Latest Post

Gully Rowdy Pre Release Event Held Grandly

 



కోన వెంక‌ట్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సందీప్‌ కిష‌న్ చాలా నేచుర‌ల్‌గా న‌టించిన కామెడీ ఎంట‌ర్‌టైనర్ ‘గ‌ల్లీ రౌడీ’ ఓ మైల్‌స్టోన్ మూవీ కావాలి:   ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గ‌ల్లీరౌడీ’.   బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో  కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్  కోన వెంక‌ట‌న్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్ట‌ర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 17న సినిమా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ  కార్య‌క్ర‌మానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా... 



ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి మాట్లాడుతూ ‘‘ఈరోజుల్లో సినిమా చేయ‌డం ఎంత క‌ష్ట‌మో తెలుస్తుంది. ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ వ‌ర్క్ చేసి సినిమా చేస్తే మ‌నం ఏదో కామెంట్ చేసి బ‌య‌ట‌కు వెళ్లిపోతాం. సినిమాలో అద్భుత‌మైన కామెడీ ట్రాక్ రాయ‌డంలో వెంక‌ట్‌ను మించిన‌వాడు లేడ‌ని నేను అనుకుంటాను. త‌నో స్టార్ రైట‌ర్‌. త‌న స‌ర్టిఫికేట్ ఇచ్చిన ఈ సినిమా త‌ప్ప‌కుండా బాగానే ఉంటుంద‌ని న‌మ్ముతున్నాను. స‌త్య‌నారాయ‌ణ‌గారిలోనే ప్యాష‌న్ అది రాజ‌కీయ‌మైన‌, సినిమా రంగ‌మైనా.. ఆయ‌న టాప్‌లోనే ఉన్నారు. ఆయ‌న‌కు అభినంద‌న‌లు. నాగేశ్వ‌ర్ రెడ్డిగారికి అభినంద‌న‌లు. సందీప్‌కిష‌న్ చేసిన వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ చూశాను. త‌ను నేచుర‌ల్ స్టార్‌. త‌న‌ని చూస్తే ధ‌నుశ్‌ను చూసిన‌ట్లు స్పార్క్ క‌నిపించింది. త‌న‌కు ఈ సినిమా త‌ప్ప‌కుండా ఈ సినిమా పెద్ద మైల్‌స్టోన్ మూవీ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను. ట్రైల‌ర్‌, పాటలు బావున్నాయి.  సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 


చిత్ర స‌మ‌ర్ప‌కుడు, రైట‌ర్ కోన వెంక‌ట్ మాట్లాడుతూ ‘‘ఇక నుంచి సినిమాయే మాట్లాడుతుంది. సినిమా క‌థ రాసింది భాను, నందు, తీసింది నాగేశ్వ‌ర్ రెడ్డిగారు. కానీ పోస్ట‌ర్‌పై ఢీ, రెఢీ, దూకుడు సినిమా పేర్లు ఎందుకు పెట్టామంటే, ఆ సినిమాల స్టైల్లో ఇది కూడా ఉంటుంద‌ని చెప్ప‌డానికి మాత్ర‌మే. నేను ప‌స్ట్ టైమ్ విష్ణుతో ఢీ, రామ్‌తో రెఢీ, మ‌హేశ్‌తో దూకుడు, ఎన్టీఆర్‌తో అదుర్స్ సినిమాలు చేశాను. అన్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలే. అలాగే ఫ‌స్ట్ టైమ్ సందీప్‌తో చేసిన గ‌ల్లీరౌడీ చిత్రానికి కూడా  అదే సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను. సినిమాకు అన్ని చ‌క్క‌గా కుదిరాయి. అంద‌రూ మంచి ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ కుదిరాయి. కామ‌న్ మేన్ హీరో సందీప్ కిష‌న్‌. సినిమా సినిమాకు త‌న గ్రాఫ్ పెరుగుతూ వ‌స్తుంది. ఇది త‌న గ్రాప్‌ను మ‌రింత పెంచుతుంది. ఇంకా త‌ను గొప్ప స్థాయికి చేరుకుంటాడు. చిరంజీవిగారు అంత టైమ్ తీసుకుని మా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి మా టీమ్‌ను ఎంక‌రేజ్ చేసింద‌నుకు ఆయ‌నకు పాదాభివంద‌నాలు’’ అన్నారు. 


హీరో సందీప్ కిష‌న్ మాట్లాడుతూ ‘‘‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ త‌ర్వాత ఎక్కువ ఆలోచించ‌కుండా స‌ర‌దాగా న‌వ్వుకునే ఓ సినిమా చేయాల‌ని అనుకుంటున్న స‌మ‌యంలో వివాహ భోజ‌నంబు సినిమాను రూపొందించిన భాను, సాయి.. గ‌ల్లీ రౌడీ క‌థ‌తో నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. వాళ్లు మ‌రో సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. అప్పుడు ఆ క‌థ‌న‌ను నాగేశ్వ‌ర్ రెడ్డిగారి ద‌గ్గ‌ర‌కు పంపాను. ఆయ‌న‌కు న‌చ్చింది. సినిమా చేద్దామని అన్నారు. అక్క‌డ నుంచి కోన‌గారి ద‌గ్గ‌ర‌కు క‌థ వెళ్లింది. కోన వెంక‌ట్‌గారు, ఎం.వి.స‌త్య‌నారాయ‌ణ‌గారితో మా ప్ర‌యాణం ప్రారంభ‌మైంది. జీవీగారు నిర్మాత‌గా ముందుండి మ‌మ్మ‌ల్ని న‌డిపించారు. ఈ సినిమాను, క్యారెక్ట‌ర్స్‌ను చాలా స‌ర‌దాగా పూర్తి చేశాం. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు, బాబీసింహ‌గారు, క‌ల్ప‌ల‌త‌గారు, నిజాయ‌తీగా అంద‌ర్నీ న‌వ్వించ‌డానికి చేసిన ప్ర‌య‌త్న‌మే గ‌ల్లీరౌడీ. ఓ క్రైమ్ కామెడీని ఫ్యామిలీ జోన‌ర్‌లో తీస్తే ఎలా ఉంటుందో అనేదే సినిమా. హీరోయిన్ నేహాశెట్టి రోల్ చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. సాయికార్తీక్‌తో నేను చేసిన మూడో సినిమా. సినిమాటోగ్రాఫ‌ర్ సిద్ధార్థ్ ... ఇటు కోన‌గారిని, అటు నాగేశ్వ‌ర్‌రెడ్డిగారిని చ‌క్క‌గా బ్యాలెన్స్ చేశాడు. సినిమా ప్ర‌పంచం మారుతుంది. దాన్ని మ‌నం అడాప్ట్ చేసుకోవాలి. మీరు  థియేట‌ర్స్‌కు వెళ్లి టిక్కెట్టు కొనుక్కుని సినిమా చూసిన‌ప్పుడు, అందులో రూపాయో, పైసానో మా మెతుకుపై మీ పేరు ఉంటుంది. మీరు సినిమా చూడ‌ట‌మే నాకు ముఖ్యం. థియేట‌ర్‌లో సినిమా చూసే అవ‌కాశం ఉంటే త‌ప్ప‌కుండా అలాగే చేస్తాం. మంచి సినిమా తీశాం. అంద‌రూ హ్యాపీగా న‌వ్వుకుంటార‌ని న‌మ్మ‌కంగా ఉన్నాం. ప్రేక్ష‌కులు మా సినిమాను చూసి బావుంద‌ని అప్రిషియేట్ చేస్తే చాలు. అదే మా స‌క్సెస్‌. ట్రైల‌ర్ చూసిన చిరంజీవిగారు.. సందీప్ నీకు ఇలాంటి క్యారెక్ట‌ర్స్ చాలా బావుంటాయి. ఇలాంటి పాత్ర‌లు బాగా న‌ప్పుతాయ‌ని అన్నారు. అది ఆయ‌న గొప్ప‌త‌నం. దేశంలో మ‌న తెలుగు ఇండ‌స్ట్రీలో మాత్ర‌మే ప‌రేక్ష‌కులు థియేట‌ర్స్‌కు వ‌స్తున్నారు. అది ఒకరికొక‌రు ఇచ్చే సాయం. మీరంద‌రూ మాకు ఇచ్చే న‌మ్మ‌కం. థియేట‌ర్స్‌లో సినిమాను చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. 


చిత్ర నిర్మాత ఎం.వి.వి.స‌త్యనారాయ‌ణ మాట్లాడుతూ ‘‘గల్లీ రౌడీ చాలా పెద్ద హిట్ అవుతుందని నిర్మాతగా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నేను, నా మిత్రుడు కోన వెంక‌ట్‌గారు క‌లిసి గీతాంజ‌లి  నుంచి జ‌ర్నీ స్టార్ట్ చేశాం. పాలిటిక్స్‌లో ఉండ‌టం వ‌ల్ల కొన్ని రోజుల పాటు సినిమా నిర్మాణానికి దూరం అయ్యాను. ఆ స‌మ‌యంలో ఓ రోజు కోన వెంక‌ట్‌గారు ఫోన్ చేసి, మంచి క‌థ ఉంది. విన‌మ‌ని క‌థ‌ను వినిపించారు. క‌థ వినే స‌మయంలో బాగా ఎంజాయ్ చేశాను. నా స్నేహితుడు జి.వికి క‌థ‌ను వినిపించాను. ఆయ‌న‌కు కూడా బాగా న‌చ్చింది. సినిమా చేద్దామ‌ని కోన వెంక‌ట్‌గారితో చెప్పాం. ఎక్కువ టైమ్ తీసుకోకుండానే సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేశాం. అర‌వై రోజుల్లో సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాం. సినిమా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది. ఇంత మంచి సినిమాను అందించిన కోన వెంక‌ట్‌గారికి, డైరెక్ట‌ర్ నాగేశ్వ‌ర్ రెడ్డిగారికి థాంక్స్‌. సందీప్ కిష‌న్ చాలా మంచి హీరో. హీరోయిన్ నేహ, రాజేంద్ర ప్ర‌సాద్ స‌హా టీమ్ అంద‌రం ఓ ఫ్యామిలీలా క‌లిసి పోయి చేసిన సినిమా ఇది. ఈ సినిమా మా ఎక్స్‌పెక్టేష‌న్స్ రీచ్ కాక‌పోతే, నెక్ట్స్ సినిమా చేయ‌ను అని చెప్ప‌గ‌ల‌ను అనేంత కాన్ఫిడెన్స్‌ను ఇచ్చిన సినిమా ఇది’’ అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు నాగేశ్వ‌ర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘సినిమా స్టార్ట్ కావ‌డానికి ముఖ్య కార‌ణ‌మైన సందీప్‌కు థాంక్స్‌. అలాగే ఈ సినిమా ఇంత బాగా రావ‌డానికి కోన‌వెంక‌ట్‌గారికి, మాకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్న నిర్మాత‌లు ఎం.వి.విగారు, జీవీగారికి థాంక్స్‌. సినిమా ఇంత అద్భుతంగా రావడానికి ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ చ‌క్క‌గా స‌పోర్ట్ చేశారు. నా కెరీర్‌లోనే ఇదొక బిగ్గెస్ట్ హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను. అంద‌రికీ పేరు పేరునా థాంక్స్‌’’ అన్నారు. 


నటకిరిటీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘‘ ప్యాండమిక్ పరిస్థితుల్లో అంద‌రూ దాదాపు ఆరు నెల‌ల పాటు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. జీవితంలో ఎలా జాగ్ర‌త్త‌గా ఉండాలనే విష‌యాల‌ను కూడా కోవిడ్ ద్వారా నేర్చుకున్నాం. క‌రోనా వ‌ల్ల ప్ర‌పంచం దెబ్బ తింది. ఈ నేప‌థ్యంలో సినిమా ఇండ‌స్ట్రీ కూడా దెబ్బ‌తింది. ఇలాంటి కోవిడ్ సిట్యువేష‌న్స్‌లో గ‌ల్లీ రౌడీ సినిమాను ఎందుకు చూడాలనే ప్ర‌శ్న వ‌స్తుంది. ఈ క‌థ‌ను సందీప్ కిష‌నే తెచ్చుకున్నాడు. అదొక మంచి విష‌యం. అలాగే కుటుంబం అంతా క‌లిసి చూసేలా సినిమా ఉంటుంది. అన్ని ఎలిమెంట్స్ ఉండే సినిమా. కోన‌వెంక‌ట్‌, నాగేశ్వ‌ర్‌రెడ్డి, ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ ఎంత త్వ‌ర‌గా సినిమాను పూర్తి చేయాల‌ని చూశారో, అంతే కంఫ‌ర్ట్‌లో ఉంచారు. సందీప్ కిష‌న్ బిడ్డ‌లా కంఫ‌ర్ట్‌ను ఇచ్చాడు. గ‌ల్లీ రౌడీ సినిమాను డిస‌ప్పాయింట్ చేయ‌ద‌ని యాక్ట‌ర్‌గా గ్యారంటీ ఇస్తున్నాను’’ అన్నారు. 


విష్వ‌క్ సేన్ మాట్లాడుతూ ‘‘కోన వెంకట్‌గారు హిట్ మిష‌న్‌. సందీప్ కిష‌న్‌ను ఇన్‌స్పైర్ అయ్యాను. త‌ను నాకు చాలా మంచి స్నేహితుడు. గ‌ల్లీ రౌడీ.. ట్రైల‌ర్‌, సాంగ్స్ చూస్తుంటే ప్రామిసింగ్‌గా ఉంది. ప్యాక్డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌. థియేట‌ర్స్‌కు ఆడియెన్స్ వ‌స్తే..రెండున్న‌ర గంట‌ల పాటు హాయిగా న‌వ్వుకుంటారు. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు. 


సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూ ‘‘గల్లీ రౌడీ సినిమా చూశాను. ప‌ర్‌ఫెక్ట్ ఎంట్‌టైన‌ర్‌. సినిమా కొచ్చే ప్రేక్ష‌కులు రెండున్న‌ర గంట‌లు వారి బాధ‌ల‌ను మ‌ర‌చిపోయి ఎంజాయ్ చేస్తారు. సందీప్ కిష‌న్ నాకు చాలా మంచి స్నేహితుడు. ఈ సినిమా త‌న‌కు పెద్ద హిట్ అవుతుంది. నేహాశెట్టి హీరోయిన్‌గా త‌నేంటో ప్రూవ్ చేసుకుంటుంది. నాగేశ్వ‌రరెడ్డిగారితో వ‌ర్క్ చేయాల‌ని ఎదురుచూస్తున్నాను. టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు. 


డైరెక్ట‌ర్ శ్రీవాస్ మాట్లాడుతూ ‘‘సాంగ్స్ చాలా బావున్నాయి. దర్శకుడిగా నాకు కోనవెంకట్‌గారితో మంచి అనుబంధం ఉంది. మా ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌, లౌక్యం, డిక్టేట‌ర్ సినిమాలు వ‌చ్చాయి. ఇక గ‌ల్లీరౌడీ సినిమా ట్రైల‌ర్ చూసినప్పుడు.. నేను, కోన‌వెంక‌ట్‌గారు క‌లిసి చేసిన లౌక్యం సినిమాలో ఎన‌ర్జీ క‌నిపించింది. కామెడీ ఫీల్ బాగా వ‌ర్క‌వుట్ అయిన‌ట్లు తెలుస్తుంది. ఇక సందీప్ గురించి చెప్పాలంటే.. అంద‌రితో క‌లుపుగోలుగా ఉండే హీరో. ఇక డైరెక్ట‌ర్ నాగేశ్వ‌ర్ రెడ్డిగారు కామెడీ సినిమాలు తీయ‌డంలో దిట్ట‌. కోన‌గారు వ‌ర్క్ చేసిన రెఢీ, దేనికైనా రెఢీ వంటి సినిమాల త‌ర‌హాలో ఈ సినిమా కూడా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఇలాంటి స‌మ‌యంలో ఇలాంటి సినిమా అవ‌స‌రం. మ‌న‌కున్న ఇబ్బందుల‌ను మ‌ర‌చిపోయే న‌వ్వుకునే సినిమా రావ‌డం మంచిది. నిర్మాత ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌గారు మంచి టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌. కోన‌గారు, స‌త్య‌నారాయ‌ణ‌గారి కాంబినేష‌న్‌లో ఇంకా మంచి సినిమాలు రావాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్‌టీమ్‌కు అభినంద‌న‌లు’’ అన్నారు. 


డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కోసం వ‌ర్క్ చేసిన అంద‌రూ నాకెంతో ప‌రిచ‌యం. ముఖ్యంగా కోన వెంక‌ట్‌గారితో మంచి అనుబంధం ఉంది. చిన్నికృష్ణ‌గారి త‌ర్వాత నాకు గురువులాంటి వ్య‌క్తి కోన‌గారు. ఇదొక కంప్లీట్ కామెడీ సినిమా. అన్ని అడ్డంకుల‌ను దాటి సినిమాను పూర్తి చేశారు. ఓటీటీకి మంచి డీల్ వ‌చ్చిన దాన్ని కూడా వ‌ద్ద‌నుకుని సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. నిర్మాత ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌గారు నిర్మాత‌గా మంచి సినిమాల‌ను చేస్తూ వ‌స్తున్నారు. ఇక హీరో సందీప్ విభిన్న‌మైన సినిమాలతో పాటు నిర్మాత‌ల‌కు డ‌బ్బులు వ‌చ్చే సినిమాల‌ను చేస్తూ వ‌స్తున్నారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ సాయికార్తీక్‌, చౌర‌స్తారామ్‌ల‌కు అభినంద‌న‌లు. సినిమాటోగ్రాఫ‌ర్ సుజాత సిద్ధార్థ్ వ‌ర్క్ ఫెంటాస్టిక్‌గా ఉంది. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారికి నేను పెద్ద అభిమానిని. త్వ‌ర‌లోనే నేను చేయ‌బోయే సినిమాలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారి కోసం ఓ పాత్ర‌ను రాసుకున్నాను. ఇవివిగారు త‌ర్వాత నాగేశ్వ‌ర్‌రెడ్డిగారి సినిమాల‌ను ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాను.  హీరోయిన్ నేహాశెట్టి సహా టీమ్‌కు ఆల్‌ది బెస్ట్‌’’ అన్నారు. 


డైరెక్ట‌ర్ బుచ్చిబాబు మాట్లాడుతూ ‘‘ కోనవెంకట్గారితో మంచి అనుబంధం ఉంది. ‘గల్లీ రౌడీ’ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 


సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ ‘‘నాగేశ్వర్ రెడ్డిగారు సాగ‌ర్‌గారి ద‌గ్గ‌ర మా కంటే ముందుగా కోడైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. అప్ప‌టి నుంచి ఆయ‌న‌తో మంచి అనుబంధం ఉంది. అలాగే వ్యాపార రంగంలో ఎన్నో విజ‌యాల‌ను సాధించిన ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌గారు సినిమా రంగంపై ప్యాష‌న్‌తో నిర్మాత‌గా మారారు. సందీప్‌..ఛోటాకు మేన‌ల్లుడు అంటే నాకు మేన‌ల్లుడే. ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తుంటే సందీప్ యాక్టింగ్ బాగా న‌చ్చింది. త‌న‌కు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. కోన వెంక‌ట్ గురించి చెప్పాలంటే, త‌ను చాలా బిజీ. ఎప్పుడూ అప్ డేట్‌లో ఉంటాడు. ఈ సినిమా పెద్ద హిట్టై గీతాంజ‌లి, నిన్నుకోరి చిత్రాల‌కు ఎంత మంచి పేరు వ‌చ్చిందో అంతే మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 


మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్ మాట్లాడుతూ ‘‘ఇండ‌స్ట్రీలో నాకు దొరికిన అన్న‌య్య కోన‌వెంక‌ట్‌గారు. అలాగే ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌గారితో మంచి అనుబంధం ఉంది. నాగేశ్వ‌ర్ రెడ్డిగారితో నేను ప‌ని చేసిన నాలుగో సినిమా ఇది. సందీప్‌కిష‌న్‌గారితోనూ నాలుగో సినిమా ఇది. సినిమాను థియేట‌ర్స్‌లోనే విడుద‌ల చేయాల‌ని వెయిట్ చేసి విడుద‌ల చేస్తున్నారు. కాబ‌ట్టి ఈ సినిమాను అంద‌రూ థియేట‌ర్స్‌లోనే చూసి ఎంజాయ్ చేయాలి’’ అన్నారు. 


డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ ‘‘నేను ద‌ర్శ‌కుడిగా మార‌డానికి ప్ర‌ధాన కార‌ణం కోన వెంక‌ట్‌గారు. ఆయ‌న లేక‌పోతే ఈ స్టేజ్‌కు రావ‌డానికి ఇంకెనేళ్లు ప‌ట్టేదో తెలియ‌డం లేదు. నాలాంటి వారినెంద‌రినో డైరెక్ట‌ర్స్‌ను చేశారు, రైట‌ర్స్‌ను చేశారు, స్క్రీన్‌ప్లే రైట‌ర్స్‌ను చేశారు. కోన‌గారితో ప‌రిచ‌యం అయిన్ప‌ప‌టి నుంచి స‌త్య‌నారాయ‌ణ‌గారితో ట్రావెల్ అవుతున్నాను. అప్పుడు ఎంత ఆప్యాయంగా ఉన్నారో, మినిష్ట‌ర్ అయిన త‌ర్వాత కూడా అంతే అప్యాయంగా ఉంటున్నారు. ట్రైల‌ర్ చూస్తే సందీప్‌లో కాన్ఫిడెన్స్ తెలుస్తుంది.  సాయికార్తీక్ సాలిడ్ మ్యూజిక్‌ను అందించాడు.అసిస్టెంట్స్‌, రైట‌ర్స్ నుంచి మంచి వ‌ర్క్ తెచ్చుకోగ‌ల డైరెక్ట‌ర్ నాగేశ్వ‌ర్ రెడ్డిగారు. ఆయ‌న‌కు ఈ సినిమా పెద్ద విజ‌యాన్ని అందించాలి. గ‌ల్లీ రౌడీ సినిమా థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అతిథులు చిత్ర యూనిట్ స‌భ్యులు సినిమా చాలా పెద్ద హిట్ కావాల‌ని అభినందించారు.


Dasari kiran Appointmented as TTD Special Invitee Member

 తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా దాస‌రి కిర‌ణ్ కుమార్‌



ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, నిర్మాత‌, రామ‌దూత క్రియేష‌న్స్ అధినేత‌ దాస‌రి కిర‌ణ్ కుమార్‌ తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా నియ‌మితుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ని టీటీడి ప్ర‌త్యేక ఆహ్వానితులుగా నియ‌మించిన ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారికి మ‌రియు మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాలశౌరిగారికి, టీటీడి బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.


Audio of 'Life Of 3' unveiled on Shashi Preetam's birthday

 Audio of 'Life Of 3' unveiled on Shashi Preetam's birthday

The film marks Preetam's directorial debut 



Prominent music director, Ad filmmaker Shashi Preetam is debuting as a director with the movie 'Life Of 3'. His daughter Aishwarya Krishna Priya has produced it. Co-produced by Dushyanth Reddy, the film has Snehal Kamath, Santosh Anantharaman, and Chinni Krishna in key roles. Vaishali, Soujanya Varma, Lohith Kumar, CVL Narasimha Rao, Vaibhav Surya have played other roles. Shashi Preetam has not only penned its story and screenplay but has also taken care of cinematography and music. On Wednesday (September 15), marking Preetam's birthday, the film's First Look and audio were unveiled. Preetam himself has written its songs.


Speaking on the occasion Shashi Preetam said, "We began the film in January. Last year, when I suffered a heart attack, I almost tasted death. I have learned a great deal from the experience, which taught me to never give up till the last moment. We ought to struggle perennially. As long as the fighting spirit is intact, life is going to be a sport. 'Life Of 3' owes its inspiration to this philosophy. A lot of newcomers have acted in my movie. I am also introducing new singers. Introducing new talents makes me very happy. I thank my daughter Aishwarya and her co-traveller Dushyanth Reddy for being nice producers. My close friends Lohith, Chinni Krishna, and Vaibhav knew what kind of a story I was writing and expressed their willingness to become a part of the movie."


Lohith said, "I have known Shashi Preetam since the days he used to charge Rs 50 for a jingle. He has done more than 55 movies and is a multi-talented guy. He is capable of very good music, and is also a talented songwriter. He is also skilled in Editing. He is going to prove himself beyond doubt with 'Life Of 3'."


Chinni Krishna said, "I entered the industry with 'Samudram' 23 years ago. Shashi Preetam was its music director. I am happy to have worked under him after all these years. I am one of the characters mentioned in the title. I thank him for this opportunity. The character I have played in it is close to my real life."


Vaibhav Surya said, "I like to act in front of the camera more than speaking off the camera. I have collaborated on Ads with Shashi garu previously. 'Life Of 3' is a project of a lifetime for him. The artists have done a nice job. This is going to be a very special project in my career."


Aishwarya Krishna Priya said, "It's my father's birthday today. I have worked with my father since my childhood. He has done a lot for me. It's for his sake that I became a producer. He is a single father for whom I have got immense respect. This is my first step as a technician and a producer."


Dushyanth Reddy said, "The singers have done a great job. Today belongs to them. As time passes, the music trends undergo many changes. We have to attune our work to the tastes of the listeners. Shashi Preetam's songs, composed many years ago, are enjoyable to this day."


The event saw the participation of Dr. Perumallu, Snehal Kamath, Santosh Anantharaman, Vaishali, Soujanya Varma, CVL, Joseph Sundar, Shastri ARK, Rajesh, Veeren Thambidurai, Anirudh Mantripragada, Vishwanathan, Ajith Shukla, Varun Sadhu, Shaheem, NC Karunya, Samanvitha Sharma, Pratyusha Sharma, Pratyusha Palluri, Adithya, Vidya Narayan Raghavan, Mrudula Sharma, Vandana Susheel, Susheel Kumar and others.


Cast:


Snehal Kamath, Santosh Anantharaman, Chinni Krishna, Vaishali, Soujanya Varma, Lohith Kumar, CVL Narasimha Rao, Vaibhav Surya, and others.


Crew:


PRO: Surendra Kumar Naidu-Phani Kandukuri (Beyond Media)

Associate Producers: Ashok Baddi, Dr. Perumallu Malineni

Executive Producer: Vishwanathan V

Editor: Anirudh Mantripragada

Co-Producer: Dushyanth Reddy

Producer: Aishwarya Krishna Priya

Story, screenplay, songs, cinematography, music, direction: Shashi Preetam

Rakshit Atluri-starrer, Ahiteja Bellamkonda-produced 'Sasivadane' Concept Teaser unveiled

 Rakshit Atluri-starrer, Ahiteja Bellamkonda-produced 'Sasivadane' Concept Teaser unveiled



Young actor Rakshit Atluri garnered the attention of the film industry and the audience alike with his performance in 'Palasa 1978'. He is now acting in a heart-touching movie, once again. SVS Constructions Pvt. Ltd. has collaborated with AG Film Company to produce a film titled 'Sasivadane', which is produced by Ahiteja Bellamkonda. Komalee Prasad is its heroine. Directed by Sai Mohan Ubbana, the film's Concept Teaser was today unveiled.


The teaser begins with a friend asking the hero as to how he is going to convince the parents of a girl he is in love with. At this, Rakshit's character says that love is not constrained by limited identities such as caste and economic status. "If you have decided to love someone, you must be ready to even wage a war," the lead man says.


The conversation in the teaser, the visuals, and the BR Ambedkar quote against the foundations of caste that is seen on a wall in the village - these elements make us believe that the film is going to be exciting.


Producer Ahiteja Bellamkonda said, "'Sasivadane' is a beautiful, meaningful love story. The Concept Teaser is receiving a wonderful response. The shooting will begin sometime in October. More details will be revealed soon."


Rakshit Atluri and Komalee Prasad are the lead pair.


PRO: Surendra Kumar Naidu-Phani Kandukuri (Beyond Media); Colourist: A Arun Kumar (Deccan Dreams); CEO: Asish Peri; Executive Producer Sripal Cholleti; Cinematographer: Saikumar Dara; Music Director: Sharavana Vasudevan; Costumes-Presentation: Gouri Naidu; Producers: Ahiteja Bellamkonda Gouri Naidu  Writer-Director: Saimohan Ubbana. 

Tanish Maro Prasthanam Movie Trailer Launched

 తనీష్ "మరో ప్రస్థానం" సినిమా ట్రైలర్ విడుదల



తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'మరో ప్రస్థానం'. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ముస్కాన్ సేథీ నాయిక. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మహా ప్రస్థానం' మూవీ ఈ నెల 24న విడుదలకు సిద్దమవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు.


ఈ సందర్భంగా  చిత్ర నిర్మాత ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ ...ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చేలా మరో ప్రస్థానం సినిమా ఉంటుంది. నటీనటుల పర్మార్మెన్స్, టెక్నికల్ అంశాల్లో కొత్తదనం చూస్తారు. అతి తక్కువ టైమ్ లో షూటింగ్ కంప్లీట్ చేశాం. లాక్ డౌన్ వల్ల రిలీజ్ ఆలస్యం అయ్యింది. ఈ నెల 24న థియేటర్ ల ద్వారా మరో ప్రస్థానం చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కరు ఈ సినిమాకు మనసుపెట్టి కష్టపడి పని చేశారు. ఇలాంటి సినిమాలు రియల్ గా చాలా అరుదుగా వస్తుంటాయి. మరో ప్రస్థానం  సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.



చిత్ర దర్శకుడు జాని మాట్లాడుతూ.. నా గత చిత్రం అంతకుమించి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత కొత్త తరహా కథతో సినిమా చేయాలని మరో ప్రస్థానం కథను డిజైన్ చేసుకున్నాను. నా కథ నచ్చి నిర్మాతలు వెంటనే సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. సింగిల్ షాట్లో  కమర్షియల్ సినిమా తీసి అందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉండేలా చేయలనుకుని ఈ కథను రాసుకొన్నాను. ఇది ఒక డెత్ స్ట్రింగ్ ఆపరేషన్ ఆధారంగా సాగే సినిమా. స్ట్రింగ్ ఆపరేషన్ అంటే అక్కడ జరుగుతున్న దాన్ని ప్రపంచానికి చూపించడమే మెయిన్ టార్గెట్. ఈ సినిమా రెగ్యులర్ సినిమాల్లా షూటింగ్  జరగలేదు. ఫస్ట్ రిహర్సల్  చేసుకుని తర్వాతనే షూట్ చేయడం జరిగింది. తెలుగు రాకున్నా ముస్కాన్ సేథీ చాలా కష్టపడి చాలా డెడికేషన్ తో వర్క్ చేసింది. అందరూ ఈ సినిమాకి మనసు ప్రాణం పెట్టి కష్టపడి పని చేశారు అందుకే అవుట్ ఫుట్ బాగా వచ్చింది. కబీర్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడు. హీరో తనీష్ గారికి మోకాలు ఆపరేషన్ అయినా ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. మరో ప్రస్థానం సినిమాలో  హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉంటాయి. మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. అన్నారు.



హీరో తనీష్ మాట్లాడుతూ ...చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత ఇలాంటి ఫంక్షన్ చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది . మేము చాలా కష్టపడి మరో ప్రస్థానం సినిమా చేయడం జరిగింది ఈ సినిమా చూస్తే మా కష్టం మీకే తెలుస్తుంది..ప్రతి యాక్టరు ప్రతి సినిమాకి ఒక మెట్టు ఎదగాలనే కోరుకుంటూ సినిమాలు చేస్తారు. నేనూ మరో ప్రస్థానం చిత్రాన్ని అలాగే చేశాను. నటుడిగా నన్ను మరో మెట్టు పైకి ఎక్కించే సినిమా అవుతుంది.  ఈ సినిమాలో ప్రస్తుతం సొసైటీ లో జరుగుతున్న వాస్తవ ఘటనలు, బర్నింగ్ ఇష్యూస్ చూపిస్తున్నాం. చిన్నప్పటి నుంచీ అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ అమ్మాయిని ఎవరో తెలియని వక్తి వచ్చి ఆ అమ్మాయి లైఫ్ ను డిసైడ్ చేస్తున్నాడు. ఇలాంటి  ఎలిమెంట్ ఉన్న కథను మరో ప్రస్థానం సినిమాలో చూస్తారు. సోషల్ గా ప్రతి ఒక్క మనిషి ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు మనకు ఏర్పడుతోంది. వన్ షాట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. మరో ప్రస్థానం సినిమా టెక్నికల్ గా కథ పరంగా చాలా స్ట్రాంగ్ .చాలా మంది వన్ షార్ట్ ఫిలిం అంటే ఏంటి ఈ సినిమాకు అంత స్పెషల్ ఏంటి అంటారు. మరో ప్రస్థానం సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా డెడికేషన్ గా పనిచేశారు. ఈ సినిమాలో ఉన్నటువంటి సందర్భాలు బయట ఉండకూడదు అని కోరుకుంటున్నాను. మనం సినిమాలు సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకే మరో ప్రస్థానం సినిమాను ఈ నెల 24న థియేటర్లలోనే విడుదల చేస్తున్నాము. అన్నారు.



కబీర్ దుహాన్ సింగ్ మాట్లాడుతూ ...సింగల్ షాట్  మూవీ  మరో ప్రస్థానంలో  నటించడం ఆనందంగా ఉంది. నేను సౌత్ లో దాదాపు 50 చిత్రాల్లో నటించాను. కానీ ఏ సినిమాలో డాన్సులు చేసే ఆవకాశం రాలేదు. మరో ప్రస్థానం చిత్రంలో నాతో దర్శకుడు జాని డ్యాన్స్ లు చేయించారు. నేను ఇప్పటిదాకా చేయని కొత్త తరహా విలనీని మరో ప్రస్థానం చిత్రంలో చేశాను. అన్నారు.



హీరోయిన్ ముస్కాన్ సేథీ మాట్లాడుతూ ..మరో ప్రస్థానం చిత్రంలో ఫస్ట్ టైం  ఛాలెంజింగ్ పాత్రలో నటించాను. వన్ షార్ట్ ఫిలిం లో నటించే ఈ సినిమా నాకు వెరీ స్పెషల్ మూవీ. ఇలాంటి మంచి సినిమాల్లో నటించే అవకాశం వచ్చినందుకు దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. మరో ప్రస్థానం మూవీ నాకు వెరీ వెరీ స్పెషల్ మూవీ. కొన్ని సీన్స్ లో లెంగ్తీ డైలాగులు ఉండేవి. కొన్ని రోజులు డే అండ్ నైట్ షూట్ కూడా చేయడం జరిగింది. ఇది ఒక ఎమోషనల్ ఫిల్మ్. ఇందులో నేను యాక్షన్ సీన్స్ లో కూడా నటించడం జరిగింది. ఫస్ట్ టైమ్ ఇటువంటి క్యారెక్టర్ చేయడం వలన నాకు చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. అన్నారు.



రిషిక ఖన్నా, అర్చనా సింగ్, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు - వసంత కిరణ్, యానాల శివ, పాటలు - ప్రణవం.., సంగీతం - సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ - ఎంఎన్ బాల్ రెడ్డి, ఎడిటర్ - క్రాంతి (ఆర్కే), ఎస్ఎఫ్ఎక్స్ - జి. పురుషోత్తమ్ రాజు, కొరియోగ్రఫీ - కపిల్, ఫైట్స్ - శివ, సమర్పణ - ఉదయ్ కిరణ్, నిర్మాణం - మిర్త్ మీడియా, రచన దర్శకత్వం - జాని.

Guduputani Pre Release Event Held Grandly

 సప్తగిరి "గూడుపుఠాణి" ట్రైలర్ ఆసక్తికంగా ఉంది : మారుతి !!!

"గూడుపుఠాణి" ప్రి రిలీజ్ ఈవెంట్



ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సప్తగిరి, నేహా సోలంకి జంటగా  కె.యమ్. కుమార్ దర్శకత్వంలో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మిస్తున్న చిత్రం "గూడుపుఠాణి " అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రే రేలీజ్ ఈవెంట్ కార్యక్రమం సినీ అతిరదుల సమక్షంలో ఘనంగా జరూపుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా వచ్చిన సినీమాటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , దర్శకుడు మారుతి,స్పీకర్ రాంభూపాల్ , ఆదోని ఎం.ఎల్.ఏ క్రాంతి కుమార్, అలీ, ఇన్ఫ్రా డెవలపర్ రంగారెడ్డి,  డైరెక్టర్ మున్నా, ధనరాజ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన 


 *మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ* .. ఈ మధ్య  నేను సినిమా ఫంక్షన్ లకు అటెండ్ కాలేదు కానీ తమ్ముడు సప్తగిరి ఫిలిచిన వెంటనే నేను ఈ ఫంక్షన్ కు రావడం జరిగింది. ఎందుకంటే తెలుగు చిత్ర రంగంలో చాలా మంది సినీ వారసులుగా ఇండస్ట్రీలో కి ఎంటర్ అయ్యారు.. కానీ ఒక మాములు వ్యక్తి ఏ బ్యా గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో హీరో స్థాయికి చేరుకోవడం చాలా గర్వకారణం.చలన చిత్ర పరిశ్రమకు యంగ్ జనరేషన్ రావాల్సిన అవసరం ఎంతో ఉంది. హీరోగా నాలుగవ చిత్రంలో నటించిన సప్తగిరికి దేవుడు ఆశీర్వాదం తో పాటు ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలి. నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్  గార్లు సినిమాను చాలా చక్కగా నిర్మించారు,దర్శకుడు కుమార్ గారు మంచి కథను తెరకెక్కించారు.ఇంతకాలం సింగర్ గా  ఉన్న రఘుకుంచె గారు ఈ  చిత్రంలో విలన్ గా నటించడం విశేషం.  ఎంతో కష్టపడి చేసిన వీరందరికీ ఈ సినిమా పెద్ద విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను అన్నారు.


 *ప్రముఖ దర్శకుడు మారుతి మాట్లాడుతూ...* సప్తగిరి చేస్తున్న గూడుపుటాని ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది, సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. కొత్త నిర్మాతలు శ్రీనివాస్ రెడ్డి, రమేష్ కటారి సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. సప్తగిరి ప్రతి సినిమాను ఇష్టపడి చేస్తాడు తాను భవిషత్తులో చేసే అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నాను, డైరెక్టర్ కుమార్ "గూడుపుఠాణి" సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతాప్ విద్య సంగీతం బాగుంది. చిత్ర యూనిట్ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.


 *నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ మాట్లాడుతూ* .... మా ఎస్ఆర్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ లో ఎన్నో సేవ కార్యక్రమాలు చేసే మేము సినిమా రంగం వైపు రావడం జరిగింది. దర్శకుడు కుమార్  చెప్పిన  కథ నచ్చినపుడే మా బ్యానర్లో ఈ సినిమాకు సప్తగిరి తో  తీయాలని అనుకున్నాము. ఇందులో సప్తగిరి అద్భుతంగా నటించాడు. ఇంతకుముందు వచ్చిన సాగర సంగమం వసంతకోకిల,ఇంద్రుడు చంద్రుడు, చిరంజీవి స్వయంకృషి, అలీగారి మయాలోడు చిత్రాలలో వారంతా నటించి ఎలా మెప్పించారో వారి లాగే  అద్భుతమైన నటనతో ఈ సినిమాలో సప్తగిరి తన నటనతో విశ్వరూపం చూపించాడు. ఇంతమంచి సినిమాకు సంగీత దర్శకుడు తన పాటలతో ప్రాణం పోశాడు. పెద్ద పెద్ద సంగీత దర్శకులకు తీసిపోకుండా ఇందులో చాలా మంచి సంగీతం అందించాడు. సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశం చాలా బాగుంటుంది. ఇందులో నటించిన వారందరూ కూడా ఎవరికి వారే వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించారు. నటీనటులను ఇంత బాగా చేస్తారా అనే విధంగా ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది.చిత్ర దర్శకుడు కొత్తవాడైనా కూడా తను ఎంచుకున్న పాయింట్ బాగుంది, హంపి, మైసూర్, మేల్కొటి, కంచి, చిక్మంగళూరు పరిసర అందమైన లొకేషన్స్ లో సినిమా తీశాము. దర్శకుడు తన ప్రతిభతో ఈ సినిమాను మరో  లెవెల్ కు  తీసుకెళ్ళాడు.  ఇందులో ప్రేక్షకులకు కావలసిన సాంగ్స్, స్టోరీ, ఫైట్స్ అన్ని సమపాళ్లలో ఉన్నాయి సప్తగిరి గారి కష్టం నేను చూశాను ఆయన కష్టానికి ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్టయ్యి ఆయన కెరీర్ లో ఈ సినిమా  ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. మా ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్ లో మేము తీసిన ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి,ఆశీర్వదించి సినిమాను సూపర్ డూపర్ హిట్ అయ్యేలా చేయాలని కోరుకుంటున్నాం అన్నారు.



 *హీరో సప్తగిరి మాట్లాడుతూ...* సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన గూడుపుఠాణి  టైటిల్ తో నేను సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు కుమార్ చెప్పిన లైన్ నచ్చి చాలా థ్రిల్ ఫీలయ్యి ఈ సినిమాచేస్తున్నాను.  నేను చిన్న హీరోను అయినా కూడా ఈ సినిమాకు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు నిర్మాతలు వారికి  నా ధన్యవాదాలు... సప్తగిరి ఎక్స్ ప్రెస్స్ లో సెంటిమెంట్ , ఎమోషన్ చేసిన నేను ఇప్పటివరకు థ్రిల్లర్ సినిమా చేయలేదు. దర్శకుడు షాట్ బై షాట్ చెప్పి నాతో చాలా ఈజీ గా యాక్ట్ చేయించాడు. నాకు చెప్పిన కథలో దర్శకుడు కొన్ని మార్పులు చేసి అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. సినిమా ట్రైలర్ చూసిన వారందరూ కూడా  క్లాసీగా చాలా అందంగా ఉన్నావని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.ఇదంతా డిఓపి పవన్ చెన్న కె దక్కుతుంది. నన్ను సినిమాలో చాల చక్కగా చూపించారు.సంగీత దర్శకుడు  ప్రతాప్ విద్య మంచి పాటలు అందించారు. ఫస్ట్ లాక్ డౌన్ లో ఓ సినిమా తీయడానికి భయపడే రోజుల్లో అవుట్ డోర్ లో సినిమా తీసి ఎంతో మందికి ఉపాధి కల్పించిన గొప్ప నిర్మాతలు  పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ గార్లు. చిత్ర నిర్మాతలు ఎంతో దైర్యంగా మా అందరికీ సపోర్ట్ గా వుంటూ మైసూరులోని శ్రీకృష్ణ దేవాలయం, చిక్ మంగళూరు,హంపి, మేల్కొటి, కంచి, ఆ ప్రాంతాలలో షూటింగ్ చేయడం జరిగింది. ఎస్ ఆర్ ఆర్ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే పదిమంది మాట్లాడుకునే విధంగా ఉండాలని ఖర్చుకు వెనకాడకుండా మంచి అవుట్ పుట్ తో సినిమాను నిర్మించారు నిర్మాతలు.ముఖ్యంగా మా అన్నయ్య దర్శకుడు మారుతి గారు పిలిచిన వెంటనే నీకు నేనున్నాను అంటూ వచ్చి నన్ను బ్లెస్స్ చేశాడు. ఆయన ద్వారానే నేను ఇండస్ట్రీని చూడడం జరిగింది. అన్నయ్య తీసిన  "ప్రేమ కథా చిత్రం" ద్వారా స్టార్ కమెడియన్ అయ్యాను. ఆ చిత్రంతో నా లైఫ్ మార్చిన గొప్ప మహానుభావుడు తను. నేను రోజు ఇంతటి వాడినవ్వడానికి కారణం తనే. అన్నయ్యా..మీరు ఈ రోజు  వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు నా ధన్యవాదాలు .ఈ మధ్య నాకు  మరొక కొత్త ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించారు. మీరు  చూపించిన మార్గంలో నడిచి మీకు మంచి పేరు తీసుకువస్తాను. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న గారంటే  నాకు చాలా సెంటిమెంటు సప్తగిరి ఎక్స్ ప్రెస్, నుండి ప్రతి సినిమా కు వచ్చి నన్ను బ్లెస్స్ చేస్తాడు. ఈ సినిమాలో రఘు కుంచే గారు విలన్ గా చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. తెలుగు సినిమాకు మంచి విలన్ దొరికాడు . స్పీకర్ రాంభూపాల్ రెడ్డి ఆదోని ఎమ్ ఎల్.ఏ, ఆలీ గారు ఇలా అందరూ వచ్చి నన్ను నా సినిమాను బ్లెస్స్ చేశారు. వారందరికీ నా కృతజ్ఞతలు.



 *దర్శకుడు కుమార్ కె.ఎం మాట్లాడుతూ...* నేను దస్తగిరి గారికి నేను చెప్పిన లైను నచ్చడంతో  ఈ కథకు ఓ రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేస్తాననడం చాలా గొప్ప విషయం.సినిమాకు తను చాలా బాగా సపోర్ట్ చేశాడు. నా కథకు మంచి ప్రొడ్యూసర్స్, హీరో దొరకడం నా అదృష్టం . సినిమా షూటింగ్ అయిపోయింది సెన్సార్ అయినప్పుడు సెన్సార్ వాళ్ళు పిలిచి సినిమా చాలా బాగుంది బాగా తీసావ్ అని చెప్పడం నా హ్యాపీ ఫీలయ్యాను. ఈవెంట్ కి  మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు,మారుతి గారు,అలీ గారు ఇలా అనేక మంది వచ్చి సినిమా బాగా తీశావ్ అంటుంటే నాకు ఇంతటి అదృష్టాన్ని కల్పించిన ప్రొడ్యూసర్స్ కు నా కృతజ్ఞతలు. సినిమా చాలా బాగా వచ్చింది విద్యా గారి  మ్యూజిక్, పవన్ గారి కెమెరా పనితనం ఇలా ఈ సినిమాకు పనిచేసిన వారందరూ ఎంతో సపోర్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ సీన్ మొదలుకొని లాస్ట్ సీన్ వరకు ఎక్కడా టెంపో తగ్గకుండా.. విపరీతమైన ఇంట్రెస్ట్ తో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ సినిమా అలరిస్తుంది అన్నారు. 



 *సంగీత దర్శకుడు  ప్రతాప్ విద్య మాట్లాడుతూ..* హరీష్ శంకర్ గారు రిలీజ్ చేసిన సాంగ్ కు ప్రేక్షకులందరూ మంచి బ్లెస్సింగ్స్ అందించారు.ఈ సినిమాలోని పాటలు చాలా బాగా వచ్చాయి. సప్తగిరి లాంటి మంచి ఆర్టిస్టు తో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.ఎస్ ఆర్ ఆర్ ప్రొడక్షన్స్ గూడుపుఠాని చిత్రంలో సంగీత దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.



ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ రాంభూపాల్ ,

ఆదోని ఎం.ఎల్.ఏ క్రాంతి కుమార్,అలీ,  ఇన్ఫ్రా డెవలపర్ రంగారెడ్డి,  డైరెక్టర్ మున్నా, ధనరాజ్ తదితరులందరూ చిత్ర యూనిట్ కు బ్లెస్సింగ్స్ ఇస్తూ చిత్రం గొప్ప విజయం సాధించాలని ప్రసంగించారు.. 


*సాంకేతిక నిపుణులు:*

బ్యానర్:ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్

నిర్మాతలు: పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్

డైరెక్షన్: కుమార్.కె.ఎం

కెమెరామెన్: పవన్ చెన్న

ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి

మ్యూజిక్: ప్రతాప్ విద్య

ఫైట్స్: సోలిన్ మల్లేష్

Ananya Nagalla Launched Aevum Jagat Song

 హీరోయిన్ అనన్య నాగళ్ళ విడుదల చేసిన "ఏవమ్ జగత్" చిత్రంలోని రాధాస్ లవ్ సాంగ్ !  



కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా తదితరులు ప్రధాన పాత్రల్లో దినేష్ నర్రా దర్శకత్వంలో  

మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మిస్తున్న చిత్రం ''ఏవం జగత్''. ఈ  సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంలోని రాధాస్ లవ్ సాంగ్ ని పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' ఫేమ్ అనన్య నాగళ్ళ విడుదల చేసారు. 


" ఉదయించే సూర్యిడిలా .. 

ప్రతిరోజు నిను చూసా .. 

జనియించిందే .. 

ఒక స్వప్నం.. !!" 

అనే పల్లవితో సాగిన మంచి ఫీల్ గుడ్ లవ్ సాంగ్ ఇది. శివ కుమార్ మ్యూజిక్ అందించగా సందీప్ కూరపాటి, సమీరా భరద్వాజ్ ఆలపించిన సాంగ్ ఇది. పాటను విడుదలచేసిన సందర్బంగా అనన్య నాగళ్ళ చిత్ర యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు . 


ప్రపంచీకరణ నేపధ్యంలో ఎన్నో కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ఎంతో మంది తమ సొంత ఊర్లు విడిచి వివిధ రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు.  దీని వల్ల నిజంగా మన దేశం అభివృద్ధి చెందిందా..? మన కలాం గారి కల, మిషన్ 2020 నెరవేరిందా..? ఇలాంటి ఆసక్తికర అంశాలతో తెరకెక్కుతున్న సినిమా "ఏవమ్ జగత్".  ఈ సందర్భంగా దర్శకుడు దినేష్ నర్రా మాట్లాడుతూ...వ్యవసాయం భవిష్యత్తు ఏంటి..? రాబోయే తరానికి కావలసిన ఆహార అవసరాలు తీర్చేటంత సాగు భూమి కానీ, పండించగల అనుభవం కానీ మన దేశ యువతకి ఉందా..? అనే అంశాలను ప్రధానంగా 'ఏవం జగత్' మూవీలో చూపిస్తున్నాం. వ్యవసాయం మరియు మానవ సంబంధాలతో ముడిపడి ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానం వెతికే ఒక 20 ఏళ్ల యువకుడి కథే 'ఏవం జగత్'. ఒక పల్లెటూరిలో సాగే ఈ కథలో, దేశ పరిస్థితులను, పురోగతికి అద్దం పట్టేలా కథా కథనాలు సాగుతాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించడంలో కమల్ ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. త్వరలోనే విడుదల చేస్తాం అన్నారు. 



నటీనటులు - కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా, స్కంద అముదాల, సంజయ్, భూపేష్ వడ్లమూడి, ఫయాజ్ అహ్మద్, దినకర్, స్వప్న గొల్లం, సరస్వతి కరవాడి, విజయలక్ష్మి తదితరులు


ఈ చిత్రానికి సంగీతం - శివ కుమార్, 

సినిమాటోగ్రఫీ - వెంకీ అల్ల, 

ఎడిటింగ్ - నిశాంత్ చిటుమోతు, 

ఆర్ట్ - సదా వంశి, 

ప్రొడక్షన్ మేనేజర్ - అభినవ్  అవునూరి, 

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ - మోహన్ కృష్ణ, 

క్వాలిటీ హెడ్ : సిద్దార్థ కండల 

సంపూర్ణమ్మ, స్కంద ఆముదాల, 

నిర్మాతలు - ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్, 

రచన దర్శకత్వం - దినేష్ నర్రా

పిఆర్ ఓ : సాయి సతీష్, పర్వతనేని

Seetimaarr Success Meet Held Grandly

 


‘సీటీమార్‌’ తో నాకు, నా నిర్మాత‌ల‌కు ఇంత పెద్ద సూప‌ర్ హిట్ ఇచ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్య‌వాదాలు:  స‌క్సెస్‌మీట్‌లో ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ 



ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన భారీ స్పోర్ట్స్ క‌మ‌ర్షియ‌ల్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’. పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రం వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్‌ 10న విడుద‌లై విజ‌య‌వంత‌మైంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం సినిమా స‌క్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్‌, చిత్ర ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది, హీరోయిన్ త‌మ‌న్నా, నిర్మాత‌లు శ్రీనివాసా చిట్టూరి, ప‌వ‌న్‌కుమార్‌, లిరిసిస్ట్ క‌ళ్యాణ చ‌క్ర‌వ‌ర్తి త‌దిత‌రులు పాల్గొన్నారు. 


ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా రిలీజ్ రోజున వినాయ‌కుడి ఆశీస్సుల‌తో సినిమా పెద్ద స‌క్సెస్ సాధిస్తుంద‌ని చెప్పాను. అన్న‌ట్లుగానే సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులను థియేట‌ర్‌కు తీసుకొస్తుంద‌నే గట్టి న‌మ్మ‌కంతో అన్నాను.  వినాయ‌క చ‌వితిరోజున సినిమాను విడుద‌ల చేశాం. వినాయ‌కుడు సీటీ కొట్టుకుంటూ వ‌చ్చి థియేట‌ర్స్‌కు ర‌మ్మ‌ని పిలిస్తే ప్రేక్ష‌కులు వ‌చ్చి మాకు చాలా పెద్ద విజ‌యాన్ని అందించారు. ఈ స‌క్సెస్‌లో భాగ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌. పాండ‌మిక్ టైమ్‌లో షూటింగ్ చేయడ‌మంటే, మ‌న‌సులో తెలియ‌ని ఓ భ‌యం ఉంటుంది. అయినా కూడా ఎంటైర్ టీమ్ ఎంతో క‌ష్ట‌ప‌డి చేశారు. ఈ సినిమాలో అమ్మాయిల క‌బ‌డ్డీ జ‌ట్టుగా న‌టించిన అమ్మాయిలు ఎన్నో బాధ‌ల‌ను అధిగ‌మించి ఈ స్టేజ్‌కు వ‌చ్చారు. ఈరోజు వాళ్లు స్క్రీన్‌పై క‌నిపించిన‌ప్పుడు క్లాప్స్ కొడుతున్నారంటే కార‌ణం, వాళ్ల త‌ల్లిదండ్రుల ప‌డ్డ క‌ష్ట‌మే. ఈరోజు వాళ్ల కుటుంబ స‌భ్యులు ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఫైట్స్‌కు ఈరోజు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది. అందుకు సంప‌త్ డిజైనింగ్ ఓ కార‌ణ‌మైతే, వెంక‌ట్‌, స్టంట్ శివ మాస్ట‌ర్స్ దాన్ని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారు. ప్రేక్ష‌కులు నానుంచి ఎలాంటి ఫైట్స్ ఎక్స్‌పెక్ట్ చేశారో అలాంటి ఫైట్స్ అందించారు. ఇక మ‌ణిశ‌ర్మ‌గారి గురించి చెప్పాలంటే.. ప్రీ రిలీజ్‌లో చెప్పాను. ఆయ‌న‌తో ఏడు సినిమాల‌కు వ‌ర్క్ చేస్తే, ఆరు సూప‌ర్‌హిట్స్ ఉన్నాయని. ఇది మా కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఎనిమిదో సినిమా. ఇది కూడా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అద్భుత‌మైన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మ‌ణిగారికి థాంక్స్‌. ఆయ‌న‌తో వ‌ర్క్ చేస్తుంటే, మ్యూజిక్ పరంగా ఆయ‌న చూసుకుంటారులే అనే ధైర్యం ఉంటుంది. గౌత‌మ్ నంద త‌ర్వాత సౌంద‌ర్ రాజ‌న్‌తో క‌లిసి చేసిన సినిమా. ఆ సినిమా చూసి నాకు నేనే ఇంత అందంగా ఉన్నానా? అనిపించింది. ఈ సినిమాలో ఇంకా అందంగా న‌న్ను చూపించాడు సౌంద‌ర్‌. ద‌ర్శ‌కుడు సంప‌త్‌కు ఏం కావాలో సౌంద‌ర్ రాజ‌న్‌కు తెలుసు. సంప‌త్‌కు ఏం కావాలో దాని కంటే ఎక్కువ ఔట్‌పుట్టే ఇచ్చాడు. త‌మ‌న్నాతో వ‌ర్క్ చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటే.. డేట్స్ అడ్జ‌స్ట్ కాక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో కుద‌ర‌లేదు. ఈ సినిమాలో కుదిరింది. త‌ను బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో అద్భుతంగా న‌టించింది. త‌ను మంచి డాన్స‌ర్‌. రావు ర‌మేశ్‌గారు, పోసానిగారు, త‌రుణ్ అరోరాగారు, భూమిక‌గారు, రెహ‌మాన్‌గారు..ఇత‌ర కో ఆర్టిస్టులు అంద‌రూ చ‌క్క‌గా న‌టించి స‌పోర్ట్ అందించారు. డైరెక్ట‌ర్ సంప‌త్‌తో గౌత‌మ్‌నంద చేశాం. ఆ సినిమాను చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని ఎక్స్‌పెక్ట్ చేశాం. కానీ ఎందుకో ఆ సినిమాతో అనుకున్న‌ది రీచ్ కాలేక‌పోయాం. ఈ సినిమా చేయాల‌నుకున్న‌ప్పుడు ముందు ఒక స్టోరి అనుకున్నాం. కానీ వ‌ర్క‌వుట్ కాద‌నుకున్నాం. రెండు నెల‌ల త‌ర్వాత సంప‌త్ ఈ స్టోరితో వ‌చ్చాడు. చాలా మంచి స్టోరి కుదిరింద‌ని అనుకున్నాను. చాలా డిస్క‌స్ చేసుకున్నాం. మ‌ధ్య‌లో పాండ‌మిక్ వ‌చ్చింది. ఈ గ్యాప్‌లో సంప‌త్ స్టోరిని ఇంకా బెట‌ర్‌మెంట్‌గా మార్చాడు. ఈ సినిమా అయితే చాలా క‌ష్ట‌మైపోతుంద‌నే భ‌యం ఇద్ద‌రికీ ఉండేది. కానీ ఏమైనా ఈ సినిమా మిస్ కాకూడ‌ద‌ని అనుకున్నాం. నేను జెన్యూన్‌గా హిట్ అనే మాట విని చాలా కాల‌మైంది. అంత‌కు ముందు హిట్స్ వ‌చ్చాయి. కానీ, ఈ మ‌ధ్య కాలంలో నా సినిమాల‌ను హిట్ అని విన్లేదు. కానీ సినిమా కొర‌త తీర్చేసింది. నేను హిట్స్‌, ప్లాప్స్ చూశాను. నా సినిమా హిట్టా, ప్లాపా అని నా ఫోన్ చెప్పేస్తుంది. ఇంకొక‌రు చెబితే నేను విన‌ను. హిట్ సౌండ్ ఎలా ఉంటుంది?  ప్లాప్ సౌండ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నిర్మాత‌లు శ్రీనివాస్ చిట్టూరి, ప‌వ‌న్‌గారు ఈ సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డారో నాకు తెలుసు. కానీ ఎవ‌రూ ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. వాళ్ల ప‌డ్డ క‌ష్టానికి ఈరోజు ఇంత పెద్ద హిట్ వ‌చ్చింది. నా నిర్మాత‌ల‌కు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆర్టిస్టుల‌కు, టెక్నీషియ‌న్స్‌.. ప్రేక్ష‌కుల‌కు పేరు పేరునా చేతులెత్తి దండం పెడుతున్నాం. ఈ నిర్మాత‌లు ఇంకా మంచి సినిమాలు తీసి పెద్ద ప్రొడ్యూస‌ర్స్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సంప‌త్ కూడా ఈ హిట్‌తో ఆప‌కుండా ఇంకా పెద్ద హిట్ మూవీస్ చేయాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. 


చిత్ర ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది మాట్లాడుతూ ‘‘‘సీటీమార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున‌, స‌క్సెస్‌మీట్‌లో మాట్లాడుతాన‌ని చెప్పాను. ఈరోజు నా సినిమాలో ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్ చెప్పుకోవాలి. వినాయ‌క చ‌వితిరోజున విడుద‌లైన మా ‘సీటీమార్’  చిత్రాన్ని ఖైర‌తాబాద్ వినాయ‌కుడి చేతిలో ఉండే ల‌డ్డంత పెద్ద హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. కోవిడ్ సెకండ్ వేవ్‌లో మ‌నకు ద‌గ్గ‌రైన వాళ్ల‌ని కోల్పోయాం. ఈ సినిమాకు వ‌ర్క్ చేసిన టీమ్‌లోనూ కొంత మందిని మేం కోల్పోయాం. ఐదు నెల‌ల త‌ర్వాత థియేట‌ర్స్‌లోకి వ‌చ్చిన ఈ సినిమాను, ప్రేక్ష‌కులు ప్రాణాల‌ను రిస్క్‌లో పెట్టి పెద్ద హిట్ చేశారు. సాధార‌ణంగా నేను డైరెక్ట్ చేసిన ఏ సినిమా అయినా స‌రిగా ఆడ‌క‌పోతే, ఆ త‌ప్పు నాదేన‌ని చెబుతాను. అదే సినిమా పెద్ద హిట్ అయితే నా టీమ్‌కు ఆ స‌క్సెస్ క్రెడిట్ ద‌క్కుతుంద‌ని కూడా చెబుతుంటాను. ‘సీటీమార్’  స‌క్సెస్‌లో ముందుగా నేను మాట్లాడాల్సింది మ‌ణిశ‌ర్మ‌గారి గురించి. ఈ సినిమాలో నాలుగు స‌క్సెస్‌ఫుల్ పాట‌ల‌ను ఆయ‌న అందించారు. సాధార‌ణంగా అంద‌ర‌రూ ఆయ‌న్ని మెలోడి బ్ర‌హ్మ అని అంటుంటారు. కానీ నేను మాత్రం ఆయ‌న్ని మాస్ కా బాస్‌.. బీజీఎం కా బాద్‌షా అని అంటుంటాను. దీన్ని ఆయ‌న మ‌రోసారి ప్రూవ్ చేశారు. త‌ర్వాత ఫైట్ మాస్ట‌ర్స్ గురించి చెప్పుకోవాలి. నేను డిజైన్ చేసుకున్న యాక్ష‌న్ సీక్వెన్స్‌లు అద్భుతంగా సిల్వ‌ర్ స్క్రీన్‌పై వ‌చ్చేలా చేసిన స్టంట్ శివ‌గారు, వెంక‌ట్‌గారు, జాషువాగారు, రియ‌ల్ స‌తీశ్‌గారికి థాంక్స్‌. సౌంద‌ర్‌రాజన్ నాతో ఐదేళ్లుగా ట్రావెల్ చేస్తున్నారు. నా క‌న్ను ఆయ‌నే. నేను ఏదైనా ఊహిస్తే దాన్ని అంత కంటే గొప్ప‌గా ప్రెజెంట్ చేశారు. ఆయ‌న నాకు మెయిన్ పిల్ల‌ర్‌. ఎడిట‌ర్ త‌మ్మిరాజుగారికి, ఆర్ట్ డైరెక్ట‌ర్ స‌త్య‌నారాయ‌ణ‌గారికి, డాన్స్ మాస్ట‌ర్ శోభిమాస్ట‌ర్‌గారికి స్పెష‌ల్ థాంక్స్‌. నా రైటింగ్ టీమ్‌కు, ధ‌నిఏలేగారికి, డైరెక్ష‌న్ టీమ్‌కు మ‌న‌స్ఫూర్తిగా థాంక్స్‌. ఫ‌స్టాఫ్‌లో రావు ర‌మేశ్‌గారు త‌న‌దైన డైలాగ్ డెలివ‌రీతో హీరోకు స‌పోర్ట్ చేస్తూ సినిమాను నిల‌బెడితే, సెకండాఫ్‌లో సినిమాకు హార్ట్‌గా నిలిచిన యాక్ట‌ర్ పోసాని కృష్ణ‌ముర‌ళిగారు స‌హా ఇత‌ర ఆర్టిస్టుల‌కు థాంక్స్‌. గౌత‌మ్ నంద స‌మ‌యంలో నేను, గోపీచంద్‌గారు ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా తీస్తున్నామ‌ని అనుకున్నాం. కానీ ఎందుకో ఆ సినిమా ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను రీచ్ కాలేక‌పోయింది. కానీ ‘సీటీమార్’ తో గోపీచంద్‌గారి బాకీ తీర్చేసుక‌న్నాను. సినిమా తొలి ఆట త‌ర్వాత సీడెడ్ డిస్ట్రిబ్యూట‌ర్ ఫోన్ చేసి సింహా అప్పుడు బాల‌కృష్ణ‌గారు, బోయ‌పాటిగారు ఎలాంటి హిట్ కొట్టారు. ఇప్పుడు గోపీచంద్‌గారు, మీరు అంత పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టార‌ని అన్నాడు. ఇక జ్వాలా రెడ్డి వంటి పాత్ర‌ను గుర్తుండిపోయేలా చేసిన త‌మ‌న్నాకు థాంక్స్‌. నిర్మాత‌లు శ్రీనివాస్ చిట్టూరి, ప‌వ‌న్‌గారి వ‌ల్లే ఈరోజు ఇలా స‌క్సెస్‌మీట్‌లో నిల‌బ‌డి మాట్లాడుతున్నాం. కథ చెప్పిన రోజే మేమున్నాం అని మా వెనుక నిల‌బ‌డ్డారు. ఆరోజు నుంచి ఈరోజు వ‌ర‌కు అలాగే మ‌మ్మ‌ల్ని ముందుకు న‌డిపిస్తూ వ‌స్తున్నారు. వారిద్ద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా థాంక్స్ చెబుతున్నాను. ఇది కేవ‌లం మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమా మాత్ర‌మే కాదు.. స్త్రీ సాధికార‌త గురించి, అమ్మాయిలు ప‌డే ఇబ్బందులు వాళ్ల‌కు మ‌నం ఇవ్వాల్సిన ఎంక‌రేజ్‌మెంట్ గురించి చెప్పే సినిమా. సాధార‌ణంగా ప్ర‌తి మ‌గాడి విజ‌యం వెనుక ఆడ‌ది ఉందంటుంటారు. కానీ వాళ్లు ఎప్పుడూ వెనుకే ఎందుకు ఉండాలి. వాళ్లు ముందుకు రాకూడ‌దా?  విజ‌యాలు సాధించ‌కూడ‌దా? అని చెప్పి వాళ్ల విజ‌యాల కోసం వెన‌కాల నిల‌బ‌డ్డ ఒక మ‌గ‌వాడి క‌థే ఈ సినిమా. ఆడ‌వాళ్ల విజ‌యం కోసం నిల‌బ‌డ్డ ఓ అన్న‌య్య క‌థే ఈ సీటీమార్‌. మీరు వంద‌రూపాయ‌లు పెట్టి ఈ సినిమా చూస్తే వెయ్యి రూపాయ‌ల ఆనందాన్నిచ్చే సినిమా ఇద‌ని మ‌న‌స్ఫూర్తిగా, న‌మ్మ‌కంతో చెబుతున్నాను. సాధారణంగా జై జవాన్, జై కిసాన్ అంటుంటారు. కానీ ఓ అమ్మ ప్రేమ తెలిసిన వ్య‌క్తిగా, బార్య ప్రేమ తెలిసిన వ్య‌క్తిగా, కూతురి ప్రేమ తెలిసిన వ్య‌క్తిగా చెబుతున్నాను. జై ఔర‌త్‌, జీయో ఔర‌త్ అని చెబుతున్నాను’’ అన్నారు. 


మిల్కీబ్యూటీ త‌మ‌న్నా మాట్లాడుతూ ‘‘2019లో ‘సీటీమార్‌’ సినిమాను స్టార్ట్ చేశారు. త‌ర్వాత ప్యాండమిక్ వ‌ల్ల చాలా స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. అన్నీ స‌మ‌స్య‌లు త‌ర్వాత ఈ సినిమా ఇంత పెద్ద స‌క్సెస్ కావ‌డం చాలా హ్యాపీగా ఉంది. ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా తీయాల‌నే కోరిక ఈ స‌క్సెస్‌కు కార‌ణం. సంప‌త్‌గారితో నేను చేసిన మూడో సినిమా. మంచి క‌థ‌ను ఎంట‌ర్‌టైనింగ్‌గా చెప్పే ద‌ర్శ‌కుడు సంప‌త్‌గారు. ఇది మ‌రోసారి ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. నాకు ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చినందుకు థాంక్స్‌. ఈ సినిమాలో 24 మంది హీరోయిన్స్ ఉన్నారు. ఈ మూవీలో క‌బ‌డ్డీ ఆడిన అమ్మాయిలు ఎంత హార్డ్ వ‌ర్క్ చేశారో చూశాను. ఈ సినిమా కోసం గోపీచంద్‌గారు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. జ్వాలారెడ్డి సాంగ్‌లో వెన్ను నొప్పి ఉన్నా కూడా గోపీచంద్‌గారు అద్భుతంగా డాన్స్ చేశారు. నిర్మాత‌లు శ్రీనివాస్‌గారు, ప‌వ‌న్‌గారికి థాంక్స్‌. ప్యాండ‌మిక్ టైమ్ త‌ర్వాత షూటింగ్స్ స్టార్ట్ కావ‌డంతో సినిమా ప్ర‌మోష‌న్స్‌కు హాజ‌రు కాలేక‌పోయాను. అందుకు నిర్మాత‌ల‌కు సారీ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా స‌క్సెస్ నాకెంతో ముఖ్యం. వినాయ‌చ‌వివితో పాటు సీటీమార్ హ‌వా కూడా న‌డుస్తుంది. అంద‌రూ ఎంజాయ్ చేయండి’’ అన్నారు.


Maestro Pre Release Event Held Grandly

 అరుదైన చిత్రాల్లో ‘మాస్ట్రో’ ఒకటిగా నిలుస్తుందని నమ్ముతున్నాను - హీరో నితిన్



నితిన్‌ హీరోగా రాబోతున్న కొత్త చిత్రం ‘మాస్ట్రో’. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'అందాధున్' రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ నెల 17న ఓటీటీలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. మంగళవారం సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో నితిన్, నభా నటేష్, తమన్నా, నరేష్, మంగ్లీ, కాసర్ల శ్యాం, నిర్మాతలు ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి, రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ తదితరులు పాల్గొన్నారు.



తమన్నా మాట్లాడుతూ.. ‘అందరికీ  నమస్కారం.. చాలా రోజుల తరువాత ఇలా మీ ముందుకు రావడం ఆనందంగా ఉంది.. స్వచ్చమైన ప్రేమ దొరికితే.. మనకు రెక్కలు వచ్చినట్టు అనిపిస్తాయి. నా అభిమానుల వల్లే ఈ స్థాయి వరకు వచ్చాను. అంధాదున్ హిందీ సినిమా. ఈ సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ తమ భాషలో  చేయాలని అనుకుంటారు.  ఈ ఆఫర్ నాకు వచ్చినప్పుడే చేయాలని ఫిక్స్ అయ్యాను. నితిన్ ఈ ప్రాజెక్ట్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది. నితిన్‌తో మంచి లవ్ స్టోరీ చేస్తాను అని అనుకున్నాను. కానీ ఇలాంటి సినిమాతో చేయడం ఆనందంగా ఉంది. స్టార్డం ప్రేక్షకులు ఇస్తారు కానీ నటిగా గుర్తింపు తెచ్చుకోవడం మా చేతుల్లోనే ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు గాంధి గారికి థ్యాంక్స్. సెప్టెంబర్ 17న ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్‌లో రాబోతోంది. తప్పక చూడండి’ అని అన్నారు.


మంగ్లీ మాట్లాడుతూ.. ‘మీ అందరికీ నేను సింగర్‌గా తెలుసు. కానీ ఈ చిత్రంతో నటిగా పరిచయం అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలు, దర్శకుడికి థ్యాంక్స్. నువ్ చేయగలవ్ అని చెప్పి దైర్యం చెప్పి మరి నేను నటించేలా చేశారు. సినిమా అద్బుతంగా ఉండబోతోంది. మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. నితిన్ చాలా కూల్. మంచి పర్సన్. మాతో హీరోలా ప్రవర్తించలేదు. ఫ్రెండ్‌లా, బ్రదర్‌లా ఉన్నారు. తమన్నాతో రెండు మూడు సీన్లే చేశాను. నభాతో సీన్లు నాకు లేవు. ఈ సినిమాలో నన్ను చూసి మీరంతా ఎంజాయ్ చేస్తారు. ఈ చిత్రం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.


కాసర్ల శ్యాం మాట్లాడుతూ.. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ నుంచి మేర్లపాక గాంధీతో  పరిచయం ఉంది. ఆయనది టిపికల్ శైలి. ఎంతో మంచి కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమాలో ఓ పాటను రాశాను. నితిన్ గారితో  బొమ్మోలే ఉందిరా పోరి,వాటే బ్యూటీ మంచి మాస్ హిట్ నంబర్స్ ఇచ్చాను. ఆయన కెరీర్‌లో భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉంది. నితిన్ ఎంతో మంచి మనిషి. ఆయన నటను వందకు రెండు వందల శాతం ఈ సినిమాతో చూస్తాం. ఈ సినిమా విజయవంతం అవుతుందని, అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


రాజ్ కుమార్ ఆకేళ్ల మాట్లాడుతూ.. ‘అంధాదున్ సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాను నితిన్ గారు రీమేక్ చేసేందుకు సిద్దపడ్డాడు అని తెలిసినప్పుడు విజయం సాధించిందని నేను అనుకున్నాను. ప్రతీ ఒక్క పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రానికి సరైన దర్శకుడు దొరికారు. సినిమాలోని  ఆత్మను చెడకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తెరకెక్కించారు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డిలతో  కలిసి  పని చేయడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.


నిఖితా రెడ్డి మాట్లాడుతూ.. ‘మాస్ట్రో సినిమా సెప్టెంబర్ 17న  విడుదల కాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. దర్శకుడు మేర్లపాక గాంధీ అద్భుతంగా తెరకెక్కించారు’ అని అన్నారు.


మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. ‘ఎప్పటి నుంచో నితిన్ భయ్యాతో చేయాలని అనుకున్నాను. కమర్షియల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చేయాలని అనుకున్నాను. కానీ అంధాదున్ లాంటి ఆర్టిస్టిక్ సినిమాచేశాను.  నితిన్ అన్న బాగా చేశారు. తమన్నాను మిల్కీ బ్యూటీ అంటే ఏదోలా ఉంది. ఇప్పటి నుంచి తమన్నాను గ్రేట్ ఆర్టిస్ట్ అని  అంటారు. నభా కూడా అద్భుతంగానటించారు. సినిమాలో పని చేసినప్పుడు కెమెరామెన్‌లు నాతో విసుగు చెందుతుంటారు. కానీ కెమెరామెన్ యువరాజ్ విసుక్కున్నారో లేదో తెలియదు. నరేష్ గారికి పెట్టిన విగ్‌తో మంచి మ్యానరిజాన్ని క్రియేట్ చేశారు. మంగ్లీ, జిషు సేన్ గుప్తా, రచ్చ రవి, శ్రీముఖి ఇలా ప్రతీ ఒక్కరూ బాగా నటించారు. మహతి స్వర స్వాగర్ సంగీతం, నేపథ్యం సంగీతాన్ని అద్భుతంగా ఇచ్చారు. ఆయన ఫోన్ ఎత్తకపోయినా కూడా మంచి ఆల్బమ్ ఇచ్చారు. సెప్టెంబర్ 17న హాట్ స్టార్‌లో  ఈ సినిమా రాబోతోంది. సినిమా చూసి కచ్చితంగా పోలికలు పెడతారు. తిట్టడానికి అయినా పొగడటానికి అయినా సరే సినిమాను చూడండి’ అని అన్నారు..


నభా నటేష్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 17న మనం కొత్త సినిమాను ఇస్తున్నాం. ఫస్ట్ వేవ్‌లో మనం అన్ని సినిమాలను చేసేశాం. సెకండ్ వేవ్‌లో కొత్త సినిమా వస్తోంది. అంధాదున్ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందోఅందరికీ తెలిసిందే. రీమేక్‌లో ఆఫర్ రావడం సంతోషంగా అనిపించింది.ఈ పాత్రకు సరిపోతాను అని నమ్మినందుకు గాంధీ గారికి థ్యాంక్స్. నితిన్ గారితో నాకు ఇది మొదటి సినిమా. ఆయన చిత్రాలు నేను ఇంతకు ముందు చూశాను. ఆయన ఎనర్జీ వేరే లెవెల్‌లో ఉంటుంది. మన కారెక్టర్ మాత్రమే కాదు.. చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా గమనించాలనే విషయం నితిన్ గారి దగ్గరి నుంచి నేర్చుకున్నాను. సినిమా పట్ల ఆయనుకున్న అంకిత భావం వేరే లెవెల్. నరేష్ గారితో నాకు మూడో సినిమా. కెమెరా మెన్ గారు నన్ను చాలా అందంగా చూపించారు. ప్రతీ ఒక్క విషయాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తారు. ఇంత మంచి సంగీతాన్ని ఇచ్చినందుకు మహతి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనాల మొహం మీద చిరునవ్వు తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే ఓటీటీలో వస్తున్నాం. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో కలిసి చూడండి. కచ్చితంగా మీరు ఎంజాయ్  చేస్తారు’ అని అన్నారు.


నితిన్ మాట్లాడుతూ.. ‘నా అభిమానులకు ముందుగా సారీ. కోవిడ్ నిబంధనల వల్ల ఫంక్షన్‌ను అంత గ్రాండ్‌గా నిర్వహించలేకపోయాం. హిందీలో అంధాదున్ కల్ట్ సినిమా. రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు భయం వేసింది. కానీ నటుడిగా నిరూపించుకునేందుకు రిస్క్ తీసుకున్నాం. దర్శకుడు ఈ సినిమాకు చాలా కష్టపడ్డాడు. ఉన్నది ఉన్నట్టు తీస్తే ఏం తీశాడురా? అని అంటారు. మార్పులు చేర్పులు చేస్తే.. సోల్ లేదు చెడగొట్టారు అంటారు. కానీ గాంధీ మాత్రం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీశారు. హిందీ సినిమాను ఎలా ఎంజాయ్ చేశారో మన సినిమా కూడా అంత బాగుందని అనుకుంటారు. మహతి సాగర్ పాటల కంటే ఎక్కువగా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అంత మంచి ఆర్ఆర్‌ను థియేటర్లో చూస్తే బాగుంటుందని నేను, గాంధీ చాలా ఫీలయ్యాం. కానీ పరిస్థితుల వల్లే ఓటీటీలోకి వస్తున్నాం. డీఓపీ యువరాజ్ పనితనం కూడా బిగ్ స్క్రీన్‌లో చూస్తే బాగుండేది. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ పని తనం కూడా బాగుంది. కానీ బిగ్ స్క్రీన్‌లో మిస్ అవుతున్నాం. మళ్లీ మన టీం అంతా కలిసి పని చేద్దాం. ఈ సినిమా కోసం చాలా కష్టమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఈ సినిమాకు క్యాస్టింగ్ చాలా ముఖ్యం. విలన్ కోసం జిషును తీసుకున్నాం. టబు  పాత్రకు చాలా మందిని అనుకున్నాం. కానీ తమన్నా ఒప్పుకుంటుందా? లేదా? అనుకున్నాం. మంగ్లీ యాక్టింగ్ చూసి సింగరా? యాక్టరా? అని షాక్ అయ్యాను. ఇకపై ఆమె సింగర్‌గా పక్కకెళ్లి.. యాక్టర్‌గా బిజీగా అవుతుంది. అలా ప్రతీ ఒక్క పాత్రకు సరైన నటీనటులు దొరకడం చాలా అరుదు. అలాంటి అరుదైన చిత్రాల్లో ఈ మాస్ట్రో కూడా ఒకటి అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ సినిమాను తీసినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. అంతేకాకుండా అందరికీ సమయానుగుణంగా డబ్బులు ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇండస్ట్రీలో  నాకు ఫాదర్ లాంటి వారు. ఇలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారు. నా తదుపరి చిత్రంలో కూడా మీరే (నరేష్) నా ఫాదర్. నేను ఫాదర్, మీరు గ్రాండ్ ఫాదర్ అయ్యే వరకు ఇలానే మన జర్నీ కొనసాగుతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 17న హాట్ స్టార్‌లో రాబోతోంది. సినిమాను  చూడండి మీ అందరూ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు..

Tremendous Response for Leharaayi Lyrical From MEB

 అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నుంచి ‘లెహరాయీ’ లిరికల్ సాంగ్‌కు అనూహ్య స్పందన..



అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం నుంచి రొమాంటిక్ లెహరాయి లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘లెహరాయి లెహరాయి గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి‘ అంటూ సాగే ఈ పాటను తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు సిద్ శ్రీరామ్. తాజాగా విడుదలైన ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. అఖిల్, పూజ హెగ్డే రొమాన్స్ కూడా అదిరిపోయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు.


ఈ పాట లిరిక్స్..


లెహరాయి.. లెహరాయీ.. ఏ లేలేలే.. లేలేలేలే..

లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..

లెహరాయీ లెహరాయీ.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి..

ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి..

కళ్లలోనే దాగి ఉన్న అమ్మాయి..

సొంతమల్లే చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ..


లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..

లెహరాయీ లెహరాయీ.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి..


రోజూ చక్కిలితో సిగ్గుల తగువాయే..

రోజూ పెదవులతో ముద్దుల గొడవాయే..

వంట గదిలో మంటలన్నీ ఒంటిలోకే ఒంపుతుంటే..

మరి నిన్నా మొన్నా ఒంటిగా ఉన్న ఈడే నేడే లెహరాయీ..


లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..

లెహరాయీ లెహరాయీ.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి..


వేలా పాలలనే మరిచే సరసాలే..

తేదీ వారాలే చెరిపే చెరసాలే..

చనువు కొంచెం పెంచుకుంటూ.. తనువు బరువే పంచుకుంటూ..

మనలోకం మైకం ఏకం అవుతూ.. ఏకాంతాలే లెహరాయీ..


లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..

లెహరాయీ లెహరాయీ.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి..

ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి..

కళ్లలోనే దాగి ఉన్న అమ్మాయి..

సొంతమల్లే చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ..



న‌టీ న‌టులు:

అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు..


సాంకేతిక నిపుణులు:


దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌  

బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్  

స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్  

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమడి

మ్యూజిక్ : గోపీ సుంద‌ర్

సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ

ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్

ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

LIGER (Saala Crossbreed) New Schedule Begins In Goa

 Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s Pan India Film LIGER (Saala Crossbreed) New Schedule Begins In Goa



Happening hero Vijay Deverakonda’s first Pan India film LIGER (Saala Crossbreed) being directed by dynamic director Puri Jagannadh is in the mid of its shooting. The film’s new schedule begins today in Goa, where high octane action sequences and also some important scenes will be canned.

"BLOOD. SWEAT. VIOLENCE. #LIGER Shoot Resumes," posted Vijay Deverakonda.


“BLOOD SWEAT VIOLENCE begins today .. #shootmode #beastmode #LIGER #salaacrossbreed @TheDeverakonda #purijagannadh @ananyapandayy @karanjohar @PuriConnects @DharmaMovies @apoorvamehta18 @IamVishuReddy @meramyakrishnan @RonitBoseRoy ,” tweeted producer Charmme Kaur who also shared a working still.


The poster sees Vijay Deverakonda as an MMA fighter getting ready to fight. Foreign fighters are also taking part in the shoot of the ongoing schedule.


Vijay Deverakonda appears in a completely new makeover and underwent training in mixed martial arts in the sports action thriller. Bollywood actress Ananya Pandey is playing the female lead.


In association with Puri connects, the film is being produced jointly by Bollywood's leading production house Dharma Productions.


Given it is a Pan India film, Puri connects and Dharma Productions are making the film on a grand scale without compromising on budget.


The film in the crazy combination has cinematography handled by Vishnu Sarma, while Kecha from Thailand is the stunt director.


Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta together are bankrolling the film.


Ramya Krishnan and Ronit Roy play prominent roles in Liger which is being made in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam languages.


Cast: Vijay Deverakonda, Ananya Pandey, Ramya Krishnan, Ronit Roy, Vishu Reddy, Aali, Makarand Desh Pandey and Getup Srinu.


Technical Crew:

Director: Puri Jagannadh

Producers: Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta

Banners: Puri connects and Dharma Productions

DOP: Vishnu Sarma

Art Director: Jonny Shaik Basha

Editor: Junaid Siddiqui

Stunt Director: Kecha


Naveen Polishetty's Next with Sithara Entertainments & Fortune Four Cinemas

Naveen Polishetty's Next with Sithara Entertainments & Fortune Four Cinemas



Young Sensation Naveen Polishetty who's on a sky high with the success of Jathi Rathnalu this year is now teaming up with Kalyan Shankar who is marking his debut in tollywood with this film.


Suryadevara Naga Vamsi, the young & the busiest Producer of Sithara Entertainments is producing the movie in association with Fortune Four Cinemas headed by Ms. Sai Soujanya.


On this occasion, the makers say, 'This movie will be your best dose of Fun & Entertainment.'


Other details of Cast & Crew will be revealed soon.

Maanas Nagulapalli Ksheera Saagara Madhanam in Second Place on Amazon

 బిగ్ బాస్ పార్టిసిపెంట్

'మానస్ నాగులపల్లి' నటించిన

"క్షీరసాగర మథనం" చిత్రానికి

అమెజాన్ ప్రైమ్ లో రెండో స్థానం!!



     "బిగ్ బాస్" ఫేమ్ మానస్ నాగులపల్లి హీరోగా నటించిన "క్షీర సాగర మథనం" చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్,... అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర ఇతర ముఖ్య తారాగణంగా... 

యువ ప్రతిభాశాలి అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన "క్షీరసాగర మథనం" చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మించింది. ఆగస్టు 6న థియేటర్స్ లో విడుదలై... కరోనా కారణంగా పరిమిత ఆదరణ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న "అమెజాన్ ప్రైమ్"లో విడుదలై... సంచలనం సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది.

      తమ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో లభిస్తున్న అపూర్వ స్పందన తమను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందని దర్శకుడు అనిల్ పంగులూరి అంటున్నారు. అమెజాన్ లో 499వ చిత్రంగా విడుదలైన "క్షీరసాగర మథనం" చిత్రం "టక్ జగదీష్" తర్వాత రెండో స్థానంలో నిలవడం తమకు చాలా గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు!!

Director Sunil Kumar Reddy Interview About Honey Trap

 ఎమోషనల్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "హనీ ట్రాప్" ను సెప్టెంబర్ 17న విడుదల చేస్తున్నాం - దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి



సొంత ఊరు, గంగపుత్రులు, గల్ఫ్, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ లాంటి ఎన్నో చిత్రాలకి దర్శకత్వం వహించి...  18 స్టేట్ అవార్డ్స్ అందుకుని విమర్శకుల ప్రశంసలందుకొన్న దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి. ఇప్పుడు 'హనీ ట్రాప్' అనే  చిత్రంతో  ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.


రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో...  భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వి.వి.వామనరావు నిర్మాతగా సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం... ఈ నెల 17న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలవుతోంది.


ఈ సందర్భంగా దర్శకుడు  సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... "గతంలో నా దర్సకత్వంలో తెరకెక్కిన ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ లాంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు తెరకెక్కించిన 'హనీ ట్రాప్'  కూడా అలాంటి కోవకు చెందిన ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఈ చిత్ర కథ మా నిర్మాత వి.వి.వామనరావు గారిదే. నేను మాటలు, దర్శకత్వం వహించాను. హనీ ట్రాప్ అనేది ఒక అంతర్జాతీయ అంశం. ఈ కాన్సెప్ట్ మీద 3, 4 చిత్రాలు చేసేంత మెటీరియల్ ఉంది. ప్రతిరోజూ మనం పత్రికల్లో ఈ హనీ ట్రాప్ కథలు చదువుతూనే ఉన్నాం. ఈ ట్రాప్ లో చాలా మంది  ఏదో రకంగా చిక్కుకుని ఉన్నారు. ఈ ట్రాప్ లో అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ మోసపోతున్నారు. సోషల్ మీడియా వల్ల ఇప్పుడు చాలా సులభంగా మోసం చేసేయవచ్చు. అలాంటి అంశాలను కూడా ఇంటెరెస్టింగ్ గా యూత్ ని ఆకర్శించే విధంగా సినిమా తీసాము.


ఈ చిత్రంలో అందరూ కొత్త వాళ్లే. రుషి, మిస్ వైజాగ్  శిల్ప మరియు తేజు అనే యంగ్ టాలెంట్ ని పరిచయం చేస్తున్నాము. మా నిర్మాత కూడా మంచి పాత్ర చేసారు. లజ్జ సినిమా లో  హీరో గా నటించిన  శివ కార్తీక్ ఒక యంగ్ పొలిటిషన్ పాత్ర లో నటించాడు.

నాకు కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన సినిమాలు ఉన్నాయి, ప్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. ఫలితం పక్కన పెడితే ఫిలిం మేకింగ్ ప్రాసెస్ అంటే నాకు చాలా ఇష్టం. మనం ఒక కథకి సినిమా రూపం లో ప్రాణం పోస్తాము. ఈ ప్రక్రియ నాకు ఇష్టం. అందుకే సినిమా అంటే ప్యాషన్ .


నేను చేసే ప్రతి సినిమాలో రొమాన్స్ అంతర్లీనంగా  ఉంటుంది. నాకు అవార్డ్స్ తెచ్చిపెట్టిన సొంత ఊరు, గంగ పుత్రుల్లో కూడా రొమాన్స్ ఉంది. మన తల్లిదండ్రుల ప్రేమకు చిహ్నమే మనం. మరి అలాంటి ప్రేమని ఎందుకు చూపించకూడదు. మన సమాజం లో ఉన్న ఎన్నో రుగ్మతలను ధైర్యంగా చర్చించుకోవటం లేదు. అలాంటి విషయాలు చర్చించటానికి నేను  ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ, హనీ ట్రాప్ లాంటి సినిమాలు చేశాను.


ఒక సినిమా దర్శకుడుని మీరు ఇలాంటి చిత్రాలు ఎందుకు చేస్తున్నారు అని అడిగితే... ఒక 9 వ తరగతి చదువుతున్న అమ్మాయిని ఎవరైనా ఏమైనా చేస్తే ఆ అమ్మాయి సొసైటీ ముందుకు వచ్చి నాకు ఇలా జరిగింది అని ఎలా చెప్తుంది? ఒక క్రిమినల్ ప్రేమ కథ సినిమాల విడుదల తర్వాత  చాలా మంది బాధితులు పోలీసులును ఆశ్రయించారని నాకు పోలీస్ ల ద్వారానే తెలిసింది.



హనీ ట్రాప్ అనేది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా. అద్భుతమైన హ్యూమన్ ఎమోషన్ తో చిత్రీకరించాము. ఈ నెల సెప్టెంబర్ 17న విడుదల అవుతుంది.  అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా.


ఈ చిత్రం తరువాత ఇంకా మూడు సినిమాలు నా దర్శకత్వంలో తెరకెక్కుతున్నాయి. ఇందులో మొదటిది "వెల్కమ్ టు తీహార్ కాలేజీ". ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి  చెప్పే సినిమా. విడుదల కి సిద్ధంగా ఉంది. దీని తర్వాత ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి. చదలవాడ శ్రీనివాస్ గారు ఒక సినిమా  నిర్మిస్తున్నారు. ఇది తండ్రి కొడుకుల కథ. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఇంకో సినిమాకి బాపిరాజు గారు నిర్మాత. త్వరలో ఈ రెండు సినిమాల గురించి అన్ని వివరాలు చెబుతా" అంటూ ముగించారు.

Vijay Anthony Launched Rai Lakshmi Cinderella Teaser

 విజ‌య్ ఆంటోని రిలీజ్ చేసిన  రాయ్‌ల‌క్ష్మి 'సిండ్రెల్లా` మూవీ టీజ‌ర్‌



ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న గ్లామ‌ర్ డాల్ 'రాయ్‌ల‌క్ష్మి ద్విపాత్రాభిన‌యం చేసిన చిత్రం 'సిండ్రెల్లా'. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో సుదీక్ష ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎంఎన్ఆర్ మూవీస్ ప‌తాకాల‌పై మంచాల ర‌వికిర‌ణ్, ఎం.ఎన్‌.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాయ్ ల‌క్ష్మి, రోబో శంక‌ర్‌, అభిన‌య‌, అర‌వింద్ ఆకాశ్‌, సాక్షి అగ‌ర్వాల్‌, వినోద్‌, అన్బు త‌దిత‌రులు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ఎస్‌.జె.సూర్య ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన విను వెంక‌టేశ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.


ఈ సినిమా టీజ‌ర్‌ను విజ‌య్ ఆంటోని రిలీజ్ చేశారు. హార‌ర్ ఫాంట‌సీ, మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా టీజ‌ర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. స‌ర్కార్ 3, కిల్లింగ్ వీర‌ప్ప‌న్ చిత్రాల‌కు కెమెరామెన్‌గా వ‌ర్క్ చేసిన ర‌మ్మీ ఈ సినిమా సినిమాటోగ్రఫీ అందించారు. కాంచ‌న 2 చిత్రానికి సంగీతాన్ని అందించిన అశ్వామిత్ర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే గేమ్ ఓవ‌ర్ చిత్రానికి సౌండ్ డిజైన్ చేసిన స‌చిన్ ఈ చిత్రానికి చేసిన సౌండ్ డిజైనింగ్ హైలైట్ కానుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాను  విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత‌ మంచాల ర‌వికిర‌ణ్‌, స‌హ నిర్మాత‌ ఎం.ఎన్‌.రాజు తెలిపారు.


న‌టీన‌టులు:

రాయ్ ల‌క్ష్మి, రోబో శంక‌ర్‌, అభిన‌య‌, అర‌వింద్ ఆకాశ్‌, సాక్షి అగ‌ర్వాల్‌, వినోద్‌, అన్బు త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌: సుదీక్ష ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎంఎన్ఆర్ మూవీస్

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: విను వెంక‌టేశ్‌

నిర్మాత‌: మంచాల ర‌వికిర‌ణ్‌, ఎం.ఎన్‌.రాజు

సినిమాటోగ్రాఫ‌ర్‌: ర‌మ్మీ,

ఎడిట‌ర్‌: లారెన్స్ కిషోర్‌

మ్యూజిక్‌: అశ్వామిత్ర‌

పీఆర్ఓ: తేజ‌స్వి స‌జ్జ‌

Regina Cassandra starrer “NeneNaa” Trailer Unveiled

 Regina Cassandra starrer “NeneNaa” Trailer Unveiled



Regina Cassandra, who is consistently proving her prowess performance in every film, will appear in dual roles as an archaeologist and as a queen in her upcoming flick NeneNaa that grabbed attention of one and all for its intriguing posters.


Expectations are quite high on the project, given Regina Cassandra is popular across Pan-Indian domain, director Caarthick Raju’s last movie Ninu Veedani Needanu Nene was a runaway hit and it’s second production venture for Raj Shekar Varma of Apple Tree Studios. The producer’s first project Zombie Reddy was a superhit.


To hike prospects on the movie, the makers have come up with trailer of the movie. The trailer is unveiled by Nidhhi Agerwal, Makkal Selvan Vijay Sethupathy and star director Lingusamy.


Going by the trailer, a horrific incident that had happened 100 years ago is repeating now. While Regina was a queen 100 years back, she is an archeologist now and has come to resolve a mysterious case.


Along with people who enter a seclude place in a forest, those who are assigned to resolve the mysterious case are also getting killed. The link between past and the present story is going to be crux of the movie. The mystery-driven plot with horror elements and lots of humour is going to offer a whole new experience to movie goers.


Caarthick Raju comes up with another interesting project and this time it will be much bigger in terms of casting and technical standards.


Simultaneously made in Telugu and Tamil, major portions of the bilingual have been shot in and around the locales of Courtallam. Sam CS is composing music and Gokul Benoy is handing cinematography. Sabu is the editor and Super Subbarayan is the stunt master.


Apart from Regina Cassandra, the others in the cast include Vennela Kishore, Akshara Gowda, Tagapothu Ramesh, Jaya Prakash, and few more prominent artists.


The film’s shoot has already been wrapped up and post-production works are also nearing completion.


Cast: Regina Cassandra, Vennela Kishore, Thagubothu Ramesh, Jaya Prakash, Akshara Gowda


Crew:

Director: Caarthick Raju

Producer: Raj Shekar Varma

Banner: Apple Tree Studios

Music: Sam CS

DOP: Gokul Benoy

Editor: Sabu

Stunts: Super Subbarayan

PRO: Vamsi-Shekar


King Nagarjuna Launched K Raghavendra Rao PelliSandaD Teaser

 కింగ్ నాగార్జున చేతుల మీదుగా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు ‘పెళ్లి సంద‌D’ టీజర్ విడుదల  



ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’తో మ‌రోసారి మ్యాజిక్‌ను రిపీట్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ సినిమాతో ఆయ‌న న‌టుడిగా కూడా ఎంట్రీ ఇస్తుండ‌టం విశేషం. ఈ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో  మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


 ద‌ర్శ‌కేంద్రుడు తెర‌కెక్కించిన నాటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ `పెళ్లిసంద‌డి`లో శ్రీ‌కాంత్ హీరో అయితే నేడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ పర్య‌వేక్ష‌ణ‌లో గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్న ‘పెళ్లిసంద‌D’లో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో అవ‌డం విశేషం. శ్రీలీల హీరోయిన్‌. మంగ‌ళ‌వారం  ‘పెళ్లి సంద‌D’ టీజ‌ర్‌ను కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు. ‘పెళ్లి సంద‌D’ మూవీ చాలా పెద్ద హిట్ కావాలంటూ చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. 


హీరో రోష‌న్ స్టైలిష్ లుక్‌తో క్యారెక్ట‌రైజేష‌న్ ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యాన్ని సింపుల్‌గా చెప్పారు. అలాగే లంగా ఓణిలో హీరోయిన్ శ్రీలీలను అందంగా ప్రెజెంట్ చేశారు. హీరో, హీరోయిన్ మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాల‌ను చూపించారు. మ‌రో వైపు ‘స‌హ‌స్త్ర‌కు పెళ్లి నాతోనా లేక నువ్వు తెచ్చి తొట్టి గ్యాంగ్ లీడ‌ర్‌తోనా’ అని హీరో రోషన్, హీరోయిన్ తండ్రి ప్రకాశ్‌రాజ్‌తో ఛాలెంజ్ చేసే సీన్‌తో సినిమాలో కేవ‌లం ప్రేమ స‌న్నివేశాలే కాకుండా నువ్వా నేనా అనేలా హీరోకి, హీరోయిన్ తండ్రికి మ‌ధ్య స‌న్నివేశాలుంటాయ‌ని అర్థ‌మవుతుంది. యాక్ష‌న్ స‌న్నివేశాలు, పెళ్లిలో హీరో, హీరోయిన్ స‌హా పెళ్లి బృంద‌మంతా క‌లిసి చేసే హ‌డావుడి, హీరో హీరోయిన్ మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాలు, క‌మ‌ర్షియ‌ల్ సాంగ్‌, ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల‌ను చూపించారు. పెళ్లి భోజ‌నం ఎంత చ‌క్క‌గా ఉంటుందో అంతే చ‌క్క‌గా మా ‘పెళ్లి సంద‌D’  సినిమా ఉంటుంద‌నేలా టీజ‌ర్ ఉంది. 


 ‘‘ఇప్ప‌టికే సినిమా ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేశాం.  ఈ సినిమా నుంచి విడుద‌లైన రాఘవేంద్ర‌రావు ప్రోమో,  హీరో, హీరోయిన్ ప్రోమోలు, సాంగ్స్ అన్నింటికీ ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.  నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల గురించి తెలియజేస్తాం’’ అని డైరెక్టర్ గౌరి రోణంకి తెలిపారు. 


నటీనటులు:


రోష‌న్, శ్రీ‌లీల, ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, స‌త్యంరాజేష్‌, రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, శక‌లక శంక‌ర్‌, అన్న‌పూర్ణ‌, జాన్సి, ప్ర‌గ‌తి, హేమ‌, కౌముది, భ‌ద్రం, కిరీటి త‌దిత‌రులు.. 


సాంకేతిక వ‌ర్గం: 


సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి

సాహిత్యం: శివ‌శ‌క్తి ద‌త్త‌, చంద్ర‌బోస్

సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్ నామ

ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు

ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె,

‌మాట‌లు: శ్రీ‌ధ‌ర్ సీపాన‌

ఫైట్స్‌: వెంక‌ట్

కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: వి. మోహ‌న్ రావు,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సాయిబాబా  కోవెల‌మూడి

స‌మ‌ర్ప‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌

నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని

ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె. రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ

ద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోణంకి.

Introducing Ganesh Bellamkonda with a Fun Entertainer “SWATHIMUTHYAM”

 Introducing Ganesh Bellamkonda with a Fun Entertainer “SWATHIMUTHYAM”



Ganesh Bellamkonda, Son of Ace producer Bellamkonda Suresh & Brother of Young Hero Bellamkonda Sai Sreenivas is making his debut to the silver screen with a Fun Entertainer titled as 'SwathiMuthyam' .


Today, On the occasion of Ganesh Bellamkonda's Birthday, the makers have unveiled the title and first look poster of the movie. In the first look poster, Ganesh is seen in a smart formal look with a bag on his shoulders and with an attractive, vibrant logo of 'SwathiMuthyam'.


Sithara Entertainments' who are on a roll with multiple movies in production are bankrolling this project which will be directed by debutant Lakshman K Krishna. Varsha Bollamma will be the female lead for the movie.


On this occasion, director Lakshman K Kumar said "This story is about a guy who has an innocent character like in 'Swathi Muthyam' . The film is about life, love & thoughts about marriage and how the opinions change & how life goes on between them. Family relations and emotions are the main assets to this film. This movie will entertain every movie goer for sure."


At present, the film is under production with a major portion of the shoot already finished. More details will be announced soon.


Other Cast included senior actor Naresh, Rao Ramesh, Subbaraju, Vennela Kishore, Harshavardhan, Pammi Sai, Goparaju Ramana, Siva Narayana, Pragathi, Surekha Vani, Sunaina, Divya Srepada.


Crew Details :


Music: Mahathi Swara Sagar

Cinematography: Suryaa

Editor: Navin Nooli

Art: Avinash Kolla

Pro: LakshmiVenuGopal

Presents: PDV Prasad

Producer: Suryadevara Naga Vamsi

Written and Directed : Lakshman K Krishna


Maro Prasthanam Censor Completed

 ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'మరో ప్రస్థానం' సెన్సార్ పూర్తి, యూఏ సర్టిఫికెట్ తో విడుదలకు రెడీ




యువ హీరో తనీష్‌, ముస్కాన్ సేథీ జంటగా నటించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మరో ప్రస్థానం. ఈ చిత్రానికి జాని దర్శకత్వం వహించారు. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో రూపొందిన మొట్ట మొదటి తెలుగు సినిమా 'మరో ప్రస్థానం' కావడం విశేషం. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. 'మరో ప్రస్థానం' చిత్రానికి సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ లభించింది. వన్ షాట్ ఫిల్మ్ గా సెన్సార్ సభ్యుల ప్రశంసలు 'మరో ప్రస్థానం' చిత్రానికి దక్కాయి. 'మరో ప్రస్థానం'  సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా.. 


*దర్శకుడు జాని మాట్లాడుతూ*..'మరో ప్రస్థానం' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ వాళ్లు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు వన్ షాట్ ఫిల్మ్ గా 'మరో ప్రస్థానం' చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారని అభినందించారు. సినిమా బాగుందంటూ వాళ్లు చెప్పడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. 'మరో ప్రస్థానం' సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు తర్వాత ఏం జరుగుతుందో అని ఆసక్తిగా చూసేలా ఉంటుంది. సినిమా చూసే వాళ్లను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో ఎలాంటి కట్స్ లేకుండా తెరకెక్కించిన చిత్రమిది. సినిమా కథంతా నేచురల్ గా ఒక ఫ్లో లో కనిపించేలా షూట్ చేశాం. థియేటర్ లో ఆడియెన్స్ కు థ్రిల్లింగ్ ఎక్సీపిరియన్స్ ఇస్తుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నాం. అన్నారు.


రిషిక ఖన్నా, అర్చనా సింగ్, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు ఇతర పాత్రల్లో నటిస్తున్నఈ చిత్రానికి మాటలు - వసంత కిరణ్, యానాల శివ, పాటలు - ప్రణవం.., సంగీతం - సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ - ఎంఎన్ బాల్ రెడ్డి, ఎడిటర్ - క్రాంతి (ఆర్కే), ఎస్ఎఫ్ఎక్స్ - జి. పురుషోత్తమ్ రాజు, కొరియోగ్రఫీ - కపిల్, ఫైట్స్ - శివ, దర్శకత్వం - జాని.

Director Merlapaka Gandhi Interview About Maestro

 ‘మాస్ట్రో’లో ఫస్ట్ షాట్ నుండి నితిన్ త‌న క్యారెక్టర్‌లో లీనమై చేశారు - డైరెక్టర్ మేర్లపాక గాంధీ



నితిన్‌ హీరోగా రాబోతున్న కొత్త చిత్రం ‘మాస్ట్రో’. న‌భ న‌టేష్‌, త‌మ‌న్నా హీరోయిన్లుగా న‌టించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ నెల 17న డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తాజా ఇంటర్వ్యూలో డైరెక్టర్ మేర్లపాక గాంధీ మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.


అరకు దగ్గరలోని టైడా అనే ఊరిలో మొదటిసారి ఈ 'అందాధున్' సినిమా చూశా. 'అందాధున్' చూడగానే మూవీలోని థ్రిల్లింగ్ మూమెంట్స్ నచ్చాయి. క్రైం, డార్క్ హ్యూమర్ బాగా నచ్చాయి. రీమేక్ చేస్తే ఇలాంటి సినిమా చేయాలని అనిపించింది. నితిన్ గారు, సుధాకర్ రెడ్డి గారు అప్రోచ్ కావడంతో ఈ సినిమా చేసాం. ఈ సినిమా ఒరిజినల్ వర్షన్‌లోని లవ్ స్టోరీలో, క్లైమాక్స్‌లో కొన్ని మార్పులు చేసాం.  


బేసిక్‌గా రీమేక్ సినిమా చేయడం కొంచెం కష్టం. ఉన్నది ఉన్నట్లుగా తీస్తే కాపీ పేస్ట్ అంటారు. ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే సోల్ చెడగొట్టారని అంటారు. ఆ సమస్య అయితే ప్రధానంగా ఉంటుంది. అందుకే ఒరిజినల్ వర్షన్‌లో ఆ ఫీల్ మిస్ కాకూడదని ఉన్న కొన్ని ఫ్రేమ్స్ ఉన్నవి ఉన్నట్లుగా చేశాం.  


చిత్రంలో అంధుడిగా నితిన్ బాగా చేశారు. కోవిడ్ సంబంధిత కొన్ని కారణాల వల్ల ప్రారంభంలోనే దుబాయ్ షెడ్యూల్ చేసి క్లైమాక్స్ షూట్ చేసాం. ఫస్ట్ షాట్‌లోనే అంధుడిగా ఆ క్యారెక్టర్‌లో లీనమై చేశారు నితిన్. దీంతో ఈ సినిమా చేసేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. టబు చేసిన పాత్రలో తమన్నాను తీసుకోవాలనే ఆలోచన నాదే. టబు ఏజ్ గ్రూప్ కాకుండా కొద్దిగా యంగ్‌గా వెళదామని ఇలా ప్లాన్ చేశాం. ఆమె కమర్షియల్ హీరోయిన్ కాబట్టి డిఫరెంట్‌గా ఉంటుంది. తమన్నా యాక్ట్ చేస్తుంటే చూసి నేనే షాకయ్యా.


హర్ష డాక్టర్ క్యారెక్టర్ బాగా చేశారు. సింగర్ మంగ్లీతో సీన్స్ బాగా వచ్చాయి. అలాగే రచ్చ రవి, సీనియర్ యాక్టర్ నరేష్ గారు, నభా నటేష్ అందరూ చాలా బాగా నటించారు. మొదట ఈ సినిమాను జులై 11న రిలీజ్ ప్లాన్ చేసాం. కానీ సెకండ్ వేవ్ స్టార్ట్ కావడంతో బాగా ఆలోచించి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ రూరల్ రీచ్ కాలేదు. చూడాలి మరి రీమేక్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది.


మహతి స్వర సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాలుగు పాటలు చాలా కొత్తగా ట్రై చేశారు. సాంగ్ చిత్రీకరణ కోసం కొత్త అటెంప్ట్ చేసాం. బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్స్ పెట్టి వర్చువల్ రియాలిటీలో షూట్ చేశాం. మాస్ట్రో అంటే మాస్టర్ ఆఫ్ మ్యూజిక్. చాలా టైటిల్ అనుకున్నాం కానీ చివరకు ఈ టైటిల్ ఫిక్స్ చేశాం. రీమేక్ సినిమాలు చేస్తుంటే కంపారిజన్స్ ఉంటాయి. కాబట్టి ఈ సినిమా తర్వాత ఇక రీమేక్ సినిమాలు చేయను. ఈ సినిమా అవుట్‌పుట్ చూసి నితిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫ్యూచర్‌లో నితిన్‌తో స్ట్రైయిట్ సినిమా కూడా చేస్తా.


ఒక స్క్రిప్ట్ అనుకొని కొన్ని నెలలు ట్రావెల్ చేసి తర్వాత డ్రాప్ చేస్తుండటం వల్ల సినిమాలు రూపొందించడంలో కాస్త లేట్ అవుతోంది. నెక్స్ట్ ప్రాజెక్టు గురించి త్వరలోనే చెబుతా. మా నాన్న రొమాంటిక్ నావెల్స్ రాస్తుంటారు. నాకేమో అది నచ్చదు. మేమిద్దరం బాగా ఫైట్ చేసుకుంటాం. ఇంట్లో రైటర్స్ ఉంటే అదే ప్రాబ్లమ్. 42 రోజుల్లో ఈ 'మాస్ట్రో' సినిమా కంప్లీట్ చేసాం. రాయడమే లేటుగానీ తీయడం ఫాస్ట్‌గా తీస్తా. సోషల్ మీడియా బాగా ఫాలో అవుతూ ఏ ఫన్ అక్కడ వర్కవుట్ అవుతోందో పక్కాగా ప్లాన్ చేసుకుంటా.