Latest Post

Yagna Movie Shooting Started

    `య‌జ్ఞ` మూవీ షూటింగ్ ప్రారంభం!!



 ముర‌ళీ మూవీ క్రియేష‌న్స్ బేన‌ర్ పై పొందూరి లక్ష్మీదేవి స‌మ‌ర్ప‌ణ‌లో పొందూరి రామ్మోహ‌న్ రావు నిర్మిస్తోన్న చిత్రం `య‌జ్ఞ‌`.  చిత్త‌జ‌ల్లు ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో సుగ‌మ్య శంక‌ర్‌, నందిని , రాఘ‌వ, చ‌ర‌ణ్ జ‌డ్చ‌ర్ల హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. భానుచంద‌ర్, జీవా, బాలాజీ, గౌతంరాజు, సుమ‌న్ శెట్టి, పొట్టి చిట్టిబాబు, క‌విత‌, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు ప్ర‌ధాన పాత్ర‌ల్లో  న‌టిస్తున్నారు.  ఈ చిత్రం ప్రారంభోత్స‌వం ఈ రోజు హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టియ‌ఫ్‌సిసి ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా ల‌య‌న్ సాయి వెంక‌ట్ కెమెరా స్విచాన్ చేశారు. గూడూరు చెన్నారెడ్డి, శ్రీమ‌తి విజ‌య‌ల‌క్ష్మి, మారంరెడ్డి కొండా రెడ్డి, కొండ‌పాక శ్రీరామ మూర్తి పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

 అనంత‌రం ఏర్పాటు  చేసిన పాత్రికేయుల స‌మావేశంలో ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ...``ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇద్ద‌రూ నాకు చాలా కావాల్సిన‌వారు. సినిమా పట్ల ఎంతో అభిరుచి ఉన్న వ్య‌క్తులు. క‌థ విన్నాను. చాలా బాగుంది. సినిమా విజ‌యవంతంగా షూటింగ్ పూర్తి అవ్వాలని కోరుకుంటూ ... సినిమా విడుద‌ల విష‌యంలో మా తెలంగాణ చాంబ‌ర్ అన్ని విధాలుగా సాయ‌ప‌డుతుంది`` అన్నారు.

 ల‌య‌న్ సాయి వెంక‌ట్ మాట్లాడుతూ...``య‌జ్ఞ‌` టైటిల్ చాలా బావుంది. ఎంతో అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కులు ప్ర‌సాద్ గారు. కొత్త, పాత న‌టీన‌టుల‌తో రూపొందుతోన్న ఈ చిత్రం యూనిట్ అంద‌రికీ మంచి పేరు తీసుక‌రావాల‌న్నారు.

 ద‌ర్శ‌కుడు చిత్త‌జ‌ల్లు ప్ర‌సాద్ మాట్లాడుతూ...``హార‌ర్  అండ్ రొమాంటిక్  కామెడీ చిత్రంగా `య‌జ్ఞ‌` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కొత్త‌, పాత న‌టీన‌టులు న‌టిస్తున్నారు. మా నిర్మాత ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాను నిర్మించ‌డానికి ప్లాన్ చేశారు. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు షూటింగ్ చేస్తాం. కొంత గ్యాప్ త‌ర్వాత జ‌న‌వ‌రి 5నుంచి 15 రోజుల పాటు కంటిన్యూ షెడ్యూల్ ప్లాన్  చేశాం`` అన్నారు.

 నిర్మాత పొందూరి రామ్మోహ‌న్ రావు మాట్లాడుతూ...``మా చిత్రం ప్రారంభోత్స‌వానికి విచ్చేసి మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించిన అతిథులంద‌రికీ నా ధ‌న్య‌వాదాలు. ప్ర‌సాద్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ఈ సినిమా ప్రారంభించాను. నా గ‌త చిత్రాల‌న్నీ ఆదిరించారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారి కోరుకుంటున్నా`` అన్నారు.

  హీరో రాఘ‌వ మాట్లాడుతూ...`` య‌జ్ఞ ` చిత్రంలో హీరోగా న‌టించే అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు`` అన్నారు.

 ఇంకా  ఈ కార్య‌క్ర‌మంలో హీరోయ‌న్లు నందిని, సుగ‌మ్య శంక‌ర్ పాల్గొన్నారు.

   భానుచంద‌ర్, జీవా, బాలాజీ, గౌతంరాజు, సుమ‌న్ శెట్టి, పొట్టి చిట్టిబాబు, క‌విత‌, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, కోట‌కొండ కృష్ణ‌, క‌రుణాక‌ర్, సికింద‌ర్, భీమ్ రాజ్‌, రాజేష్‌, మునిచంద్ర‌, ధ‌ర్మ‌తేజ‌, మ‌ల్లీశ్వ‌రి, మంజుల‌, దీపిక‌, స్వ‌ర్ణ‌ల‌త‌, శ్రీజ రెడ్డి, దివ్య‌, సంజ‌న త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్ః ఎస్‌.క‌ర‌ణ్‌,  ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ః శ్యామ్ కోట‌, కో-డైర‌క్ట‌ర్ః కొండా శ్రీనివాస‌రెడ్డి;  కెమెరాః శ్రావ‌ణ్ కుమార్‌;  సంగీతంః దేవేంద‌ర్‌; ఆర్ట్ డైర‌క్ట‌ర్ః శివ బోగోలు;  కొరియోగ్ర‌ఫీః తాజ్ ఖాన్‌, ఫైట్స్ః హుస్సేన్ భాయ్‌;  పాట‌లుః జి.సీతారామ చౌద‌రి, ఎస్ ర‌ఘుబాబు;  పీఆర్వోః చందు ర‌మేష్‌;  నిర్మాతః పొందూరి రామ్మోహ‌న్ రావు, క‌థ‌-స్ర్ర్క్రీన్ ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వంః చిత్త‌జ‌ల్లు ప్ర‌సాద్.


New The Ten Commendments Releasing on New Year

 ప్రపంచమంతటా నూత‌న సంవ‌త్స‌ర  కానునగా విడుద‌ల కానున్న‌

న్యూ ‘ది టెన్ కమాండ్మెంట్స్’



ప్ర‌పంచ సినిమా చ‌రిత్ర లో   ‘ది టెన్ కమాండ్మెంట్స్’ ది ఒక ప్ర‌త్యేక స్థానం. ఓల్డ్ టెస్టెమెంట్ లోని మోషే చేసిన అద్భుతం ని తెర‌మీద కు తెచ్చిన ‘ది టెన్ కమాండ్మెంట్స్’ ఒక విజువ‌ల్ వండ‌ర్. ఎర్ర స‌ముద్రం ని రెండుగా చీల్చిన మోషే క‌థ ఇప్ప‌టికీ క‌న్నుల‌ముందు ఒక అద్భుతంగా క‌నిపిస్తుంది. దేవుని పై న‌మ్మ‌కం ఉంచి మోషే చేసిన ఈ అద్భుతం ఇప్పుడు మరో సారి వెండిత‌ర మీద నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా రాబోతుంది.


1956లో సెసిల్ బి డెమిల్లే (అమెరికన్ సినిమా వ్యవస్థాపక పితామహుడిగా, చలనచిత్ర చరిత్రలో అత్యంత విజయవంతమైన నిర్మాత/దర్శకుడిగా నిలిచిన వ్యక్తి) 220 నిమిషాల నిడివితో “ది టెన్ కమాండ్‌మెంట్స్” చిత్రాన్ని (పారామౌంట్ పిక్చర్స్) ప్రపంచ సినీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

భారతదేశంలో, ఈ చిత్రం ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు మరియు చెన్నై (క్యాసినో) వంటి మెట్రో నగరాలలో 50 వారాలకు పైగా ప్రదర్శితమైంది.

65 సంవత్సరాల తర్వాత ఆ అద్భుతమైన చిత్రాన్ని రీమేక్ చేశారు. ఇందులో డౌగ్రే స్కాట్ (మిషన్ ఇంపాజిబుల్ 2 & బాట్‌వుమన్ 2022 ఫేమ్) మోసెస్‌ పాత్రలో నటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 2021, డిసెంబర్ 31న నూత‌న సంవ‌త్స‌ర కానుకగా పాన్ ఇండియా స్థాయిలో (ఇంగ్లీష్, తమిళం & తెలుగులో) మరియు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

ఈ చిత్రంలో మోసెస్‌గా డౌగ్రే స్కాట్, ఆరోన్‌గా లినస్ రోచ్, మెనెరిత్‌గా నవీన్ ఆండ్రూస్, జిప్పోరాగా మియా మాస్ట్రో, రామ్‌సెస్‌గా పాల్ రైస్, అనందర్‌గా రిచర్డ్ ఓబ్రెయిన్, జెరెడ్‌గా సిలాస్ కార్సన్, యువరాణి బిథియాగా పద్మా లక్ష్మి, మిరియమ్‌గా సుసాన్ లించ్, రాణిగా క్లైరే బ్లూమ్, ఇంకా జెత్రోగా ఒమర్ షరీఫ్ నటించారు.

రాబర్ట్ డోర్న్‌హెల్మ్ మరియు జెఫ్రీ మడేజా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జేసన్ కామియోలో, రాండీ ఎడెల్‌మాన్ సంగీతం, ఎడ్వర్డ్ జె పేయ్ సినిమాటోగ్రఫీ అందించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 31వ తేదీన ప్రపంచమంతటా ఈ చిత్రం బ్రహ్మాండమైన స్థాయిలో విడుదల కాబోతుంది.

Iravatham Movie lyrical song launch by BiggBoss Contestants

 ఐరావతం"సినిమాలోని 'నా దేవేరి' పాట లిరికల్ వీడియోని రిలీజ్ చేసిన బిగ్ బాస్ టీం 



నూజివీడు టాకీస్ నుంచి రేఖ పలగాని సమర్పణలో  వస్తున్న చిత్రం ఐరావతం.ఈ సినిమాలోని  "ఓ నా దేవేరి" లిరికల్ వీడియో ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా రిలీజ్ అయినందుకు ఆరోజు గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. రామ్ మిర్యాల పాడిన ఈ పాట రిలీజైన మొదటి ఇరవై నాలుగు గంటల్లో మంచి వ్యూస్ వచ్చాయి. అలాగే ఇంతకు ముందే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చినట్టు తెలిపారు. 


ఈ ఈవెంట్ లో బిగ్ బాస్ 5 టీమ్ లో సభ్యులైన నటరాజ్ మాస్టర్, లోబో, మానస్, కాజల్ మరియు 

ప్రణీత్  యాంటీలియా మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ గారు కలిసి 'నా దేవేరి' పాట లిరికల్ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. 


హీరో,హీరోయిన్ పాత్రలలో నటించిన అమర్ దీప్,తన్వీ లు మాట్లాడుతూ..  ఒక సరికొత్త కథ లో నటించినందుకు ఆనందం వ్యక్తపరిచారు. నిర్మాతలైన రాంకీ సల్లగాని, లలితకుమారి, తోట బాలయ్య చౌదరి చల్లా మాట్లాడుతూ కథలోని న్యూ వేవ్ ట్రీట్మెంట్ మూవీ తీయడానికి ప్రేరేపించిందని ,ఇటువంటి కొత్త కథలు చెప్తే ప్రేక్షకులు ఖచ్చితంగా తమని దీవిస్తారని ఈ సినిమా షూట్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉందని చెప్పారు. 


దర్శకుడు సుహాస్ మీరా మాట్లాడుతూ.. "ఓ నా దేవేరి" పాటని టూ మెలోడియస్ గా కంపోజింగ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కి, అడగగానే పాడి ఆ పాటకు ప్రాణాన్ని పోసిన రామ్ మిరియాల కి కృతజ్ఞతలు తెలిపారు.ఐరావతం లో ఉన్న ప్రముఖ పాత్రల్లో "ఐరావతం" అనే ముఖ్య పాత్ర ఎవరిది !? మరియు వైట్ కలర్ లో ఉన్న కెమెరా ని క్లిక్ చేస్తే జరిగే మ్యాజిక్ ఏంటనేది మూవీ చూస్తేనే తెలుస్తుంది అని 

తెలిపారు. ఈ వైట్ కెమెరా హీరోయిన్ చేతుల్లోకి వచ్చాక ఆమె పడిన ఇబ్బందులు ఏమిటి అనేదీ చాలా యంగేజింగ్ గా రాసుకున్న స్క్రీన్ ప్లే అని సినిమా చూస్తే తెలుస్తోంది అన్నారు. 


మ్యూజిక్ డైరెక్టర్ సత్య మాట్లాడుతూ.. తన పైన నమ్మకం ఉంచి పాట కంపోజింగ్ అయ్యే వరకు తనని నమ్మి, అన్నివిధాలా సహకరించి ఒక మంచి పాట ఆడియన్స్ కి అందించేలా సహకరించిన నిర్మాతలకి దర్శకుడికి తను కృతజ్ఞుడినై ఉంటానన్నారు. ఇటువంటి యునీక్ స్టోరీకి మ్యూజిక్ ఇవ్వడం తన లక్ అని అన్నారు. 


నటీనటులు

హీరో: అమర్‌దీప్‌, హీరోయిన్: తన్వి, 2వ హీరో: అరుణ్, 2వ హీరోయిన్: ఎస్తేర్, కామెడీ: సప్తగిరి హీరో తల్లి: జయవాణి, SI : సంజయ్ నాయర్, హెడ్ ​​కానిస్టేబుల్: రవీంద్ర, 


టెక్నిషియన్స్

సమర్పణ :  రేఖ పలగాని 

నిర్మాతలు: రాంకి పలగాని, లలిత కుమారి తోట, బాలయ్య చౌదరి చల్లా 

దర్శకుడు: సుహాస్ మీరా 

డిఒపీ: Rk వల్లెపు 

సంగీతం: సత్య కశ్యప్ 

ఎడిటర్: సురేష్ దుర్గం 

పి.ఆర్.ఓ: మధు వి.ఆర్ 

డిజిటల్ : మనోజ్ 

పోస్టర్లు: ధని ఎల్


Meet the oggu katha artistes from Nalgonda, who hogged the limelight in 'World of Senapathi'

 Meet the oggu katha artistes from Nalgonda, who hogged the limelight in 'World of Senapathi', a glimpse of aha's web original film Senapathi starring Rajendra Prasad



100% Telugu streaming platform aha is gearing up to entertain audiences with their upcoming web original film titled Senapathi, the crime drama that marks the OTT debut of veteran actor Rajendra Prasad on December 31. Directed by Pavan Sadineni (who has helmed Prema Ishq Kaadhal in the past), the film is produced by Sushmitha Konidela and Vishnu Prasad under Gold Box Entertainments. 


Earlier this week, the film hit the headlines with World of Senapathi, which offered a sneak peek into the film's ambience. A major highlight of the glimpse was the effort to tell the story of Senapathi through the oggu katha tradition with intriguing mythological parallels. The oggu katha narrated the story of two characters SI Krishna (Naresh Agastya) and Krishna Murthy (Rajendra Prasad) - two supposed modern-day incarnations of Krishna in Kaliyuga, who adopt different paths to accomplish the same goal. 


A group of four oggu katha artistes from Nalgonda - Chinnam Srinu (main singer), Kondeboyina Mahesh, Kadakanchi Parasuramulu (chorus) and JB Laxman Ganga (lyricist) were brought on board by the team of Senapathi for the same. For the uninitiated, oggu katha is a storytelling tradition unique to the Golla Kuruma community in Telangana and originated as a tool to narrate glorious tales of kings, warriors and Gods to the masses. The small two-headed drum, popularly referred to as damarukam, besides anklets and dhol are integral elements to the storytelling tradition.


Expressing his happiness about the oggu katha artistes getting their due among audiences, Senapathi director Pavan Sadineni exclaims, "So much of struggle went into finding the right voices and finally everything paid off. It's heartening to see the reaction of the singers when they felt very happy for creating an identity for them. They felt it as an achievement coming from a backward place and singing in a city like Hyderabad. They don't even know what they are contributing exactly, but today their contribution has made things explode. That's the beauty of art and cinema. Talent anywhere won't go wasted. Everyone gets their due when the time arrives."


Gnaneswari Kandregula, Harshavardhan, Keshav Deepak and Rakendu Mouli also essay crucial roles in Senapathi. aha is also home to some of the biggest Telugu releases in 2021, including Love Story, Unstoppable with NBK, 3 Roses, One, Manchi Rojuloachaie, Romantic, Most Eligible Bachelor, Anubhavinchu Raja, Sarkaar, Chef Mantra, The Baker and The Beauty, Krack, Alludu Garu, 11th Hour, Naandhi, Super Deluxe, Tharagathi Gadhi Daati, Maha Ganesha, Parinayam, and Ichata Vahanamulu Nilupa Radu.


Pushpa The Rise Thanks Meet Held Grandly

సుకుమార్ లేకపోతే నేను లేను.. పుష్ప థ్యాంక్యూ మీట్లో ఐకాన్ సార్ అల్లు అర్జున్..



అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే వసూళ్లు 280 కోట్లు దాటిపోయాయి. ఈ నేపథ్యంలోనే సినిమా థ్యాంక్ యూ మీట్ ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు.


పుష్ప సినిమా విడుదలై సంచలన విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థ్యాంక్యూ మీట్ ఏర్పాటు చేశారు. తన కెరీర్లో సాధించిన విజయం లో సుకుమార్ పాత్ర ఎంతో ఉంది అంటూ ఎమోషనల్ అయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన మాట్లాడుతూ.. ' ఈ రోజు సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. నా కెరీర్లో ఆర్య అనేది ఒక మైలురాయి.. సుకుమార్ లేకపోతే ఆర్య లేదు.. ఆర్యా లేకపోతే నేనులేను.. ఈ రోజు నా కెరీర్ ఇంత అద్భుతంగా ఉంది అంటే దానికి కారణం సుకుమార్ అని గర్వంగా చెబుతాను. సుకుమార్ నాకు మంచి స్నేహితుడు. ఇక సినిమా విషయానికి వస్తే హిట్ అయినా.. ఫ్లాప్ అయినా థాంక్యూ మీట్ అనేది కచ్చితంగా పెడతాను. ఎందుకంటే ఫలితంతో సంబంధం లేకుండా ఏ సినిమాకైనా కష్టపడేది అంతా సమానంగానే ఉంటుంది. థాంక్యూ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. పుష్ప సినిమా కోసం అహర్నిశలు కష్టపడిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నాతో పాటు నటించిన నటీనటులకు.. సినిమా కోసం అడవుల్లో సైతం లెక్క చేయకుండా కష్టపడిన టెక్నికల్, అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పుష్ప సినిమాను ఇంత బాగా ఆదరించినందుకు మరొకసారి తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ సినీ అభిమానులకు థాంక్యూ..' అని తెలిపారు.


పుష్ప సినిమా తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకొచ్చింది రష్మిక మందన. తాజాగా పుష్ప థ్యాంక్యూ మీట్లో ఆమె మాట్లాడుతూ.. ' ముందుగా ఈ చిత్రంలో నన్ను సెలెక్ట్ చేసినందుకు దర్శకుడు సుకుమార్ గారికి థాంక్స్. ఆయన నాలో శ్రీవల్లిని ఎలా చూసాడో తెలియదు. ఏదైనా సినిమా అయిపోతే ఎమోషనల్ గా ఫీల్ అవుతారు కానీ పుష్ప అయిపోతే సంతోషంగా ఉంది. ఎందుకంటే రెండు నెలల్లో కలిసి పార్ట్ 2 కోసం పని చేయబోతున్నాం కాబట్టి. ఇది నా కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్. అది నాకు ఇచ్చిన నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.. దర్శకుడు సుకుమార్.. హీరో అల్లు అర్జున్ గారికి థాంక్స్..' అని తెలిపారు.


పుష్ప సినిమా థ్యాంక్ యూ మీట్ చాలా ఎమోషనల్‌గా జరిగింది. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. అల్లు అర్జున్ తనకు దేవుడు అంటూ చెప్పుకొచ్చాడు ఈయన. సుకుమార్ మాట్లాడుతూ.. ‘అల్లు అర్జున్ నాకు దేవుడు లాంటి వాడు. ఆయన చాలా గొప్ప నటుడు. మొహంలోనే అన్ని భావాలు పలికించగల గొప్ప నటుడు. అలాంటి నటుడు దొరకడం అదృష్టం. అన్ని ఎమోషన్స్ అద్భుతంగా పండించగల సత్తా అల్లు అర్జున్ సొంతం. ఆయనతో ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను..’ అని తెలిపారు.


హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘పుష్ప సినిమా జనవరి 6 వరకు కచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా 325 కోట్లకు పైగానే కలెక్ట్ చేస్తుందని నమ్మకంగా చెప్తున్నాము. ఇప్పటి వరకు 285 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. ఇంకా బాగా వెళ్తుంది. తమ బ్యానర్‌కు పాన్ ఇండియన్ స్థాయి గుర్తింపు ఇవ్వడమే కాకుండా.. ఇంత పెద్ద విజయం అందించినందుకు ముందుగా హీరో అల్లు అర్జున్ గారికి, దర్శకుడు సుకుమార్ గారికి ధన్యావాదాలు తెలుపుకుంటున్నాము..’ అని తెలిపారు.

LIGER (Saala Crossbreed) Multiple Updates Ahead Of New Year

Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s Pan India Film LIGER (Saala Crossbreed) Multiple Updates Ahead Of New Year



Pan India star Vijay Deverakonda and dashing director Puri Jagannadh’s maiden Pan India project LIGER (Saala Crossbreed) that also marks Dynamite Mike Tyson’s debut in Indian cinema is in last leg of shoot. Only a small shooting schedule is pending which will be canned soon in India.


As earlier revealed by the makers, Liger will ‘Aag Laga Denge’ for New Year with First Glimpse that will be out on December 31st. That’s not all, they have come up with multiple updates. “The Big Announcement Video”, will be released on December 29th at 10:03 AM.


On December 30th, we will have two special treats. While BTS Stills will be released at 10:03 AM, Special Insta Filter will be unveiled at 4 PM. On last day of this year, First Glimpse will be out. So, get ready for back-to-back treats from team Liger.


Vijay Deverakonda is seen taking a break, before going for the big fight in ring in the announcement poster. Underwent a tremendous makeover, Vijay appears with ponytail here.


Liger is going to be one of the biggest action extravaganzas in India, as it deals with the subject of Mixed Martial Arts and moreover, it features Legend Mike Tyson in a mighty role. Fans and cine goers are waiting with bated breath to witness the real action on big screens. They are eager to see the breath-taking stunt sequences of Vijay Deverakonda and Mike Tyson. The glimpse is sure to offer a perfect New Year presentation for action movie lovers.


In association with Puri connects, the film is being produced jointly by Bollywood's leading production house Dharma Productions. Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta together are bankrolling the film on a grand scale.


The film in the crazy combination has cinematography handled by Vishnu Sarma, while Kecha from Thailand is the stunt director.


Ramya Krishnan and Ronit Roy play prominent roles in Liger which is being made in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam languages.


The Pan India Movie is ready to splash its blood, sweat and entertainment, as it is releasing in theatres worldwide on 25th August, 2022. Vijay Deverakonda’s pathbreaking film Arjun Reddy was also released on August 25th four years ago in 2017. So, Liger is going to be another cult, iconic and trendsetting movie for Vijay Deverakonda.


Cast: Vijay Deverakonda, Ananya Pandey, Ramya Krishnan, Ronit Roy, Vishu Reddy, Ali, Makarand Desh Pandey and Getup Srinu.


Technical Crew:

Director: Puri Jagannadh

Producers: Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta

Banners: Puri connects and Dharma Productions

DOP: Vishnu Sarma

Art Director: Jonny Shaik Basha

Editor: Junaid Siddiqui

Stunt Director: Kecha

Pushpa Will Make 325 Crores

 'Pushpa Will Make Rs 325 Crores'



Icon Staar Allu Arjun's Pushpa: The Rise is going great guns at the box office. The film is doing pretty well not just in the domestic circuit but also in the pan-India market.


The makers held a success meet event today to celebrate the success of the Sukumar directorial. Speaking at the event, Mythri Movie Makers stated that Pushpa will make Rs 300 - Rs 325 crores in its full run at the box office. 


"Pushpa: The Rise has already grossed over Rs 285 crores at the box office. We are expecting that the film will gross in upwards of Rs 300 - 325 crores in its full run. We would like to thank Allu Arjun and Sukumar for giving us a pan-India blockbuster with Pushpa: The Rise." Mythri Movie Makers state. 


The director of Pushpa, Sukumar said Allu Arjun is like a god for him. "Allu Arjun is a very composed actor. The way he emotes subtle emotions and nuances are of top notch quality. He is like a god for me and I hope to collaborate with him multiple times in the future as well."

Karan Johar Praised Allu Arjun For His Pushpa

 'Allu Arjun Is A Huge Megastar,' Karan Johar Heaps Praises On ‘Pushpa’ Star And Success In North Markets !!!



Allu Arjun‘s latest release Pushpa: The Rise is roaring at box office. The actor has achieved a smashing box office number with the film’s pan India release and has become the talk of the town. The entertainment industry of South and Bollywood, both have been praising the actor for his performance and the way director Sukumar has presented him in the film.


Bollywood Producer and director Karan Johar who recently spoke about Allu Arjun’s stardom across India. In a recent interaction with the producers on a show, he shared his views about Allu Arjun’s star stature and the success of Pushpa: The Rise. The film has surprised everyone in the North markets with extremely pleasant numbers at the Box office. Adding to the numbers the director-producer spoke about how the Superstar has managed to penetrate Pan India markets that have seen his popular films on satellite and digital platforms.


He also said that Allu Arjun is a huge megastar. He is a big superstar in South but his films have been watched on pan-India level through satellite and Digital platforms. He did not forget to mention Allu’s previous film Ala Vaikunthaourumuloo and how Big Hit it was in Telugu states. Meanwhile, Pushpa: The Rise is running successfully in theaters with new shows being allotted even in its second week.

Recce First Look Launched

 మాంచి కిక్కిచ్చే క్రైమ్ థ్రిల్లర్ "రెక్కీ"



# "రెక్కీ" ఫస్ట్ లుక్ విడుదల 

వేడుకలో చిత్ర బృందం!!


     "స్నోబాల్ పిక్చర్స్" పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న సూపర్ క్రైమ్ థ్రిల్లర్ "రెక్కీ". "కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు" అనే ట్యాగ్ లైన్ తో శ్రీమతి సాకా ఆదిలక్ష్మి సమర్పణ... ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ యునీక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా... క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా... ఇప్పటివరకు తన కెరీర్ లోనే చేయని ఓ వినూత్నమైన పాత్ర పోషిస్తున్నారు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. 

     ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన వేడుకలో యూనిట్ సభ్యులు ఆవిష్కరించుకున్నారు. చిత్ర కథానాయకుడు అభిరామ్, దర్శకుడు ఎన్. ఎస్.ఆర్.ప్రసాద్, నాయకి సమీక్ష, సెకండ్ హీరో భద్రమ్, ఈ చిత్రంలో ఓ ముఖపాత్ర పోషించిన భాష, ఎడిటర్ పాపారావు ఈ వేడుకలో పాల్గొన్నారు.

    క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ లో తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కథాoశంతో, ఎవరూ ఊహించని ట్విస్టులతో అత్యంత ఆసక్తికరంగా రూపొందుతున్న "రెక్కీ" టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి చేసుకుని, తుది మెరుగులు దిద్దుకుంటున్న "రెక్కీ" చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్ర రూపకల్పనలో ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ గారు అందించిన మోరల్ సపోర్ట్ కు ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు.

      నాగరాజు ఉండ్రమట్ట, దేవిచరణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: శక్తి స్వరూప్, ఆర్ట్: రాజు, కెమెరా: వెంకట్ గంగాధరి, ఎడిటర్: కె.ఎల్.వై.పాపారావు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా, ప్రొడక్షన్ మేనేజర్: నాగార్జున, సమర్పణ: శ్రీమతి సాకా ఆదిలక్ష్మి, నిర్మాత: కమలకృష్ణ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్!!

Tremendous Response for Dharmapuri Lyrical Song Ayyayo Ayyayo

 రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైన 'ధర్మపురి' సినిమాలోని లిరికల్ సాంగ్ 'అయ్యయ్యో అయ్యాయ్యో'కు అనూహ్య స్పందన..



తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపించిన డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్. ఇప్పటి వరకు ఈయన డాన్స్ చూసాం.. ఇప్పుడు ఈయనలోని అభిరుచి గల నిర్మాత బయటకు వచ్చారు. గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా విశ్వజగత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ధర్మపురి. 1995 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు విశ్వజగత్. అక్కడ ఉండే రాజ గడిలో పని చేసే ఓ జీతగాడు.. బీడీలు చుట్టుకునే అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ ఈ ధర్మపురి. అక్కడున్న ఒరిజినల్ లొకేషన్స్ లో చాలా రియాలిస్టిక్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమాలోని అయ్యాయ్యో అయ్యాయ్యో లిరికల్ సాంగ్ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైంది. ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ లో శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర్ యాదవ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఓషో వెంకట్ సంగీతం అందిస్తున్న ధర్మపురి చిత్రానికి మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.


నటీనటులు:

గగన్ విహారి, అపర్ణ దేవి, నాగ మహేష్, జనార్దన్, కేశవ, బస్టాప్ కోటేశ్వరరావు, రాగిని తదితరులు..


టెక్నికల్ టీమ్:

రచన, దర్శకత్వం: విశ్వజగత్

సమర్పణ: శేఖర్ మాస్టర్

బ్యానర్: భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా

నిర్మాత: భాస్కర్ యాదవ్ దాసరి

ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్

కొరియోగ్రాఫర్: శేఖర్ మాస్టర్

సంగీతం: ఓషో వెంకట్

PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Megastar Chiranjeevi Appreciated Sukumar For Pushpa The Rise







 

Tremendous Response for Aha Telugu Indian Idol

 ‘ఆహా’ తెలుగు ఇండియన్ ఐడల్‌కి హ్యూజ్ రెస్పాన్స్.. భారీగా త‌ర‌లి వ‌చ్చిన యువ‌త‌



100% తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఆహా... తన తదుపరి షో  తెలుగు ఇండియన్ ఐడల్ ద్వారా  తెలుగు రాష్ట్రాల్లోని అత్యుత్తమ సింగింగ్ టాలెంట్ గుర్తించాలనే ఆశ‌యంతో సరికొత్త అడుగు వేసింది. అందుకోసం తెలుగు వారిలోని గాత్ర ప్ర‌తిభ‌ను వెలికితీయ‌డానికి, స‌రైన వేదిక క‌ల్పించ‌డానికి  ప్రపంచంలోనే అతిపెద్ద పాటల పోటీని తెలుగులోకి తీసుకువస్తోంది ఆహా!. అందులో భాగంగా, 12 సీజ‌న్ల‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అయిన ఇండియ‌న్ ఐడ‌ల్ ప్లాట్‌ఫార్మ్‌ని ద‌క్షిణాదిన తొలి సారిగా, అందులోనూ మ‌న తెలుగులో తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ పేరుతో ప్రారంభిస్తోంది ఆహా. నాన్‌-ఫిక్ష‌న్ స్పేస్‌లో  ప్రారంభం కానున్న ఈ షో గురించి ఇప్ప‌టికే జనాల్లో క్యూరియాసిటీ క‌నిపిస్తోంది. త్వ‌ర‌లోనే సింగింగ్ కాంపిటిష‌న్స్ ఆడిష‌న్స్ కూడా  పూర్తయ్యాయి. 


ఇండియ‌న్ ఐడ‌ల్ విన్న‌ర్‌గా నిలిచి తెలుగువారికి ఎంతో గ‌ర్వ‌కార‌ణంగా నిలిచిన శ్రీరామ్ చంద్ర .. తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే అంశం. తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ కోసం ఆన్ లైన్‌లోనూ ఆఫ్‌లైన్‌లోనూ ఆడిష‌న్స్ జరిగాయి. తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్‌లో పాల్గొనడానికి పాటించాల్సిన గైడ్ లైన్స్‌ను ఆహా విడుదల చేయగా.. వాటిని పాటిస్తూ..ఈ ఆడిషన్స్‌కు 5వేలకు పైగా కంటెస్టెంట్స్ పాల్గొనడం విశేషం. ఇంత మంది పార్టిసిపేట్ చేస్తున్నారంటే, తెలుగు ఇండియన్ ఐడల్‌కు ఉన్న క్రేజేంటో అర్థం చేసుకోవచ్చు. ఇక త్వరలోనే తెలుగు సినీ ప్రేమికులను అలరించబోతున్న ఈ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందనడంలో సందేహం లేదు. 


2021లో ఆహాలో ఇప్పటికే లవ్‌స్టోరీ, అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే, త్రీ రోసెస్‌, ఒన్‌, మంచి రోజులొచ్చాయి, రొమాంటిక్‌, మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌, అనుభవించురాజా, సర్కార్‌,  చెఫ్‌ మంత్ర, ది బేకర్‌ అండ్‌ ది బ్యూటీ, క్రాక్‌, అల్లుడు గారు, లెవన్త్ హవర్‌, నాంది, సూపర్‌ డీలక్స్, తరగతి గది దాటి, మహా గణేశ, పరిణయం, ఇచట వాహనములు నిలపరాదు... ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.

Shyam Singha Roy Team Held Grand Success Meet

సినిమాపై ప్యాష‌న్‌తో ట్రావెల్ అయిన‌ప్పుడే శ్యామ్ సింగ రాయ్ లాంటి  విజ‌యాలు వ‌స్తాయి - దిల్‌రాజు



న్యాచురల్ స్టార్ నాని హీరోగా న‌టించిన‌ శ్యామ్ సింగ రాయ్ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించిన‌ ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన స‌క్సెస్‌మీట్‌లో...


ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాహుల్‌కి థ్యాంక్స్. నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు నిర్మాతకు థ్యాంక్స్. నన్ను గుర్తించిన నాని, సాయి పల్లవిలకు థ్యాంక్స్’ అని అన్నారు.


సత్యదేవ్ జంగా మాట్లాడుతూ.. ‘పాతికేళ్ల కల నిజమైంది. ఈ పాత్ర నిజంగా ఉందా? అని సర్చ్ చేశారట. అదే నాకు పెద్ద సక్సెస్. నన్ను, రాహుల్ గారిని నమ్మి నాని గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిర్మాతకు ఆయనే చెప్పారు. దిల్ రాజు గారు ఈ సినిమాను భుజాల మీద వేసుకుని వెళ్లడం దైవికంగా అనిపిస్తుంది. ఈ సినిమాను మిస్ అయ్యామనే బాధ జీవితాంతం ఉంటుంది. అంత మంచి ప్రాజెక్ట్. అందుకే అందరూ చూడండి. ఎన్నో సినిమాలు వస్తాయ్ పోతాయ్. నాకు, మా డైరెక్టర్‌కు ఇదొక బ్లాక్ బస్టర్ కళాఖండంగా నిలిపోతుందని ఆశిస్తున్నాను. రోజి పాత్రకు సాయి పల్లవి జీవం పోశారు. ఆమె నటనను చూసి చలించిపోయాను. సింహపు పిల్లలా కనిపించారు. సావిత్రి తరువాత అంత గొప్ప నటి అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


అభినవ్ గోమఠం మాట్లాడుతూ.. ‘మా సినిమాను చూసి ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. సెకండ్ వేవ్‌ను తట్టుకుని సినిమా చేయడానికి నిర్మాత కారణం. నాని, సాయి పల్లవి, కృతి శెట్టి గారి గురించి నేను ఏం చెప్పగలను. ఇది నాని 2.ఓ. సాయి పల్లవి గారు అద్భుతంగా నటించారు. కృతి శెట్టి గారు చక్కగా నటించారు. రాహుల్ చక్కగా తీశారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్’ అని అన్నారు.


నిర్మాత వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ.. ‘సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీడియా కూడా చాలా సపోర్ట్ చేసింది. దిల్ రాజు గారు, శిరీష్ గారు నా వెంటే ఉంటూ చేసిన సాయాన్ని మరిచిపోలేను. కరోనా, లాక్డౌన్ సమయంలో ఎంతో కష్టపడి షూటింగ్ చేశాం. రాత్రి ఆరు గంటలకు ఇంట్లోకి వెళ్తే.. ఉదయం ఆరు గంటల వరకు కష్టపడేవారు. సాయి పల్లవి గారిని అయితే నిద్రపోనివ్వకుండా చేశాం. 45 రోజులు ఎంతో కష్టపడి చేశారు. నాలుగైదు సినిమాలు మాన్పించి మరీ ఈ ప్రాజెక్ట్ కోసం అవినాష్ కొల్ల గారిని తీసుకున్నాం. ఆయనకు ఇలాంటి మరిన్ని గొప్ప చిత్రాలు వస్తాయి. నీరజ కోన గారు అద్భుతంగా పని చేశారు. జెర్సీ సమయంలో కెమెరామెన్ సాను గారిని చూశాను. ఆయన మంచి చిత్రాలనే సెలెక్ట్ చేసుకుంటారు. ఆయన మా సినిమాను ఎంచుకున్నప్పుడే నాకు నమ్మకం కలిగింది. ఆ రోజు నుంచి సినిమా ఆడుతుందనే నమ్మకం మాకు ఉంది. నవీన్ గారు అద్భుతంగా పని చేశారు. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం బాగుంది. ఎన్ని సార్లు అడిగినా మా కోసం పని చేశారు. కృతి శెట్టి నటించిన ప్రతీ సినిమా హిట్ అవుతూనే ఉంది. శ్యామ్ సింగ రాయ్ రచనలు హీరో.. సమాజం అనేది విలన్. అదే సినిమా కథ. సాయి పల్లవి గారు కథ విన్న వెంటనే ఒప్పుకున్నారు. ఎప్పుడూ ఎక్కడా కూడా ఆలస్యం చేయలేదు. ఆమె తప్పా ఇంకెవ్వరూ ఈ పాత్రను చేయలేరు. ఆమె నాకు ఫ్యామిలీ మెంబర్. నాని గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది’ అని అన్నారు.


కృతి శెట్టి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు ఇంత మంచి స్పందన ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్. సినిమాను తెలుగు ప్రేక్షకులు ప్రేమించినంతగా మరెవ్వరూ ప్రేమించలేరు. ఈ చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉంది. నాని గారి సినిమాలు చూసి నటిగా ఎప్పుడూ స్పూర్తిపొందుతూనే ఉంటాను. ఈ సినిమాను చూశాక అది ఇంకా పెరిగింది. నటుడిగానే కాకుండా మంచి వ్యక్తిగా ఎంతో ఇన్‌స్పైర్ చేశారు. సాయి పల్లవి గారు అద్బుతంగా నటించేశారు. తెరపై ఆమె అందరినీ కట్టిపడేస్తారు. సత్యదేవ్ గారు అద్బుతమైన కథ అందించారు. నన్ను కొత్త పాత్రలో చూపించిన రాహుల్ గారికి థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత గారికి థ్యాంక్స్’ అని అన్నారు.


రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ.. ‘మా నిర్మాత మమ్మల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. ఈ రోజు ఆర్ నారాయణ మూర్తి గారిని గెస్ట్‌గా పిలిచి ఆశ్చర్యపరిచారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఈ రోజుకు విలువలు, నిజాయితీతో బతికే వ్యక్తి. నిప్పులాంటి మనిషి. శ్యామ్ సింగ రాయ్ లాంటి మనిషి. ఇది వరకే సినిమా టీం గురించి అంతా చెప్పేశాను. రాయి రాయి పేర్చి గుడి కట్టామని చెప్పాను. కొరియోగ్రఫర్ కృతి మహేష్ గారికి థ్యాంక్స్. దేవదాసీలుగా నటించిన అందరికీ థ్యాంక్స్. మరో కొరియోగ్రఫర్ యశ్ మాస్టర్‌కి థ్యాంక్స్. ఫైట్ మాస్టర్ రవివర్మన్ గారికి థ్యాంక్స్. ప్రొడక్షన్ టీంలో ఉండే వారే రియల్ హీరోలు. మీరంతా కనిపించని రియల్ హీరోలు. మీరంతా కలిసే ఈ సినిమాను చేశారు. హిట్, సూపర్ హిట్ అని అంతా అంటారు. కానీ ఈ సినిమా చూసిన ఆడియెన్స్ క్లాసిక్ అని అంటున్నారు.  మళ్లీ మళ్లీ చూడాలని ఉందంటున్నారు. ప్రేక్షకులకు ఉన్న అభిరుచి వల్లే ఇలాంటి సినిమాలు ఆడుతున్నాయి. వారికి కథ, కథనం, సాహిత్యం, సంగీతం అంటే ఇష్టమున్నాయి. అందుకే మా సినిమా నిలబడింది. ప్రతీ ఒక్క ఆడియెన్‌కు థ్యాంక్స్. ప్రేక్షకులకు టేస్ట్ లేదని అనడం తప్పు. మీకు నచ్చే చిత్రాలను తీస్తాను. నా జీవితంలో ముగ్గురు శ్యామ్ సింగ రాయ్‌లాంటి వ్యక్తులు ఉన్నారు. వారిలో మొట్టమొదటి వారు మా నాన్న ప్రసాద్ గారు. నాకు చిన్నతనం నుంచే ప్రశ్నించే గుణాన్ని నేర్పించారు. ఇక రెండో వారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆయన ఆఖరి శ్వాస తీసుకునే సమయంలో నేను బిజీగా ఉన్నాను. మూడో వ్యక్తి నాని గారు. రియల్ శ్యామ్ సింగ రాయ్. ఆయన వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. నాకు, నిర్మాతకు అంత అనుభవం లేకపోయినా అంతా ముందే ఉండి నడిపించారు. సెక్యూరిటీ గార్డులా సినిమాను కాపాడి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. కరోనా సమయంలో సినిమాను విడుదల చేయడం, ఇంత పబ్లిసిటీ చేయడం ఎంత ఒత్తిడితో కూడుకున్న పనో మాకు తెలుసు. కానీ ఆ ప్రెజర్‌ను మా దగ్గరకు రానివ్వుకుండా అడ్డుగోడలా ఉన్నారు. పదేళ్ల తరువాత నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో నేను మొదటి సినిమా చేశాను అని గర్వంగా చెప్పుకుంటాను. పల్లవి చూడరా ఎంత చక్కగా ఉందో అని మ అమ్మ గారు అన్నారు. తెలుగు వారి గుండెల్లో సాయి పల్లవి స్థానం అది’ అని అన్నారు.


సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘థియేటర్లో ప్రేక్షకుల రియాక్షన్ చూసి ఎంతో సంతృప్తి అనిపించింది. సత్యదేవ్, రాహుల్ గారికి థ్యాంక్స్. ఇంత మంచి పాత్రను రాసినందుకు థ్యాంక్స్. పేపర్‌లో ఏదైనా రాసుకోవచ్చు. కానీ ఆ సినిమా ఇంకా అందరికీ గుర్తుంది అంటే దానికి కారణం రాహుల్. సాను గారి విజువల్స్ అద్బుతంగా ఉన్నాయి. అవినాష్ గారి వర్క్ ఇంకా క్లియర్‌గా చూపించాలి.. ప్రతీ ఒక్కటీ ఎంతో పర్ఫెక్ట్‌గా ఉంటుంది. నీరజ గారి క్యాస్టూమ్ వల్లే అంత అందంగా కనిపించాం. కృతి శెట్టి స్వీట్ డార్లింగ్. ఆమెకు మున్ముందు మరిన్ని విజయాలు రావాలి. నిర్మాత వెంకట్ గారు నాకు ఫ్యామిలీ కంటే ఎక్కువ. ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా రోజంతా వేస్ట్ అయిపోయినా కూడా పట్టించుకోరు. నాకు మనీ కాదు.. మంచి సినిమా తీయాలని అనేవారు. ఈ చిత్రంలో భాగస్వామిని అయినందుకు ఆనందంగా ఉంది. ఇక నాని గారు.. డౌన్ టు ఎర్త్ అనే వ్యక్తిత్వం ఆయనది. ఇప్పటికీ తన సినిమాను తొలి సినిమాగానే భావిస్తుంటారు’ అని అన్నారు.


నాని మాట్లాడుతూ.. ‘సినిమా బాగుంది అని ఒకటి రెండు లైన్లలో చెప్పడం లేదు. లవ్ లెటర్‌లా రాస్తున్నారు. అదే మాకు పెద్ద సక్సెస్ అనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితులున్నా కూడా మంచి సినిమాను ఆదరిస్తామని ప్రతీ సారి నిరూపిస్తూనే ఉన్నారు. మీరున్నంత వరకు, మీ నుంచి ఈ ప్రోత్సాహం ఉన్నంత వరకు మీకు మంచి సినిమాలు ఇచ్చేందుకు ప్రాణం పెట్టి పని చేస్తాం. మొదటి నుంచి అండగా ఉన్న మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ క్యాస్టూమ్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. నీరజ కోన గారు అద్భుతంగా పని చేశారు. అభినవ్ సినిమాలన్నీ చూశాను. కానీ ఆయనతో ఇంత వరకు నటించలేదు. వేరే హీరోను నా పేరుతో పిలిచాడు. అంటే నాకు అంత బాగా కనెక్ట్ అయ్యాడేమో. శ్యామ్ సింగ రాయ్ బేసిక్ ఐడియాలో చాలా బలం ఉండాలి. అలాంటి కథను అందించిన సత్యదేవ్ గారికి థ్యాంక్స్. మీరు ఇలాంటి సమయం కోసం ఎన్నేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. శ్యామ్ సింగ రాయ్‌తో అది నిజమైనందుకు సంతోషంగా ఉంది. రాహుల్ పేరెంట్స్ ఇక్కడున్నారు. వారి కళ్లళ్లో ఆనందం కనిపిస్తుంది. రాహుల్ పట్ల మేం ఎంతో గర్వంగా ఫీలవుతున్నాం. శ్యామ్ సింగ రాయ్ వంటి పెద్ద సినిమా, ఇంత కాస్టింగ్‌, పెద్ద బాధ్యతను రాహుల్ మీద పెట్టాం. ఇండస్ట్రీలో చాలా మంది నమ్మలేదు. కానీ అందరి అంచనాలు తప్పు అని నిరూపించాడు. ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలి. రాజమౌళికి గారికి రాహుల్‌ను పరిచయం చేశాను. రాజమౌళి గారే రాహుల్ స్పూర్తి అన్నాడు. అది నేను విన్నాను. ఆయన దారిలోనే నువ్ వెళ్లున్నావ్.. ఆ గ్యాప్ తగ్గిపోతుందని నాకు అనిపిస్తుంది. కృతి శెట్టి ఆల్రెడీ సూపర్ స్టార్. ఆమె టచ్ చేస్తే చాలు హిట్ అవుతున్నాయి. కృతి శెట్టి ద్వితీయవిఘ్నాన్ని దాటేసింది. మడోన్నా ఈ సినిమాను, కథను, పాత్రను నమ్మించింది. తెలుగులో డబ్బింగ్ చెప్పుకుని నటించింది. దిల్ రాజు గారు శ్యామ్ సింగ రాయ్ ముందు రోజే చూశారు. థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చెప్పారు. ఆయన చెప్పినట్టే జరుగుతోంది. డిస్ట్రిబ్యూషన్ సైడ్ మాకు ఇంత సాయం చేసినందుకు థ్యాంక్స్. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఈ నెల అంతా బాగుంది. అన్ని పరిస్థితులు చక్కబడి ఈ ఊపు ఏదైతే ఉందో వచ్చే ఏడాది.. ఇంకా పదేళ్లు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయి పల్లవి విషయంలో.. చుట్టూ ముళ్లున్నా అందరికీ అందాన్ని, ఆనందాన్ని పంచే రోజాపువ్వు నువ్వు.. అన్న డైలాగ్ కరెక్టేనేమో. ప్రణవాళయం అనే పాట ఎలాంటి పరిస్థితుల్లో చేసిందో మా అందరికీ తెలుసు. అయినా కూడా ఆ మొహంలో చిరునవ్వు మాత్రం చెరగనివ్వదు. సాయి పల్లవి పేరు రోజీగా మారిపోయింది. సఖిలాంటి సినిమాలు చూసినప్పుడు నాకు కూడా ఎప్పటికీ అలా నిలిచిపోయే కథ రావాలనే కోరిక ఉండేది. సూపర్ హిట్ లవ్ స్టోరీలు, బ్లాక్ బస్టర్ హిట్ లవ్ స్టోరీలున్నాయి. కానీ ఎప్పటికీ నిలిచిపోయే లవ్ స్టోరీలు లేవనే బాధ ఉండేది. కానీ శ్యామ్ బాబు, రోజీలు ఆ కోరిక తీర్చారు. నారాయణ మూర్తి గారి స్పీచ్ వల్లే ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. మా నిర్మాత వెంకట్ గారు చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ రోజు కోసం చాలా ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. వెంకట్ గారికి నాని దొరికాడు అని అంతా అనుకుంటారు.. కానీ నానికే వెంకట్ గారు దొరికారు. ఆయన వంద సినిమాలు తీయాలి.. అందులో నాతో యాభై చిత్రాలు తీయాలని కోరుకుంటున్నాను. ఆర్ నారాయణమూర్తి గారు మొదటగా వచ్చి ఆర్ట్ డైరెక్టర్ ఎవరు బ్రదర్ అని అడిగారు. అంత కంటే సక్సెస్ ఏమీ ఉండదు. సాను లేకపోతే నాకు టెన్షన్ పెరిగిపోతుంది. నా రెండు మెమోరబుల్ సినిమాలను అందించారు. సెకండాఫ్ ఎప్పుడైందో కూడా తెలీడం లేదని అంటున్నారు. నవీన్ గారి ఎడిటింగ్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా సక్సెస్‌లో మిక్కీ గారి పాత్ర ఎంతో ఉంది. సిరివెన్నెల గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ పాత్రలకు మంచి పేరు వచ్చింది. టీం అందరికీ థ్యాంక్స్. తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. న్యూ ఇయర్ కూడా మనదే’ అని అన్నారు.


దిల్ రాజు మాట్లాడుతూ.. ‘గ‌త రెండేళ్ల‌లో కోవిడ్ కార‌ణంగా చాలా ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాం. ఇండ‌స్ట్రీ ఎటు వెళుతుందో తెలియ‌డం లేదు అని అనుకుంటున్న త‌రుణంలో అఖండ‌, పుష్ప‌, శ్యామ్ సింగ‌రాయ్ సినిమాల‌ను నైజాంలో విడుల చేస్తే.. మూడు సూప‌ర్ హిట్స్ అయ్యాయి. సినిమాపై ప్యాష‌న్‌తో ట్రావెల్ అవుతున్న‌ప్పుడు ఇలాంటి విజ‌యాలు ఎన్నో వ‌స్తుంటాయి. డిస్ట్రిబ్యూట‌ర్స్‌, నిర్మాత‌గా ఇలాంటి మ్యాజిక్‌ను చూసిన‌ప్పుడు చాలా ఎనర్జీ వ‌స్తుంది. నాని సినిమా రిలీజ్ స‌మ‌యంలో మాట్లాడిన విష‌యాన్ని చాలా మంది చాలా ర‌కాలుగా నెగిటివ్‌గా తీసుకున్నారు. హీరోగా త‌ను థియేట‌ర్‌కు వ‌చ్చి రెండేళ్లు అయ్యింది. థియేట‌ర్స్‌కు రాకుండా నాని ఇబ్బంది ప‌డ్డ సినిమా వి.. నేను నిర్మించిందే. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రం చాలా ఇబ్బందులు ప‌డ్డాం. చివ‌ర‌కు ఆలోచించి మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మారాల‌ని నానితో నేను మాట్లాడి క‌న్విన్స్ చేశాను. ఓటీటీకి ఇచ్చాం. త‌ర్వాత కూడా నాని సినిమా ట‌క్ జ‌గ‌దీష్ కూడా ఓటీటీలోనే విడుద‌ల చేయాల్సి వ‌చ్చింది. అప్పుడు చాలా మంది డిస్ట్రిబ్యూట‌ర్స్ నానిపై అభ్యంత‌రాలు చెప్పారు. అలా రెండు సినిమాల త‌ర్వాత ఇప్పుడు థియేట‌ర్స్‌కు త‌న సినిమా వెళుతున్న‌ప్పుడు క‌ష్టం ప‌డ్డ వ్య‌క్తిగా నాని రియాక్ట్ అయ్యారు. నానిని ఎవ‌రూ త‌ప్పుగా అర్థం చేసుకోవ‌ద్దు. త‌ను చెప్పిన ఫీలింగ్ వేరు. క‌మ్యూనికేట్ అయిన ఫీలింగ్ వేరు’ అని అన్నారు.


ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. ''మన సౌత్ ఇండియాలో సంక్రాంతి పండగ జరుపుకుంటాం. నార్త్ ఇండియాలో దీపావళి పండగ చేసుకుంటాం. ఈస్టర్న్ స్టేట్స్ లో నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం. ఇవాళ బెంగాల్ లో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏ బెంగాల్ లో ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయో ఆ ఉత్సవాలను, ఆ గొప్పతనాన్ని, ఆ కలకత్తా కాళీ నాలుక మహోన్నత బీబత్సాన్ని ఈ సినిమా ద్వారా ప్రపంచానికి చూపింది నవరాత్రి ఉత్సవాలు జరుపుకునేట్టు చేస్తున్నారు. నిర్మాత బోయినపల్లి వెంకట్ గారు ఎంత మంచి వ్యక్తి. నాని గురించి మాట్లాడుతూ ఆయన గురించి నేను ఏమి చెప్పగలంటూ అయాన్ ఏడిస్తే.. అయ్యా మీ గ్రాటిట్యూట్, సెంటిమెంట్ కి సెల్యూట్. నిర్మాత అంటే అలా ఉండాలి. అలాగే ఈ చిత్రానికి బ్యాక్ బోన్ గా నిలబడి అమోఘమైన సహాయ సహకారాలు అందించిన దిల్ రాజు గారికి నమస్కారాలు. పాప.. సాయి పల్లవి నిన్ను ఫస్ట్ టైం ఎక్కడ చూశానంటే.. రాజు గారి సినిమా ఫిదాలో చూశా. హీరోయిన్ లా కాకుండా పక్కంటిపిల్లలా ఉండే అమ్మాయి సాయి పల్లవి. తెలుగు సినిమా ఇండస్ట్రీ మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండాలి.. ఆ దశగా ప్రభుత్వం సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నా'' అన్నారు.


SudheerBabu Sree Venkateswara Cinemas HarshavardhanLLP Production No 5 Shoot Begins Today

 Sudheer Babu, Harshavardhan, Sree Venkateswara Cinemas LLP Production No 5 Shoot Begins Today



Hero Sudheer Babu teams up with actor-filmmaker Harshavardhan for a film to be produced by Narayan Das K Narang and Puskur Ram Mohan Rao on Sree Venkateswara Cinemas LLP as Production No 5, while Sonali Narang and Srishti present it.


The film was launched a few days ago and the team today began regular shoot in RFC, Hyderabad. Key sequences on the lead cast will be canned in the first schedule of the movie.


A working still released to make the announcement of commencing the shoot shows Sudheer Babu in an atypical avatar. Sporting moustache, he looks bit chubby here. We can’t see his face in the back pose, wherein he appears with garland around his neck. However, he wears it reversely.


Sudheer Babu plays one of the most challenging roles in his 15th film. Harshavardhan has prepared a different subject to present Sudheer Babu in a never seen before multi-shaded character. Billed to be an action entertainer with an innovative concept, the yet to be titled flick will feature some noted actors and a top-notch technical team will be working for it.


Chaitan Bharadwaj renders soundtracks, while PG Vinda handles cinematography. Rajeev is the art director. Other cast and crew of the movie will be revealed soon.


Cast: Sudheer Babu


Technical Crew:

Writer, Director: Harshavardhan

Producers: Narayan Das K Narang and Puskur Ram Mohan Rao

Presenter: Sonali Narang, Srishti

Banner: Sree Venkateswara Cinemas LLP

Music Director: Chaitan Bharadwaj

DOP: PG Vinda

Art Director: Rajeev

PRO: Vamsi-Shekar

Sharwanand, Shree Karthick, Dream Warrior Pictures Oke Oka Jeevitham Teaser Release On December 29th

 Sharwanand, Shree Karthick, Dream Warrior Pictures Oke Oka Jeevitham Teaser Release On December 29th



Young and promising hero Sharwanand’s milestone 30th film Oke Oka Jeevitham directed by debutant Shree Karthick and produced by SR Prakash Babu and SR Prabhu under ‘Dream Warrior Pictures’ is getting ready for release.


Here comes an interesting update of the movie. Oke Oka Jeevitham’s teaser will be released on December 29th. The announcement poster sees cheerful faces of Sharwanand, Vennela Kishore and Priyadarshi. The trio is seen sitting on a swing.


Tharun Bhascker has penned dialogues for the film billed to be a family drama with sci-fi elements. Telugu girl Ritu Varma stars opposite Sharwa, while Amala Akkineni played his mother. Vennela Kishore and Priyadharshi will be seen in supporting roles.


The music for this film is composed by Jakes Bejoy. ‘Dear Comrade’ fame cinematographer and editor, Sujeeth Sarang and Sreejith Sarang are also part of this movie.


Sharwanand has huge following among family audiences and this film is going to equally cater to family viewers as well as the youth. In fact, films with mother-son bonding will enthral all sections.


The film is slated for its theatrical release in February, 2022.


Cast: Sharwanand, Ritu Varma, Amala Akkineni, Vennela Kishore, Priyadarshi, Nassar and others.


Technical Crew:


Written & Direction: Shree Karthick

Producers: SR Prakash Babu, SR Prabhu

Production Company: Dream Warrior Pictures

Dialogues: Tharun Bhascker

DOP: Sujith Sarang

Music Director: Jakes Bejoy

Editor: Sreejith Sarang

Art Director: N.Satheesh Kumar

Stunts: Sudesh Kumar

Stylist: Pallavi Singh

Lyrics: Sirivennela Sitaramasastri, Krishnakanth

PRO: Vamsi-Shekar

Bala shouri Son Marriage Photos