు సామ్ సిఎస్. ఎక్స్ లెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఫైట్ మాస్టర్ స్టంట్ శివ, కెవిన్ సూపర్ గా యాక్షన్ డిజైన్ చేశారు. జులై 29న 'రామారావు ఆన్ డ్యూటీ థియేటర్ కి వస్తుంది, అంతా థియేటర్ లో కలుద్దాం'' అన్నారు.


నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. రవితేజ గారు చిరంజీవి గారిని ఇన్స్ ప్రేషన్ గా తీసుకున్నారు. మేము కెరీర్ మొదలుపెట్టినపుడు రవితేజ గారు మాకు ఇన్స్ ప్రేషన్.  చిరంజీవి గారి కార్వాన్ లోకి రవితేజ గారు ఎంటర్ అవ్వడం చూసినపుడు.. రవితేజ కార్వాన్ లోకి త్వరలోనే నేను ఎంటరవ్వాలనిపించింది. రవితేజ గారి మాటల్లో ఎంతో ప్రేమ వుంటుంది. సినిమా బావుంటే ఆయన ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందిస్తారు. 'రామారావు ఆన్ డ్యూటీ' కి చాలా పాజిటివ్ వైబ్ వుంది. నా 'దసరా' సినిమా చేస్తున్న నిర్మాతలే ఈ సినిమా చేస్తున్నారు. బాక్సాఫీసు సక్సెస్ తో పాటు మంచి కంటెంట్ వుండే సినిమా ఇవ్వాలనే తపన మా నిర్మాతల్లో వుంది. ఈ సినిమా అన్నీ ఎలిమెంట్స్ వున్న కాంబినేషన్ అనిపిస్తుంది. వేణు ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టడం ఆనందంగా వుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఇరవై ఏళ్ల నుండి రవితేజ ఆన్ డ్యూటీ. 29 నుండి రామారావు ఆన్ డ్యూటీ'' అన్నారు.


దర్శకుడు శరత్ మండవ మాట్లాడుతూ.. ఒక మంచి మనిషిగా రవితేజ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన వలనే 'రామారావు ఆన్ డ్యూటీ' సాధ్యమైయింది. ట్రైలర్ ఎంత బావుందో అంతకంటే గొప్పగా సినిమా వుంటుంది. 'రామారావు ఆన్ డ్యూటీ' చాలా యునిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ధరలు ఎక్కువగా వుండటం వలన ప్రేక్షకులు థియేటర్ కి రావడం లేదని కొందరు చెబుతున్నారు.  'రామారావు ఆన్ డ్యూటీ' టికెట్లు సాధారణ ధరలకే అందుబాటులో వుంటాయి. తెలంగాణలోని  మల్టీ ఫ్లెక్స్ లో 195, సింగెల్ స్క్రీన్స్ లో 150, 100, 50 రూపాయిలు. ఆంధ్రప్రదేశ్ లో రేట్లు ప్రభుత్వం చేతిలో వుంటాయి. అక్కడ 177, 147, 80 రూపాయిలుగా టికెట్ ధరలు వున్నాయి. ఈ ఈవెంట్ కి విచ్చేసిన నాని గారికి, బాబీ గారికి కృతజ్ఞతలు. మా నిర్మాతలు సుధాకర్ గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతి టెక్నిషియన్ కృతజ్ఞతలు. సంగీత దర్శకుడు సామ్ సిఎస్ డివోపీ సత్యన్ సూర్య, మిగతా టెక్నిషియన్స్ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. సామ్ సిఎస్ చెవుల్లో తుప్పు వదిలిపోయే ఆర్ఆర్ ఇచ్చారు. దర్శకత్వ విభాగంలో పని చేసి అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది. మీరంతా తప్పకుండా థియేటర్లో సినిమా చూడాలి'' అని కోరారు.


దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. రామారావు ఆన్ డ్యూటీ టీజర్ ట్రైలర్ అద్భుతంగా వున్నాయి. దర్శకుడు శరత్ మండవ నాకు ఎప్పటినుండో తెలుసు. ట్రైలర్ చుసిన తర్వాత రెగ్యులర్ మాస్ సినిమాలా కాకుండా ఒక కాన్సెప్ట్ సినిమాగా చేశారనిపించింది. సంగీత దర్శకుడు సామ్ సిఎస్ డివోపీ సత్యన్ సూర్య, మిగతా టెక్నిషియన్స్ అద్భుతమైన వర్క్ చేశారు. రవితేజగారు తన డ్యూటీ సరిగ్గా చేశారు. మనం కూడా 29న థియేటర్లో సినిమా చూసి మన డ్యూటీ చేద్దాం. మాస్ మహారాజాని పట్టుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది. మాలాంటి వాళ్ళ స్థాయి రేంజ్ రోవర్ వరకూ సెట్ అయిపోతుంది.  దానికి నేనే పెద్ద ఉదాహరణ, 'బలుపు' సినిమాకి  ముందు వరకు ఒకలా వుండేది జీవితం. తర్వాత ఆయనకి కథ చెప్పిన తర్వాత మరో లా వుంది. పవన్ కళ్యాణ్ గారితో చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ అనుకున్న స్థాయిలో రాణించలేదు. రవితేజ గారు ఫోన్ చేసిన అబ్బాయి కథ చెప్తావా.. నన్ను సెట్ చేయమంటావా ? అని అన్నారు. సెట్ చేయడమే కాదు రిసెట్ చేస్తుంటారాయన. సర్దార్ తర్వాత రవితేజ గారితో సినిమా చేయాలి. కానీ ఎన్టీఆర్ గారితో సినిమా కుదిరింది. రవితేజ గారు చాలా గొప్ప మనసుతో ''ముందు ఎన్టీఆర్ సినిమా చేయ్. ఎన్టీఆర్ చాలా అద్భుతమైన నటుడు. నీ లైఫ్ ఇంకా స్పీడ్ అవుతుంది'' అని  చెప్పారు. అది ఆయనలోని గొప్పదనం. నా డ్రీం ప్రాజెక్ట్ మెగా 154 కి కథ చెప్పగానే రవితేజ గారు అంగీకరించి జాయిన్ అయ్యారు. మెగా 154లో రవితేజ గారిది షాలిడ్ క్యారెక్టర్. రవితేజ గారి ఫ్యాన్స్ విజల్స్ వేనుసుకునేలా వుంటుంది'' అన్నారు.


వేణు తొట్టెంపూడి మాట్లాడుతూ.. నా మిత్రుడు రవితేజ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాను. నా పై నమ్మకం పెట్టుకొని అవకాశం ఇచ్చిన సుధాకర్, శ్రీకాంత్ గారికి, దర్శకుడు శరత్ మండవ గారికి థాంక్స్.  ఈ సినిమా యూనిట్ అందరికీ  అల్ ది బెస్ట్. 29న అందరం మన అభిమాన థియేటర్లోకి వెళ్లి ఈ సినిమాని సక్సెస్ చేద్దాం''అన్నారు.


రజిషా విజయన్ మాట్లాడుతూ..   'రామారావు ఆన్ డ్యూటీ' తో తెలుగులో అడుగుపెట్టడం ఆనందంగా వుంది. మాళిని లాంటి మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు శరత్ గారికి, నిర్మాత సుధాకర్ గారికి కృతజ్ఞతలు. రవితేజ గారు గ్రేట్ కోస్టార్.  29న సినిమా థియేటర్ కి వస్తుంది. థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది. అందరూ థియేటర్ కి వచ్చి సినిమా చూడాలి'' అని కోరారు.


దివ్యాంశ కౌశిక్ .. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన రవితేజ, దర్శకుడు శరత్ మండవ, నిర్మాత సుధాకర్ చెరుకూరి గారికి కృతజ్ఞతలు. రవితేజ గారి సినిమాలో చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. 29న మీ ముందుకు వస్తుంది. అందరూ థియేటర్ లో సినిమా చూడాలని కోరుకుంటున్నాను.


అన్వేషి జైన్ మాట్లాడుతూ.. 'సీసా' పాట మీ అందరికీ నచ్చడం ఆనందాన్ని ఇచ్చింది, ఈ అవకాశం ఇచ్చిన రవితేజ, శరత్, నిర్మాతలకు థాంక్స్. 29న సినిమా థియేటర్ లోకి వస్తుంది. అందరం థియేటర్ లో కలుద్దాం'' అన్నారు.  


సంగీత దర్శకుడు సామ్ సిఎస్ మాట్లాడుతూ..  'రామారావు ఆన్ డ్యూటీ' అద్భుతమైన కథ, స్క్రీన్ ప్లేయ్. ఈ కథకి సంగీత ప్రాధన్యత కూడా వుంది. మ్యజికల్ గా నా బెస్ట్ ఇచ్చాను. మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను.  ఇంత మంచి సినిమా ఇచ్చిన రవితేజ, దర్శకుడు శరత్ మండవ, నిర్మాత సుధాకర్ చెరుకూరి గారికి కృతజ్ఞతలు. రవితేజ గారు అద్భుతమైన మనిషి, ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనీ వుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు.


డివోపీ సత్యన్ సూర్యన్ మాట్లాడుతూ... రవితేజ, దర్శకుడు శరత్ మండవ, నిర్మాత సుధాకర్ చెరుకూరి గారికి కృతజ్ఞతలు. 'రామారావు ఆన్ డ్యూటీ' అద్భుతంగా వుంటుంది. రవితేజ గారు బ్రిలియంట్ గా కనిపిస్తారు. ఈ సినిమా మీ అందరికీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది.


ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ మాట్లాడుతూ.. రవితేజ, దర్శకుడు శరత్ మండవ, నిర్మాత సుధాకర్ చెరుకూరి గారికి కృతజ్ఞతలు.  రామారావు ఆన్ డ్యూటీ 29 న విడుదల కాబోతుంది. బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం. ఇందులో సందేహం లేదు'' అన్నారు.


గేయ రచయిత కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో రెండు మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చిన రవితేజ, దర్శకుడు శరత్ మండవ గారికి కృతజ్ఞతలు. రవితేజ గారు నిర్మలమైన మహానది లాంటి మనిషి. ఎంతో మంది రచయితలకు, దర్శకులకు  అవకాశాలు కల్పించారు. 29 రామారావు ఆన్ డ్యూటీ. టోటల్ ఏపీ తెలంగాణ ఆన్ డ్యూటీ'' అన్నారు.


ఎడిటర్ ప్రవీణ్ కెఎల్ మాట్లాడుతూ.. ట్రైలర్ ఎంత అద్భుతంగా వుందో సినిమా అంతకంటే అద్భుతంగా వుంటుంది. రవితేజ, శరత్, నిర్మాతలకు థాంక్స్. అవుట్ పుట్ అద్భుతంగా  బావోచ్చింది. మా అందరికీ నచ్చింది. మీకూ నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.


స్టంట్ మాస్టర్ శివ మాట్లాడుతూ.. రవితేజ గారితో ఇది మా ఐదో సినిమా. ఇందులో అద్భుతమైన యాక్షన్ వుంది.  రోడ్ జంక్షన్ లో వచ్చే ఒక యాక్షన్ బ్లాక్ ఎక్స్ టార్డినరీగా వుంటుంది. తన మొదటి సినిమాకి ఇప్పటికి రవితేజ గారి ఎనర్జీలో ఎలాంటి మార్పు లేదు. దర్శకుడు శరత్ మాండవ గారు అద్భుతమైన వ్యక్తి. అద్భుతమైన కథని చూపించబోతున్నారు. మాకు చాలా స్వేఛ్చని ఇచ్చారు. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. సినిమా చాలా అద్భుతంగా వుంటుంది'' అన్నారు.

Sita Ramam Trailer Launched Grandly


దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ క్లాసిక్ లవ్ స్టోరీ 'సీతా రామం' తెలుగు ట్రైలర్ గ్రాండ్ గా విడుదల


స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో 'యుద్ధంతో రాసిన ప్రేమకథ'గా ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం 'సీతా రామం'. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కీలక పాత్రలో కనిపిస్తున్నారు. బ్రిగేడియర్ విష్ణు శర్మ సుమంత్ మరో కీలక పాత్ర పోహిస్తున్నారు. గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో 'సీతారామం' థియేట్రికల్ ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో దుల్కర్, హను రాఘవపూడి, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన, సుమంత్, రమేష్ ప్రసాద్, నిర్మాత అశ్వినీదత్ పాల్గొన్నారు. 


థియేట్రికల్ ట్రైలర్ 'సీతారామం' ఎపిక్ లవ్ స్టొరీలోని కీలకమైన ఘట్టాలని ఆసక్తికరంగా ఆవిష్కరించింది.“ఇరవై ఏళ్ల క్రితం లెఫ్ట్నెంట్ రామ్ నాకొక బాధ్యత అప్పగించాడు. ఈ ఉత్తరం సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి' అనే డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 

రామ్ ఒక ఒక అనాథ. కాశ్మీర్ లో లెఫ్టినెంట్ గా భాద్యతలు నిర్వహిస్తుంటాడు. సీత అనే అమ్మాయి నుండి వచ్చిన ఉత్తరం రామ్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. రామ్, సీతను కలుస్తాడు. వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. రామ్ కాశ్మీర్ లోని తన క్యాంపు కి తిరిగి వచ్చినప్పుడు సీతకు ఒక లేఖ రాస్తాడు. కానీ అది ఆమెకు చేరలేదు. 20 ఏళ్ల తర్వాత సీతకు ఆ లేఖ ఇచ్చే భాద్యత రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్ ల పై పడుతుంది. సీత అన్వేషణ లో విఫలమైన వారు.. రామ్ కోసం అన్వేషణ మొదలుపెడతారు. కానీ రామ్ ని పట్టుకోవడం సీతని అన్వేషించడం కంటే కష్టమౌతుంది. దీనికి కారణం రామ్ బాస్ బ్రిగేడియర్ విష్ణు శర్మ (సుమంత్). ట్రైలర్ లో ఆవిష్కరించిన ఈ సన్నివేశాలు సినిమాపై మరింత క్యురీయాసిటీని పెంచాయి. 


1965, 80 నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా అద్భుతంగా సాగింది. అత్యున్నత నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేసిన ఈ చిత్రం చిరకాలం నిలిచిపోయే చిత్రంగా అవుతుంది అని ట్రైలర్ చూస్తేఅర్ధమౌతుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తమ స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకున్నారు,. ఇందులో వారి కెమిస్ట్రీ మ్యాజికల్ గా వుంది. రష్మిక మందన్న హీరోయిక్ రోల్, సుమంత్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించడం ఆసక్తికరంగా వుంది.


అందమైన ప్రేమకథలు రూపొందించడంలో హను రాఘవపూడి మరోసారి తన ప్రత్యేకతని నిరూపించుకున్నారు. సీత, రామ్ ల ప్రేమకథని చాలా అందంగా, హృద్యంగా చూపించారు. “నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే – కాశ్మీర్ ని మంచుకొదిలేసి వస్తారా?“ అనే డైలాగ్ ఈ ప్రేమ కథ ఎంత అందంగా వుంటుందో చెప్పకనే చెప్పింది.   


పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ విజువల్ వండర్ గా వుంది. ట్రైలర్ కి విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన రీ-రికార్డింగ్ గ్రాండ్ గా ఉంది. ఎమోషన్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేసింది. రెండు విభిన్న కాలాల కథను సులభంగా అర్థమయ్యే రీతిలో అందించడంలో మాస్టర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు తన మార్క్ ని చూపించారు. వైజయంతీ మూవీస్ , స్వప్న సినిమా గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్ అత్యద్భుతంగావుంది. విజువల్స్ గొప్ప ఆర్టిస్ట్ చిత్రీకరించిన పెయింటింగ్స్ లా ఉన్నాయి.

ఆగస్ట్ 5న సీతారామం తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.


ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. అందరూ రొమాంటిక్ హీరో అని పిలవడంతో విసుగొచ్చి ఇంక ప్రేమకథలు చేయకూడదని అనుకున్నాను. ఇలాంటి సమయంలో హనుగారు ఈ కథతో వచ్చారు. అద్భుతమైన ప్రేమ కథ. చిరకాలం గుర్తిండి పోయే ఎపిక్ సినిమా. ఇలాంటి కథని ఎట్టిపరిస్థితిలో వదులకూడదనిపించింది. చివరి ప్రేమకథగా సీతారామం లాంటి క్లాసిక్ ఎపిక్ లవ్ స్టొరీ చేయాలని నిర్ణయించుకున్నా. సీతారామం షూటింగ్ అద్భుతమైన అనుభవం. దేశంలోని అనేక ప్రదేశాలలో షూట్ చేశాం. అన్ని ప్రదేశాలు నేను ఎప్పుడూ చూడలేదు. కథని బలంగా నమ్మాము. అందరం వంద శాతం బెస్ట్ వర్క్ ఇచ్చాం. అశ్వినీదత్ గారి లాంటి సినిమా పై ప్యాషన్ వున్న నిర్మాతతో ఇప్పటివరకూ పని చేయలేదు. అన్ని అవసరాలని సమకూర్చారు. ఎంతో అప్యాయంగా భోజనం పెట్టెవారు. హను గారు సినిమా పై గ్రేట్ ప్యాసన్ వున్న రచయిత, దర్శకుడు. ఆయనకి సినిమా తప్పితే మరో ద్యాస లేదు. సీతగా మృణాల్ అద్భుతంగా చేసింది. రష్మిక పాత్ర కూడా అద్భుతంగా వుంటుంది. గ్రేట్ టీమ్ తో పనిచేశాననే ఆనందం వుంది. సినిమాలో అద్భుతమైన మ్యూజిక్ వుంది. సీతారామం లార్జర్ దెన్ లైఫ్ సినిమా. ఆగస్ట్ 5న అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి'' అన్నారు.  


హను రాఘవపూడి మాట్లాడుతూ.. సీతారామం సినిమా బాగా వర్షం వచ్చినపుడు వేడి కాఫీ తాగినట్లు వుంటుంది. ఎండాకాలంలో చల్లటి నీరు తాగినట్లు వుంటుంది. ఆగస్ట్ 5 ఈ సినిమా చూస్తున్నపుడు మిమ్మల్ని మీరు మర్చిపోతారు. ఇది రాసివ్వగలను. ఈ సినిమా మీతో పాటు వచ్చేస్తుంది. చిరకాలం గుర్తిండిపోతుంది. కథ ,పాత్రలు మాత్రమే వుంటాయి.మిమ్మల్ని కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఇలానే ప్రదేశాలకు తీసుకెల్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దుల్కర్ , సుమంత్, మృణాల్, రష్మిక కి స్పెషల్ థాంక్స్. వీరి సపోర్ట్ లేకపొతే సినిమాలో ఒక్క పేజీ కూడా నిండేది కాదు. కరోనా లాంటి ప్రతికూల పరిస్థితులని దాటి ఈ రోజు సినిమా ట్రైలర్ చూసే పరిస్థితి వచ్చిందంటే తెరవెనుక వందలమంది కష్టం వుంది. సీతారామం మీ అందరికీ గొప్ప అనుభూతిని ఇస్తుంది'' అన్నారు. 


మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. దర్శకుడు హను గారు జీనియస్. ఈ కథని చెప్పినపుడు సీత, రామ్ ల ప్రేమలో పడిపోయా. నిర్మాత అశ్వినీదత్ గారు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. సెట్ లో ప్రతిరోజు ఒక అందమైన కలలా వుండేది. సీత పాత్ర అద్భుతంగా వుంటుంది. ఆ పాత్రలో రోమాన్స్ కూడా వుంది. ఈ మధ్య కాలంలో రోమాన్స్ సినిమాలు తగ్గిపోతున్నాయి. సీతారామంలో మ్యాజికల్ రోమాన్స్ వుంటుంది. దుల్కర్, సుమంత్, రష్మిక కు థాంక్స్. ఆగస్ట్ 5న అందరం థియేటర్ లో కలుద్దాం' అన్నారు. 


రష్మిక మాట్లాడుతూ.. అఫ్రిన్ లాంటి వైలెంట్ క్యారెక్టర్ ఇచ్చారు.. ఈ పాత్రకు ఎలా న్యాయం చేయాలని దర్శకుడు హను గారిని అడిగాను. ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ నా పాత్రకు న్యాయం చేశానని పిస్తుంది. ఒక అందమైన ప్రేమ కథ చెప్పాడానికి కథకుడు వుండాలి. కథ ఎలా జరిగిందో వివరంగా చెప్పాలి కదా.. ఇందులో ఆ వివరాలని నేను ఇస్తా. సీత రామ్ అందమైన ప్రేమ కథని అఫ్రిన్ చెప్పే విధానం మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. ఆగస్ట్ 5కోసం ఎదురుచూస్తున్నాను'' అన్నారు.  


రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ..'ప్రసాద్'కు సినిమాతో ఎంతో అనుబంధం వుంది, నాన్నగారు మూకీ నుండి సినిమాల్లో భాగమయ్యారు. ప్రసాద్స్ అనేది సినిమా కోసం. సినిమా కరోనాతో గడ్డుకాలం ఎదురుకుంది. అయితే గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు ప్రేక్షకుల ప్రేమతో కష్టకాలాన్ని అధిగమించింది. సినిమా పరిశ్రమ నేడు ఎంతో చిత్తశుద్ధి, ప్రతిభతో చిత్రాలని నిర్మిస్తుంది. సీతారామం యూనిట్ కి ఆల్ ది బెస్ట్. సినిమా కలకాలం నిలుస్తుంది'' అన్నారు.  


సుమంత్ మాట్లాడుతూ.. ఈ సినిమా 150 పేజీల కథ మొత్తం చదివిన తర్వాత సీతారామం దృశ్యకావ్యం అవుతుందనిపించింది. 'గోదావరి' అనే సీతారాముల కథ చేశాను. అది అప్పుడు క్లాసిక్ అయ్యింది. ఇప్పుడు సీతారామం కూడా క్లాసిక్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆగస్ట్ 5 కోసం ఎదురుచూస్తున్నాను. ఇది థియేటర్ లో చూడాల్సిన సినిమా. ఆగస్ట్ 5న అందరం థియేటర్లో కలుద్దాం'' అన్నారు. 


అశ్వినీదత్ మాట్లాడుతూ.. దుల్కర్ , సుమంత్, మృణాల్, రష్మిక సీతారామం యూనిట్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కరోనా ఉదృతంగా వున్న సమయంలో కాశ్మీర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రష్యా లాంటి ప్రదేశాల్లో సాహసించి షూటింగ్ చేశారు. సీతారామం చూసి ఎంజాయ్ చేసి మాకు సూపర్ సక్సెస్ ని ఇస్తారనే నమ్మకం వుంది'' అన్నారు.


ఈ సందర్భంగా విలేఖరు అడిగిన ప్రశ్నలు సమాధానాలు ఇచ్చింది సీతారామం చిత్ర యూనిట్ 


సీతారామం నిర్మించడానికి మిమ్మల్ని ఎక్సయిట్ చేసిన అంశం ?

అశ్వినీదత్ : సీతారామం నా 60వ చిత్రం. ఇప్పటివరకూ చాలా కాస్టింగ్ వున్న చిత్రాలు తీశాను కానీ లవ్ స్టొరీని మిస్ అయ్యాను. మంచి ప్రేమకథ తీయలేదనే ఫీలింగ్ వుండేది. మరోచరిత్ర, గీతాంజలి నా అభిమాన చిత్రాలు. ఇవి చూసినప్పుడు ఇలాంటి సినిమా తీయగలనా ? అనిపించేది. సీతారామంతో ఆ కోరిక తీరింది. సీతారామం సంచలనమైన విజయం సాధిస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమాని తీసినందుకు గర్వపడుతున్నాను. టికెట్ రేట్లు నార్మల్ గా వుంటాయి. అందరూ చూడాల్సిన సినిమా ఇది. అందరికీ అందుబాటు ధరలో టికెట్ రేట్లు వుంటాయి. నటీనటుల అద్భుత ప్రదర్శన, గొప్ప విజువల్స్, కథ, కథనం, మంచి సంగీతం వున్న ఈ సినిమాని ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్లోనే చూస్తారు. 


సీతా రామం కథ .. రామాయణంలో సుందరకాండకి యుద్ధ కాండకి సారాంశం అనుకోవచ్చా ? 

హను రాఘవపూడి : రామాయణంతో పోలిక లేదు. ఆ కథకి ఈ కథకి సబంధం లేదు. అయితే ఒక అబ్ స్ట్రాక్ట్ గా అనుకోవచ్చు. రాముడులాంటి లక్షణాలు వున్న వారిని చూస్తే గొప్పగా చూస్తాం. అలంటి వ్యక్తిత్వం రామ్ ది. సీత పాత్ర వైదేహి లాంటిదే. అయితే రెండు విధాలుగా వుంటుంది. సినిమా చుస్తే అర్ధమౌతుంది. వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు రాస్తే రామాయణం అవుతుంది. అంత అద్భుతంగా వుంటుంది. 


అఫ్రిన్ పాత్ర చెప్పినపుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు ? 

రష్మిక: అఫ్రిన్ ఒక రెబల్ పాత్ర. నా వల్ల ఎలా అవుతుందని హనుగారిని అడిగాను. నా పాత్రల్లో యాంగ్రీ బర్డ్ గా వుంటాను కానీ అందులో కూడా అమాయకత్వం వుంటుంది. కానీ అఫ్రీన్ పూర్తిగా రెబల్ రోల్. ఐతే ఇది అద్భుతమైన ప్రేమ. ఇందులో నా పాత్ర రామ్ సీతల ప్రేమ కథ చుట్టూ తిరుగుతుంది. ఇది నాకు చాలా కొత్త పాత్ర. నా పాత్ర పై ఆడియన్స్ కి కోపం వచ్చి నా ఎమోషన్స్ తోటి కనెక్ట్ అయితే నేను విన్నర్ అయినట్లే. 


వైజయంతి మూవీస్ లో మహానటి, ఇప్పుడు సీతారామం చేశారు.. ఈ అనుభవం ఎలా వుంది ? 

దుల్కర్ : వైజయంతి మూవీస్ హైదరాబాద్ లో నా సొంత ఇల్లు లాంటింది. నా కోసం మంచి కథలు తీసుకొస్తారనే నమ్మకం వుంది. నేను నో చెప్పలేని స్క్రిప్ట్స్ మాత్రమే చెప్తారు. అందుకే వైజయంతి లో సినిమా అంటే నేను పెద్దగా అలోచించను. సినిమాని చాలా ప్యాషన్ తో చేసే నిర్మాతలు. 


సీత పాత్రలో రష్మికని ఎందుకు తీసుకోలేదు ? 

హను రాఘవపూడి : అఫ్రిన్ పాత్ర అనుకున్నపుడు రష్మిక ఫస్ట్ ఛాయిస్ గా కనిపించారు. సీత పాత్రలో మరొకరిని వూహించుకుంటానేమో కానీ అఫ్రిన్ పాత్ర చేయడానికి మరొక ఆప్షన్ లేదు. ఇద్దరు వ్యక్తులని కలిసేలా చేసే మనిషిని అద్భుతం అంటాం. రష్మిక గారి ఆఫ్రిన్ పాత్ర కూడా ఒక అద్భుతం. ఇది రామాయణం కథకు కనెక్ట్ చేసే హనుమంతుడు అంటాం. రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంత గొప్పదో ఇందులో ఆఫ్రిన్ గా రష్మిక పాత్ర అంత వున్నతమైనది. 


బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రని చేయడానికి మిమ్మల్ని ఎక్సయిట్ చేసిన అంశం ? 

సుమంత్ : నేను ఎప్పటి నుండో ఇలాంటి పాత్ర చేయడానికి ఎదురుచూస్తున్నాను. హీరో పాత్రలు చేస్తూ కథలో బలమైన పాత్రలు చేయాలనీ ఎప్పటినుండో అనుకుంటున్నాను. హను గారు ఈ కథ చెప్పినపుడు నా పాత్ర చాలా నచ్చింది. ఇప్పుడే పాత్ర గురించి ఇంకా ఎక్కువ చెప్పడం సరికాదు. అలాగే చాలా కాలం తర్వాత భూమిక నేను కలసి నటిస్తున్న సినిమా సీతారామం కావడం కూడా ఆనందంగా వుంది.


సీతారామం చేయడనికి మిమ్మల్ని ఎక్సయిట్ చేసిన అంశాలు ? 

మృణాల్: హనుగారు చాలా గొప్ప కథ చెప్పారు. వైజయంతి మూవీస్, దుల్కర్ సల్మాన్.. ఇంత గొప్ప కాంబినేషన్ లో భాగమవ్వడం నా అదృష్టం, ఈ సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టడం ఎంతో గర్వంగా వుంది. సీతా రామం ఓ అద్భుతం.


తారాగణం: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, భూమిక చావ్లా ప్రకాష్ రాజ్ తదితరులు 


సాంకేతిక విభాగం:

దర్శకత్వం: హను రాఘవపూడి

నిర్మాత: అశ్వినీదత్ 

బ్యానర్: స్వప్న సినిమా

సమర్పణ: వైజయంతీ మూవీస్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గీతా గౌతమ్

ఛాయాగ్రహణం : పీఎస్ వినోద్ 

సంగీతం: విశాల్ చంద్రశేఖర్

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

ప్రొడక్షన్ డిజైన్: సునీల్ బాబు

ఆర్ట్ డైరెక్టర్: వైష్ణవి రెడ్డి, అలీ

కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ

పీఆర్వో : వంశీ-శేఖర్

Pan India Film Laatti Teaser Unleashed

 Vishal, A Vinoth Kumar, Rana Productions Pan India Film Laatti Teaser Unleashed



Hero Vishal is presently starring in a Pan India film Laatti under the direction of A Vinoth Kumar, while Rana Productions is bankrolling it. Sunaina is the female lead in the movie being produced jointly by Ramana and Nandha. The film’s teaser has been unleashed.


The teaser starts off on an intriguing note with Vishal who’s tied and is badly beaten up by baddies give them a stern warning. “Rey… Thappu Chesina Thaladachukune Pokirivi… Neeke Intha Pogarunnappudu… Aa Thappuni Niliadeese Polisodni… Naku Entha Pogaruntundi…”


The subsequent episode shows Vishal saluting his senior officials. Then comes the huge action block in an under-construction building, where Vishal as a lone fighter announces war against many rowdies. The teaser definitely increases curiosity on the film.


Vishal appeared in an intense role as an honest cop who is ready even to die in the duty. He is just brilliant in the role. Vinoth Kumar presented the character in a mass-appealing way. 


Laatti will have some amazing action sequences choreographed by Peter Hein master. In fact, second half of the movie will have 45 minutes of action blocks.


Sam CS is the music composer, while Balasubramanian is the cameraman and Pon Parthiban is the writer.


Laatti will have simultaneous release in all languages on September 15th.


Cast: Vishal, Sunaina


Technical Crew:

Director: A Vinoth Kumar

Producers: Ramana and Nandha

Banner: Rana Productions

Writer: Pon Parthiban

Music: Sam CS

DOP: Balasubramanian

Stunt Directors: Peter Hein

Ex-Producer: Bala Gopi

PRO: Vamsi-Shekar

The Legend Pre Release Event Held Grandly

 గ్రాండ్ గా లెజెండ్ శరవణన్ 'ది లెజెండ్' మూవీ ప్రీ రిలీజ్ మీట్  


 



లెజెండ్‌ శరవణన్‌ మల్టీ లాంగ్వెంజ్ భారీ పాన్-ఇండియా చిత్రం 'ది లెజెండ్' తో కధానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఎమోషన్, యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడిన ఈ మాస్ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం జెడి-జెర్రీ.  ఊర్వశి రౌటేలా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వివేక్, యోగి బాబు, విజయకుమార్, ప్రభు, నాజర్, సుమన్ కీలక పాత్రలు పోహిస్తున్నారు. లెజెండ్ న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయనే స్వయంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ జులై 28న ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌ గా విడుదల కానుంది. శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ తిరుపతి ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీరిలీజ్ మీట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో లెజెండ్‌ శరవణన్‌, ఊర్వశి రౌటేలా, లక్ష్మీ రాయ్, జేడీ జెర్రీ, ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు తదితరులు పాల్గొన్నారు.


 


లెజెండ్‌ శరవణన్‌ మాట్లాడుతూ.. మీ అందరూ చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. ఒక కామన్ మాన్ ఎలా లెజెండ్ గా ఎదిగాడు? అతని ప్రయాణంలో ఎలాంటి సవాల్ ని అధిగమించాడనేది ది లెజెండ్ లో అద్భుతంగా చూపించాం. ఇది చాలా భారీ చిత్రం. ఎమోషన్, యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ అన్నీ ఎలిమెంట్స్ వున్నాయి. ఈ చిత్రం కోసం అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేశారు. ది లెజెండ్ జూలై 28న మీ ముందుకు వస్తుంది. మీరంతా చూసి విజయవంతం చేయాలి'' అని కోరారు.


 


ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. శరవణన్‌ స్టోర్ అనేది తమిళనాడులో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో వుండే ఒక బ్రాండ్. ఎంతో  ప్యాషన్ తో ఈ సినిమాని ప్రోడ్యుస్ చేసి లెజెండ్‌ శరవణన్‌ యాక్ట్ చేశారు. చాలా రిచ్ గా వుంటుంది. కొత్త కథ. తెలుగు ప్రేక్షకులు కొత్త కంటెంట్ ని ఎప్పుడూ ఆదరిస్తారు. ఇది ఆయన మొదట సినిమా అయినప్పటికీ ప్రేక్షకులు చూసినప్పుడు చాలా సర్ప్రైజ్ అవుతారు. టాప్ మోస్ట్ టెక్నిషియన్స్ ఈ చిత్రం కోసం పని చేశారు.  ఒక సక్సెస్ ఫుల్ చిత్రానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి మంచి విజయాన్ని అందించాలి'' అని కోరారు.


 


జెడి మాట్లాడుతూ.. ది లెజెండ్ బిగ్ బడ్జెట్ మూవీ. ఈ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా థియేటర్ లో చూడాలి. లెజెండ్‌ శరవణన్‌ గారు సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్. ఒక నటుడిగా ఆయనకి చాలా కమిట్ మెంట్ వుంది. సినిమా అంటే చాలా ప్యాషన్ వుంది. ఆయన డెడికేషన్ ని స్క్రీన్ పై చూస్తారు. ఊర్వశి రౌటేలా అద్భుతంగా చేసింది. లక్ష్మీ రాయ్ స్పెషల్ ఎప్పిరియన్స్ లో ఆకట్టుకుంది. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్ లో ఎంజాయ్ చేస్తారు'' అన్నారు.


 


జెర్రీ మాట్లాడుతూ.. లెజెండ్‌ శరవణన్‌ ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని రూపొందించారు. ఒక నటుడిగా యాక్షన్ కామెడీ రోమాన్స్ ఇలా అన్ని కోణాల్లో అద్భుతంగా చేశారు. తప్పకుండా అందరినీ తన నటనతో సర్ప్రైజ్ చేస్తారు. ఊర్వశి బ్రిలియంట్ యాక్టర్. చాలా హుషారుగా నటిస్తుంది. లక్ష్మీ రాయ్ సింగల్ టేక్ ఆర్టిస్ట్. ఇందులో అద్భుతంగా చేసింది. ప్రసాద్ గారు అద్భుతమైన నిర్మాత. ఆయన తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయడం ఆనందంగా వుంది. తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే ప్రేమ.  సినిమాని ఎంతగానో ప్రేమిస్తారు. తెలుగు, తమిళ్ సినిమా ఇండియన్ సినిమాకి రెండు కళ్ళు. ది లెజెండ్ మీ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. ఇది చాలా పెద్ద సినిమా. అందరూ 28న థియేటర్ లో చూడాలి''అని కోరారు.


 


ఊర్వశి రౌటేలా మాట్లాడుతూ.. ది లెజెండ్ చిత్రంతో తెలుగులో పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా వుంది. ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చాలా ఎనర్జీని ఇచ్చింది. హైదరాబాద్ లో మీ అందరినీ కలవడం ఆనందాన్ని ఇచ్చింది. చాలా భారీ బడ్జెట్ తో తీసిన చిత్రమిది. 28న థియేటర్ లోకి వస్తుంది. అందరం థియేటర్ లో  కలుద్దాం. మీ అందరినీ ది లెజెండ్ అలరిస్తుంది'' అన్నారు


 


లక్ష్మీ రాయ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో స్పెషల్ అప్పిరియన్స్ లో ఫోక్ సాంగ్ చేశాను. ఈ అవకాశం ఇచ్చినందుకు శరవణన్‌ లెజెండ్ కు కృతజ్ఞతలు. ఈ టీంతో ఎప్పటి నుండో అనుబంధం వుంది. జులై 28న ఈ సినిమా విడుదలౌతుంది. కంప్లీట్ ఎంటర్ టైనర్ ఇది. మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీరంతా థియేటర్ కి వచ్చి సినిమా చూడాలి'' అని కోరారు.


 


ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది ది లెజెండ్ టీమ్


 


ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా వున్న  మీరు ఈ వయసులో సినిమా చేయడానికి కారణం ?


లెజెండ్‌ శరవణన్‌ : చిన్నప్పటి నుండి సినిమాపై ఆసక్తి వుంది. కానీ మా లైఫ్ స్టయిల్, బిజినెస్ వేరు. బిజినెస్ లో సక్సెస్ అయ్యాను. ఇప్పుడు సినిమా చేసే అవకాశం రావడంతో చేశాను. వయసు అనేది దీనికి అడ్డంకి కాదని భావిస్తాను.


 


సినిమా కోసం అరవై కోట్లకు పైగే ఖర్చు చేశారని విన్నాం. ఒక బిజినెస్ మాన్ గా  రికవరీ గురించి లెక్కలు వేసుకున్నారా ?


లెజెండ్‌ శరవణన్‌ : ఖచ్చితంగా లెక్క వుంటుంది.  ప్యాషన్ తో పాటు బిజినెస్ కూడా ముఖ్యం కదా.


మీ అభిమాన నటులు ?


లెజెండ్‌ శరవణన్‌ : తమిళ్ లో విజయ్, రజనీకాంత్, తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్, హిందీలో షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్.


మల్టీ స్టారర్ పై ఆసక్తి ఉందా ?


లెజెండ్‌ శరవణన్‌ : లేదండీ. చేస్తే నేను ఒక్కడినే చేస్తాను.


మీ అభిమాన దర్శకులు ?


లెజెండ్‌ శరవణన్‌ : రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ గారు అంటే ఇష్టం.


సినిమాలు కొనసాగిస్తా రా ?


లెజెండ్‌ శరవణన్‌ : అవును. సినిమాలు కంటిన్యూగా చేస్తా,


జేడీ-జెర్రీ ని దర్శకులుగా తీసుకోవడానికి కారణం ?


లెజెండ్‌ శరవణన్‌ : జేడీ-జెర్రీ నాకు మంచి స్నేహితులు. వారితో ఎప్పటి నుండో జర్నీ చేస్తున్నా. ఇది చాలా యునిక్ స్టొరీ. ఈ కథని జేడీ జెర్రీ అద్భుతంగా తీశారు.


 


ఈ చిత్రాన్ని తెలుగు లో విడుదల చేయడానికి మిమ్మల్ని ఆకర్షించిన అంశం ?


ఎన్వీ ప్రసాద్:  ఒక నటుడి లాంచింగ్ మూవీ ఇంత భారీ బడ్జెట్ తో తీశారా ? అనేది షాకింగ్ అనిపించింది. చాలా లావిష్ గా ఈ సినిమాని తీశారు. కొత్త కంటెంట్ ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులు సినిమా చూసి ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారని భావిస్తున్నా.

NBK 107 Shooting going on In Kurnool

 కర్నూలు లోశరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ #NBK107 



నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో ఓ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్‌న రూపుదిద్దుకుటుంది. #NBK107 వర్కింగ్ టైటిల్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రేపు(సోమవారం) కర్నూలులోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.


 


ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.


 


నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ ‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.


 


మ్యూజిక్ సెన్సేషన్  థమన్ ఎన్‌బికె107కి సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.


 


నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు.


 


సాంకేతిక విభాగం


కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: గోపీచంద్ మలినేని


నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్


బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్


సంగీతం: థమన్


డివోపీ: రిషి పంజాబీ


ఎడిటర్: నవీన్ నూలి


ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్


డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా


ఫైట్స్: రామ్-లక్ష్మణ్


సిఈవో: చిరంజీవి (చెర్రీ)


కో-డైరెక్టర్: కుర్రా రంగారావు


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి


లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవివి


పబ్లిసిటీ: బాబా సాయి కుమార్


మార్కెటింగ్: ఫస్ట్ షో


పీఆర్వో: వంశీ-శేఖర్