Latest Post

Lyricist Chandra Bose Launched Kalaya Nijama Song From Vikram

  విక్రమ్'లోని కలయా నిజమా పాటను విడుదల చేసిన ప్రముఖ గీత రచయిత చంద్రబోస్



' *విక్రమ్'* చిత్రంలోని " *కలయా నిజమా.."* అంటూ సాగే *లిరికల్ వీడియో పాటను ప్రముఖ సినీ గీత రచయిత చంద్రబోస్ విడుదలచేశారు.* 

 *నాగవర్మను 

హీరోగా పరిచయం చేస్తూ, హరిచందన్ దర్శకత్వంలో* ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. *హీరో నాగవర్మ సరసన దివ్యాసురేశ్ కథానాయికగా నటించింది.** 

కాగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్లో విడుదలకు సన్నద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో చంద్రబోస్ చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేశారు.

 *అనంతరం ముఖ్య అతిథి చంద్రబోస్ మాట్లాడుతూ,* "కలయా నిజమా... అనే పల్లవితో సాగే ఈ పాటలో రచయిత కాసర్ల శ్యామ్ అద్భుతమైన సాహిత్యాన్ని పొందుపరిచారు. చిత్రంలో సందర్భాను సారంగా వచ్చే  విషాదభరిత ఈ పాట గుండెలను పిండేశాలా ఆకట్టుకుంటోంది. హీరో నాగవర్మ తన హావభావాలతో పాటను రక్తికట్టించారు. సురేష్ ప్రసాద్ సంగీతం, సత్య మాస్టర్ కొరియోగ్రఫీ పాటకు ప్రాణంపోశాయి. సినిమా విజయవంతం కావాలని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా" అని అన్నారు.

 *చిత్ర హీరో, నిర్మాత నాగవర్మ మాట్లాడుతూ,* "చిత్రంలో అద్భుతమైన సాహిత్యం కలిగిన ఈ పాటను చంద్రబోస్ గారు ఆవిష్కరించడం ఎనలేని ఆనందంగా ఉంది. ఇందులో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. ఏ పాటకు ఆ పాట పోటాపోటీగా అలరింపజేస్తాయి. సమష్టి కృషితో చిత్రం చాలా బాగా వచ్చింది. అక్టోబర్లో అనుకూలమైన మంచి డేట్ చూసుకుని చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు.

 *దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ*,"సంగీతభరిత ప్రేమ కథకు థ్రిల్లర్ అంశాలను మేళవించి కొత్తపంధాలో ఈ చిత్రాన్ని మలిచాం. విక్రమ్ అనే ఓ సినిమా రచయిత పాత్ర చుట్టూ తిరిగే ఈ చిత్రకథలోని పాత్రలు సమాజానికి దగ్గరగా... మనం నిత్యం చూసే వ్యక్తుల పాత్రలు మాదిరిగా సహజంగా ఉంటాయి.  తన ప్రేమను సాధించడం కోసం, ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసం ఆ సినిమా రచయిత ఏం చేశాడు అన్నది ఆసక్తికరంగా చెప్పాం" అని అన్నారు.

 *సంగీత దర్శకుడు సురేష్ ప్రసాద్ మాట్లాడుతూ,* ఇందులోని ఐదు పాటలు సందర్భానుసారంగా సాగుతూ కథను ముందుకు నడిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో బాగా వచ్చిందని చెప్పగా... *కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ మాట్లాడుతూ,* ఇందులోని అన్ని పాటలకు తాను కొరియోగ్రఫీ చేశానని అన్నారు.

నాగవర్మ బైర్రాజు, దివ్యాసురేశ్ జంటగా నటించిన ఈ చిత్రంలో   ఆదిత్య ఓం, పృథ్వి రాజ్, సురేష్, చలపతిరాజు, ఖయ్యుమ్, సూర్య, జ్యోతి, తాగుబోతు రమేష్, టార్జాన్, ఫిష్ వెంకట్, చిత్రం బాష, భూపాల్ రాజు, డాన్స్ సత్య, జయవాణి తదితరులు ఇతర ముఖ్యతారాగణం.

ఈ చిత్రానికి సంగీతం: సురేష్ ప్రసాద్, ఛాయాగ్రహణం: వేణు మురళీధర్, ఫైట్స్: శివప్రేమ్, ఎడిటర్ మేనగ శ్రీను, *నిర్మాత: నాగవర్మ బైర్రాజు, దర్శకత్వం హరిచందన్.*

Mathrudevobhava (o Amma Katha) Post Production Completed

 "మాతృదేవోభవ" (ఓ అమ్మ కథ)

పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి!!



      శ్రీవాసవి మూవీస్ పతాకంపై కె.హరనాథ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చోడవరపు వెంకటేశ్వరావు నిర్మాతగా అరంగేట్రం చేస్తున్న చిత్రం "మాతృదేవోభవ". 'ఓ అమ్మ కథ' అన్నది ఉప శీర్షిక. సీనియర్ నటి సుధ తన కెరీర్ లో తొలిసారి టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రం ద్వారా పతంజలి శ్రీనివాస్-అమృతా చౌదరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ప్రముఖ రచయిత మరుదూరి రాజా సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రంలో సుమన్, రఘుబాబు, పోసాని, చమ్మక్ చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

     షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు కె.హరనాథ్ రెడ్డి మాట్లాడుతూ... "ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని అవమానవీయ సంఘటనలకు అద్దం పడుతూ ప్రముఖ రచయిత కె.జె.ఎస్.రామారెడ్డి (సితారె) రాసిన కథతో ఈ చిత్రాన్ని రూపొందించాం. భర్తను కోల్పోయి పిల్లల కోసమే బ్రతికి, వాళ్ళను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఓ మాతృమూర్తికి పిల్లల వల్ల ఎదురైన చేదు సంఘటనల సమాహారమే మా "మాతృదేవోభవ". సుధ గారి అభినయం, మరుదూరి రాజా సంభాషణలు ఈ చిత్రానికి ఆయువుపట్టుగా నిలుస్తాయి. హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న పతంజలి శ్రీనివాస్-అమృతా చౌదరి చాలా బాగా చేశారు. యువతరం మెచ్చే అంశాలు కూడా "మాతృదేవోభవ"లో పుష్కలంగా ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే సెన్సార్ చేయిస్తాం. మా నిర్మాత చోడవరపు వెంకటేశ్వరావు గారికి చక్కని శుభారంభం ఇచ్చే చిత్రమవుతుంది" అన్నారు.

     సూర్య, జెమిని సురేష్, శ్రీహర్ష, సత్యశ్రీ, సోనియా చౌదరి, అపూర్వ, కీర్తి, జబర్దస్త్ అప్పారావు, షేకింగ్ శేషు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైన్స్: కృష్ణప్రసాద్, ఫైట్స్: డైమండ్ వెంకట్, కెమెరా: రామ్ కుమార్, ఎడిటింగ్: నందమూరి హరి, సంగీతం: జయసూర్య, పాటలు: అనంత్ శ్రీరామ్-పాండురంగారావు- దేవేందర్ రెడ్డి, మాటలు: మరుదూరి రాజా, కథ: కె.జె.ఎస్.రామారెడ్డి (సితారె), సమర్పణ: ఎం.ఎస్.రెడ్డి, నిర్మాత: చోడవరపు వెంకటేశ్వరావు, స్క్రీన్ ప్లే-డైరెక్షన్: కె.హరనాథరెడ్డి!!

Republic Pre Release Event Held Grandly

 


అక్టోబ‌ర్ 1న విడుద‌ల‌వుతున్న ‘రిపబ్లిక్’ మూవీ అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించాలి: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌


సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా న‌టించిన పొలిటికల్ థ్రిల్ల‌ర్ ‘రిప‌బ్లిక్‌’. దేవ క‌ట్టా ద‌ర్శ‌కుడిగా జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రిప‌బ్లిక్‌’ గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 1న విడుద‌ల‌వుతుంది. శ‌నివారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌కి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో...


ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాట్లాడుతూ ‘‘నేనెప్పుడూ తేజ్ ఫంక్షన్స్‌కు రాలేదు. త‌న మొద‌టి సినిమా స‌మ‌యంలో వ‌చ్చాన‌ని అనుకుంటున్నాను. దానికి కార‌ణం.. ఇంట్లో మా అక్క‌య్య కొడుకుగా త‌న‌ను ట్రైనింగ్ పంపించి ఏదైనా చేయొచ్చు. . గోకులంలో సీత సినిమా విష‌యానికి వ‌చ్చేస‌రికి అన్న‌య్య స‌పోర్ట్ తీసుకోలేదు. ఏ సినిమా వ‌చ్చిందో అలాగే చేశాను. అలాగే తేజ్ కానీ, వైష్ణ‌వ్ కానీ.. ఎవ‌రైనా కుటుంబంపై ఆధాప‌ప‌డ‌కూడ‌దు. క‌ష్ట‌మో, న‌ష్ట‌మో..సొంతంగా జ‌ర్నీ చేయాలి. కానీ ఈరోజు ఫంక్ష‌న్‌కు రావ‌డానికి కార‌ణం, నిర్మాత‌లు ఇంత ఖ‌ర్చు పెట్టి సినిమా తీశారు. సినిమా రిలీజ్ టైమ్‌లో అంద‌రూ హ్యాపీగా ఉండాలి. కానీ తేజ్ మోటార్ బైక్ యాక్సిడెంట్‌కు గురికావ‌డమ‌నేది చాలా బాధాక‌ర‌మైన విష‌యం. హీరో ఫంక్ష‌న్‌లో లేని లోటు తెలియ‌నీయ‌కుండా మ‌నవంతు ఏదో చేయాల‌ని నేనిక్క‌డికి వ‌చ్చాను. మీ అంద‌రి ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే అంద‌రూ ఆనందంగా ఉండాల‌ని కోరుకునే వ్య‌క్తి తేజు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ట్రైల‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. సినిమా అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించాలి. ఇక ఈ మ‌ధ్య కాలంలో నేను ఫీలైందేంటంటే.. తేజ్‌కు యాక్సిడెంట్ అయ్యి హాస్పిట‌ల్లో ఉన్న‌ప్పుడు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, మిత్రులు, పెద్ద‌లు వ‌చ్చి కోలుకోవాలని ప్రార్థించారు. కొన్ని ప్రోగ్రామ్స్ చూశాను. తేజ్ యాక్సిడెంట్ ఎలా అయ్యింది.. చాలా స్పీడుతో న‌డుపుతున్నాడు.. నిర్ల‌క్ష్యంతో న‌డుపుతున్నాడు.. క‌థ‌లు వ‌చ్చాయి. ఆటోను దాటించేట‌ప్పుడు ఎంత స్పీడులో వెళ‌తాడు న‌ల‌బై ఐదు కిలోమీట‌ర్ల వేగంతో వెళ్లి ఉండొచ్చు. ఇసుక ఉండ‌టం వ‌ల్ల ప‌డిపోయాడు. జాలిప‌డాలి మ‌నం. దాని మీద క‌థ‌నాలు అల్లి, మాట్లాడితే ఎలా? అలాంటి వ్య‌క్తుల‌కు నా విన్న‌పం ఏంటంటే.. కొంచెం క‌నిక‌రం చూపించండి. మేమూ మ‌నుషుల‌మే క‌దా! ఇలాంటి ప‌రిస్థితి మీకు రాద‌ని గ్యారంటీ ఏంటి?  మీకు కూడా వ‌స్తుంది క‌దా. ద‌య‌చేసి కొంత క‌నిక‌రం చూపించండి. దేవ‌క‌ట్టాగారు చేసిన ప్ర‌స్థానం సినిమా చూశాను. చాలా చ‌క్క‌టి సినిమా. ఆటోన‌గ‌ర్ సూర్య చేసినప్పుడు ఆ నిర్మాత‌లు క‌లిసి చాలా చ‌క్క‌టి ద‌ర్శ‌కుడు అని చెబుతుండేవారు. రిప‌బ్లిక్ సినిమాను కూడా సామాజిక స్పృహ‌తో చేశారు. భార‌త రాజ్యాంగం ఏం చెప్పింది. మ‌న ప్రాథ‌మిక హ‌క్కులేంటి? అనే దానిపై మాట్లాడే సినిమా అని అర్థ‌మ‌వుతుంది. జైహింద్ అని నేను ప్ర‌తి స‌భ‌లో చెబతుంటాను. ఓ భ‌గ‌త్ సింగ్‌, సుభాష్ చంద్ర‌బోస్‌, చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్‌, మ‌హాత్మాగాంధీజీ వంటి వేల‌కొల‌ది మ‌హానుభావులు ప్రాణ త్యాగం చేస్తే కానీ, భార‌త దేశం గ‌ణ‌తంత్య్ర దేశంగా ఆవిర్భ‌వించ‌లేదు. అంత గొప్ప త్యాగాల‌కు గుర్తు. స్వాతంత్య్ర ఉద్య‌మ కారులు ఎంతో త్యాగం చేశారు. కానీ రాను రాను.. పాలిటిక్స్‌లో దిగ‌జారుడుత‌నం వచ్చేసింది. హుందాత‌నం పోయింది.  ఆ భావన‌ను ఓ క‌వి దాన్ని క‌విత‌గా రాస్తాడు. ఓ ద‌ర్శ‌కుడు దాన్ని సినిమాగా తెర‌కెక్కిస్తాడు. నీ స్వేచ్ఛ కోసం ఎంత ర‌క్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యం చ‌ల్ల‌క‌పోతే, అది నీ గుండెల్లో ఆత్మ గౌర‌వం పండిచ‌క‌పోతే, నువ్వు ఎప్ప‌టికీ మోచేతి అంబ‌లి తాగే బానిస‌ల్లాగా బ‌త‌కాల‌ని అనుకుంటే.. ఆ చిందించిన ర‌క్తానికి ఎంత ద్రోహిగా మారావో తెలుసుకో’’శేషేంద్ర శ‌ర్మ‌గారు చెప్పారు. సినిమాల్లో విలువలు మాట్లాడటం ఒక ఎత్తైతే, దాన్ని నిజ జీవితంలో ముందుకు తీసుకెళ్ల‌డం ఎంతో క‌ష్ట‌త‌రం. ఈరోజు ద‌ర్శ‌కులు నిర్మాత‌లు, పెద్ద‌లు.. అంద‌రూ థియేట‌ర్స్ బావుండాలని కోర‌కుంటున్నారు. క‌రోనా స‌మ‌యం వ‌ల్ల సినిమా ఇండ‌స్ట్రీ ఇబ్బందుల‌ను ఎదుర్కొంటుంది. సెన్సిటివ్ ప‌రిశ్ర‌మ . ఎవ‌రికైనా ఈజీ టార్గెట్ సినిమా ప‌రిశ్ర‌మ‌. 45 కిలోమీట‌ర్ల అత్యంత వేగంగా వెళుతూ ఆటోని ఓవ‌ర్‌టేక్ చేస్తూ కింద‌ప‌డిపోయాడు తేజు.. అనే క‌థ‌నాలు కూడా ఉన్నాయి. అంతే కంటే చాలా ఇంట్రెస్టింగ్ విష‌యాలు చాలానే ఉన్నాయి. వై.ఎస్‌.వివేకానంద‌రెడ్డి ఎందుకు హ‌త్య చేయ‌బ‌డ్డారు అని క‌థ‌నం వేయండి. తేజ్ యాక్సిడెంట్ కాదు. ఓ నాయ‌కుడిపై కేంద్ర ప్ర‌భుత్వం ఆధీనంలో ఉండే ఎయిర్‌పోర్టులో కోడిక‌త్తితో దాడి జ‌రిగింది. అదేమైంద‌ని అడ‌గండి...తేజు యాక్సిడెంట్ గురించి కాదు. ల‌క్ష‌లాది పోడు భూముల్లో గిరిజ‌నులు వ్య‌వ‌సాయం చేసుకుంటూ వుంటే అది వారికి ద‌క్క‌డం లేదు. దాని గురించి మాట్లాడండి..తేజు యాక్సిడెంట్ గురించి కాదు. ఆరేళ్ల చిన్నారి చ‌రిత అన్యాయంగా, అకార‌ణంగా, అమానుషంగా హ‌త్య‌కు గురైతే అది వ‌దిలేసి.. తేజు యాక్సిడెంట్ గురించి క‌థ‌నం కాదు కావాల్సింది మ‌న‌కు. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు కాపు రిజ‌ర్వేష‌న్స్ గురించి మాట్లాడి, వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కాపు రిజర్వేషన్స్ గురించి ఎందుకు మాట్లాడ‌టం లేదో దాని మీద క‌థ‌నాలు చేయండి.. రాయ‌ల‌సీమ‌లో బ‌లిజ‌లు ఎందుకు న‌లిగిపోతున్నారు.. బోయ కుల‌స్థుల‌కు ఎందుకు రాజ‌కీయ ప్రాతినిధ్యం రావ‌డం లేదు... ఓ ఆడ‌పిల్ల బ‌య‌ట‌కు వెళితే క్షేమంగా ఎలా బ‌య‌ట‌కు రావాలో వంటి విష‌యాల‌పై క‌థ‌నాలు న‌డ‌పండి. మేం గౌర‌విస్తాం. సినిమా హీరోల మీద‌, సినిమా వాళ్ల గురించి ఎందుకు మాట్లాడుతారంటే వాళ్లు సాఫ్ట్ టార్గెట్స్‌. వాళ్లనేమైనా అంటే ఎవ‌రూ ఏమ‌న‌రు. రాజ‌కీయ నాయ‌కుల గురించి మాట్లాడ‌రు. ఇడుపుల పాయ‌లో నేల‌మాళిగ‌ల్లో డ‌బ్బులుంటాయ‌ని పోలీస్ వ్య‌వ‌స్థే చెబుతుంటుంది. ఎంత నిజ‌మో తెలియ‌దు కానీ.. దానిపై క‌థ‌నాలు న‌డ‌పండి. అవి న‌డిపితే, ఇళ్ల‌లో కొచ్చి కొడ‌తారు. అందుకే వాళ్ల గురించి మాట్లాడ‌రు. తేజ్ అమాయ‌కుడు క‌దా!. క‌ళ్లు తెర‌వ‌కుండా అక్క‌డ ప‌డున్నాడు క‌దా, హాస్పిట‌ల్లో. ఈరోజు వ‌ర‌కు తేజు ఇంకా క‌ళ్లు తెరిచాడో లేదో నేను కూడా చూడ‌లేదు. దీనిపై క‌థ‌నాలు కాదు కావాల్సింది. పొలిటిక‌ల్ క్రైమ్ గురించి మాట్లాడండి. సినిమా వాళ్ల గురించి కాదు మాట్లాడాల్సింది. అది క‌దా, స‌మాజానికి కావాల్సింది. సినిమాల థియేట‌ర్స్‌కు వెళ్లాల‌ని అంద‌రూ అనుకుంటున్నారు. కానీ థియేట‌ర్స్ తెలంగాణ‌లోనే ఉన్నాయి. ఆంధ్రాలో థియేట‌ర్స్ ఎక్క‌డున్నాయి. వైసీపీ నాయ‌కులు ఏమ‌నుకుంటున్నారంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ఆపేసినా, అత‌నొచ్చిన చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఆపేసినా, వాళ్లంద‌రూ భ‌య‌ప‌డి మ‌న కాళ్ల ద‌గ్గ‌ర‌కొచ్చేస్తార‌ని. కానీ వాళ్లు న‌న్ను త‌ప్పు అర్థం చేసుకున్నారు. సినిమాలో ద‌ర్శ‌కులు, హీరోలు, హీరోయిన్లు ఇన్ని కోట్లు తీసుకుంటున్నార‌ని అంద‌రూ అంటుంటారు. వాళ్ల‌కు చెప్పేదొక్క‌టే.. అరే! స‌న్నాసుల్లారా, ద‌ద్ద‌మ్మ‌ల్లారా! హీరోలు కానీ, ద‌ర్శ‌కులు కానీ, హీరోయిన్స్ కానీ, వీళ్లు లెక్క చెబుతారు. ఉదాహ‌ర‌ణ‌కు హీరోకు ప‌దికోట్లు పంపితే అందులో ఒక కోటి ట్యాక్స్ క‌ట్ చేసుకునే పంపుతారు. ప‌న్నులు పోగా.. ఆరున్న‌ర‌కోట్లు మిగులుతాయి. దీంట్లో వాళ్లు వ్య‌వ‌స్థ‌ను న‌డుపుకోవాలి. ఆ డ‌బ్బులు ఊరికే రాలేదు. దోచింది కాదు. వాళ్ల క‌ష్టం మీద వ‌చ్చిందే. వేల‌కోట్లు దోచేయ‌లేదు. దొంగ క్రాంటాక్టులు చేసి సంపాదించ‌లేదు. ఎంటర్‌టైన్ చేసి సంపాదిస్తున్నాం. డాన్సులేసో, కింద‌ప‌డో, మీద ప‌డో, ఒళ్లు విర‌గొట్టుకునో చేస్తున్నాం. బాహుబ‌లిలో ప్ర‌భాస్‌గారిలాగా కండ‌లు పెంచి కృషి చేస్తే, రానాగారిలాగా కండ‌లు పెంచి క‌ష్ట‌ప‌డితేనే అది బాహుబ‌లి అవుతుంది. జూనియ‌ర్ ఎన్టీఆర్‌లా అద్భుత‌మైన డాన్సులు చేస్తే అప్పుడు డ‌బ్బులు ఇస్తారు. ఒక‌రోజులో ఎవ‌రికీ ఇవ్వ‌లేదు. రామ్‌చ‌ర‌ణ్ లాంటి హీరో అద్భుత‌మైన స్వారీలు చేస్తే అప్పుడు డ‌బ్బులు ఇస్తారు. దేన్నైనా తెగేదాకా లాక్కండి అని అంద‌రికీ చెబుతున్నాను. సినీ ఇండ‌స్ట్రీ బాగుకోరే వారికిచెబుతున్న‌దొక్క‌టే. సినీ ఇండ‌స్ట్రీ న‌ష్ట‌పొతే, నేను డ‌బ్బులు వ‌దిలేస్తున్నాను. అలాగే ఎక్క‌డో మారుమూల న‌న్నెవ‌రూ గుర్తించ‌లేద‌ని బాధ‌ప‌డుతున్న కిన్నెర మొగ‌ల‌య్య‌ను గుర్తించి డ‌బ్బులిచ్చాను. అది నా సంస్కారం. మేమూ చేస్తాం. అవి కూడా చూడండి. మీరు దృష్టి పెట్టాల్సింది. అక్ర‌మ ఆర్జిత రాజకీయ నాయ‌కుల‌పైన‌.. సినిమా వాళ్ల మీద కాదు. మీరు ఒక‌సారి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ముప్పై ఏళ్లు అధికారంలోకి ఉండాల‌నుకునే కోరిక‌లుంటాయి కానీ, వ్యాపారం చేసుకునేవాళ్ల‌కు ఉండ‌దా. హోట‌ల్ ఓ బ్రాంచీ పెడితేనె, మ‌రో బ్రాంచీ పెట్టాల‌నుకుంటాం. అందులో త‌ప్పేంటి. మీకు దిల్‌రాజుగారు న‌చ్చ‌లేదా.. పోటీగా మ‌రో ప‌ది మందికి అవ‌కాశం ఇవ్వండి. వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల వాళ్ల‌కు థియేట‌ర్స్ కోసం స్థ‌లాలు ఇవ్వండి. ఆర్థికంగా బ‌లంగా లేనివారికి థియేట‌ర్స్ ఇవ్వండి వాళ్లు వీళ్ల‌తో పోటీ ప‌డ‌తారు. అది మానేసి, మీకు డ‌బ్బులొద్దు..మాకు డ‌బ్బులొద్దంటారు. వెల్త్ క్రియేష‌న్ లేక‌పోతే ఎక్క‌డ్నుంచి డ‌బ్బులు వ‌స్తాయి. అది త‌ప్పా అని అడ‌గాల‌నుంది. కానీ ఎవ‌ర్నీ అడ‌గాలో తెలియ‌దు. నేను వెల్త్ క్రియేష‌న్ చేయ‌లేక‌పోతే మొగ‌ల‌య్య‌కు రెండున్న‌ర ల‌క్ష‌లు ఇవ్వ‌గ‌ల‌నా?  సైనికులకు కోటి రూపాయ‌లు, క‌రోనా నిధికి రెండు కోట్లు ఇవ్వ‌గ‌ల‌నా?  వెల్త్ క్రియేష‌న్ జ‌ర‌గాలిరా స‌న్నాసుల్లారా!. డ‌బ్బులు సంపాదించేస్తున్నారు అనే స‌న్నాసుల‌కు ఒక‌టే చెబుతున్నా. నా పేరు చెప్పి ఫిల్మ్ ఇండ‌స్ట్రీని చావ దొబ్బేస్తున్నారు. చిత్ర పరిశ్ర‌మ వైపు క‌న్నెత్తి చూడ‌కండి.. కాలిపోతారు జాగ్ర‌త్త‌. మీరు ల‌క్ష కోట్లు సంపాదించొచ్చు. మేం అడుక్కుతినాలా?  వైసీపీ నాయ‌కుల‌కు ఇండ‌స్ట్రీ వైపు చూడ‌కండి అని మీరు చెప్పాలేరా?  మాట్లాడండి. ఏం చేస్తారు? ఇది వైసీపీ రిప‌బ్లిక్ అని కాదు.. ఇండియ‌న్ రిప‌బ్లిక్ అని చెప్పండి. అధికారం ఉంది క‌దా.. అని పిచ్చి వేషాలు వేస్తే.. భ‌విష్య‌త్ ఉండ‌దు. దీనికి ఒక ఉదాహ‌ర‌ణ‌..లిబియా అధ్య‌క్షుడు గ‌డాఫీ.. అధికారం కోసం చాలా మందిని చంపాడు. ఇర‌వై ఏళ్ల త‌ర్వాత న‌డిరోడ్డులో మారుమూల‌, చిన్న కుర్రాళ్లు గ‌డాఫీని కొట్టి చంపేశారు. నాకు సినిమాల్లోకి, రాజీకీయాల్లోకి రావాల‌ని లేదు. కానీ ఖ‌ర్మ స‌రిగా లేదు. అందుక‌నే రాజకీయాల్లోకి ..సినిమాల్లోకి వ‌చ్చాను. సినిమా ప‌రిశ్ర‌మ‌కు కులాలు మ‌తాలు ఉండ‌వు. న్యూక్లియ‌ర్ ఫిజిక్స్‌లో యూనివ‌ర్సిటీ ఫ‌స్ట్ వ‌చ్చిన త్రివిక్రమ్ సినిమాల్లోకి వ‌చ్చాడు. హ‌రీశ్ శంక‌ర్ క‌రీంన‌గ‌ర్ వాస్త‌వ్యుడు. నాతో వ‌కీల్ సాబ్ సినిమా చేసిన శ్రీరామ్ వేణు ఎంబీసీ కులానికి చెందిన‌వాడు. ఆయ‌న తండ్రి ఓ టైల‌ర్‌. త‌న వ‌రంగ‌ల్‌కు చెందినవాడు. సురేంద‌ర్ రెడ్డి వ‌రంగల్‌వాడు. ఇప్పుడు రిప‌బ్లిక్ చేసిన దేవ‌క‌ట్టా కూడా బాగా చ‌దువుకున్న‌వాడే. ఎంత జ్ఞానం లేక‌పోతే, రిపబ్లిక్ సినిమా తీయ‌లేడు. ఓ సినిమా తీయ‌డం ఎంత క‌ష్ట‌మో దిల్‌రాజుగారిని అడ‌గండి. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్రాంతీయ త‌త్వం, కుల‌త‌త్వం ఉండ‌వు. నేను కులం చూసి బంధాలు పెంచుకోలేదు. వ్య‌క్తిత్వం చూసి బంధాలు పెంచుకున్నాను. మొగిల‌య్య ద‌ళిత కులానికి చెందిన వ్య‌క్తి. నేను అభిమానించే ప్రొఫెస‌ర్ సుధాక‌ర్ ద‌ళిత కులానికి చెందిన వ్య‌క్తి. నాతో వ‌కీల్ సాబ్ సినిమా చేసిన శ్రీరామ్ ద‌ర్జీ కులానికి చెందిన‌వాడు. ఈరోజు భీమ్లానాయ‌క్ సినిమా చేస్తున్న సాగ‌ర్ రెడ్డి.. కులానికి చెందిన‌వాడు. అంద‌రూ బావుండాల‌ని కోరుకునేవాడిని. రాజ్యాంగం చాలా గొప్ప‌ది. ఇప్పుడు వైసీపీవాళ్ల‌ను అడిగితే ఓ రూల్ చూపిస్తారు. ఇలా చేస్తున్నామ‌ని అంటారు. నిజ‌మే అది రూల్‌గానే ఉండొచ్చు. కానీ అన్వ‌యించేది మీ నిబ‌ద్ద‌త‌ను బ‌ట్టి ఉంటుంది. చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని వ్య‌క్తిగా చెబుతున్నాను. మీ మీద దాడి చేస్తున్న‌ప్పుడు మీరు బ‌లంగా మాట్లాడండి. మీకు హ‌క్కు ఉంది. మీరు దోపీడీలు, దొమ్మీలు చేయ‌డం లేదు. చిత్ర ప‌రిశ్ర‌మ అంటే దిల్‌రాజుగారో, అల్లు అర‌వింద్‌గారో, సురేష్‌బాబుగారో కాదు.. చాలా ఉంది. ఈ మ‌ధ్య హీరో నానిని అంద‌రూ తిడుతుంటే చాలా బాధేసింది. త‌నో సినిమా చేసుకుని, థియేట‌ర్స్ దొర‌క్క ఓటీటీకెళితే, థియేట‌ర్స్ య‌జ‌మానులంద‌రూ త‌న‌ని తిట్టారు. మీరు వైసీపీ నాయ‌కుల‌తో మాట్లాడుకోండి. ఆ అబ్బాయి మీద ప‌డితే త‌నేం చేస్తాడు. త‌న త‌ప్పేం ఉంది. పాతిక వేల మంది సినిమా ప‌రిశ్ర‌మ‌పై ఆధాప‌డుతున్నారు. వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ల‌క్ష మంది ఉంటారు. మీరు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై కోపంతో సినిమా ఆపేస్తే .. ఇక్క‌డ ల‌క్ష మంది పొట్ట కొడుతున్నారు. మీకు నాతో గొడ‌వుంటే, నా సినిమాల‌ను ఆపేయండి. మా వాళ్ల‌ను వ‌దిలేయండి. చిరంజీవిగారెందుకు అలా బ‌తిమాల‌డుకుంటున్నారు? అని ఎవ‌రో అంటే.. అది ఆయ‌న మంచి మ‌న‌సు.. అలానే ఉంటారు. ఏం చేస్తాం. చిత్ర ప‌రిశ్ర‌మ‌కు అక్క‌ర‌కు రాని సోద‌ర భావ‌న ఎందుకు?  వెళ్లి దిబ్బ‌లో కొట్టుకోవ‌డానికా!. సినిమా టిక్కెట్ల‌ను ఆంధ్ర ప్ర‌భుత్వం ఎందుకు తీసుకోవాల‌నుకుంటుందంటే వాళ్ల ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవు. చిత్ర ప‌రిశ్ర‌మ మీద వ‌చ్చే ఆదాయాన్ని బ్యాంకుల‌కు చూపించ‌వ‌చ్చు. లోన్స్ తెచ్చుకోవ‌చ్చు. దాని కోస‌మే టికెట్స్ అమ్మ‌కాన్ని తీసుకుంటున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం థియేట‌ర్స్ విష‌యంలో ఇబ్బంది పెడ‌తారు. చిరంజీవిగారిలాంటి వ్య‌క్తుల‌కు చెప్పండి ప్రాధేప‌డొద్ద‌ని. హ‌క్కుతో మాట్లాడ‌మ‌ని చెప్పండి. సినీ పెద్ద‌లు, సంపూర్ణ విద్వాంసులు బ‌య‌ట‌కు రండి. ఖండించండి. తప్ప‌ని చెప్పండి. చిత్ర ప‌రిశ్ర‌మ వైపు ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీరు మార‌క‌పోతే, మీరు మార్చేలా ఎలా చేయాలో మాకు తెలుసు’’ అన్నారు.


హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ ‘‘అన్నయ్య తేజు బాగా కోలుకుటున్నాడు. అందరినీ అలరించడానికి త్వరగా వచ్చేస్తాడు. ఆరోజు ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు స్పాట్‌లో ఉండి త్వ‌ర‌గా ఫోన్ చేసి అన్న‌య్య‌ను హాస్పిట‌ల్‌లో చేర్చిన వారికి చాలా థాంక్స్‌. డాక్ట‌ర్స్‌తో పాటు అభిమానులు, ప్రేక్ష‌కుల ఆశీర్వాదంతో తేజ‌న్న‌య్య త్వ‌ర‌గా కోలుకుంటున్నాడు. మీకు థాంక్స్ అని చెబితే స‌రిపోదు. రిప‌బ్లిక్ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని అనుకుంటున్నాను. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ సినిమాను థియేట‌ర్స్‌లో చూడాల‌ని అనుకుంటున్నాను. అంద‌రూ హెల్మెట్ ధ‌రించి జాగ్ర‌త్త‌గా డ్రైవ్ చేయాల‌ని ఓ అన్న‌య్య‌లా, త‌మ్ముడిలా, కొడుకులా చెబుతున్నాను. ప్లీజ్‌.. రిప‌బ్లిక్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు దేవ క‌ట్టా మాట్లాడుతూ ‘‘నేను పవన్ క‌ళ్యాణ్‌గారికి నిరంత‌ర అభిమానిని. ఆరాధ‌కుడిని. ఆయ‌న రిప‌బ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావ‌డంతో గ్రాండ్ స‌క్సెస్ అయ్యింది. అభిమానుల‌కు థాంక్స్‌. నా టీమ్‌కు, తేజ్ ప్ర‌యాణంలో భాగ‌మైన ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు కూడా ఇక్క‌డికి వ‌చ్చారు. అందరికీ థాంక్స్‌. రిప‌బ్లిక్ సినిమా విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమా ఇక్క‌డ వ‌ర‌కు వ‌చ్చిందంటే కార‌ణం తేజ్‌. జిమ్‌లో వ‌ర్క‌వుట్ చేస్తున్న‌ప్పుడు వ‌చ్చిన ఐడియా. దాన్ని బ్యూరోక్రాట్ రూపంలో సినిమా చూడాల‌ని ఉంద‌ని తేజ్‌కు చెప్పాను. త‌ను డీప్‌గా క‌నెక్ట్ అయ్యాడు. ఈ క‌థ నాతోనే చేస్తాన‌ని ప్రామిస్ తీసుకున్నాడు. నేను ప్ర‌స్థానం త‌ర్వాత చేసిన త‌ప్పుల వ‌ల్ల ఇండ‌స్ట్రీకి నాపై న‌మ్మ‌కం పోయింది. తేజ్ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి, ప‌వ‌ర్ ఇచ్చి సినిమాను సైనికుడిలా కాపాడాడు. నా విజ‌న్‌లో త‌ను, త‌న విజ‌న్‌లో నేను.. క‌లిసి ప‌నిచేశాం. క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో పాటు అన్ని ఉంటూనే సినిమాలోని సోల్‌ను ఏది దెబ్బ తీయ‌కూడ‌ద‌ని ఓ సైనికుడిలా తేజ్ పోరాడాడు. తేజ్‌చాలా త‌ర్వగా కోలుకుంటున్నాడు. త‌ను ఈ సినిమాకు సైనాధ్య‌క్షుడిలా తిరిగి వ‌స్తాడు. ఈ సినిమా క‌థ చెప్పిన రోజు నుంచి నిర్మాత‌లు జీస్టూడియోస్ ప్ర‌సాద్‌గారు, భ‌గ‌వాన్‌గారు, పుల్లారావుగారు నాపై న‌మ్మ‌కంతో వ‌దిలేశారు. ప‌వ‌ర్‌, రెస్పెక్ట్‌తో పాటు ఫ్రీడ‌మ్ ఇచ్చారు. మ‌ణిశ‌ర్మ‌గారు అద్భుత‌మైన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. కె.ఎల్‌.ప్ర‌వీణ్ సినిమాను బ్యూటీఫుల్‌గా ఎడిట్ చేశారు. సినిమాటోగ్రాఫ‌ర్ సుకుమార్‌గారు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చాడు. అంద‌రూ సైనికుల్లా ఈ సినిమా కోసం ప‌నిచేశారు. ట్రైల‌ర్ చూసి చాలా మంది ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. నా దృష్టిలో ప్ర‌తి మాట ఓ ఆలోచ‌న‌. దాన్ని ఈ సినిమాలో రాశాను. అంతే త‌ప్ప మాట‌ల గార‌డీ చేయ‌లేదు. బ‌ల‌మైన ఆలోచ‌న రిప‌బ్లిక్ మూవీ మీపై ప్ర‌భావం చూపిస్తుంద‌ని, థియేట‌ర్స్‌లో వ‌దిలిపోయే సినిమాలా కాకుండా, గుండెల్లో మీతో మోసుకెళ్లే సినిమా అవుతుందని న‌మ్ముతున్నాను’’ అన్నారు.


చిత్ర నిర్మాత పుల్లారావు మాట్లాడుతూ ‘‘మెగాభిమానులు, ప్రేక్ష‌కులు ఆశీర్వాదంతో తేజు త్వ‌ర‌గా కోలుకుంటున్నాడు. చిత్రలహరి, ప్ర‌తిరోజూ పండ‌గే చిత్రాల త‌ర్వాత సాయితేజ్ మాకు రిప‌బ్లిక్ సినిమా చేసే అవ‌కాశం ఇవ్వ‌డం మా అదృష్టంగా భావిస్తున్నాం. మా సినిమాకు వ‌చ్చి క్లాప్ కొట్టి ఆశీర్వ‌దించిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారు ఇప్పుడు మ‌ళ్లీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు వ‌స్తున్నారు. ఆయ‌న‌కు థాంక్స్‌. క‌రోనా స‌మ‌యంలో రెండు లాక్‌డౌన్స్‌ను ఫేస్ చేశాం. అంద‌రి నిర్మాత‌ల్లాగానే మేం క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు జీ స్టూడియోస్ వారు అండ‌గా నిల‌బ‌డ్డారు. ఈ సంద‌ర్భంగా జీ స్టూడియోస్‌వారికి థాంక్స్‌. డైరెక్ట‌ర్ దేవ క‌ట్టాగారికి, సినిమాటోగ్రాఫ‌ర్ సుకుమార్‌గారికి అండ్ టీమ్‌కు థాంక్స్‌. క‌థ ఓకే అయిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అండ‌గా నిల‌బ‌డ్డ స‌తీశ్‌గారికి థాంక్స్‌. అక్టోబ‌ర్ 1న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. ప్రేక్ష‌కులు ఈ సినిమాను థియేట‌ర్స్‌లో చూసి ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు. 


చిత్న నిర్మాత భ‌గ‌వాన్‌ మాట్లాడుతూ ‘‘ఈ ఈవెంట్‌ను ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన మెగాభిమానులు, ప‌వ‌ర్‌స్టార్‌గారి అభిమానుల‌కు థాంక్స్‌. సాయితేజ్‌తో మాకు ప‌న్నెండేళ్ల అనుబంధం ఉంది. తేజ్‌.. బంగారం. మా దేవ క‌ట్టాగారి గురించి చెప్పాలంటే ఆయ‌న సినిమాలే చెబుతాయి. సాయితేజ్‌గారు, దేవ‌క‌ట్టాగారికి ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది’’ అన్నారు.


నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్న సాయితేజ్ వారి ఆశీర్వాద బ‌లంతోనే త్వ‌ర‌గా కోలుకుంటున్నాడు. త్వ‌ర‌లోనే మ‌న మ‌ధ్య‌కు వ‌స్తాడు. ఇక రిప‌బ్లిక్ సినిమా గురించి చెప్పాలంటే దేవ క‌ట్టా మంచి ప్యాష‌నేట్ డైరెక్ట‌ర్‌. త‌న ఔట్‌పుట్ వ‌చ్చే వ‌ర‌కు కాంప్ర‌మైజ్ కాడు. రిప‌బ్లిక్ వంటి పొలిటిక‌ల్ డ్రామా గురించి సాయితేజ్ ఓ సంద‌ర్భంలో మాట్లాడాడు. లైన్ నాకెంతో న‌చ్చింది. తేజ్ హీరోగా ఎన్నో స‌క్సెస్‌, ఫెయిల్యూర్స్ చూశాడు. అక్టోబ‌ర్ 1న రిప‌బ్లిక్ మూవీ రిలీజ్ అవుతుందంటే ప్రేక్ష‌కాభిమానులే కాదు.. మెగాస్టార్‌గారు, ప‌వ‌ర్‌స్టార్‌గారు వెనుకుండి న‌డిపిస్తున్నారు. రిప‌బ్లిక్ సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించి హిట్ చేయాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.


ద‌ర్శ‌కుడు ఎస్‌.హ‌రీశ్ శంక‌ర్ మాట్లాడుతూ ‘‘సాయితేజ్‌తో నాకు మంచి ఎటాచ్‌మెంట్ ఉంటుంది. ఎప్పుడూ న‌న్ను అన్న‌య్య అనిపిలుస్తుంటాడు. తేజ్‌..క‌ళ్యాణ్‌గారికి వ‌రుస మేన‌ల్లుడే అయినా, తండ్రీకొడుకుల్లా ఉంటారు. ఆ విషయంలో తేజ్ అదృష్ట‌వంతుడు. తేజ్‌కు ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు....నంద‌మూరి అభిమానులు, మ‌హేశ్‌గారి అభిమానులు, ప్ర‌భాస్‌గారి అభిమానులు..ఇలా తేజ్ గురించి తెలిసిన ప్ర‌తి హీరో అభిమాని తను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థించారు. గుళ్ల‌లోనే కాదు, చ‌ర్చిల్లో, మ‌సీదుల్లో అంద‌రూ ప్రార్థించారు. సినిమాకు కుల మ‌తాలు లేవ‌ని నిరూపించిన ప్రేక్ష‌క దేవుళ్ల‌కు మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను. కోవిడ్ ఫ‌స్ట్ వేవ్ త‌ర్వాత సోలో బ్ర‌తుకే సో బెట‌ర్  సినిమాతో మ‌న ముందుకు వ‌చ్చాడు. ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్‌లోనూ ఫ‌స్ట్ బంచ్ మూవీస్‌లో రిప‌బ్లిక్ సినిమాతో మ‌న ముందుకు వ‌స్తున్నాడు. తేజ్ ఆరోగ్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చే స‌రికి అంద‌రూ ఈ సినిమాను థియేట‌ర్స్‌లో చూసి ఘ‌న విజయాన్ని అందించి వెల్‌క‌మ్ చెబుతాం. టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూశాను. సిస్ట‌మ్‌లో ఉంటూనే ప్ర‌శ్నించ‌వ‌చ్చున‌ని అర్థ‌మైంది. సినిమాలో క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు సామాజిక స్పృహ ఉంటుంది. గౌరవంగా చూపించే ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టాగారికి థాంక్స్‌’’ అన్నారు.


హీరోయిన్ ఐశ్వ‌ర్యా రాజేశ్ మాట్లాడుతూ ‘‘తేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. రిపబ్లిక్ సినిమా కోసం తేజ్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. ఇద్ద‌రం స్కూల్ పిల్ల‌ల్లాగా సినిమా కోసం ప్రిపేర్ అయ్యాం. తెలుగు ప్రేక్ష‌కుల్లాగా ఎవ‌రూ ఉండ‌రు. థియేట‌ర్స్‌కు వ‌చ్చి సినిమాను ఆద‌రిస్తున్నారు. నేను కూడా ఇప్ప‌టి వ‌ర‌కు థియేట‌ర్‌కు వెళ్ల‌లేదు. ఈ సినిమాను థియేట‌ర్‌లో చూడ‌టానికి చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను. మంచి సినిమాను ఇచ్చిన ద‌ర్శ‌కుడు దేవ క‌ట్టాగారికి, నిర్మాత‌ల‌కు థాంక్స్‌’’ అన్నారు. 


డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల మాట్లాడుతూ ‘‘నాకు సాయితేజ్ హీరో కంటే తమ్ముడిగానే దగ్గరయ్యాడు. మేమిద్దం ఎంతో ఇష్ట‌ప‌డి చేసిన సినిమా చిత్ర‌ల‌హ‌రి. నాకు చిరంజీవిగారి సినిమాల్లో అభిలాష అంటే ఎంతో ఇష్టం. రిప‌బ్లిక్ ట్రైల‌ర్ చూసిన‌ప్పుడు నాకు అభిలాష సినిమానే గుర్తుకొచ్చింది. చిరంజీవిగారి కెరీర్‌లో అభిలాష ఎలాగో, సాయితేజ్‌గారి కెరీర్‌కు రిప‌బ్లిక్ అలా నిల‌వాల‌ని కోరుకుంటున్నాను. తేజ్‌, ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా, నిర్మాత‌ల‌కు, మ‌ణిశ‌ర్మ త‌దిత‌రులకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంట‌న్నాను’’ అన్నారు. 


నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘రిపబ్లిక్ సినిమా సాంగ్స్, ట్రైలర్ చూస్తే సినిమాలో సామాజిక స్పృహ క‌నిపిస్తుంది. ఇంత మంచి సినిమా చేసిన సాయితేజ్‌, దేవ క‌ట్టా, నిర్మాత‌ల‌కు అభినంద‌న‌లు’’ అన్నారు. 


డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ ‘‘ప్రపంచంలో ఎక్క‌డా లేని విధంగా మ‌న తెలుగు రాష్ట్రాల్లోనే ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌కు వ‌స్తున్నారు. నిన్న విడుద‌లైన ల‌వ్‌స్టోరికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇప్పుడు అక్టోబ‌ర్ 1న రిప‌బ్లిక్ విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా సాయితేజ్‌కే కాదు, ఇండ‌స్ట్రీకి కూడా ఎంతో ముఖ్యం. దేవ‌క‌ట్టా యూనిక్ మార్క్ ఉన్న డైరెక్ట‌ర్‌. ఈ సినిమాలో సాయితేజ్ మంచి బ్యూరోక్రాట్‌గా క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమా పెద్ద హిట్టై సాయితేజ్‌, డైరెక్ట‌ర్ దేవ‌క‌ట్టాగారికి, నిర్మాత‌ల‌కు అభినంద‌న‌లు’’ అన్నారు. 


డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ ‘‘మా తేజును ఇక్క డ మిస్ అవుతున్నాం. త‌న‌కు ఎంతో సంక‌ల్పబ‌లం ఉంది. అందుకే త‌ను అనుకున్న తేదికి రిప‌బ్లిక్ సినిమా విడుద‌ల‌వుతుంది. దేవుడు, ప్రేక్ష‌కుల ఆశీర్వాదాల‌తోనే త‌ను త్వ‌ర‌గా కోలుకుంటున్నాడు. సీటీమార్ సినిమా నుంచి ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌కు వెల్లువ‌లా వ‌చ్చి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నారు. ల‌వ్‌స్టోరికి తెలుగు ప్రేక్షకులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇలా మేమున్నామంటూ భ‌రోసా ఇస్తున్న తెలుగు ప్రేక్ష‌కులు రిపబ్లిక్ సినిమాకు కూడా బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టాల‌ని కోరుకుంటున్నాను. దేవకట్టాగారి సినిమాలంటే నాకెంతో ఇష్టం. ప్రస్థానం సినిమాలో కనిపించిన ఓ ఎన‌ర్జీ మ‌ళ్లీ ఈ సినిమాలో క‌నిపిస్తుంది. నిర్మాత‌లు భ‌గ‌వాన్‌గారు, పుల్లారావుగారికి, ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.


ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని మాట్లాడుతూ ‘‘సాయితేజ్ నా కుటుంబ స‌భ్యుడితో స‌మానం. మా మ‌ధ్య మంచి ఎమోష‌న‌ల్ బాండింగ్ ఉంది. తేజ్ చాలా మంచి మ‌నిషి. నాకెంతో ఆప్తుడు. అక్టోబ‌ర్ 1న సాయితేజ్ న‌టించిన రిప‌బ్లిక్ సినిమా విడుద‌ల‌వుతుంది. అక్టోబ‌ర్ 15న సాయితేజ్ పుట్టిన‌రోజు. ఈ సినిమాను హిట్ చేసి అంద‌రూ త‌న‌కు బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను. చిరంజీవిగారు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారి నుంచి మంచి ల‌క్ష‌ణాల‌ను పుణికి పుచ్చుకున్న తేజ్‌, దేవ క‌ట్టాగారు చేసిన రిప‌బ్లిక్ ట్రైల‌ర్ చాలా ఇన్‌టెన్స్‌గా ఉంది. సినిమా కూడా అలాగే ఉంటుంద‌ని భావిస్తున్నాను. న‌టిగా త‌నెంటో ప్రూవ్ చేసుకున్న ఐశ్వ‌ర్యా రాజేశ్‌కు అభినంద‌న‌లు. నిర్మాత‌ల‌కు అభినంద‌న‌లు. మెగాభిమానులు, పవ‌ర్‌స్టార్ అభిమానులే కాదు, అంద‌రి హీరోల అభిమానుల‌కు నేను చెప్పేదొక్క‌టే... మంచి సినిమా చేశారు. ఆ సినిమాను చాలా పెద్ద హిట్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


సినిమాటోగ్రాఫ‌ర్ ఎం.సుకుమార్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ దేవకట్టాగారికి, నిర్మాతలు భగవాన్‌గారు, పుల్లారావుగారికి థాంక్స్‌’’ అన్నారు. 


రైట‌ర్ బి.వి.ఎస్‌.ర‌వి మాట్లాడుతూ ‘‘మనం అందరం మెగాభిమానులం. స‌మాజం ఇలా ఉంటే  బావుంటుంద‌ని చెప్పే వ్య‌క్తి తాలుకా ఆలోచ‌న‌ల‌ను తెలియ‌జేసేది క‌ళ‌. సినిమా అనేది ఓ ఆర్ట్‌. సినిమాల్లో సామాజిక బాధ్య‌త ఉండాల‌ని న‌మ్మే అతి కొద్ది మంది దర్శ‌కుల్లో దేవ క‌ట్టాగారు ఒక‌రు. సాయితేజ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. సామాజిక బాధ్య‌త‌ను గుర్తు చేసేలా సాయితేజ్‌, దేవ‌క‌ట్టాగారికి అభినంద‌న‌లు. ముప్పై ఏళ్లుగా అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి ఉండి, సినిమాలు చేస్తున్న భ‌గ‌వాన్‌గారు, పుల్లారావుగారికి ఈ సినిమా పెద్ద స‌క్సెస్ చేయాల‌ని ప్రేక్ష‌కుల‌ను కోరుకుంటున్నాను’’ అన్నారు.


Thalapathy Vijay's 66th Film With Vamshi Paidipally and Dil Raju

 Thalapathy Vijay's 66th Film With Vamshi Paidipally and Dil Raju



With a massive following among all sections Thalapathy Vijay’s popularity has been growing even bigger with every film that he does. For his next movie Thalapathy Vijay will be teaming up with National Award-Winning director Vamshi Paidipally. This film will be produced by the National-Award winning producer Dil Raju & Shirish  under their production house Sri Venkateswara Creations. The leading production house will be mounting up this big-budgeted film on a grand scale.


 The film has been announced officially today, much to the contentment of fans and movie buffs.


Given the collaboration of Thalapathy Vijay, Vamshi Paidipally and Dil Raju,  the buzz surrounding the project is immense. The crazy project in the combination of these skilled people will be no less than a magnum opus.


The film will start rolling once Thalapathy Vijay wraps up his 65th film Beast with Nelson. Many noted actors and top-notch technical team will be associating  with this project. Other details will be announced soon.

AIshwarya Rajesh Interview About Republic

 రిపబ్లిక్’ మూవీ సాయితేజ్ కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుంది: ఐశ్వ‌ర్యా రాజేశ్‌



సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా న‌టించిన పొలిటికల్ థ్రిల్ల‌ర్ ‘రిప‌బ్లిక్‌’. దేవ క‌ట్టా ద‌ర్శ‌కుడిగా జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రిప‌బ్లిక్‌’ గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 1న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ ఐశ్వ‌ర్యా రాజేశ్ ఇంట‌ర్వ్యూ విశేషాలు...


- మేం ఉండేది చెన్నైలోనే అయితే ఆహారంతినే ప‌ద్ద‌లు అన్నీ మ‌న తెలుగువాళ్ల‌లాగానే ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు త‌మిళులు సాంబార్‌లో కూర‌లు క‌లుపుకుని తింటారు. కానీ మ‌న తెలుగువాళ్లు అన్నంలో క‌లుపుకుని తింటారు. మేం ఎప్పుడైన ఫంక్ష‌న్స్‌కు వెళ్లిన‌ప్పుడు మ‌న స్టైల్లో తింటుంటే విచిత్రంగా చూస్తుంటారు. 

- నేను చేప‌లు పులుసు, చికెన్ కూర బాగా చేస్తాను. మిగ‌తా వంట‌ల‌ను కూడా బాగా చేస్తాను. 

- ఓ రోజు దేవ‌క‌ట్టాగారు ఫోన్ చేసి రిప‌బ్లిక్ సినిమా గురించి చెప్పి మైరా పాత్ర ఉంద‌ని చెప్పారు. ఆయ‌న బేసిగ్గా హీరో, హీరోయిన్ అని కాకుండా క్యారెక్ట‌ర్స్‌, దాని ప్రాధాన్య‌త‌లేంటి? అని చూస్తారు. ఆయ‌న నాకు ఫోన్ చేసిన‌ప్పుడు కరోనా కార‌ణంగా ఫోన్‌లోనే స్క్రిప్ట్ గంట పాటు వివ‌రించారు. హైద‌రాబాద్ వ‌చ్చి క‌లిసిన త‌ర్వాత ఐదారు గంట‌ల పాటు స్క్రిప్ట్ నెరేట్ చేశారు. 

- దేవాగారికి త‌ను చేసే సినిమాపై ప‌క్కా క్లారిటీ ఉంటుంది. నా పాత్ర విష‌యానికి వ‌స్తే నేను ఇందులో ఎన్నారై అమ్మాయిగా క‌నిపిస్తాను. ఓ స‌మ‌స్య కార‌ణంగా విదేశాల్లో ఉండే నా పాత్ర ఇండియాకు వ‌స్తుంది. 

-రొటీన్‌గా సాంగ్స్ పాడుకునేలా ఇందులో హీరో, హీరోయిన్ మ‌ధ్య ల‌వ్‌ట్రాక్ ఉండ‌దు. మెచ్యూర్డ్‌గా క‌నిపిస్తుంది. సినిమాలో ప్ర‌పోజ్ చేసే సీన్ కూడా ఉండ‌దు. 

- ఇది కేవ‌లం హీరో హీరోయిన్ సినిమా కాదు.. సాయితేజ్‌, నాతో పాటు జ‌గ‌ప‌తిబాబుగారు, ర‌మ్య‌కృష్ణ‌గారు ఇత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపిస్తాం. ప్ర‌తి పాత్ర‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది. 

- తెలుగులో సినిమాలు వ‌స్తున్నాయి. పెర్ఫామెన్స్‌కు ప్రాధాన్యం ఉండే పాత్ర‌లైతే చేద్దామ‌ని వెయిట్ చేస్తున్నాను. విజ‌య్ దేవ‌రకొండ‌గారి డియ‌ర్ కామ్రేడ్‌లో సువ‌ర్ణ పాత్ర‌లో న‌టించాను. సినిమా బాగా ఆడ‌క‌పోయినా పాత్ర చ‌క్క‌గా అంద‌రికీ రీచ్ అయ్యింది క‌దా. 

- రిపబ్లిక్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ కాదు.. డిఫ‌రెంట్ మూవీ. రియ‌ల్ స్టోరిని తీసుకుని బ‌ల‌మైన  ప్లాట్‌ను బేస్ చేసుకుని దేవ క‌ట్టాగారు సినిమాను తెర‌కెక్కించారు. ప్ర‌తిదీ హండ్రెడ్ ప‌ర్సెంట్ ఉండాల‌నుకునే వ్య‌క్తి ఆయ‌న‌. సినిమాకు 22 రోజులు వ‌ర్క్ చేశాం. డ‌బ్బింగ్ చెప్ప‌డానికి 15 రోజుల స‌మ‌యం ప‌ట్టింది. అంటే డైరెక్ట‌ర్‌గారు ఎంత ప‌ర్‌ఫెక్ష‌న్ కోరుకున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. 

- సినిమా అనేది మ‌న జీవితాల్లో ప్ర‌భావాన్ని చూపిస్తుంటుంది. అందుకే మ‌నం సినిమా చూసిన‌ప్పుడు ఏదో ఒక పాయింట్‌కు క‌నెక్ట్ అవుతుంటాం. అలాంటి ఓ బ‌ల‌మైన సినిమా మాధ్య‌మంలో స‌మాజానికి అవ‌స‌ర‌మైన ఓ విష‌యాన్ని వివ‌రిస్తూ తెర‌కెక్కించారు. 

- డిఫ‌రెంట్ సినిమా అనిపిస్తే అందులో చిన్న రోల్ అయినా చాలు చేయ‌డానికి న‌టిస్తాను. మ‌న పాత్ర ద్వారా అంద‌రికీ గుర్తుండిపోవాల‌ని భావిస్తాను. 

- సాయితేజ్ ఓ జెమ్‌. ఈ సినిమా కోసం చాలా ఎఫ‌ర్ట్ పెట్టారు. సినిమాలో ప్ర‌జ‌లు త‌రపున మాట్లాడే పాత్ర‌లో త‌ను న‌టించాడు. సినిమా షూటింగ్‌కు వెళ్ల‌డానికి ముందుగానే నేను యూనిట్‌ను క‌లిశాను. నేను, తేజ్‌, దేవ‌క‌ట్టాగారు.. ఇలా అంద‌రూ డిస్క‌స్ చేశాం. తేజ్ ప్ర‌తిరోజూ స్కూల్‌కు వెళ్లే పిల్లాడిలా ఉద‌యం ప‌దిన్న‌ర‌కంతా వ‌చ్చేవాడు. ఓ బుక్ పెట్టుకుని అందులో డైలాగ్స్ రాసుకుని ప్రాక్టీస్ చేసేవాడు. ఎంత క‌ష్ట‌ప‌డ్డారంటే ఇందులో కోర్టు రూమ్ సీన్ ఉంది. ప‌ది నిమిషాల పాటు సాగే ఆ సీన్‌ను తేజ్ సింగిల్ టేక్‌లో చేశాడు. ఆ సీన్ త‌ర్వాత యూనిట్ అంద‌రూ క్లాప్స్ కొట్టారు. త‌న కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుంద‌ని నేను భావిస్తున్నాను. 

- సినిమా ఇండ‌స్ట్రీ చాలా మారింది. కొత్త ద‌ర్శ‌కులు వ‌స్తున్నారు. రీసెంట్‌గా ఓ సంద‌ర్భంలో బుచ్చిబాబుగారిని క‌లిశాను. మీ వ‌ర్కింగ్ స్టైల్ బావుంటుంది. మీతో వ‌ర్క్ చేయాల‌నుంద‌ని చెప్పారు. ఆయ‌న డైరెక్ట్ చేసిన ఉప్పెనలో కృతిశెట్టి.. ఓ సినిమాతో స్టార్ హీరోయిన్ అయ్యింది. అయితే క‌మ‌ర్షియ‌ల్ మూవీ కార‌ణంగానే ఆమె స్టార్ కాలేదు. పెర్ఫామెన్స్ వ‌ల్ల అయ్యింది. అలాగ‌ని క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్స్‌గా చేయ‌డం సుల‌భ‌మ‌ని కాదు. 

- ఇప్పుడున్న హీరోయిన్స్‌లో స‌మంతగారంటే చాలా ఇష్టం. పెర్ఫామెన్స్ అయినా, గ్లామ‌ర్ రోల్స్ అయినా ఆమె చ‌క్క‌గా చేస్తారు. అలాగే అనుష్కగారంటే ఇష్ఠం. సౌంద‌ర్య‌గారంటే ఎంతో అభిమానం. త‌ను బ్రిలియంట్ యాక్ట‌ర్‌. 

- తెలుగులో రిప‌బ్లిక్ సినిమా విడుద‌ల‌వుతుంది. మ‌రో తెలుగు సినిమా చేయ‌డం లేదు. క‌థ‌లు వింటున్నాను. త్వ‌ర‌లోనే కిర‌ణ్ రెడ్డిగారి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాను. త‌మిళంలో చాలా సినిమాలు చేస్తున్నాను.


Telugu Film Chamber of Commerce Pressnote


The Telugu Film Industry had approached the Government of Andhra Pradesh to guide us through the Pandemic and various other issues.
Upon the invitation of the Honourable Minister of Andhra Pradesh,                    Sri Perni Nani, representatives of The Telugu Film Industry met and expressed their concerns about various issues being faced by Telugu  Film Industry. We are immensely grateful to the Government, under the leadership of Honourable Chief Minister, Sri Y.S. Jagan Mohan Reddy garu for patiently understanding and positively responding to all our concerns and assuring us that all our concerns will be favourably addressed in the near future.
Due to the current situation in the Industry which has suffered the onslaught of the division of Our States, the Pandemic and other Issues, our Industry is at the worst possible situation. Various individuals have expressed their views, opinions and anguish on different platforms. These are not the voices of the Industry as a whole. We wish to reiterate that the Apex body of our Industry is the Telugu Film Chamber of Commerce in both the Telugu States. We have always been supported by our Governments over the years. Without their support we will not be able to survive.
Thousands of people and their families who are dependent on this Industry have been suffering since March 2020. At this juncture we require the support of our Leaders & Governments to be large hearted and extend their continued support to us.
The Telugu States of Andhra Pradesh & Telangana are the two eyes of our Film Industry and both our Honourable Chief Ministers have been proactive and always extended their encouragement & support to us. Seeking their continued blessings & support.

(Narayandas Kishandas Narang)
 President

Most Eligible Bachelor Releasing on October 15th

 అక్టోబర్ 15న అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. ఆకట్టుకుంటున్న రిలీజ్ పోస్టర్



అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తున్నారు. 

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం రిలీజ్ పోస్టర్ విడుదల అయింది. ఇందులో అఖిల్, పూజా హెగ్డే చేతులు పట్టుకొని ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.  ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు.


న‌టీ న‌టులు:

అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు.. 


సాంకేతిక నిపుణులు:


దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌  

బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్  

స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్  

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమడి

మ్యూజిక్ : గోపీ సుంద‌ర్

సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ

ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్

ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Netho Teaser Launched Grandly

 యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటున్న ‘నీతో’ టీజర్.. 



అభిరామ్ వర్మ, సాత్విక రాజ్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ నీతో. ఏవిఆర్ స్వామి, ఎమ్ఆర్ కీర్తన, స్నేహాల్ జంగాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాలు శర్మ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. లవ్ లైఫ్ డ్రామాగా నీతో టీజర్ ఆకట్టుకుంటుంది. యూత్ ఫుల్ అంశాలతో ఈ టీజర్ కట్ చేసారు దర్శక నిర్మాతలు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు టీజర్‌లో ఆకట్టుకుంటున్నాయి. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా అద్భుతంగా వర్కవుట్ అయింది. టీజర్‌లో మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఉంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న నీతో సినిమాకు మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సుందర్ రామ్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల అవుతుంది.


నీతో మూవీ టీజర్ లాంచ్ ప్రెస్ మీట్.


-ప్రొడ్యూసర్ ఏ వి ఆర్ స్వామి గారు మాట్లాడుతూ ఇక్కడకి వచ్చిన పెద్దలు అందరికి, మీడియా మిత్రులకి నా నమస్కారములు, నేను రాహు అనే మూవీ తో నా ప్రయాణం స్టార్ట్ చేశాను, బాలు గారి తో ఒక సినిమా చేశాను, ఇప్పుడు నీతో చేస్తున్నాను, ఈ సినిమా తప్పకుండా మీ ఆదరణ పొందుతుంది అని మాట్లాడారు.


-హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, ఈ ఈవెంట్ కి  రావటానికి కారణం టీజర్ నాకు చాలా చాలా నచ్చింది, సినిమా ఆటోగ్రాఫేర్ సుందర్ అమేజింగ్ వర్క్, అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అమేజింగ్, బాలు ఈ నగరానికి ఏమైంది కి వర్క్ చేసాడు, పవిత్రలోకేష్ గారు దియా లో తన నటనకి నా కళ్ల నుంచి నీళ్లు వచ్చాయి, రవివర్మ వెన్నల చూసినప్పుడు చాలా ఎక్సయిట్  అయ్యాను, డైరెక్టర్ చెపుతున్నాడు మాది చిన్న సినిమా అని అంటున్నాడు సినిమా రిలీజ్ అయ్యాక చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతాయి,  మొదట్లో అభిరామ్ నేను కలిసి అవకాశాలు కోసం ట్రావెల్ చేసాం, మా గ్రూప్ లోనే ఉంటేవాడు, అల్ ది  బెస్ట్ అభిరామ్,ప్రొడ్యూసర్స్ థాంక్స్ యు సార్,నన్ను ఈ ఈవెంట్ కి పిలిచినందుకు అని చెప్పి ఈ సినిమా మంచి విజయం సాదించాలి అని కోరుకున్నాడు.


-పవిత్ర లోకేష్ మాట్లాడుతూ  అందరికి నమస్కారం, ఇక్కడ అందరు యంగ్ స్టార్స్ వున్నారు, వీళ్ళు అందరిని  కలవటం చాలా ఆనందం గా వుంది, ప్రొడ్యూసర్స్ సినిమా తీయటం అనేది ఒక వ్యాపారం లాంటిది,చాలా సీరియస్ గా సినిమాలు నిర్మించాలి, బాలు శర్మ గురించి చెప్పాలి అంటె  చాలా మంచివాడు, ఫస్ట్ డైరెక్టర్ అంటె ఏమో అనుకున్నాను కాని సెట్  లో తన వర్క్ చూసిన తరువాత అంత క్లియర్ అయ్యింది, విశ్వక్ ని కలవటం చాలా హ్యాపీ గా వుంది, అభిరామ్ చాలా  పెద్ద హీరో అవుతాడు, ఇప్పుడు  మంచి సినిమాలు చేసుకుంటూ పొతే స్మాల్ బడ్జెట్ అనేది నో  మేటర్ మేటర్, థాంక్ యు పప్రొడ్యూసర్స్ అలాగే అల్ ది బెస్ట్ చెప్పారు.


-స్నేహాల్ గారు మాట్లాడుతూ నీతో ఒక మెట్రో సెక్షన్ లవ్ స్టోరీ, మెట్యూర్డ్  లవ్ స్టోరీ, దీనిలో అన్ని ఎమోషషన్స్ ఉంటాయి, ఇది నాకు, మా వైఫ్ కీర్తన కి ఫస్ట్ ప్రాజెక్ట్, ఇది రొటీన్ గా వుండే సినిమా కాదు మీ అందరికి సినిమా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను.


-సినిమాటోగ్రఫేర్ సుందర్ మాట్లాడుతూ ఇది నాకు మొదటి సినిమా, మాది ప్రొపెర్ అంత తమిళనాడు,నాకు ఈ సినిమా లో అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.


-డైరెక్టర్ బాలు గారు  మాట్లాడుతూ అందరి కి నమస్కారం, విశ్వక్ సేన్  చాలా థాంక్స్ పిలవగానే వచ్చినందుకు, ఈ రోజుల్లో అవకాశాలు రావటం లేదు అనుకుంటాం కాని అవకాశాలు వెతుకుతూ ప్రయత్నం చేయాలి, అభిరామ్ గారు ద్వారా ఏవి ఏస్  స్వామి గారిని  కలిఫించటం జరిగింది, మా ప్రొడ్యూసర్స్  కధ వినటం జరిగింది, అభిరామ్ గారు, సాత్విక్ గారికి  నాకు థాంక్స్, వివేక్ సాగర్ సంగీతం, కాని, పవిత్ర లోకేష్ గారు కాని, TNR గారు  ఆయన మన మధ్య లేరు ఆయనతో కలిసి గడిపిన టైం చాలా విలువైనది, మా సినిమా ఆటోగ్రాఫేర్  సుందర్ అందరికి థాంక్స్ చెప్పుకుంటున్నాను అని చెప్పారు.


-అభివర్మ గారు మాట్లాడుతూ ప్రొడ్యూసర్ గారు మూడు సినిమాలు తీశారు కోవిద్ టైం లో మీకు పెద్ద  సక్సెస్  రావాలి, విశ్వక్ సేన్ ని ఫలక్ నామ దాస్ లో చూసి చాలా ఇంప్రెస్స్ అయ్యాను, అభి నువ్వు కూడా   విశ్వక్ లాగా ట్రాన్స్ఫార్మర్ అవుతుంది రావాలి, నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, సినిమా మంచి విజయం సాధిస్తుంది అని చెప్పారు.


-సిమ్రాన్ చౌదరి మాట్లాడుతూ, టీజర్ వెరీ ఫ్రెష్ గా వుంది, నాలుగు సంవత్సరాలనుండి బాలు తెలుసు,ఈ స్టోరీ నేను చాలా బాగా నమ్ముతున్నాను అని చెప్పి, ఈ సినిమా టీమ్ అందరికి అల్ ది బెస్ట్ చెప్పింది.


-సంజిత్ మాట్లాడుతూ, విశ్వక్ థాంక్స్  మమ్మల్ని విష్ చేయటానికి వచ్చినందుకు,బాలు,అభిరామ్, నాలుగు సంవత్సరాలు నుంచి ఫ్రెండ్స్, బాలు నీతో గురించి చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యాను, రియల్లీ ఫన్ వర్కింగ్ పర్సన్, స్నేహాల్ గారు ఒక్కరోజు కూడా సెట్ కి రాకుండా ఉండటం నేను చూడలేదు అంత హార్డ్ వర్కింగ్ ప్రొడ్యూసర్ అలాగే ఇక్కడకి వచ్చిన అందరకి థాంక్స్.

ప్రొడ్యూసర్స్ :ఏ వి ఆర్ స్వామి M.SC ( AG ),ఎం. ఆర్. కీర్తన, స్నేహాల్ జంగాల

మ్యూజిక్ :వివేక్ సాగర్

డైరెక్టర్ :బాలు శర్మ 

ఎడిటింగ్ :మార్తాండ్ కె వెంకటేష్

సినిమాటోగ్రఫీ :సుందరం  కృష్ణన్

కాస్ట్యూమ్ డిజైనర్ :సంజన శ్రీనివాస్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ :స్మరన్

పి ఆర్ వో :ఏలూరు శ్రీను.మేఘ శ్యామ్

Idhe Maa Kadha Releasing on October 2nd

 అక్టోబ‌రు 2న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న  `ఇదే మా కథ`



ప్రపంచంలోని చాలా మంది వ్యక్తుల‌కు తమ కలల గమ్యస్థానానికి వెళ్లాలనే కోరిక ఉంటుంది. అలా   విభిన్న నేపథ్యం ఉన్న నలుగురు బైక్‌ రైడర్లు తమ గమ్యానికి చేరుకునే మార్గంలో ఒకరికొకరు పరిచయమై  ఒకరి గురించి మరొకరు ఏం తెలుసుకున్నారు? గమ్యానికి ఎలా చేరుకున్నారు? అనే ఆస‌క్తిక‌ర‌ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న చిత్రం `ఇదే మా క‌థ‌`.


ఈ రోడ్ జ‌ర్నీ చిత్రంలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో న‌టించారు. గురు పవన్ దర్శకత్వంలో  శ్రీ‌మ‌తి మ‌నోర‌మ స‌మ‌ర్ప‌ణ‌లో గుర‌ప్ప ప‌ర‌మేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మహేష్ గొల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు.  


టాలీవుడ్ లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కాన్సెప్ట్ టీజ‌ర్‌ను ఇటీవ‌ల విక్ట‌రీ వెంక‌టేష్ రిలీజ్ చేశారు. ఆ టీజ‌ర్‌కి ప్రేక్ష‌కుల నుండి విశేష‌ స్పంద‌న ల‌భిస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని గాంధీ జ‌యంతి కానుక‌గా అక్టోబ‌రు 2 న‌గ్రాండ్ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్.


ఒక ప్రముఖ వ్యాపార దిగ్గజం వ్యక్తి, ఒక మధ్యతరగతి మహిళా తన తండ్రి కన్న కలలు నెరవేర్చాలని ఆరాటం, సమకాలీన ప్రపంచంలో యువత తనలో ఉన్న శక్తులను ఎలా ఒక గమ్యస్థానం వైపు తీసుకువెళ్ళాడు, నేటి కాలంలో ఉన్న మహిళలు తన జీవితంలో నూతన అడ్డంకులను అదే జీవితం కాదు ఇంకా చాలా జీవితం ఉంది అని ఎలా తెలుసుకున్నది అన్నది అక్టోబర్ రిలీజ్ అవుతున్న తెరపై చూడవచ్చు


ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్, జునైద్ సిద్దిఖీ ఎడిటర్.


న‌టీన‌టులు: సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్, పృధ్వీ రాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, సప్తగిరి, జబర్దస్త్ రామ్ ప్రసాద్, త్రివిక్రమ్ సాయి, శ్రీజిత ఘోష్ తదితరులు



సాంకేతిక వ‌ర్గం:

దర్శకత్వం: గురు పవన్

నిర్మాత‌: మహేష్ గొల్లా

స‌మ‌ర్ప‌ణ‌: శ్రీ‌మ‌తి మ‌నోర‌మ

బ్యాన‌ర్‌: గుర‌ప్ప ప‌ర‌మేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్

కెమెరా: సి. రామ్‌ప్రసాద్,

సంగీతం: సునీల్‌ కశ్యప్‌.

ఎడిట‌ర్‌: జునైద్ సిద్దిఖీ

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చిరంజీవి ఎల్

పీఆర్ఓ: వంశీ - శేఖ‌ర్

V b Entertainments Telugu Film, TV Directory Launch ... Dedicated to SP Balasubramaniam

             V b Entertainments Telugu Film, TV Directory Launch ... Dedicated to SP Balasubramaniam 




         Veebi Entertainments has been publishing Telugu Film and TV Directory since 2014 and has been presenting the Silver Awards along with the Television Awards. Vishnu Boppana, the head of Veebi Entertainments, has created a diary of movie stars for this year, just like every year. This diary is dedicated to Ganagandharva Padma Vibhushan SP Balasubramaniam. The diary launch event was held on Saturday at Prasad Lab in the presence of celebrities. Our Presidents launched the VK Naresh Diary and presented it to actor Shiva Balaji and Vishnu Boppana. VK Naresh said, "I thank Vishnu Boppana, the head of Veebi Entertainments, for the last seven years for their support in the Diary, TV Awards, Silver Screen Awards, Poor Cinema and TV co-ops for not stopping in catastrophic situations like Kovid." Actor Shiva Balaji said, "Vishnu Boppana, who is still trying to do something else, wants to do good for everyone who supports him and for other people." Vishnu Boppana, Head, Veebi Entertainments, said, "I would like to salute my sponsors who are supporting me by launching similar programs with me, and planning some other social events.--


Akash Puri’s Romantic Grand Release Worldwide On November 4 For Diwali

 Akash Puri’s Romantic Grand Release Worldwide On November 4 For Diwali



Dashing director Puri Jagannadh has provided story, screenplay and dialogues for his son Akash Puri’s next outing Romantic being helmed by his protégé Anil Paduri. After delivering a blockbuster with ‘iSmart Shankar’, Puri Jagannadh and Charmme Kaur are producing ‘Romantic’ under Puri Jagannadh Touring Talkies and Puri Connects banners.


The makers have announced release date of Romantic through a striking ‘Romantic’ poster. Akash is seen following the glamorous looking Ketika Sharma in a foreign location. Akash looks dapper, while Ketika is pretty here. Moreover, their pairing looks adorable.


The worldwide theatrical release date of ‘Romantic’ is now locked for November 4th, on Diwali Day. It is indeed the first Telugu film to join Diwali race.


The film’s censor formalities were also completed recently and it was awarded with U/A certificate and no cuts were suggested by the censor sleuths.


Starring Ramya Krishna in an important role, Romantic is touted to be an intense romantic entertainer. Sunil Kashyap scores music for the film, while Naresh handles the cinematography.


The makers so far have released two songs which both got tremendous response.


Cast: Akash Puri, Ketika Sharma, Ramyakrishna, Makarand Deshpande, Uttej and Sunaina


Crew:

Story, screenplay and dialogues: Puri Jagannadh

Director: Anil Paduri

Producers: Puri Jagannadh, Charmme Kaur

Presented by: Lavanya

Banners: Puri Jagannadh Touring Talkies and Puri Connects

Music: Sunil Kashyap

Cinematography: Naresh

Editor: Junaid Siddiqui

Art Director: Jonny Shaik

Lyrics: Bhaskarbhatla

Fights: Real Satish

PRO: Vamsi-Shekar

Maha Samudram Trailer Is Intense And Intriguing Says Pan India Star Prabhas

 



Maha Samudram Trailer Is Intense And Intriguing Says Pan India Star Prabhas

Sharwanand, Ajay Bhupathi, AK Entertainments - Maha Samudram has locked its arrival on October 14th as Dussehra Special. The team has released their trailer and set the ball rolling. The trailer which is a perfect blend of emotions and action is a blockbuster and has become viral on social media.

In the second day of its release, the trailer is still trending at Top on YouTube Trends chart and has amassed more than 6.5 Million Views. It has floored many celebrities until now and now Pan India Star Prabhas joins the list.

"Maha Samudram trailer is intense and intriguing... My best wishes to Sharwanand, Siddharth, and the entire team..," Prabhas wrote on Facebook sharing the trailer. The team is floored by the Baahubali Star's endorsement and have thanked him profusely.

Jagapathi Babu, Rao Ramesh, KGF Ramchandra Raju and others play important roles in the film which has Aditi Rao Hydari and Anu Emmanuel playing the female leads. Chaitan Bhardwaj composes music for the film and the songs released so far were very impressive.


Naga Shaurya,Ritu Varma stared Varudu Kaavalenu releasing in October 15 on the ocassion of Dussehra

 Naga Shaurya,Ritu Varma stared Varudu Kaavalenu releasing in October 15 on the ocassion of Dussehra.



Young Hero Naga Shaurya and Heroine Ritu Varma starer Varudu Kaavalenu under the direction of Lakshmi Sowjanya in the production of prestigious banner Sitara Entertainments.


Makers have announced through a poster that they’re releasing the movie on the auspicious day if Dussehra on October 15.

“Varudu Kaavalenu will be a mix of Love,fun,emotional ride and audience will love it”


Already the songs Kola Kale ilaa‘ and ‘Digu Digu Naga,‘Manasulone Nilichipoke Maimarapula Madhurima" which got released won the hearts of audience.Recently released teaser has received tremendous response from both audience and social media.First glimpse, posters also garnered positive response.Currently post production work is under progress.


Naga Shourya and Ritu Varma as a leading pair, Nadiya, Murali Sharma, Vennela Kishore, Praveen, Ananth, Kiriti Damaraju, Rangasthalam Mahesh, Arjun Kalyan, Vaishnavi Chaitanya, Siddiksha are the main leads.


For this movie

Dialogues: Ganesh Kumar Ravuri,

Cinematographer: Vamsi Patchipulusu,

Music : Vishal Chandrashekhar

Editor: Navin Nooli

Art: A.S Prakash

PRO: Lakshmivenugopal

Presents by: P.D.V Prasad

Produced by: Surya Devara NagaVamsi

Story- Direction:Lakshmi Sowjanya

Raviteja Khilaadi Movie Talkie Completed

 మాస్ మహారాజా ర‌వితేజ‌, రమేష్ వర్మ, సత్యనారాయణ కోనేరు `ఖిలాడి` టాకీ పార్ట్ పూర్తి



మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ `ఖిలాడి`.  సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.


ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కి, వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని చిత్రయూనిట్ ప్రకటించింది.


థియేటర్లో ప్రేక్షకులను థ్రిల్‌ ఇచ్చేందుకు రమేష్ వర్మ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సుజిత్ వాసుదేవ్,  జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా..అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.


నటీనటులు: రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి


సాంకేతిక బృందం:

కథ, కథనం, దర్శకత్వం: రమేష్ వర్మ

నిర్మాత: సత్యనారాయణ కోనేరు

బ్యానర్: ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్

ప్రొడక్షన్: ఏ హవీష్ ప్రొడక్షన్

సమర్పణ: డాక్టర్ జయంతిలాల్ గద

సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫర్: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు

స్క్రిప్ట్ కో ఆర్టినేషన్: పాత్రికేయ

ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు అరివు

డైలాగ్స్: శ్రీకాంత్ విస్స, సాగర్

ఎడిటర్: అమర్ రెడ్డి

లిరిక్స్: శ్రీ మణి

స్టిల్స్: సాయి మాగంటి

మేకప్: ఐ శ్రీనివాసరాజు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి

ప్రొడక్షన్ హెడ్: పూర్ణ కండ్రు

పబ్లిసిటీ: రామ్ పెద్దిటి సుధీర్

కో డైరెక్టర్: పవన్ కేఆర్‌కే

ఆర్ట్:  గాంధీ న‌డికుడిక‌ర్‌

పీఆర్ఓ: వంశీ-శేఖర్

Asalem Jarigindante Releasing on October 1st

 ఆద్యంతం అలరించే

అసలేం జరిగిందంటే...?

అక్టోబర్ 1 విడుదల!!



     "అసలు ఏం జరిగిందంటే చిత్రం అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఒక ట్రయాంగిల్ లవ్ స్టొరీతో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం అలరించనుంది. "పెదరాయుడు, ఆహా, పెళ్లి చేసుకుందాం, దేవి" తదితర సూపర్ హిట్ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా.. మొన్న వచ్చిన మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతికి చిన్నప్పటి కారెక్టర్ తో మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ కథానాయకుడిగా.. శ్రీపల్లవి, కారుణ్య చౌదరి, కరోణ్య కత్రిన్ హీరోయిన్లుగా, 'రమణా లోడెత్తాలిరా' ఫేమ్ కుమనన్ సేతురామన్, హరితేజ, షఫీ, షాని సాల్మన్, జబర్దస్త్ ఫణి మరియు దొరబాబు ముఖ్య పాత్రలలో రూపొందిన ఈ సినిమా కుటుంబం అందరూ కలిసి చూసి ఆనందించేలా ఉంటుంది అని.. అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అని చిత్ర రచయిత & దర్శకుడు శ్రీనివాస్ బండారి తెలియజేసారు. 

     జి.ఎస్.ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ చిత్రాన్ని ఏ.బి.ఆర్.ప్రొడక్షన్స్ ద్వారా అనిల్ బొద్దిరెడ్డి సమర్పిస్తున్నారు. ఎమ్.జి.ఎమ్ ఫిలిమ్స్ వారు ఈ చిత్రాన్ని తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కర్ణ ప్యారసాని, సాహిత్యం-సంగీతం: చరణ్ అర్జున్, కూర్పు: జె.ప్రతాప్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షాని సాల్మన్, సమర్పణ: అనిల్ బొద్దిరెడ్డి, నిర్మాణం: జి.ఎస్.ఫిల్మ్స్,

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ బండారి!!

Goutham Raju Son Krishna 2+4=24 First Look Launched

 గౌతమ్ రాజు తనయుడు కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా  2+4=24 సినిమా ఫస్ట్ లుక్ విడుదల



కృష్ణ రావు సూపర్ మార్కెట్ సినిమా ద్వారా తన నటన తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కృష్ణ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం 2+4=24.  సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో కృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా ఈ సినిమా  షూటింగ్ శెరవేగంగా జరుగుతుంది.  ఆర్.పి రామ్ దర్శకత్వంలో సావిత్రి ఫిలిమ్స్ సమర్పణ లో రీల్స్ అండ్ రీల్స్ ప్రొడక్షన్ పతాకం పై నంబిరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రిన్స్ జోసెఫ్ సంగీతం సమకూరుస్తున్నారు. అరుళ్ మోసెస్ కూర్పు, మహేష్ ఆర్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర బృందం.


ఈ సందర్భంగా నిర్మాత నంబి రాజ్ మాట్లాడుతూ.. 2+4=24 సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడి మీద పూర్తి నమ్మకం తోనే ఈ సినిమా చేస్తున్నాం. కథ కు తగ్గ హీరో మాకు కృష్ణ గారి రూపం లో దొరికారు. అయన ఈ సినిమా తో మళ్ళీ ప్రేక్షకులను ఎంతగానో అలరించబోతున్నారు. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఈ సినిమా కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం అన్నారు.  


దర్శకుడు  ఆర్.పి రామ్ మాట్లాడుతూ.. సైన్స్ ఫిక్షన్ చిత్రాలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. నన్ను నమ్మి ఈ సినిమా ను ప్రొడ్యూస్ చేస్తున్న నిర్మాత గారికి, సినిమా చేస్తున్న హీరో గారికి ధన్యవాదాలు. సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నాం.. త్వరలోనే మిగితా షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం.. కృష్ణ గారి నటన ఈ సినిమా లో చాలా బాగుంటుంది. ఆయనకు ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొస్తుంది అని నమ్ముతున్నా.. అన్నారు. 


నటీనటులు 

కృష్ణ, రుజుల్ కృష్ణ, సుజీవన్, బద్రి జార్జ్ తదితరులు..


సాంకేతిక నిపుణులు :

సమర్పణ : సావిత్రి ఫిలిమ్స్

బ్యానర్ : రీల్స్ అండ్ రీల్స్

డీవోపీ :  కృష్ణ

ఎడిటింగ్ : అరుళ్ మోసెస్

సంగీతం :  ప్రిన్స్ జోసెఫ్

దర్శకుడు :  ఆర్.పి రామ్ 

నిర్మాత : నంబి రాజ్

పీ ఆర్ ఓ : సాయి సతీష్ , పర్వతనేని రాంబాబు

The Turn First Look Launched

హీరో కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా  "ది టర్న్"  సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల ..!!



ప్రముఖ హాస్య నటుడు గౌతమ్ రాజు తనయుడు కృష్ణ హీరోగా చేస్తున్న తాజా చిత్రం  "ది టర్న్". సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో మనోహర్ వల్లెపు ,లడ్డు ,అరుణ్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండగా వాసంతి, రత్నమాల ఫీమేల్ లీడ్ రోల్స్ లోనటిస్తున్నారు. కౌశల్ క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై డీబీ దొరబాబు దర్శకత్వంలో భీమినేని శివ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా కి RG సారథీ సంగీతం సమకూరుస్తుండగా ప్రదీప్ జంబిగా ఎడిటింగ్ ను అందిస్తున్నారు.  విజయ్ ఠాగూర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఈ చిత్రానికి ఆయన విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కాగా ఈరోజు హీరో కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేసింది చిత్ర బృందం. 


ఈ సందర్భంగా  నిర్మాత భీమినేని శివ ప్రసాద్ మాట్లాడుతూ.. ది టర్న్ సినిమా కథ చాలా బాగుంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా లు మెచ్చే వారికి ఈ చిత్రం తప్పక నచ్చుతుంది. మా హీరో కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అయన నటన చాలా బాగుంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేశాం.. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాం అన్నారు. 


దర్శకుడు డీబీ దొరబాబు మాట్లాడుతూ.. నన్ను నమ్మి ఈ సినిమా ను నిర్మించడానికి ఒప్పుకున్న నిర్మాత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అనుకున్నట్లుగానే ఈ సినిమా చాలా బాగా వస్తుంది. తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది. కృష్ణ గారితో పనిచేయడం ఎంతో గొప్పగా ఉంది.. తొందర్లోనే సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం.. హీరో కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు అన్నారు. 



నటీనటులు 


కృష్ణ, మనోహర్ వల్లెపు ,లడ్డు ,అరుణ్ కుమార్, వాసంతి, రత్నమాల


సాంకేతిక నిపుణులు :

బ్యానర్ :  కౌశల్ క్రియేషన్స్

డీవోపీ :  విజయ్ ఠాగూర్

ఎడిటింగ్ :  ప్రదీప్ జంబిగా 

సంగీతం :  RG సారథీ

దర్శకుడు :  డీబీ దొరబాబు

నిర్మాత :  భీమినేని శివ ప్రసాద్

పీ ఆర్ ఓ : సాయి సతీష్

Lamp Movie First Look Launched

 "లాంప్ " మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన యండమూరి వీరేంద్రనాథ్                                                     


                                                                 

                                                                                                                            నువ్వుల వినోద్, కోటి కిరణ్, మధుప్రియ, అవంతిక హీరో హీరోయిన్లుగా చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్ పై రాజశేఖర్ దర్శకుడిగా ఏడుచేపలకథ చిత్ర నిర్మాత జి వి యన్ శేఖర్ రెడ్డి నిర్మించిన "లాంప్ " మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రపంచ ప్రఖ్యాత నవలా రచయత డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ విడుదల చేసారు.                                                                           ఈ సందర్భంగా యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ ... లాంప్ మూవీ కథ తెలుసు డైరెక్టర్ రాజశేఖర్  నాకు స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎక్సయిటింగ్ గా ఫీల్ అయ్యా అంతర్లీనంగా మంచి మెసేజ్ కూడా ఉంది , ఏడుచేపలకథ చిత్ర నిర్మాత ఈ సినిమాను ఎక్కడ  కంప్రమైస్ కాకుండా నిర్మించి ఉంటారు ప్రేక్షకులు కూడా  ఈ సినిమా ని బాగా ఆదరించాలని ఈ చిత్రంలో నటించిన నటీనటులకు సాంకేతిక నిపుణలకు మంచిపేరు రావాలని అన్నారు .                                                                                                               నిర్మాత జి వి యన్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ... ఏడుచేపలకథ లాంటి హిట్ సినిమా తర్వాత ఎలాంటి మూవీ చేద్దామని ఆలోచిస్తున్న టైములో రాజశేఖర్ లాంప్ మూవీ కథ చెప్పాడు నాకు బాగా నచ్చి చేశాను సినిమా బాగా వచ్చింది అన్ని వర్గాల ప్రేక్షలకు నచ్చుతుందని ఆశిస్తున్నా అన్నారు.                                                                                దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ ... ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటూ ఒక చిన్న మెసేజ్ అందర్నీ అలరిస్తుంది .                                                                                              ఇంకా రాకేష్ మాస్టర్, సి హెచ్ నాగేంద్ర, వై వి రావ్ , చలపతి నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : క్రిష్ బొంగొని , ఎడిటింగ్ : గణేష్ దాసరి , మ్యూజిక్ : శ్రీ వెంకట్ , నిర్మాత :  జి వి యన్ శేఖర్ రెడ్డి, కథ స్క్రీన్ ప్లే  దర్శకత్వం : రాజశేఖర్

White Paper in Indian Book of Records

 9 గంటల 51 నిమిషాల వ్యవధిలో రెండు గంటల " వైట్ పేపర్ " సినిమా



ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అదిరే అభి " వైట్ పేపర్ " సినిమా

జి.ఎస్.కె  ప్రొడక్షన్స్ పతాకంపై శివ దర్శకత్వం గ్రందే శివ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం  " వైట్ పేపర్" (White Paper). ప్రభాస్ హీరో గా నటించిన ఈశ్వర్ చిత్రంలో ప్రభాస్ ఫ్రెండ్ గా తన నట జీవితాన్ని ప్రారంభించిన అభినయ కృష్ణ, ఎన్నో చిత్రాల్లో నటుడుగా కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. జబర్దస్త్ టివి షో తో అదిరిపోయే కామెడీ పెర్ఫార్మెన్స్ తో అదిరే అభి గా ప్రసిద్ధి చెందాడు. ఇప్పుడు ఈ వైట్ పేపర్ చిత్రం తో హీరో గా పరిచయం కాబోతున్నాడు.


ఈ చిత్రాన్ని కేవలం 9 గంటల 51 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసారు. ఈ సందర్భంగా  ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అరుదైన చిత్రంగా సత్కరించారు.


అయితే ఈ రోజు సెప్టెంబర్ 24న మన అదిరే అభి పుట్టిన రోజు. ఈ సందర్భంగా వైట్ పేపర్ టైటిల్ లుక్ ను మనో,ఇంద్రజా, అనసూయ గార్లు విడుదల చేసారు.



ఈ సందర్భంగా మనో మాట్లాడుతూ "వైవిధ్య కథనాలు ఎంచుకోవడంలో మా అభి ముందు ఉంటాడు, అలానే ఇప్పుడు ఈ వైట్ పేపర్ సినిమా ని కూడా డిఫరెంట్ గా చేసాడు, ఈ చిత్రం మంచి విజయం సాధించాలి" అని కోరుకున్నారు.


ఇంద్రజా మాట్లాడుతూ  "సామాన్యంగా నటి నటులు తమ పాత్రలు చేస్తున్నప్పుడు ఎంతో హోమ్ వర్క్ చేస్తారు , అలాంటిది ఒక్క రోజులో అది కూడా  9 గంటల 51 నిమిషాల టైమ్ టార్గెట్ పెట్టుకొని సినిమా తియ్యడం అంటే ఇంకా మా అభి  చాలా హోమ్ వర్క్స్ చేసి ఉంటాడు, సో అభి ఇలాంటి అవార్డ్స్ ఇంకా ఎన్నో పొందాలని కోరుకుంటున్నాను.


అనసూయ మాట్లాడుతూ "అభి ని ఎప్పటి నుంచో చూస్తున్నాను , అభి ఏదేనా చేయాలి అనుకుంటే చాలా కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు , ఒక నటుడిగా తన ప్రతిభ మన అందరికి తెలుసు, ఇప్పుడు వైట్ పేపర్ సినిమాలో హీరో గా చేయడమే కాకుండా, ఆ సినిమా ని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నిలిచేలా చేయడం చాలా సంతోషంగా ఉంది, వారి టీం అందరికి శుభాకాంక్షలు.



హీరో అభి మాట్లాడుతూ "కథ చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించింది. కేవలం 9 గంటల 51 నిమిషాల సమయంలోనే సినిమా షూటింగ్ అంత పూర్తి చేయాలి అన్నప్పుడు దర్శకుడి డెడికేషన్ నచ్చింది. ఈ చిత్రానికి విడుదల ముందే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు రావటం, మా మనో గారు, ఇంద్రజా గారు, అనసూయ గారు మా చిత్రం టైటిల్ లుక్ పోస్టర్ ను విడుదల చేయటం చాలా సంతోషం గా ఉంది .



డైరెక్టర్ శివ మాట్లాడుతూ "సస్పెన్స్ కథనంతో తెరకెక్కిన ఈ సినిమా లో అభి హీరో గా నటించారు. తను లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు, మాకు అవార్డు కూడా వచ్చేది కాదేమో, మాకు అభి అన్న ఇచ్చిన  సపోర్ట్ వాళ్ళ 9 గంటల 51 నిమిషాలలో  చిత్రాన్ని పూర్తిచేసాము. అందరూ ఒక్క రోజులో ఎలా సినిమా తీయగలవు అన్నారు, అభి అన్న సపోర్ట్ తో, టీం సహకారంతో సినిమా తీయడం అవార్డు కొట్టడం, అలానే అభి అన్న పుట్టినరోజు సందర్భంగా ఇలా టైటిల్ లుక్  రివిల్ చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.


ఈ కార్యక్రమంలో  రాజశేఖర్,  శ్యామ్ ప్రసాద్ లు పాల్గొన్నారు.



అదిరే అభి ( అభినయ కృష్ణ), వాణి, తల్లాడ సాయి కృష్ణ ,నేహా, నంద కిషోర్ తదితరులు నటించిన ఈ సినిమా కి

నిర్మాత - గ్రంథి శివ కుమార్, డైరెక్టర్- శివ,కేమేరా- మురళి కృష్ణ,

ఎడిటింగ్- కె.సి.బి. హరి

సంగీతం - నవనిత్ చారి,

పి.ఆర్.ఓ- పాల్ పవన్


Love Story Success Celebrations

 "లవ్ స్టోరి" సక్సెస్ మాటలకు అందని సంతోషాన్నిచ్చింది - సినిమా టీమ్ మెంబర్స్




నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా "లవ్ స్టోరి". ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన ప్రతి సెంటర్ నుంచి సూపర్బ్ రిపోర్ట్ అందుకుంటోంది. ఈ సక్సెస్ సంతోషాన్ని లవ్ స్టోరి టీమ్ పాత్రికేయులతో పంచుకుంది. ఏషియన్ సినిమాస్ సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ విజయోత్సవ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్, పి.రామ్మోహన్ రావు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఆనందంగా లవ్ స్టోరి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా


*దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ*...ఎన్నో కష్టాలు పడి లవ్ స్టోరి సినిమా మీ ముందుకు తీసుకొచ్చాం. ఇవాళ ప్రేక్షకులు మా సినిమాకు గొప్ప విజయాన్ని అందించారు. లవ్ స్టోరి సినిమా తమకు బాగా నచ్చిందని చెబుతున్నారు. ఈ విజయం గురించి వింటుంటే మాటలు రావడం లేదు. ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. కులం పేరుతో ఇబ్బందులు పడే హీరోకు, చిన్నప్పటి నుంచి వివక్షకు, బాధలకు గురైన అమ్మాయికి మధ్య తెరకెక్కించిన ఈ కథను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. నిర్భయ ఘటన జరిగిన తర్వాత సొసైటీకి మంచిని చెప్పే ఒక సినిమా చేయాలని అనుకున్నాను. ఆ తర్వాత స్కూల్స్, కాలేజీలకు వెళ్లి ధీర నువ్వే ధీర అనే అవేర్ నెస్ ప్రోగ్రాం చేశాం. ఈ కార్యక్రమంలో ఇంటిలో, బయటా ఇబ్బందులకు గురయ్యే అమ్మాయిలను నిర్భయంగా మాట్లాడమని చెప్పాం. అక్కడి నుంచి ఈ సినిమా కథకు ఇన్సిపిరేషన్ దొరికింది. లవ్ స్టోరి కథను తెరకెక్కించడం కత్తి మీద సాము. అలాంటి కథను బాగా చూపించామని చెబుతుండటం సంతోషంగా ఉంది. తాము పడుతున్న ఇబ్బందులను ఒక ఆడపిల్ల బయటకు చెప్పుకోగలిగే ధైర్యం ఈ సినిమా చూసి తెచ్చుకుంటే, వివక్షకు గురైన ఒక ఊరి అబ్బాయి ఇది నా కథ అని రిలేట్ చేసుకుంటే మేము ఇంకా ఎక్కువ సక్సెస్ అయినట్లు భావిస్తాను. నా సినిమాల మీద ఉన్న నమ్మకంతో థియేటర్లకు వచ్చిన ఆడియెన్స్ కు థాంక్స్. నాగ చైతన్య, సాయి పల్లవి తమ క్యారెక్టర్స్ లో లీనమై సహజంగా నటించారు. మా యూనిట్ లోని ప్రతి ఒక్కరికి లవ్ స్టోరి సక్సెస్ పట్ల థాంక్స్ చెప్పుకుంటున్నాను. అన్నారు.



*హీరో నాగ చైతన్య మాట్లాడుతూ*...ఇప్పుడున్న టైమ్ లో థియేటర్లకు ఆడియెన్స్ ఎంతవరకు వస్తారు అని రిలీజ్ ముందు భయపడ్డాం కానీ ఇవాళ థియేటర్స్ లో ప్రేక్షకులను చూస్తుంటే సంతోషంగా అనిపిస్తోంది. లవ్ స్టోరి  చిత్రంలో దర్శకుడు శేఖర్ కమ్ముల అడ్రస్ చేసిన ఇష్యూస్ కు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఆ అంశాన్నింటినీ సినిమా చూసిన వాళ్లు ప్రశంసిస్తున్నారు. లవ్ స్టోరి సినిమా థియేటర్ లలో చూడాల్సిన సినిమా. తప్పకుండా థియేటర్లకు రండి మీరు మూవీని ఎంజాయ్ చేస్తారు. లవ్ స్టోరి  చిత్రానికి పనిచేసిన టీమ్ అందరికీ నా కృతజ్ఞతలు. అన్నారు.



*హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ*....మా సినిమా మంచి విజయం సాధించాలని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. స్టార్స్ ట్వీట్స్ చేశారు. ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్స్ మా సినిమా ప్రమోషన్ కు సపోర్ట్ చేశారు. వాళ్లందరికీ ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను. లవ్ స్టోరి వినోదం కోసం చూసే సినిమా మాత్రమే కాదు...ఇందులో మన చుట్టూ సమాజంలో, మన ఇంట్లో జరిగే అవకాశమున్న సమస్యలు ఉన్నాయి. ఆడపిల్లకు ఇంట్లో, బయటా ఇబ్బందిగా ఉంటే మీరు తప్పకుండా అడగాలి. అలాంటి మార్పు లవ్ స్టోరి చూశాక వస్తే మేము సంతోషిస్తాము. సొసైటీకి ఉపయోగపడే ఈ పాయింట్స్ ను టచ్ చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల గారిని అభినందించాలి. అన్నారు.



*నిర్మాత పి.రామ్మోహన్ రావు మాట్లాడుతూ*...లవ్ స్టోరి సక్సెస్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. సినిమా బాగుందంటూ ప్రతి థియేటర్ నుంచి మాకు ఫోన్స్ వస్తున్నాయి. సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ లో భారీగా రిలీజైన సినిమా మాదే. ఇంత గ్రాండ్ రిలీజ్ కు మాకు సపోర్ట్ చేసిన ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కు థాంక్స్. దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో నాగచైతన్య, సాయి పల్లవి..ఇలా ఈ టీమ్ తో మాకు మంచి బాండింగ్ ఉంది. అందుకే మా అసోసియేషన్ ఇకపైనా కొనసాగుతుంది. అన్నారు.



*నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ*...లవ్ స్టోరి సక్సెస్ గురించి ఇవాళ ప్రేక్షకులే మాట్లాడుతున్నారు. మేము మాట్లాడాల్సింది ఏమీ లేదు. ఇదే కాంబినేషన్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల గారు నెక్ట్ ఇయర్ మరో సినిమా చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.