Latest Post

Kapata Nataka Suthradhari Censor Completed

 కపటనాటక సూత్రధారి’ సెన్సార్ పూర్తి



విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకృష్ణ,విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కపటనాటక సూత్రధారి’. థ్రిల్లర్ జోన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ‘యు/ఎ’ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఫ్రెండ్స్ అడ్డా బ్యాన‌ర్‌పై మనీష్ (హలీమ్) నిర్మించిన ఈ సినిమాకు క్రాంతి సైన దర్శకత్వం వహించారు. ఉమా శంకర్, వెంకటరామరాజు, శరత్ కుమార్, జగదీశ్వర్ రావు, శేషు కుమార్, ఎండి హుస్సేన్  సహా నిర్మాతలు. ఈ సంద‌ర్భంగా..

 

చిత్ర నిర్మాత మనీష్ మాట్లాడుతూ ‘‘మా ‘కపట నాటక సూత్రధారి’ సెన్సార్ పూర్తయ్యింది. మంచి థ్రిల్లర్ మూవీ చేశామని సెన్సార్ సభ్యులు మా టీమ్‌ను అప్రిషియేట్ చేశారు. డైరెక్టర్ క్రాంతి సైన సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సుభాష్‌గారి విజువ‌ల్స్‌, రామ్‌గారి సంగీతం, వికాస్ నేప‌థ్య సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యాయి. కచ్చితంగా సినిమా ఆడియెన్స్‌ను డిఫ‌రెంట్ మూవీగా ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన డిఫ‌రెంట్ పోస్ట‌ర్స్‌, ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడ‌నేది అనౌన్స్ చేస్తాం’’ అన్నారు. 



నటీనటులు 


విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకృష్ణ,విజయ్ 


సాంకేతిక నిపుణులు : 

దర్శకుడు : క్రాంతి సైన

నిర్మాత : మనీష్ (హలీమ్)

సహా నిర్మాతలు : ఉమా శంకర్, వెంకటరామరాజు, శరత్ కుమార్, జగదీశ్వర్ రావు, శేషు కుమార్, ఎండి హుస్సేన్

బ్యాన‌ర్‌:  ఫ్రెండ్స్ అడ్డా

సినిమాటోగ్రఫీ : సుభాష్ దొంతి

సంగీతం : రామ్ తవ్వా

నేపథ్య సంగీతం : వికాస్ బడిస

మాటలు : రామకృష్ణ

ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్

డాన్స్ : జిత్తు మాస్టర్

M.S. Raju wrapped up 7 Days 6 Nights shoot in record time!!

 M.S. Raju wrapped up 7 Days 6 Nights shoot in record time!!



Amidst the adverse conditions, Mega Maker M.S Raju & team wrapped up his 7 Days 6 Nights film in record time.


On the way back from manglore & udipi after a hectic schedule in Goa, movie team is aiming for a Grand release soon.


Speaking on the occasion, Director M.S. Raju says, “I'm extremely happy with the outcome of the project and thank all my crew for working so hard in abnormal conditions at all outdoor locations. We're very excited to bring our sensational banner Sumanth Art Productions back into business with this film. I'm immensely joyful to introduce my son Sumanth Ashwin as producer too. Our 7 Days 6 Nights is going to be a rib tickling romantic entertainer with some sweet emotions too"


Hero/Producer Sumanth Ashwin says, "Wrapping up the shoot in record time amidst the adverse situations, 7 Days 6 Nights is going to be my best film till date. I'm thankful & inspired by my father M.S Raju's extreme hardwork & dedication towards filmmaking. This film is a unique entertainer and will be one among the classics from our previous productions under Sumanth Art Productions. I'm happy to be associated with Wintage pictures & ABG Creations in this prestigious project”


Co-producer J. Srinivasa Raju says, "Our director MS Raju garu known for his blockbuster productions bounced back as an eminent director with Dirty Hari & continuing the league with another interesting flick 7 Days 6 Nights. We're planning to release it soon, wrapping up the shoot & most of the dubbing"


Music: Samarth Gollapudi

Cinematography: Nani Chamidisetty

Editor: Junaid Siddiqui

Production Designer: Bhaskar Mudavath

Stills: M. Rishitha Devi

Pro: Pulagam Chinnarayana

Digital PR: Sudheer Telaprolu

Publicity Designer: Eshwar Ande

Executive Producer, Co-Director: UV Sushma

Co-Producer: J.Srinivasa raju, Manthena Ramu

Producers: Sumanth Ashwin, Rajnikant S, Writer - Director: M.S.Raju


Diehard Fan Cycles From Tirupati To Hyderabad For 12 Days To Meet his Matinee Idols Chiranjeevi And Pawan Kalyan


 Diehard Fan Cycles From Tirupati To Hyderabad For 12 Days To Meet his Matinee Idols Chiranjeevi And Pawan Kalyan


Megastar Chiranjeevi's birthday was on August 22. An avid fan cycled from Alipiri, Tirupati for 12 days to express his wishes to the star On the occasion. Meeting him in Hyderabad, Chiranjeevi wondered how the fan got so much energy to join him but also said such misadventure is inappropriate.

Speaking on this occasion, Megastar Chiranjeevi said- "My fan N, Eswaraiah came from the village of Balujupalli. He started his journey on a bicycle from Tirupati (Alipiri) to meet me on my birthday. He took the Deeksha of my idol Anjaneya Swami wishing me the blessings of the Lord. On August 10th, the fan started from Alipiri and cycled for twelve days. I have said it on many occasions. The love of the fans is great energy for us. At the same time, we wish for their well-being and of their family members".

Chiranjeevi has spent some quality time with the diehard fan. The Megastar has also made the necessary arrangements for the fan who wanted to meet Pawan Kalyan. When the fan met Power star Pawan Kalyan, his happiness knows no bounds. "I am blessed today. Meeting Megastar Chiranjeevi and Powerstar Pawan Kalyan, I have forgotten all the hard work of the twelve days cycle journey in one day," says that heroic fan. The Mega fan has gone home caring lifelong memories after meeting the Mega Brothers.

Kaalam Rasina Kadhalu Movie Launched

 "కాలం రాసిన కథలు" నూతన చిత్రానికి క్లాప్ కొట్టిన హాస్య నటుడు పృద్వి



 ఎస్ ఎమ్ 4 ఫిలిమ్స్ పతాకంపై బేబీ శాన్వి శ్రీ షాలిని సపర్పణలో "కాలం రాసిన కథలు" అనే నూతన చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఈ నూతన చిత్రానికి  ప్రముఖ హాస్య నటుడు పృద్వి రాజ్ అతిథిగా విచ్చేసి క్లాప్ ఇవ్వగా.. వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీఫ్య  విజయ్ కుమార్ స్విచ్ ఆన్ చేశారు.


అనంతరం పృద్వి రాజ్ మాట్లాడుతూ.. 'కాలం రాసిన కథలు' చిత్రానికి దర్శకుడు, నిర్మాత బాధ్యతలను సాగర్ వహిస్తున్నాడు. తను చాలా అద్భుతంగా కథను రాసుకున్నాడు... క్యాస్టింగ్ కూడా చాలా మంచి నటీనటులు ఇందులో ఉన్నారని తెలిపాడు.. ఫ్యాన్ ఇండియా సినిమాల ఓపెనింగ్ లకు ఎలాగూ మనల్ని పిలవరు.. పిలిచిన సినిమాలకు సపోర్ట్ అందించాలనే పిలవగానే వచ్చాను.. సినిమాలలో చిన్న- పెద్ద అనేవి ఏవీ ఉండవు.. ఏ సినిమా కైనా ఒకే కెమెరా, ఒకే కష్టం ఉంటుంది.. అందుకే సాగర్ అందిస్తున్న ఈ నూతన చిత్రానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని, ఇందులో నటించిన వారందరికీ మంచి సక్సెస్ చేకూరాలని ఆసిస్తూన్నా అన్నారు.


కార్పొరేటర్ దేదీప్య మాట్లాడుతూ... టైటిల్ చాలా బాగుంది.. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా సాగర్ కు మంచి విజయాన్ని అందించాలని బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నా అన్నారు.


దర్శకుడు నిర్మాత సాగర్ మాట్లాడుతూ... కాలం రాసిన కథలు నూతన చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసిన పృద్వి రాజ్ గారికి, కార్పొరేటర్ దేదీఫ్య గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇదివరకు నేను "కొంటె కుర్రాడు" అలియాస్ లోఫర్ గాడి ప్రేమ కథ అనే చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించి విడుదలకు సిద్దంగా ఉంచాను. ఇప్పుడు ఈ నూతన చిత్రాన్ని ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభించా.. ప్రపంచం లో ఎవ్వరూ ఇవ్వని ధైర్యం కుటుంబం మాత్రమే ఇవ్వగలదు అనేదే "కాలం రాసిన కథలు" కథాశం. ఈ చిత్రంలో వెన్నెల, రీతూ లు లీడ్ రోల్ లో నటిస్తున్నారు.. వీరితో  పాటు మరికొందరు ఆర్టిస్టులు ఇంకా ఖరారు కావాల్సి ఉందని తెలిపారు..


ఇంకా ఈ ప్రారంభోత్సవంలో  అతిథిగా ప్రసన్న కుమార్, కథానాయికలు వెన్నెల, రీతూ, కొరియోగ్రాఫర్ వి నైన్ విజయ్ మాస్టర్ తదితరులు హాజరయ్యారు.


వెన్నెల, రీతూ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ

చిత్రానికి నిర్మాత- రైటర్- డైరెక్టర్ ఎమ్ ఎన్ వి సాగర్, డిఓపి: దేవి వరప్రసాద్, ఎడిటర్: మేకల మహేష్, మ్యూజిక్: మెరుగు అరమాన్, లిరిక్స్: శ్రీనివాస్ తమ్మిశెట్టి,

కొరియా గ్రఫీ: వి నైన్ విజయ్ మాస్టర్,   పబ్లిసిటీ డిజైనర్: ఎమ్ కె ఎస్ మనోజ్, పీఆర్ఓ:  

బి. వీరబాబు.


Hero Sushanth Interview About Ivnr

 ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు..సినిమా సక్సెస్ మీద  పూర్తి నమ్మకం ఉంది - హీరో సుశాంత్



సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’. ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో లెజెండ్రీ న‌టి భానుమ‌తి రామ‌కృష్ణ మ‌న‌వ‌డు ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల‌గుండ్లల‌తో క‌లిసి ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 27న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సుశాంత్ మీడియాతో ముచ్చటించారు.


*చిలసౌ సినిమాను బన్నీ ఫస్ట్ చూశారు.. ఆయన త్రివిక్రమ్ గారికి చెప్పారు. ఆయన ఆ సినిమాను చూసిన వెంటనే ఫోన్ చేశారు. అలా అప్పుడు అల వైకుంఠపురములో సినిమాకు చాన్స్ ఇచ్చారు. అలా చిలసౌ ద్వారా అల వైకుంఠపురములో వచ్చింది.. ఆ మూవీ తరువాత స్ప్రైట్ యాడ్ వచ్చింది. అలా నాకు దగ్గరకు వచ్చిన వాటిని చేస్తూ ఉన్నాను.


*ఏం చేసినా కూడా సొంతంగా చేసుకోవాలని.. మనది మనమే నిలబడాలని చిలసౌ కంటే ముందు నాగార్జున గారు చెప్పారు. బీ ఇండిపెండెంట్ అని చెప్పడంతో.. నాకు నచ్చిన సినిమాను చేస్తే ఆ రిజల్ట్ తెర మీద కనిపిస్తుందని అనుకున్నాను. డౌట్లు పెట్టుకుంటే అంత పర్ఫెక్ట్ రాదేమో అని అనుకున్నాను.. అందుకే చిలసౌ నుంచి ఎక్కువ ఒత్తిడి తీసుకోలేదు. ఎంతో ఫ్రీగా చేశాను.. ఆ విషయాన్ని త్రివిక్రమ్ గారు సెట్‌లో పసిగట్టారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా షూటింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నావ్ అని త్రివిక్రమ్ అన్నారు.


*చిలసౌ విడుదలకంటే ఓ రెండు నెలల ముందే ఈ కథను డైరెక్టర్ దర్శన్ వినిపించారు. నూటొక్క జిల్లాల అందగాడు సాగర్.. హరీష్ ప్రొడ్యూసర్ ద్వారా దర్శన్‌ను పంపించారు. కాలనీలో జరిగే సంఘటనలు.. తన ఫ్రెండ్ జీవితంలో జరిగిన సంఘటనలు అని కథను నెరేట్ చేశారు. చిలసౌ కంటే ముందే ఈ కథను చేస్తాను అని చెప్పాను. కానీ మధ్యలో అల వైకుంఠపురములో చేశాను. నాకోసం చాలా వెయిట్ చేశారు. ఈ కథకు నిరంజన్ రెడ్డి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. ఆయన బిజీగా ఉండటం వల్ల అది సెట్స్ మీదకు వెళ్లలేదు. మీరు  పర్మిషన్ ఇస్తే వింటాను అని నిరంజన్ రెడ్డి గారిని నేను అడిగాను. ఈ కథ నాకైతే బాగుంటుందని ఆయన కూడా చెప్పారు. అలా ఈ సినిమా ముందుకు వచ్చింది. ఈ కథ విన్నప్పుడు  చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఇంతకు ముందు విన్నట్టు ఎక్కడా అనిపించలేదు. కాంప్లికేటెడ్ కథ అయితే కాదు.. ఎంతో రియలిస్టిక్ ఉంటుంది. ఎంటర్టైనింగ్‌గానూ ఉంటుంది. కమర్షియల్ టచ్ కూడా ఉంటుంది.


*ఫిబ్రవరి 1న ప్రారంభించినా.. మార్చి 15 వరకు చాలానే పూర్తి చేసేశాం. జూన్‌లోనే విడుదల చేద్దామని అనుకున్నాం. మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోయింది. కృష్ణా నగర్‌లో ఒక్కరోజు  షూటింగ్ మాత్రమే మిగిలింది. కానీ లాక్డౌన్ ముగిసిన తరువాత వెళ్తే అక్కడ పరిస్థితి అంతా మారిపోయింది. సినిమా మీదున్న పాజిటివ్ వైబ్ మమ్మల్ని నడిపించింది. ఫస్ట్ లాక్డౌన్ మామూలుగా గడిచింది. అయితే జనవరిలో వద్దామని అనుకున్నాం కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయింది. ఆ తరువాత మళ్లీ సెకండ్ లాక్డౌన్ వచ్చింది. అది చాలా కష్టంగా గడిచింది. ఓటీటీ ఆఫర్లు రావడం ప్రారంభమయ్యాయి. థియేటర్లు ఓపెన్ అవుతాయో లేదో.. జనాలు వస్తారో లేదో అనే అనుమానాలు వచ్చాయి. నిర్మాతలను కూడా ఎక్కువగా ఒత్తిడి పెట్టలేం. వాళ్లు కూడా సినిమాను నమ్మి..  థియేటర్లోనే చూడాల్సిన సినిమా అని వెయిట్ చేశారు. పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఆఫర్‌తోనే నిర్మాతలు సేఫ్ అయ్యారు. అందుకే మేం కూడా విడుదలకు సిద్దమయ్యాం.


*సినిమా సక్సెస్ మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్ వర్క్. ఈ సినిమాను దాదాపు 50 మందికి చూపించాం. అందరూ  బాగానే ఉందని అన్నారు. డిజిటల్ ఆఫర్ ఇచ్చిన వారు కూడా సినిమాను చూసే తీసుకున్నారు. కొన్ని సీన్స్ గుర్తుండిపోయాయని అందరూ అన్నారు. ఈ చిత్రంలో ప్రతీ ఒక్క క్యారెక్టర్‌కు ప్రాముఖ్యత ఉంటుంది. మా వైపు నుంచి చేయాల్సిందంతా చేశాం. ఇక జనాలు తీర్పునివ్వాలి.


*ముందు తమిళ్‌లో టైటిల్ చెప్పారు. నో పార్కింగ్ అని అనుకున్నాం. కానీ తెలుగులో ఉండాలని.. ఇచ్చట వాహనములు నిలుపరాదు అని అనుకున్నాం. అందరూ కూడా టైటిల్ బాగా ఉందని అన్నారు. తెలుగు వచ్చినా, రాకపోయినా కూడా అందరికీ అర్థం అవ్వాలని నో పార్కింగ్ అని ట్యాగ్ లైన్ కూడా పెట్టేశాం.


*కెమెరామెన్ సుకుమారన్, డైరెక్షన్ దర్శన్ మధ్య సింక్ బాగా కుదిరింది. కెమెరామెన్ ఉన్నారంటే.. దర్శన్ కాస్త ఫ్రీ అవుతారు.


*రుహానీ శర్మ ఓ వర్క్ షాప్ గురించి చెప్పారు. అప్పుడు ముంబైకి వెళ్తే అక్కడ మీనాక్షి చౌదరి కనిపించారు. ఆమె మిస్ ఇండియా అని నాకు తెలీదు. నేను యాక్టర్ అని ఆమెకు కూడా తెలీదు. అయితే అక్కడ క్లాస్‌లో ఓ టఫ్ సీన్ చేశారు.  తెలుగు సినిమాలో చాన్స్ వస్తే చేస్తారా? అని అడిగాను. అలా మీనాక్షి ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఆమె టాలెంట్‌కు కచ్చితంగా బిజీ అవుతుందని అనుకున్నాను. కానీ ఈ మూవీ విడుదల కాకముందే.. తమిళ, తెలుగు, హిందీలో ఆఫర్లు వచ్చేశాయి.


*నేను ఎప్పుడూ సినిమాలు త్వరగానే పూర్తి చేయాలని అనుకుంటాను. అల వైకుంఠపురములో సినిమాకు ఇచ్చిన డేట్స్ వల్ల ఈ మూవీ లేట్ అయింది. అల వైకుంఠపురములో, ఇచ్చట వాహనములు రెండు కూడా ఒకే సంవత్సరంలో వస్తాయని అనుకున్నాను. కానీ పాండమిక్ వల్ల అది మిస్ అయింది.


*ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేషన్ ఇవన్నీ ఎంత ముఖ్యమో ఈ పాండమిక్ వల్ల తెలుసుకున్నాను. ఒత్తిడిగా ఫీలవ్వడం కంటే.. మనం మన వాళ్లతో, మనం ప్రేమించే వాళ్లతో ఉన్నామని అనుకోవడం బెటర్. మెడిటేషన్ చేయడం ప్రారంభించాను. పియానో నేర్చుకున్నాను. కుకింగ్ కూడా కొద్దిగా నేర్చుకున్నాను. అలా అని బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే పిచ్చెక్కుతుంది. అన్నింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నాను.


*అల వైకుంఠపురములో సినిమాను అందరూ చూశారు. తమిళ, మళయాలం.. ఓటీటీ, శాటిలైట్ ఇలా అందరూ చూశారు. సినిమా నుంచి బయటకు వచ్చిన వారంతా కూడా.. నువ్ గుర్తున్నావ్ అని అన్నారు. అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ సమయంలో త్రివిక్రమ్, బన్నీ నుంచి ఎంతో నేర్చుకున్నాను.


*త్రివిక్రమ్, బన్నీ ఇద్దరి కెమిస్ట్రీ, ర్యాపో బాగుంటుంది. ఆయన ఒకటి చెబుతారు.. ఈయన ఇంకోటి యాడ్ చేస్తారు. సీన్లు ఇంప్రూవ్ చేస్తుంటారు.  నాకు సరదాగా అనిపిస్తుంటుంది. సెట్ అంతా కూడా సందడిగా ఉంటుంది.


*పెళ్లి కూడా సినిమాలానే నేను ఏదీ ప్లాన్ చేయలేదు. అలాంటి వాళ్లను ఇలాంటి వాళ్లను చేసుకోవాలని అనుకోలేదు. కరెక్ట్ పర్సన్ దొరికితే చేసుకోవాలని అనుకున్నాను. నా ఇంట్లో కూడా పెళ్లి గురించి ఒత్తిడి చేయరు.


*ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ బాగుందని, చాలా నవ్వుకున్నామని అన్నారు. ఎంటర్టైనింగ్‌గా ఉందని చెప్పారు. చాలా ఓపెన్ అయ్యావని అన్నారు. కామెడీ టైమింగ్, స్పాంటేనిటీ బాగుందని అన్నారు ఆఫీస్‌లో ఎవ్వరూ లేనప్పుడు డ్యాన్స్ చేస్తుంటాను. ఇంత వరకు ఏ సినిమాలోనూ అలా చేయలేదు. ఈ సినిమాలో కొత్త సుశాంత్ కనిపించాడని అన్నారు. అదే బెస్ట్ కాంప్లిమెంట్.


*చాలా కథలు విన్నాను. కానీ ఓ ద్విభాష కథ బాగా నచ్చింది. ఎన్ని విన్నా కూడా మళ్లీ అక్కడికే వెళ్తున్నాను. అది చిలసౌ, ఇచ్చట వాహనములు నిలుపరాదకు భిన్నంగా ఉంటుంది. ఇప్పుడే వివరాలేవీ చెప్పలేను.

Aesthetic First Look Poster of Vijay Sethupathi’s Annabelle Sethupathi Out Now

 Aesthetic First Look Poster of Vijay Sethupathi’s Annabelle Sethupathi Out Now



The makers of Annabelle Sethupathi, a horror fantasy starring Vijay Sethupathi and Tapsee in the lead roles have unveiled the first look poster of the film and it looks aesthetically pleasing. 

We see Vijay Sethupathi and Tapsee carrying a puzzled look on their faces in the poster. There is also horror element as a spooky bungalow is highlighted.

Annabelle Sethupathi has a peculiar plot and it is one of the most awaited OTT releases of the year. The film premieres on Disney + Hotstar on the 17th of September. It is directed by Deepak Sunderrajan and produced by Sudhan Sundaram and G Jayaram.


Aishwarya Rajesh Republic Look Launched By Actress Ramya Krishna

 సుప్రీమ్ హీరో సాయితేజ్ ‘రిప‌బ్లిక్‌’లో ఐశ్వ‌ర్యా రాజేశ్ ఇన్‌టెన్స్ రోల్‌... లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన ర‌మ్య‌కృష్ణ‌




సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌, దేవ్ క‌ట్టా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ `రిప‌బ్లిక్‌`. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలుతుది దశకు చేరుకున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. 


సినిమా ప్రమోషన్స్ .. డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా సినిమాలో కీల‌క పాత్ర‌ల లుక్స్‌ను, వాటికి సంబంధించిన బ్యాక్‌డ్రాప్‌ను విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు హీరో సాయితేజ్‌, కీల‌క పాత్ర చేస్తున్న జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ లుక్ పోస్ట‌ర్స్‌ను విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ లేటెస్ట్‌గా హీరోయిన్ ఐశ్వ‌ర్యా రాజేశ్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.  ఈ పోస్ట‌ర్‌ను సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ విడుద‌ల చేశారు. ‘‘కూలిపోతాం.. కుంగిపోతాం, ఓడిపోతాం! అయినా... నిల‌బ‌డ‌తాం, కోలుకుంటాం, గెలుస్తాం!’’ అని పోస్ట‌ర్‌పై ఉన్న లైన్స్ సినిమాలో మైరా హ‌న్‌స‌న్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఐశ్వ‌ర్యా రాజేశ్ పాత్ర‌లోని ఇన్‌టెన్సిటీని తెలియ‌జేస్తున్నాయి. 


ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్ష‌ణ న‌టులు జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, కాలేజ్ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సాయితేజ్ యాక్టింగ్‌, దేవ్ క‌ట్టా మార్క్ టేకింగ్ డైలాగ్స్‌తో సినిమాపై ఆసక్తి నెలకొంది. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌. కె.ఎల్‌.ప్ర‌వీణ్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. 



న‌టీన‌టులు:

సాయితేజ్

ఐశ్వ‌ర్యా రాజేశ్‌

జ‌గ‌ప‌తిబాబు

ర‌మ్య‌కృష్ణ‌

సుబ్బ‌రాజు

రాహుల్ రామ‌కృష్ణ‌

బాక్స‌ర్ దిన 


సాంకేతిక వ‌ర్గం:

నిర్మాత‌లు: జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు, జీస్టూడియోస్‌, జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్

క‌థ‌, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం:  దేవ్ క‌ట్టా

స్క్రీన్‌ప్లే:  దేవ క‌ట్ట‌, కిర‌ణ్ జ‌య్ కుమార్‌

సినిమాటోగ్ర‌ఫీ:  ఎం.సుకుమార్‌

మ్యూజిక్‌:  మ‌ణిశ‌ర్మ‌

ఎడిట‌ర్‌:  కె.ఎల్‌.ప్ర‌వీణ్


Aakash Puri Launched Batch Trailer

 ఆకాష్ పూరి చేతుల మీదుగా "బ్యాచ్" ట్రైలర్ విడుదల



ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకం పై బేబీ ఆరాధ్య సమర్పణలో సాత్విక్ వర్మ, నేహా పఠాన్ జంటగా  శివ దర్శకత్వంలో రఘు కుంచే సంగీత సారధ్యంలో రమేష్ ఘనమజ్జి నిర్మిస్తున్న మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం బ్యాచ్.  ఈ చిత్రం ట్రైలర్ ను  సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాధ్ గారి తనయుడు పూరి ఆకాష్ విడుదల చేసారు. 


ఈ సందర్భంగా పూరి ఆకాష్ మాట్లాడుతూ "ట్రైలర్ చూసా, చాలా ఆసక్తికరంగా ఉంది. రఘు కుంచే  సంగీతం చాలా హైలైట్ గా ఉంది. పాటలు చాలా బాగున్నాయి. పాటలు మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈచిత్ర నిర్మాత  సినిమాను థియేటర్ లోనే విడుదల చేస్తాను అంటున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో కూడా థియేటర్ లోనే  విడుదల చేస్తాననటం గొప్ప విషయం, మీలాంటి నిర్మాతలు ఇండస్ట్రీ కి కావాలి. సాత్విక్ చైల్డ్ యాక్టర్ గా చాలా సినిమాలు చూసాం. ఇప్పుడు హీరో గా ఎంట్రీ ఇస్తున్నాడు. చాలా పాజిటివ్ గా ఉంటాడు. ఎప్పుడూ నవ్వుతు ఉంటాడు. అల్ ది బెస్ట్ సాత్విక్. ఈ సినిమా మంచి విజయం సాదించాలి" అన్నారు.


ఐటమ్ సాంగ్ గర్ల్ చాందిని మాట్లాడుతూ "నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి మరియు నిర్మాతకి ధన్యవాదాలు. నేను ఐటెం సాంగ్ చేశాను, పాట అద్భుతంగా వచ్చింది. సినిమా హిట్ అవ్వాలి" అని కోరుకున్నారు. 


సహా నిర్మాత సత్తి బాబు కసిరెడ్డి మాట్లాడుతూ "బ్యాచ్ చిత్రానికి మొదటి విజయం రఘు కుంచే సంగీతం. పాటలు అద్భుతంగా వచ్చాయి. దర్శకుడు శివ, కెమెరా మాన్ వెంకట్ మరియు ఇతర టెక్నీషియన్స్ అందరూ బాగా కష్టపడ్డారు. సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని" చెప్పారు


సింగర్ అసిరయ్య బాబాయ్ మాట్లాడుతూ "కూటి కోసం పాటలు పడుకునే నాకు రఘు కుంచే గారు మంచి అవకాశం ఇచ్చారు. మా శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు నన్ను అందరు గౌరవిస్తారు, దానికి కారణం రఘు కుంచే గారు. మా ఊరిలో అందరు ఈ చిత్రం చూస్తారు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది" అన్నారు. 


నటి సంధ్య జనక్ మాట్లాడుతూ "బ్యాచ్ అనేది అందరికి నచ్చే టైటిల్. స్కూల్, కాలేజీ రోజులలో ప్రతి ఒక్కరికీ బ్యాచ్ ఉంటుంది. సినిమా కూడా అందరికి కనెక్ట్ అవుతుంది. రఘు కుంచే గారి మ్యూజిక్ హై లైట్ అవుతుంది. పూరి ఆకాష్ గారు ట్రైలర్ విడుదల చేసారు. వారికీ ధన్యవాదాలు. చిత్రం హిట్ అవ్వాలి" అని ఆకాంక్షించారు. 


నిర్మాత రమేష్ ఘనమజ్జి మాట్లాడుతూ "నాకు నిర్మాతగా అనుభవం లేదు కానీ కథ నచ్చింది. మా దర్శకుడు శివని నమ్మి ముందుకు సాగిపోయాము. మా చిత్రానికి సంగీతమే బలం. అన్ని పాటలు అద్భుతంగా వచ్చాయి. రఘు కుంచే గారికి నా ధన్యవాదాలు. మా హీరో సాత్విక్ బాగా సపోర్ట్ చేసాడు. షూటింగ్ రోజులు పెరిగినా బాగా సపోర్ట్ చేసాడు. నటి నటులు అందరు సహకరించారు. మా చిత్రంలో ముగ్గురు కొత్త సింగర్స్ ని పరిచేయం చేసాం. అసిరయ్య గారి పాట విన్నారు. లక్ష్మి మరియు సాయి సంవిద్ లను పరిచేయం చేసాము. మిగతా పాటలు కూడా త్వరలోనే విడుదల చేస్తాము. ఎడిటర్ జె పి, కెమెరా మాన్ వెంకట్ గారు బాగా సహాయం చేసారు. మా రమేష్ గారు అద్భుతమైన  పబ్లిసిటీ పోస్టర్ డిజైన్ చేసారు. మా చిత్రం యొక్క ట్రైలర్ ని విడుదల చేసిన పూరి ఆకాష్ గారికి ధన్యవాదాలు" అని తెలిపారు. 


హీరోయిన్ నేహా పఠాన్ మాట్లాడుతూ "ఇది నా మొదటి సినిమా. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ కి ధన్యవాదాలు" అని తెలిపారు. 


దర్శకుడు శివ మాట్లాడుతూ "కాకినాడ లో నలుగురి స్నేహితులతో కలిసి ఈ చిత్రాన్ని స్టార్ట్ చేశాను, నిర్మాత రమేష్ గారు ఒక పునాదిగా నిలిచారు. అందరూ కష్టపడి పని చేసాం. సినిమా బాగ వచ్చింది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది" అన్నారు.


హీరో సాత్విక్ వర్మ మాట్లాడుతూ "ఈ కథ వినగానే బాగా నచ్చింది. వెంటనే స్టార్ట్ చేసాము. రఘు గారి సంగీతం మా సినిమా కి ప్రాణం పోసింది. నిర్మాత గారు బాగా సపోర్ట్ చేసారు. ప్రతి టెక్నిషన్ బాగా సపోర్ట్ చేసారు. పూరి ఆకాష్ గారు నా సినిమా ట్రైలర్ విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది"అన్నారు.


సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ "ఇండస్ట్రీలో నాకు లైఫ్ ఇచ్చింది పూరి జగన్నాధ్ గారు. ఇప్పుడు మా బ్యాచ్ సినిమా ట్రైలర్ విడుదల చేయటానికి పూరి గారి అబ్బాయి ఆకాష్ రావటం చాలా సంతోషంగా ఉంది. పెద్ద బ్యానర్ సినిమాలో ప్రయోగం చేద్దాం అంటే రిస్క్ ఎందుకు అనుకుంటారు, కానీ చిన్న సినిమాలో ప్రయోగం చేయటం సులభం. అసిరయ్య బాబాయ్ ట్రైన్ లో పాడుతున్న వీడియో చూసాను. గొప్ప గాయకుడు, ఈ సినిమాతో తనను పరిచయం చేస్తున్నా. అలాగే నిజామాబాద్ దగ్గర ఒక పల్లెటూరులో పెరిగిన అమ్మాయి లక్ష్మి మా చిత్రంలో ఒక మంచి పాట పాడింది. సాయి సంవిద్ అమ్మాయి గొంతులా పాడతాడు. తనతో ఒక మంచి మెలోడీ సాంగ్ పాడించాను. ఈ పాటలు మంచి హిట్ అవుతాయి. బాల నటుడిగా సాత్విక్ 80 సినిమాలు చేసాడు. ఇప్పుడు హీరోగా వస్తున్నాడు. ఈ చిత్రం మంచి హిట్ కావాలని" కోరుకున్నారు.



చిత్రం : బ్యాచ్ 

సమర్పణ : బేబీ ఆరాధ్య

బ్యానర్ : ఆకాంక్ష మూవీ మేకర్స్

నటి నటులు : సాత్విక్ వర్మ, నేహా పఠాన్, బాహుబలి ప్రభాకర్, సంధ్యా జనక్, మిర్చి మాధవి, వినోద్ కుమార్, చిన్న, తదితరులు

కెమెరా : వెంకట్ మన్నం  

సంగీతం : రఘు కుంచే  

కొరియోగ్రఫీ : రాజ్ పైడి 

ఎడిటింగ్ : జె పి 

పి అర్ ఓ : పాల్ పవన్ 

డైరెక్టర్ : శివ 

కో ప్రొడ్యూసర్ : సత్తి బాబు కసిరెడ్డి, అప్పారావు పంచాది 

నిర్మాత : రమేష్ ఘనమజ్జి

Aha announces The Baker and the Beauty, in collaboration with Annapurna Studios

aha announces yet another flagship web series- The Baker and the Beauty, in collaboration with Annapurna Studios



100% Telugu OTT platform aha, a household name for Telugu entertainment, bringing together latest blockbusters and pathbreaking web shows, is lining up a memorable, slice-of-life web original for viewers titled The Baker and the Beauty. The romantic drama starring Santosh Shobhan and Tina Shilparaj in the lead roles is all set to premiere on aha on September 10, 2021. The show is a tale of two opposites, revolving around an unlikely romance between a middle-class youngster Vijay, who manages his parents' small-time bakery and a film star Aira Vasireddy, a loner at heart despite having the world at her feet. The Baker and the Beauty is directed by Jonathan Edwards and marks the first collaboration between aha and reputed production house Annapurna Studio, which has a six-decade legacy in the entertainment industry across multiple mediums.

The first poster of The Baker and the Beauty was unveiled by aha's founder, star producer Allu Aravind, aha’s CEO Ajit Thakur and producer, CEO of Annapurna Studios, Supriya Yarlagadda. The poster sets the ball rolling, introducing the viewers to the contrasting worlds of its lead characters Vijay and Aira Vasireddy. Vijay (played by Santosh Shobhan) is seen alongside a hoarding in a posh locality, featuring an image of the popular actress Aira (essayed by Tina Shilparaj). The on-screen chemistry of the lead actors catches your attention instantly and it'll be interesting to witness the clash of their destinies. Vishnu Priya, Sai Swetha, Sangeeth Shobhan, Srikanth Iyengar, Jhansi Laxmi and Venkat play crucial roles in the show.

The Baker and the Beauty is aha's first Telugu adaptation of Keshet International's globally-acclaimed series by the same name. The first season of the show received high ratings from critics and was widely watched. "We're very happy to collaborate with Annapurna Studios and aha to bring together the international adaptation of our show, The Baker and the Beauty, for Telugu audiences. aha, Annapurna Studios and Keshet International share a unified vision of coming up with content brimming with local flavour that cuts across barriers. The Baker and the Beauty is a show with an undeniable universal appeal comprising beautifully-etched characters that are rooted in their setting. aha has consistently stood out for the quality Telugu original content it has churned out at a record pace and we hope to take this association forward to deliver many memorable shows in the times to come," said Kelly Wright from Keshet International.

"aha has delivered big time in terms of numbers and offering quality entertainment to Telugu viewers with its vast content library of latest movies and genre-bending web originals since its launch. Recently, we've had consecutive successes like Kudi Yedamaithe, that gave the digital space its first sci-fi crime thriller and received immense applause besides Tharagathi Gadhi Daati, a blissful small-town teenage romance that felt like a walk down the memory lane. I must say, this is the beginning of a phase aha is going all out in terms of original offerings, be it films, originals, web shows. With The Baker and the Beauty, it's wonderful to associate with Supriya (Yarlagadda) and a production house as illustrious as Annapurna (Productions) that has a legacy of its own across multiple mediums over six decades. I can't wait for audiences to watch the performances of the lead actors Santosh Shobhan, Tina Shilaparaj and Vishnu Priya; they have a bright future ahead of them," said Allu Aravind, founder of aha.

The show has been adapted in Telugu keeping in view the sentiments and sensibilities of a different audience. Beyond its lead characters and the rom-com setting, the feel-good show offers a grounded picture of the conflicts, aspirations across Telugu middle-class households and the elite sections of the society with a pinch of humour and sensitivity. The romance chapter in the lives of a 'pakka local' guy and a young damsel in distress promises a rollercoaster ride of emotions for the viewer.

The Baker and the Beauty promises to be another feather in the cap for aha, which had premiered the country's first sci-fi crime thriller in the Indian digital space, Kudi Yedamaithe, recently. Directed by Pawan Kumar, the show, starring Amala Paul and Rahul Vijay, received applause from audiences and critics alike. The platform has hogged the limelight in 2021 for premiering popular movies and shows including Krack, 11th Hour, Zombie Reddy, Chaavu Kaburu Challaga, Naandhi, In the Name of God, Needa, Kala, aha Bhojanambu, One and Chathur Mukham.

Cast:

Santosh Shoban, Tina Shilparaj, Vishnu Priya, Sangeeth Shoban, Sai Swetha

Srikanth Iyengar, Jhansi Laxmi, Venkat

Crew:

Producer : Supriya Yarlagadda, Director: Jonathan Edwards , Creative Producer: Maheshwar Reddy Gojala, DOP: Suresh Ragutu, Music: Prashanth R Vihari, Edit: Nageswar Reddy Bonthala, Executive producer: Anand Reddy Karnati, Art: Jhansi Lingam, Costumes:Rajini.

 About Keshet International:

The Baker and the Beauty is aha's first Telugu adaptation of Keshet International's globally-acclaimed series by the same name, which was created by Assi Azar for Israel’s most-watched TV channel, Keshet 12. Following widespread critical acclaim and ratings records in Israel (both seasons one and two were the most watched dramas in their respective broadcast years), the romantic comedy returns to Keshet 12 for a third season this autumn. To date, Keshet International has licensed the format in various territories for local adaptations: including the United States for ABC (produced by Keshet Studios and Universal Television); the Netherlands for NET5; Russia for CTC; with more deals in negotiation. 

Jaathiya Rahadhari Lyrical Song Released By Yandamuri

 ప్రముఖ రచయిత, దర్శకుడు యండమూరి వీరేంద్రనాధ్ గారి చేతుల మీదుగా "జాతీయరహదరి" లిరికాల్ సాంగ్ లాంచ్ 



భీమవరం టాకీస్ పతాకంపై మధు చిట్టె ,సైగల్ పాటిల్ , మమత, ఉమాభారతి, మాస్టర్  నందిరెడ్డి. ధక్షిత్ రెడ్ది, నటీనటులుగా నరసింహ నంది దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం "జాతీయరహదరి" అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ నెల 10 న త ప్రపంచ వ్యాప్తంగా  200 థియేటర్స్ లో విడుదల కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత దర్శకుడు యండమూరి వీరేంద్రనాధ్ గారి చేతుల మీదుగా  జాతీయరహదరి లిరికాల్ సాంగ్ విడుదల చేశారు.. అనంతరం 


 *యండమూరి వీరేంద్రనాధ్ మాట్లాడుతూ..* దర్శకుడు నరసింహ నంది ప్రతిభ కలిగిన నేషనల్ అవార్డ్ గ్రహీత అని ట్రైలర్ చాలా బాగుంది ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి అని తెలియజేసారు. 


 *నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ* ...నాకు ఎంతో  ఇష్టమైన శ్రీ యండమూరి గారి చేతులు మీదుగా ఈ సాంగ్ విడుదల చేయటం ఆనంద దాయకం అని నరసింహ నంది. అద్భుతమైన దర్శకుడు అని అతని ని నమ్మి దర్శక భాద్యతలు అప్పగించాను దానికి 100% న్యాయం చేశారు..ఈ సినిమా హిట్ అతని ఖాతాలో కె వెల్లుతాదీ అన్నారు. 



 *నటి నటులు* -

మధు చిట్టె ,సైగల్ పాటిల్ , మమత, ఉమాభారతి, మాస్టర్  నందిరెడ్డి. ధక్షిత్ రెడ్ది, అభి, తెల్జెరు మల్లెష్, తరని,గొవిందరాజు, ఘర్షణ శ్రీనివాస్., విజయ భాస్కర్, సిద్దిపెట రవి 


 *సాంకెతిక వర్గం ,* 

సినిమాటొగ్రఫి :- యస్ మురలి మొహన్ రెడ్డి,

సంగీతం :- సుక్కు,

పాటలు :;- మౌన శ్రీ మల్లిక్, 

ఎడీటర్ :; వి నాగిరెడ్డి, 

నిర్మాత :- తుమ్మలపల్లి రామసత్యనారాయణ.,

రచన దర్శ కత్వం :; నరసింహ నంది...

సమర్పణ.:- సంధ్య స్టూడియోస్ రవి కనగల.

పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్

Actress Poorna Special Guest for RMS Groups Pvt Ltd Launch

 ప్రముఖ హీరోయిన్ పూర్ణ 

ముఖ్య అతిధిగా ఆగస్టు 27న

*ఆర్.ఎమ్.ఎస్.గ్రూప్స్* 

*ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ* ప్రారంభోత్సవం!!!




      సినిమా పరిశ్రమకు, సినిమా ప్రియులకు మదనపల్లి సుపరిచితమే. ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్య దర్శనీయ ప్రాంతాల్లో మదనపల్లి ఒకటనే విషయం తెలిసిందే. మదనపల్లిలో హార్సిలీ హిల్స్ లో వివిధ భాషలకు చెందిన సినిమాలు నిత్యం షూటింగ్ జరుపుకుంటూ ఉంటాయి. 

     ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మదనపల్లిలో... శరవేగంగా అభివృద్ధి చెందుతున్న "ఆర్.ఎమ్.ఎస్.గ్రూప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ"... మరింతగా విస్తరించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఆగస్టు 27, శుక్రవారం ఉదయం ప్రముఖ హీరోయిన్ పూర్ణ  ప్రారంభిస్తున్నది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకోనున్నారు.

     వేలాదిమందికి ఉపాధి కల్పించే ఐ.టి.కంపెనీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొనే అవకాశం లభించడం తనకు చాలా సంతోషాన్నిస్తోందని పూర్ణ పేర్కొన్నారు. ఆగస్టు 27, శుక్రవారం మదనపల్లి సందర్శన కోసం సన్నాహాలు చేసుకుంటున్నానని పూర్ణ తెలిపారు!!

House Arrest Pre Release Event Held Grandly

 



‘హౌస్ అరెస్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్


నిర్మాణ సంస్థ‌, డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో ప్రేక్ష‌కులను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది. ఈ క్రమంలో ఈ బ్యాన‌ర్‌లో తొలి చిత్రంగా ‘హౌస్ అరెస్ట్‌’ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.  థియేట‌ర్స్‌లో ఆగ‌స్ట్ 27న‌ విడుద‌లవుతున్న ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, స‌ప్త‌గిరి, అదుర్స్ ర‌ఘు, ర‌విప్ర‌కాశ్‌, ర‌విబాబు, తాగుబోతు ర‌మేవ్‌, ఫ్ర‌స్టేటెడ్ సునైన‌, కౌశిక్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. శేఖ‌ర్ రెడ్డి ఎర్రా ద‌ర్శ‌క‌త్వంలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌శాంత్ వ‌ర్మ‌ రామ్ ప్ర‌సాద్‌, చంద్ర‌మ‌హేశ్‌, అశోక్ రెడ్డి, ఎన్‌.శంక‌ర్‌, చందు రెడ్డి తదితరులు పాల్గొని బిగ్ టిక్కెట్టుని విడుదల చేశారు. ఈ సందర్భంగా...


సోహైల్ మాట్లాడుతూ ‘‘ఓరోజు డైరెక్ట‌ర్ శేఖ‌ర్ రెడ్డిగారు ఫోన్ చేసి చిన్న పిల్ల‌ల మూవీ చేస్తున్నామ‌ని అన్నారు. ఈ సినిమాలో చేసిన పిల్ల‌లు..పిల్ల‌ల్లాగా లేరు పిడుగుల్లాగా అనిపిస్తున్నారు. ఈ సినిమాను చిన్న‌పిల్ల‌లే కాదు, పెద్ద‌వాళ్లు కూడా చూసేంత బాగా ఉంటుంది. శ్రీనివాస‌రెడ్డ‌న్న‌, స‌ప్త‌గిర‌న్న‌, ర‌మేశ‌న్న ఇలా మంచి ఆర్టిస్టులు కూడా న‌టించారు. 90 ఎం.ఎల్ వంటి క‌మ‌ర్షియ‌ల్ మూవీ త‌ర్వాత శేఖ‌ర్ రెడ్డిగారు చిన్న‌పిల్ల‌లు చేయ‌డ‌మ‌నేది ఆయ‌న ప్యాష‌న్‌ను తెలియ‌జేస్తోంది. ఇక కాన్సెప్ట్‌కు త‌గిన‌ట్లు అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చే అనూప్ రూబెన్స్‌గారు, ఈ సినిమాకు ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యూజిక్‌ను అందించారు. అంద‌రూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది’’ అన్నారు.


డైరెక్ట‌ర్ శేఖ‌ర్ రెడ్డి ఎర్రా మాట్లాడుతూ ‘‘‘90 ఎం.ఎల్‌’ త‌ర్వాత హౌస్ అరెస్ట్ అనే సినిమా చేయ‌డానికి కార‌ణం అనూప్ రూబెన్స్‌. నా త‌ల్లిదండ్రుల‌కు, నా సినిమా గురువు చంద్ర మ‌హేశ్‌గారికి, డైరెక్ట‌ర్‌గా జ‌న్మ‌నిచ్చిన హీరో కార్తికేయ‌గారికి, నిర్మాత అశోక్ రెడ్డిగారికి ధ‌న్య‌వాదాలు. వారికెప్పుడూ రుణ‌ప‌డి ఉంటాను. ఈ జ‌న‌రేష‌న్‌లో పిల్ల‌లు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారు. ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు వారెలా రియాక్ట్ అవుతున్నారనే విష‌యాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. శ్రీనివాస్‌రెడ్డిగారు, స‌ప్త‌గిరిగారు, అదుర్స్ ర‌ఘుగారు, ర‌విబాబుగారు, ర‌విప్ర‌కాశ్‌గారు, కౌశిక్‌ల‌తో పాటు జాను, శివ‌, నేత్ర‌, రితేశ్‌, వ‌శీక‌ర్‌, ఆహా, ఖుషి వంటి చిన్న‌పిల్ల‌లు కూడా న‌టించారు. ఓ ఇంట్లోకి అర్ద‌రాత్రి దొంగ‌లు ప‌డ్డ‌ప్పుడు ఆ ఇంట్లోని పిల్ల‌లు వారినెలా ఆడుకున్నార‌నేదే ఈ సినిమా. యువరాజ్‌గారి సినిమాటోగ్ర‌ఫీ, అనూప్‌గారి మ్యూజిక్ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. టీమ్‌లో ప్ర‌తి ఒక్క‌రూ రాత్రిప‌గ‌లు క‌ష్ట‌ప‌డ్డారు. ప్రైమ్ షో నిరంజ‌న్ రెడ్డిగారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ అశ్రిన్ రెడ్డిగారు, చైత‌న్య‌గారు న‌మ్మ‌కంతో మ‌మ్మ‌ల్ని ముందుకు న‌డిపారు. ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్మెంట్ నాకు పున‌ర్జ‌న్మ ఇచ్చారు. క‌థ విన‌గానే కొత్త‌గా ఉంద‌ని మంచి బ‌డ్జెట్‌తో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యారు. నిర్మాతల వ‌ల్ల‌నే  సినిమా ఇంత రిచ్‌గా క‌నిపిస్తుంది. పిల్ల‌ల గురించి చేసిన తారె జ‌మీన్ ప‌ర్‌, సీక్రెట్ సూప‌ర్‌స్టార్ వంటి సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అంద‌రికీ తెలిసిందే. తెలుగులో పిల్ల‌ల సినిమాలు వ‌చ్చి 15 ఏళ్ల అవుతున్నాయి. చాలా గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్న మంచి పిల్ల‌ల సినిమా ఇది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు చూసేలా సినిమా ఉంటుంది. ఆగ‌స్ట్ 27న విడుద‌ల‌వుతున్న ఈ సినిమాను ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ‘‘చిన్న పిల్లలతో చేసిన హిలేరియస్ ఎంట‌ర్‌టైన‌ర్ మా హౌస్ అరెస్ట్‌. నిరంజ‌న్ రెడ్డిగారు, అశ్రిత్ రెడ్డి, చైత‌న్య‌గారు మంచి టీమ్‌తో చ‌క్క‌టి ప్ర‌య‌త్నం చేశారు. ప్రైమ్ షో చేస్తున్న ఈ తొలి ప్రాజెక్ట్ చాలా పెద్ద హిట్ కావాలి. శేఖ‌ర్ రెడ్డిగారు సినిమాను చాలా బాగా తెర‌కెక్కించారు. సినిమాను బాగా ఎంజాయ్ చేస్తూ చేశాం. ఈ నెల 27న విడుద‌లవుతున్న ఈ చిత్రం, థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల‌ను అరెస్ట్ చేస్తుంద‌ని అనుకుంటున్నాం’’ అన్నారు.


స‌ప్త‌గిరి మాట్లాడుతూ ‘‘సాధారణంగా 90 ఎం.ఎల్ వంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమా త‌ర్వాత ఎవ‌రైనా నెక్ట్స్ కూడా క‌మ‌ర్షియ‌ల్ సినిమానే చేస్తారు. కానీ.. శేఖ‌ర్ రెడ్డిగారు ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారి స‌పోర్ట్‌తో చిన్న పిల్ల‌ల సినిమా చేయడం గొప్ప విష‌యం. ఆయన గ‌ట్స్‌కు థాంక్స్‌. స్క్రిప్ట్‌ను న‌మ్ముకుని ఓ య‌జ్ఞంలా శేఖ‌ర్‌గారు సినిమా పూర్తి చేశారు. పిల్ల‌లంటే దేవుళ్ల‌తో స‌మానం. వారి కోస‌మైనా సినిమా పెద్ద హిట్ అవుతుంది. నిర్మాత‌లు నిరంజ‌న్ రెడ్డిగారు, అశ్రిత్‌రెడ్డి, చ‌ర‌ణ్‌గారికి అభినంద‌న‌లు’’ అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ ‘‘శేఖ‌ర్ రెడ్డిగారు చాలా ఫాస్ట్‌గా సినిమాలు తీసే ద‌ర్శ‌కుల లిస్ట్‌లో ఉంటారు. చిన్న‌పిల్ల‌ల‌పై సినిమా చేయ‌డం చాలా గొప్ప విష‌యం. ఆయ‌న ఈ సినిమాను ఇంత బాగా తీయ‌డానికి కార‌ణం నిర్మాత‌లు నిరంజ‌న్ రెడ్డి, అశ్రిత్ రెడ్డి, చైత‌న్య‌గారు. వారికి హ్యాట్పాఫ్‌. ఇలా వాళ్లు ఇంకా మంచి సినిమాలు చేసి పెద్ద నిర్మాత‌లుగా పేరు తెచ్చుకోవాలి. శ్రీనివాస్‌రెడ్డిగారు, స‌ప్త‌గిరిగారు, తాగుబోతు ర‌మేశ్‌గారు.. ఇలా  నాకు ఇష్ట‌మైన క‌మెడియ‌న్స్ ఈ సినిమాలో ఉన్నారు. ఇంత మంచి టీమ్‌తో చేసిన ఈ సినిమా ఆగస్ట్ 27న విడుదలవుతుంది. సినిమా చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.  


డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ‘‘నిరంజన్ రెడ్డిగారితో నా నెక్ట్స్ మూవీ చేస్తున్నాను. చిన్నపిల్లల సినిమా అంటే చిన్నగా ఉంటుందేమో అనుకున్నాను. టెక్నీషియ‌న్స్ పేర్లు చూస్తే యువ‌రాజ్‌గారు, అనూప్‌గారు వంటి పేర్లు క‌నిపించాయి. చిన్న‌పిల్లల సినిమాను ఇంత రిచ్‌గా చేశారంటే, నా సినిమాను ఎంత బాగా చేస్తారోన‌నిపించింది. సినిమాపై ప్యాష‌న్ ఉన్న నిర్మాత‌లు. నేను వారితో క‌లిసి ట్రావెల్ అవుతుండ‌టం చాలా హ్యాపీగా ఉంది. శ్రీనివాస్‌రెడ్డిగారు, స‌ప్త‌గిరిగారు, తాగుబోతు ర‌మేశ్‌గారు, ర‌ఘుగారు, కౌశిక్‌ ఇలా చాలా మంచి ఆర్టిస్టులు వ‌ర్క్ చేశారు. యువ‌రాజ్‌గారు, అనూప్‌గారు సినిమాకు వ‌ర్క్ చేసిన తీరు అద్భుతం. పిల్ల‌ల‌తో పాటు ఎంటైర్ ఫ్యామిలీ సినిమాను చూసి హిట్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ ‘‘క‌రోనా కార‌ణంగా విధించిన లాక్‌డౌన్స్‌తో ప్ర‌జ‌లంద‌రూ చెప్ప‌లేని హౌస్ అరెస్ట్‌ను ఫీల్ అయ్యారు. పిల్ల‌ల‌తో పాటు పెద్ద ఆర్టిస్టులు కూడా చ‌క్క‌టి ఎఫ‌ర్ట్స్ పెట్టార‌ని అర్థ‌మ‌వుతుంది. ద‌ర్శ‌కుడు శేఖ‌ర్‌, క‌రోనా స‌మ‌యంలో ఓ స్క్రిప్ట్‌ను ఓకే చేయించి చాలా త్వ‌ర‌గా పూర్తి చేయ‌డం విశేషం. నిరంజ‌న్ రెడ్డి, అశ్రిత్‌ల‌కు ఈ సినిమా నిర్మాత‌గా చాలా మంచి పేరు తెచ్చిపెట్టాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


కౌశిక్ మాట్లాడుతూ ‘‘నేనుకూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గానే కెరీర్ స్టార్ట్ చేశాను. వీరితో వ‌ర్క్ చేస్తుంటే, నాకు పాత రోజులు గుర్తుకు వ‌చ్చాయి. చాలా గ్యాప్ త‌ర్వాత చిన్న పిల్ల‌లు సినిమా చూడ‌బోతున్నాం. శేఖ‌ర్ రెడ్డిగారు సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. సినిమాను పెద్ద హిట్ చేస్తే ఇలాంటి చిన్న‌పిల్ల‌ల సినిమాలు ఎక్కువ‌గా వ‌స్తాయి’’ అన్నారు.


తాగుబోతు ర‌మేశ్ మాట్లాడుతూ ‘‘శేఖ‌ర్ రెడ్డిగారి చేసిన 90 ఎం.ఎల్ సినిమాలో యాక్ట్ చేశాను. ఇప్పుడీ సినిమాలో మంచి రోల్ చేశాను. ఆగ‌స్ట్ 27న సినిమా రిలీజ్ అవుతుంది. క‌రోనా కార‌ణంగా హౌస్ అరెస్ట్‌లో ఉన్న‌వాళ్లంద‌రూ ఈ సినిమా చూస్తే రిలాక్స్ అవుతారు. యువ‌రాజ్‌గారు, అనూప్‌గారు చాలా పెద్ద రేంజ్‌లో ఎలివేట్ చేశారు. పిల్ల‌లు అద్భుతంగా న‌టించారు’’ అన్నారు.



Ichata Vahanalu Niluparadhu Pre Release Event Held Grandly


‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ ప్రీ రిలీజ్ ఈవెంట్



సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’. ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో లెజెండ్రీ న‌టి భానుమ‌తి రామ‌కృష్ణ మ‌న‌వ‌డు ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల‌గుండ్లల‌తో క‌లిసి ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 27న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి స్టార్ రైట‌ర్‌, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో సుశాంత్‌, హీరోయిన్ మీనాక్షి చౌద‌రి, నిర్మాత హ‌రీశ్‌, డైలాగ్ రైట‌ర్ సాయిబాబా, అభిన‌వ్ గోమ‌టం, సినిమాటోగ్రాఫ‌ర్ సుకుమార్‌, పాట‌ల ర‌చ‌యిత శ్రీనివాస్ మౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు, అవసరాల శ్రీనివాస్, వి.ఎన్.ఆదిత్య, జెమినీ కిరణ్, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రోల్ రైడా, ఎడిటర్ గ్యారీ  తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...


స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘ఇండియాలోనే కాదు, ప్ర‌పంచం మొత్తం మీద థియేట‌ర్‌కు రావ‌డానికి సాహ‌సిస్తున్న జాతి.. తెలుగు జాతి మాత్ర‌మే. ఏమీ భ‌య‌ప‌డ‌క్క‌ర్లేదు. మంచి కంటెంట్ క్రియేట్ చేసి మ‌రింత ముందుకు వెళ్దాం. ఈ సినిమా చేయ‌బోతున్న‌ట్లు అల వైకుంఠ‌పుర‌ములో షూటింగ్ టైమ్‌లోనే సుశాంత్ చెప్పాడు. సినిమా చాలా బాగా వ‌చ్చింద‌ని నేను కూడా బ‌య‌ట వింటున్నాను. సుశాంత్ త‌న‌కు తెలియ‌కుండా ఓ చ‌ట్రంలో ఇరుక్కుపోయాడ‌ని అనుకునేవాడిని. అయితే నాకు తెలిసి చి.ల‌.సౌ సినిమాతో త‌న‌ను తాను కొత్త‌గా ఆవిష్క‌రించుకునే ప‌నిలో ప‌డ్డాడు. ఆ సినిమా చూసే త‌న‌ని నా అల వైకుంఠ‌పుర‌ములో యాక్ట్ చేయ‌మ‌ని అడిగాను. ఇప్పుడు త‌న హ్యాట్రిక్ మూవీ ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు. ఈ సినిమాతో ప్రొడ్యూస‌ర్ నుంచి గ‌వ‌ర్న‌మెంట్‌కు బోల్డెంత ట్యాక్స్ క‌ట్టించాలి. డైరెక్ట‌ర్ ద‌ర్శ‌న్‌.. ఫస్ట్ మూవీ ఎలా ఉంటుందో తెలుసు. ఓ సినిమాను మిక్సింగ్ చేసి వ‌దిలేస్తుంటే మ‌నింటి ఆడపిల్ల‌ను ఎవ‌రికో ఇచ్చేసి పంపిచేస్తున్న‌ట్లుగా ఉంటుంది. అందులో ఫ‌స్ట్ మూవీ అనేస‌రికి ఇంకా బాధ‌గా ఉంటుంది. కాకుంటే ఆడపిల్ల వెళ్లి సెప‌రేట్ ఎస్టాబ్లిష్ ఎలా చేస్తుంద‌నే ఆనందంగా పంపిస్తామో, సినిమా కూడా దాని జీవితాన్ని అది వెతుక్కుని, ప్ర‌జ‌ల జీవితాల్లోకి వెళ్లిపోయి. థియేట‌ర్స్‌లో, టీవీల్లో, మొబైల్ ఫోన్స్‌లో, కామెడీ సీన్స్‌లో, సాంగ్స్‌లో, షోస్‌లో దానికి తాలుకు శ‌బ్దం వినిపిస్తున్న‌ప్పుడు, దాని జీవితం తాలుకు స్పాన్ పెరుగుతున్న‌ప్పుడు మ‌న‌కు మ‌రింత ఆనందంగా, గ‌ర్వంగా, ఉత్సాహంగానూ ఉంటుంది. అలాంటి రోజులు మ‌రిన్ని ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌న్‌కు రావాల‌ని కోరుకుంటున్నాను. ప్రవీణ్ ల‌క్క‌రాజు మ్యూజిక్ బాగా న‌చ్చింది. యాక్ట‌ర్ వెంక‌ట్.. ట్రూ హైద‌రాబాదీ. నేను హైద‌రాబాద్ వ‌చ్చిన కొత్త‌ల్లో ఈయ‌న న‌టించిన సీతారాముల క‌ళ్యాణం చూత‌మురారండి సినిమా చూశాను. నా ఫేవ‌రేట్ యాక్ట‌ర్ అభిన‌వ గోమ‌టం, మీనాక్షి చౌద‌రి ఆల్ ది బెస్ట్‌. ప్రియ‌ద‌ర్శిని పెళ్లిచూపుల నుంచి చూస్తున్నాను. సిన్సియ‌ర్ యాక్ట‌ర్‌. ఇలా అంద‌రికీ అభినంద‌న‌లు. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


హీరో సుశాంత్ మాట్లాడుతూ ‘‘మా సినిమా ప్రమోషన్స్ ప్రభాసన్న విడుదల చేసిన టీజర్‌తో స్టార్ట్ అయ్యింది. త‌ర్వాత స‌మంత‌, వ‌రుణ్‌, చైత‌న్య సాంగ్స్‌ను, చిన్న‌మామ‌(నాగార్జున‌) ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. అంద‌రూ మాకు కావాల్సిన బూస్ట్ ఇచ్చారు. అంద‌రికీ పేరు పేరునా థాంక్స్‌. త్రివిక్ర‌మ్‌గారు చాలా బిజీగా ఉన్న‌ప్ప‌టికీ నేను అడిగాన‌ని వ‌చ్చాడు. నేను తొలి మూడు నాలుగు సినిమాలను లెక్క‌లు వేసుకుని చేశాను. అంద‌రం క‌ష్ట‌ప‌డే చేశాం. అయితే అంత క్లారిటీ లేక‌పోయింది. చి.ల‌.సౌ స‌మ‌యంలో నాగార్జున మామ‌య్య న‌న్ను పిలిచి సినిమా ఆడినా, ఆడ‌క‌పోయినా ఇండిపెండెంట్‌గా ఆలోచించ‌మ‌ని స‌ల‌హా ఇచ్చారు. కొత్త హీరోలా ఆలోచించి రాహుల్‌తో క‌లిసి కొత్త జ‌ర్నీలా స్టార్ట్ చేశాం. ఆ సినిమా చేసిన‌ప్పుడు నేను ఊహించ‌లేదు కూడా. ఆ టైమ్‌లో నన్ను న‌మ్మి సినిమా చేసిన నిర్మాత‌ల‌కు థాంక్స్‌. రాహుల్ సినిమాను చైత‌న్య‌, స‌మంత‌ల‌కు చూపించాడు. చైత‌న్య‌కు సినిమా న‌చ్చింది. చైత‌న్య ఆ సినిమాను నాగార్జున‌కు చూపించాడు. ఆయ‌న న‌చ్చ‌డంతో ఆయ‌న పార్ట్‌న‌ర్‌గా మారి సినిమా రిలీజ్ చేశారు. అక్క‌డి నుంచి ఇండిపెండెంట్‌గా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం స్టార్ట్ చేశాను. అల వైకుంఠ‌పుర‌ములో సినిమాను త్రివిక్ర‌మ్‌గారు అడ‌గ్గానే ఏమీ ఆలోచించ‌కుండా చేస్తాన‌ని అన్నాను. అందుకు కార‌ణం అక్క‌డ బ‌న్నీ, ట‌బుగారు ఇలా అంద‌రూ ఉంటారు. ఏదైనా నేర్చుకోవ‌చ్చున‌ని నా ఫీలింగ్‌. అక్క‌డ నుంచి కొత్త మూమెంట్ స్టార్ట్ అయ్యింది. ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమా విష‌యానికి వ‌స్తే డైరెక్ట‌ర్ ద‌ర్శ‌న్‌ను హ‌రీశ్ ద్వారా సాగ‌ర్‌గారు నాకు ప‌రిచ‌యం చేశారు. క‌థ న‌చ్చింది. అయితే అప్ప‌టికే ఆ క‌థ‌కు అడ్వాన్స్ ఇచ్చిన నిరంజ‌న్ రెడ్డిగారు, నేను రిక్వెస్ట్ చేయ‌డంతో, నీకు బావుంటుంది చేయ‌మ‌ని అన్నాడు. శ్రీనివాస్ అవ‌స‌రాల క‌థ విని కొన్ని చిన్న చిన్న స‌ల‌హాలు ఇచ్చాడు. హ‌రీశ్ ఇత‌ర స్నేహితులు ఎంతో స‌పోర్ట్ చేశారు. ఎంటైర్ టీమ్‌కు థాంక్స్‌. చి.ల‌.సౌకు వ‌ర్క్ చేసిన సుకుమారన్‌గారు ఈ సినిమాకు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాకు ర‌విశంక‌ర్ శాస్త్రిగారు, ఏక్తా శాస్త్రిగారు బ్యాక్‌బోన్‌లా నిల‌బ‌డ్డారు. పెద్ద స్టార్‌ను కాదు, కొత్త హీరోయిన్‌, డెబ్యూ డైరెక్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ, మాపై న‌మ్మ‌కంతో ఎక్క‌డ ఖ‌ర్చు పెట్టాలో అక్క‌డ ఖ‌ర్చు పెడుతూ సినిమా చేశారు. ఓటీటీ ఆఫ‌ర్స్ కూడా వ‌చ్చాయి. కానీ నిర్మాత‌లు థియేట‌ర్స్‌లోనే విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందుకు ర‌విశంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రిగారు అందించిన స‌పోర్ట్‌కు థాంక్స్‌. ప్రవీణ్ ల‌క్క‌రాజు అమేజింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. త‌ను భవిష్య‌త్తులో పెద్ద మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవుతాడు. ద‌ర్శ‌న్ ఈ క‌థ‌ను చెప్ప‌డానికి ముందు మ‌రో క‌థ‌ను చెప్పాడు. డార్క్ క‌థ కావ‌డంతో నిరంజ‌న్‌గారి ప‌ర్మిష‌న్‌తో ఈ సినిమా చేశాం. నిజ ఘ‌ట‌న ఆధారంగా చేసుకుని చేసిన సినిమా. నా పాత్ర‌లో చాలా షేడ్స్ ఉన్నాయి. చాలా ఓపెనెప్ అయ్యి ఈ సినిమా చూశాను. ఇలాంటి పాత్ర‌ను నాకు ఇచ్చిన ద‌ర్శ‌న్‌కు థాంక్స్‌. కొత్త సుశాంత్‌ను ద‌ర్శ‌న్ చూపించాడు. హ‌రీశ్ నా సినిమాకు నిర్మాతే కాదు, మంచి స్నేహితుడు కూడా. చి.ల‌.సౌకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా ఉన్న హ‌రీశ్‌, ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమాకు నిర్మాత‌గా మారాడు. మ‌మ్మ‌ల్నంద‌రినీ క‌లిపి సినిమా చేశాడు. ముంబైలో వ‌ర్కింగ్ షాప్‌లో మీనాక్షి చౌద‌రిని క‌లిశాను. అప్పుడు ఈ సినిమాలో చేయ‌మ‌ని అడిగాను. పెర్ఫామెన్స్ రోల్ అది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే మీనాక్షి చౌద‌రి చాలా బిజీగా మారిపోయింది. త‌ను ఇంకా బిజీ హీరోయిన్‌గా మారాలి. గ్యారీ సినిమాను అద్భుతంగా ఎడిట్ చేశాడు. సురేశ్‌బాబా, భాస్క‌ర్ చాలా క‌నెక్టింగ్ డైలాగ్స్ రాశారు. కృష్ణ చైత‌న్య చాలా మంచి పాత్ర చేశాడు. వెంక‌ట్‌గారు నాకు ఎప్ప‌టి నుంచో తెలుసు. తాత‌గారితో క‌లిసి ప‌నిచేశారు. వెంక‌ట్‌గారు ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశారు. అలాగే ఈ సినిమాలో అభిన‌వ్‌ను చాలా కొత్త‌గా క‌నిపిస్తాడు. ఇక ప్రియ‌ద‌ర్శి చాలా ఇంపాక్ట్ రోల్ చేశాడు. వెన్నెల‌కిషోర్‌గారు బిజీగా ఉన్నా డేట్స్ అడ్జ‌స్ట్ చేసి సినిమా చేశాడు. ఈ సినిమా కాన్సెప్ట్ బేస్డ్. కానీ ఎంట‌ర్‌టైనింగ్‌గా చేశాం. త‌ప్ప‌కుండా ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను  సాలిడ్‌గా ఎంట‌ర్ టైన్ చేస్తుంద‌ని గ్యారంటీ ఇస్తున్నాను’’ అన్నారు.


నిర్మాత రవి శంకర్ శాస్త్రి మాట్లాడుతూ ‘‘మా టీమ్ కోసం వ‌చ్చిన త్రివిక్ర‌మ్‌గారికి థాంక్స్‌. పెద్ద‌మ్మమ్మ‌గారితో ఉండే అనుబంధం కార‌ణంగా నాకు చిన్న‌ప్పుడు సినీ ఇండ‌స్ట్రీతో ప‌రిచయం ఉండింది. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టాను. అయితే మంచి స‌పోర్ట్ దొరికింది. సుశాంత్ అంద‌గాడే కాదు, తెలివైనవాడు, బాగా క‌ష్ట‌ప‌డ‌తాడు. త‌న ఎఫ‌ర్ట్స్ ఈ సినిమాలో కనిపిస్తాయి. ఆగ‌స్ట్ 27న విడుద‌లవుతున్న మా ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమాను స‌క్సెస్ చేయాలి’’ అన్నారు.


నిర్మాతఏక్తా శాస్త్రి మాట్లాడుతూ ‘‘త్రివిక్రమ్‌గారికి థాంక్స్‌. సుశాంత్‌, ద‌ర్శ‌న్‌, మీనాక్షి స‌హా ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు. ఆగ‌స్ట్ 27న విడుద‌ల‌వుతున్న సినిమాను అంద‌రూ ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


దర్శకుడు ఎస్‌.ద‌ర్శ‌న్ మాట్లాడుతూ ‘‘ఎన్నో ఏళ్ల క‌ల నేర‌వేరిన రోజుది. నాకు అండ‌గా నిల‌బ‌డిన కుటుంబ స‌భ్యుల‌కు థాంక్స్‌. 2010లో నాకు, నా స్నేహితుడికి ఎదురైన ఓ నిజ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేశాను. ఢ‌మ‌రుకం సినిమా చేసే స‌మ‌యంలో నా తోటి అసిస్టెంట్స్‌కు చెబితే సినిమాగా చేస్తే బాగుంటుంద‌ని వాళ్లు స‌ల‌హా ఇచ్చారు. దాంతో అప్ప‌టి నుంచి ఈ క‌థ‌ను డెవ‌ల‌ప్ చేశాను. 2013లో క‌థ పూర్త‌య్యింది. చాలా మంది ఈ క‌థ విన్నారు. ఈ క‌థ ఎప్పుడు సినిమాగా వ‌స్తుందోన‌నే క్యూరియాసిటీ ఎక్కువ‌గా ఉండేది. చివ‌ర‌కు సుశాంత్‌గారితో సినిమా చేశాను. ఈ సినిమా చేయ‌డానికి కార‌ణం.. నా స్నేహితులు అభిన‌వ్ గోమ‌టం, ప్రియ‌ద‌ర్శి. వాళ్లు ఇచ్చిన ఎంక‌రేజ్‌మెంట్‌తో ఇక్క‌డ‌కు వ‌చ్చాను. ముందుగా గ్యారీకి ఈ క‌థ చెబితే, త‌ను న‌న్ను నిరంజ‌న్ రెడ్డిగారికి ప‌రిచ‌యం చేశారు. ఆయ‌న‌కు క‌థ బాగా న‌చ్చింది. ఆయ‌న సినిమా చేస్తాన‌ని అన్నారు. కానీ ఆయ‌న‌కున్న క‌మిట్‌మెంట్స్ కార‌ణంగా, సినిమా వాయిదా ప‌డింది. అప్పుడు మ‌రో క‌థ‌ను రెడీ చేసుకుని మ‌ళ్లీ మ‌రో సినిమా కోసం ట్ర‌య‌ల్స్ స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు డైరెక్ట‌ర్ సాగ‌ర్ ప‌రిచ‌యం అయ్యారు. ఆయ‌న సుశాంత్‌గారితో సినిమా చేద్దామ‌ని, హ‌రీశ్‌గారికి ప‌రిచ‌యం చేశారు. నేను చెప్పిన సుశాంత్‌గారికి న‌చ్చింది. అయితే, ఆయ‌న మ‌రో క‌థ‌తో సినిమా చేద్దామ‌ని అన్నారు. అప్పుడు నిరంజ‌న్ రెడ్డిగారికి క‌థ చెప్పాన‌ని, ఆ క‌థ మీకు చెప్ప‌లేన‌ని అన్నాను. అప్పుడు సుశాంత్‌గారు నిరంజ‌న్ రెడ్డిగారితో మాట్లాడి ఒప్పించారు. త‌ర్వాత ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. ఈ క్ర‌మంలో నాకు స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌. శ్రీనివాస‌రెడ్డిగారు నాన్న‌లాగా న‌న్ను ముందుండి న‌డిపించారు. కూల్‌గా ఎలా ప‌నిచేయాల‌నే విష‌యాన్ని ఆయ‌న ద‌గ్గ‌ర నుంచే నేర్చుకున్నాను. త‌మిళ ఇండ‌స్ట్రీలో రైట‌ర్‌, డైరెక్ట‌ర్ అయిన మా నాన్న‌గారి నుంచి స్క్రిప్ట్ నేర్చుకున్నాను. ఆయ‌న‌కు సాధార‌ణంగా నేను చెప్పిన క‌థ‌లేవీ న‌చ్చ‌లేదు. అలాంటాయ‌న‌కు ఈ క‌థ బాగా న‌చ్చింది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు అద్భుత‌మైన సంగీతాన్నే కాదు.. షాకింగ్ రీరికార్డింగ్  అందించాడు. సుకుమార‌న్‌గారితో వ‌ర్క్ చేయాల‌ని అనుకున్నాను. ఆయ‌న‌తో నా తొలి సినిమా చేయ‌డం ల‌క్‌. ఆయ‌న వ‌ల్లే  ఈసినిమా ఇంత అద్భుతంగా వ‌చ్చింది. గ్యారీ గ్రేట్ ఎడిట‌ర్‌. సాయిబాబా, భాస్క‌ర్ మాట‌ల‌తో సినిమాకు ప్రాణం పోశారు. ప్ర‌తి ఒక్క‌రూ వారి ప‌నిని ప్రేమించి చేయ‌డంతో సినిమా అద్భుతంగా వ‌చ్చింది. కృష్ణ‌చైత‌న్య న‌టుడిగా నెక్ట్స్ లెవ‌ల్‌కు వెళ‌తాడు. యాక్ట‌ర్ వెంక‌ట్‌గారు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఆయ‌న‌కు థాంక్స్‌. ఇక సినిమా నిర్మాత‌లు ర‌విశంక‌ర్‌గారు, ఏక్తా మేడ‌మ్‌, హ‌రీశ్‌గారు.. వాళ్ల ఫ్యామిలీ మెంబ‌ర్‌లా ట్రీట్ చేసి ఇంకా బెస్ట్‌గా చేద్దామ‌ని స‌పోర్ట్ చేశారు. రెండు లాక్‌డౌన్స్ ఫేస్ చేశాం. ఓటీటీ ఆఫ‌ర్స్ వ‌చ్చినా సుశాంత్‌గారు, నిర్మాత‌లు థియేట‌ర్స్‌లోనే సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకుని అండ‌గా నిల‌బ‌డ్డారు. మీనాక్షి తొలి సినిమానే అయినా, త‌న క్యారెక్ట‌ర్‌లో ఇన్‌వాల్వ్ అయ్యి చేసింది. త‌ను హీరోయిన్‌గా నెక్ట్స్ రేంజ్‌కు చేరుకుంటుంది. ఇక నా సినిమా హీరో సుశాంత్‌గారి చెప్పాలంటే ఎమోష‌న్‌గా ఉంది. క‌థ విన‌గానే నేను చేస్తాన‌ని అన్న‌మాట‌ను నిల‌బెట్టుకున్నారు. మ‌రో క‌థ‌ను కూడా విన‌లేదు. ఈ సినిమాలో త‌నను చాలా కొత్త‌గా చూస్తారు. చాలా ఎఫ‌ర్ట్ పెట్టి చేస్తారు. ఆయ‌న వ‌ల్లే సినిమా జ‌రిగిన‌న్ని రోజులు స్మూత్‌గా సాగిపోయింది. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లోని ఈ మూవీలో చాలా లేయ‌ర్స్ ఉన్నాయి. సినిమా క‌చ్చితంగా అంద‌ర్నీ ఎంటర్‌టైన్ చేస్తుంది’’ అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు మాట్లాడుతూ ‘‘మా సినిమా నిర్మాతలకు థాంక్స్. గీతాంజలి, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల త‌ర్వాత నాకు కాస్త గ్యాప్ వ‌చ్చింది. మ‌ళ్లీ సినిమాలు చేయాల‌నుకుంటున్న స‌మ‌యంలో హ‌రీశ్‌గారి ద్వారా సుశాంత్‌ను క‌లిశాను. ఆయ‌న నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. నా పాట‌ల ర‌చ‌యిత‌కు, రోల్ రైడాకు థాంక్స్‌. ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌న్‌తో చాలా మంచి జర్నీ. చాలా మంచి అవుట్‌పుట్ రాబ‌ట్టుకున్నాడు. త‌న‌కు మంచి మ్యూజిక‌ల్ సెన్స్ ఉంది. త‌ను భ‌విష్య‌త్తులో పెద్ద డైరెక్ట‌ర్ అవుతాడు. ఈ జ‌ర్నీలో స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.


నిర్మాత హ‌రీశ్ మాట్లాడుతూ ‘‘రవిశంకర శాస్త్రిగారు, ఏక్తాగారు, సుశాంత్‌గారి లెగ‌సీస్ ఏంటో తెలుసు. అలాంటి వాళ్లు చేసే సినిమాలో నేను భాగం కావ‌డం అనేది చాలా గౌర‌వంగా, అదృష్టంగా భావిస్తున్నాం. ర‌విగారు, ఏక్తాగారు.. సినిమా రేంజ్‌ను పెంచారు. కొత్త‌వాళ్ల‌ను న‌మ్మి మాకు స‌పోర్ట్ చేశారు. సుశాంత్‌గారు స‌హా ఎంటైర్ టీమ్‌కు థాంక్స్‌. కొత్త సుశాంత్‌ను చూస్తారు. త‌న‌లో చాలా ఫైర్ ఉంటుంది. ఈ సినిమా త‌ర్వాత త‌న‌కు చాలా కొత్త సినిమాలు వ‌స్తాయి’’ అన్నారు.


హీరోయిన్ మీనాక్షి చౌద‌రి మాట్లాడుతూ ‘‘తొలి సినిమా కావ‌డంతో కాస్త నెర్వ‌స్‌గా ఫీల్ అయ్యాను. అయితే నిర్మాతలు రవిగారు, ఏక్తాగారు, హ‌రీశ్‌గారి వ‌ల్ల మ‌న అనే భావం ఎక్క‌వగా క్రియేట్ అయ్యింది. టాలెంటెడ్ టీమ్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ జర్నీ ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు.


యాక్ట‌ర్ వెంక‌ట్ మాట్లాడుతూ ‘‘రెండు పాండమిక్స్, లాక్‌డౌన్స్‌ను త‌ట్టుకుని ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్న నిర్మాత‌ల‌కు థాంక్స్‌. అలాగే న‌న్ను మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేస్తున్న ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌న్ గారికి, నిర్మాత హ‌రీశ్ గారికి కూడా థాంక్స్‌. ఈ సినిమా సుశాంత్‌కు చాలా పెద్ద హిట్ కావాల‌ని అనుకుంటున్నాను. 2018 మిస్ ఇండియా అయిన మీనాక్షి చౌద‌రి ఈ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం కావ‌డం చాలా హ్యాపీ. అభిన‌వ్‌, ప్రియ‌ద‌ర్శి, కృష్ణ‌చైత‌న్య‌ల‌కు థాంక్స్‌’’ అన్నారు.


శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ ‘‘నిర్మాత హరీశ్ నాకు మంచి స్నేహితుడు. నాకు ఎంతో న‌చ్చిన స్నేహితులు ఈ సినిమాలో ఉన్నారు. సుశాంత్‌తో మంచి అనుబంధం ఉంది. చాలా మంది ఈ సినిమాతో డెబ్యూ అవుతున్నారు. సినిమా చూడ‌టానికి ఈ నెల 27న బండి తీయాల‌ని ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.


న‌టుడు కృష్ణ చైత‌న్య మాట్లాడుతూ ‘‘ప్రతి ఆర్టిస్ట్‌కు త‌న టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవాల‌ని క‌సి ఉంటుంది. నాకు అలాంటి అవ‌కాశం ఈ సినిమాతో ద‌క్కింద‌ని అనుకుంటున్నాను. ఇలాంటి క్యారెక్ట‌ర్‌ను నాకు ఇచ్చిన ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌న్‌, నిర్మాత హ‌రీశ్‌గారికి థాంక్స్‌. అక్కినేని హీరో అయిన సుశాంత్‌గారితో క‌లిసి న‌టించ‌డం హ్యాపీగా అనిపించింది. త‌ను ఇచ్చిన స‌పోర్ట్‌తో నా క్యారెక్ట‌ర్‌ను ఇంకా ఈజ్‌తో చేశాను’’ అన్నారు.


సినిమాటోగ్రాఫ‌ర్ సుకుమార‌న్ మాట్లాడుతూ ‘‘డిఫ‌రెంట్ మూవీ. స‌పోర్ట్ చేసిన డైరెక్ట‌ర్ ద‌ర్శ‌న్‌, నిర్మాత‌లు, ఎంటైర్ టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు.

Karthik Sai The Killer Pre Release Event Held Grandly

 కార్తీక్ సాయి ది కిల్లర్ ప్రీ రిలీజ్ వేడుక !

ఇది నా పదేళ్ల కష్టం : ది కిల్లర్ ప్రీ రిలీజ్ వేడుకలో హీరో కార్తీక్ సాయి



కార్తీక్ సాయి హీరోగా పరిచయం అవుతూ, డాలీషా, నేహా దేశ్‌పాండే హీరోయిన్స్ గా  చిన్నా దర్శకత్వంలో శ్రీమతి లలిత సమర్పణలో  యాదవ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై ఆవుల రాజు యాదవ్ & సంకినేని వాసు దేవ రావు నిర్మించిన చిత్రం కార్తీక్'స్  ది కిల్లర్. ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదల అవుతున్న సందర్బంగా మంగళవారం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిలుగా తెలంగాణ ప్రొహిబిషన్, అండ్ ఎక్సయిజ్, టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జయసుధ తనయుడు నీహాల్  తదితర ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్రైలర్ విడుదల చేయగా, బిగ్ టికెట్ ని హీరో సోహెల్ విడుదల చేసారు.


ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ... కార్తీక్ సాయి హీరోగా, డాలీషా హీరోయిన్ గా నటిస్తున్న సినిమా కిల్లర్, నిర్మాతలు రాజు గారు, వాసు దేవరావ్ నిర్మాతలుగా తీస్తున్న సినిమా. తెలంగాణ రాకముందు సినిమా రంగంలో కేవలం కొన్ని కుటుంబాలకు మాత్రమే ఉండేది, వాళ్ళు తీసింది సినిమాలు, కానీ తెలంగాణ వచ్చాకా టాలెంట్ ఉన్నవాళ్లు చాలా మంది సినిమా రంగంలోకి వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సినిమా రంగానికి ఎంతో ప్రోత్సహం అందిస్తున్నారు. పరిశ్రమకు కొత్త టాలెంట్ రావాల్సిన అవసరం. కొత్త టాలెంట్ వస్తేనే పరిశ్రమ మనుగడ సాగుతుంది. అయితే సినిమాల్లో మంచి మెసేజ్ ఉండే సినిమాలు రావాలి.  కేవలం వినోదం కోసమే కాదు, అందరు అంటే ఫ్యామిలీ అందరు కలిసి చూసేలా మంచి సినిమాలు రావాలి. ఈ సినిమా విషయానికి వస్తే కార్తీక్ సాయి చేస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే షూటింగ్స్ కోసం దేశ దేశాలకు పోకుండా తెలంగాణలోనే మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. కేవలం నామమాత్రపు ఫీజుతో మీకు కావలసిన అన్ని రకాల లొకేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని సినిమా వాళ్ళు వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఇక కార్తీక్ సాయి హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని అలాగే అతను హీరోగా మరో రెండు సినిమాలు కూడా చేస్తున్నాడు. అతనికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను అన్నారు.


హీరో నీహాల్ మాట్లాడుతూ .. కార్తీక్ చేసిన ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. తప్పకుండా కార్తీక్ కు మంచి సినిమా అవుతుంది. తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అయి కార్తీక్ కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ .. కార్తీక్ ది థ్రిల్లర్ ఈ వేడుకకు రావడానికి ముఖ్య కారణం రాజు అన్న. వాళ్ళబ్బాయి హీరోగా పరిచయం అవుతూ తీస్తున్న సినిమాకు అయన చాలా సపోర్ట్ ఇస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు సినిమా చేస్తామంటే సపోర్ట్ ఇవ్వరు . కానీ రాజు అన్న వాళ్ళ కొడుకు హీరోగా చేస్తానంటే ఎంకరేజ్ చేసారు .. ఆయనకు అభినందనలు తెలుపుతున్నాను. కార్తీక్ సాయి మొదటి సినిమాతో డైరెక్టర్ గా హీరోగా చేస్తున్నాడు అతనికి సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ టీం అందరికి మంచి విజయం రావాలి. ఈ సినిమాతో నిర్మాతలుగా పరిచయం అవుతున్న రాజు అన్న మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. సినిమా విషయంలో ఏ సపోర్ట్ కావాలన్నా నేను అందించేందుకు సిద్ధంగా ఉన్నాను, ఈ టీం అందరికి మరోసారి ఆల్ ది బెస్ట్ అన్నారు.  


మ్యూజిక్ డైరెక్టర్ చిన్న మాట్లాడుతూ .. కార్తీక్ ది కిల్లర్ ... ఈ సినిమా గురించి సతీష్ ఫోన్ చేసి సార్ ఈ సినిమా మీరు చూడాలి అని అడిగారు. సైకో సినిమా ను పట్టుబట్టి నాకు చూపించారు, అంతే కాదు ఈ సినిమాకు మీరే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయాలనీ పట్టుబట్టారు. సినిమా చూసాను .. బాలయ్య సింహా తరువాత ఆ రేంజ్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా హీరో, డైరెక్టర్ కార్తీక్ చేయడం నిజంగా సూపర్. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం అందుకోవాలి. కార్తీక్ కు తప్పకుండా మంచి ఫుచర్ ఉంటుంది అన్నారు.


నిర్మాత గంజి రమేష్ మాట్లాడుతూ ... ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. నిర్మాతలు రాజు గారు, వాసు గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. హీరో చాలా చక్కగా చేసాడు.. తప్పకుండా అతనికి మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మంచి విజయం అందుకుని హీరో కార్తీక్ మరిన్ని సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నాను అన్నారు.


రామ సత్యనారాయణ మాట్లాడుతూ .. సినిమా ట్రైలర్ చూసాం.. నిర్మాతగా ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారని తెలుస్తుంది. నిర్మాత రాజు గారు వాళ్ళబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ సపోర్ట్ అందిస్తున్నారు. ఈ మద్యే వచ్చి సూపర్ హిట్ అయిన ఎస్ ఆర్ కల్యాణ మండపం సినిమా సూపర్ హిట్ అయింది. మంచి కంటెంట్ ఉంటె తప్పకుండా పెద్ద విజయం అందుకుంటుంది. అలాగే ఈ సినిమా కూడా కష్టపడి చేసారు. తప్పకుండ దాని ఫలితం ఉంటుంది. ఈ సినిమా హీరో కార్తీక్ ఆర్ ఎక్స్ 100 కార్తికేయల ఉన్నాడు.. ఈ సినిమా కూడా ఆ సినిమా రేంజ్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. కరోనా వల్ల నష్టమే కాదు లాభాలు కూడా ఉన్నాయి.. కరోనా కారణంగా పెద్ద సినిమాలు వెనక్కి వెళ్లడం చిన్న సినిమాలకు కలిసి వచ్చింది. ఇప్పుడు కరోనా లేదు ఏమి లేదు.. తప్పకుండ ప్రేక్షకులు థియటర్స్ కు వస్తున్నారు .. కాబట్టి దైర్యంగా సినిమా విడుదల చేసుకోవచ్చు.మరోసారి ఈ టీం అందరికి ఆల్ ది బెస్ట్ అన్నారు.


గెస్ట్ సి ఐ నరసింహ స్వామి మాట్లాడుతూ .. కార్తీక్ సాయి సినిమా కిల్లర్, హీరోయిన్ డాలీషా గారికి నటీనటులు అందరికి థాంక్స్ .. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం అందించాలి. రాజు యాదవ్ నా బెస్ట్ ఫ్రెండ్. ఒకరోజు ఆయన ఈ సినిమా గురించి చెబుతూ .. నేను ఒక సినిమా చేయాలనీ చెప్పాడు .. కొంచెం డౌట్ కలిగింది.. హీరో ఎవరు అంటే మా అబ్బాయి అని చెప్పారు.. డైరెక్టర్ , కథ అన్ని మా అబ్బాయే అని చెప్పాడు.. కానీ నాకు ఇంకా ఎక్కడో డౌట్ ఉండేది.. కానీ ఈ సినిమా షో చూసాకా అవన్నీ తొలగిపోయాయి. సినిమా క్రైం థ్రిల్లర్ గా చాలా అద్భుతంగా చేసాడు. తప్పకుండా కార్తీక్ కు ఈ సినిమా మంచి విజయం అందించాలని కోరుకుంటున్నాను అన్నారు.


హీరోయిన్ డాలీషా మాట్లాడుతూ .. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. తప్పకుండా ఈ సినిమా చూస్తుంటే గూస్ బాంబ్స్ వస్తాయి. ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి కచ్చితంగా ఉంటుంది. కార్తీక్ మొదటి సారి హీరోగా, డైరెక్టర్ గా చేసిన ఈ సినిమా చాలా అద్భుతంగా తీసాడు. అతను మల్టి టాలెంట్ కుర్రాడు అని చెప్పాలి. ఇక నిర్మాతలు రాజు గారు, వాసు గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రొడక్షన్ వాల్యూ పెరిగేలా ఈ సినిమా చేసారు. అలాగే టెక్నీకల్ టీం కెమెరా మెన్ చాలా ఓపికగా ప్రతి సీన్ అద్భుతంగా తీసాడు. అలాగే ఎడిటింగ్ సూపర్ చంపేశారు .. అలాగే ఈ సినిమాకు ప్రియా బ్యాక్ బోన్ .. ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుని చేసింది. అలాగే లైన్ ప్రొడ్యూసర్ అయి ఉండి కూడా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలుతీసుకున్నారు . నిర్మాత వాసుగారు సినిమా షూటింగ్ కోసం నా డ్రెస్ లు కూడా దగ్గరుండి తీసుకున్నారు. నిజంగా అయన గ్రేట్ అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తోట సతీష్ మాట్లాడుతూ ..రాజుగారు, వాసు గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా పూర్తీ చేసారు. అలాగే టీం అందరు ఎంతో సపోర్ట్ చేసారు. ఈ సినిమా విషయంలో నలభై ఐదు రోజులు చాలా కష్టపడ్డాం .. హీరో కార్తీక్ రెండు పాత్రలు అద్భుతంగా చేసారు .. కెమెరా వెనక, కెమెరా ముందు ఇలా రెండు పాత్రలు అద్భుతంగా చేసారు. మేము పడ్డ కష్టం ..మొత్తాన్ని చిన్న గారు తీసుకున్నారు. ఈ సినిమాకు అయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపాయింది. థాంక్స్ చిన్నగారు .. ఈ సినిమా వచ్చే నెల 3న విడుదల అవుతుంది తప్పకుండా మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాత వాసుదేవరావు మాట్లాడుతూ .. ఈ సినిమాకు నాకింత సపోర్ట్ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇది మా సినిమా అని చెప్పుకోవడం కాదు .. సినిమా చాలా బాగుంటుంది. విడుదల రోజు అందరు టాటూ వేయించుకోవాలి. ఈ సినిమా వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఈ సినిమా గురించి చాలా చెప్పాలి, ఈ వేడుకకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రావాలి. ఈ సినిమా గురించి కార్తీ ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకుని కథ, మాటలు, డైరెక్షన్ , హీరో ఇలా అన్ని విధాలుగా చాలా కష్టపడి చేసాడు. ముందు ఆయనకు థాంక్స్ చెప్పాలి. ప్రతి రోజు ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అలాగే సతీష్ కూడా చాలా కష్టపడ్డాడు. సినిమా చాలా బాగా తీసాం .. తప్పకుండా ఇది పెద్ద విజయం అందుకుంటుందన్న నమ్మకం ఉంది, ఈ సినిమా విషయంలో నా ఫ్యామిలీ కూడా చాలా సపోర్ట్ చేసారు వాళ్లకు నా థాంక్స్,  అన్నారు.      


సురేష్ కొండేటి మాట్లాడుతూ .. ఇండస్ట్రీ కి చాలా మంది ప్రొడ్యూసర్స్ వస్తుంటారు .. వాళ్లలో ఉన్న ప్యాషన్ చాలా ఉంది .. తప్పకుండ ఈ ఇద్దరు పెద్ద నిర్మాతలు అవుతారు. అలాగే హీరో, దర్శకుడు సాయి గారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. అలాగే సతీష్ గారు కూడా చాలా కష్టపడ్డారు. తప్పకుండా ఈ నెల 3 న విడుదల అవుతున్న ఈ సినిమా పెద్ద విజయం అందుకోవాలి, సినిమాను బతికిద్దాం థియేటర్స్ కు వచ్చి చూద్దాం అన్నారు.


నిర్మాత రాజు యాదవ్ మాట్లాడుతూ .. ఈ సినిమా విషయంలో నమ్మకం కలిగింది. అందుకే మా అబ్బాయిని ప్రోత్సహించాను. అనుకున్నట్టుగానే ఈ సినిమా విషయంలో తాను ఏమిటో సినిమా ద్వారా చూపించాడు. అలాగే నాకు సపోర్ట్ చేసిన వాసు గారికి, అలాగే నెరేడ్ మేట సి ఐ నరసింహ స్వామి గారికి థాంక్స్ చెబుతున్నాను. అందరికి ఒకటే చెబుతున్నాను సెప్టెంబర్ 3న సినిమా వస్తుంది .. ఆ రోజు బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి అన్నారు.


హీరో సోహైల్ మాట్లాడుతూ .. కిల్లర్ మూవీ ట్రైలర్ వేరేలా ఉన్నది.. దీని కథ వేరేగా ఉన్నది... ఈ వేదికపై ఒక తండ్రి కళ్ళలో ఆనందం చూసాను. నా కొడుకు ఎదగాలి అని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇంత బడ్జెట్ పెట్టి సినిమా చేసారు కదా.. తప్పకుండా మీ కల నెరవేరుతుంది. సెప్టెంబర్ 3న విడుదల అవుతుంది కాబట్టి .. అందరు థియేటర్స్ లో సినిమా చూడండి. నేను సాంగ్స్ చూసాను ఇరగదీసాడు. కార్తీక్ ఈ సినిమా విషయంలో అన్ని బాధ్యతలు తీసుకుని చేశారు. తప్పకుండా మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. కొత్తవాళ్ల చేస్తున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. అలాగే డాలీషా తో నేను ఓ సినిమా చేశాను. ఇక ఈ వేడుక ఇంత గ్రాండ్ గా జరగడానికి కారణం అయిన సంతోషం సురేష్ గారికి థాంక్స్ చెప్పాలి.. ఈవెంట్ అదిరిపోయింది అన్న. సో తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.


హీరో , దర్శకుడు కార్తీక్ సాయి ( చిన్నా ) మాట్లాడుతూ .. నాకు ఈ రోజు ఈ స్టేజి పై నిలబడి మాట్లాడటానికి పదేళ్లు పట్టింది. నన్ను నమ్మింది మా ఫ్యామిలీ. మనం ఏమి చేస్తున్నాం అని అందరు అడుగుతూనే ఉంటారు.. మీ అబ్బాయి ఏమి చేస్తున్నారు అని.. కానీ మా అమ్మ నాకు చాలా సపోర్ట్ చేసింది. ఈ పదేళ్లు నేను ఫ్యామిలీ ని మిస్ అయ్యాను. ఇంట్లో భోజనం చేసి ఆరు నెలలైంది. ఫ్యామిలీ ని మిస్ అయింది కేవలం ఈ రోజు కోసం .. నన్ను ఎంకరేజ్ చేసింది మా అమ్మ, నాన్న ఆ తరువాత వాసుగారు .. సొంతోళ్లు ,కూడా నమ్మరు కానీ అయన నన్ను నమ్మరు. సినిమా చాలా బాగా వచ్చింది. కిల్లర్ అంటే ఎదో థ్రిల్లర్ అనుకోకండి... ఇది ఫ్యామిలీ అందరు కలిసి చూసే సినిమా. తప్పకుండా అందరు థియేటర్స్ కి వచ్చి చూడండి. ఈ సినిమా కోసం సపోర్ట్ చేసిన ఎడిటర్, కెమెరా మెన్, అలాగే సతీష్ గారు అలాగే నా టీం అందరు, వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది .. అలాగే ప్రియా నన్ను అమ్మలా చూసుకుంది. కార్తీక్ సాయి ఇంకా మూడు సినిమాలు చేస్తున్నాడు .. ఆ మూడు సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి .. ఈ సినిమా ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెబుతున్నాను, ఈ సినిమాకు చిన్నాగారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు .. సినిమాలో చాలా మంది కొత్తవాళ్లు నటించారు. ఇది నా పదేళ్ల కష్టం .. ఇది గుర్తిస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. తగ్గేదేలే ! ఈ సినిమా విడుదల రోజు మార్నింగ్ షో అన్ని సెంటర్స్ లో ఫ్రీ .. సినిమా చూడండి పదిమందికి చెప్పండి, అలాగే ఈ వేడుక ఇంత బాగా రావడానికి సపోర్ట్ చేసిన సురేష్ కొండేటి గారికి థాంక్స్  అన్నారు.

Mega Prince Varun Tej unveils trailer for '101 Jillala Andagadu'

 Mega Prince Varun Tej unveils trailer for '101 Jillala Andagadu'




'101 Jillala Andagadu' is headlined by Avasarala Srinivas, who has made a variety of movies as a director and has been enacting a range of characters in movies. Starring Ruhani Sharma as the heroine, the film is a hilarious entertainer directed by newcomer Rachakonda Vidyasagar. It is presented by the Krish Jagarlamudi-Dil Raju duo and is produced by Shirish, Rajiv Reddy and Saibaba Jagarlamudi on Sri Venkateswara Creations and First Frame Entertainments.



Ahead of its theatrical release on September 3, its trailer was unveiled by Mega Prince Varun Tej, who appreciated the team of the movie. The trailer introduces us to the premise of the movie, wherein a young bachelor who is about to get married has got a bald head. What consequences he faces because of this, is what the film is about. He resorts to several tricks to hide his baldness problem, especially from his girlfriend. There is also an emotional angle in the story. 



A hairdresser at the salon tells Avasarala's character that he has got very good hair even though his father has got a bald head. At this, the male lead boasts that it's all courtesy his "maintenance". Eventually, the hairdresser is shocked to know the truth. The trailer also features the element of how the male lead conveys to the heroine, who doesn't know Telugu, that she might have had a boyfriend, in the form of a song. In reply, Ruhani's character says that the song is not original. The trailer also presents the hero's ordeal when he visits his girlfriend's house and struggles to hide his baldness. His emotional conflict when others come to know about his secret is also captured in the trailer. 



This funny line in the trailer is the icing on the cake, though: ’ఏ జుట్టు దువ్వుకుంటే ప‌ళ్లు రాలుతాయ‌ని దువ్వెన‌లు సైతం భ‌య‌ప‌డ‌తాయో.. ఏ జుట్టు ముడేస్తే కొండ‌లు సైతం క‌దులుతాయో, అలాంటి బ‌ల‌మైన‌, ద‌ట్ట‌మైన, అందమైన జుట్టిచ్చి నన్నీ కేశ దారిద్య్రం నుంచి బ‌య‌ట‌పడేయి తండ్రీ’. 



The trailer reveals that the film has got enough of comedy and emotional content. 



Avasarala Srinivas has surely made a sincere attempt to elicit laughs and to give entertainment through the film. Cinematography is by Ram and music is by Shaktikanth Karthik. 



Cast:



Avasarala Srinivas, Ruhani Sharma and others. 



Crew:



Director: Rachakonda Vidya Sagar


Presenters: Dil Raju, Krish Jagarlamudi


Producers: Shirish, Rajiv Reddy, Saibaba Jagarlamudi


Writer: Avasara Srinivas


Cinematographer: Ram


Editor: Kiran Ganti


Music Director: Shaktikanth Karthik


Art Director: A Ramanjaneyulu


Designer: Aishwarya Rajeev

Sundeep Kishan Interview About Vivaha Bhojanambu

 'సోని లివ్' చాలా త్వరగా తెలుగు ఆడియెన్స్ కు రీచ్ అవుతుంది - హీరో సందీప్ కిషన్




'సోని లివ్' ఓటీటీ చాలా త్వరగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతుందని అన్నారు హీరో సందీప్ కిషన్. ఆయన నిర్మించి నటించిన "వివాహ భోజనంబు" సినిమాతో 'సోని లివ్' ఓటీటీ టాలీవుడ్ లోకి వస్తోంది. ఈ నెల 27న "వివాహ భోజనంబు" 'సోని లివ్' ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్, సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కమెడియన్ సత్య హీరోగా నటించగా..ఆర్జావీ రాజ్ నాయికగా కనిపించనుంది. "వివాహ భోజనంబు" సినిమా గురించి సందీప్ కిషన్ పాత్రికేయులతో ముచ్చటించారు. సోని లివ్, "వివాహ భోజనంబు" సినిమా గురించి సందీప్ కిషన్ చెప్పిన విశేషాలు చూస్తే...


- సోని లివ్ కు నార్త్ లో బాగా ఆదరణ ఉంది. వాళ్లు తెలుగులో మా "వివాహ భోజనంబు" చిత్రంతో అడుగుపెడుతుండటం సంతోషంగా ఉంది. అతి తక్కువ టైమ్ లోనే సోని లివ్ కు మంచి ఆదరణ దక్కుతుందని నమ్ముతున్నాను. వాళ్ల కేటలాగ్ అలా క్రియేట్ చేస్తారు. సోని లివ్ డెబ్యూకు "వివాహ భోజనంబు" కరెక్ట్ ఫిల్మ్. ఎందుకంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ కాబట్టి కుటుంబంలోని వాళ్లంతా ఓటీటీలో మా మూవీ చూడొచ్చు.


- గతేడాది మార్చిలోనే "వివాహ భోజనంబు" సినిమా సోని లివ్ కు అగ్రిమెంట్ చేశాం. మిగతా పెద్ద ఓటీటీలకు వెళ్లొచ్చు కానీ, ప్రతి ఓటీటీకి కాపీరైట్ పరిమితులు ఉంటాయి. ఇవన్నీ దృష్టిలోకి తీసుకునే సోనిలివ్ కు మా సినిమా రైట్స్ ఇచ్చాం. "వివాహ భోజనంబు" రిలీజ్ డేట్ విషయంలోనూ నిర్ణయం చాలా రోజుల కిందట తీసుకున్నదే. ఆగస్టు 27న రిలీజ్ అవుతున్న సినిమాలతో పోటీ పడాలని, వాటిని ఇబ్బంది పెట్టాలని మేము ఎప్పుడూ అనుకోలేదు.


- రామ్ అబ్బరాజు ఈ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. ఇలా కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమాలో నటించడం నాకు ఇష్టం. అయితే ఇది ఒక కమెడియన్ ఇమేజ్ ఉన్న నటుడు చేస్తే బాగుంటుంది. అందుకే సత్యను ఎంచుకున్నాం. మనసులో మాత్రం నేనే ఈ కథలో నటిస్తే బాగుండును అనిపించింది. అందుకే ఓ చిన్న క్యారెక్టర్ లోనైనా కనిపించాలని నెల్లూరు ప్రభ అనే పాత్రను పోషించాను.


- సత్య ఈ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించాడు. మొత్తంగా కథను లీడ్ తీసుకున్నాడు. సత్య పర్మార్మెన్స్ రేపు ఆడియెన్స్ ను బాగా ఇంప్రెస్ చేస్తుంది. మిగతా క్యారెక్టర్స్ లో మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్లంతా కథలో భాగంగా నటించి ఆకట్టుకుంటారు. సినిమా షూటింగ్ టైమ్ లోనూ పండగ వాతావరణంలా ఉండేది. డజను మంది ఆరిస్టులు, ఒక ఫ్యామిలీ నిజంగానే ఇంటికి వస్తే ఎలా ఉంటుందో అలా ఉండేది.


- ఈ కథ పెళ్లికి సంబందించింది, పెళ్లిచూపులు లాంటి టైటిల్స్ వచ్చాయి. పెళ్లంటే వివాహం, చక్కగా భోజనం చేయడం..కాబట్టి "వివాహ భోజనంబు" అనే టైటిల్ ఠక్కున గుర్తుకొచ్చింది. అదే టైటిల్ పెట్టాం. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నీ రామ్ అబ్బరాజే. అతను సినిమా ఎంతో ప్రతిభావంతంగా తెరకెక్కించారు. 


- దర్శకుడు రామ్ అబ్బరాజు తను చూసిన, తనకు తెలిసిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా "వివాహ భోజనంబు" మూవీని రూపొందించారు. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా చూసేందుకు నేను పర్సనల్ గా బాగా ఇష్టపడతాడు. మూవీ చూస్తూ చాలా ఎంజాయ్ చేశాను. నేను చేసిన నెల్లూరు ప్రభ అనే క్యారెక్టర్ లాక్ డౌన్ లో ఇల్లీగల్ గా ప్రయాణికులను తీసుకు వెళ్తుంటాడు. నెల్లూరు యాసలో మాట్లాడటం ఆస్వాదించాను. 


- త్వరలో గల్లీరౌడీ సినిమా థియేటర్ లలో రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో మూవీ చేస్తున్నాను. మరికొన్ని చిత్రాలు లైనప్ లో ఉన్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 3 చిత్రంలో ఓ క్యారెక్టర్ లో నటిస్తున్నాను.

Devudutho Sahajeevanam First Look Launched

 


దేవుడితో సహజీవనం’ మూవీ ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్ విడుదల*

సురేష్ నీలి ప్రొడక్షన్‌లో కాంట్రవర్శియల్ డైరెక్టర్ సాయిరామ్ దాసరి అందిస్తున్న మరో చిత్రం ‘దేవుడితో సహజీవనం’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మరియు గ్లింప్స్‌ను విడుదల చేశారు. అయితే ఇందులో విశేషం ఏమిటంటే... దర్శకుడు రవిబాబు పంది సినిమాను ప్రమోషన్‌లో పందిచే విడుదల చేయించినట్టు... ఈ చిత్ర దర్శకుడు సాయిరామ్ దాసరి కూడా వినూత్నంగా కుక్క చే దేవుడితో సహజీవనం చిత్ర ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ ను విడుదల చేయించారు. ఈ చిత్రంలో హర్ష నీలవెళ్లి, విక్రమ్, సింధు, హైమ, మధు, సుమిత్ లు ముఖ్య పాత్రలో పోషిస్తున్నారు.  


ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు సాయిరామ్ దాసరి మాట్లాడుతూ... దేవుడితో సహజీవనం చిత్రంలో కుక్క (భైరవ్) ప్రధాన పాత్ర పోషిస్తోంది. అందుకే ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను కుక్కచే విడుదల చేయించడం జరిగింది. ఈ చిత్రానికి సురేష్ నీలి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆర్టిస్టులందరూ అద్భుతంగా సపోర్ట్ చేశారు. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా మంచి సినిమాలను నాకు నచ్చిన సినిమాలను ప్రేక్షకులకు అందజేయాలనేదే నా ఉద్దేశ్యం. అందుకే ఇది నా పదవ సినిమాగా మీ ముందుకు రానున్నది. ఇక నా తదుపరి చిత్రం నిర్మాత భాస్కర్‌తో ‘కావూరి చరణ్ రాజ్ అలియాస్ కేసీఆర్’ అనే చిత్రాన్ని తీయనున్నాము. అది వచ్చే నెలలో ప్రారంభం అవుతుంది.. అని తెలిపారు


నటుడు సుమిత్ మాట్లాడుతూ.. నేను చేసిన సినిమాలన్నింటిలో ఇది బెస్ట్‌గా నిలబడుతుంది. అంతబాగా వచ్చింది ఈ సినిమా. సాయిరాం దాసరి అనుకున్నదాని కంటే బాగా తీశారు అన్నారు.


విక్రాంత్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను టైటిల్ రోల్ అయిన దేవుడి పాత్రలో నటిస్తున్నాను.. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ సాయిరామ్ దాసరికి నా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను.. అన్నారు.


హీరో మరియు నిర్మాత సురేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాలోని ప్రతి సీన్ ఎగ్జయిట్‌మెంట్‌తో ఉంటుంది. అలాగే చాలా ఫన్ గా కూడా సాగుతుంది.. వంశీధర్ నా స్నేహితుడు అతను కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రాజెక్ట్‌ను సక్సెస్ ఫుల్ గా తీసుకొచ్చిన దర్శకుడు సాయిరామ్ దాసరికి నా కృతఙ్ఞతలు అన్నారు.


ఇంకా భాస్కర్, హైమ, సింధు, మధు, వంశీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సినిమా అనుభవాలను పంచుకున్నారు.


‘దేవుడితో సహజీవనం’ చిత్రానికి

కథ- మాటలు- దర్శకత్వం: సాయిరామ్ దాసరి,

నిర్మాతలు: సాయిరాం దాసరి సురేష్, వంశీధర్ రెడ్డి

మ్యూజిక్: డేవిడ్,

డిఓపి: తరుణ్ కె సోను,

ఎడిటర్: ప్రవీణ్,

పీఆర్వో: బి. వీరబాబు

Akkineni Nagarjuna, Naga Chaitanya, Kalyan Krishna Bangaraju Shooting Started

 Akkineni Nagarjuna, Naga Chaitanya, Kalyan Krishna, Zee Studios and Annapurna Studios Pvt Ltd begins the shoot of the much awaited movie Bangaraju.



We all know that King Akkineni Nagarjuna is known to explore variety of films in every genre known to us in his decade long career. He also Enjoys huge fan base be it the youth or among family audiences.


Soggade Chinni Narayana directed by Kalyan Krishna Kurasala was a highest grosser for Nagarjuna.


The team is coming up with its sequel titled Bangaraju and this much awaited film will feature Nagarjuna’s elder son Yuva Samrat Akkineni Naga Chaitanya in other lead role.


The celebrated father-son duo previously appeared together in Akkineni’s multi-starrer Manam which is remembered as one of the all-time classic blockbuster and also as one of the most memorable film for the Akkineni family and fans all over the world.


Ramya Krishna who was paired in Soggade Chinni Narayana, is part of Bangaraju as well. The makers have roped in the most sought-after heroine Krithi Shetty to play Naga Chaitanya’s love interest.


The craziest multi-starrer was launched recently and the regular shoot has commenced from today in Hyderabad.


Anup Rubens scores music for the film. Satyanand has penned screenplay, while Yuvaraj handles the cinematography.


Bangaraju is billed to be a wholesome entertainer with a total dose of romance, emotions and other commercial elements. Expectations are quite high on this project, since it is the sequel for the blockbuster.


Zee Studios will be co-producing the project with Annapurna Studios Pvt Ltd.


Cast: Akkineni Nagarjuna, Naga Chaitanya, Ramya Krishna, Krithi Shetty, Chalapathi Rao, Rao Ramesh, Brahmaji, Vennela Kishore and Jhansi


Technical Crew:

Story & Direction: Kalyan Krishna Kurasala

Producer: Akkineni Nagarjuna

Banners: Zee Studios, Annapurna Studios Pvt Ltd

Screenplay: Satyanand

Music: Anoop Rubens

DOP: Yuvaraj

Art Director: Brahma Kadali

PRO: Vamsi-Shekar

Dear Megha Censored Releasing on September 3rd

 సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ''డియర్ మేఘ''. సెప్టెంబర్ 3న

థియేటర్లలో గ్రాండ్ రిలీజ్



మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన

సినిమా ''డియర్ మేఘ''. 'వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్', బ్యానర్ పై

అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుశాంత్ రెడ్డి ఈ చిత్ర

దర్శకుడు.

ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

సెప్టెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే

రిలీజైన టీజర్,పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ప్రమోషన్ పనులు కూడా

మెదలు పెట్టింది టీమ్. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో సెప్టెంబర్ 3న దాదాపు

300 థియేటర్లలో రిలీజ్ అవుతున్నట్టు నిర్మాత ప్రకటించారు.


నటీనటులు - మేఘా ఆకాష్,అదిత్ అరుణ్,అర్జున్ సోమయాజుల,పవిత్రా లోకేష్ తదితరులు.


ఈ చిత్రానికి సంగీతం - హరి గౌర, సినిమాటోగ్రాఫర్ - ఐ ఆండ్రూ, ఎడిటర్ -

ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ - పీఎస్ వర్మ, పీఆర్వో - జి.ఎస్.కె

మీడియా, నిర్మాత : అర్జున్ దాస్యన్, రచన,దర్శకత్వం : సుశాంత్ రెడ్డి.

Director Karuna Kumar Interview About Sridevi Soda Center

 




నిజ జీవిత సంఘటనల సమాహారం 'శ్రీదేవి సోడా సెంటర్' డైరెక్టర్‌ కరుణ కుమార్‌.



 ‘‘పలాస 1978’’తో  అటు ప్రేక్షకులలోను ఇటు ఇండస్ట్రీ లోను క్రేజీ డైరెక్టర్‌ గా మంచిపేరు సంపాదించుకొని, సినీ విమర్శకుల ప్రశంసలు సైతం పొందారు దర్శకుడు కరుణకుమార్‌. తను చేస్తున్న రెండవ సినిమాకే సెలెక్టెడ్‌ కథలను ఎంచుకుని తీసే 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్‌  లాంటి పెద్ద బ్యానర్‌లో లీడిరగ్‌ ఆర్టిస్ట్‌ హీరో సుధీర్‌ బాబుతో  చేస్తున్న సినిమా ‘‘శ్రీదేవి సోడా సెంటర్‌’’. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి లు నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సీనియర్‌ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, బ్రిడ్జ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ అధినేత లక్ష్మణ్‌ సహకారంతో ఈ నెల 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో  చిత్ర దర్శకుడు కరుణ కుమార్‌ మాట్లాడుతూ..


నేను కథలు చెప్పాలని ఇండస్ట్రీ కు వచ్చాను. ప్రస్తుతం మనం కథలు చెప్పడం మానేసి టెంప్లేట్‌ సినిమాలు చేస్తున్నాము. పరభాషా చిత్రాలు చూసి తమిళ్‌ లో, మలయాళంలో మంచి సినిమాలు వచ్చాయని మాట్లాడు కుంటున్నాము. సినిమా గ్లోబల్‌ అయిన తర్వాత ఇంటర్నెట్‌ విస్తృతి వేగంగా పెరిగిన తరువాత తెలుగులో ఇలాంటి సినిమాలు ఎందుకు రావడం లేదనే క్వశ్చన్‌ మొదలయ్యింది. ఎంతసేపు మనం పరభాషా చిత్రాలను అప్రిషియేట్‌ చేస్తున్నాము కానీ మనం తీయడం లేదు. శంకరాభరణం, సిరివెన్నెల, జ్యోతి, విజేత, చాలెంజ్‌ లాంటి లిటరేచర్‌ బేస్డ్‌ సినిమాలు అలాగే లిటరరీ పీపుల్స్‌ ని ఇన్వాల్వ్‌ చేసినన్ని సినిమాలు తెలుగులో వచ్చినంతగా ఏ భాషలో రాలేదు. 

ప్రపంచాన్ని షేక్‌ చేసిన బాహుబలి, అరుంధతి చిత్రాలు కూడా తెలుగులోనే ఇచ్చాము. 


తెలుగు నిర్మాతలు ఎప్పుడూ కొత్త కథ చెప్తే వినడానికి సిద్ధంగా ఉంటారు. ఒక బర్నింగ్‌ ఇష్యు ని తీసుకొని సినిమాటిక్‌గా చెప్పుదామని ‘‘పలాస’’ సినిమా చేశాను. ఈ సినిమాలో కూడా బలమైన సమస్యనే చర్చించాము. దీనికి నాకు బలమైన నిర్మాతలు దొరికారు. ‘‘పలాస’’ సినిమాలో డ్రైనెస్‌ ఉంటుంది. ఆ సినిమాని రా గా, రస్టిక్‌ గానే చెప్పాలనుకున్నాను కాబట్టి ఆ సినిమాను అలాగే చూపించాము. ఈ సినిమా పూర్తి విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ కాబట్టి నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పక్కన ఉన్న గ్రామాలు ఇప్పటివరకు మనం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల అంటే అరిటాకులు, అరిసెలు, బొబ్బట్లు, అమ్మమ్మ ల ఆప్యాయతలు, పొలం గట్లు, మంచి మనసులు తూర్పుగోదావరి అంటే ఇవే ఫిక్స్‌ అయిపోయాము.


తూర్పుగోదావరి జిల్లా చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే కమ్యూనిటీస్‌ వాళ్ల మధ్య ఉండే భావోద్వేగాల మధ్య కథ నడుస్తుంటే ఆ కథలో భాగంగా ఈ ప్రేమ కథ ఉంటుంది. కానీ తూర్పు గోదావరి వారిలో కూడా అన్ని రకాలైన ఎమోషన్స్‌ , భావోద్వేగాలు, వివక్ష, రాజకీయాలు, ఘోరమైన ఇన్సిడెంట్స్‌ కూడా ఉంటాయని ఈ సినిమాలో చూపెట్టడం జరిగింది. మేము ఎంచుకున్న లొకేషన్స్‌ శ్యామ్‌ దత్‌ గారి లాంటి అద్భుతమైన కెమెరామెన్‌ తో మేము సక్సెస్‌ అయ్యాను అని అనుకుంటున్నాను. సినిమాను చాలా అందంగా తెరకెక్కించాడు 


 ఒక సోడా సెంటర్‌ యజమాని కూతురు హీరోయిన్‌. గ్రామాల్లో అల్లరి చిల్లరిగా కనిపించే తెలివైన సాధారణమైన ఒక ఎలక్ట్రీషియన్‌ హీరో. ఆ అబ్బాయి కూడా ఒక మంచి వ్యాపారం పెట్టుకొని పెద్ద స్థాయికి వెళ్లి ఆ వ్యాపారానికి వాళ్ళ అమ్మ పేరు పెట్టుకొవాలనే డ్రీమ్‌ ఉంటుంది. అలా ఉన్న  వీరి మద్యన చిగురించిన  ప్రేమే ఈ శ్రీదేవి సోడా సెంటర్‌. ఆ తర్వాత ప్రేమ తాలూకు పర్యవసనాలు దాని వెనుక ఉండే సాంఘిక, సామాజిక, ఆర్థిక పరమైన ఇబ్బందుల మధ్య వాళ్ళు ఏమయ్యారు అనేది ఈ సినిమా కథ. 


సుధీర్‌ బాబు చాలా డెడికేటెడ్‌ యాక్టర్‌ ఆయన ఇప్పటి వరకు 12 సినిమాలు చేశాడు. ప్రతి సినిమాకు ఒక వైవిధ్యంతో కొత్త ప్రయత్నం చేయడానికి తపిస్తాడు. పలాస సినిమా చూసి సినిమా బాగుందని నన్ను ఆఫ్రిసియేట్‌ చేసి మీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌ గురించి అడిగాడు. అయితే  నాదగ్గరున్న వాటిలో రెండు కథలు చెప్పాను. వాటిలో ఒకటి శ్రీదేవి సోడా సెంటర్‌. ఈ కథ నచ్చి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. 


కొంతమంది దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్‌ తీసుకొని, అక్కడి భాష, బాడీ లాంగ్వేజస్‌ అలాగే ఎలక్ట్రిషన్‌లో కూడా కొన్ని మెళుకువలు నేర్చుకొని ఆయన నటించడం జరిగింది. ఈ సినిమాలో ఒక రోప్‌ కూడా వాడకుండా ఫైట్స్‌ ,అన్ని కూడాచాలా రిస్కీ గా తీసుకొని వర్క్‌ చేశాడు.మేమంతా ఈ విధంగా కష్టపడ్డాము కాబట్టి  సినిమా అద్భుతంగా వచ్చింది.


నేను తీసే ప్రతి సినిమా కి డిఫరెంట్‌ ఉండాలని కోరుకుంటాను. నేను రాసుకున్న కథలన్నీ కూడా కథే హీరో. నన్ను, నా కథను నమ్మిన వారితోనే నేను సినిమాలు చేస్తాను. నేను తీసిన పలాసలో మొత్తం తెలుగు వాళ్లే .ఇందులో ఇందులో కూడా 99% తెలుగువారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఒక్క విలన్‌ తప్ప  తనకి కరోనా రావడంతో వేరే విలన్‌ ను పెట్టుకోవడం జరిగింది.నా నెక్స్ట్‌ మూవీలో కూడా తెలుగు వారితోనే తీస్తాను.


మణి శర్మ గారి గురించి చెప్పే అంత స్థాయి నాకు లేదు కానీ తను ఒక ఇళయరాజా. మొదటిసారి ఆయన్ను కలిసి కథ చెప్పాను. బ్రేక్‌ టైం లో 10 నిమిషాల్లో  ‘చుక్కల మేళం’ ట్యూన్‌ రెడీ చేసి వినిపించారు. ఈ సినిమా ద్వారా ఆయన మ్యూజిక్ తో కొత్త మణి గారిని చూస్తారు. తను ఈ సినిమాకు అద్భుతమైన పాటలు రెడీ చేసి ఇచ్చారు. ఆయన ఎప్పుడూ బయటకు రారు అలాంటిది ఈ సినిమా షూటింగ్‌ కి ,ఆడియో ఫంక్షన్‌ కు,ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ కు వచ్చాడు దాన్ని నేను గ్రేట్‌ గా భావిస్తాను.


ఈ సినిమా విడుదల తర్వాత ఎవరితో చేస్తుంది అనేది వివరంగా చెబుతాను. నా కథకు ప్రాధాన్యత నిచ్చి నాకు ఫ్రీడమ్‌ ఇచ్చే బ్యానర్‌ లో చేయడానికే నేను ఇష్టపడతాను. నిర్మాత  నాకు పది రూపాయలు అయ్యే ఖర్చును నేను ఎనిమిది రూపాయలకే చేసి పెడతాను. నాకు ఈ  ప్రొడక్షన్‌ హౌస్‌ అంత ఫ్రీడమ్‌ ఇచ్చింది. ప్రజలకు మంచి కథ చెప్పాము అందరికీ మా కథను ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు