Latest Post

Tremendous Response for Kotha Kotha ga Movie Diamond Rani Song

 ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతీ విడుద‌ల‌చేసిన‌ `కొత్త కొత్త‌గా`చిత్రం నుంచి డైమండ్ రాణి సాంగ్ కు మంచి స్పంద‌న‌



అజయ్‌, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, ఆనంద్ (సీనియర్ హీరో), తులసి, కాశీవిశ్వనాద్, కల్యాణి నటరాజన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్న చిత్రం `కొత్త కొత్త‌గా`. బి జి గోవిందరాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్నారు యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి హనుమాన్ వాసంశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలోని  `డైమండ్ రాణి ..`సాంగ్ ను శుక్ర‌వారం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతీ ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. శేఖర్ చంద్ర సంగీతం దర్శకత్వంలో కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి పాడిన `డైమండ్ రాణి ..`సాంగ్ ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల చేసిన కొద్ది సేప‌టికే మంచి స్పంద‌న రావ‌డం విశేషం.


మంచి ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను ఇటీవ‌లే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి విడుద‌ల చేశారు. అలాగే టీజ‌ర్ కూడా మంచి ఆద‌ర‌ణ పొందుతోంది.ఇక ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుగుతున్నాయి. ఈ సినిమాను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.


న‌టీన‌టులు-

అజయ్

వీర్తి వఘాని

ఆనంద్ (సీనియర్ హీరో)

కాశీ విశ్వనాధ్

తులసి

కల్యాణి నటరాజన్

పవన్ తేజ్

ఈరోజుల్లో సాయి త‌దిత‌రులు.

 

బ్యానర్: ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్

స‌మ‌ర్ప‌కులు: బి జి గోవింద రాజు

నిర్మాత: మురళీధర్ రెడ్డి ముక్కర

దర్శకుడు: హనుమాన్ వాసంశెట్టి

సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర

ఎడిటర్: ప్రవీణ్ పూడి

కెమెరా- వెంకట్

కొరియోగ్రాఫర్: హరికిరణ్

ఫైట్ మాస్టర్: పృధ్వీ శేఖర్

ఆర్ట్ డైరెక్టర్: సురేష్ భీమగాని

సాహిత్యం: కాసర్ల శ్యామ్, అనంత శ్రీరామ్, కృష్ణ చైతన్య, శ్రీ మణి.

Keerthy Suresh’s Good Luck Sakhi Releasing On January 28th

 Keerthy Suresh’s Good Luck Sakhi Releasing On January 28th



National Award-Winning Actress Keerthy Suresh will next be seen in a woman-centric sports rom-com film Good luck Sakhi, where she played the role of a shooter. Aadhi Pinisetty will be seen as male lead, while Jagapathi Babu essayed a crucial role in the film boasts proudly of a female dominated crew lead by co-producer Shravya Varma.


The makers today announced the release date of the movie. Good Luck Sakhi will be releasing on January 28th, two days after the Republic Day. The film will most probably have no competition, as no noted film will be arriving on the week. The makers will strengthen the promotions, as there is only one week left for the release.


Directed by Nagesh Kukunoor, Good Luck Sakhi is a multi-lingual film made simultaneously in Telugu, Tamil and Malayalam languages. Popular producer Dil Raju is presenting the film while Sudheer Chandra Padiri is producing it on Worth A Shot Motion Arts banner.


Rock star Devi Sri Prasad has scored, music while Chirantan Das has cranked the camera.


Teaser and other promotional content of the film got good response from all the corners.


Cast: Keerthy Suresh, Aadhi Pinishetty, Jagapathi Babu and others.


Technical Crew:

Director: Nagesh Kukunoor

Presented by: Dil Raju (Sri Venkateswara Creations)

Banner: Worth A Shot Motion Arts

Producer: Sudheer Chandra Padiri

Co-Producer: Shravya Varma

Music Director: Devi Sri Prasad

Cinematographer: Chirantan Das

PRO: Vamsi-Shekar


Prime Video Honuring The Legacy of Late Puneeth Rajkumar

 HONOURING THE LEGACY OF LATE PUNEETH RAJKUMAR, PRIME VIDEO ANNOUNCES THE EXCLUSIVE PREMIERE OF THREE UPCOMING FILMS FROM HIS STUDIO AND MAKES FIVE OF HIS PREVIOUS MOVIES FREE FOR ALL



Prime Video announces the exclusive world premiere of three films from Puneeth Rajkumar’s PRK Productions directly on the service - Man of the Match, One Cut Two Cut and Family Pack

The streaming service will also make five of late Puneet Rajkumar’s most popular movies, free for all customers starting February 1

The collaboration aims to carry forward late Puneeth Rajkumar’s cinematic vision and bring the best of stories for his fans in India and across the globe 

Amazon Prime offers incredible value with unlimited streaming of the latest and exclusive movies, TV shows, stand-up comedy, Amazon Originals, ad-free music listening through Amazon Prime Music, free fast delivery on India’s largest selection of products, early access to top deals, unlimited reading with Prime Reading and mobile gaming content with Prime Gaming.  Customers can also watch these titles by subscribing to Prime Video Mobile Edition. Prime Video Mobile Edition is a single-user, mobile-only plan currently available for Airtel Prepaid customers.     


 *MUMBAI, INDIA – 21 January 2022 –* Honouring the creative prowess of Late Puneeth Rajkumar, Prime Video today announced a slate of three new Kannada movies with PRK Productions which includes Man of the Match, One Cut Two Cut and Family Pack, to be available exclusively for Prime Members worldwide. Paying a humble tribute to the legend, Prime Video will also make five of his most memorable movies— Law, French Biryani, Kavaludaari, Mayabazaar & Yuvarathnaa, available to watch for free, even for non-Prime members, for 1-month starting February 1. Not just limiting to Prime members and making these five movies free-to-stream worldwide on the service for anyone who has an Amazon account is a modest attempt to allow wider audiences and fans to pay their love and respect to the legend. 

Talking about the association with PRK Productions, Manish Menghani, Head, Content Licensing, Amazon Prime Video said, “Over the last few years, we have had a successful association with PRK Productions. This collaboration, is our effort to pay a humble tribute to the creative excellence of Late Puneeth Rajkumar and his unique vision of storytelling. His contribution to cinema is immense and we are sure, these films will offer an immersive experience to his fans and admirers in India and beyond. We are happy to present some fun, relatable and highly engaging stories through this association in the loving memory of the legend Late Puneeth Rajkumar. At Prime Video, we’re always endeavoring to take the most authentic homegrown stories to a global audience.”

Ashwini Puneeth Rajkumar, Producer, PRK Productions said "Puneeth Rajkumar's distinct vision for cinema fascinated audiences for years, earning him the massive fan following and honour he so rightly deserved. It now remains our endeavour to carry that legacy forward. We are happy to continue our successful association with Prime Video and take our films to viewers world over.


 

 

The three-film announcement is an ode to the craft and legacy of the late actor and filmmaker whose contribution to cinema stands unmatched. Featuring popular faces from the Kannada film industry, this repertoire of films will premiere on Prime Video in India and across 240 countries and territories worldwide. While Man of the Match is a modern-day reflection of human emotions and social challenges starring some of the finest upcoming actors like Atharva Prakash K Jayaram, Dharmanna Kadur and Nataraj, One Cut Two Cut brings the story of a day when everything went haywire in a mad-cap comedy featuring Danish Sait, Prakash Belavadi and Samyukta Hornad. Family Pack is a romantic comedy starring Likith Shetty and Amrutha Iyengar in lead roles. With these three movies, Prime Video aims to carry forward Puneeth Rajkumar’s legacy.

 

 

Akhanda 50days Function Held Grandly

 అఖండమైన సినిమాలు వచ్చేలా నన్ను, బోయపాటి శ్రీనుని ఆ దేవదేవుడే కలిపాడు

- అఖండ అర్థ శతదినోత్సవం వేడుకలో నందమూరి బాలకృష్ణ

 



ఈ అఖండ విజయాన్ని ఎన్.టి.ఆర్ గారికి అంకితం ఇస్తున్నాం - అఖండ అర్థ శతదినోత్సవం వేడుకలో డైరెక్టర్ బోయపాటి శ్రీను



అభిమానుల కేరింతలు, ఆనందోత్సాహాలమధ్య నందమూరి బాలకృష్ణ నటించిన `అఖండ` చిత్రం అర్థ శతదినోత్సవ వేడుక జరిగింది. గురువారంనాడు సాయంత్రం హైదరాబాద్లోని ఆర్.టి.సి. క్రాస్రోడ్లో గల సుదర్శన్ 35.ఎం.ఎం. థియేటర్ ఇందుకు వేదికైంది. ప్రేక్షకులు అఖండ సినిమా చూస్తుండగానే  బాలకృష్ణ  విచ్చేసి అభిమానులను అలరించారు. వారి ఆనందానికి అవధులు లేవు.


ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, ఆర్.టి.సి. క్రాస్ రోడ్కు వస్తుంటే మా రామకృష్ణ స్టూడియో జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయన్నారు.  స్టూడియోలో నాన్నగారికోసం టిఫిన్ తీసుకు వచ్చేవాడినంటూ అప్పటి రోజులను ప్రేక్షకులకు తెలియజేశారు. మరోవైపు సమరసింహారెడ్డి శతదినోత్స వేడుకకు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.

చిత్ర విజయాన్ని గురించి ప్రస్తావిస్తూ,, ఇది ప్రేక్షకులు ఇచ్చిన విజయం. మా టీమ్ సమిష్టి కృషి. శివుడు భక్తుడిగా నేను చేసిన అఖండలోని పాత్ర నాన్నగారు చేసిన పాత్రలు గుర్తుచేసుంటూ వాటిని పోషించాను. మొన్ననే సంక్రాంతి పండుగ జరుపుకున్నాం. ఇప్పుడు అఖండ పండుగ ఇది. కోవిడ్ సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారోరారో అనుకున్న సమయంలో తీర్థయాత్రలకు వచ్చినట్లు థియేటర్లకు జనాలు వచ్చారు. ఇది ఆంధ్ర, తెలంగాణేకాదు, కర్నాటక, మహారాష్ట్ర, ఒరిస్సా అలాగే యావత్ ప్రపంచ పండుగ అఖండ అర్థ శతదినోత్సవం. ఈ వేడుకను పలుచోట్ల అభిమానులు జరుపుకుంటున్నారు. అందుకు గర్వంగా వుంది. ఈ సినిమా విజయాన్ని చేసేలా సహకరించిన ఆది దంపతులకు కృతజ్ఞతలు. ఇక బోయపాటి శ్రీను, నా కాంబినేషన్ హాట్రిక్. మా కలయిక జన్మజన్మలది. అందుకే ఆ దేవుడే మమ్మల్ని కలిపాడు.

మానవ పుట్టుకలో ఒకరో ఇద్దిరినో స్నేహితులుగా ఇస్తారు. కానీ మాకు కోట్లాది మంది అభిమానులను సంపాదించేలా భగవంతుడు చేశాడు. నేను ఏది చేసినా అభిమానులు ప్రోత్సహిస్తూనే వున్నారు. నాకు నాన్నగారు ఆదర్శం. ఈఅఖండ విజయం తెలుగు చలన చిత్ర పరిశ్రమ విజయం.

ఈ సినిమాలో తీసుకున్న అంశం హిందూ సమాజం, ధర్మం, పద్ధతులు. వాటిజోలికి ఎవరైనా వస్తే దేవుడు అఖండలా వచ్చి వారికి బుద్ధి చెబుతాడు. కలుషితమైనపోయిన సమాజానికి ప్రక్షాణనగా ఈ సినిమా వుంది.  ఈ సినిమా ఇంత అద్భుతమైన విజయానికి కారకులు అభిమానులు, ప్రేక్షకులే. ఇది పాన్ ఇండియా సినిమా కాదు. పాన్ వరల్డ్ సినిమా. ఇక తమన్ సంగీతం ఈ చిత్రానికి అదరగొట్టేలా చేసింది.  రిలీజ్ కాకముందు ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకున్నారు. రిలీజ్ అయ్యాక థమన్ సంగీతంలా అదిరింది అన్నారు. తెలుగు పరిశ్రమ ఇలాగే మూడు పువ్వులు ఆరుకాయలుగా వుండాలి అని ఆకాంక్షించారు.

అనంతరం యాభైరోజుల జ్ఞాపికలు బాలకృష్ణ ఎగ్జిబిటర్లకు పంపిణీదారులకు అందజేశారు.


ఫైనల్ గా బాలకృష్ణ మాట్లాడుతూ, అఖండ సినిమాను థియేటర్లలో చూసి ఎంతో పెద్ద ఘనవిజయాన్ని సాధించారు. అదేవిధంగా రేపు సాయంత్రం 6గంటల నుంచి డిస్నీప్లస్ హార్ట్ స్టార్లో కూడా చూసి ఎంజాయ్ చేయండి అని తెలిపారు.


దర్శకుడు బోయపాటి శ్రీను, జై బాలయ్య అంటూ అభిమానులను హుషారెత్తిస్తూ మాట్లాడారు. సోదర సమానులైన నందమూరి అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో అలాగే అభిమానుల అండతో తెలుగు ప్రేక్షకుల అండదండలతో బాలయ్యబాబు నా మీద పెట్టుకున్న నమ్మకంతో ఈ సినిమాకు సహకరించిన నిర్మాతలకూ అఖండ విజయం సాధించి పెట్టింది. దాదాపు వందకుపైగా థియేటర్లలో ఆడుతోంది. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించారు. ఈ విజయం  నందమూరి అబిమానులది. తెలుగు ప్రేక్షకులది. తెలుగు పరిశ్రమ ది. ఈ విజయాన్ని ఎన్.టి.ఆర్.గారికి అంకితమిస్తూ, మా కాంబినేషన్ ఎప్పడు తీసినా మీ ఆదరాభిమానాలు వుండాలని కోరుకుంటున్నానని తెలిపారు.


నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, నందమూరి కుటుంబానికి, ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ, మీ అభిమానాన్ని యాభైరోజులు ఏకధాటిగా చూపించారు. అందుకే కృతజ్ఞతలు తెలిపేందుకు మీ ముందుకు వచ్చాం. మనం ఏదైనా కల కంటే అది నిజమైతే ఆనందంగా వుంటుంది. నిజాయితీగా చెబుతున్నా... ఇలా అఖండ సినిమా విడుదల అవుతుందనీ, యాభై రోజులు అడుతుందనీ, ఇంకా థియేటర్లలో కొనసాగుతుందనీ కానీ నేను కానీ, ఎవరూ కానీ కల కనలేదు. ఆ కలను నిజంచేసిన ప్రతి ఒక్కరినీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముందుముందు ఇలాగే మీ అభిమానం వుండాలంటూ జై బాలయ్య అంటూ ముగించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో నైజాం పంపిణీదారుడు శిరీష్ రెడ్డి, సుదర్శన్ థియేటర్ అధినేత బాల గోవిందరాజు, మేనేజర్ బాలు తదితరులు పాల్గొన్నారు.

ZEE5 to release Sumanth's ‘Malli Modalaindi’

 ZEE5 to release Sumanth's ‘Malli Modalaindi’

The relationship drama is going to be a ZEE5 exclusive



Hyderabad, 20 January 2022: ZEE5 has got one goal. It's to offer unlimited entertainment to its viewers in various genres, be it comedy, drama, action, or any other genre. In this endeavour, the OTT platform has picked Originals, direct-to-digital releases, and new films offering a variety of stories and subjects since its inception. Latest, it is gearing up to release a direct-to-digital movie exclusively.


‘Malli Modalaindi’, starring Sumanth in the lead, is the one. Directed by TG Keerthi Kumar, the Telugu-language film has been produced by K Rajasekhar Reddy of ED Entertainment. Anup Rubens has composed its music. ZEE5 has garnered its exclusive OTT release rights. It's planning to release the movie in February. It's a direct OTT release.


What happens when a man who applies for a divorce falls in love with his lawyer? That's the premise of 'Malli Modalaindi'. Varshini Sounderajan has played Sumanth's wife, while Naina Ganguly has played the lawyer. The first look, character posters, teaser, and trailer of the movie have already struck a chord with the audience. 'Alone Alone', a song sung by Sid Sriram, has received an amazing response. Charan Tej Uppalapati is the CEO of the banner that has bankrolled the film.


ZEE5 is gearing up for the release of 'Loser 2' on January 21. Besides 'Malli Modalaindi', a number of other offerings are on the anvil.

Athadu Aame Priyudu Poster Launched by V V Vinayak

 యండమూరి వీరేంద్రనాధ్

"అతడు ఆమె ప్రియుడు"

ప్రచారచిత్రం ఆవిష్కరించిన

దర్శకసంచలనం వి.వి.వినాయక్!!



     ప్రఖ్యాత రచయిత 

యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా 

దర్శకత్వం వహిచిన వినూత్న కథా చిత్రం “అతడు-ఆమె-ప్రియుడు”.

సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో సునీల్-బిగ్ బాస్ ఫేమ్ కౌశల్-సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో… శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో... రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ విభిన్న కథా చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమైంది. 

     త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ ను దర్శకసంచలనం వి.వి.వినాయక్ విడుదల చేసి, ట్రైలర్ అద్భుతంగా ఉందని... సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తమ చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేసిన వి.వి.వినాయక్ కు నిర్మాతలు రవి కనగాల- రామ్ తుమ్మలపల్లి సంతోషం వ్యక్తం చేశారు. రచయితగా ఎన్నో సంచలనాలకు నెలవైన యండమూరి దర్శకత్వంలో రూపొందిన "అతడు ఆమె ప్రియుడు" అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని పేర్కొన్నారు.

     అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కెమెరా: మీర్, నిర్మాణ సారధ్యం: అమర్, సమర్పణ: శ్రీమతి కూనం కృష్ణకుమారి, నిర్మాతలు: రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాధ్!!

Tremendous Response for Producer Mitraaw Sharma PhotoShoot

 



The producer of #Boys - Mitraaw Sharma bold photoshoot snaps going viral


Young producer Mitraaw Sharma is currently bankrolling '#Boys' along with Dayanand. The teaser of the film was unveiled by Sunny Leone and it garnered a great response. The makers are now planning to release the trailer of the film in a new-age manner. The makers handed over cash prizes amounting to Rs 10,000, Rs 5000, Rs 3000 to 100 people with the 'Common Man is our Celebrity' promotional plan.


Mitraaw Sharma has now taken part in a bold photoshoot and she looks all things gorgeous in the same. Not often to do wee young female producers in Telugu cinema looking so very sensuous. Mitraaw is now proving that she is not just a producer but is also a great model/actress. These snaps are now going viral on social media. She is lining up a few more projects under her production house now. 


Venkat Prasad is handling the cinematography for #Boys and Marthand K Venkatesh is the editor. Bekkem Ravinder and Kondapurthi Prasad are the production managers. More details will be out soon.



Kabir Duhan Singh is Super Villain ELECTRO-MAN in INDRANI film

 Kabir Duhan Singh is Super Villain ELECTRO-MAN in INDRANI film




Kabir Duhan Singh will be playing the most powerful SUPER VILLAIN ever featured in Indian Cinema History, said Stephen, Director of India’s First Super Girl Film INDRANI.  He also informed that the designing of the action episodes between Indrani and ELECTRO-MAN played by Kabir Singh have been finalized and they have come out SUPERBLY well. Director is very confident that the background score by Music Director Sai Kartheek and Visual Effects designed by Srikanth Shakamuri in these action sequences will elevate the fights to next level and make sure that audience will sit at the edge of their seats watching ELECTRO-MAN and Indrani's electrifying performances.



Producer Suman Babu P has mentioned that INDRANI film has a very UNIQUE storyline & screenplay which has never been explored in any film so far, and the box office result of INDRANI will be nothing short of a BLOCKBUSTER. 



The makers are planning to announce other cast and crew of the movie soon.




Supriya yarlagadda About Loser 2

 


కొన్ని క‌థ‌లు ఓటీటీలోనే చెప్పాలి - జ‌న‌వ‌రి 21న జీ 5లో ఒరిజిన‌ల్‌ సిరీస్ 'లూజర్ 2` స్ట్రీమింగ్ సంద‌ర్భంగా నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ‌



స్పోర్ట్స్ డ్రామా జాన‌ర్‌లో రూపొందిన ఒరిజినల్ సిరీస్ 'లూజర్'తో వీక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రజల కోరిక మేరకు తాజాగా ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన 'జీ 5' ఒరిజినల్ సిరీస్ 'లూజర్ 1 ఏంతో ప్రేక్షాదరణ పొందింది'.ఆ హిట్ సిరీస్ కు సీక్వెల్ గా ''లూజర్ 2' ను తీసుకువస్తోంది.తొలి సీజన్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో  తెరకెక్కింది. 'లూజర్ 2'కు అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించారు. దీనికి అభిలాష్ రెడ్డి క్రియేటర్., అన్న‌పూర్ణ స్టూడియోస్‌, స్పెక్ట్ర‌మ్ మీడియా నెట్‌వ‌ర్క్క్‌ నిర్మించిన ఈ సిరీస్ జీ`5 ఓటీటీలో ఈనెల 21న టెలికాస్ట్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా దీని గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేసేందుకు గురువారంనాడు అన్న‌పూర్ణ ఏడెకాల స్టూడియోలో టీమ్ అంతా పాల్గొన్నారు.


ముందుగా నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ లూజ‌ర్‌2 టీమ్‌ను ప‌రిచ‌యం చేస్తూ, అన్న‌పూర్ణ స్టూడియోస్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులే దీనికి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంద‌ని పేర్కొన్నారు. నేను క‌థ‌లు రాస్తాన‌ని అంటారు. కానీ ఆ క‌థ‌లు బాగుంటాయ‌ని ఎదుటివారు చెబితేకానీ తెలీదు. సినిమాకూ, ఓటీటీ క‌థ‌ల‌కు చాలా వ్య‌త్యాసం వుంటుంది. ఓటీటీలో చిన్న పాత్ర అయినా చాలా డిటైల్‌గా రాయాలి. భ‌ర‌ద్వాజ్‌, శ్ర‌వ‌న్‌, అవినాష్ మొద‌టినుంచి క‌థ‌ను రాయాల‌ని అనుకుని వ‌చ్చారు. అవి విన్న వెంట‌నే ఏ పాత్ర‌ను చూసినా వాటికి పూర్తి న్యాయం చేశారు. వెబ్ క‌థ‌లు వేరుగా వుంటాయి. అదే సినిమా అయితే లాగ్ అనేది ఎడిటింగ్‌లో తెలిసిపోతుంది. కానీ ఓటీటీలో లాగ్‌ వుండాలి. దానిలోనూ అందం క‌నిపించాలి. దానికీ ఓ టైం పిరిడ్ వుంటుంది. అటువంటి దాన్ని స‌రిగ్గా చూప‌గ‌లిగితే ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ అవుతాడు. ఇక స్క్రీన్ ఫేస్‌కూడా ద‌గ్గ‌రా చూపించాలి. అందులో న‌టీన‌టులను ఎఫెక్టివ్‌గా చూపించ‌గ‌ల‌గాలి. ఒక్కోసారి క‌ళ్ళు కూడా మాట్లాడుతుంటాయి. దాన్ని క్యాచ్ చేయ‌గ‌ల‌గాలి. మాకు ఫేవ‌ర్ అంశం ఏమంటే, దీనికి ప‌నిచేసిన వారంతా మా అన్న‌పూర్ణ స్టూడియోస్ కాలేజీలో చ‌దువున్న వారే. అందుకే వారి మ‌ధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్ప‌డి క‌థ బాగా రావ‌డానికి దోహ‌ద‌ప‌డింది.

ద‌ర్శ‌కుడు అభిలాష్ ఒకసారి క‌థ‌ను చెప్ప‌డానికి వ‌చ్చాడు. స్పోర్ట్స్ ఫీల్డ్‌లో స‌క్సెస్ అవ్వ‌ని వారు గురించి చెప్పారు. ఇలాంటి క‌థ‌లు ఎక్క‌డా చెప్ప‌లేం. ఓటీటీలోనే చెప్ప‌గ‌లం. అందుకు జీటీ వారు మ‌మ్మ‌ల్ని న‌మ్మ‌డం అందుకు అనుగుణంగా తెర‌కెక్కించ‌డం జ‌రిగింది. ఇందులో పాత్ర‌ల ప‌రంగా పెద్ద వారు. లేరు. అంద‌రూ స‌రిప‌డేవిధంగా కుదిరారు. ఇప్ప‌టి యువ‌త‌రం ఏవైనీ కొత్త విష‌యాలు మాకు నేర్పించేవారుగా వుండాలి. అలా వున్న టీమ్ మాకు దొరికింది. కొత్త‌త‌రంలో టాలెంట్ బాగుంటుంది. రేపు ఓటీటీలో చూసి మీరు తెలుసుకుంటార‌ని తెలిపారు.


న‌టుటు వెంక‌ట్ మాట్లాడుతూ, సినిమాలుచేసినా ఓటీటీలో చేయ‌డం థ్రిల్ క‌లిగిస్తుంది. లూజ‌ర్‌2 సిరీస్ నాకు బాగా న‌చ్చిన క‌థ‌. ఇందులో చాలా మంది జీవితాలు మ‌న క‌ళ్ళ‌ముందుక నిపించేలా వుంటాయ‌ని పేర్కొన్నారు.  


దర్శకుడు అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది చాలా ఇష్ట‌ప‌డి చేసిన క‌థ‌. పీరియాటిక్ క‌థ‌తో కూడుకున్న‌ది. ఈ కథకు భరత్, శ్రవణ్ లిద్దరూ రైటింగ్ లో ఫుల్ సపోర్ట్ చేశారు.అలాగే  మాకు సపోర్ట్ గా నిలుస్తూ మంచి సూచ‌న‌లు సుప్రియ గారు ఇచ్చారు వారికి మా ధన్యవాదాలు. నాతోపాటు కొన్ని ఎపిసోడ్స్ శ్రవణ్  డైరెక్ట్ చేశాడు. స్పెక్ట్రా మీడియా నెట్వర్క్ మాకు ఎం కావాలన్నా సహాయ సహకారాలు అందించారు వారికి మా ధన్యవాదాలు. నటీనటులు, టెక్నికల్ టీమ్ అంతా బాగా సపోర్ట్ చేయడంతో ఈ సిరీస్ బాగా వచ్చింది.ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న "లూజర్ 2" ను కూడా  ప్రేక్షకులందరూ ఆదరించి గొప్ప విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ, .అన్నపూర్ణ బ్యానర్ లో ఎంతో మందికి అవకాశం ఇచ్చినా కూడా వారు గొప్పలు చెప్పుకోరు. మేము లూజర్ కోసం చాలా కష్టపడ్డాము.టెక్నిసిషన్స్ అందరూ చాలా సపోర్ట్ చేయడంతోనే ఈ సీరీస్ ఇంతపెద్ద హిట్ అయ్యింది. మా కిలాంటి మంచి కంటెంట్ ఉన్న సిరీస్ లో  నటించే అవకాశం ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియో కు,సుప్రియ గారిగి జీ 5 కు మా ధన్యవాదాలు అన్నారు.

 

శశాంక్  మాట్లాడుతూ, నేను ఏజ్ వున్న వాడిగా క‌నిపిస్తాను. ఆ పాత్ర‌ను ద‌ర్శ‌కుడు బాగా డిజైన్ చేశాడు. ట్రైల‌ర్‌లో చూసిన వారంతం మెచ్చుకోవ‌డం ఆనందంగా వుంది. ఈ అవ‌కాశం ఇచ్చిన సుప్రియ గారికి ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నాన‌ని పేర్కొన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో హర్షిత్, పావని, కల్పిక‌, గాయ‌త్రితోపాటు సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.


నటీనటులు

ప్రియ‌ద‌ర్శి, ధ‌న్యా బాలకృష్ణ‌న్‌, క‌ల్పికా గణేష్, షాయాజీ షిండే,  శ‌శాంక్‌,  హ‌ర్షిత్ రెడ్డి, సూర్య‌,  పావ‌నీ గంగిరెడ్డి,  స‌త్య కృష్ణ‌న్  శ్రీ‌ను, టిప్పు, తదితరులు


సాంకేతిక నిపుణులు-=

ప్రొడ‌క్ష‌న్‌:  అన్న‌పూర్ణ స్టూడియోస్‌, నిర్మాత - సుప్రియ యార్ల‌గ‌డ్డ‌, ద‌ర్శ‌క‌త్వం- అభిలాష్ రెడ్డి క‌న‌కాల‌, శ్రవ‌ణ్ మాదాల‌, రచన: అభిలాష్ రెడ్డి క‌న‌కాల‌, శ్ర‌వ‌న్ మాదాల‌, సాయి భరద్వాజ్, సంగీతం: సాయి శ్రీ‌రామ్ మ‌ద్దూరి, ఛాయాగ్ర‌ణం: న‌రేష్ రామ‌దురై, క్రియేటివ్ ప్రొడ్యూసర్: మహేశ్వర్ రెడ్డి గోజల,  ప్రొడక్షన్ డిజైన్: ఝాన్సీ లింగం,   కాస్ట్యూమ్ డిజైనర్ & స్టైలిస్ట్: రజనీ, ఎడిటింగ్‌- అనిల్ కుమార్ పి.

కూర్పు: కుమార్ పి. అనిల్‌,


Varalaxmi Sarathkumar On Boarded For Sundeep Kishan Pan India Film Michael

 Varalaxmi Sarathkumar On Board For Sundeep Kishan, Vijay Sethupathi, Ranjit Jeyakodi, Sree Venkateswara Cinemas LLP, Karan C Productions LLP’s Pan India Film Michael



Sundeep Is Unique  star who has craze in multiple languages, Also Who is well known For Selecting Fine choice of Scripts.

Sundeep Kishan is presently starring in a massive action entertainer Michael with Makkal Selvan Vijay Sethupathi playing a special action role. Ranjit Jeyakodi is directing this Pan India film to be released in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages, while the most happening Production House Sree Venkateswara Cinemas LLP in association with Karan C Productions LLP is mounting it on a massive scale.


The film is turning big with every announcement. Divyansha Kaushik is essaying the heroine opposite Sundeep Kishan in the movie. Now, Varalaxmi Sarathkumar comes on board to play a crucial role in the movie. More details about her character in the movie are awaited.


Star director Gautham Vasudev Menon is playing an antagonist in the film that has already completed a shooting schedule and second schedule will commence soon.


Ranjit Jeyakodi penned a distinctive script and Sundeep Kishan will be seen in an intense and author-backed role.


Michael is a joint production venture of Bharath Chowdary and Puskur Ram Mohan Rao. Narayan Das K Narang is the presenter.


The film’s other cast and crew will be revealed later.


Cast: Sundeep Kishan, Vijay Sethupathi, Gautham Menon, Divyansha Kaushik, Varalaxmi Sarathkumar and others


Technical Crew:

Director: Ranjit Jeyakodi

Producers: Bharath Chowdary and Puskur Ram Mohan Rao

Presenter: Narayan Das K Narang

Banners: Sree Venkateswara Cinemas LLP, Karan C Productions LLP

PRO: Vamsi-Shekar

Nandamuri Balakrishna Akhanda Successfully Completes 50 Days In 103 Centres

 Nandamuri Balakrishna, Boyapati Sreenu, Dwaraka Creations Akhanda Successfully Completes 50 Days In 103 Centres




Natasimha Nandamuri Balakrishna and mass director Boyapati Sreenu’s is proving to be one of the craziest and successful combinations. The duo who previously delivered two blockbusters earlier with Simhaa, Legend have completed hat-trick hits in their combination. Like how Simhaa and Legend were biggest hits by the time for Balakrishna, Akhanda is ending as the highest grosser for the actor.

Meanwhile, Akhanda successfully completes 50 days run in 103 centres which is a rare feat in recent times, not just in Tollywood, but in entire Indian film industry. The film which was made on highest ever budget for Balakrishna has done a business of Rs 200 Cr which includes theatrical gross and non-theatrical revenue.

Akhanda indeed provided huge profits to producer as well all the distributors which again is another rare achievement in recent times. It was a profitable venture in overseas too. While it has done wonderful business in UK and Australia, the film crossed 1 million dollar mark in USA.

When there was so much uncertainty over theatrical business due to upsurge in omicron cases, Akhanda came and conquered the box office. Despite new releases every week, the mass action entertainer continued to make solid business. The film collected good numbers in its seventh week as well.

It’s the team work which resulted in an exceptional outcome. S Thaman’s background score is other biggest asset of the movie, other than C Ram Prasad’s cinematography and rich production values of Dwaraka Creations.

Pragya Jaiswal played the leading lady in the movie, while Srikanth played the antagonist and Jagapathi Babu appeared in a vital role.

Tremendous response across southern States for The Warrior first look

Tremendous response across southern States for The Warrior first look



The first look of The Warrior, ace director N Lingusamy's upcoming Telugu-Tamil bilingual starring Tollywood young gun Ram Pothineni, which was released recently along with the title, has evoked tremendous response. 


Interestingly, fans are celebrating it not just in the Telugu States of Andhra Pradesh and Telangana, but also in other South Indian States like Tamil Nadu, Karnataka and Kerala. Not just that, the look has created a huge positive impact across India.


In Andhra and Telangana, fans celebrated the first look of The Warrior in a huge way with 40-ft cutouts and grand flexi banners in many areas. They burst crackers, distributed sweets and made it look and sound like a festival.


Earlier known as RAPO19, the title of the film was revealed recently. Along with a poster that features Ram Pothineni as a police officer wielding a gun with a tough look and with cops surounding him, the title of the movie was unveiled as The Warrior. 


The poster was designed in such a way that it triggered a lot of curiosity about the subject. Cop stories are always loved by the audience. With Ram donning the khaki for the first time that too in the combination of Lingusamy, who is known for his gripping entertainers, a lot of expectations are riding on The Warrior. 


According to the movie's team, the film will surpass the anticipations and will be one of the memorable police stories of south Indian cinema. The Warrior comes after the success of iSmart Shankar of Ram Pothieni. A fresh schedule shoot of The Warrior has commenced in which crucial scenes are being shot. 


Aadhi Pinisetty, who is popular in both Kollywood and Tollywood, plays the antagonist and his character will be talked about. The film has Krithi Shetty, one of the happening actresses of the south, as heroine, while Akshara Reddy will be seen in an important role. 


Produced by Srinivasaa Chitturi under Srinivasaa Silver Screen banner, The Warrior is expected to be a feather in the production house's hat after the success of its recent sports drama Seetimaar, which had Gopichand and Tamannah Bhatia in lead roles. 


The action drama will be presented by Pavan Kumar and it is a Devi Sri Prasad musical. Cinematography is by Sujith Vaassudev.

Chiru Bidiyam lyrical video from Naveen, Divya Sripada's Charitha Kamakshi out now

 



Chiru Bidiyam lyrical video from Naveen, Divya Sripada's Charitha Kamakshi out now


Featuring Naveen Bethiganti and Divya Sriapada in the lead roles, Charitha Kamakshi is being bankrolled by Rajini Reddy under Firefly Fly Arts banner. The first look poster of the film had already garnered a very good response. 


Now, the makers have unveiled the lyrical video of the Chiru Bidiyam song from the audio album. The lead pair is seen in traditional outfits as they ooze charm and elegance in the video. 


The music and the composition are of elite quality. Abu is composing the music for the film. Kodati Pawan is the editor and Raki Vanamali is the cinematographer. The makers stated that more details about the film will be out in the days to follow.

Tremendous Response for Tamannaah Song From Ghani

 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్  ‘గని’ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్‌కు అద్భుతమైన స్సందన.. 



మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ తమన్నా ఐటం సాంగ్ చేసారు. ఈ మధ్యే విడుదలైన పాటకు అనూహ్యమైన స్పందన వస్తుంది. యూ ట్యూబ్‌లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ‘కొడితే’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాసారు. హారిక నారాయణ్ పాడిన ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. తమన్నా అందచందాలు పాటకు అదనపు ఆకర్షణ. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా మేకోవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ చేసి సరికొత్త ఫిజిక్‌తో కనిపిస్తున్నారు. జనవరి 19న ఈయన పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తుంది. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.


నటీనటులు: 

వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు


టెక్నికల్ టీమ్:

దర్శకుడు: కిరణ్ కొర్రపాటి

నిర్మాతలు: అల్లు బాబీ, సిద్దు ముద్ద

సమర్పకుడు: అల్లు అరవింద్

ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్ 

సినిమాటోగ్రపీ: జార్జ్ సి విలియమ్స్

ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్

సంగీతం: థమన్

పిఆర్ఓ: వంశీ కాక, ఏలూరు శ్రీను

Varun Tej Ghani Teaser Launched

 వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ‘గని’ టీజర్ విడుదల..



మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా మేకోవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ చేసి సరికొత్త ఫిజిక్‌తో కనిపిస్తున్నారు. జనవరి 19న ఈయన పుట్టిన రోజు సందర్భంగా టీజర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఇందులో బాక్సర్‌గా నటిస్తున్నారు వరుణ్ తేజ్. దీనికోసం బాక్సింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ప్రొఫెషనల్ బాక్సర్స్‌తో కలిసి సినిమాలో నటిస్తున్నారు వరుణ్ తేజ్. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.


నటీనటులు:

వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు


టెక్నికల్ టీమ్:

దర్శకుడు: కిరణ్ కొర్రపాటి

నిర్మాతలు: అల్లు బాబీ, సిద్దు ముద్ద

సమర్పకుడు: అల్లు అరవింద్

ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్

సినిమాటోగ్రపీ: జార్జ్ సి విలియమ్స్

ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్

సంగీతం: థమన్

పిఆర్ఓ: వంశీ కాక, ఏలూరు శ్రీను


Heroine Nidhi Agerwal turns Lucky Charm for HERO

 "హీరో" సినిమాలో పర్మార్మెన్స్ తో ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్



తన కొత్త సినిమా "హీరో"తో ప్రేక్షకులను ఫిదా చేసేస్తోంది అందాల తార నిధి అగర్వాల్. గల్లా అశోక్ డెబ్యూ ఫిల్మ్ గా వచ్చిన హీరో చిత్రంలో నిధి గ్లామర్, నటన ఆకట్టుకుంటోంది. హీరో విజయంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది నిధి అగర్వాల్. ఈ సినిమాలో నిధి పర్మార్మెన్స్ పై ప్రేక్షకులే కాదు చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. 


నటుడు జగపతి బాబు తనకు మళ్లీ హీరో కావాలని కోరిక ఉందని, ఎందుకంటే తనకు హీరోయిన్ గా నిధి అగర్వాల్ దొరికే అవకాశం ఉండొచ్చని చెప్పారు. నిధి అందంగా ఉండటమే కాదు థియేటర్లో తన పర్మార్మెన్స్ కు  వస్తున్న అప్లాజ్ ఆకట్టుకుందని చెప్పారు. మరో నటుడు నరేష్ అయితే నిధి అగర్వాల్ కున్న క్రేజ్ చూస్తుంటే మళ్లీ జన్మలో ఆమెలా పుట్టాలని ఉందని అన్నారు. నిధి అంటే సందప అని ఆమెను హీరోయిన్ గా పెట్టుకున్న సినిమాలన్నీ సూపర్ కలెక్షన్స్ రాబడుతున్నాయని బ్రహ్మాజీ చెప్పారు. హీరో సుధీర్ బాబు, దర్శకులు అనిల్ రావిపూడి, కొరటాల శివ కూడా నిధి స్క్రీన్ ప్రెజన్స్ ను, ఆడియెన్స్ లో ఉన్న క్రేజ్ ను మెచ్చుకున్నారు.


తెలుగులో నాగచైతన్యతో సవ్యసాచి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అఖిల్ సరసన మిస్టర్ మజ్నూ లో నటించింది. రామ్, పూరీ జగన్నాథ్ ల ఇస్మార్ట్ శంకర్ తో ఫస్ట్ సక్సెస్ అందుకుని తెలుగు తమిళ ఇండస్ట్రీలను ఆకర్షించింది. ఆ తర్వాత తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది.


సంక్రాంతి పండగ ఈ టాలెంటెడ్ హీరోయిన్ కు బాగా కలిసొచ్చింది. పండక్కి విడుదలైన గల్లా అశోక్ హీరో సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ చేసిన సుబ్బు క్యారెక్టర్ ను ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హీరో చిత్రంలో నిధి పర్మార్మెన్స్ తో పాటు గ్లామర్ కు యూత్ ఆడియెన్స్ ఫాంటసీలో పడిపోతున్నారు. నిధి లిస్టులో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో నాయికగా కనిపించబోతోంది నిధి అగర్వాల్.

Badmashgallaki Bumper offer movie Trailer Launched

 ఫన్, సస్పెన్స్ డ్రామాతో ఆకట్టుకుంటున్న "బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్" సినిమా ట్రైలర్



ఇంద్రసేన, సంతోష్ రాజ్, నవీనా రెడ్డి, మెరిన్ ఫిలిప్, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్". సస్పెన్స్ కామెడీ డ్రామా కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు రవి చావలి తెరకెక్కిస్తున్నారు. ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడెమీ, ప్లాట్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్, తిరుమల మీడియా బ్యానర్స్ పై నిర్మాతలు అతీంద్ర అవినాష్ మరియు అలవలపాటి శేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్" చిత్రానికి రాఘవేంద్ర రెడ్డి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా "బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్" సినిమా ట్రైలర్ విడుదలైంది. ఫన్ సస్పెన్స్ డ్రామాతో ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటూ ఆకట్టుకుంటోంది.


"బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్" ట్రైలర్ ఎలా ఉందో చూస్తే.. *ఇవాళ, రేపు తప్పు చేయకుండా బతకడం కష్టంరా.. కానీ పక్కోడు చేసిన తప్పును వాడుకుని బతకడం ఈజీ* అనుకుంటారు రాజు, రమేష్ అనే ఇద్దరు యువకులు. ఇదే ఆలోచనతో సులువుగా డబ్బు సంపాదిస్తూ జల్సా చేస్తుంటారు. ఈ క్రమంలో వాళ్లు కామెడీ, యాక్షన్ చేయాల్సివస్తుంది. ఇద్దరు హీరోయిన్ల క్యారెక్టర్స్ ను కూడా పరిచయం చేశారు. నేను చాలా అదృష్టవంతుడిని అని చెప్పుకున్న విలన్ సత్యప్రకాష్ తో ఇప్పటి నుంచి నీకు శని దశ మొదలైందిరా అంటారు హీరోలు. *బంగారు గుడ్లు పెట్టే బాతును చంపకూడదురా అది పెడతనే ఉండాలే మనం బాగుపడతనే ఉండాలే*. అంటూ హీరో చెప్పే డైలాగ్ తో ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్ కంప్లీట్ అవుతుంది. 


సస్పెన్స్ కామెడీ డ్రామా మూవీగా తెరకెక్కిన "బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్" సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక ట్విస్ట్ వస్తుందని చెబుతున్నారు దర్శకుడు రవి చావలి. మరి ఆ ట్విస్టులు ఎలా ఉంటాయో త్వరలోనే థియేటర్ లలో సినిమా రిలీజ్ అవగానే చూసేయొచ్చు.


సత్య ప్రకాష్,‌ శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్ - మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ - విజయ్ సి కుమార్, సంగీతం - బాంబే భోలే, పీఆర్వో - జీఎస్కే మీడియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - దుర్గాప్రసాద్ శెట్టి , నిర్మాతలు - అతీంద్ర అవినాష్, శేఖర్ అలవలపాటి సమర్పణ - రాఘవేంద్ర రెడ్డి, దర్శకత్వం - రవి చావలి

Producer Dil Raju Interview About Rowdy Boys

 రౌడీబాయ్స్ హీరోగా ఆశిష్‌కు చక్కటి శుభారంభాన్నిచ్చింది, మౌత్‌టాక్‌తో కలెక్షన్లు పెరుగుతున్నాయి: నిర్మాత దిల్‌రాజు




రౌడీబాయ్స్‌తో హీరోగా ఆశిష్‌కు చక్కటి  శుభారంభం దక్కడం ఆనందంగా ఉంది.  నటన, డ్యాన్సుల్లో పరిణతి కనబరచడచంతో పాటు ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌లో కూడా నటుడిగా అందర్ని ఆకట్టుకున్నాడని  ప్రశంసిస్తున్నారు అని అన్నారు దిల్‌రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి ఆయన నిర్మించిన తాజా చిత్రం రౌడీబాయ్స్. ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ నిర్మాత దిల్‌రాజు పాత్రికేయులతో ముచ్చటించారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి చక్కటి స్పందన లభిస్తున్నది. కథ, కథనాలు బాగున్నాయని, ఆశిష్ అద్భుతంగా నటించాడని చెబుతున్నారు. కథ, పాత్రలతో యువతరం కనెక్ట్ అవుతుండటంతో ఓపెనింగ్స్ నిలకడగా ఉన్నాయి. పండుగ తర్వాత కూడా వసూళ్లు తగ్గలేదు. ఐదు రోజుల్లో దాదాపు ఏడు కోట్ల గ్రాస్ వచ్చింది. నాలుగున్నర కోట్ల షేర్ లభించింది. మౌత్‌టాక్‌తో వసూళ్లు నిలకడగా వున్నాయి. సంక్రాంతి బరిలో విడుదలై అందరి అభినందనలు అందుకుంటుంది. ఆంధ్రాలో చాలా చోట్ల హౌస్‌ఫుల్‌తో సినిమా ఆడుతుంది.  కొత్త హీరో సినిమాకు ఈ స్థాయి ఆదరణ దక్కడం సంతోషంగా ఉంది. రెండో వారంలో ఇదే ఆదరణ లభిస్తుందనే నమ్మకముంది. ఆశిష్ అరంగేట్రం కోసం ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా కంటే నటనకు ప్రాధాన్యమున్న యూత్‌ఫుల్ కథ అయితేనే బాగుంటుందని కొంతమంది శ్రేయోభిలాషులు సలహాలిచ్చారు.  అతడి కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ కథను ఎంచుకున్నాం. భవిష్యత్తులో అతడు మంచి కథలు ఎంచుకునేలా చూసే బాధ్యత నాపై ఉంది.

సుకుమార్‌తో కలిసి

సినిమాను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. థియేటర్స్ కోసమే రూపొందించాం. యాభై రోజుల తర్వాతే ఓటీటీలో విడుదలచేస్తాం. దేవిశ్రీప్రసాద్ పాటలకు చక్కటి స్పందన లభిస్తున్నది. త్వరలో మ్యూజికల్ కంటెస్ట్ నిర్వహించబోతున్నాం. ఏపీలో యాభై శాతం ఆక్యుపెన్సీ అమలులో ఉన్నా  సినిమా కలెక్షన్స్ మాత్రం బాగున్నాయి.  ఈ నిబంధనను మా సినిమాకు అడ్వాంటేజ్‌గానే భావిస్తున్నాం. కరోనా భయాలు పక్కనపెట్టి సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్‌చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణలో గురువారం నుంచి వసూళ్లు పెరుగుతాయనే నమ్మకముంది. ఆశిష్ హీరోగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌తో కలిసి సెల్ఫిష్ పేరుతో ఓ సినిమాను నిర్మించబోతున్నాం. సుకుమార్ శిష్యుడు కాశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. సుకుమార్ సంభాషణలను అందించనున్నారు. ఆర్య తర్వాత నేను, సుకుమార్‌తో కలిసి చేస్తున్న చిత్రమిది. అందువల్లే  బాధ్యతగా భావిస్తున్నాం.

ఏపి అండ్ తెలంగాణలో రౌడిబాయ్స్ వసూళ్లు

తొలిరోజు ఏపీ తెలంగాణలో మొత్తం  1 కోటి 42లక్షలు, రెండోరోజు 1 కోటి 62 లక్షలు, మూడోరోజు 1 కోటి 55 లక్షలు, నాలుగో రోజు 1 కోటి 32 లక్షలు, ఐదో రోజు 1 కోటి 5 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసింది. 

Vishwak Sen Ashoka vanam Lo Arjuna kalyanam Lyrical Song Launched

 విశ్వ‌క్ సేన్  ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ నుంచి ‘ఓ ఆడ‌పిల్లా నువ్వ‌ర్ధం కావా..’ లిరికల్ సాంగ్ రిలీజ్



మాట రాని మాయ‌వా

మాయ జేయు మాట‌వా

మాటులోని మ‌ల్లెవా

మ‌ల్లె మాటు ముల్లువా

వ‌య్యారివా.. క‌య్యారివా

సింగారివా..సింగాణివా

రాయంచ‌వా.. రాకాసివా

లే మంచులో లావా నీవా

ఓ ఆడ‌పిల్లా నువ్వ‌ర్ధం కావా

నా జీవితంతో ఆటాడుతావా... 


అంటూ  అర్జున్ (విశ్వ‌క్ సేన్‌) త‌న ప్రేయ‌సి (రుక్స‌ర్ థిల్లాన్‌) కోసం పాట పాడుతున్నారు. అస‌లు వీరి క‌థేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ మేకర్స్. ఫ‌ల‌క్‌నుమాదాస్ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’. ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రాజావారు రాణిగారు’ మూవీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ చిత్రానికి కథ- మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా విద్యాసాగ‌ర్ చింతా డైరెక్ట్ చేస్తున్నారు. బుధ‌వారం ఈ సినిమా నుంచి ‘ఓ ఆడపిల్ల నువ్వర్ధం కావా..’ అనే పాట‌ను చిత్ర యూనిట్‌ విడుద‌ల చేసింది. 


సినిమా ప్రారంభం నుంచి ఈ సినిమాకు డిఫ‌రెంట్‌గా ప్ర‌మోష‌న్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది వ‌ర‌కు హీరో విశ్వ‌క్ సేన్ పాత్ర అర్జున్ అని, త‌న‌కు ముప్పై ఏళ్లు అవుతున్నా పెళ్లి కావ‌డం లేద‌ని జుట్టు పోతుంద‌ని, పొట్ట వ‌చ్చేస్తుంద‌ని క్యారెక్ట‌ర్‌ను చ‌క్క‌గా రివీల్ చేశారు. అలాగే రీసెంట్‌గా విశ్వ‌క్ సేన్ త‌న‌కు అమ్మాయి దొరికేసిందంటూ సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్‌కు కూడా మంచి స్పంద‌నే వ‌చ్చింది. ఇప్పుడు విడుద‌ల చేసిన బ్రీజి మెలోడియ‌స్ సాంగ్ ‘ఓ ఆడ‌పిల్లా నువ్వ‌ర్ధం కావా..’  ఆకట్టుకుంటోంది. 


జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఆయ‌న సంగీత సార‌థ్యంలో రూపొందిన ఈ పాట‌ను అనంత శ్రీరామ్ రాయ‌గా.. రామ్ మిర్యాల పాడారు.  ప‌వి కె.ప‌వ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. విప్ల‌వ్ ఎడిట‌ర్‌. ప్ర‌వ‌ల్య దుడ్డిపూడి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్స్ అందిస్తామ‌ని చిత్ర యూనిట్ స‌భ్యులు తెలిపారు. 



న‌టీన‌టులు:


విష్వ‌క్ సేన్‌, రుక్స‌ర్ థిల్లాన్ త‌దిత‌రులు


సాంకేతిక నిపుణులు:


ద‌ర్శ‌క‌త్వం:  విద్యాసాగ‌ర్ చింతా

స‌మ‌ర్ప‌ణ‌:  బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌

కథ, మాటలు, స్క్రీన్ ప్లే : ర‌వి కిర‌ణ్ కోలా

బ్యాన‌ర్‌: ఎస్‌.వి.సి.సి.డిజిట‌ల్‌

నిర్మాత‌లు:  బాపినీడు, సుధీర్ ఈద‌ర‌

సినిమాటోగ్ర‌ఫీ:  ప‌వి కె.ప‌వ‌న్‌

సంగీతం:  జై క్రిష్‌

ర‌చ‌న‌:  ర‌వికిర‌ణ్ కోలా

ఎడిట‌ర్‌:  విప్ల‌వ్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  ప్ర‌వ‌ల్య దుడ్డిపూడి

పి.ఆర్‌.ఓ :  వంశీ కాకా


Sr Actor Naresh Vijay Krishna Birthday Interview

 


ఈ ఏడాది  మ‌రిన్ని మంచి చిత్రాలతో మీ ముందుకు రాబోతోన్నాను - డా. న‌రేష్ విజ‌య‌కృష్ణ‌



టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ వీకే పుట్టిన రోజు (జనవరి 20) సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ గురించి మీడియాతో ముచ్చటించారు. నటుడిగా యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన సినీ కెరీర్ గురించి ప్రస్థావించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ స్థాపించి యాభై ఏళ్లు అవుతుండటంతో.. ఈ ఏడాది నుంచి తన నిర్మాణ సంస్థలో కొత్త సినిమానులను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ సంద‌ర్భంగా...


న‌రేష్ విజ‌య‌కృష్ణ మాట్లాడుతూ -  ‘జనవరి 20 నా పుట్టిన రోజు. నా అభిమానులు, పాత్రికేయ సోదరులు అందరితో కలిసి జరుపుకుంటాను. కానీ రమేష్‌ని మిస్ అవుతున్నాం. కరోనాను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది బర్త్ డేను సెలెబ్రేషన్స్ చేసుకోవడం లేదు. నా జీవితంలో జరిగే వాటిని ఇలా పంచుకోవడం సహజం. అందుకే ఇలా కలుస్తాను. 1972లో పండంటి కాపురం సినిమాతో తెరంగేట్రం చేశాను. కృష్ణ గారు, విజయ నిర్మల గారు, గుమ్మడి గారు, జయసుధ గారు ఇలా అందరూ పరిచయం అయ్యారు. నాకు నటుడిగా యాభై ఏళ్లు నిండాయి. ఇంతటి సుధీర్ఘ ప్రయాణం చాలా అరుదుగా ఉంటుంది. ఇంత జర్నీ చేసేందుకు కారణమైన సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల గారికి థ్యాంక్స్. నా గురువు జంధ్యాల గారికి థ్యాంక్స్. ఈ యాభై ఏళ్లలో ఓ పదేళ్లు సామాజిక సేవకు అంకితం చేశాను. పొలిటికల్‌గా కూడా వెళ్లాను. అనంతపురంలో సేవలు చేశాను. చెరువులు నింపడం, అంతరించిపోతోన్న కళల కోసం ఓ ఐదేళ్లు నా జీవితాన్ని అంకితం చేశాను. అలానే ఇండస్ట్రీలో పుట్టిన బిడ్డగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం పాటు పడ్డాను. యాభై ఏళ్ల ప్రయాణం తరువాత ఇప్పుడు కూడా కొత్త కొత్త పాత్రలు వేస్తున్నాను. నన్ను ఆదరిస్తున్న సినీ పరిశ్రమలోని ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సెకండ్ ఇన్నింగ్స్‌లో కారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వచ్చినప్పుడు.. ఎస్వీరంగారావు గారిని స్పూర్తిగా తీసుకున్నాను. ఎలాంటి పాత్రలైనా చేయాలని అనుకున్నాను. యువ దర్శకులు కొత్త కొత్త కాన్సెప్ట్‌లు, గెటప్‌లతో రావడం ఆనందంగా ఉంది. భారతదేశంలో నేడు తెలుగు సినిమా పరిశ్రమ విజయభావుట ఎగరవేస్తోంది. కొత్త బాటలో వెళ్తున్నాం. ఈ సమయంలో నేను ఒక బిజీ ఆర్టిస్ట్‌గా ఉండటం, రైటర్స్ మనసులో నేను ఇంకా ఉండటం నా పూర్వ జన్మ సుకృతమని భావిస్తున్నాను. విజయ కృష్ణ మూవీస్ ప్రారంభించి యాభై ఏళ్లు అవుతోంది. వాళ్ల నేతృత్వంలో మీనా, కవిత, హేమాహేమీలు, అంతం కాదు ఇది ఆరంభం అనే ఎన్నో గొప్ప చిత్రాలను తీశారు. విజయ కృష్ణ మూవీస్‌ను విజయ కృష్ణ గ్రీన్ స్టూడియో‌స్‌గా మార్చాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్‌లు చేస్తున్నారు. సినిమా బిడ్డగా నేను కూడా సినిమా పరిశ్రమకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందించాలని అనుకున్నాం. ఈ ఏడాదితో అమ్మ పేరుతో ఈ స్టూడియోను అందిస్తున్నాం. ఈ ప్రయత్నాన్ని కృష్ణగారు అభినందించారు. ఎయిర్ కండీషన్ ఫ్లోర్స్ కూడా రెడీ చేస్తున్నాం. ప్రీలిట్ సెట్స్ అనే కాన్సెప్ట్ ఇండియాలో ఎక్కడా లేదు.  భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకుని మేం దీన్ని రెడీ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం సినిమాలను నిర్మించాలనేది మా సంకల్పం. తరం మారింది. థియేటర్లు, ఓటీటీ, కొత్త దర్శకులు వస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ బేస్డ్‌గా మంచి సినిమాలను ఈ ఏడాది అందించాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఈ ప్రెస్ మీట్‌ను నిర్వహించాం. కొత్త దర్శకులు వస్తున్నారు. న్యూ జనరేషన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను తీయాలని అనుకుంటున్నాం. విజయ కృష్ణ మూవీస్ పతాకాన్ని మళ్లీ ఎగరవేయాలని అనుకుంటున్నాం. చాలా మంది నన్ను లక్కీ ఆర్టిస్ట్ అని అంటారు. నేను నిజంగానే లక్కీ. మంచి సినిమాల్లో నన్ను తీసుకున్నందుకు నేను లక్కీ. మంచి హిట్ సినిమాల్లో పాత్రలు వేశాను. జాతి రత్నాలు, దృశ్యం 2, భీష్మ, శ్రీదేవీ సోడా సెంటర్‌లో పూర్తిగా నెగెటివ్ రోల్‌ వేశాను. ఇలా నేను మంచి సినిమాల్లో నటించి, బిజీగా ఉండటం నా అదృష్టం. ఈ ఏడాది కూడా మంచి చిత్రాలతో మీ ముందుకు రాబోతోన్నాను. మైత్రీ, నాని సినిమా అంటే సుందరానికీలో మంచి రోల్‌ పోషిస్తున్నాను. నందినీ రెడ్డి గారి అన్నీ మంచి శకునాలే సినిమాలో మరో సినిమాను చేస్తున్నాను. వరుణ్ తేజ్ గనిలో మంచి రోల్ చేస్తున్నాను. వైష్ణవ్ తేజ్ చిత్రంలోనూ నటిస్తున్నాను. దీంతో పాటు చాలా కొత్త పాత్రలు వస్తున్నాయి. ఇంకొన్ని లీడ్ రోల్స్ వస్తున్నాయి. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో వెబ్ సిరీస్, నిహారిక తీసిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ బాగా నిలబడింది. ఇదంతా తెలుగు పరిశ్రమ ముందుకు వెళ్తోందనే పాజిటివ్ సైన్. దాంట్లో భాగంగా నేను కూడా ఉన్నందుకు సంతోషిస్తున్నాను. రానున్న రోజుల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లలో విజయ కృష్ణ మూవీస్ అలరించబోతోంది. వెల్ఫేర్ విభాగంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో బెంచ్ మార్క్ క్రియేట్ చేశాం. మేం చేసిన కార్యక్రమాల వల్లే గత ఎన్నికల్లో మేం గెలిచాం. మమ్మల్ని గౌరవించి గెలిపించిన మా సభ్యులకు థ్యాంక్స్. అధ్యక్షుడిగా ఒకేసారి పోటీ చేస్తాను అని చెప్పాను. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా నా సపోర్ట్ ఇస్తాను. సినిమా బిడ్డగా నేను ముందుంటాను అని చెప్పాను. ఈ శ్రామ్‌లో సినిమా కార్మికులందరికీ ఈ కార్డ్‌లను ఇప్పించాలని ప్రయత్నిస్తున్నాం. సినిమా నాకు సక్సెస్ ఇచ్చింది కాబట్టి.. సినిమా బిడ్డగా నేను ఎవ్వరికైనా సేవ చేసేందుకు రెడీగా ఉన్నాను. సినీ పరిశ్రమకు సేవ అనేది నా బాధ్యత. కళాకారుల ఐక్య వేదికను స్థాపించి పదేళ్లు అవుతుంది. పదకొండు వేల సభ్యులున్నారు. అంతరించిపోతోన్న కళల మీద పదేళ్లుగా పని చేస్తున్నాం. తోలు బొమ్మలాటల వంటి వాటి మీద పని చేస్తున్నాం. ఈ సంస్థ ద్వారా మా మెంబర్లు, సినిమా కార్మికులకు కూడా సేవా చేస్తామని చెప్పదలుచుకున్నాను.


నాలుగు స్థంభాల సినిమా చేస్తోన్న సమయంలో నాకు 17 ఏళ్లు. గౌరవం ఆశించకు. ప్రతీ ఒక్కరికీ నువ్ గౌరవం ఇవ్వు. సెట్‌లో లైట్ బాయ్ నుంచి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు అని మా అమ్మ గారు చెప్పారు. నేను అదే ఫాలో అవుతుంటాను. ప్రతీ ఒక్కరినీ గౌరవిస్తాను. అందరినీ కలుపుకుపోవడం, కలిసి పని చేయడం, దర్శకులు చెప్పింది చేయడం వంటి వాటి వల్లే నేను ఇంకా టాప్‌లో ఉన్నాను. నిర్మాతను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. కాంట్రవర్సీల జోలికి వెళ్లలేదు. నేను కూడా ఓ నిర్మాతే. దాదాపు 30 సినిమాలు నిర్మించాను. ఎవరైనా కొత్త వారు వస్తే.. రెమ్యూనరేషన్ గురించి ఆలోచించను. శంకర్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. సితార ఎంటర్టైన్మెంట్స్, నవీన్ పొలిశెట్టి సినిమాను కూడా చేస్తున్నాను. మంచి సినిమాకు ఎప్పుడూ అండగా ఉంటాను. సినీ పరిశ్రమ, ప్రభుత్వం కలిసి త్వరలోనే మంచి నిర్ణయానికి వస్తారని ఆశిస్తున్నాను. ఎంతో ఓటీటీ వచ్చినా థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ వేరు. త్వరలోనే మంచి నిర్ణయం వస్తుందని అనుకుంటున్నాను. చర్చలు జరుగుతున్నాయి. పరిశ్రమ, ప్రజలు, ప్రభుత్వానికి అనుసంధానమైంది. ఈ విషయంలో ప్రభుత్వం, పరిశ్రమ కలిసి మంచి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం. మా అనేది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ సంక్షేమం కోసమే పెట్టాం. ‘మా’ను ఈ పాలిటిక్స్‌లో భాగంగా చూడకూడదు. మా సభ్యుల సంక్షేమం కోసం మెడికవర్‌లో 30 కార్పోరేట్ ఆస్పత్రులతో టై అప్ అయ్యాం. మేం మెంబర్ల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాం. ఛాంబర్, నిర్మాతలు అందరూ త్వరలోనే ప్రభుత్వాన్ని కలుస్తారని, మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాను. పొలిటికల్‌గా పదవులు ఆశించి ఎప్పుడూ నేను రాజకీయాల్లోకి రాలేదు. సామాజిక సేవ కోసం అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు నా దృష్టి అంతా కూడా సినిమాల మీదే ఉంది. సినీ పరిశ్రమ మీద దాదాపు 22 వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వారి కోసం ఆలోచించాలని, సినిమాల మీదే ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అయితే రాజకీయాల గురించి ఆలోచించడం లేదు. సినిమా పరిశ్రమ నన్ను గౌరవించి ఇన్ని మంచి పాత్రలు ఇస్తోంది. నేను రచయితనే. దర్శకత్వం అనేది చాలా పెద్ద బాధ్యత. ఆరు నెలలు ఒక సబ్జెక్ట్ మీద కూర్చోవాలి. రాజకీయాల్లోకి వెళ్లిన పదేళ్లు.. నటుడిగా నన్ను నేను మిస్ అవుతున్నాను అని డిప్రెషన్‌లోకి వెళ్లాను. అప్పుడు నటుడిగా నేను ఏం మిస్ అయ్యానో.. దాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు దర్శకత్వం చేయాలనే ఆలోచన లేదు. చేయకూడదని లేదు.. భవిష్యత్తులో చేస్తానేమో. ఇప్పుడున్న పరిస్థితులో ఈ ఏడాదిలో కరోనాను దాటి మంచి సినిమాలు ఇవ్వగలిగితే చాలు. అదే మాకు గర్వంగా ఉంటుంది. సంక్రాంతికి అశోక్ గల్లా సినిమా విడుదలైంది. మంచి టాక్ వచ్చింది. మంచి పాత్రను చేశాను. ఈ ఏడాది అందరికీ బాగుండాలని ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు.