Latest Post

Maestro Pre Release Event Held Grandly

 అరుదైన చిత్రాల్లో ‘మాస్ట్రో’ ఒకటిగా నిలుస్తుందని నమ్ముతున్నాను - హీరో నితిన్



నితిన్‌ హీరోగా రాబోతున్న కొత్త చిత్రం ‘మాస్ట్రో’. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'అందాధున్' రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ నెల 17న ఓటీటీలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. మంగళవారం సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో నితిన్, నభా నటేష్, తమన్నా, నరేష్, మంగ్లీ, కాసర్ల శ్యాం, నిర్మాతలు ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి, రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ తదితరులు పాల్గొన్నారు.



తమన్నా మాట్లాడుతూ.. ‘అందరికీ  నమస్కారం.. చాలా రోజుల తరువాత ఇలా మీ ముందుకు రావడం ఆనందంగా ఉంది.. స్వచ్చమైన ప్రేమ దొరికితే.. మనకు రెక్కలు వచ్చినట్టు అనిపిస్తాయి. నా అభిమానుల వల్లే ఈ స్థాయి వరకు వచ్చాను. అంధాదున్ హిందీ సినిమా. ఈ సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ తమ భాషలో  చేయాలని అనుకుంటారు.  ఈ ఆఫర్ నాకు వచ్చినప్పుడే చేయాలని ఫిక్స్ అయ్యాను. నితిన్ ఈ ప్రాజెక్ట్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది. నితిన్‌తో మంచి లవ్ స్టోరీ చేస్తాను అని అనుకున్నాను. కానీ ఇలాంటి సినిమాతో చేయడం ఆనందంగా ఉంది. స్టార్డం ప్రేక్షకులు ఇస్తారు కానీ నటిగా గుర్తింపు తెచ్చుకోవడం మా చేతుల్లోనే ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు గాంధి గారికి థ్యాంక్స్. సెప్టెంబర్ 17న ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్‌లో రాబోతోంది. తప్పక చూడండి’ అని అన్నారు.


మంగ్లీ మాట్లాడుతూ.. ‘మీ అందరికీ నేను సింగర్‌గా తెలుసు. కానీ ఈ చిత్రంతో నటిగా పరిచయం అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలు, దర్శకుడికి థ్యాంక్స్. నువ్ చేయగలవ్ అని చెప్పి దైర్యం చెప్పి మరి నేను నటించేలా చేశారు. సినిమా అద్బుతంగా ఉండబోతోంది. మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. నితిన్ చాలా కూల్. మంచి పర్సన్. మాతో హీరోలా ప్రవర్తించలేదు. ఫ్రెండ్‌లా, బ్రదర్‌లా ఉన్నారు. తమన్నాతో రెండు మూడు సీన్లే చేశాను. నభాతో సీన్లు నాకు లేవు. ఈ సినిమాలో నన్ను చూసి మీరంతా ఎంజాయ్ చేస్తారు. ఈ చిత్రం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.


కాసర్ల శ్యాం మాట్లాడుతూ.. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ నుంచి మేర్లపాక గాంధీతో  పరిచయం ఉంది. ఆయనది టిపికల్ శైలి. ఎంతో మంచి కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమాలో ఓ పాటను రాశాను. నితిన్ గారితో  బొమ్మోలే ఉందిరా పోరి,వాటే బ్యూటీ మంచి మాస్ హిట్ నంబర్స్ ఇచ్చాను. ఆయన కెరీర్‌లో భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉంది. నితిన్ ఎంతో మంచి మనిషి. ఆయన నటను వందకు రెండు వందల శాతం ఈ సినిమాతో చూస్తాం. ఈ సినిమా విజయవంతం అవుతుందని, అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


రాజ్ కుమార్ ఆకేళ్ల మాట్లాడుతూ.. ‘అంధాదున్ సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాను నితిన్ గారు రీమేక్ చేసేందుకు సిద్దపడ్డాడు అని తెలిసినప్పుడు విజయం సాధించిందని నేను అనుకున్నాను. ప్రతీ ఒక్క పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రానికి సరైన దర్శకుడు దొరికారు. సినిమాలోని  ఆత్మను చెడకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తెరకెక్కించారు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డిలతో  కలిసి  పని చేయడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.


నిఖితా రెడ్డి మాట్లాడుతూ.. ‘మాస్ట్రో సినిమా సెప్టెంబర్ 17న  విడుదల కాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. దర్శకుడు మేర్లపాక గాంధీ అద్భుతంగా తెరకెక్కించారు’ అని అన్నారు.


మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. ‘ఎప్పటి నుంచో నితిన్ భయ్యాతో చేయాలని అనుకున్నాను. కమర్షియల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చేయాలని అనుకున్నాను. కానీ అంధాదున్ లాంటి ఆర్టిస్టిక్ సినిమాచేశాను.  నితిన్ అన్న బాగా చేశారు. తమన్నాను మిల్కీ బ్యూటీ అంటే ఏదోలా ఉంది. ఇప్పటి నుంచి తమన్నాను గ్రేట్ ఆర్టిస్ట్ అని  అంటారు. నభా కూడా అద్భుతంగానటించారు. సినిమాలో పని చేసినప్పుడు కెమెరామెన్‌లు నాతో విసుగు చెందుతుంటారు. కానీ కెమెరామెన్ యువరాజ్ విసుక్కున్నారో లేదో తెలియదు. నరేష్ గారికి పెట్టిన విగ్‌తో మంచి మ్యానరిజాన్ని క్రియేట్ చేశారు. మంగ్లీ, జిషు సేన్ గుప్తా, రచ్చ రవి, శ్రీముఖి ఇలా ప్రతీ ఒక్కరూ బాగా నటించారు. మహతి స్వర స్వాగర్ సంగీతం, నేపథ్యం సంగీతాన్ని అద్భుతంగా ఇచ్చారు. ఆయన ఫోన్ ఎత్తకపోయినా కూడా మంచి ఆల్బమ్ ఇచ్చారు. సెప్టెంబర్ 17న హాట్ స్టార్‌లో  ఈ సినిమా రాబోతోంది. సినిమా చూసి కచ్చితంగా పోలికలు పెడతారు. తిట్టడానికి అయినా పొగడటానికి అయినా సరే సినిమాను చూడండి’ అని అన్నారు..


నభా నటేష్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 17న మనం కొత్త సినిమాను ఇస్తున్నాం. ఫస్ట్ వేవ్‌లో మనం అన్ని సినిమాలను చేసేశాం. సెకండ్ వేవ్‌లో కొత్త సినిమా వస్తోంది. అంధాదున్ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందోఅందరికీ తెలిసిందే. రీమేక్‌లో ఆఫర్ రావడం సంతోషంగా అనిపించింది.ఈ పాత్రకు సరిపోతాను అని నమ్మినందుకు గాంధీ గారికి థ్యాంక్స్. నితిన్ గారితో నాకు ఇది మొదటి సినిమా. ఆయన చిత్రాలు నేను ఇంతకు ముందు చూశాను. ఆయన ఎనర్జీ వేరే లెవెల్‌లో ఉంటుంది. మన కారెక్టర్ మాత్రమే కాదు.. చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా గమనించాలనే విషయం నితిన్ గారి దగ్గరి నుంచి నేర్చుకున్నాను. సినిమా పట్ల ఆయనుకున్న అంకిత భావం వేరే లెవెల్. నరేష్ గారితో నాకు మూడో సినిమా. కెమెరా మెన్ గారు నన్ను చాలా అందంగా చూపించారు. ప్రతీ ఒక్క విషయాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తారు. ఇంత మంచి సంగీతాన్ని ఇచ్చినందుకు మహతి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనాల మొహం మీద చిరునవ్వు తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే ఓటీటీలో వస్తున్నాం. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో కలిసి చూడండి. కచ్చితంగా మీరు ఎంజాయ్  చేస్తారు’ అని అన్నారు.


నితిన్ మాట్లాడుతూ.. ‘నా అభిమానులకు ముందుగా సారీ. కోవిడ్ నిబంధనల వల్ల ఫంక్షన్‌ను అంత గ్రాండ్‌గా నిర్వహించలేకపోయాం. హిందీలో అంధాదున్ కల్ట్ సినిమా. రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు భయం వేసింది. కానీ నటుడిగా నిరూపించుకునేందుకు రిస్క్ తీసుకున్నాం. దర్శకుడు ఈ సినిమాకు చాలా కష్టపడ్డాడు. ఉన్నది ఉన్నట్టు తీస్తే ఏం తీశాడురా? అని అంటారు. మార్పులు చేర్పులు చేస్తే.. సోల్ లేదు చెడగొట్టారు అంటారు. కానీ గాంధీ మాత్రం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీశారు. హిందీ సినిమాను ఎలా ఎంజాయ్ చేశారో మన సినిమా కూడా అంత బాగుందని అనుకుంటారు. మహతి సాగర్ పాటల కంటే ఎక్కువగా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అంత మంచి ఆర్ఆర్‌ను థియేటర్లో చూస్తే బాగుంటుందని నేను, గాంధీ చాలా ఫీలయ్యాం. కానీ పరిస్థితుల వల్లే ఓటీటీలోకి వస్తున్నాం. డీఓపీ యువరాజ్ పనితనం కూడా బిగ్ స్క్రీన్‌లో చూస్తే బాగుండేది. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ పని తనం కూడా బాగుంది. కానీ బిగ్ స్క్రీన్‌లో మిస్ అవుతున్నాం. మళ్లీ మన టీం అంతా కలిసి పని చేద్దాం. ఈ సినిమా కోసం చాలా కష్టమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఈ సినిమాకు క్యాస్టింగ్ చాలా ముఖ్యం. విలన్ కోసం జిషును తీసుకున్నాం. టబు  పాత్రకు చాలా మందిని అనుకున్నాం. కానీ తమన్నా ఒప్పుకుంటుందా? లేదా? అనుకున్నాం. మంగ్లీ యాక్టింగ్ చూసి సింగరా? యాక్టరా? అని షాక్ అయ్యాను. ఇకపై ఆమె సింగర్‌గా పక్కకెళ్లి.. యాక్టర్‌గా బిజీగా అవుతుంది. అలా ప్రతీ ఒక్క పాత్రకు సరైన నటీనటులు దొరకడం చాలా అరుదు. అలాంటి అరుదైన చిత్రాల్లో ఈ మాస్ట్రో కూడా ఒకటి అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ సినిమాను తీసినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. అంతేకాకుండా అందరికీ సమయానుగుణంగా డబ్బులు ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇండస్ట్రీలో  నాకు ఫాదర్ లాంటి వారు. ఇలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారు. నా తదుపరి చిత్రంలో కూడా మీరే (నరేష్) నా ఫాదర్. నేను ఫాదర్, మీరు గ్రాండ్ ఫాదర్ అయ్యే వరకు ఇలానే మన జర్నీ కొనసాగుతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 17న హాట్ స్టార్‌లో రాబోతోంది. సినిమాను  చూడండి మీ అందరూ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు..

Tremendous Response for Leharaayi Lyrical From MEB

 అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నుంచి ‘లెహరాయీ’ లిరికల్ సాంగ్‌కు అనూహ్య స్పందన..



అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం నుంచి రొమాంటిక్ లెహరాయి లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘లెహరాయి లెహరాయి గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి‘ అంటూ సాగే ఈ పాటను తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు సిద్ శ్రీరామ్. తాజాగా విడుదలైన ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. అఖిల్, పూజ హెగ్డే రొమాన్స్ కూడా అదిరిపోయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు.


ఈ పాట లిరిక్స్..


లెహరాయి.. లెహరాయీ.. ఏ లేలేలే.. లేలేలేలే..

లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..

లెహరాయీ లెహరాయీ.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి..

ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి..

కళ్లలోనే దాగి ఉన్న అమ్మాయి..

సొంతమల్లే చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ..


లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..

లెహరాయీ లెహరాయీ.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి..


రోజూ చక్కిలితో సిగ్గుల తగువాయే..

రోజూ పెదవులతో ముద్దుల గొడవాయే..

వంట గదిలో మంటలన్నీ ఒంటిలోకే ఒంపుతుంటే..

మరి నిన్నా మొన్నా ఒంటిగా ఉన్న ఈడే నేడే లెహరాయీ..


లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..

లెహరాయీ లెహరాయీ.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి..


వేలా పాలలనే మరిచే సరసాలే..

తేదీ వారాలే చెరిపే చెరసాలే..

చనువు కొంచెం పెంచుకుంటూ.. తనువు బరువే పంచుకుంటూ..

మనలోకం మైకం ఏకం అవుతూ.. ఏకాంతాలే లెహరాయీ..


లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..

లెహరాయీ లెహరాయీ.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి..

ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి..

కళ్లలోనే దాగి ఉన్న అమ్మాయి..

సొంతమల్లే చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ..



న‌టీ న‌టులు:

అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు..


సాంకేతిక నిపుణులు:


దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌  

బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్  

స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్  

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమడి

మ్యూజిక్ : గోపీ సుంద‌ర్

సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ

ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్

ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

LIGER (Saala Crossbreed) New Schedule Begins In Goa

 Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s Pan India Film LIGER (Saala Crossbreed) New Schedule Begins In Goa



Happening hero Vijay Deverakonda’s first Pan India film LIGER (Saala Crossbreed) being directed by dynamic director Puri Jagannadh is in the mid of its shooting. The film’s new schedule begins today in Goa, where high octane action sequences and also some important scenes will be canned.

"BLOOD. SWEAT. VIOLENCE. #LIGER Shoot Resumes," posted Vijay Deverakonda.


“BLOOD SWEAT VIOLENCE begins today .. #shootmode #beastmode #LIGER #salaacrossbreed @TheDeverakonda #purijagannadh @ananyapandayy @karanjohar @PuriConnects @DharmaMovies @apoorvamehta18 @IamVishuReddy @meramyakrishnan @RonitBoseRoy ,” tweeted producer Charmme Kaur who also shared a working still.


The poster sees Vijay Deverakonda as an MMA fighter getting ready to fight. Foreign fighters are also taking part in the shoot of the ongoing schedule.


Vijay Deverakonda appears in a completely new makeover and underwent training in mixed martial arts in the sports action thriller. Bollywood actress Ananya Pandey is playing the female lead.


In association with Puri connects, the film is being produced jointly by Bollywood's leading production house Dharma Productions.


Given it is a Pan India film, Puri connects and Dharma Productions are making the film on a grand scale without compromising on budget.


The film in the crazy combination has cinematography handled by Vishnu Sarma, while Kecha from Thailand is the stunt director.


Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta together are bankrolling the film.


Ramya Krishnan and Ronit Roy play prominent roles in Liger which is being made in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam languages.


Cast: Vijay Deverakonda, Ananya Pandey, Ramya Krishnan, Ronit Roy, Vishu Reddy, Aali, Makarand Desh Pandey and Getup Srinu.


Technical Crew:

Director: Puri Jagannadh

Producers: Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta

Banners: Puri connects and Dharma Productions

DOP: Vishnu Sarma

Art Director: Jonny Shaik Basha

Editor: Junaid Siddiqui

Stunt Director: Kecha


Naveen Polishetty's Next with Sithara Entertainments & Fortune Four Cinemas

Naveen Polishetty's Next with Sithara Entertainments & Fortune Four Cinemas



Young Sensation Naveen Polishetty who's on a sky high with the success of Jathi Rathnalu this year is now teaming up with Kalyan Shankar who is marking his debut in tollywood with this film.


Suryadevara Naga Vamsi, the young & the busiest Producer of Sithara Entertainments is producing the movie in association with Fortune Four Cinemas headed by Ms. Sai Soujanya.


On this occasion, the makers say, 'This movie will be your best dose of Fun & Entertainment.'


Other details of Cast & Crew will be revealed soon.

Maanas Nagulapalli Ksheera Saagara Madhanam in Second Place on Amazon

 బిగ్ బాస్ పార్టిసిపెంట్

'మానస్ నాగులపల్లి' నటించిన

"క్షీరసాగర మథనం" చిత్రానికి

అమెజాన్ ప్రైమ్ లో రెండో స్థానం!!



     "బిగ్ బాస్" ఫేమ్ మానస్ నాగులపల్లి హీరోగా నటించిన "క్షీర సాగర మథనం" చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్,... అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర ఇతర ముఖ్య తారాగణంగా... 

యువ ప్రతిభాశాలి అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన "క్షీరసాగర మథనం" చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మించింది. ఆగస్టు 6న థియేటర్స్ లో విడుదలై... కరోనా కారణంగా పరిమిత ఆదరణ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న "అమెజాన్ ప్రైమ్"లో విడుదలై... సంచలనం సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది.

      తమ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో లభిస్తున్న అపూర్వ స్పందన తమను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందని దర్శకుడు అనిల్ పంగులూరి అంటున్నారు. అమెజాన్ లో 499వ చిత్రంగా విడుదలైన "క్షీరసాగర మథనం" చిత్రం "టక్ జగదీష్" తర్వాత రెండో స్థానంలో నిలవడం తమకు చాలా గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు!!

Director Sunil Kumar Reddy Interview About Honey Trap

 ఎమోషనల్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "హనీ ట్రాప్" ను సెప్టెంబర్ 17న విడుదల చేస్తున్నాం - దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి



సొంత ఊరు, గంగపుత్రులు, గల్ఫ్, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ లాంటి ఎన్నో చిత్రాలకి దర్శకత్వం వహించి...  18 స్టేట్ అవార్డ్స్ అందుకుని విమర్శకుల ప్రశంసలందుకొన్న దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి. ఇప్పుడు 'హనీ ట్రాప్' అనే  చిత్రంతో  ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.


రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో...  భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వి.వి.వామనరావు నిర్మాతగా సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం... ఈ నెల 17న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలవుతోంది.


ఈ సందర్భంగా దర్శకుడు  సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... "గతంలో నా దర్సకత్వంలో తెరకెక్కిన ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ లాంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు తెరకెక్కించిన 'హనీ ట్రాప్'  కూడా అలాంటి కోవకు చెందిన ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఈ చిత్ర కథ మా నిర్మాత వి.వి.వామనరావు గారిదే. నేను మాటలు, దర్శకత్వం వహించాను. హనీ ట్రాప్ అనేది ఒక అంతర్జాతీయ అంశం. ఈ కాన్సెప్ట్ మీద 3, 4 చిత్రాలు చేసేంత మెటీరియల్ ఉంది. ప్రతిరోజూ మనం పత్రికల్లో ఈ హనీ ట్రాప్ కథలు చదువుతూనే ఉన్నాం. ఈ ట్రాప్ లో చాలా మంది  ఏదో రకంగా చిక్కుకుని ఉన్నారు. ఈ ట్రాప్ లో అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ మోసపోతున్నారు. సోషల్ మీడియా వల్ల ఇప్పుడు చాలా సులభంగా మోసం చేసేయవచ్చు. అలాంటి అంశాలను కూడా ఇంటెరెస్టింగ్ గా యూత్ ని ఆకర్శించే విధంగా సినిమా తీసాము.


ఈ చిత్రంలో అందరూ కొత్త వాళ్లే. రుషి, మిస్ వైజాగ్  శిల్ప మరియు తేజు అనే యంగ్ టాలెంట్ ని పరిచయం చేస్తున్నాము. మా నిర్మాత కూడా మంచి పాత్ర చేసారు. లజ్జ సినిమా లో  హీరో గా నటించిన  శివ కార్తీక్ ఒక యంగ్ పొలిటిషన్ పాత్ర లో నటించాడు.

నాకు కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన సినిమాలు ఉన్నాయి, ప్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. ఫలితం పక్కన పెడితే ఫిలిం మేకింగ్ ప్రాసెస్ అంటే నాకు చాలా ఇష్టం. మనం ఒక కథకి సినిమా రూపం లో ప్రాణం పోస్తాము. ఈ ప్రక్రియ నాకు ఇష్టం. అందుకే సినిమా అంటే ప్యాషన్ .


నేను చేసే ప్రతి సినిమాలో రొమాన్స్ అంతర్లీనంగా  ఉంటుంది. నాకు అవార్డ్స్ తెచ్చిపెట్టిన సొంత ఊరు, గంగ పుత్రుల్లో కూడా రొమాన్స్ ఉంది. మన తల్లిదండ్రుల ప్రేమకు చిహ్నమే మనం. మరి అలాంటి ప్రేమని ఎందుకు చూపించకూడదు. మన సమాజం లో ఉన్న ఎన్నో రుగ్మతలను ధైర్యంగా చర్చించుకోవటం లేదు. అలాంటి విషయాలు చర్చించటానికి నేను  ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ, హనీ ట్రాప్ లాంటి సినిమాలు చేశాను.


ఒక సినిమా దర్శకుడుని మీరు ఇలాంటి చిత్రాలు ఎందుకు చేస్తున్నారు అని అడిగితే... ఒక 9 వ తరగతి చదువుతున్న అమ్మాయిని ఎవరైనా ఏమైనా చేస్తే ఆ అమ్మాయి సొసైటీ ముందుకు వచ్చి నాకు ఇలా జరిగింది అని ఎలా చెప్తుంది? ఒక క్రిమినల్ ప్రేమ కథ సినిమాల విడుదల తర్వాత  చాలా మంది బాధితులు పోలీసులును ఆశ్రయించారని నాకు పోలీస్ ల ద్వారానే తెలిసింది.



హనీ ట్రాప్ అనేది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా. అద్భుతమైన హ్యూమన్ ఎమోషన్ తో చిత్రీకరించాము. ఈ నెల సెప్టెంబర్ 17న విడుదల అవుతుంది.  అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా.


ఈ చిత్రం తరువాత ఇంకా మూడు సినిమాలు నా దర్శకత్వంలో తెరకెక్కుతున్నాయి. ఇందులో మొదటిది "వెల్కమ్ టు తీహార్ కాలేజీ". ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి  చెప్పే సినిమా. విడుదల కి సిద్ధంగా ఉంది. దీని తర్వాత ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి. చదలవాడ శ్రీనివాస్ గారు ఒక సినిమా  నిర్మిస్తున్నారు. ఇది తండ్రి కొడుకుల కథ. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఇంకో సినిమాకి బాపిరాజు గారు నిర్మాత. త్వరలో ఈ రెండు సినిమాల గురించి అన్ని వివరాలు చెబుతా" అంటూ ముగించారు.

Vijay Anthony Launched Rai Lakshmi Cinderella Teaser

 విజ‌య్ ఆంటోని రిలీజ్ చేసిన  రాయ్‌ల‌క్ష్మి 'సిండ్రెల్లా` మూవీ టీజ‌ర్‌



ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న గ్లామ‌ర్ డాల్ 'రాయ్‌ల‌క్ష్మి ద్విపాత్రాభిన‌యం చేసిన చిత్రం 'సిండ్రెల్లా'. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో సుదీక్ష ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎంఎన్ఆర్ మూవీస్ ప‌తాకాల‌పై మంచాల ర‌వికిర‌ణ్, ఎం.ఎన్‌.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాయ్ ల‌క్ష్మి, రోబో శంక‌ర్‌, అభిన‌య‌, అర‌వింద్ ఆకాశ్‌, సాక్షి అగ‌ర్వాల్‌, వినోద్‌, అన్బు త‌దిత‌రులు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ఎస్‌.జె.సూర్య ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన విను వెంక‌టేశ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.


ఈ సినిమా టీజ‌ర్‌ను విజ‌య్ ఆంటోని రిలీజ్ చేశారు. హార‌ర్ ఫాంట‌సీ, మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా టీజ‌ర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. స‌ర్కార్ 3, కిల్లింగ్ వీర‌ప్ప‌న్ చిత్రాల‌కు కెమెరామెన్‌గా వ‌ర్క్ చేసిన ర‌మ్మీ ఈ సినిమా సినిమాటోగ్రఫీ అందించారు. కాంచ‌న 2 చిత్రానికి సంగీతాన్ని అందించిన అశ్వామిత్ర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే గేమ్ ఓవ‌ర్ చిత్రానికి సౌండ్ డిజైన్ చేసిన స‌చిన్ ఈ చిత్రానికి చేసిన సౌండ్ డిజైనింగ్ హైలైట్ కానుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాను  విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత‌ మంచాల ర‌వికిర‌ణ్‌, స‌హ నిర్మాత‌ ఎం.ఎన్‌.రాజు తెలిపారు.


న‌టీన‌టులు:

రాయ్ ల‌క్ష్మి, రోబో శంక‌ర్‌, అభిన‌య‌, అర‌వింద్ ఆకాశ్‌, సాక్షి అగ‌ర్వాల్‌, వినోద్‌, అన్బు త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌: సుదీక్ష ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎంఎన్ఆర్ మూవీస్

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: విను వెంక‌టేశ్‌

నిర్మాత‌: మంచాల ర‌వికిర‌ణ్‌, ఎం.ఎన్‌.రాజు

సినిమాటోగ్రాఫ‌ర్‌: ర‌మ్మీ,

ఎడిట‌ర్‌: లారెన్స్ కిషోర్‌

మ్యూజిక్‌: అశ్వామిత్ర‌

పీఆర్ఓ: తేజ‌స్వి స‌జ్జ‌

Regina Cassandra starrer “NeneNaa” Trailer Unveiled

 Regina Cassandra starrer “NeneNaa” Trailer Unveiled



Regina Cassandra, who is consistently proving her prowess performance in every film, will appear in dual roles as an archaeologist and as a queen in her upcoming flick NeneNaa that grabbed attention of one and all for its intriguing posters.


Expectations are quite high on the project, given Regina Cassandra is popular across Pan-Indian domain, director Caarthick Raju’s last movie Ninu Veedani Needanu Nene was a runaway hit and it’s second production venture for Raj Shekar Varma of Apple Tree Studios. The producer’s first project Zombie Reddy was a superhit.


To hike prospects on the movie, the makers have come up with trailer of the movie. The trailer is unveiled by Nidhhi Agerwal, Makkal Selvan Vijay Sethupathy and star director Lingusamy.


Going by the trailer, a horrific incident that had happened 100 years ago is repeating now. While Regina was a queen 100 years back, she is an archeologist now and has come to resolve a mysterious case.


Along with people who enter a seclude place in a forest, those who are assigned to resolve the mysterious case are also getting killed. The link between past and the present story is going to be crux of the movie. The mystery-driven plot with horror elements and lots of humour is going to offer a whole new experience to movie goers.


Caarthick Raju comes up with another interesting project and this time it will be much bigger in terms of casting and technical standards.


Simultaneously made in Telugu and Tamil, major portions of the bilingual have been shot in and around the locales of Courtallam. Sam CS is composing music and Gokul Benoy is handing cinematography. Sabu is the editor and Super Subbarayan is the stunt master.


Apart from Regina Cassandra, the others in the cast include Vennela Kishore, Akshara Gowda, Tagapothu Ramesh, Jaya Prakash, and few more prominent artists.


The film’s shoot has already been wrapped up and post-production works are also nearing completion.


Cast: Regina Cassandra, Vennela Kishore, Thagubothu Ramesh, Jaya Prakash, Akshara Gowda


Crew:

Director: Caarthick Raju

Producer: Raj Shekar Varma

Banner: Apple Tree Studios

Music: Sam CS

DOP: Gokul Benoy

Editor: Sabu

Stunts: Super Subbarayan

PRO: Vamsi-Shekar


King Nagarjuna Launched K Raghavendra Rao PelliSandaD Teaser

 కింగ్ నాగార్జున చేతుల మీదుగా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు ‘పెళ్లి సంద‌D’ టీజర్ విడుదల  



ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’తో మ‌రోసారి మ్యాజిక్‌ను రిపీట్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ సినిమాతో ఆయ‌న న‌టుడిగా కూడా ఎంట్రీ ఇస్తుండ‌టం విశేషం. ఈ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో  మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


 ద‌ర్శ‌కేంద్రుడు తెర‌కెక్కించిన నాటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ `పెళ్లిసంద‌డి`లో శ్రీ‌కాంత్ హీరో అయితే నేడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ పర్య‌వేక్ష‌ణ‌లో గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్న ‘పెళ్లిసంద‌D’లో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో అవ‌డం విశేషం. శ్రీలీల హీరోయిన్‌. మంగ‌ళ‌వారం  ‘పెళ్లి సంద‌D’ టీజ‌ర్‌ను కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు. ‘పెళ్లి సంద‌D’ మూవీ చాలా పెద్ద హిట్ కావాలంటూ చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. 


హీరో రోష‌న్ స్టైలిష్ లుక్‌తో క్యారెక్ట‌రైజేష‌న్ ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యాన్ని సింపుల్‌గా చెప్పారు. అలాగే లంగా ఓణిలో హీరోయిన్ శ్రీలీలను అందంగా ప్రెజెంట్ చేశారు. హీరో, హీరోయిన్ మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాల‌ను చూపించారు. మ‌రో వైపు ‘స‌హ‌స్త్ర‌కు పెళ్లి నాతోనా లేక నువ్వు తెచ్చి తొట్టి గ్యాంగ్ లీడ‌ర్‌తోనా’ అని హీరో రోషన్, హీరోయిన్ తండ్రి ప్రకాశ్‌రాజ్‌తో ఛాలెంజ్ చేసే సీన్‌తో సినిమాలో కేవ‌లం ప్రేమ స‌న్నివేశాలే కాకుండా నువ్వా నేనా అనేలా హీరోకి, హీరోయిన్ తండ్రికి మ‌ధ్య స‌న్నివేశాలుంటాయ‌ని అర్థ‌మవుతుంది. యాక్ష‌న్ స‌న్నివేశాలు, పెళ్లిలో హీరో, హీరోయిన్ స‌హా పెళ్లి బృంద‌మంతా క‌లిసి చేసే హ‌డావుడి, హీరో హీరోయిన్ మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాలు, క‌మ‌ర్షియ‌ల్ సాంగ్‌, ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల‌ను చూపించారు. పెళ్లి భోజ‌నం ఎంత చ‌క్క‌గా ఉంటుందో అంతే చ‌క్క‌గా మా ‘పెళ్లి సంద‌D’  సినిమా ఉంటుంద‌నేలా టీజ‌ర్ ఉంది. 


 ‘‘ఇప్ప‌టికే సినిమా ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేశాం.  ఈ సినిమా నుంచి విడుద‌లైన రాఘవేంద్ర‌రావు ప్రోమో,  హీరో, హీరోయిన్ ప్రోమోలు, సాంగ్స్ అన్నింటికీ ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.  నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల గురించి తెలియజేస్తాం’’ అని డైరెక్టర్ గౌరి రోణంకి తెలిపారు. 


నటీనటులు:


రోష‌న్, శ్రీ‌లీల, ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, స‌త్యంరాజేష్‌, రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, శక‌లక శంక‌ర్‌, అన్న‌పూర్ణ‌, జాన్సి, ప్ర‌గ‌తి, హేమ‌, కౌముది, భ‌ద్రం, కిరీటి త‌దిత‌రులు.. 


సాంకేతిక వ‌ర్గం: 


సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి

సాహిత్యం: శివ‌శ‌క్తి ద‌త్త‌, చంద్ర‌బోస్

సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్ నామ

ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు

ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె,

‌మాట‌లు: శ్రీ‌ధ‌ర్ సీపాన‌

ఫైట్స్‌: వెంక‌ట్

కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: వి. మోహ‌న్ రావు,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సాయిబాబా  కోవెల‌మూడి

స‌మ‌ర్ప‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌

నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని

ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె. రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ

ద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోణంకి.

Introducing Ganesh Bellamkonda with a Fun Entertainer “SWATHIMUTHYAM”

 Introducing Ganesh Bellamkonda with a Fun Entertainer “SWATHIMUTHYAM”



Ganesh Bellamkonda, Son of Ace producer Bellamkonda Suresh & Brother of Young Hero Bellamkonda Sai Sreenivas is making his debut to the silver screen with a Fun Entertainer titled as 'SwathiMuthyam' .


Today, On the occasion of Ganesh Bellamkonda's Birthday, the makers have unveiled the title and first look poster of the movie. In the first look poster, Ganesh is seen in a smart formal look with a bag on his shoulders and with an attractive, vibrant logo of 'SwathiMuthyam'.


Sithara Entertainments' who are on a roll with multiple movies in production are bankrolling this project which will be directed by debutant Lakshman K Krishna. Varsha Bollamma will be the female lead for the movie.


On this occasion, director Lakshman K Kumar said "This story is about a guy who has an innocent character like in 'Swathi Muthyam' . The film is about life, love & thoughts about marriage and how the opinions change & how life goes on between them. Family relations and emotions are the main assets to this film. This movie will entertain every movie goer for sure."


At present, the film is under production with a major portion of the shoot already finished. More details will be announced soon.


Other Cast included senior actor Naresh, Rao Ramesh, Subbaraju, Vennela Kishore, Harshavardhan, Pammi Sai, Goparaju Ramana, Siva Narayana, Pragathi, Surekha Vani, Sunaina, Divya Srepada.


Crew Details :


Music: Mahathi Swara Sagar

Cinematography: Suryaa

Editor: Navin Nooli

Art: Avinash Kolla

Pro: LakshmiVenuGopal

Presents: PDV Prasad

Producer: Suryadevara Naga Vamsi

Written and Directed : Lakshman K Krishna


Maro Prasthanam Censor Completed

 ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'మరో ప్రస్థానం' సెన్సార్ పూర్తి, యూఏ సర్టిఫికెట్ తో విడుదలకు రెడీ




యువ హీరో తనీష్‌, ముస్కాన్ సేథీ జంటగా నటించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మరో ప్రస్థానం. ఈ చిత్రానికి జాని దర్శకత్వం వహించారు. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో రూపొందిన మొట్ట మొదటి తెలుగు సినిమా 'మరో ప్రస్థానం' కావడం విశేషం. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. 'మరో ప్రస్థానం' చిత్రానికి సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ లభించింది. వన్ షాట్ ఫిల్మ్ గా సెన్సార్ సభ్యుల ప్రశంసలు 'మరో ప్రస్థానం' చిత్రానికి దక్కాయి. 'మరో ప్రస్థానం'  సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా.. 


*దర్శకుడు జాని మాట్లాడుతూ*..'మరో ప్రస్థానం' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ వాళ్లు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు వన్ షాట్ ఫిల్మ్ గా 'మరో ప్రస్థానం' చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారని అభినందించారు. సినిమా బాగుందంటూ వాళ్లు చెప్పడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. 'మరో ప్రస్థానం' సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు తర్వాత ఏం జరుగుతుందో అని ఆసక్తిగా చూసేలా ఉంటుంది. సినిమా చూసే వాళ్లను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో ఎలాంటి కట్స్ లేకుండా తెరకెక్కించిన చిత్రమిది. సినిమా కథంతా నేచురల్ గా ఒక ఫ్లో లో కనిపించేలా షూట్ చేశాం. థియేటర్ లో ఆడియెన్స్ కు థ్రిల్లింగ్ ఎక్సీపిరియన్స్ ఇస్తుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నాం. అన్నారు.


రిషిక ఖన్నా, అర్చనా సింగ్, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు ఇతర పాత్రల్లో నటిస్తున్నఈ చిత్రానికి మాటలు - వసంత కిరణ్, యానాల శివ, పాటలు - ప్రణవం.., సంగీతం - సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ - ఎంఎన్ బాల్ రెడ్డి, ఎడిటర్ - క్రాంతి (ఆర్కే), ఎస్ఎఫ్ఎక్స్ - జి. పురుషోత్తమ్ రాజు, కొరియోగ్రఫీ - కపిల్, ఫైట్స్ - శివ, దర్శకత్వం - జాని.

Director Merlapaka Gandhi Interview About Maestro

 ‘మాస్ట్రో’లో ఫస్ట్ షాట్ నుండి నితిన్ త‌న క్యారెక్టర్‌లో లీనమై చేశారు - డైరెక్టర్ మేర్లపాక గాంధీ



నితిన్‌ హీరోగా రాబోతున్న కొత్త చిత్రం ‘మాస్ట్రో’. న‌భ న‌టేష్‌, త‌మ‌న్నా హీరోయిన్లుగా న‌టించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ నెల 17న డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తాజా ఇంటర్వ్యూలో డైరెక్టర్ మేర్లపాక గాంధీ మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.


అరకు దగ్గరలోని టైడా అనే ఊరిలో మొదటిసారి ఈ 'అందాధున్' సినిమా చూశా. 'అందాధున్' చూడగానే మూవీలోని థ్రిల్లింగ్ మూమెంట్స్ నచ్చాయి. క్రైం, డార్క్ హ్యూమర్ బాగా నచ్చాయి. రీమేక్ చేస్తే ఇలాంటి సినిమా చేయాలని అనిపించింది. నితిన్ గారు, సుధాకర్ రెడ్డి గారు అప్రోచ్ కావడంతో ఈ సినిమా చేసాం. ఈ సినిమా ఒరిజినల్ వర్షన్‌లోని లవ్ స్టోరీలో, క్లైమాక్స్‌లో కొన్ని మార్పులు చేసాం.  


బేసిక్‌గా రీమేక్ సినిమా చేయడం కొంచెం కష్టం. ఉన్నది ఉన్నట్లుగా తీస్తే కాపీ పేస్ట్ అంటారు. ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే సోల్ చెడగొట్టారని అంటారు. ఆ సమస్య అయితే ప్రధానంగా ఉంటుంది. అందుకే ఒరిజినల్ వర్షన్‌లో ఆ ఫీల్ మిస్ కాకూడదని ఉన్న కొన్ని ఫ్రేమ్స్ ఉన్నవి ఉన్నట్లుగా చేశాం.  


చిత్రంలో అంధుడిగా నితిన్ బాగా చేశారు. కోవిడ్ సంబంధిత కొన్ని కారణాల వల్ల ప్రారంభంలోనే దుబాయ్ షెడ్యూల్ చేసి క్లైమాక్స్ షూట్ చేసాం. ఫస్ట్ షాట్‌లోనే అంధుడిగా ఆ క్యారెక్టర్‌లో లీనమై చేశారు నితిన్. దీంతో ఈ సినిమా చేసేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. టబు చేసిన పాత్రలో తమన్నాను తీసుకోవాలనే ఆలోచన నాదే. టబు ఏజ్ గ్రూప్ కాకుండా కొద్దిగా యంగ్‌గా వెళదామని ఇలా ప్లాన్ చేశాం. ఆమె కమర్షియల్ హీరోయిన్ కాబట్టి డిఫరెంట్‌గా ఉంటుంది. తమన్నా యాక్ట్ చేస్తుంటే చూసి నేనే షాకయ్యా.


హర్ష డాక్టర్ క్యారెక్టర్ బాగా చేశారు. సింగర్ మంగ్లీతో సీన్స్ బాగా వచ్చాయి. అలాగే రచ్చ రవి, సీనియర్ యాక్టర్ నరేష్ గారు, నభా నటేష్ అందరూ చాలా బాగా నటించారు. మొదట ఈ సినిమాను జులై 11న రిలీజ్ ప్లాన్ చేసాం. కానీ సెకండ్ వేవ్ స్టార్ట్ కావడంతో బాగా ఆలోచించి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ రూరల్ రీచ్ కాలేదు. చూడాలి మరి రీమేక్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది.


మహతి స్వర సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాలుగు పాటలు చాలా కొత్తగా ట్రై చేశారు. సాంగ్ చిత్రీకరణ కోసం కొత్త అటెంప్ట్ చేసాం. బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్స్ పెట్టి వర్చువల్ రియాలిటీలో షూట్ చేశాం. మాస్ట్రో అంటే మాస్టర్ ఆఫ్ మ్యూజిక్. చాలా టైటిల్ అనుకున్నాం కానీ చివరకు ఈ టైటిల్ ఫిక్స్ చేశాం. రీమేక్ సినిమాలు చేస్తుంటే కంపారిజన్స్ ఉంటాయి. కాబట్టి ఈ సినిమా తర్వాత ఇక రీమేక్ సినిమాలు చేయను. ఈ సినిమా అవుట్‌పుట్ చూసి నితిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫ్యూచర్‌లో నితిన్‌తో స్ట్రైయిట్ సినిమా కూడా చేస్తా.


ఒక స్క్రిప్ట్ అనుకొని కొన్ని నెలలు ట్రావెల్ చేసి తర్వాత డ్రాప్ చేస్తుండటం వల్ల సినిమాలు రూపొందించడంలో కాస్త లేట్ అవుతోంది. నెక్స్ట్ ప్రాజెక్టు గురించి త్వరలోనే చెబుతా. మా నాన్న రొమాంటిక్ నావెల్స్ రాస్తుంటారు. నాకేమో అది నచ్చదు. మేమిద్దరం బాగా ఫైట్ చేసుకుంటాం. ఇంట్లో రైటర్స్ ఉంటే అదే ప్రాబ్లమ్. 42 రోజుల్లో ఈ 'మాస్ట్రో' సినిమా కంప్లీట్ చేసాం. రాయడమే లేటుగానీ తీయడం ఫాస్ట్‌గా తీస్తా. సోషల్ మీడియా బాగా ఫాలో అవుతూ ఏ ఫన్ అక్కడ వర్కవుట్ అవుతోందో పక్కాగా ప్లాన్ చేసుకుంటా.

Producer Vishnu Induri Interview About Talaivi

 తలైవి సినిమా విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను.  - నిర్మాత విష్ణువర్దన్ ఇందూరి



సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన‌ చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయలలిత పాత్ర పోషించగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేశారు. ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్ 10న సినిమా విడుదల కాగా.. విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా నిర్మాత విష్ణువర్దన్ ఇందూరి మీడియాతో ముచ్చటించారు.


తలైవి సినిమా విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. మంచి సినిమా చేశాను అనే ప్రశంసలు కూడా వచ్చాయి. అదే సమయంలో పెట్టిన డబ్బుల కంటే ఎక్కువే వెనక్కి వచ్చాయి. అలా వ్యాపారపరంగా లాభాలు కూడా వచ్చాయి. మొత్తానికి తలైవి సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం ఆనందంగా ఉంది.


నాన్ థియేట్రికల్ రైట్స్‌‌తో బడ్జెట్ మొత్తం రికవరీ అయింది. సినిమాకు పెట్టిన ఖర్చు కంటే ఎక్కువే వచ్చింది. మల్టీప్లెక్స్ అసోసియేషన్ వల్ల థియేటర్ల సమస్య ఏర్పడింది. కానీ నిర్మాతగా నా పరంగా చూస్తే నేను తీసుకున్న నిర్ణయం సరైనదే. ఏ నిర్మాత కూడా తన సినిమాను వారం ముందే అందరికీ చూపించరు. కానీ నేను చూపించాను. నా సినిమా మీద నాకున్న నమ్మకం అదే. ఏ టెన్షన్ లేకుండా రిలీజ్ రోజు హాయిగా నిద్రపోయాను. ఎందుకంటే మేం థియేటర్ రెవెన్యూ మీద ఆధారపడలేదు. తీసుకున్న ఫైనాన్స్ కట్టి సినిమా రిలీజ్ చేయాలంటే నా ముందు ఆప్షన్ అదే. నా నిర్ణయాన్ని మా టీం మొత్తం సమర్థించింది. ఇలాంటి సమయంలో సినిమాను తీయడం కష్టం అనుకుంటే.. రిలీజ్ చేయడం మరింత కష్టం.


సినిమాను థియేటర్ కోసమే తీశాం. ఎన్నో ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. కానీ మా మొదటి ప్రాధాన్యం థియేటర్లే. కానీ పరిస్థితుల వల్లే ఇలా చేయాల్సి వచ్చింది. దాంతో నాన్ థియేట్రికల్ రెవెన్యూ బాగానే వచ్చింది. ఇలాంటి సమయంలో సినిమా హిట్ అయిందా? లేదా? అని బాక్సాఫీస్ లెక్కల్ని పట్టి చెప్పలేం. పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చాయా? లేదా? మన సినిమాను ఎంత ఎక్కువ మంది చూశారు అనేది పరిగణలోకి తీసుకోవాలి. ఆ విషయంలో మేం సక్సెస్ అయ్యాం.


మా సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ బృందా వల్లే ఈ సినిమా ప్రారంభమైంది. జయలలిత గారు చనిపోయినప్పుడు రెండు మూడు రోజులు తిండి తినలేదు.. నిద్రపోలేదు. ఆమె బతికి ఉన్నప్పుడు బృంద అంత కనెక్ట్ అవ్వలేదేమో కానీ జయలలిత చనిపోయిన తరువాత మాత్రం చాలా కనెక్ట్ అయింది. జయలలిత గురించి ప్రపంచం తెలుసుకోవాలనేది ఆమె ఐడియా. అయితే ప్రాంతీయ చిత్రంగా కాకుండా పాన్ ఇండియన్ మూవీగా తీయాలని అనుకున్నారం. తమిళ భావాలు కనిపించాలనే ఉద్దేశ్యంతో విజయ్‌ను దర్శకుడిగా తీసుకున్నాం. ఇక ఇలాంటి కథను రాయాలంటే.. విజయేంద్ర ప్రసాద్ కంటే గొప్ప వారు ఎవరని అనుకున్నాం. ఇక కంగనాను హీరోయిన్‌గా తీసుకున్నప్పుడు అందరూ బ్యాడ్ చాయిస్ అని అన్నారు.


జయలలిత సినిమాలో ఆమె కంటే ఎక్కువగా ఎంజీఆర్ పాత్ర ఉంటుంది. అంత ఇంపార్టెంట్ రోల్ కాబట్టే అరవింద్ స్వామిని తీసుకున్నాం. తక్కువ సీన్లు ఉన్నా కూడా ఇంపాక్ట్ కనిపించాలని అనుకున్నాం. అయితే కరోనా దెబ్బ పడటంతో బడ్జెట్, క్యాస్టింగ్ అన్నింటిని తగ్గించేద్దామని అన్నారు. కానీ మా నిర్మాతలు అందరూ సపోర్ట్ చేశారు. జయలలిత ఎన్ని కష్టాలు పడ్డారో గానీ.. సినిమాను తీయడానికి, రిలీజ్ చేయడానికి ఎన్నో కష్టాలు పడ్డాం.


కంగనా రనౌత్ తమిళ నాడులో అంతగా తెలియదు. మొదట్లో అందరూ నెగెటివ్ కామెంట్ చేశారు. కానీ సినిమా చూశాక ప్రతీ ఒక్కరూ నాడు చేసిన ట్వీట్లను రీ ట్వీట్ చేస్తూ.. క్షమాపణలు చెబుతున్నారు. మేం తప్పుగా అనుకున్నాం.. మీ నిర్ణయమే సరైనది అని చెబుతున్నారు. అది నాకు సంతోషంగా అనిపిస్తోంది. మంచి సినిమా చేశామని వస్తోన్న ప్రశంసలు నిర్మాతగా నాకు సంతోషాన్ని ఇస్తోంది.


తలైవి సినిమా ఎలాంటి విమర్శలు రావడం లేదు. మొదట్లో సినిమాపై జయలలిత కుటుంబ సభ్యులు కేస్ వేశారు. కానీ సినిమా చూశాక వారి నిర్ణయం మారింది. జయలలితకు ఇంత కంటే గొప్ప నివాళిని ఎవరూ ఇవ్వలేరు అని అన్నారు. ఆమె మేనళ్లుడు దీపక్ ఫోన్ చేసి అభినందించాడు. తమిళ నాడులో స్క్రీన్లు పెంచే యోచనలో ఉన్నాం. రోజురోజుకూ థియేటర్లో జనాలు పెరుగుతున్నాయి. మొదటి సారి సింగిల్ స్క్రీన్‌లో సినిమా చూశామని అందరూ చెబుతున్నారు. ఇక కొంత మంది అయితే రెండు వారాల్లో ఓటీటీలో వస్తుంది కదా? అని అనుకుంటూ ఉంటారు.


నాకు బయోపిక్స్ అంటే ఇష్టం. కథలో ఏదైనా ఫీల్ ఉంటేనే చెప్పాలనిపిస్తుంది. ఇంకా మూడు నాలుగు చిత్రాలు ప్లాన్ చేశాం. హిందీలో మంచి లైనప్స్ ఉన్నాయి. త్వరలోనే అన్ని వివరాలు చెబుతాను. కపిల్ దేవ్ బయోపిక్ 1983 పెద్ద సినిమా. థియేటర్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం.


ఒకరిని గొప్పగా చూపించేందుకు మరొకరిని తక్కువ చూపించాల్సిన అవసరం లేదు. మా సినిమా కథ అది కాబట్టి అలా తీశాం. అవతల ఉన్న కరుణానిధి కూడా గొప్ప వ్యక్తి. కరుణానిధి, ఎంజీఆర్ ఇద్దరూ కూడా పరిస్థితుల వల్ల అపొజిషన్ అయిపోయారు.


సోషల్ మీడియా మీద ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాను. దాని పేరు ట్రెండింగ్. ఓ పెద్ద దర్శకుడు ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్యాన్ ఇండియా వైడ్‌గా విడుదల చేస్తాం. ప్రధానమంత్రి అధికారి కార్యాలయం చుట్టూ తిరిగే మరో కథను తెరకెక్కిస్తున్నాం. ఆజాద్ హింద్ అనే దేశభక్తి సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నాం.

Tremendous Response for Love Story Trailer

 "లవ్ స్టోరి" ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ , 24న థియేటర్ లలో రిలీజ్



సంతోషం, బాధ, ప్రేమ, ఉద్యోగం, కుటుంబం...ఇలా జీవితంలోని రంగుల చిత్రాన్ని

చూపిస్తూ సాగింది "లవ్ స్టోరి" సినిమా ట్రైలర్. ఇవాళ రిలీజైన "లవ్

స్టోరి" ట్రైలర్ దర్శకుడు శేఖర్ కమ్ముల ట్రేడ్ మార్క్ తో కనిపించింది.

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన "లవ్ స్టోరి" సినిమా ఈనెల 24న

థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.


"లవ్ స్టోరి" ట్రైలర్ ఎలా ఉందో చూస్తే... నాగ చైతన్య తెలంగాణ ప్రాంతానికి

చెందిన రేవంత్ ఓ మిడిల్ క్లాస్ కుర్రాడుగా కనిపించాడు. లోన్ తీసుకొని

బిజినెస్ చేయడం ద్వారా లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకునే  డ్యాన్సర్ రేవంత్ గా

నాగచైతన్య ను చూపించడంతో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. మరో వైపు బీటెక్

పూర్తి చేసి ఎలాగైనా సాఫ్ట్ వేర్ జాబ్ సాధించాలనే యువతి మౌనికగా సాయి

పల్లవిని చూపించారు. అయితే.. మౌనికలో దాగి ఉన్న డ్యాన్సింగ్ టాలెంట్ ని

గుర్తిస్తాడు రేవంత్. ఆమెను మంచి డ్యాన్సర్ అవ్వాలని ప్రోత్సహిస్తాడు. ఈ

క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడడం.. ఆ స్నేహం ప్రేమగా మారడం.. ఒక ప్రేమ

అంటే అడ్డంకులు మామూలే కదా. వీరి ప్రేమకు కూడా అడ్డంకులు ఏర్పడడం.. ఆ

అడ్డంకులను దాటుకుని వీళ్లు ఎలా ఒకటయ్యారు అనేదే ఈ లవ్ స్టోరీ

అనిపిస్తుంది. చైతన్య తెలంగాణ యాసలో మాట్లాడడం బాగుంది. అలాగే నేచురల్

బ్యూటీ సాయిపల్లవి కూడా పాత్రకు తగ్గట్టుగా అదరగొట్టేసింది అనిపిస్తుంది.

మనకు లోన్లు ఇవ్వరు.. రెంటుకు రూములు ఇవ్వరు.. పిల్లనిస్తార్రా..

బతుక్కోసం ఈ ఉరుకులాట నాతో కాదింక.. చస్తే చద్దాం.. కానీ తేల్చుకొని

చద్దాం వంటి డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. మిడిల్

క్లాస్ యువకుడిగా నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ పెరఫార్మన్స్ ఇచ్చాడని

చెప్పచ్చు. టోటల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే... లవ్ స్టోరీ ట్రైలర్

అదిరింది. హిట్ పక్కా... అనేట్టు ఉంది.


ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్

సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్

రావు నిర్మాతలు. ''లవ్ స్టోరి'' చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు,

దేవయాని,ఉత్తేజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.


సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్ : మార్తాండ్

కె.వెంకటేష్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి,

పిఆర్ఓ : జి.ఎస్.కె. మీడియా , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర

రావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు,

రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

Akhil Akkineni Most Eligible Bachelor Leharaayi Lyrical video Released

 అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ రొమాంటిక్ ‘లెహరాయి’ సాంగ్ ప్రోమో విడుదల..



అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం నుంచి రొమాంటిక్ లెహరాయి సాంగ్ ప్రోమో విడుదలైంది. లెహరాయి లెహరాయి గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి అంటూ సాగే ఈ పాటను తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు సిద్ శ్రీరామ్. సెప్టెంబర్ 15న ఫుల్ సాంగ్ విడుదల కానుంది. ఈ మేరకు విడుదలైన ప్రోమోలో అఖిల్, పూజ హెగ్డే రొమాన్స్ అదిరిపోయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ ఛాన‌ల్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుద‌ల అవుతుంది.


న‌టీ న‌టులు:

అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు..


సాంకేతిక నిపుణులు:


దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌  

బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్  

స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్  

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమడి

మ్యూజిక్ : గోపీ సుంద‌ర్

సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ

ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్

ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Vijaya Raghavan Pre Release Event Held Grandly

 కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి చూసేలా రూపొందిన క‌మ‌ర్షియ‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘విజ‌య రాఘ‌వ‌న్‌’ త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజ‌య్ ఆంటోని



‘న‌కిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని. ఈయన హీరోగా.. ‘మెట్రో’ వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ ఆనంద కృష్ణన్‌ తెరకెక్కించిన‌ చిత్రం ‘విజయ రాఘవన్‌’.  ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.  ‘కోడియిల్ ఒరువ‌న్‌’ పేరుతో త‌మిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీకరి ఫిలింస్ బ్యానర్‌పై ర‌విచంద్రా రెడ్డి, శివారెడ్డి తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ‘విజ‌య రాఘ‌వ‌న్‌’  పేరుతో తెలుగులో సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా  ఆదివారం హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో బిగ్ టిక్కెట్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా....



రైట‌ర్ భాష్య‌శ్రీ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌, అనువాదంలో వ‌ర్క్ చేసిన అంద‌రూ సినిమా గ్యారంటీ హిట్ అని చెప్పారు. క‌చ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాలో ప‌నిచేసే అవ‌కాశం ఇచ్చినందుకు థాంక్స్‌. ఈ సినిమాలో విజ‌య రాఘ‌వ‌న్‌గా న‌టించిన విజ‌య్ ఆంటోనిగారు ఓ ట్యూష‌న్ మాస్ట‌ర్‌. త‌న అమ్మ క‌న్న క‌ల‌ను నేర‌వేర్చ‌డానికి ఓ ప్రాంతానికి వ‌స్తాడు. ఆయ‌న పాత్ర‌లో చాలా డైమ‌న్ష‌న్స్ ఉంటాయి. చాలా విభిన్నంగా ఉండే సినిమా’’ అన్నారు. 


మ్యూజిక్ డైరెక్ట‌ర్ నివాస్ కె.ప్ర‌స‌న్న మాట్లాడుతూ ‘‘మంచి క‌థ‌కు త‌గ్గ సాంగ్స్ కుదిరాయి. అవ‌కాశం ఇచ్చిన విజ‌య్ ఆంటోనిగారికి, దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు. 


శ్రీకరి ఫిలింస్ అధినేతలు ర‌విచంద్రా రెడ్డి, శివారెడ్డి మాట్లాడుతూ ‘‘విజయ్ ఆంటోనిగారికి థాంక్స్‌. ఆనంద్ కృష్ణ‌న్‌గారు అద్భుత‌మైన క‌థ‌తో సినిమా చేశారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. సినిమాపై కాన్ఫిడెన్స్‌గా ఉన్నాం. సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల‌వుతున్న మా సినిమాను థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాం’’ అన్నారు. 


చిత్ర దర్శకుడు ఆనంద కృష్ణ‌న్ మాట్లాడుతూ ‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘మెట్రో’ తెలుగులో విడుదలై మంచి ఆదరణను దక్కించుకుంది. ఇది నా రెండో సినిమా. ఇది కూడా తెలుగులో భారీగా విడుదలవుతుండటం హ్యాపీగా ఉంది. తెలుగులో గ్రాండ్‌గా సినిమా విడుద‌ల‌వుతుంది. ఐఏఎస్ ఆఫీస‌ర్ కావాల‌నుకునే ఓ యువ‌కుడి క‌థే ఇది. జీవితంలో ఎన్నో సాధించాల‌నుకునే హీరో, త‌న త‌ల్లి కోరిక‌ను తీర్చాల‌నుకుంటాడు. ఆ క్ర‌మంలో కొన్ని స‌మ‌స్య‌ల్లో చిక్కుకుంటాడు. వాటి నుంచి త‌నెలా బ‌య‌ట‌ప‌డ‌తాడు అనేదే ఈ చిత్రం. ఇదొక ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. అంతే కాకుండా.. స‌మాజంలో మ‌న‌కు ఎదుర‌య్యే రాజ‌కీయ ప‌ర‌మైన ఇబ్బందులను ఎలా హ్యాండిల్ చేయాల‌నే సందేశం కూడా ఇస్తుంది. ఇలాంటి ఓ సినిమాను చేసే అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లకు, విజ‌య్ ఆంటోనిగారికి థాంక్స్‌. నివాస్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. హీరోయిన్ ఆత్మిక చాలా మంచి రోల్‌ను క్యారీ చేసింది. సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల‌వుతున్న సినిమాను ఆద‌రించండి’’ అన్నారు. 


రామచంద్రరాజు మాట్లాడుతూ‘‘సెప్టెంబర్ 17న విజయ రాఘవన్ థియేటర్స్‌లో విడుద‌ల‌వుతుంది. మంచి సినిమా. దాన్ని థియేట‌ర్స్‌లో చూసి ఎంక‌రేజ్ చేయండి. ఆనంద కృష్ణ‌న్‌, విజ‌య్ ఆంటోనిగారికి, నిర్మాత‌ల‌కు థాంక్స్‌’’ అన్నారు. 


ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్ క‌మ‌ల్ మాట్లాడుతూ ‘‘విజయ్ రాఘవన్ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాం. సెప్టెంబ‌ర్ 17న థియేట‌ర్స్‌లో మెప్పించ‌డానికి రాబోతున్నాం. ప్రేక్ష‌కులు సినిమాను స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాం’’ అన్నారు. 


హీరోయిన్ ఆత్మిక మాట్లాడుతూ ‘‘మంచి సినిమాలను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తారు. అలాంటి ఓ మంచి మూవీ విజ‌య రాఘ‌వ‌న్ సెప్టెంబ‌ర్ 17న మీ ముందుకు రాబోతుంది. సినిమాను థియేట‌ర్స్ చూసి విజ‌యాన్ని అందించండి. సినిమా త‌ప్ప‌కుండా మిమ్మ‌ల్ని మెప్పిస్తుంది’’ అన్నారు. 


హీరో విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ ‘‘‘కిల్లర్’ సినిమా తర్వాత ప్యాండ‌మిక్ కార‌ణంగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను క‌లుసుకునే అవ‌కాశ‌మే లేకుండా పోయింది. ఈ గ్యాప్ త‌ర్వాత విజ‌య రాఘ‌వన్ వంటి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌టం హ్యాపీగా ఉంది. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ఆనంద కృష్ణ‌న్ సినిమాను తెర‌కెక్కించారు. ఆయ‌న ఇంత‌కు ముందు మెట్రో అనే సినిమాను తెర‌కెక్కించారు. చాలా మంచి ద‌ర్శ‌కుడు. విజ‌య రాఘ‌వ‌న్ సినిమాను నిర్మించిన రాజాగారు, క‌మ‌ల్‌గారు, ప్ర‌దీప్‌గారికి, ధ‌నంజ‌య‌న్‌గారికి ఇత‌రుల‌కు థాంక్స్‌. బాగా ఖ‌ర్చు పెట్టి ఓ మంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేశారు. అలాగే తెలుగులో సినిమాను విడుద‌ల చేస్తున్న శ్రీక‌రి ఫిలింస్ ర‌విచంద్రా రెడ్డి, శివారెడ్డిల‌కు థాంక్స్‌, అభినంద‌న‌లు. ఓ ఎడిట‌ర్‌గా కూడాఈ సినిమాను చాలా సార్లు చూశాను. సినిమాలో చాలా ఎమోష‌న్స్ ఉన్నాయి. ప్రేక్ష‌కుల‌ను సినిమా డిస్పాయింట్ చేయ‌దు. బిచ్చ‌గాడు ఓ అమ్మ‌క‌థ అయితే, విజ‌య రాఘ‌వ‌న్ ఓ అమ్మ క‌ల‌ను నేర‌వేర్చే చిత్రం. అంద‌రూ మీ ఫ్యామిలీతో క‌లిసి చూడొచ్చు. నివాస్ ప్ర‌స‌న్న అద్భుత‌మైన సంగీతాన్నిఅందించారు. త‌న‌తో మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని అనుకున్నాను. రామ‌చంద్ర‌రాజుగారికి థాంక్స్‌. భాష్య‌శ్రీగారు మంచి సంభాష‌ణ‌లు, పాట‌లు అందించారు. సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది’’ అన్నారు. 



న‌టీన‌టులు:

విజయ్‌ ఆంటోని, ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు 


సాంకేతిక వ‌ర్గం:

రచన, దర్శకత్వం: ఆనంద కృష్ణన్‌

నిర్మాతలు: టి.డి.రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌

 సహ నిర్మాతలు: కమల్ బోరా, లలిత ధనంజయన్‌, బి.ప్రదీప్‌, పంకజ్‌ బోరా, ఎస్‌.విక్రమ్‌ కుమార్‌

సినిమాటోగ్రఫీ: ఎన్‌.ఎస్‌.ఉదయ్‌కుమార్‌

మ్యూజిక్‌: నివాస్‌ కె.ప్రసన్న

ఎడిటర్‌: లియో జాన్‌ పాల్‌

Maro Prasthanam Heroine Muskan Seth Interview

 నేను ఛాలెంజ్ గా తీసుకుని చేసిన సినిమా "మరో ప్రస్థానం" - హీరోయిన్ ముస్కాన్ సేథి




"పైసా వసూల్", "రాగల 24 గంటల్లో" చిత్రాల్లో నటించి తన అందంతో, అభినయంతో ఆకట్టుకున్న అందాల కథానాయిక ముస్కాన్ సేథి. సినిమాలతో పాటు బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లో నటించి మెప్పించిన ముస్కాన్ సేథి "మరో ప్రస్థానం" సినిమాలో తనీష్ సరసన నటించింది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీని జానీ తెరకెక్కించారు. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. "మరో ప్రస్థానం" చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ఈ నెల 24న "మరో ప్రస్థానం" మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా..


* హీరోయిన్ ముస్కాన్ సేథి మాట్లాడుతూ*... మరో ప్రస్థానం మూవీ నాకు వెరీ వెరీ స్పెషల్ మూవీ. కొన్ని సీన్స్ లో లెంగ్తీ డైలాగులు ఉండేవి. కొన్ని రోజులు డే అండ్ నైట్ షూట్ కూడా చేయడం జరిగింది. ఇది ఒక ఎమోషనల్ ఫిల్మ్. ఇందులో నేను యాక్షన్ సీన్స్ లో కూడా నటించడం జరిగింది. ఫస్ట్ టైమ్ ఇటువంటి క్యారెక్టర్ చేయడం వలన నాకు చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. అయితే.. డైరెక్టర్ జానీ సార్ చాలా బాగా హెల్ప్ చేశారు. డైలాగుల విషయంలో ప్రామిటింగ్ చెప్పడం.. కొన్ని సీన్స్ లో ఎలా నటించాలో యాక్ట్ చేసి చూపించడం.. జరిగింది. 


జానీ సార్ అలా ప్రతిదీ డీటైల్ గా చెప్పడం వలనే నేను ఈ క్యారెక్టర్ ను చేయగలిగాను. ఈ సందర్భంగా జానీ సార్ కి మనస్పూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ కథ విషయానికి వస్తే.. రఫ్ అండ్ రగ్గడ్ ఫిల్మ్. ఇది చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. మరో విషయం ఏంటంటే.. ఈ కథ అంతా ఒక రోజులోనే జరుగుతుంది. ప్రతి సీన్ చాలా రియలిస్టిటిక్ గా ఉంటుంది. ఫైట్ మాస్టర్ శివ గారి నేతృత్యంలో షూట్ చేసిన యాక్షన్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. ఆయన మా అందర్నీ చాలా బాగా గైడ్ చేశారు. టోటల్ గా చెప్పాలంటే.. ఈ సినిమా అనేది నాకు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. ఖచ్చితంగా ఆడియన్స్ కి మరో ప్రస్థానం నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. అన్నారు.

Sai Raam Shankar, SS Murali Krishna’s Resound First Look Out

 Sai Raam Shankar, SS Murali Krishna’s Resound First Look Out



Hero Sai Raam Shankar who took some break is making comeback with a proper commercial film being directed by debutant SS Murali Krishna. Rashi Singh is playing the female lead, while Aravind Krishna will be seen in a vital role.


Today, on the occasion of Sai Raam Shankar’s birthday, title and first look poster of the movie have been unveiled. The film gets a powerful and mass-appealing title- Resound. Star directors Gopichand Malineni and Bobby have launched the first look poster and wished the entire team all the luck.


Coming to first look poster, Saai Ram Shankar can be seen sitting in a chair and smoking a beedi, after a heavy action with cops in a police station. The poster looks as powerful as the title. This indeed indicates Saai Ram Shankar’s action-packed role in the film tipped to be an out and out action entertainer.


A joint production venture of J. Suresh Reddy B Ayyappa Raju and NVN Raja Reddy, Resound will comprise an ensemble cast in important roles. It is being made under the banners of Sri Amuratha Harini Creations, Sri Saranam Ayyappa Creations and Real Reel Arrts.


Cinematography and music are handled by Saiprakash Ummadisingu and Sweekar Agasthi respectively. Sagar.u is the editor of the movie which is done with its shoot and post-production works are underway.


Cast: Sai Raam Shankar, Rashi Singh, Aravind Krishna, Posani Krishna Murali, Ajay Gosh, Kasi Vishwanath, Adhurs Raghu, Pinky (Sudeepa), Venu, Lavanya Reddy, Pawan Suresh, Raja Reddy, Yamini, Srinivas Sagar, Manivardhan etc.


Technicians:

Director - SS Murali Krishna

Producers: J. Suresh Reddy B Ayyappa Raju and NVN Raja Reddy

Banners: Sri Amuratha Harini Creations, Sri Saranam Ayyappa Creations and Real Reel Arrts

DOP - Saiprakash Ummadisingu

Music - Sweekar Agasthi

Editor - Sagar.u

Stunts - Stunt Naba - Shivaraj Master

Choreography - Vijay Pollaki

Lyrics - Rehman

Art - Vijay Krishna

Designs - Sudhir

PRO – Vamsi-Shekar

Naa Chelive From Chakori Out Now

 Naa Chelive From Chakori Out Now



Here comes the first melody from Chakori. Titled Naa Chelive, this soothing melody is crooned by the man in form, Sid Sriram.


Naa Chelive is powered by a Leander Lee's pleasant composition and Sid Sriram's soulful vocal renditions. The lyrics are deep and meaningful as well.


Chakori is directed by Satya Dhanekula and produced by Devi Satyanarayana.


Chakori has Noel Sean, Mehaboob, and Sumeeta Bajaj in the lead roles.


Production: Aasta Cine Creation

Producer: Devu Satyanarayana

Written & Director: Satya Dhanekula  

Starring: Noel Sean, Mehaboob, Sumeeta Bajaj

Music: Leander Lee

Editor: Kranthi

DOP: Prashanth Neelam

PRO: Eluru Srinu, Meghasyam

Gully Rowdy Trailer Launched By Megastar Chiranjeevi

 మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేసిన ‘గ‌ల్లీ రౌడీ’ ట్రైల‌ర్‌.. సెప్టెంబ‌ర్ 17న సినిమా గ్రాండ్ రిలీజ్‌



కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత సినిమా థియేట‌ర్స్‌లో చాలా సినిమాలు వ‌చ్చాయి. ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాయి. అయితే మేం ఏకంగా న‌వ్వులతో సెప్టెంబ‌ర్ 17న‌ దాడి చేయ‌బోతున్నాం అని అంటున్నారు ‘గ‌ల్లీరౌడీ’ అండ్ టీమ్‌. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో  కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్  కోన వెంక‌ట‌న్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లే అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్ట‌ర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మించారు.  


 ప‌క్కా హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా అన్ని ఎలిమెంట్స్ ఉన్న విందుభోజ‌నంలా ప్రేక్ష‌కుల‌ను సంతోష‌పెట్ట‌డానికి సెప్టెంబ‌ర్ 17న మీ ద‌గ్గ‌రున్న థియేట‌ర్స్‌లో గ‌ల్లీరౌడీ సంద‌డి మొద‌లు కానుంది. ఈ న‌వ్వుల సంద‌డికి శాంపిల్ ఎలా ఉంటుందో చూపించడానికి మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. 

‘‘నీకు తెలిసిన రౌడీ ఎవ‌రైనా ఉన్నారా? అని వైవా హ‌ర్ష‌ను హీరోయిన్‌ అడిగితే నా ఫ్రెండే పెద్ద రౌడీ అనే డైలాగ్‌తో ట్రైల‌ర్ మొద‌ల‌వుతుంది. 
సందీప్ కిష‌న్ ప‌రిచయం ఓ రేంజ్‌లో ఎంట‌ర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది. అదే హీరోయిన్ ‘ఇత‌ను నిజంగానే రౌడీనా?’  అని ప్ర‌శ్నిస్తే.. ‘రోజూ  పులిగోరు అవీ ఇవీ పెడ‌తావు క‌దా అవెక్క‌డ’ అంటూ వైవాహ‌ర్ష ప్ర‌శ్నించ‌డం దానికి బ‌దులుగా సందీప్ ‘మొదటిసారి కాఫీషాప్‌కు వ‌స్తున్నా క‌దా, కాస్త క్లాస్‌గా ఉందామని’ అని బ‌దులిస్తాడు. దానికి రివ‌ర్స్‌గా వైవా హ‌ర్ష ‘ఏసుకోరా రౌడీ అంటే ఎవ‌రూ న‌మ్మ‌ట్లేదు’ అని చెప్పే డైలాగ్‌తోనే హీరో క్యారెక్ట‌ర్ ఏంటి?  త‌ను ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఫేస్ చేస్తున్నాడ‌నే విష‌యం రివీల్ అవుతుంది. 

హీరోయిన్ నేహాశెట్టి ప్రేమలో హీరో ఆమె వెంటపడటం.. 
‘వాడు రౌడీ.. వాళ్ల నాన్న రౌడీ... వాళ్ల తాత రౌడీ.. ’ అంటూ హీరో గురించి హీరోయిన్ బిల్డప్ ఇవ్వడం 
రౌడీలను సందీప్ కిషన్ చితక్కొట్టడం

‘పోలీసులు నాపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తే నాకు పాస్‌పోర్ట్ కూడా రాదు క‌దా.. ’అని సందీప్ కిష‌న్ అంటే ‘ఒక్క పాస్ పోర్ట్ ఏంటి?  రేష‌న్ కార్డ్ కూడా రాదు’ అంటూ వైవా హ‌ర్ష చెప్పే డైలాగ్ వింటే హీరోకి రౌడీ కావ‌డం కంటే బ‌య‌ట దేశాల‌కు వెళ్లాల‌నే డ్రీమ్ ఉండ‌టం. కానీ ప్రేమ కోసం రౌడీ మారుతాడ‌నే సంగ‌తి అర్థ‌మ‌వుతుంది. 
బాబీ సింహ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. త‌ను రౌడీల‌ను ఎన్‌కౌంటర్ చేయ‌డం 
కామెడీ కోణంలో సాగే రాజేంద్ర ప్ర‌సాద్‌, స‌హా ప్ర‌తి పాత్ర ఎంట‌ర్‌టైనింగ్‌లోనే సాగుతుంది’’



ట్రైలర్‌లోనే ఈ రేంజ్ కామెడీ  ఉంటే, ఇక సినిమా ఎలా ఉండ‌బోతుందోన‌నే ఆస‌క్తి ప్రేక్ష‌కుల్లో క్రియేట్ చేసేలా ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా, ఎంట‌ర్‌టైనింగ్‌గా క‌నిపిస్తుంది. న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఇందులో ఇంపార్టెంట్ రోల్‌ను పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ కీలక పాత్రలో నటించారు. 


న‌టీన‌టులు: 
సందీప్ కిష‌న్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, బాబీ సింహ, నేహా శెట్టి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, వైవా హ‌ర్ష‌, త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, ఎం.వి.వి.సినిమా
స‌మ‌ర్ప‌ణ‌: కోన వెంక‌ట్‌
ద‌ర్శ‌క‌త్వం: జి.నాగేశ్వ‌ర్ రెడ్డి
నిర్మాత‌: ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌
స‌హ నిర్మాత‌:  జి.వి
సంగీతం: చౌర‌స్తా రామ్‌, సాయికార్తీక్‌
స్క్రీన్ ప్లే: కోన వెంక‌ట్‌
క‌థ‌: భాను
ఎడిట‌ర్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌
స్టైలిష్ట్‌: నీర‌జ కోన‌
పి.ఆర్‌.ఒ: వంశీ కాకా