Latest Post

Ishan, Varalaxmi Sharathkumar, Ramana Gopisetti, RES Entertainment LLP’s Pan India Film Tatvamasi Concept Poster Out

 Ishan, Varalaxmi Sharathkumar, Ramana Gopisetti, RES Entertainment LLP’s Pan India Film Tatvamasi Concept Poster Out



Writer Ramana Gopisetti is all set to debut as director with a high intense action and thrilling drama that will feature Ishan of Rogue movie fame and Varalaxmi Sharathkumar playing the lead roles. Title and concept-centric motion poster of the film are out now.


The film gets an intense title- Tatvamasi. It’s a Sanskrit mantra from the Advaita tradition, typically translated as “I am that”. Tatvamasi is one of the four principle Mahavakyas from the ancient Hindu text, The Upanishads. It is used to refer to the unity of Atman (the individual self or soul) with Brahman (universal consciousness or the Absolute).


As the title suggests, Tatvamasi is going to be a larger-than-life film with a unique plot. The concept poster is as intriguing as the title. It is designed as Kundali (Horoscope) with blood marks on title logo.


The motion poster gives more info about the film and it’s plotline. “Never Before In The History Of Mankind. The Ceaseless Power. The Boundless Emotion. Get Ready To Witness The Euphoria Of Vengeance,” reads the statements in motion poster. Sam CS’s vivacious music for the motion poster augments the inquisitiveness on the project.


Tatvamasi is a Pan India project to be made in Telugu, Tamil, Malayalam and Hindi languages.


All set to go on floors soon, Tatvamasi is sure to leave people awestruck with its new age story. Veteran actor PrakashRaj is roped in for a spectacular character and Harish Uthaman is also playing an important role.


Radhakrishna.Telu produces the movie under his RES Entertainment LLP. Sam CS composes tunes and background score, while Shyam K Naidu is the lensman. Marthand K Venkatesh is the editor. India’s leading stunt director Peter Hein master is zeroed in for the film, while Chandrabose pend lyrics.


The details of the other cast and crew will be revealed soon by makers.


Cast: Ishan, Varalaxmi Sarathkumar, Prakash Raj, Harish Uthaman


Technical Crew:

Writer & Director: Ramana Gopisetti

Producer: Radhakrishna.Telu

Banner: RES ENTERTAINMENT LLP.

Music: Sam CS

DOP: Shyam K Naidu

Editor: Marthand K Venkatesh

Lyrics: Chandrabose

Stunts: Peter Hein

PRO: Vamsi-Shekar


Aadhi Pinisetty, Akansha Singh, Prithivi Adithya’s Clap Teaser From September 6

 Aadhi Pinisetty, Akansha Singh, Prithivi Adithya’s Clap Teaser From September 6



Clap is the most challenging project for hero Aadhi Pinisetty who will be seen as an athlete. The sports drama is being directed by Prithivi Adithya and produced jointly by Ramanjaneyulu Javvaji (Sarvanth Ram Creations) and M Rajasekhar Reddy (Shri Shirdi Sai Movies) presented by IB Karthikeyan (Big Print Pictures)


The film’s teaser will be out on September 6th and the poster sees Aadhi Pinishetty gearing up for a sprit on big competition. Aadhi looks apt as a sprinter here. As the Olympics just got over India has performed well, it’s a right time for the release of the film’s teaser.


Aadhi was on a rigorous training program to turn into a sprinter. The Tamil-Telugu bilingual has music by maestro Ilaiyaraaja, while Praveen Kumar handles cinematography. Akansha Singh is the leading lady, while Krisha Kurup, Prakash Raj, Nasser, Brahmaji, Mime Gopi and Munishkanth will be seen in curial parts.


Clap has already completed its shooting and the film is getting ready for release.


Cast: Aadhi Pinisetty, Akansha Singh, Krisha Kurup, Prakash Raj, Nasser, Brahmaji, Mime Gopi and Munishkanth


Technical Crew:


Writer & Director: Prithivi Adithya

Producers: Ramanjaneyulu Javvaji and M Rajasekhar Reddy

Banners: SarvanthRam Creations & Shri Shirdi Sai movies

Presented by : IB Karthikeyan (BIG PRINT PICTURES)

Music: Maestro Ilayaraaja

DOP: Praveen Kumar

Dialogues: Vanamaali

Art: Vairabalan & S Haribabu

Editor: Ragul

PRO: Vamsi-Shekar


Kalyan Dev Movie Launched Grandly

 తుల‌సివ‌నం లో శ్రీవెంక‌టేశ్వ‌ర స్వామి వారి స‌న్నిధిలో మోనిష్ ప‌త్తిపాటి నిర్మాత‌గా క‌ళ్యాణ్‌ దేవ్ హీరోగా MP ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా ప్రారంభం..



'విజేత' లాంటి క్లాసిక్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్లో మంచి  గుర్తింపు సంపాదించుకున్న కళ్యాణ్ దేవ్ హీరోగా..  క‌థ కంచికి మ‌నం ఇంటికి లాంటి క‌మ‌ర్షియ‌ల్ చిత్రాన్ని నిర్మించిన ఎం పి ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నిర్మాత మోనిష్ ప‌త్తిపాటి నిర్మాత‌గా, ద‌త్తి సురేష్ బాబు క్రియెటివ్ ప్రోడ్యూస‌ర్ గా  ఎం కుమార‌స్వామి నాయిడు ద‌ర్శ‌కుడిగా నిర్మిస్తున్న చిత్రం ఈరోజు కూక‌ట్‌ప‌ల్లి లోని తుల‌సివ‌నం లోని శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి వారి టెంపుల్ లో పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది.  ఈ  ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. అక్టోబర్ చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. YS కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు గౌతి హరినాథ్ నిర్మాణ నిర్వహణ చూసుకుంటున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.


నటీనటులు: కళ్యాణ్ దేవ్


టెక్నికల్ టీమ్:

దర్శకుడు: M కుమారస్వామి నాయుడు

బ్యానర్: MP ఆర్ట్స్

నిర్మాత: మోనిష్ పత్తిపాటి

క్రియేటివ్ ప్రొడక్షన్స్: దత్తి సురేష్ బాబు

నిర్మాణ నిర్వహణ: గౌతి హరినాథ్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుభాష్ దేవబత్తిని

DOP : YS కృష్ణ

PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Kichcha Sudeepa Vikrant Rona First Glimpse

 Vikrant Rona First Glimpse: Kichcha Sudeep is the lord of the dark in this spine chilling First Glimpse 



Kichcha Sudeepa-starrer Vikrant Rona was the first mega-budget films to have hit the floors in the early days of the pandemic and the anticipation for its release scales up with each announcement from its makers. On the occasion of superstar's birthday, the makers drop an exciting First Glimpse that is sure to incite goosebumps among viewers. The glimpse follows the narration of a world that sees the entry of Vikrant Rona striking fear into his his enemies heart. The visuals complement Kichcha Sudeep’s swag who is called the lord of the dark by the narrator. Aptly titled ‘The Deadman’s Anthem’ the first glimpse is sure to take the expectations for the film a few notches higher.  



Director Anup Bhandari says, "I am very happy that we got to celebrate Sudeepa sir's birthday with ‘Deadman’s Anthem’ first glimpse reveal of Vikrant Rona. Vikrant rona is a mysterious character and the first glimpse captures that. While making the film, I was aware of its humongous scale, but Sudeepa sir's embodiment of the titular hero has elevated it even further. Happy birthday to him.” 



Producer Jack Manjunath says, “We wish Sudeepa sir the warmest birthday wishes with the First Glimpse of Vikrant Rona. It's incredible and we're raring to go on such a positive note. His energy, passion and his will to make cinema that's big enough to withstand the test of time is what makes Vikrant Rona special.” 



Vikrant Rona is a multilingual action adventure that will see a 3-D release in 14 languages and 55 countries. Directed by Anup Bhandari, produced by Jack Manjunath and Shalini Manjunath, co-produced by Alankar Pandian, music by B Ajaneesh Loknath, the film features sets designed by Award winning art director Shivkumar and frames lit up by DOP William David. It stars Kichcha Sudeepa, Nirup Bhandari, Neetha Ashok and Jacqueline Fernandez.


Pawan Kalyan Surender Reddy SRT Films Movie Update

 పవన్ కళ్యాణ్ , సురేందర్ రెడ్డి ల కాంబినేషన్ లో ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్ చిత్రం అధికారిక ప్రకటన 



పవన్ కళ్యాణ్  హీరోగా యువ నిర్మాత రామ్ తాళ్లూరి 

ఓ  చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. దీనికి సంబంధించి ఎస్ ఆర్ టి ఎంటర్ టెన్నెంట్ సంస్థ  చిత్రం విషయమై అధికారిక ప్రకటన ఈ రోజు విడుదల చేస్తూ పవన్ కళ్యాణ్ గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రచార చిత్రాన్ని గమనిస్తే .. ఓ వైపు తుపాకి, "యధా కాలమ్.. తధా వ్యవహారం" అన్న పదాలు కనిపిస్తాయి. నగర వాతావరణం అగుపిస్తుంది. కథా బలం స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ తమ 9 వ చిత్రం గా ప్రకటించిన ఈ చిత్రానికి 

వక్కంతం వంశి రచయిత.

Pawan Kalyan Harish Shankar Movie Poster Revealed

 పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల కాంబినేషన్లో 

మైత్రి మూవీ మేకర్స్ సినిమా ప్రచార చిత్రం విడుదల



పవన్ కళ్యాణ్ కథానాయకుడు గా ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ లు కాంబినేషన్లో గతంలో రూపొందిన 'గబ్బర్ సింగ్' ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందో, ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ ను రిపీట్ చేస్తోంది ఈ సంస్థ. 

నేడు పవన్ కళ్యాణ్ గారు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రానికి సంబంధించి ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ ప్రచార చిత్రాన్ని గమనిస్తే.... ఆధునిక వాహనం పై పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా కూర్చుని ఉండటం కనిపిస్తుంది. అయితే పవన్ కల్యాణ్ ను పూర్తిగా చూపించకుండ ఉండటాన్ని ప్రీ లుక్ గా భావించాలని చిత్ర బృందం చేసిన ప్రయత్నం హర్షించదగ్గది. అయినా ప్రచార చిత్రం యువతను కిర్రెక్కిస్తోంది. అభిమాన యువతలో మరో బ్లాక్ బస్టర్ చిత్రం 'జాతర షురూ' అన్న ఆనందాలు వెల్లువెత్తుతున్నాయి. 

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అయాంక బోస్ ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తున్నారు. కళా దర్శకుడు గా ఆనంద సాయి, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్, పోరాటాలు రామ్ లక్ష్మణ్ పేర్లు ప్రధాన సాంకేతిక నిపుణులుగా ఈ ప్రచారచిత్రం లో కనిపిస్తాయి. 

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ లు నిర్మాతలు. 

Hari Hara Veeramallu Birthday Wishes to Pawan Kalyan

హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు"



"హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు" 2022 ఏప్రిల్ 29 న విడుదల

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రచారచిత్రం విడుదల

పవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న మాగ్న‌మ్ ఓప‌స్ ఫిల్మ్‌ 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'.‘నిధి అగర్వాల్‘ నాయిక. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


నేడు చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రంను విడుదల చేశారు చిత్ర బృందం. ఈ ప్రచార చిత్రంలో"హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు" 2022 ఏప్రిల్ 29 న విడుదల అన్న విషయాన్ని స్పష్టం చేశారు. 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్య‌ద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ"హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు" సినిమా  రూపొందుతోంది. పాన్‌-ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌,  మ‌ల‌యాళంభాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ యాభై శాతం పూర్త‌యింది. త్వరలో చిత్రం నూతన షెడ్యూల్ ప్రారంభం అవుతుందని నిర్మాత‌ ఎ.ద‌యాక‌ర్ రావు తెలియచేశారు.ఈచిత్రానికి అగ్ర‌శ్రేణి సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి సంగీత బాణీలు అందిస్తుండ‌గా, పేరుపొందిన సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధ‌వ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు సమకూరుస్తున్నారు. 


క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో మెగాసూర్యా ప్రొడ‌క్ష‌న్‌ బ్యాన‌ర్‌ పై నిర్మాత‌ ఎ.ద‌యాక‌ర్ రావు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.


పీఆర్వో: ల‌క్ష్మీ వేణుగోపాల్‌.

‘Bheemla Nayak’ Title song Release

 BHEEMLA NAYAK FIRST SINGLE RELEASE



‘Bheemla Nayak’ Title song release.


Esteemed Director Krish released the song through his twitter account. *Ramajogayya Sastry penned the lyrics describing ‘Bheemla Nayak’s’ character. A mesmerizing tune composed by Thaman.


Pawan Kalyan and Rana Daggubati starrer ‘Bheemla Nayak’ is being produced by Sithara Entertainments. Screenplay and dialogues are given by Ace Writer-Director ‘Trivikram’ while ‘Survyadevara Naga Vamsi’ is producing the film which is being Directed by ‘Saagar K Chandra’.


Bheemla Nayak’s first single was released today on the occasion of Pawan Kalyan’s birthday by renowned Director ‘Krish’ through his twitter account. Director Krish expressed his joy on having the opportunity to release such a striking song on the occasion of Pawan Kalyan’s birthday.


This song stands for the bravery and strength of Bheemla Nayak. Every word in the song portrays Bheemla as fierce as a lion’s roar for the bad guys. The song resonates Bheemla’s ferocity and sincerity towards his duty as a cop. The song explains the heroics of his character in plain and simple terms.


The character dynamics of Bheemla Nayak is penned down by renowned lyricist Ramajogayya Sastry. His words about this song, “My association with Shree Trivikram is a unique one, Being a great writer himself, gives a lot of support to any lyricist like me. It is through him that I wrote a song for Pawan Kalyan for the first time in the film ‘Jalsa’. Even though I have written many songs for him later on, writing this title song was a unique experience. It was not just about working with the two people I like the most.. But unveiling my song in their presence gave me utmost happiness. Witnessing their response while listening to the song is an unforgettable experience. Being a literary expert himself, to know that Shree Pawan Kalyan liked each and every word of this song makes me feel proud. My heartfelt thanks to Shree Trivikram, Saagar Chandra and Thaman for being the pivotal contributors of this film.”, he says.


Producer Suryadevara Naga Vamsi said that his banner is producing this film with great ambition. He also said that the film is set to release on 12 January 2022.


Nithya Menen and Aishwarya Rajesh are acting alongside Pawan Kalyan and Rana Daggubati respectively. Renowned actors like Rao Ramesh, Murali Sharma, Samuthirakani, Raghu Babu, Narra Srinu, Kadambari Kiran, Chitti, Pammi Sai are playing important characters in this movie.


 


 Dialogues, Screenplay: Trivikram Cinematographer: Ravi K. Chandran (ISC) Music: Thaman.S


Editor: Navin Nooli


Art: A.S.Prakash


VFX Supervisor: Yugandhar.T


P.R.O: Lakshmi Venugopal


Presenter: P.D.V. Prasad


Producer: Suryadevara Naga Vamsi Director: Saagar K. Chandra


Director Sushanth Reddy Interview About Dear Megha

 "డియర్ మేఘ" చూశాక ప్రతి పాత్ర గుర్తుపెట్టుకుంటారు. - దర్శకుడు సుశాంత్ రెడ్డి



కొత్త తరహా ప్రేమ కథతో డియర్ మేఘ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సుశాంత్ రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 3న శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. డియర్ మేఘ సినిమాలో మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజులు హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ భావోద్వేగ ప్రేమ కథ గురించి, చిత్ర పరిశ్రమలో తన ప్రయాణం గురించి దర్శకుడు సుశాంత్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడారు. ఆయన చెప్పిన విశేషాలు చూస్తే...


- నేను గతంలో సూపర్ స్టార్ కిడ్నాప్ అనే చిత్రాన్ని రూపొందించాను. డియర్ మేఘ దర్శకుడిగా నాకు రెండో సినిమా. మీ అందరిలాగే నాకూ సినిమాల మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇష్టంతోనే చదువులు పూర్తయ్యాక.. ముంబైలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాను. ఆ కోర్సు పూర్తి చేసుకుని టాలీవుడ్ వచ్చి ఫస్ట్ మూవీ సూపర్ స్టార్ కిడ్నాప్ కి దర్శకత్వం వహించాను. ఆ సినిమాకు నిర్మాణ బాధ్యతలు కూడా నేనే వహించాను.


- ఈ సినిమా ప్రొడ్యూసర్ అర్జున్ దాస్యన్ తో స్క్రిప్టు డిస్కషన్స్ జరిగాయి. మేము రెండు మూడు స్క్రిప్టులు అనుకుంటే, నిర్మాత అర్జున్ కు డియర్ మేఘ కథ నచ్చింది. అలా ఈ ప్రాజెక్ట్ టేకాఫ్ అయ్యింది. డియర్ మేఘ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరి. మజిలీ, నిన్ను కోరి లాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరిస్ ను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. అలా సేఫ్ జానర్ అని నమ్మి ఈ కథతో సినిమా చేశాం.


- ఒక అబ్బాయి అమ్మాయిని డియర్ మేఘ అని పిలుస్తాడు. అలా ఎందుకు పిలుస్తాడు అనేది థియేటర్ లో చూడాలి. ఇక ఈ సినిమా కథ గురించి ఎక్కువగా చెప్పాలని అనుకోవడం లేదు. బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే ఆ ఎమోషన్ ఫీల్ అవుతారు. ఇప్పుడు చెబితే ఆ ఇంట్రెస్ట్ పోతుంది.


- కథ అనుకున్నాక మా మనసులోకి వచ్చిన ఫస్ట్ హీరోయిన్ మేఘా ఆకాష్. తనే ఈ కథను, క్యారెక్టర్ ను జస్టిఫై చేయగలదు అని నమ్మాం. ఆమెకు కథ చెప్పగానే వెంటనే ఓకే చేస్తానని ముందుకొచ్చింది. మేఘ క్యారెక్టర్ లో తను బెస్ట్ పర్మార్మెన్స్ ఇచ్చింది. ఇప్పటిదాకా ఆమె చేసిన సినిమాల్లో ఇదే గొప్ప నటన అంటారు. అలాగే ఆదిత్ అరుణ్ కూడా తన బెస్ట్ పర్మార్మెన్స్ ఇచ్చాడు. మేఘ, అరుణ్ ఇద్దరి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది.


- ఒక అమ్మాయి కోణంలో వస్తున్న ప్రేమ కథ ఇది. మేఘ అనే అమ్మాయి టీనేజ్ నుంచి అడల్ట్ వరకు తన జీవితంలో జరిగిన లవ్ ఇన్సిడెంట్స్ ఎమోషనల్ గా చెప్పే చిత్రమిది. అమ్మాయి కోణంలో ఒక ప్రేమ కథ తెరకెక్కించడం ప్రేక్షకులకు కొత్తదనాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం. మొత్తం సినిమా అంతా నటీనటుల పర్మార్మెన్స్ ల మీద ఆధారపడి ఉంటుంది. ఇదే డియర్ మేఘ సినిమాలో ఛాలెంజింగ్ గా అనిపించింది. ముగ్గురు లీడ్ యాక్టర్స్ మేఘ, అరుణ్, అర్జున్ సోమయాజులు పర్ ఫెక్ట్ గా నటించారు. ఈ క్యారెక్టర్స్ వీళ్లే చేయాలని అనుకున్నాం కాబట్టి ఔట్ పుట్ అనున్నట్లు వచ్చింది. 


- ప్రేమ కథలకు సంగీతం ప్రాణం అనుకోవచ్చు. డియర్ మేఘకు హరి గౌర బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నేపథ్య సంగీతం కూడా అంతే అందంగా ఉంటుంది. సినిమా రిలీజ్ అయ్యాక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను కాలర్ ట్యూన్స్ గా పెట్టుకుంటారు.


- డియర్ మేఘ చిత్రాన్ని బెంగళూరు, చెన్నైలో కూడా రిలీజ్ చేస్తున్నాం. నా మొదటి చిత్రానికి చాలా విషయాలు నేర్చుకున్నాను. సూపర్ స్టార్ కిడ్నాప్ నుంచి డియర్ మేఘకు ఐదేళ్ల గ్యాప్ వచ్చింది. నెక్ట్ సినిమాకు కథలు రెడీ చేసుకుంటున్నా. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాను.

Avasarala Srinivas Interview About 101 Jillala Andagadu

 నూటొక్క జిల్లాల అందగాడు చూసి... ఒక్కరు మారినా సంతోషిస్తా

- అవసరాల శ్రీనివాస్‌ 



*నూటొక్క జిల్లాల అందగాడు గురించి చెప్పండి?

- మనకి గుర్తున్నట్టయితే, ఈ సినిమా 2019 అక్టోబర్‌లో ఓపెన్‌ చేశాం. అప్పటికి హిందీలో బాలా రాలేదు. అయితే బాలా వస్తోందని, ఆ సినిమాతో పోటీ పడి చేసి రిలీజ్‌ చేద్దామనుకున్నాం. కానీ కుదర్లేదు. బాలాకి కూడా హిందీలో ఉజ్డా చమన్‌  పోటీకొచ్చింది. ఇన్నిటి మధ్య  పోటీ పడలేమని ఏప్రిల్‌లో వద్దామనుకున్నాం. మార్చిలో లాక్‌డౌన్‌ వచ్చేసరికి పోస్ట్ పోన్‌ అయింది. అందుకే మనం ఇప్పుడు వస్తున్నాం.

* బాలా చూశారా మీరు?

- బాలా వచ్చినప్పుడు వెళ్లి చూశాను. అయితే ఆ సినిమా చూశాక, నూటొక్కజిల్లాల అందగాడులో  మార్పులు చేయలేదు. మనల్ని మనం ఉన్నదున్నట్టుగా యాక్సెప్ట్ చేయాలనే విషయంలో మాత్రం రెండు సినిమాల్లోనూ సిమిలారిటీ కనిపిస్తుందేమో. అంతకు మించి దేనికదే సెపరేట్‌గా ఉంటుంది. అందుకే, చేంజెస్‌ అవసరం లేదనుకున్నా. కానీ బాలా కన్నా ముందు ఈ సినిమా వచ్చి ఉంటే బావుండేది. ఇప్పుడు అందరూ ఒరిజినలా కాదా? అని అడుగుతున్నారు.

* ఈ కథకి ఇన్‌స్పిరేషన్‌ ఏంటి? 

- కథకి ఇన్‌స్పిరేషన్‌ అంటూ ఏమీ లేదు. మన సొసైటీలో కాస్త కలర్‌ తక్కువగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా... కామెడీ చేస్తుంటారు. ఒకసారి నేనొక పెళ్లికెళ్తే.. పెళ్లికొడుకు ఎంత అసహ్యంగా ఉన్నారో పెళ్లి కూతురు వాళ్లు పాడుతున్నారు. ఇటువారు అమ్మాయి గురించి పాడుతున్నారు. మన సొసైటీలో బాడీ షేమింగ్‌ ఎప్పటినుంచో ఉంది. ఇది కొంతమంది కాన్పిడెన్స్ దెబ్బతీస్తుంది.  కొందరు ఎఫెక్ట్ అయినవాళ్లున్నారు. నిజానికి బట్టతల అనేది కాన్ఫిడెన్స్ దెబ్బతీయాల్సిన విషయం కాదు.

* క్రిష్‌తో ఎలా అసోసియేట్‌ అయ్యారు?

- కథను ఒకసారి క్రిష్‌గారికి చెబితే బావుందన్నారు. తర్వాత 2018లో కలిసినప్పుడు 'ఆ కథ చెప్పావు బావుంది... టీవీల్లోనూ ఇది కరెక్ట్ కాదని చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు చేద్దాం' అన్నారు. సరేనని చేశాం.

* లడ్డూబాబు, సైజ్‌ జీరోకి రిలేటెడ్‌గా ఉంటుందా ఈ సినిమా?

- ఒక్కొక్కరి టేక్‌ ఒక్కోలా ఉంటుంది. ఈ సినిమాలో కాస్త హ్యూమర్‌ ఎక్కువగా ఉంటుంది.

* మీరు డైరక్ట్ చేయాలనుకోలేదా? 

- నేను మూడో సినిమా ఆల్రెడీ మొదలుపెట్టేశాను. అది సగంలో ఉంది. మిగిలిన సగం అమెరికాలో షూట్‌ చేయాలి. ఒక సినిమా సగంలో ఉండగా ఇంకో సినిమా డైరక్ట్ చేయడం రైట్‌ కాదనిపించింది.

* విద్యాసాగర్‌కి కథ చెప్పగానే ఏమన్నారు?

- ఆయన నా అసోసియేట్‌ డైరక్టర్‌. రాజీవ్‌రెడ్డిగారికి కథ  చెప్పినప్పుడు... ఈ కథకి విద్యాసాగర్‌ పూర్తి న్యాయం చేస్తారని చెప్పా. ఆ తర్వాత కూడా రెండు నెలలు... నేను, విద్యాసాగర్‌ డిస్కషన్స్  చేసుకున్నాం.  ఆ తర్వాతే ఆయన ఆన్‌బోర్డ్ వచ్చారు. ఆయన మంచి రైటర్‌. త్వరలోనే ఓన్‌ కథతో సినిమా చేస్తారు.

* మీ అసోసియేట్‌ అంటున్నారు. మీరే ఒక డైరక్టర్‌. ఆయనకు ఎంత వరకు ఫ్రీడమ్‌ ఇచ్చారు?

- నేను డైరక్ట్ చేసినప్పుడు కూడా నా నటులతో కొలాబరేషన్‌లాగానే ఫీలవుతాను. డైరక్టర్‌కి, యాక్టర్‌కీ ఆ కమ్యూనికేషన్‌ ఉన్నప్పుడే బావుంటుంది. సెట్లోకి నేరుగా వెళ్లి ఇప్పుడు ఏం చేయాలని అడిగితే అప్పుడు మన పర్సనాలిటీ బయటకు వస్తుందే కానీ, కేరక్టర్‌ ఎలివేట్‌ కాదు. ఇది ఆయన సినిమా. 

*క్రిష్‌కి కథ ఎప్పుడో చెప్పా అంటున్నారు... స్టేల్‌ అయ్యే ఛాన్సుల్లేవా?

- క్రిష్‌కి కథ చెప్పేటప్పుడు నేను జ్యో అచ్యుతానంద కథ రాస్తున్నా. అదే బ్యానర్‌లో సినిమా తీసి, ఇది చేద్దామనుకున్నా. దీన్ని కూడా థర్డ్ ఫిల్మ్ అయ్యాక చేద్దామని అనుకున్నా. కానీ నా మూడో సినిమా కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది.  విజిటర్స్ వీసాల మీద సినిమాలు షూట్‌ చేయడానికి లేదు. వర్క్ వీసాలు క్రూ మొత్తానికి అప్లై చేయడానికి 6-7 నెలలు పట్టింది. ఈలోగా ఖాళీగా ఉండటం ఎందుకని ఈ సినిమా చేశాం. మళ్లీ వీసాలకు వెళ్లాలని అనుకున్నప్పుడు లాక్‌డౌన్‌ వచ్చింది.

* ఈ టైటిల్‌ ఎలా చూజ్‌ చేసుకున్నారు?

- నూటొక్క జిల్లాల అందగాడు అనగానే మనకు నూతనప్రసాద్‌గారు గుర్తుకొస్తారు. నేను ఫస్ట్ రాసుకున్నప్పుడు అందమే ఆనందం అని టైటిల్‌ అనుకున్నా.  నేనిచ్చిన నాలుగు టైటిల్స్ లో ఇది క్రిష్‌కి బాగా నచ్చింది. జనాల్లో కూడా ఈ టైటిలే బాగా రీచ్‌ అయిందన్నారు. చాలా మంది కథ... చాలా మంచి కథ అని ట్యాగ్‌ లైన్‌ పెట్టుకున్నాం.

*రుహానీ శర్మను తీసుకోవడానికి రీజన్‌ ఏమైనా ఉందా?

- నేను చిలసౌ సినిమా చూశా. ఆ తర్వాత నేను వేరే కథ కోసం ఆ అమ్మాయిని చూశా. అప్పుడు వర్కవుట్‌ కాలేదు. ఈ సినిమా కోసం దిల్‌ రాజుగారి దగ్గర చెప్పిన పేర్లలో ఈ అమ్మాయి పేరు కూడా ఉంది. ఈ అమ్మాయి పేరుకు నిర్మాతలు కూడా ఓటు వేశారు.

* బట్టతల మీద తీశారు. ఎవరి మనోభావాలు దెబ్బతినవు కదండీ?

-  తినవండీ. ఇందులో ఎక్కడా ఎవరినీ కించపరచడం లేదు. అదే జరిగితే నిజంగా నేను ఫ్లాప్‌ అయినట్టే. టీజింగ్‌.... హ్యూమర్‌ కాదని చెప్పాలన్నదే నా పర్పస్‌. శిరీష్‌గారు ఎడిట్‌ రూమ్‌లో చూసి... 'నా ఫ్రెండ్స్  చాలా మంది బట్టతలల వాళ్లున్నారు. వాళ్ల మీద జోకులు వేసేవాడిని. ఇంక వేయను" అని అన్నారట. నాతో అనలేదు. పక్కవాళ్లతో అన్నారు. ఈ సినిమా చూశాక ఎవరైనా పక్కవారిని ఇంకా కామెడీ చేస్తే సినిమా సక్సెస్‌ అయినా, ఫెయిల్యూర్‌ అన్నట్టే.

* బట్టతల ఉన్నవాళ్లతో మీరేమైనా ఇంటరాక్ట్ అయ్యారా? 

- లేదండీ. నాకు నల్లగా ఉన్నవాళ్ల గురించి తెలుసు. నలుపు వేరు. బట్టతల వేరు. బట్టతల ఉన్నవాళ్లు నరకయాతన పడుతుంటారు. నేను మెసేజ్‌ చెప్పాలని అనుకోలేదు. నాకు అనిపించింది, ఎక్స్ ప్లోర్‌  చేస్తూ తీశా. అది చూసిన వాళ్లకి మెసేజ్‌లా అనిపిస్తే ఓకే. అంతేగానీ నేనేం చెప్పాలనుకోలేదు.

* ఈ సినిమాతో సొసైటీలో మార్పు వస్తుందనుకుంటున్నారా?

- ఒక్క సినిమాతోప్రపంచంలో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావు. అవేర్‌నెస్‌ స్టెప్‌ బై స్టెప్‌ బిల్డ్ అయితే బావుంటుంది.

* ఫక్తు కామెడీ సినిమానా? 

- చాలా మంది ఉన్న కామెడీ అంతా ట్రైలర్‌లో పెట్టేస్తుంటారు. సినిమాకి వచ్చిన వారు ట్రైలర్‌ కన్నా ఎక్కువ ఎంజాయ్‌  చేయాలని నా ఫీలింగ్‌. మనసులో నుంచి హ్యూమర్‌ రాకుంటే వెంటనే మర్చిపోతుంటారు. ఈ సినిమాలో ఉన్న హ్యూమర్‌ అంతా ఎమోషన్‌ నుంచి వచ్చే హ్యూమరే. లాంగ్విటీ ఉంటుందని నమ్ముతున్నా.

*ఇండస్ట్రీకి వచ్చి చాన్నాళ్లయింది. స్లోగా సినిమాలు చేస్తున్నారు?

- నా సినిమాలు నేనే రాసుకుంటా. ఊహలు గుసగుసలాడేకి 3 ఏళ్లు పట్టింది. జో అచ్యుతానందకు రెండేళ్లు పట్టింది. నెక్స్ట్ సినిమాకు మళ్లీ రెండేళ్లు పట్టింది. స్క్రిప్ట్ కి కనీసం ఏడాది పడుతుంది రాయాలంటే. నాక్కూడా కంగారు లేదు. నచ్చడం, నచ్చకపోవడం అనేది కాదు కానీ, టీమ్‌ని పెట్టి వండించాలని అనుకోను.  ఏం కథ చెప్పాలనిపిస్తోంది... ఎంత కన్విన్సింగ్‌గా చెప్పగలం అనేది ఇంపార్టెంట్‌. 

ఈ కథ నాది కాదు... అనిపిస్తే నేను సినిమా చేయలేను. 

* బాబు బాగా బిజీ నచ్చే చేశారా?

- బాబు బాగా బిజీ నచ్చే చేశాను. ఫ్యామిలీస్‌ ఇబ్బందిపడ్డారని తెలుసు. కానీ నేను నటుడిగా నటించానంతే. నటుడిగా ఇమేజ్‌కి ఇరుక్కుపోవడం నాకు నచ్చదు. జెంటిల్మేన్‌లో విలన్‌గా చేశా. నటుడిగా ఎక్స్ ప్లోర్‌ కావాలనే చేశాను.

*మీరేం కావాలని అనుకుంటున్నారు?

- నేనేమవ్వాలో అది అయిపోయాను. నాకు రైటింగ్‌లోనే శాటిస్‌ఫ్యాక్షన్‌. సినిమాలన్నీ రైటింగ్‌ టేబుల్‌; ఎడిటింగ్‌ టేబుల్‌ మీద జరుగుతాయని నా ఫీలింగ్‌. నేను స్ట్రెస్‌ ఫీలయింది డైరక్షన్‌లో. రాసింది తీసింది తక్కువైనా నన్ను జనాల్లోకి బాగానే తీసుకెళ్లాయి.


*అందం గురించి మీ మైండ్‌లో విశ్లేషణ ఎలా ఉంటుంది?

- ఒక మనిషి ఇంకో మనిషితో ఇంటరాక్ట్ అయినప్పుడు... ఒక లెవల్‌ దాటరు. అది దాటగలిగిందే అందం అనుకుంటా. 

* ఇప్పుడు చేతిలో ఉన్న ప్రాజెక్టులు ఏంటి?

- నా దగ్గర నాలుగు కథలున్నాయి. రైటింగ్‌ మీద కాన్‌సెన్‌ట్రేట్‌ చేసుకున్నా. నాకు కొన్ని కమిట్‌మెంట్స్ ఉన్నాయి. ఆ నాలుగు కథల్లో దేన్ని ముందుకు తీసుకెళ్తే బావుంటుందో దాన్ని బట్టి ఎలాబరేట్‌ చేసి రాస్తాను.

* ఓటీటీల వల్ల సెన్సార్‌ ప్రాబ్లెమ్స్ కూడా ఉండవు కదా?

- నేను ఇప్పటివరకు తీసిన సినిమాల్లో నాకెప్పుడూ సెన్సార్‌కి ప్రాబ్లమ్‌ రాలేదు. నా సెన్సార్‌ యాక్చువలీ ప్రజలే. ఓటీటీలో తీసినప్పటికీ,  నా కథల్లో అభ్యంతరాలు ఉండవని నా ఫీలింగ్‌. వయలెన్స్ నాకు పెద్ద నచ్చదు.

* క్రిష్‌ ఉండటం వల్ల నూటొక్క జిల్లాల అందగాడుకు హైప్‌ వచ్చిందనుకుంటారా?

- క్రిష్‌ ఉండటం వల్ల హైప్‌ వచ్చిన మాట నిజమే. క్రిష్‌గారు బండిల్‌ ఆఫ్‌ ఐడియాస్‌. ఒక్క ఐడియా రెండో సారి చెప్పరు. 'నేను చెప్తున్నాను... నచ్చితే వినండి. లేకుంటే పెక్కనపెట్టండి" అంటారు. ఎడిటింగ్‌లో ఆయన ఇచ్చిన ఇన్‌పుట్స్ యూజ్‌ అయ్యాయి. ఆయనకు డ్రమటిక్‌ సెన్స్ ఉంది. రిథమ్‌ తెలుసు.

* మీరు డైరక్ట్ చేస్తున్న మూడో సినిమా గురించి చెప్పండి?

- 10 ఏళ్ల టైమ్‌ పీరియడ్‌లో జరిగే సినిమా. 7 డిఫరెంట్‌ లుక్స్ ఉంటాయి. ఎంత గ్యాప్‌ వస్తో లుక్‌లో పర్ఫెక్షన్‌ ఉంటుంది. నాగశౌర్య చేస్తున్నాడు. 50 శాతం పూర్తయింది. ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి చేస్తున్నాం. 2022లో అవుతుందేమో.ఇది సీరియస్‌ సినిమా. డైలాగులు కూడా సింక్‌ సౌండ్‌లో చేశాం. ఇది కంటెంట్‌... మీరు మాట్లాడుకోండి అన్న టైప్‌లో చేస్తున్నాం.

* మ్యూజిక్‌ గురించి చెప్పండి?

- శక్తికాంత్‌గారు చేశారు. కథ చెప్పిన 10 నిమిషాల్లో పార్ట్ అయ్యారు. 

* మీ సినిమాల్లో కామెడీ మస్ట్ గా ఉంటుందా?

- ప్రతి సినిమాలోనూ నాకు కామెడీ ఉండటం ఇష్టం.  ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు నవ్వించి చెప్తే తప్పేముంది? అనిపిస్తుంది. 

* మీ టార్గెట్‌ ఏంటి?

- నాకు టార్గెట్స్ లేవు. నెక్స్ట్ సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తా.

* వెబ్‌ సీరీస్‌ చేస్తున్నట్టున్నారు?

- అమెజాన్‌ ప్రైమ్‌కి నిత్యామీనన్‌ లీడ్‌లో  షో రన్నర్‌గా చేస్తున్నా. కుమారి శ్రీమతి అని టైటిల్‌ అనుకున్నాం. అక్టోబర్‌ నుంచి షూట్‌ స్టార్ట్ అవుతుంది

Aadi Sai Kumar Athidhi Devobhava First Look Launched

ఆదిసాయికుమార్ హీరోగా  `అతిథి  దేవోభ‌వ‌` ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌



ఆదిసాయికుమార్ హీరోగా శ్రీ‌నివాస సినీ క్రియేష‌న్స్ ప‌తాకంపై రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మాత‌లుగా పొలిమేర నాగేశ్వ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `అతిథి  దేవోభ‌వ‌`.

ఈ రోజు హైద‌రాబాద్‌లో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ విడుద‌ల‌చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా ప్ర‌ముఖ‌నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా...


ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ మాట్లాడుతూ - ``ఈ సినిమా డిఓపి అమ‌ర్‌నాథ్ రెడ్డి నేను క‌లిసి కొన్ని షార్ట్ ఫిలింస్ చేశాం. ఆయ‌న ద్వారా నేను ఈ కార్య‌క్ర‌మానికి రావ‌డం జ‌రిగింది. ఫ‌స్ట్ లుక్ చాలా బాగుంది. ఆదిలో ఎప్ప‌డు ఒక స్పార్క్ ఉంటుంది. అలాగే అమ‌ర్ ఈ సినిమాలో ఒక పాట చూపించాడు. చాలా చాలా బాగుంది. శేఖ‌ర్ చంద్ర‌గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. టైటిల్ చాలా బాగుంది. త‌ప్ప‌కుండా చాలా పెద్ద హిట్ అవుతుంది. నిర్మాత‌లు రాజాబాబు, అశోక్ రెడ్డి గారికి, అలాగే ద‌ర్శ‌కుడు నాగేశ్వ‌ర్ గారికి ఆల్ ది బెస్ట్‌. ఈ సినిమాకు వ‌ర్క్ చేసిన టెక్నీషియ‌న్స్ అంద‌రికీ మై బెస్ట్ విషెస్‌. ఆది కెరీర్‌కి మ‌రోసారి మంచి కిక్ స్టార్ట్ చేసే సినిమా అవ్వాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను`` అన్నారు.


లిరిసిస్ట్ భాస్క‌ర భట్ల మాట్లాడుతూ - ``ఈ సినిమాలో రెండు మంచి పాట‌లు రాశాను. మంచి టీమ్‌. ద‌ర్శ‌కుడు నాగేశ్వ‌ర్ నాకు మంచి స్నేహితుడు. వెరీ టాలెంటెడ్. టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను`` అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు పొలిమేర నాగేశ్వ‌ర్ మాట్లాడుతూ - ``నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లు రాజాబాబు, అశోక్ రెడ్డి గారికి నా జీవితాంతం రుణ‌ప‌డిఉంటాను. మంచి క‌థ ఇచ్చిన వేణుగారికి, అలాగే అద్భ‌త‌మైన మ్యూజిక్ ఇచ్చిన శేఖ‌ర్ చంద్ర గారికి థ్యాంక్యు. పాట‌లు, ఫోటోగ్ర‌ఫి నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉంటుంది. ఆదిగారు ఈ సినిమాలో ఒక డిఫ‌రెంట్ పాత్ర‌లో క‌నిపిస్తారు. హీరోయిన్ నివేక్ష మంచి పెర్ఫార్మ‌ర్‌. మంచి క్యాస్టింగ్ ఉంది. త‌ప్ప‌కుండా మంచి విజ‌యం సాధిస్తుంది`` అన్నారు.


ప్ర‌ముఖ నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ  - ``ఈ జ‌న‌రేష‌న్‌లో కూడా ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ని చ‌క్క‌గా చూపించే ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చినందుకు ఆయ‌న‌కు నా ధ‌న్య‌వాదాలు. భాస్క‌ర‌భ‌ట్ల ఎన్నో మంచి పాట‌లు రాశారు. ఈ సినిమాలో కూడా ఒక మంచి పాట రాశారు. నేను విన్నాను చాలా బాగుంది. సాధార‌ణంగా సినిమా అంటే ప్యాష‌న్ అని చెబుతుంటారు. మా ఫ్యామిలీమెంబ‌ర్స్ అంద‌రూ ఇన్‌వాల్వ్ అయ్యి వాళ్ల‌నుకున్న ప‌ర్‌ఫెక్ష‌న్ వ‌చ్చే విధంగా చూసుకుంటారు. కాబ‌ట్టి ఈ సినిమా క‌చ్చితంగా ఒక మంచి సినిమా అవుతుంది. ఇంత కాన్ఫిడెంట్‌గా ఈ మాట చెప్ప‌డానికి కార‌ణం నా సోద‌రుడిమీద ఉన్న న‌మ్మ‌కం`` అన్నారు.


ఆది సాయికుమార్ మాట్లాడుతూ - ``ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డిగారికి, శివ నిర్వాణ గారికి థ్యాంక్యూ వెరీ మ‌చ్. శివ గారి అన్ని సినిమాలు నాకిష్టం. ఫ్యామిలీస్, యూత్‌ని చాలా బాగా చూపిస్తారు. ఈ రోజు అతిథి దేవోభ‌వ ఫ‌స్ట్‌లుక్ లాంచ్ చేశాం. చాలా సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. పాట‌లు కూడా రికార్డ్ చేశాం. ఈ అవ‌కాశం ఇచ్చిన రాజాబాబు, అశోక్ రెడ్డి గారికి థ్యాంక్స్‌. రాజాబాబు గారు చాలా కేర్‌తీసుకుని ఈ సినిమా నిర్మించారు. శేఖ‌ర్ చంద్ర మంచి సాంగ్స్ ఇచ్చారు. భాస్క‌ర‌భ‌ట్ల గారి సాహిత్యం ఈ సినిమాకు చాలా ప్ల‌స్ అవుతుంది. త‌ప్ప‌కుండా ఒక మంచి సినిమా అవుతుంది`` అన్నారు.


తారాగ‌ణం: ఆదిసాయికుమార్‌, నివేక్ష‌, రోహిణి, స‌ప్త‌గిరి, సూర్య‌, ఆద‌ర్శ్‌, ర‌వి ప్ర‌కాశ్‌, ర‌ఘు కురుమంచు, బీహెచ్ఈఎల్ ప్ర‌సాద్‌, గుండు సుద‌ర్శ‌న్, ప్రియాంక‌, న‌వీనా రెడ్డి, స‌త్తిపండు, ఇమ్మాన్యేల్‌


సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌ :- శ్రీనివాస సినీ క్రియేషన్స్

నిర్మాత‌లు :- రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల

ద‌ర్శక‌త్వం :- పొలిమేర నాగేశ్వర్

సంగీతం :- శేకర్ చంద్ర

క‌థ‌ :- K. వేణు గోపాల్ రెడ్డి

స్క్రీన్ ప్లే, డైలాగ్స్ :- రజిని రాజాబాబు

డిఓపి:- అమర్ నాద్ బొమ్మిరెడ్డి

ఎడిట‌ర్‌ :- కార్తిక్ శ్రీనివాస్

కొరియోగ్రాఫ‌ర్ :- V.J. శేకర్, హానీ

లిరిసిస్ట్‌ :- భాస్కర భ‌ట్ల‌, కె. కె

ఆర్ట్ డైరెక్ట‌ర్ :- రఘు కులకర్తి

సింగ‌ర్స్‌ :- సిద్ శ్రీరామ్, అనురాగ్ కులకర్ణి, నూతన

ఫైట్ మాస్ట‌ర్ :- జాషువ

కో-డైరెక్ట‌ర్‌ :- శంకర్ మైచ‌ర్ల‌

ఎగ్జిక్యూటివ్‌ :- శామ్ బొల్లెప‌ల్లి

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌:- జోగినాయుడు మొల్లేటి

పీఆర్ఓ :- వంశీ-శేఖ‌ర్

డిజైన‌ర్‌ :- ధనియేలే

Arjun Dasyam Interview About Dear Megha

 "డియర్ మేఘ" కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తోనే థియేటర్ లలో రిలీజ్ చేస్తున్నాం - నిర్మాత అర్జున్ దాస్యన్



వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై తొలి చిత్రంగా డియర్ మేఘను నిర్మించారు నిర్మాత అర్జున్ దాస్యన్. మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. బ్యూటిఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరిగా తెరకెక్కిన డియర్ మేఘ ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకు థియేటర్ లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత అర్జున్ దాస్యన్ మీడియాతో సినిమా విశేషాలు తెలిపారు.



నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ...



- ఇది నా మొదటి సినిమా. నా నేటివ్ ప్లేస్ నిర్మల్. నేను పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే. ఏరోనాటికల్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ చేశాను. లండన్ లో వర్క్ చేశాను. హైదరాబాద్ లోనూ వర్క్ చేశాను. వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేశాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్  జరుగుతోంది. డియర్ మేఘ నా రెండో సినిమా అవ్వాలి కానీ....వీఎన్ ఆదిత్య గారి సినిమా ఆలస్యమై ఇది మొదటి సినిమాగా వస్తోంది.


- నేను చిరంజీవి గారి అభిమానిని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆ తర్వాత సినిమాల మీద ఇష్టం పెరిగి నిర్మాత అవ్వాలని పరిశ్రమకు వచ్చాను. సినిమా నిర్మాణ సంస్థ పెట్టాలని అనుకున్నప్పుడు రెండేళ్లు ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నాను. మన పరిశ్రమలో ఉన్న వాళ్లతో ట్రావెల్ చేశాను. వీఎన్ ఆదిత్య గారితో పరిచయం వల్ల టాలీవుడ్ గురించి చాలా విషయాలు తెలిశాయి.



- డియర్ మేఘ ఒక లవ్ స్టోరి. ఫీమేల్ కోణంలో సాగుతుంది. స్టోరీ ఎక్కువగా రివీల్ చేయలేను. మంచి టెక్నికల్ టీమ్ ఉంది. హైదరాబాద్, ముంబై,గోవా లో షూట్ చేశాం. ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. హరి గౌర మ్యూజిక్ కు చాలా పేరొచ్చింది. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలకు మంచి పేరొచ్చింది. నాలుగో పాట రిలీజ్ చేస్తున్నాం.



- ఇదొక ఎమోషనల్ లవ్ స్టోరి. మేఘ అనే క్యారెక్టర్ కోణంలో సినిమా సాగుతుంది. అబ్బాయి లవ్ స్టోరిలు చాలా చూసి ఉంటాం. కానీ ఇది మేఘ అనే అమ్మాయి పర్సెప్షన్ లో కొత్తగా ఉంటుంది. ఆండ్రూ గారి సినిమాటోగ్రఫీ వల్ల త్వరగా షూట్ చేయగలిగాం. కొవిడ్ టైమ్ లో షూటింగ్ చేసినా మా యూనిట్ వాళ్లకు ఎవరికీ కొవిడ్ రాలేదు.


- థియేటర్ లలో సినిమాకు ఆదరణ బాగానే ఉంటోంది. ఇటీవల ఎస్ఆర్ కళ్యాణ మండపం లాంటి చిత్రాన్ని సక్సెస్ చేశారు. మా తొలి సినిమా కాబట్టి, డియర్ మేఘను థియేటర్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నాం. డబ్బు కంటే మాకు సినిమా అంటే ప్యాషన్ అందుకే ధైర్యంగా థియేటర్ లో విడుదల చేయబోతున్నాం.



- ఇది మిలటరీ స్టైల్ లో చేసిన సినిమా డియర్ మేఘ. ప్రొడక్షన్ సైడ్ ఖర్చు పెరగకుండా చూసుకున్నాం. మేఘా ఆకాష్ మెచ్యూర్డ్ పర్మార్మెన్స్ చూపించింది. అర్జున్ సోమయాజులు తెలుగు బ్యాక్ గ్రౌండ్ ఉన్న అబ్బాయే. ఆదిత్ అరుణ్ కు దక్కాల్సిన పేరు ఇంకా రాలేదని అనుకుంటున్నాను. ఈ సినిమాతో ఆ గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాం.



- సూపర్ స్టార్ కిడ్నాప్ అనే మూవీని చేశారు సుశాంత్ రెడ్డి. డియర్ మేఘ ఆయనకు రెండో చిత్రం. తను అనుకున్న కథను చాలా స్పష్టంగా, ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత సుశాంత్ కు దర్శకుడిగా పేరు తెచ్చుకుంటారు. 



- వీఎన్ ఆదిత్య సినిమా తర్వాత పెద్ద హీరోతో ఓ సినిమా అనౌన్స్ చేయబోతున్నాం. చిరంజీవి గారికి నేను అభిమానిని. కానీ ఆయనను ఇప్పటిదాకా కలిసే అవకాశం రాలేదు. డియర్ మేఘ ఫైనల్ అవుట్ పుట్ చూశాక చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఆ దైర్యంతోనే థియేటర్ లలో డియర్ మేఘను రిలీజ్ చేయబోతున్నాం.


- నాకు అన్ని రకాల సినిమాలు ఇష్టం. ఈ జానర్ లోనే సినిమాలు నిర్మించాలని అనుకోవడం లేదు. మార్వల్ స్టోరీస్ నుంచి షార్ట్  ఫిలింస్ దాకా అన్నీ చూస్తాను. బాగున్నంత వరకు ఆ కంటెంట్ ఏంటి అనే తేడాలు చూడను. సినిమా ఇండస్ట్రీలో స్థిరపడాలనే గట్టి నిర్ణయంతోనే టాలీవుడ్ లో అడుగుపెట్టాను. కష్టమైనా సుఖమైనా ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను. చాలా మంది కొత్త దర్శకులు, రచయితలు నన్ను అప్రోచ్ అవుతున్నారు. కొత్త కథలు వింటున్నాం.


- మా డియర్ మేఘ పాటలు, ట్రైలర్ చూడండి, నచ్చితే సినిమాకు రండి. అన్ని సేప్టీ ప్రికాషన్స్ తీసుకుని థియేటర్ లో ఎంజాయ్ చేయండి.

Jetti movie Lyrical Song Launched by Lyricist Chandrabose

 *గీత రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా "జెట్టి" సినిమాలోని 'గంగమ్మ గంగమ్మ మాయమ్మ..' లిరికల్ సాంగ్ విడుదల*



నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "జెట్టి". తెలుగు, తమిళ, కన్నడ,  మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. కార్తీక్ కొడకండ్ల సంగీతాన్ని అందించిన "జెట్టి" సినిమాలోని ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తున్నారు చిత్ర బృందం.


తాజాగా ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా "జెట్టి" సినిమా నుంచి 'గంగమ్మ గంగమ్మ మాయమ్మ..' అనే పాట లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. *చంద్రబోస్ రాసిన ఈ పాట ఎలా ఉందో చూస్తే.....గంగమ్మ గంగమ్మ మాయమ్మ...మమ్ము సల్లంగ సూడాలమ్మా.. సుడి గుండాలు, గండాలు రాకుండా సెయ్యమ్మా...ఆటుపోటుల్లోనే ఆటుపోటుల్లోనే ఆట పాటలంట హైలెస్స...అలల కౌగిట్లోనే అలల కౌగిట్లోనే అలుపు తీరెనంట హైలెస్స...ఉప్పొంగి పోయేటి ఉప్పెనలో మేము ఊయలూగేమంట హైలెస్సో, ఉబికి వచ్చె మా సెమటనీటి తోటి ఉప్పు నీరు ఇంకా ఇంకా ఉప్పయిందట...గంగమ్మ గంగమ్మ మాయమ్మ...మమ్ము సల్లంగ సూడాలమ్మా*..అని సాగుతుంది. ఈ పాటను కార్తీక్ కొడకండ్ల మ్యూజిక్ కంపోజిషన్ లో అనురాగ్ కులకర్ణి ఆలపించారు. గంగపుత్రుల జీవన విధానాన్ని, గంగమ్మ తల్లి ఆదరణకు సజీవ శిల్పమీ పాట.


*ఈ సందర్భంగా గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ*...ఇటీవల పుష్ప సినిమాలో అడవి మీద పాట రాశాను. ఇప్పుడు "జెట్టి" మూవీలో సముద్రం గురించి, గంగపుత్రుల జీవితం గురించి 'గంగమ్మ గంగమ్మ మాయమ్మ...' అనే పాట రాశాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, సంగీత దర్శకుడికి కృతజ్ఞతలు. చాలా చక్కటి పాట ఇది. సముద్ర ఘోష ఈ పాటలో వినిపించేలా కంపోజిషన్ చేశారు సంగీత దర్శకుడు కార్తీక్. గీత రచయితగా ఈ పాట రాయడం నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. అనురాగ్ కులకర్ణి అంతే చక్కగా పాడాడు. త్వరలో విడుదల కానున్న "జెట్టి" సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.


ఓ మత్య్సకార గ్రామంలో జరిగిన ఘటనలను ఆధారంగా తీసుకుని "జెట్టి" సినిమాను తెరకెక్కించారు. మత్య్సకారుల జీవన విధానాలను, వారి కట్టుబాట్లను, ఇప్పటి వరకూ వెండితెరమీద కనిపించని జీవితాలను తెరమీద హృద్యంగా తీసుకురాబోతున్నాడు దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక. 


*నటీ నటులు* : నందిత శ్వేత‌, కృష్ణ , క‌న్న‌డ కిషోర్, మైమ్ గోపి,  ఎమ్ య‌స్ చౌద‌రి, శివాజీరాజా, జీవా, సుమ‌న్ షెట్టి తదితరులు


*సాంకేతిక నిపుణులు* : బ్యానర్ : వర్ధని ప్రొడక్షన్స్, మ్యూజిక్ :  కార్తిక్ కొండ‌కండ్ల‌, డిఓపి:  వీర‌మ‌ణి, ఆర్ట్ ః ఉపేంద్ర రెడ్డి, ఎడిటర్:  శ్రీనివాస్ తోట‌, స్టంట్స్: దేవరాజ్ నునె, కోరియోగ్రాఫర్ : అనీష్, పబ్లిసిటీ డిజైనర్:  సుధీర్, డైలాగ్స్ ః శ‌శిధ‌ర్, పిఆర్ ఓ : జియస్ కె మీడియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః పండ్రాజు శంక‌ర్రావు , నిర్మాత ః వేణు మాధ‌వ్,  క‌థ‌, స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ ః సుబ్ర‌హ్మ‌ణ్యం  పిచ్చుక.

Tuck Jagadish Trailer Launched

 టక్ జగదీష్ మన ఇంటి సినిమా.. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి :  నేచుర‌ల్ స్టార్ నాని



నేచురల్ స్టార్ నాని  హీరోగా నటించిన 'టక్ జగదీష్' చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'నిన్నుకోరి' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల  క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్‌ను విడుద‌ల‌చేశారు. ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్రయూనిట్ ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో నాని, రీతూ వ‌ర్మ‌, శివ నిర్వాణ, ప్రవీణ్, తిరువీర్, సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది పాల్గొన్నారు.


నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ - ``ఫ్యామిలీ ఎమోషన్సే శివ నిర్వాణ బలం. నిన్నుకోరి, మజిలి సినిమాలను చూస్తే ఆ విషయం తెలుస్తుంది. ఆ రెండు సినిమాల్లో ఇద్దరి ముగ్గురు మధ్యే ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం చాలా మంది మధ్య ఎమోషన్స్ చూపించేశారు. ఇప్పటికే చాలా మందికి ట్రైలర్ చూపించాం. అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. అదే శివ నిర్వాణ బలం. అలా ఏడిపిస్తామని కాదు.. అందరిలోనూ ఆనంద భాష్పాలు వస్తాయి. థియేటర్లో కాకుండా సినిమాను ఓటీటీ విడుదల చేయడంపై కొంత మంది కొన్ని రకాల కామెంట్లు చేశారు. వారంతా నాకంటే పెద్దవాళ్లు. వారున్న పరిస్థితుల్లో అలా మాట్లాడటంలో తప్పు లేదు. ఆ కాసేపు వాళ్లు నన్ను బయటి వాడిలా చేసేశారు. అదే నాకు బాధ. నేను వారి బాధను అర్థం చేసుకుంటాను. టక్ జగదీష్‌లో అన్నదమ్ముల రిలేషన్ మధ్య ఉండే ఆ కాంప్లెక్సిటీని దర్శకుడు  మొదటగా చెప్పాడు. కథ చెప్పినప్పుడు నచ్చిన పాయింట్ అదే. రిలేషన్ షిప్‌లో ఉన్న కాంప్లెక్సిటీని మనం ఈ మధ్య మిస్ అవుతున్నాం. శివ నిర్వాణ తాను నిజ జీవితంలో చూసిన పాత్రలన్నీ కూడా ఇందులో పెట్టేశారు. అందుకే ట్రైలర్ ఇంత యూనిక్‌గా ఉంది. సినిమా కూడా అలానే ఉంది. తెలుగు తెరపై అన్నదమ్ముల మధ్య వచ్చే గొడవలు, రిలేషన్స్ హ్యాండిల్ చేసి చాలా రోజులైంది. చిన్నతనంలో మనం చూసిన సినిమాలెన్నో ఉన్నాయి. కానీ గత కొన్నేళ్లుగా వాటిని మనం చూడలేదు. ఇదేమీ కొత్త సినిమా, ట్విస్ట్‌‌లు, కాన్సెప్ట్‌‌లు ఉండవు. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన సినిమానే. మళ్లీ మన పాత రోజుల్లోకి తీసుకెళ్లేలా ఉంటుంది. ఏదైనా సినిమాలో ఒక ఎమోషన్ ఉంటుంది.. కానీ మన ఇంట్లో మాత్రం అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. టక్ జగదీష్ కూడా మన ఇంటి సినిమా. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి.


నిన్నుకోరితో ఇది వరకే శివ నిర్వాణతో కలిసి పని చేశాను. రీతూ వర్మతో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కలిసి చేశాను. ప్రవీణ్ అయితే నా కెరీర్ ప్రారంభం నుంచి సినిమాలు చేస్తూనే ఉన్నాం. సినిమాలు చేయకపోయినా కూడా టచ్‌లోనే ఉంటారు. తిరువూర్ అయితే అద్భుతమైన నటుడు. ఇంత వరకు ఆయన నటించిన సినిమాలు చూడలేదు. ఆయన చూడటానికి ఎంతో సింపుల్, స్వీట్‌గా ఉన్నారు. కానీ ఆయన పాత్ర మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆయన నటనను చూసి నాకు భయం వేసింది. సినిమాను మన తెలుగు ప్రేక్షకులు ఆదరించడం లేదనే సమస్యే ఉండదు. ఒక్కో సినిమా ఒక్కో లెక్క ఉంటుంది.. అన్ని కోణాల్లో సినిమా గురించి ఆలోచించాలి. నిర్మాత, దర్శకులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమిది. థియేటర్లో అందరితో కలిసి చూడాలని ఎంతో అనుకున్నాను. కానీ బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకున్నాం. బయటి పరిస్థితులు త్వరగా చక్కబడాలి. మళ్లీ ఆ పూర్వ వైభవం రావాలి. బ్రేకుల్లేకుండా ఇకపై మీ (అభిమానులు, మీడియా) అందరినీ కలుసుకోవాలని అనుకుంటున్నాను’  అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు శివనిర్వాణ మాట్లాడుతూ - ``చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. టక్ జగదీష్ కథ నానికి చెప్పినప్పటి నుంచి.. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. రెండేళ్ల శ్రమ ఇది. ఏప్రిల్ 16న విడుదల చేద్దామని అనుకున్నాం. ఆ తరువాత మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇలా అన్ని అనుకున్నాం. థియేటర్లో ఆ సీన్‌కు అలా ఉంటుంది.. ఈ సీన్‌కు విజిల్స్ పడతాయి.. ఇంటర్వెల్ ఇలా ఉంటుంది అని ఎన్నో అనుకున్నాం. థియేటర్లో సినిమా విడుదల కావడం లేదు అని తెలిసినప్పుడు బాధ కలిగింది. అది నాకు, నానికి మాత్రమే తెలుసు. సినిమాను నాని థియేటర్ డోర్ వద్ద రెండున్నర గంటలు వెయిట్ చేసి నిల్చుని చూస్తాడు. అక్కడి నుంచి అయితే అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుస్తుంది అని నాని ఎప్పుడూ కూడా తన సినిమాలను అలానే చూస్తాడు. థియేటర్లో సినిమా చూడటం నానికి అంత పిచ్చి. షైన్ స్క్రీన్‌తో రెండో సినిమా చేస్తున్నాను. నా డబ్బులే పెట్టి సినిమా తీస్తున్నాను అనేంత ఫ్రీడం నాకు ఉంటుంది. రెండేళ్లు సినిమాను తీశాం. ఐదు నెలలు రిలీజ్ కోసం వెయిట్ చేశారు నిర్మాతలు. పరిస్థితులు ఇంకా మారడం లేదు. ఇలాంటి సందర్భంలో చిన్నా పెద్దా అందరూ థియేటర్లోకి వస్తారా? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏమైనా తేడా వస్తే మా (నాని, శివ నిర్వాణ) రెమ్యూనరేషన్‌లోంచి కట్ చేసుకోమ్మని చెప్పాం. మా సినిమా అమెజాన్ ద్వారా ప్రతీ ఊర్లోకి వెళ్తోంది. వినాయక చవితి నాడు మా సినిమాను ఊర్లో వాళ్లు కూడా చూస్తారు. ఒక్కో నిర్మాత, ప్రొడక్షన్ కంపెనీ పరిస్థితులు వేరు. ఎవరికి వీలున్నట్టు వారు సినిమాలను రిలీజ్ చేస్తారు. అందరినీ ఒకే గాడిన కట్టేయకండి. వినాయకచవితి నాడు టక్ జగదీష్ అదిరిపోతుంది’ అని అన్నారు.


కమెడియన్ ప్రవీణ్  మాట్లాడుతూ - ‘ప్రభుత్వ అధికారి పాత్రలో నేను నటిస్తున్నాను. ఆ పాత్ర గురించి దర్శకుడు అన్ని క్లియర్‌గా చెప్పారు. ఆయనే ఎన్నో ఇన్ పుట్స్ ఇచ్చారు` అన్నారు.


హీరోయిన్ రీతు వ‌ర్మ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో గుమ్మ పాత్రను పోషించడం ఆనందంగా ఉంది ‘థియేటర్లో విడుదల కావడం లేదనే బాధ నాకు కూడా ఉంది. పండుగ రోజు కుటుంబం అంతా కలిసి చూడటానికి కరెక్ట్ సినిమా`` అన్నారు


నటుడు  తిరువీర్ మాట్లాడుతూ - ``శివ నిర్వాణ టీంను చూస్తేనే పండుగలా ఉంటుంది. తెలుగు కుటుంబాలు అందరూ కూడా చూసేందుకు సరైన సినిమా’ అని  అన్నారు.

Vishal, A Vinoth Kumar, Rana Productions Pan India Film Launched

 Vishal, A Vinoth Kumar, Rana Productions Pan India Film Launched, Regular Shooting Commences



Action hero Vishal joins hands with director A Vinoth Kumar for a high-octane action entertainer. The film was launched with a pooja ceremony on Vishal’s birthday in a popular Sai Baba Temple in Chennai and regular shooting commenced from the very next day.


Ramana and Nandha are jointly producing the movie under Rana Productions. Sunaina is roped in to play the leading lady opposite Vishal in the Pan India project.


The makers have locked a powerful title for the film which will be revealed soon. An object that influences bringing big change in the society is the title. The movie will have the same title for all the languages.


Vishal has starred in numerous high-octane action entertainers. But this movie will have some breath-taking action sequences, much to the delight of action movie lovers. Guess what, second half of the movie will have 45 minutes of action blocks. Dhilip Subbarayan will supervise stunts.


Sam CS is the music director, while Balasubramanian cranks the camera. Pon Parthiban is the writer.


Cast: Vishal, Sunaina


Technical Crew:

Director: A Vinoth Kumar

Producers: Ramana and Nandha

Banner: Rana Productions

Writer: Pon Parthiban

Music: Sam CS

DOP: Balasubramanian

Stunt Director: Dhilip Subbarayan

Ex-Producer: Bala Gopi

PRO: Vamsi-Shekar

Heroine Rushika Raj About Aasi

 అశ్మీ సినిమా ప్రతి మహిళా గర్వ పడే సినిమా అవుతుంది -హీరోయిన్  రుషికా రాజ్, 



సాచీ క్రియేష‌న్స్ ప‌తాకం పై స్నేహా రాకేశ్ నిర్మాత‌గా, నూత‌న ద‌ర్శకుడు శేష్ కార్తీకేయ తెర‌కెక్కిస్తున్న చిత్ర అశ్మీ. పూర్తిగా వైవిధ్య‌మైన కాన్సెప్ట్ తో థ్లిల‌ర్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రుషికా రాజ్, రాజా నరేంద్ర‌, కేశ‌వ్ దీపిక లీడ్ రోల్స్ చేస్తున్నారు.

ఈ సినిమా లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసిన రుషికా రాజ్ మీడియా తో ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు, నేను ఒక కన్నడ అమ్మాయిని నేను కన్నడ లో మూడు   సినిమాలు చేసాను, తగరు అనే మూవీ నాకు మంచి పేరు తీసుకువచ్చింది,ఈ మూవీ పేరు అశ్మీ అంటేనే సంస్కృత పదం, నేను హీరోఇన్ గా చేయటానికి చాలా సంవత్సరాలు ఆగాను ఒక మంచి రోల్ చేయటానికి, అందరిలాగా చేయకూడదు చేస్తే సొసైటీ కి మంచి మెసేజీ వుండే క్యారెక్టర్ చేయాలి అనుకున్నాను, ప్రతి ఒక్క అమ్మాయి ఈ సినిమా నుంచి మెసేజ్ ఇవ్వాలి అని ఈ సినిమా చేశాను, ఈ సినిమా నేను మొదట ఒప్పుకునే అప్పుడు చాలా భయపడ్డాను ఈ సినిమా ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చాలా భయం వేసింది, ఈ సినిమా లో మహిళలు ఈ రోజుల్లో చాలా మంది పేస్ చేస్తున్న సమస్యలు ని ఈ సినిమా  లో చూపించటం జరిగింది, ఈ పాయింట్ నేను సినిమా చేయటానికి దోహద పడ్డది, ఈ సినిమా లో యాక్టింగ్ కి చాలా స్కోప్ వున్న పాత్ర ఇది,నేను తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నాను అని అందరు చెప్తున్నారు నేను తెలుగు నేర్చుకోవాటినికి రెండు సంవత్సరాలు పట్టింది, ఫస్ట్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అయిన డైరెక్టర్ గారు అయినా సినిమా ని ఓటిటి కోసం అని తీసి సినిమా బాగా వచ్చింది అని ఈ సినిమా ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు, ఈ సినిమా రిలీజ్ అవ్వటానికి మా పి. ఆర్.వో ఏలూరు శ్రీను గారు బాగా హెల్ప్ చేశారు, ఈ సినిమా లో ఎటువంటి అసభ్యకరమయిన సన్నివేశాలు లేవు కుటుంబం అంత  కలిసి చూడదగిన సినిమా ఇది,డైరెక్టర్ శేష్ కార్తికేయ గారు చాలా మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నారు,నా క్యారెక్టర్ కి ఫస్ట్ వేరే అమ్మాయిని సెలెక్ట్ చేసి తరువాత ఆ ప్లేస్ లో నన్ను తీసుకున్నారు,ఈ సినిమా శివ,ప్రొఫిసర్, అశ్మీ మూడు క్యారెక్టర్ లు చుట్టూ తిరుగుతుంది,సినిమా లో ఒక సాంగ్ ఉంటుంది అండి శాండీ అద్దంకి మంచి మ్యూజిక్ ఇచ్చారు,ఫైనల్ గా ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే ఇది ప్రస్తుతం సమాజం లో ప్రతి మహిళా పేస్ చేస్తున్న క్యారక్టర్ ప్రతి మహిళా కి మెసేజీ రీచ్ అవ్వాలి అనేదే మా ఈ ప్రయత్నం.


న‌టీన‌టులు

రుషికా రాజ్, రాజా న‌రేంద్ర‌, కేశవ్ దీప‌క్


సాంకేతిక వ‌ర్గం


బ్యాన‌ర్ - సాచీ క్రియేష‌న్స్

నిర్మాత - స్నేహా రాకేశ్

ర‌చ‌న - ద‌ర్శ‌కత్వం, సినిమాటోగ్ర‌ఫి - శేష్ కార్తీకేయ‌

ఎడిటింగ్ - ప్ర‌వీణ్ పూడి

మ్యూజిక్ - శాండీ అద్దంకి

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

Jayaho Indians First Look Poster Launched

 ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ 'జయహో ఇండియన్స్' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..



ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ పతాకంపై రాజ్ భీమ్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా జయహో ఇండియన్స్. ఆర్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది. మతం పేరుతో రగిలే కార్చిచ్చులో బలయ్యేదెవరు.. నాయకులా..? అమాయకులా..? దేశమా..? ఈ కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. అది స్పష్టంగా పోస్టర్లో కనిపించేలా డిజైన్ చేశారు దర్శక నిర్మాతలు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. జైపాల్ రెడ్డి నిమ్మల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. 


నటీనటులు: 

రాజ్ భీమ్ రెడ్డి, జారా ఖాన్, చమ్మక్ చంద్ర, సమీర్, ముమైత్ ఖాన్, CVL నరసింహా రావు, రామరాజు, చిత్రం శ్రీను, అనంత్, టార్జాన్, గగన్ విహారి.. 


టెక్నికల్ టీం:

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకుడు: ఆర్ రాజశేఖర్ రెడ్డి

నిర్మాణ సంస్థ: ది భీమ్ రెడ్డి క్రియేషన్స్

నిర్మాత: రాజ్ భీమ్ రెడ్డి

సంగీతం: సురేష్ బొబ్బిలి

సౌండ్ డిజైన్: నాగార్జున తల్లపల్లి

సినిమాటోగ్రఫీ: జైపాల్ రెడ్డి నిమ్మల

ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి

లిరిక్స్: కాసర్ల శ్యామ్

VFX: విరించి ప్రొడక్షన్స్

ఆర్ట్: మోహన్, మగేశ్వర రావు

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే

Glimpse of Prem Kumar is Out

 Will PK get married? Or will he be content with matchmaking?



Glimpse of Santosh Shoban's 'Prem Kumar' is out


Sharanga Entertainments Pvt. Ltd. and producer P Shiva Prasad are currently doing a film with Santosh Shobhan as the hero. Titled 'Prem Kumar', the film marks the directorial debut of Abhishek Maharshi. Rashi Singh is its female lead. Krishna Chaitanya, Ruchitha Sadineni, Krishna Teja, Sudarshan, Ashok Kumar, Prabhavathi, Raj Madiraju, Madhu, Abhishek Maharshi, Sri Vidya, Sai Swetha, Akula Shiva, and others have been roped in to play other roles. On Wednesday, its First Glimpse was released.


The Glimpse introduces us to the key characters in the life of the male protagonist in a funny way: సునందగారికి సింగిల్ సుపుత్రుడు, సుందర లింగానికి సోలో స్నేహితుడు, రోషన్ గాడికి రంకు మొగుడు, వరుడు చిరంజీవి చిం ప్రేమ్ కుమార్. Rashi Singh is seen as a bride. What is suspenseful is the fact that the wedding gets canceled. Why did the bride elope?


Speaking about the premise of 'Prem Kumar', director Abhishek Maharshi said, "Prem Kumar's marriage gets canceled, but you have to watch the movie to know why his wedding got canceled, because of whom, with whom and how. Will PK ever get married? Or will he remain a bachelor for the rest of his life? When is his marriage going to be held? These are going to be answered in the movie." The makers also introduced us to the wedding card.


Producer Panneeru Shiva Prasad said, "Our movie is a hilarious comedy entertainer. The director and his fellow writer Anirudh Krishnamurthy came up with a unique story. The screenplay is exciting. Santosh Shoban's character will be a special attraction. The production works have come to an end. Currently, post-production works are on. We will announce the rest of the details soon."


Cast:: Santosh Sobhan, Rashi Singh, Krishna Chaitanya, Ruchitha Sadineni, Krishna Teja, Prabhavathi, Sudharshan, Raj Madiraju, Ashok Kumar, Madhoo, Abhishek Maharshi, Sri Vidya, Sai Swetha, and Akula Siva.


Crew: Director: Abhishek Maharshi, Producer: Shiva Prasad Panneeru, Writers: Abhishek Maharshi, Anirudh Krishnamurthy, Editor:  Garry BH, Director of Photography: Rampy, Music Director: Anant Srikar, Additional Dialogues: Charan Tej, PRO: Naidu Surendra Kumar - Phani Kandukuri (Beyond Media), Digital Media: Ticket Factory


Vijay Anthony's Vijaya Raghavan Grand release on September 17

 సెప్టెంబర్ 17న విజ‌య్‌ ఆంటోని `విజ‌య రాఘ‌వ‌న్‌` గ్రాండ్ రిలీజ్



`న‌కిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌` వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని. ఈయన హీరోగా.. `మెట్రో` వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ ఆనంద కృష్ణన్‌ తెరకెక్కించిన చిత్రం 'విజయ రాఘవన్‌'.  ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.  కోడియిల్ ఒరువ‌న్‌` పేరుతో త‌మిళంలో.. `విజ‌య రాఘ‌వ‌న్‌`పేరుతో తెలుగులో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 17న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 


‘‘ఇది వ‌రకే విడుద‌లైన ఈ సినిమా ట్రైలర్, పాటలకు, టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఓ మాస్ ఏరియాలో పిల్ల‌లు ప‌క్క దారులు ప‌ట్ట‌కుండా ... చ‌దువు గొప్ప‌త‌నాన్ని వారికి వివ‌రించి, వారి ఉన్న‌తికి పాటు ప‌డే యువ‌కుడి క‌థే విజ‌య్ రాఘ‌వ‌న్‌. ప్ర‌స్తుత ట్రెండ్‌కు అనుగుణంగా తెర‌కెక్కించాం. డిఫరెంట్ పాత్ర. కచ్చితంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా సినిమా ఉంటుంది. డైరెక్ట‌ర్ ఆనంద కృష్ణ‌న్ సినిమాను అద్భుతంగా అన్ని ఎలిమెంట్స్‌ను క‌వ‌ర్ చేస్తూ తెర‌కెక్కించారు.ఎప్పుడో విడుద‌ల కావాల్సిన సినిమా కోవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డింది. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాయి. ఇప్పుడు సినిమాను సెప్టెంబర్ 17న ప్రేకకుల ముందుకు తీసుకొస్తున్నాం అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంది ’’ అని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. 


న‌టీన‌టులు:

విజయ్‌ ఆంటోని, ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు 


సాంకేతిక వ‌ర్గం:

రచన, దర్శకత్వం: ఆనంద కృష్ణన్‌

నిర్మాతలు: టి.డి.రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌

 సహ నిర్మాతలు: కమల్ బోరా, లలిత ధనంజయన్‌, బి.ప్రదీప్‌, పంకజ్‌ బోరా, ఎస్‌.విక్రమ్‌ కుమార్‌

సినిమాటోగ్రఫీ: ఎన్‌.ఎస్‌.ఉదయ్‌కుమార్‌

మ్యూజిక్‌: నివాస్‌ కె.ప్రసన్న

ఎడిటర్‌: లియో జాన్‌ పాల్‌


Jaathiya Rahadhari Trailer Launched by RGV

 జాతీయ రహదారి ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శక సంచలనం 

-RGV



దర్శకుడు రాంగోపాల్ వర్మ గారు మాట్లాడుతూ జాతీయ రహదారి ట్రయిలర్ చూసాను చాలా హర్ట్ టచింగ్ గా వుంది,కరోనా పాండమిక్ లో జరిగిన 2 ప్రేమ కధలు కి ఈ మూవీ డైరెక్టర్ నరసింహ నంది మంచి ముగింపు ఇచ్చాడు..ఇదీ నేషనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ రావాలని కోరుకుంటున్నాను..నరసింహ నంది  కి అలాగే  ఇంత రిస్కీ తీసుకుని మంచి సినిమా తీయాలి అనుకునే మా ప్రొడ్యూసర్ రామ సత్య నారాయణ గారికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని మాట్లాడారు.

 

ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మాట్లాడుతూ ఆర్.జి. వి గారి దయవల్లే నేను ఈ రోజు ఇలా వైట్ బట్టలు వేసుకుని  ఈ స్థానం లో వున్నాను, ఆయన కి నచ్చనిదే ఏ పని చేయరు అలాంటిది ఈ మూవీ ట్రైలర్ చూసి బావుంది అని చెప్పారు..డైరెక్టర్ ని ఒకసారి పిలువు అన్నారు. ఈ మూవీ డైరెక్టర్ నరసింహ నంది కి శుభాకాంక్షలు తెలిపిన మా గురువు గారికి రుణపడి వుంటాను అని మాట్లాడారు.ఈ నెల 10 వతేదీన వినాయక చవితి కానుకగా రెండు తెలుగు రాష్ట్రాలలో 200 థియేటర్స్ లో విడుదల అవుతుంది..అని అన్నారు.


డైరెక్టర్ నరసింహ నంది మాట్లాడుతూ నేను ఎప్పుడు ఆర్.జి.వి గారిని కలుస్తానా అని అనుకునే వాడిని అది ఈ జాతీయ రహదారి వల్ల తీరింది, ఆయన శివ సినిమా చూసి చెన్నై కి ట్రైన్ ఎక్కిన వాళ్లలో నేను ఒకడిని,RGV గారు ఎప్పుడు ఎవరిని మెచ్చుకోరు అలాంటిది మా ట్రైలర్ చూసి మా జాతీయ రహదారి ట్రైలర్  బావుంది అని మెచ్చుకున్నందుకు..రేలీజ్ చేసి నందుకు ధన్యవాదములు  అని చెప్పారు.

[

నటి నటులు:

మధు చిట్టె ,సైగల్ పాటిల్ , మమత, ఉమాభారతి, మాస్టర్  నందిరెడ్డి. ధక్షిత్ రెడ్ది, అభి, తెల్జెరు మల్లెష్, తరని,గొవిందరాజు, ఘర్షణ శ్రీనివాస్., విజయ భాస్కర్, సిద్దిపెట రవి 

సాంకెతిక వర్గం :

సినిమాటొగ్రఫి :- యస్ మురలి మొహన్ రెడ్డి,

సంగీతం :- సుక్కు,

పాటలు :;- మౌన శ్రీ మల్లిక్, 

ఎడీటర్ :; వి నాగిరెడ్డి, 

నిర్మాత :- తుమ్మలపల్లి రామసత్యనారాయణ.,

రచన దర్శ కత్వం :; నరసింహ నంది...

సమర్పణ.:- సంధ్య స్టూడియోస్ రవి కనగల.

పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్