Latest Post

Hanu-man Creating New Benchmarks in ZEE5

 ZEE5 చరిత్రలోనే ‘హను-మ్యాన్’ గ్లోబల్ సెన్సేషన్.. 11 గంటల్లోనే 102 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌తో  రికార్డ్స్ బ్రేక్



Subscribe ZEE5 and watch it now! 🍿


https://www.zee5.com/movies/details/hanu-man/0-0-1z5531939



సినిమా బాక్సాఫీస్ దగ్గరే ఎవరూ ఊహించని విధంగా సెన్సేషన్  చేయటమే కాదు.. ఓటీటీలో అంతకు మించిన రికార్డులు క్రియేట్ చేయటం అనేది అరుదుగా జరిగే విషయం. అయితే ఈ అరుదైన విషయాన్ని ముందుగానే ఊహించిన వన్ అండ్ ఓన్లీ ఇండియన్ టాప్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ZEE5. అందుకనే ఇప్పుడు ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా టాప్ ట్రెండింగ్‌తో ZEE5 దూసుకెళ్తోంది. అందుకు కారణం ‘హను-మ్యాన్’. తెలుగువారికే కాదు అన్ని భాషల వారికి వైవిధ్యమైన కథలను అందించడంలో ముందు ఉంటుంది ఓటీటీ ప్లాట్ ఫామ్ ZEE5. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచిన ‘హను-మ్యాన్’ను మార్చి 17 నుంచి తమ ప్రియమైన ప్రేక్షకుల కోసం స్ట్రీమింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 


వెర్స‌టైల్ యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో కె.నిరంజ‌న్ రెడ్డి నిర్మాత‌గా  ఈ ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ‘హను-మ్యాన్’ చిత్రం ఎవ‌రూ ఊహించ‌ని స‌క్సెస్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్‌తో రూ.300కోట్లను సాధించిన ‘హను-మ్యాన్’ తమ జీ 5లో హిస్టరీ క్రియేట్ చేస్తుందని భావించారు. నిజంగా వారి అంచనాలను మించి ఈ చిత్రం రికార్డ్స్ క్రియేట్ చేస్తూ  ZEE5 చరిత్రలో తొలి రోజున ఉన్న రికార్డులను తిరగరాసింది. కేవలం 11 గంటల్లోనే 102 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ సాధించటంతో ఆశ్చర్యపోవటం అందరివంతైంది. అంతే కాదండోయ్..2024లో జీ 5ను ప్రపంచ వ్యాప్తంగా హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలబెట్టింది ‘హను-మ్యాన్’. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ‘హను-మ్యాన్’ను గ్లోబల్ ఆడియెన్స్ ఒరిజినల్ లాంగ్వేజ్‌లోనే చూస్తుండటం విశేషం. 


విజువల్స్, భక్తి పారవశ్యంలో మునిగిపోయే సన్నివేశాలు, రోమాలు నిక్కబొడిచే యాక్షన్ సన్నివేశాలు..చక్కటి పాటలు ఇవన్నీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. అందుకనే పాన్ ఇండియా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సెన్సేష‌న్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి రికార్డుల‌ను క్రియేట్ చేసిన ‘హను-మ్యాన్’..జీ 5లో స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది. 


అంజ‌నాద్రి ప్రాంతంలో ఉండే హ‌నుమంతు (తేజ స‌జ్జ‌) అల్ల‌రి చిల్ల‌ర‌గా తిరుగుతుంటాడు. త‌ల్లిదండ్రి లేని హ‌నుమంతుని అక్క అంజ‌నమ్మ (వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌) అన్నీ తానై హ‌నుమంతుని పెంచి పెద్ద‌చేస్తుంది. ఆ ప్రాంతంలో అన్యాయం చేస్తోన్న గ‌జ‌ప‌తిని ఓ సంద‌ర్భంలో హ‌నుమంతు  ఆ ఊళ్లో వైద్యం చేయ‌టానికి వ‌చ్చిన డాక్ట‌ర్ మీనాక్షి కార‌ణంగా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. మీనాక్షిని హ‌నుమంతు చిన్న‌ప్ప‌టి నుంచి ఇష్ట‌ప‌డుతుంటాడు. గ‌జ‌ప‌తి కార‌ణంగా హ‌నుమంతు ప్ర‌మాదంలో చిక్కుకుంటే అత‌ని ఆంజ‌నేయ స్వామికి సంబంధించిన ఓ అపూర్వ‌శ‌క్తి దొరుకుతుంది. దాంతో అత‌ను ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తుంటాడు. చివ‌ర‌కు విష‌యం విల‌న్ వ‌ర‌కు చేరుతుంది. అపూర్వ దైవ‌శ‌క్తిని సంపాదించుకోవ‌టానికి ప్ర‌తినాయ‌కుడు ఏం చేశాడు.. అత‌న్ని మ‌న హీరో ఎలా ఎదుర్కొన్నాడు.. చివ‌ర‌కు ఆంజ‌నేయ‌స్వామి భ‌క్తుడి కోసం ఏం చేశాడ‌నే క‌థాంశంతో ‘హను-మ్యాన్’ తెరకెక్కింది. 


జీ5 గురించి:

జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది.

Magadheera Re Release on March 26th

 మార్చి 26న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-దర్శకధీర రాజమౌళి ల మెగా బ్లాక్ బస్టర్ "మగధీర"  రీ-రిలీజ్.



గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక రోజు ముందే పండగ రాబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన  గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి,  

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో  రూపొందించిన  మెగా బ్లాక్ బస్టర్ "మగధీర" చిత్రం మార్చి 26న థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా పంపిణీదారులు   శ్రీ విజయలక్ష్మి  ట్రేడర్స్ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిషోర్ బాబు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని  భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేస్తున్నాం. మమ్మల్ని ప్రోత్సహించి మాకు రీ రిలీజ్ చేసే అవకాశం కల్పించిన మెగా ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారికి కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించి రామ్ చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం అన్నారు.

Yamadheera Trailer Launched

క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్, ఈవీఎం ల ట్యాంపరింగ్ పై ఒక మంచి కథగా ఈ నెల23 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న యమధీర మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్



కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ గారు నిర్మిస్తున్న తొలి చిత్రం గా వస్తున్న సినిమా యమధీర. ఈ సినిమాలో నాగబాబు గారు, ఆలీ గారు, సత్య ప్రకాష్ గారు, మధు సూధన్ గారు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ గారి చేతుల మీద జరగగా నేడు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫిలిం ఛాంబర్ లో చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రెజరర్ రామ్ సత్యనారాయణ గారు, నిర్మాత డి. ఎస్. రావు గారు, పి. శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ : వేదాల శ్రీనివాస్ గారు నిర్మాతగా శంకర్ దర్శకుడిగా చేస్తూ కన్నడ సినిమాగా తీసి తెలుగులో వస్తున్న సినిమా యమధీర. ఈ సినిమాలో మన తెలుగువారు నాగబాబు గారు, మధుసూదన్ గారు, ఆలీ గారు, సత్య ప్రకాష్ గారు నటించడం ఇది ఒక తెలుగు సినిమాలాగే అనిపిస్తోంది. యమధీర టైటిల్ కూడా చాలా క్యాచీగా ఉంది. యమ గతంలో మన యమదొంగ, యమలీల, యమగోల వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి అదేవిధంగా ధీర మగధీర లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఉంది. కోమల్ కుమార్ కూడా పోలీస్ ఆఫీసర్ గా చాలా అద్భుతంగా నటించాడు. మొత్తం అంతా కూడా ఫారిన్ లొకేషన్స్ లో చాలా అద్భుతంగా చిత్రీకరించారు. గతంలో విజయ్ సర్కార్ మూవీ లాగే ఇది కూడా పొలిటికల్ డ్రామా. ఈవీఎం ల ట్యాంపరింగ్, పోలింగ్ వాటి గురించి చాలా బాగా చూపించారు. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా టెక్నికల్ వాల్యూస్ తో ఈ యమధీర సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. వేదాల శ్రీనివాస్ గారు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ఈ జనరేషన్ కి కొత్త అవకాశాలు ఇవ్వాలని అదేవిధంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.


తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రెజరర్ రామ్ సత్యనారాయణ గారు మాట్లాడుతూ : యమధీర చాలా మంచి టైటిల్. ఇందాక ప్రసన్నకుమార్ గారు యముడు మీద వచ్చిన టైటిల్ చెప్తూ యముడికి మొగుడు టైటిల్ మర్చిపోయారు. యముడు టైటిల్స్ మీద వచ్చిన సినిమాలన్నీ కూడా పెద్ద సక్సెస్ అయ్యాయి. వేదాల శ్రీనివాస్ గారు చాలా మంచి వ్యక్తి. కోమల్ కుమార్ హీరోగా మనందరికీ తెలిసిన క్రికెటర్ శ్రీశాంత్ విలన్ గా ఈ సినిమా నిర్మించారు. మంచి ఫారిన్ లొకేషన్స్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తీశారు. మన తెలుగువారు నాగబాబు గారు, అలీ గారు లాంటివాళ్ళు నటించిన పదహారణాల తెలుగు సినిమా ఇది. చిన్న సినిమాలని ప్రమోట్ చేయడంలో ఎప్పుడూ ముందుండే పి ఆర్ ఓ, జర్నలిస్ట్ మధు ఈ సినిమాని చాలా చక్కగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రేక్షకులు సినిమాకి పెద్ద విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాత డి. ఎస్. రావు గారు మాట్లాడుతూ : యమధీర ఈనెల 23న విడుదల అవబోతోంది. కన్నడ సినిమా అయిన అచ్చమైన తెలుగు సినిమాల ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాని నిర్మించారు. ఎలక్షన్స్ గురించి ఈవీఎం ల ట్యాంపరింగ్ గురించి ముఖ్యంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. వేదాల శ్రీనివాస్ గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


పి. శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ : శ్రీ మందిరం ప్రొటెక్షన్ పై వేదాల శ్రీనివాస్ గారు నిర్మాతగా యమధీర సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఇందాక ప్రసన్నకుమార్ గారు చెప్పినట్టు రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టు ఇది తెలుగుదనం ఉట్టిపడుతున్న సినిమా. ఒక మంచి కాన్సెప్ట్ తో ప్రెసెంట్ ట్రెండుకు తగినట్టుగా ఎలక్షన్స్ గురించి వివరిస్తూ ఈ సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నారు. శ్రీనివాస రావు గారు విధ్వంసుడు. అన్నీ తెలిసి ఉండి ఇండస్ట్రీకి రావడం అంటే చాలా గట్స్ ఉండాలి. చాలా ధైర్యం ఉన్న ప్రొడ్యూసర్ మన ఇండస్ట్రీకి వచ్చారు. ఆయన లాంటి వ్యక్తికి సక్సెస్ వస్తే ఇంకా ఎన్నో మంచి సినిమాలతో ఎన్నో కుటుంబాలు ఇండస్ట్రీలో నిలబడతాయి. ఈ సినిమాకి పెద్ద విజయం చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాత వేదాల శ్రీనివాస్ రావు గారు మాట్లాడుతూ : నేను అడగగానే ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన టి ఎఫ్ పి సి సెక్రటరీ ప్రసన్నకుమార్ గారికి ట్రెజరర్ రామ సత్యనారాయణ గారికి డి. ఎస్. రావు గారికి పి. శ్రీనివాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ యమధీర ఫిలిం ఈవీఎం ట్యాంపరింగ్ పైన చిత్రీకరించాము. అజర్ బైజాన్ కంట్రీ లో ఎక్కువ శాతం షూట్ చేసాము. 100 సినిమాల్లో నటించిన కోమల్ కుమార్ గారు క్రికెటర్ శ్రీశాంత్ గారు ముఖ్య పాత్రలో నటించారు. అదేవిధంగా నాగబాబు గారు, అలీ గారు, సత్య ప్రకాష్ గారు, మధుసూదన్ గారు నటించారు. ఈనెల 23న ప్రేక్షకుల ముందుకి సినిమాను తీసుకురాబోతున్నాం. ఈ సినిమాని మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


తారాగణం : 

కోమల్ కుమార్, శ్రీశాంత్ (క్రికెటర్), రిషీక శర్మ, నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూదన్, తదితరులు. 


టెక్నికల్ టీం :

ప్రొడక్షన్ : శ్రీ మందిరం ప్రొడక్షన్స్

కెమెరామెన్ : రోష్ మోహన్ కార్తీక్ 

మాటలు & పాటలు : వరదరాజ్ చిక్కబళ్ళపుర

ఎడిటింగ్ : సి రవిచంద్రన్ 

సంగీతం : వరుణ్ ఉన్ని

నిర్మాత : వేదాల శ్రీనివాస్ రావు గారు

కథ & దర్శకత్వం : శంకర్ ఆర్

పి ఆర్ ఓ : మధు VR

Prabhudeva Premikudu Re Release Soon

 ప్రభుదేవ నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమికుడు గ్రాండ్ రీ రిలీజ్



కే టి  కుంజుమన్ నిర్మాతగా, ఎస్. శంకర్ దర్శకత్వంలో, ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా డాన్సర్, యాక్టర్ ప్రభుదేవ, అందాల నటి నగ్మ నటించిన ప్రేమికుడు సినిమా రీ-రిలీజ్ అవబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ గారు, మురళీధర్ గారు వ్యవహరిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమా రీ రిలీజ్ కి సంబంధించిన ప్రెస్ మీట్ నేడు చాలా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు, ట్రెజరర్ రామ్ సత్యనారాయణ గారు, దర్శకుడు ముప్పలనేని శివ గారు, శివనాగు నర్రా గారు, శోభారాణి గారు, నిర్మాతలు రమణ గారు, మురళీధర్ గారు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ముప్పలనేని శివ గారు మాట్లాడుతూ : 30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అప్పట్లో ప్రభుదేవ ని చూసి స్ప్రింగ్ లు ఏమన్న మింగాడా అనుకునేవాళ్లం. ఒక మంచి ప్రేమ కథ గా సెన్సేషన్ సృష్టించిన సినిమా ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరితోపాటు ఈ సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను అన్నారు.


తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ : ఈ సినిమా రీ రిలీజ్ లో కూడా మంచి విజయం అందుకుంటుంది. ఇందులో గానకందరుడు ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారి నటన అద్భుతంగా ఉంటుంది. ప్రభుదేవ నటన, డాన్సులు నగ్మ అందాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. మా సోదరి సుధారాణి గారికి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


దర్శకుడు శివనాగు గారు మాట్లాడుతూ : ఈ సినిమా ఈ తరంలో వచ్చుంటే కచ్చితంగా 100 కోట్లు కొట్టే సినిమా అయ్యేది. అప్పుడున్న బడ్జెట్ కి 3 కోట్లతో చేసిన సినిమ ఇప్పుడు ఉన్న కలెక్షన్లకి రీ రిలీజ్ లో 30 కోట్లు సాధిస్తుంది అని ఆశిస్తున్నాను. ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారి నటన ఈ సినిమాల అద్భుతంగా ఉంటుంది. ప్రభుదేవా గారి డాన్సులు అలాగే బాలసుబ్రమణ్యం గారితో కూడా డాన్స్ వేయించడం ఈ సినిమాకి హైలెట్. రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాతలు రమణ మరియు మురళీధర్ గారు మాట్లాడుతూ : 30 సంవత్సరాల క్రితం సెన్సేషన్ సృష్టించిన సినిమా మేము రీ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అతి త్వరలో ఫ్రీ రిలీజ్డ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా చేయబోతున్నాం. ఈవెంట్ కి ప్రభుదేవా గారు కూడా హాజరయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాం. రీ రిలీజ్ లో కూడా కలెక్షన్లు సృష్టిస్తుందని ఆశిస్తున్నామన్నారు.


ఈ ఈవెంట్లో ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు, ట్రెజరర్ రామ్ సత్యనారాయణ గారు, దర్శకుడు ముప్పలనేని శివ గారు, శివనాగు నర్రా గారు, శోభారాణి గారు, నిర్మాతలు రమణ గారు, మురళీధర్ గారు పాల్గొన్నారు.

Producer Razesh Danda Interview

 ‘బచ్చలమల్లి’ సరికొత్త కథతో డిఫరెంట్ జోనర్ సినిమా. సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరంతో చేసే సినిమాలు కూడా యూనిక్ కాన్సెప్ట్స్ తో అలరిస్తాయి. 2025 లో తప్పకుండా పాన్ ఇండియా సినిమా చేయబోతున్నా: సక్సెస్ ఫుల్ నిర్మాత రాజేష్ దండా



పంపిణీదారుని కంటే నిర్మాతగా ప్రయాణం బాగుందనీ, నచ్చిన కథతో ప్రయాణం చేసే వెసులుబాటు నిర్మాతగా వుందని సక్సెస్ ఫుల్ నిర్మాత రాజేష్ దండా తెలియజేస్తున్నారు. నేను పంపిణీదారుడిగా వున్నప్పుడే సందీప్ కిషన్, అల్లరి నరేష్ నన్ను నమ్మారు. అలా నాతో జర్నీ చేస్తున్నారు. వారితో మరలాసినిమాలు తీయడానికి కారణమదే అంటూ హాస్య మూవీస్ అధినేత రాజేష్ దండా అన్నారు. 


హాస్య మూవీస్ పతాకంపై పలు సినిమాలు నిర్మిస్తున్నారు. మార్చి 19 న రాజేష్ దండా పుట్జినరోజు. ఈ సందర్భంగా సినిమా నిర్మాణంలోనూ, భవిష్యత్ సినిమాల గురించి పలు విషయాలను పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.


ఈసారి బర్డ్ డే గిఫ్ట్ గా ఏమేమీ చేయబోతున్నారు?

స్వామిరారా చిత్రంతో పంపిణీదారునిగా మొదలయి దాదాపు 82 సినిమాలను విడుదల చేశా. ఒక్క క్షణం, నాంది సినిమాలకు సహ నిర్మాతగా పనిచేశా. అనిల్ సుంకరతో ప్రయాణం సాగిస్తూ ఊరి పేరు భైరవ కోన, సామజవర గమన వంటి సినిమాలను నిర్మించా. అవి హిట్ కావడంతో ఈ బర్త్ డే గిఫ్ట్ గా మరో కొన్నిసినిమాలు సిద్ధం చేసుకున్నా.


మీ బేనర్ లో స్వంతంగా సినిమా చేస్తున్నారే?

నేను ఇంతకుముందు కూడా చేసినవి స్వంత బేనర్ లోనే. నా కిష్టమైన వారితో నా బేనర్ లో చేయడం చాలా హ్యాపీ. నాంది సినిమా నా జోనర్ సినిమా. బచ్చలమల్లి కూడా నా జోనర్ సినిమా. ఇలా నా కిష్టమైన కథలతో మనుషులతో చేయడం చాలా ఆనందంగా వుంటుంది. దీనికి సుబ్బు దర్శకుడు.


బచ్చల మల్లి ఎలాంటి కథ. సీరియస్ గా వుంటుందా?

90 దశకంలోని కథ. చాలా ఆసక్తికరంగా వుంటుంది. కథ ప్రకారం సహజమైన లొకేషన్లలో తీయాలని అన్నవరం, తుని చుట్టు పక్కల విలేజ్ లలో షూటింగ్ చేస్తున్నాం. మే 10 నుంచి సాగే సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేస్తాం.

 

పెద్ద నిర్మాతలే నిదానంగా చేస్తున్నరోజుల్లో మీరు స్పీడ్ గా చేయడం శాటిటైల్ బిజినెస్ కూడా పొందడం మీకెలా అనిపిస్తుంది?

ఇక్కడ ఒక్కటే కొలమానం. సినిమాలు బాగా ఆడుతున్నాయి కనుక బిజినెస్ జరుగుతుంది. ఇంతకంటే పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతలు అనే తేడాలేదు.

 

పంపిణీదారునిగా నిర్మాతగా ఎలా మీకు ఉపయోగపడుతుంది? కాన్సెప్ట్ లను ఎలా అంచనా వేస్తున్నారు?

ఒకరకంగా పంపిణీదారునిగా వున్న అనుభవం చాలా వరకు ఉపయోగపడుతుంది. కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే కొత్తగా వుండే పాయింట్ తో వెళ్ళాలన్నదే నా పాలసీ. అలాంటి కథలతోనే భైరవ కోన, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, సామజవరగమన వంటి సినిమాలు తీయగలిగాను. 


అల్లరి నరేశ్, సందీప్ కిషన్..  వీరితోనే సినిమాలు చేస్తారా? వేరే హీరోతో చేయరా?

అదేం లేదు. రన్నింగ్ లో వున్న హీరోలతో కంపర్టబుల్ గా వుంటుంది. పైగా నేను పంపిణీదారుడిగా వున్నప్పటినుంచీ వారు నన్ను నమ్మారు. వారితో జర్నీ చాలా హ్యాపీగా వుంది. అలా అని బయట హీరోతో చేయను అని చెప్పను. త్వరలో బయట హీరోతో చేయబోతున్నా. 


సహజంగా మీకు ఏ జోనర్ అంటే ఇష్టం?

కమర్షియల్ సినిమా అంటే ఇష్టం. అందులో నాకు యాక్షన్ సినిమాలంటే మరీ ఇష్టం. అవి నా సినిమాలో వుండేలా చూసుకుంటాను. అది కూడా కథ ప్రకారం వుండాలి.


ఒక్కోసారి రివ్యూలు మిక్స్ డ్ గా వస్తుంటాయి? అన్ని సినిమాలపై మీరు చూసినప్పుడు మీ అంచనా ఎలా వుంటుంది? 

ఏ సినిమా అయినా  కొనుక్కున్న బయ్యర్ కు హిట్ అయితే డబ్బులు వస్తాయి. అది బెటర్ సినిమా అనుకుంటాడు. ఒక్కోసారి కొన్ని సినిమాలు మనకు బాగున్నా రికవరీ అవ్వలేదంటే ప్రేక్షకులకు నచ్చలేదని అర్థం. ఇక రివ్యూలు అంటారా.. వారి అభిప్రాయాలు ఎలాగైనా రాయవచ్చు. బైరవ కోనలో ఓ సాంగ్ వుంది. అది థియేటర్ వరకు తీసుకువస్తుందని భావించాం. అలాగే జరిగింది. నేడు  రెగ్యులర్ సినిమాలకు పెద్దగా ఆడియన్ రావడంలేదు. కానీ భిన్నంగా వుంటే తప్పకుండా వస్తారు.


చిన్న సినిమాలను తక్కువలో అవ్వగొట్టొచ్చు అనే టాక్ బయట వుంది? కానీ మీ సినిమాలకు ప్రభాస్ సినిమాకు పనిచేసే కెమెరామెన్, సంగీత దర్శకుడిని తీసుకోవడానికి కారణం?

సినిమాకు కథ తర్వాత ముఖ్యమైనది ఫొటోగ్రపీ. అది చక్కగా వుంటేనే కంటికి ఇంపుగా వుంటుంది. రంగస్థలం, కోమాలి సినిమాలు నేను చూశాను. సినిమాటో గ్రఫీ అద్భుతంగా వుంది. తను నాకు బాగా తెలుసు. అందుకే నేను తీసుకున్నాను. అలాగే సంగీత దర్శకుడు కూడా ఎంపిక చేశాను. తను బిజీగా వున్నా. నాకోసం చేస్తానని హామి ఇచ్చాడు. ఇలా మంచి మనుషులతో కలిసి పనిచేయడం నాకు చాలా ఇష్టం. ప్రేక్షకులకు కూడా ఆ ఫీలింగ్ వుంటేనే కనెక్ట్ అవుతారు. క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీయగలుగుతున్నా. 


 

నిర్మాతలకు కథపై కంట్రోల్ వుండదు. కేవలం క్యాప్ ఇయర్ అనే అపప్రద వుంది. దానికి మీరేమంటారు?

నేను చేసే హీరోలు నాకు పర్సనల్ ఫ్రెండ్స్. నేను అన్నీ స్టడీ చేసి ప్లాన్ చేసుకుంటాను. నాకు నా మాట వినేవారే దొరికారు. అది నా అద్రుష్టం. ముందుముందు వేరే హీరోలతో కూడా అలాగే వుండాలని కోరుకుంటా. ఇక సినిమా పరంగా చూస్తే, కథ, ప్రీప్రొడక్షన్, షూటింగ్ అన్నీ నేను ప్లాన్ చేసుకుంటా. నా ప్రమేయం అన్నింటిలో వుంటుంది. పంపిణీదారునిగా వున్న నా అనుభవం ఇలా ఉపయోగపడుతుంది. షూటింగ్ కూడా వెళుతుంటా. నిర్మాతగా కంట్రోల్ అనేది మన చేతుల్లోనే వుంటుంది.


అనిల్ గారితో జర్నీ ఎలావుంది?

ఆయనతో కలిసి సినిమాలు చేశాను. ఆయనతో జర్నీ చాలా బాగుంది.


హాస్య మూవీస్ కు ప్రత్యేకతగా మీరు ఏం చేయబోతున్నారు?

హాస్య మూవీస్ తో అన్ని మంచి సినిమాలు కొత్త కథలు తీయడమే ప్రత్యేకత. పలు పెద్ద సంస్థలు తీసినట్లే మా బేనర్ లో మంచి కథాంశాలు, కొత్త కథలు తీయాలనుకుంటున్నాం. ఇప్పటివరకు తీసినవి అలాంటికొత్త కథలే. రేపు దర్శకుడు త్రినాథ్ తో తీయబోయే సినిమా కూడా భిన్నమైన కథతో వుంటుంది.


థమాకా తర్వాత త్రినాథ్ పెద్ద సంస్థలతో చేస్తున్నారనే టాక్ వచ్చింది? అతన్ని మీరెలా లాక్ చేశారు?

ప్రసన్న చెప్పిన కథ బాగా నచ్చింది. పైగా అందరూ సక్సెస్ లో వున్నవారు కలిసి సినిమా చేయాలని చేస్తున్నాం. దానికి అన్నీకలిసివచ్చాయి. 


ప్రస్తతుం తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి చేరింది. మీ బేనర్ లో ఆ స్థాయిసినిమా వుంటుందా?

తప్పకుండా. పాన్ ఇండియా హీరో, కథ లభిస్తే తప్పకుండా చేస్తా. 2025 లో తప్పకుండా చేస్తా.


కొత్త సినిమాలు?

అల్లరి నరేష్ సినిమా యాభై శాతం పూర్తయింది. తదుపరి సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం సినిమాలు వున్నాయి.


డిజిటల్, శాటిలైట్ వ్యాపారం ఎలా వుందని భావిస్తున్నారు?

గత ఏడాదితో పోలిస్తే డిజటిల్, శాటిలైట్ బిజినెస్ తగ్గిందనే చెప్పాలి. ఇది చిన్న సినిమాలకే. పెద్ద సినిమాలకు పెద్దగా వర్తించదు. లక్కీగా నా సినిమాలకు అటువంటి ఇబ్బంది రాలేదు. నా మూడు సినిమాలు రిలీజ్ కుముందుగానే శాటిలైట్ బిజినెస్ అయిపోయాయి. రేపు రాబోయే సినిమాలు కూడా బిజినెస్ కు సిద్ధంగా వున్నాయి. ఏది ఏమైనా బేనర్, నిర్మాత సక్సెస్ చూసే మార్కెట్ వుంటుంది. అలా నాకు రావడం అద్రుష్టంగా భావిస్తున్నా. ఎవరు కొన్నా ముందుగా టీజర్ చూసే కొంటారు. అవి నచ్చితేనే ఏ బిజినెస్ అయినా ఈజీగా అవుతుంది.


మీ బేనర్ లో పెద్ద ప్రాజెక్ట్ ఎప్పుడు ఉండబోతుంది?

వచ్చే ఏడాది తప్పకుండా పెద్ద హీరోతో చేయబోతున్నా. అది ఎవరనేది సస్పెన్స్. 


ఏడాదికి ఇన్ని సినిమాలు చేయాలని రూల్ పెట్టుకున్నారా?

అలాంటిది ఏమీ లేదు. మారేడుమల్లి. షూట్ లో వుండగానే బచ్చల మల్లి కథ విన్నాను. అదేవిధంగా సామజవరగమన షూట్ లో వుండగానే కిరణ్ అబ్బవరం సినిమా అనుకున్నాం. షడెన్ గా వచ్చింది త్రినాథ్ సినిమా.. అని ముగించారు.

Oh My Lilly Song From Tillu Square is Unveiled in Grand Scale

 స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 'టిల్లు స్క్వేర్' చిత్రం నుంచి 'ఓ మై లిల్లీ' పాట విడుదల



స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ 'డీజే టిల్లు' చిత్రంతో సంచలన బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. ఆ సినిమాలో ఆయన పోషించిన టిల్లు పాత్ర యువతలో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. టిల్లుగా సిద్ధు పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాయి.


ఇప్పుడు 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్‌ గా 'టిల్లు స్క్వేర్' వస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి.. టిల్లుని, అతని చేష్టలను తిరిగి వెండితెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి.


'టిల్లు స్క్వేర్' నుంచి ఇప్పటికే విడుదలైన 'టికెటే కొనకుండా', 'రాధిక' పాటలు విశేష ఆదరణ పొందాయి. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో సంచలనం సృష్టించాయి. తాజాగా ఈ చిత్రం నుంచి 'ఓ మై లిల్లీ' అనే పాట విడుదలైంది. సోమవారం వారం సాయంత్రం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో అభిమానుల కోలాహలం మధ్య జరిగిన వేడుకలో ఈ పాటను విడుదల చేశారు.


అచ్చు రాజమణి స్వరపరిచిన 'ఓ మై లిల్లీ' మెలోడీ సాంగ్ కట్టి పడేస్తోంది. గాయకుడు శ్రీరామ్ చంద్ర తన మధుర స్వరంతో మాయ చేశాడు. సిద్ధు, రవి ఆంథోనీ సాహిత్యం అద్భుతంగా కుదిరింది. తేలికైన పదాలతో లోతైన భావాన్ని పలికించారు. ఇక లిరికల్ వీడియోలో సిద్ధు, అనుపమ మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


అందరినీ అలరించే చిత్రం:

పాట విడుదల సందర్భంగా దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ.. "ఓ మై లిల్లీ పాట మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ కావడంతో ఈ సినిమా మొదలైనప్పుడే ఎంతో బాధ్యత, ఒత్తిడి ఉందని అర్థమైంది. మాకు ఒక మంచి టీం దొరికింది. అందరం కలిసి మంచి అవుట్ పుట్ ని తీసుకొచ్చాము. ఈ చిత్రం మార్చి 29న థియేటర్లలో విడుదల కానుంది. మీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను" అన్నారు.


డీజే టిల్లుని మించేలా సీక్వెల్ ఉంటుంది:

కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. "డీజే టిల్లు చేసే సమయంలో ప్రేక్షకుల్లో సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అందుకే ఎలాంటి ఒత్తిడి లేకుండా చేశాము. కానీ టిల్లు స్క్వేర్ పై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా, మొదటి భాగాన్ని మించేలా సినిమాని రూపొందించాము. టిల్లు పాత్ర అలాగే ఉంటుంది. కానీ కథ మాత్రం వేరేలా ఉంటుంది" అన్నారు.


మీ ప్రేమ మాపై ఎప్పుడు ఇలాగే ఉండాలి:

కథానాయిక అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. "నేను మొదటిసారి టిల్లు స్క్వేర్ కి సంబంధించిన వేడుకలో పాల్గొన్నాను. మీ స్పందన చూసి చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి నుంచి ఒక్క వేడుక కూడా మిస్ అవ్వను. మీ ప్రేమ మాపై ఎప్పుడు ఇలాగే ఉండాలి. మార్చి 29న సినిమా విడుదలవుతోంది. ఈ చిత్ర విడుదల కోసం మేము ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాము. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను." అన్నారు.


కుటుంబ ప్రేక్షకులను కూడా మెప్పించేలా ఉంటుంది:

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. వేసవి సీజన్ లో మొదటి సినిమాకి లబ్ది చేకూరుతుందన్న ఉద్దేశంతో మార్చి 29న వస్తున్నాం. ఎన్నికలు కూడా ఏప్రిల్ లో లేకపోవడంతో కలిసొచ్చింది. డీజే టిల్లు మొదట యూత్ ఫుల్ సినిమాగా ప్రచారం పొందింది. కానీ యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచి కూడా విశేష స్పందన లభించింది. టిల్లు స్క్వేర్ కూడా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది" అన్నారు.  


'టిల్లు స్క్వేర్' చిత్రం 2024, మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. రామ్ మిరియాల, అచ్చు రాజమణి ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందిస్తున్నారు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

Sanjana Anne Movie Dubbing Works Started

సంజన అన్నే దర్శకత్వంలో వస్తోన్న క్రైమ్ రీల్ చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం !!!



అన్నే క్రియేషన్స్ బ్యానర్ పై సంజన అన్నే దర్శకత్వం వహిస్తున్న సినిమా క్రైమ్ రీల్. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సంజన అన్నే ఈ సినిమాతో దర్శకురాలిగా మారడం విశేషం. ఇటీవల ఈ చిత్ర పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మినిష్టర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేశారు.


ఇటీవల విడుదలైన క్రైమ్ రీల్ మూవీ పోస్టర్ కు విశేష స్పందన లభించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. త్వరలో ఈ సినిమా టీజర్ ను యూనిట్ విడుదల చేయనున్నారు.


సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న ఈ సినిమా సీట్ ఎడ్జె థ్రిల్లర్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది,  బాబు కొల్లాబత్తుల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సాగర్ ఉదగండ్ల ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. రచన, దర్శకత్వం సంజన అన్నే గా వ్యవహరిస్తున్నారు. 


PrajaKavi Kaloji Movie Bagged 7 Prestigious Awards

 "ప్రజాకవి కాళోజీ" సినిమాకు ఇప్పటికే 7 ప్రతిష్టాత్మక ఫిల్మ్ అవార్డులు......



జైనీ క్రియేషన్స్ పతాకంపై, ఇప్పటి వరకు  ''అమ్మా!  నీకు వందనం",  "క్యాంపస్ అంపశయ్య'",  "ప్రణయ వీధుల్లో' పోరాడే ప్రిన్స్ ", వంటి  ప్రయోజనాత్మక ' సినిమాలు తీసిన డాక్టర్ ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో అదే బ్యానర్లో శ్రీమతి విజయలక్ష్మీ  జైనీ నిర్మించిన చిత్రం  'ప్రజాకవి కాళోజీ' బయోపిక్. ఈ చిత్రాన్ని ప్రదర్శించిన ప్రతీ చోట విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా


ఇండియన్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు 2024 లో ఫీచర్ ఫిక్షన్ కేటగిరిలో స్పెషల్ జ్యురీ అవార్డు,


 కోలీవుడ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2023 లో రెండు అవార్డులు


బెస్ట్ డైరెక్టర్ అవార్డు


బెస్ట్ యాక్టర్ అవార్డ్


ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 16వ జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్  2024 (జె ఐ యఫ్ యఫ్) లో బెస్ట్ ఫీచర్ డాక్యుమెంటరీ అవార్డు


ఢిల్లీ ఫిలిం ఫెస్టివల్  2024 లో మార్చి 30 న బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు


రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ , 2024 లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ రీజనల్, తెలుగు అవార్డు


కర్ణాటక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ , 2023 లో  బెస్ట్ డైరెక్టర్ అవార్డు


..ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్, 2024 కు బెస్ట్ బయోపిక్ మూవీ అవార్డ్  లభించాయి...


పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు గారి జీవిత విశేషాలతో నిర్మించిన బయోపిక్ చిత్రం గురించి చిత్రసీమకు చెందిన అనేక మంది ప్రముఖులు ప్రశంసించారు. ఒక కవి మీద సినిమా తీయడం చాలా సాహసమని కొనియాడారు. ఇందులోని నాలుగు పాటలు కాళోజీ గారి ఔన్నత్యాన్ని పెంచే విధంగా చిత్రీకరించారని మెచ్చుకున్నారు. మొదట్లో ఈ చిత్రం అందరి విమర్శలు ఎదుర్కున్నా, చివరికి నా కృషి ఫలించినందుకు చాలా ఆనందంగా ఉంది , ఇందులో ముఖ్య పాత్రలలో నటించిన మూలవిరాట్ (అశోక్ రెడ్డి), పీవీ మనోహర్ రావు గారు, పద్మ, మల్లిఖార్జున్, నరేష్, రజని మొదలైన వారు అద్భుతమైన నటన ప్రదర్శించారని డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్ జైనీ కొనియాడారు.


సంగీతం సూరంపూడి శ్రీధర్, కెమెరా స్వర్గీయ రవికుమార్ నీర్ల.


Hero Priyadarshi Interview About Om Bheem Bush

 'ఓం భీమ్ బుష్' అందరినీ అలరించే క్లీన్ ఎంటర్ టైనర్. ఇందులోని ఎమోషనల్ ఎలిమెంట్ చాలా యూనిక్ గా వుంటుంది: హీరో ప్రియదర్శి



హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ 'ఓం భీమ్ బుష్' తో ప్రేక్షకులని ఆలరించబోతున్నారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 'ఓం భీమ్ బుష్'  మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో ప్రియదర్శి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


ప్రియదర్శిగారు  'ఓం భీమ్ బుష్'  ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?

దర్శకుడు హర్ష 'హుషారు' సినిమా నుంచే పరిచయం. నేను తన గత చిత్రాలలో పని చేయాల్సింది కానీ కుదరలేదు. 'ఓం భీమ్ బుష్' కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. శ్రీ విష్ణు, రాహుల్ అనేసరికి ఇంకా ఆసక్తి పెరిగింది. అలాగే యువీ లాంటి బలమైన నిర్మాణ సంస్థ వుండటం.. ఇలా అన్నీ కుదిరాయి. కథలో చాలా ఇంట్రస్టింగ్ ఐడియా వుంది. దానికి ఫాంటసీ, హారర్ ఎలిమెంట్ కూడా యాడ్ చేయడం ఇంకా క్రేజీగా అనిపించింది. అలాగే స్నేహితులతో కలసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.


ఇందులో మీ పాత్ర ఎలా వుంటుంది ?

ఇందులో నా పాత్ర పేరు డా. వినయ్ గుమ్మాడి. మా ఫ్రెండ్స్ అంతా ఉస్మానియాలో పీహెచ్డీ చేయాలనీ చేరుతాం. కానీ ముఖ్య ఉద్దేశం మాత్రం అక్కడ వచ్చే స్టయిఫండ్ , ఉచిత హాస్టల్ సౌకర్యం కోసం.  నాది సైన్స్ ని బిలివ్ చేసే పాత్ర. మిగతా ఇద్దరు మాత్రం మంత్రాలు, తంత్రాలని నమ్ముతారు. అలా మా ముగ్గురి మధ్య మంచి హ్యుమర్ వుంటుంది. సినిమా అంతా ఎంటర్ టైన్ మెంట్ వుంటుంది. మధ్యలో మంచి ఎమోషనల్ పాయింట్ వుంది. అది యూనిక్ గా వుంటుంది. మేము ముగ్గురం కలసి బ్రోచేవారెవరురా చేశాం. దానికి 'ఓం భీమ్ బుష్' కి ఎక్కడా పోలిక వుండదు.


ఈ సినిమాలో మీకు హీరోయిన్ ఉందా ?

ఆయేషా ఖాన్ నా జోడిగా కనిపిస్తారు. అలాగని రొమాంటిక్ సాంగ్స్ ఏమీ వుండవు.


ఇందులో కామెడీ ఎలా వుంటుంది ?

ఇది బడ్డీ కామెడీ మూవీ. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా చాలా అందరూ ఎంజాయ్ చేశా చాలా క్లీన్ గా సినిమా చేశాం.


మీ ముగ్గురు కలిసి చేసిన బ్రోచేవారెవరు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ అనుకోవచ్చా?

ఖచ్చితంగా కాదు. ఎందుకంటే అందులో ముగ్గురం కొంచెం మెచ్యూర్డ్ పాత్రలు. అనుకోకుండా ఓ సమస్యలో ఇరుక్కుంటాం. కానీ 'ఓం భీమ్ బుష్' అలా కాదు. మేం ముగ్గురం తింగరి పనులు చేసి సమస్యలలో ఇరుక్కుంటాం. దానికి దీనికి చాలా తేడా వుంది. సీక్వెల్ కాదు.


మంగళవారం సినిమాలో ఓ ప్రధాన పాత్ర చేశారు కదా.. ఆ సినిమా తర్వాత హీరోగా కథలు ఎంచుకోవాలనే ఆలోచన వచ్చిందా ?

హీరోగా కంటే నన్ను నేను ఒక నటుడిగా చూసుకోవడానికి ఇష్టపడతాను. హీరో అనగానే ఒక ఇమేజ్ వస్తుంది. నటుడిగా వుంటే చాలా స్వేఛ్చగా ఒక నదిలా హాయిగా ప్రవహించవచ్చు. నటుడిగా వుంటే ఎక్కువ వైవిధ్యం చూపించవచ్చు. అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయనేది నా నమ్మకం. మంగళవారంలో కూడా ఒక ముఖ్యపాత్రగానే వుంటాను కానీ హీరోగా వుండను. ఇలాంటి మంచి పాత్రలు ఇస్తున్న రచయిత, దర్శకులు వుండటం నా అదృష్టం.


నిర్మాతల సహకారం ఎలావుంది?

సునీల్ గారు, వంశీ గారు సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు. అద్భతమైన ప్రొడక్షన్ వాల్యూస్ వుంటాయి. ఇందు భారీ మహల్ సెట్ వుంటుంది. ఫిల్మ్ సిటీలో మ్యాసీవ్ సెట్ వేశారు. అలాగే సినిమాకి కావాల్సిన ప్రతిది ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు.  వారి సహకారంలేకుండా ఈ సినిమా గ్రాండ్ గా తీసేవాళ్ళంకాదు. ఇందులో గ్రీక్ తరహా గెటప్ లో ముగ్గురం వుంటాం. మాతో పాటు ఫారిన్ లేడీస్ నటించారు. ఇది ఓ పేలెస్ లో షూట్ చేశారు. ఆ  పాలెస్ పూనెకు డెబ్బ కిలోమీలర్ల దూరంలో వుండే థోర్ అనే ప్రాంతంలో వుంది. చాలా బ్రహ్మాండగా వచ్చింది.  ఈ నేపథ్యంలో ఓ సాంగ్ కూడా వుంటుంది. ఇదంతా డ్రీమ్ సాంగ్ లా వస్తుంది. నిర్మాతల సమకారం లేకుండా ఇలా రిచ్ నెస్ వచ్చేదికాదు. అలాగే ఫిలింసిటీలో కూడా కొంత పార్ట్ తీశారు.


'ఓం భీమ్ బుష్'  టైటిల్ పెట్టడానికి కారణం?

అసలు కథగా అనుకున్నప్పుడు ముందుగా ఈ టైటిల్ అనుకోలేదు. కానీ రానురాను షూటింగ్ చేస్తుండగా, మా ముగ్గురి మధ్య వుండే రాపోతో ఈనాటి ట్రెండ్ కు తగినట్లు మాట్లాడే భాషతో షడెన్ గా పుట్టిన టైటిల్ 'ఓం భీమ్ బుష్'. ఇలాంటి పదం గతంలో మనం చాలాసార్లు వినేవాల్ళం. చాలా కేచీగా వుంటుందనిపించింది. అలాగే ఈ సినిమాకు టైటిల్ ఓ ఎసెట్ గా అనిపించింది.


ఈమధ్య ప్రమోషన్ లో భాగంగా టూర్ లు వెళ్ళారు. స్పందన ఎలా వుంది?

నేను వైజాగ్ కు వేరే షూట్ లో వుండడం వల్ల వెళ్ళలేకపోయా. హైదరాబాద్ లో ట్రైలర్ అప్పుడు కానీ, మిగిలిన చోట్ల కానీ అద్భుతమైన రెస్సాన్స్ వచ్చింది. యూత్ ఆడియన్స్ మమ్మల్ని చూడగానే ఎంతో ఎంజాయ్ చేస్తూ గత సినిమాలతో పోలుస్తూ పలకరించడంతో మాపై మాకు మరింత బాధ్యతగా అనిపించింది.


యూత్ సినిమాలలో డైలాగ్ లు కొంచెం గాడి తప్పుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.? దీనిపై మీరేం మంటారు?

సహజంగా యూత్ బయట మాట్లాడుకునే మాటలే సహజత్వం కోసం సినిమా పరంగా కథపరంగా కొన్నిడైలాగ్స్ లు అలా వస్తుంటాయి. కానీ ఎక్కడా అసభ్యతకు తావులేకుండా వుంటాయి.


గతానికి వర్తమానికి మీలో కలిగిన మార్పులు ఏమిటి?

నేను పెళ్లిచూపులు టైంలో టీనేజ్ లో వున్నాను. ఆ తర్వాత సినిమా సినిమాకూ వస్తున్న రెస్సాన్స్ చూసి నాలోతెలీని మార్పు గమనించాను. మంగళవారం తర్వాత నాలో తెలీని మార్పు కనిపించింది. ఆమధ్య  షూటింగ్ లో భాగంగా బయటకు వెలితే.. మీరు సినిమా వాల్ళా.. ఆర్.ఆర్.ఆర్.. సినిమా వాళ్ళే కదా.. అంటూ ఆ సినిమాను కంపేర్ చేస్తూ తెలుగు సినిమా వారిలో ఎంత కనెక్ట్ అయిందో మాకు అర్థం అయింది.  బయట ప్రేక్షకులు మనల్ని ఇంతగా గుర్తుపెట్టుకున్నారంటో మరింత బాధ్యతగా వుండాలని చాలా నాకు నేను మార్చుకున్నాను.


దర్శకుడు హర్ష గురించి చెప్పండి?

తను టాలెంట్ దర్శకుడు. హర్ష నాకు 12 ఏళ్ళుగా తెలుసు. హుషారు ముందు సినిమా చేయాల్సింది కుదరలేదు. రౌడీబాయ్స్ టైంలలో కథ చెప్పాడు. అదీ కుదరలేదు. ఇప్పుడు మూడోసారి కుదిరింది.


రాహుల్ రామక్రిష్ణ, శ్రీ విష్ణు ఇలా మీ ముగ్గురు కెరీర్ చూస్తే ఏమనిపిస్తుంది.

రాహుల్  12 ఏళ్ళుగా తెలుసు. శ్రీ విష్ణుతో ఉన్నది ఒక్కటే జిందగీ నుంచి తెలుసు. స్నేహితులతో కలసి సినిమా చేస్తున్నపుడు ప్రతి క్షణం మెమరబుల్ గానే వుంటుంది. మా ముగ్గురికీ ఒకే పోలిక వుంది. మేం ఇండస్ట్రీలో స్వయంగా ఎదిగాం. అలా సినిమా రంగం మమ్మల్ని ప్రోత్సహించింది. ఇందుకు ఆడియన్స్ కు మన్సూర్తిా క్రుతజ్జతలు తెలియజేసుకుంటున్నాం.


ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ?

లీడ్ రోల్ లో ఓ సినిమా చేస్తున్నా. షూటింగ్ జరుగుతోంది. అలాగే గేమ్ ఛేంజర్ లో కూడా నటిస్తున్నాను.

Haddu Leduraa Trailer Launched Grandly

 ”హద్దు లేదురా'లో ఫ్రెండ్షిప్ తో పాటు మంచి యాక్షన్ వుంది. సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలి: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని



ఆశిష్‌ గాంధీ, అశోక్‌ హీరోలుగా వర్ష, హ్రితిక హీరోయిన్లుగా రాజశేఖర్ రావి దర్శకత్వంలో తెరకెక్కిన  చిత్రం ”హద్దు లేదురా'. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వర్ణ పిక్చర్స్  బ్యానర్స్ పై  వీరేష్ గాజుల బళ్లారి నిర్మిస్తున్నారు. రావి మోహన్ రావు సహా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం  టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ముఖ్యఅతిధిగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.  


ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ..”హద్దు లేదురా'.. దర్శకుడు రాజశేఖర్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్లు అనిపించలేదు. సినిమా అద్భుతంగా తీశాడు. చాలా మంచి సినిమా అవుతుంది.  మొదటి సినిమా బర్త్ లాంటింది. నా మొదటి సినిమా డాన్ శ్రీను ఇప్పటికీ మర్చిపోలేను. మొదటి సినిమా మనం ఇండస్ట్రీకి తెలియజేసే సినిమా. రాజశేఖర్ కూడా అలాంటి మూమెంట్ లోనే వున్నాడు. మొదటి సినిమా కోసం ఫ్రెండ్షిప్ అనే మంచి పాయింట్ తీసుకున్నాడు.  ట్రైలర్ చూసినప్పుడు ఫ్రెండ్షిప్ తో పాటు మంచి యాక్షన్  కూడా వుంది.  ఆశిష్‌ గాంధీ నేను చేసిన 'విన్నర్' లో చేశాడు. తర్వాత నుంచి మంచి నటుడిగా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆశిష్‌ గాంధీ, అశోక్‌ ఇద్దరికీ ఆల్ ది బెస్ట్. వీరేష్ చాలా పాషన్ తో ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా మంచి హిట్ కావాలని నిరూపించుకున్నాడు. నేను బాలయ్య బాబుకి ఎంత పెద్ద  అభిమానినో రాజశేఖర్ కూడా అంతే పెద్ద ఫ్యాన్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. మార్చి 21న సినిమా విడుదలౌతుంది.  సినిమాని మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాను' అన్నారు.


ఆశిష్‌ గాంధీ మాట్లాడుతూ.. నాటకం సినిమా టీజర్ లాంచ్ కి గోపీచంద్ గారు వచ్చారు. అదే సెంటిమెంట్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్షిప్ మూవీ. రాజశేఖర్ చాలా పాషన్ తో సినిమా చేశారు. నిర్మాతలు బ్యాక్ బోన్ గా నిలబడి ఈ సినిమాని ఇక్కడి వరకూ తీసుకొచ్చారు. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.'' అన్నారు.


దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకులు గోపీచంద్ మలినేని గారికి ధన్యవాదాలు. జీవితాన్ని నచ్చినట్లు బ్రతకాలని చెబుతూ ఈ చిత్రానికి హద్దులేదురా అనే టైటిల్ పెట్టడం జరిగింది. లక్ష్యం చేరుకునే వరకూ హద్దు ఉండకూడదు. నిర్మాత వీరేష్ అద్భుతంగా సపోర్ట్ చేశారు. ఆశిష్‌ గాంధీ, అశోక్‌ తో పాటు మిగతా నటీనటులంతా అద్భుతంగా నటించారు. సినిమా యూనిట్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. పేరుపేరునా అందరికీ ధన్యవాదాలు' తెలిపారు.


తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. పరిశ్రమలో కష్టపడనిదే విజయం దక్కదు. దర్శకుడు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మార్చి 21న దాని ఫలితం దక్కుతుంది. రాజశేఖర్ రాసిన మాటలు చాలా బావున్నాయి. ఇందులో పాటలు కూడా చాలా చక్కగా వున్నాయి. కొత్త హీరోలు ఇద్దరు ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి వచ్చారు. వారని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. హద్దులేదురా సినిమాకి హద్దు ఉండకూడదని కోరుకుంటున్నాను అన్నారు.


రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ..  ఈ సినిమా కథ అద్భుతంగా వుంది. ఇలాంటి సినిమాలు ఇంకెన్నో రావాలి.  కృష్ణార్జునులు స్నేహం ఇతివృత్తంగా తీసుకోవడం చాలా బావుంది. సినిమా యూనిట్ అందరికీ నా అభినందనలు. సినిమా తప్పకుండా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.'' అన్నారు.


నిర్మాత విరేశ్ మాట్లాడుతూ.. చాలా కష్టపడి ఈ సినిమా చేశాం. సినిమా చాలా బావొచ్చింది. అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూసి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.  దర్శకుడు ఈ కథ చెప్పగానే చాలా నచ్చింది. ఆశిష్‌ గాంధీ, అశోక్‌ చాలా అద్భుతంగా నటించారు. మార్చి 21న అందరూ సినిమా చూడాలని కోరుకుంటున్నాను'' అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.


Lambasingi Success Meet Held Grandly

 ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పడే వేదన నాకు తెలుసు అందుకే లంబసింగి నిర్మించాను : కళ్యాణ్ కృష్ణ  !!!




కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్ పై మార్చి 15న విడుదలైన సినిమా లంబసింగి. భారత్ రాజ్, దివి హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నిర్మించగా, నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు...


ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ....

ముందుగా మీడియా వారికి ధన్యవాదాలు, మా సినిమాకు మీరు ఇచ్చిన రివ్యూస్ చాలా బాగున్నాయి. నేను ఒక దర్శకుడిగా ఉండి ఇంకో దర్శకుడితో సినిమా చెయ్యడానికి కారణం ఏంటంటే... టాలెంట్ ఉండి కూడా అవకాశాలు రాక చాలా మంది ఉంటారు, నేను కూడా అలా అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను అందుచేత నేను కొందరికి అవకాశం ఇద్దామని సినిమా నిర్మాణంలో అడుగు పెట్టాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు డైరెక్షన్ చెయ్యడానికి ఏడేళ్లు 

వెయిట్ చేశారు, ప్రతిరోజు రేపే షూటింగ్ అనుకుంటూ గడిపే నాకు నాగార్జున గారూ నాకు అవకాశం ఇచ్చారు,  ఆయనకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. దివి లాంటి చాలా మంది తెలుగు అమ్మాయిలు ఉన్నారు అందరికి అవకాశాలు రావాలి దివి ఈ సినిమాలో అద్భుతంగా నటించింది, భారత్ రాజ్ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అననికి మంచి భవిషత్తు ఉండాలి. నవీన్ గాంధీ గారు తాను అనుకున్న కథను అద్భుతంగా తెరకెక్కించారు, ఆర్.ఆర్.ధ్రువన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు, ఈ సినిమా కోసం సూపర్ మెలోడీస్ ఇచ్చారు, ఆర్ట్ ఝాన్సీ కెమెరామెన్ బుజ్జి ఇలా అందరూ కష్టపడ్డారు, వారి కష్టానికి ఫలితం ఈరోజు లభించింది, సినిమాను అందరూ చూసి ఎంకరేజ్ చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.ఆర్.ధ్రువన్ మాట్లాడుతూ...

లంబసింగి సినిమా నాకు చాలా స్పెషల్, సాంగ్స్ బాగున్నాయని అందరూ అంటున్నారు. సినిమా చూసి వచ్చిన ప్రతిఒక్కరు ఎమోషనల్ అయ్యారు. కళ్యాణ్ కృష్ణ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్, ఈ సినిమా చేస్తున్న ప్రాసెస్ లో చాలా నేర్చుకున్నాను అన్నారు. 


నటుడు మాధవ్ చిలుకూరి మాట్లాడుతూ.. .

సినిమాకు అందరి దగ్గర నుండి మంచి రెస్పాన్ లభిస్తోంది. దివి, భారత్ చాలా నేచురల్ గా చేశారు. ఒక మంచి లవ్ స్టొరీని డైరెక్టర్ గారు అందంగా చూపించారు. ఈ సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. 


దర్శకుడు నవీన్ గాంధీ మాట్లాడుతూ...

ఈ కథ రాసినప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఇప్పుడు ప్రేక్షకులు అదే బరువైన హృదయంతో బయటికి వస్తున్నారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గారు నన్ను నమ్మి ఈ సినిమా చేసినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన జీ.కె.మోహన్ గారికి థాంక్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ , మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్, ఆర్ట్ ఝాన్సీ ఇలా అందరూ వారి బెస్ట్ ఇచ్చారు. దివి, భారత్ చాలా ఇంటెన్స్ తో నటించాని, మా లంబసింగి సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. 


హీరోయిన్ దివి మాట్లాడుతూ...

కళ్యాణ్ కృష్ణ గారు ఒక తెలుగు అమ్మాయి కావాలని నన్ను ఈ సినిమాకు తీసుకోవడం నాకు చాలా ఆనందమేసింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ గారికి స్పెషల్ థాంక్స్, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వండి, గుర్తించండి, మేము కూడా కష్టపడతాము, నవీన్ గాంధీ గారు సినిమాను అద్భుతంగా తీశారు. రెస్పాన్స్ బాగుందని అన్నారు.


హీరో భారత్ రాజ్ మాట్లాడుతూ...

కళ్యాణ్ కృష్ణ గారి దర్శకత్వంలో ఒక చిన్న రోల్ చెయ్యాలని అనుకున్నాను. అలాంటిది  ఆయన నిర్మాతగా చేసే సినిమాలో లీడ్ రోల్ చెయ్యడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలో మ్యూజిక్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, క్రెడిట్ మొత్తం ఆర్.ఆర్.ధ్రువన్ గారికి చెందుతుంది, నవీన్ గాంధీ గారు సినిమాను తీసిన విధానం చాలా బాగుంది. వీరవాబు పాత్రను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

Icons Of Indian Film Industry Awards- 2024

 ఘనంగా ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ 2024 కార్యక్రమం



ఇవ్వాలని ఇదే వేదిక మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కోరాం. ఆయన సీఎం రేవంత్ గారికి చెప్తా అన్నారు. చెప్పిన వారంలోనే ప్రకటన ఇచ్చారు. గద్దర్ గారి పేరు మీద నంది అవార్డ్స్ ఇస్తామన్నారు. ఈ ఏడాది గద్దర్ అవార్డ్స్ ఇస్తారని కోరుకుంటున్నా అన్నారు.


వీకే నరేష్ మాట్లాడుతూ.. నేను 8 ఏళ్ల వయసులో బాల నటుడిగా ఇండస్ట్రీకి వచ్చాను. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. మురళీ మోహన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకోవడం చాలా హ్యాపీగా ఉంది. కళాకారుడికి నిజమైన సంతోషాన్నిచ్చేది అవార్డ్స్ మాత్రమే. నేను నా ప్రతిభ వల్లే ఇన్నేళ్లు పరిశ్రమలో ఉన్నాను అనుకుంటే తప్పు. సినిమా టీమ్ వర్క్. డైరెక్టర్ మీడియం. నేను ఒక మహిళా దర్శకురాలికి బిడ్డగా పుట్టాను. ఈ అవార్డ్స్ కార్యక్రమంలో సినీ పెద్దలంతా పాల్గొనాలని కోరుకుంటున్నాను అన్నారు.


అంతర్జాతీయ ఖ్యాతి పొందిన టాక్ షో ప్రయోక్త కిరణ్ ప్రభ మాట్లాడుతూ.. ఇంతమంది ప్రముఖులు పాల్గొన్న ఈ ఐకాన్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో నన్ను సత్కరించటం ఆనందంగా ఉంది. టాక్ షోస్ ద్వారా చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందిస్తున్న ప్రముఖుల జీవిత చరిత్రలను ఆవిష్కరిస్తున్న నా కృషికి ఈ అవార్డు మరింత స్ఫూర్తిని ఇచ్చింది అన్నారు.

ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమాన్ని ప్రముఖ యువ నటుడు, ప్రయోక్త కృష్ణ కౌశిక్ తన చక్కని వ్యాఖ్యానంతో రక్తి కట్టించారు.



Nikhil Siddharth Officially Confirms Karthikeya 3 With Chandoo Mondeti, Starts Soon

 నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ3' త్వరలో ప్రారంభం



హీరో నిఖిల్ సిద్ధార్థ్ తెలుగు, హిందీ భాషల్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అప్పటి నుంచి కార్తికేయ 3కి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


తాజాగా నిఖిల్ కార్తికేయ 3ను అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు.  దర్శకుడు చందూ మొండేటి అడ్వెంచరస్ థ్రిల్లర్  మూడవ ఫ్రాంచైజీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌పై పని చేస్తున్నారు.  ఇది త్వరలో ప్రారంభం కానుంది.


“డా. కార్తికేయ సరికొత్త సాహసం కోసం ... త్వరలో🔥 @chandoomondeti #Karthikeya3 #Karthikeya2 #cinema #adventure" అని నిఖిల్ పేర్కొన్నారు,


కార్తికేయ 3  స్పాన్, స్కేల్ పరంగా చాలా బిగ్గర్ గా ఉండబోతోంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తారు.


ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'స్వయంభూ' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.


Telugu SuperHero Film HanuMan starts streaming on ZEE5

 ZEE5లో సెన్సేష‌న‌ల్ పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ ‘హను-మ్యాన్’ స్ట్రీమింగ్‌



Subscribe ZEE5 and watch Hanuman now! 🍿

https://www.zee5.com/movies/details/hanu-man/0-0-1z5531939



తెలుగువారికే కాదు అన్ని భాషల వారికి వైవిధ్యమైన కథలను అందించడంలో ముందు ఉంటుంది ఓటీటీ ప్లాట్ ఫామ్ ZEE5. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచిన ‘హను-మ్యాన్’ను స్ట్రీమింగ్ చేస్తోంది. వెర్స‌టైల్ యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో కె.నిరంజ‌న్ రెడ్డి నిర్మాత‌గా  ఈ ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ‘హను-మ్యాన్’ చిత్రం ఎవ‌రూ ఊహించ‌ని స‌క్సెస్‌ను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా లెవ‌ల్లో రూ.300 కోట్ల‌ను అందుకుంది. థియేట‌ర్స్‌లో ‘హను-మ్యాన్’ సినిమాను ఎంజాయ్ చేసిన ఆడియెన్స్ ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆస‌క్తిగా ఎదురు చూడ‌సాగారు. అంద‌రి వెయిటింగ్‌కు జీ5 ఇప్పుడు తెర దించేసింది. ఈ ఎగ్జ‌యిటింగ్ చిత్రాన్ని ఆడియెన్స్‌కు అందిస్తోంది.  


ప్ర‌పంచంలోనే తొలి సూప‌ర్ హీరో ఎవ‌రంటే వెంట‌నే వినిపించే పేరు ‘హనుమాన్’. కానీ దైవ‌శ‌క్తిని ఎదిరించేలా తాను ఎద‌గాల‌ని, ప్ర‌జ‌లంద‌రూ త‌న‌నే సూప‌ర్ హీరోగా చూడాల‌ని భావించిన ఓ వ్య‌క్తి (విన‌య్ వ‌ర్మ‌).. కృత్రిమంగా శక్తిని సంపాదించుకునే పనుల్లో బిజీగా ఉంటాడు. అదే స‌మ‌యంలో అంజ‌నాద్రి ప్రాంతంలో ఉండే హ‌నుమంతు (తేజ స‌జ్జ‌) అల్ల‌రి చిల్ల‌ర‌గా తిరుగుతుంటాడు. త‌ల్లిదండ్రి లేని హ‌నుమంతుని అక్క అంజ‌నమ్మ (వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌) అన్నీ తానై హ‌నుమంతుని పెంచి పెద్ద‌చేస్తుంది. ఆ ప్రాంతంలో అన్యాయం చేస్తోన్న గ‌జ‌ప‌తిని ఓ సంద‌ర్భంలో హ‌నుమంతు  ఆ ఊళ్లో వైద్యం చేయ‌టానికి వ‌చ్చిన డాక్ట‌ర్ మీనాక్షి కార‌ణంగా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. మీనాక్షిని హ‌నుమంతు చిన్న‌ప్ప‌టి నుంచి ఇష్ట‌ప‌డుతుంటాడు. గ‌జ‌ప‌తి కార‌ణంగా హ‌నుమంతు ప్ర‌మాదంలో చిక్కుకుంటే అత‌ని ఆంజ‌నేయ స్వామికి సంబంధించిన ఓ అపూర్వ‌శ‌క్తి దొరుకుతుంది. దాంతో అత‌ను ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తుంటాడు. చివ‌ర‌కు విష‌యం విల‌న్ వ‌ర‌కు చేరుతుంది. అపూర్వ దైవ‌శ‌క్తిని సంపాదించుకోవ‌టానికి ప్ర‌తినాయ‌కుడు ఏం చేశాడు.. అత‌న్ని మ‌న హీరో ఎలా ఎదుర్కొన్నాడు.. చివ‌ర‌కు ఆంజ‌నేయ‌స్వామి భ‌క్తుడి కోసం ఏం చేశాడ‌నే క‌థాంశంతో ‘హను-మ్యాన్’ తెరకెక్కింది.


పాన్ ఇండియా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సెన్సేష‌న్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి రికార్డుల‌ను క్రియేట్ చేసిన ‘హను-మ్యాన్’..జీ 5లో స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేయ‌టానికి సిద్ధ‌మైంది.


జీ5 గురించి:

జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది.


Saripodhaa Sanivaaram Next Schedule Begins on March 18

 నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ, డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం' నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ మార్చి 18 నుంచి ప్రారంభం



నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సెకండ్ కొలాబరేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. 'అంటే సుందరానికీ' చిత్రంలో నాని సాఫ్ట్  పాత్రలో కనిపించగా, ఈ చిత్రంలో మునుపెన్నడూ లేని యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో ఆశ్చర్యపరచబోతున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.


ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ మార్చి 18 నుంచి ప్రారంభం కానుంది. హీరో నానితో పాటు ఇతరతారాగణం పాల్గొనే ఈ షెడ్యూల్ లో పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్ పాటు కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ సీన్స్ సినిమాలో హైలెట్ గా వుండబోతున్నాయి.

 

ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక. SJ సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మురళి జి డీవోపీగా పని చేస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.


ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్ట్ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ విడుదల కానుంది.  


నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య


సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ

నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి

బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్

సంగీతం: జేక్స్ బిజోయ్

డీవోపీ: మురళి జి

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

ఫైట్స్: రామ్-లక్ష్మణ్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్

Tulasivanam Trailer Launched

 'తులసీవనం' అందరికీ కనెక్ట్ అవుతుంది. తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్



క్రియేటివ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సమర్పణలో అక్షయ్, ఐశ్వర్య, వెంకటేష్ కాకమాను, విష్ణు ప్రధాన పాత్రలో అనిల్ రెడ్డి దర్శకత్వం వహించిన న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'తులసీవనం'. ఈటీవ్ విన్ ఓటీటీ వేదికగా మార్చి 21 నుంచి ప్రసారం కానున్న నేపధ్యంలో యూనిట్ గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ని చేసింది.


''జనరల్ గా మైండ్ కి క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా .. అవి ఇట్ల అనగానే అట్ల జరిగిపోతాయి' అంటూ తులసి( అక్షయ్) డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.  ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్, లవ్  ఎలిమెంట్స్ చాలా ఫ్రెష్ గా నేచురల్ గా అలరించాయి. స్ట్రీట్ క్రికెట్ టోర్నమెంట్ నేపధ్యంలో వచ్చే సన్నివేశాలు నవ్వులుపంచాయి. అక్షయ్, ఐశ్వర్య, విష్ణు తమ కామిక్ టైమింగ్ తో కడుపుబ్బానవ్వించారు. దర్శకుడు అనిల్ రెడ్డి న్యూ ఏజ్ కంటెంట్ ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. స్మరన్ నేపధ్య సంగీతం ఫన్ ని మరింత ఎలివేట్ చేయగా, ప్రేమ్ సాగర్ కెమరాపనితనం బ్రిలియంట్ గా వుంది. స్టార్ ఎడిటర్ రవితేజ గిరిజాల ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా వుంది. మొత్తానికి ట్రైలర్ తులసీవనం పై చాలా క్యురియాసిటీని పెంచింది.


ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. అనిల్, తులసి పెళ్లి చూపులు నుంచి నాకు సహాయ దర్శకులుగా వున్నారు. మాది విడదీయలేని ఓ అనుబంధం(నవ్వుతూ).  తులసి అనే పేరు పెట్టాడు కానీ ఇది అనిల్ పిక్చరే. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి సొంత గొంతుక చెప్పాలనే తాపత్రయం ఉన్నప్పటికీ మార్కెట్ దృష్ట్యా కొన్ని భయాలు వుంటాయి.  ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వెనుక అందరి కృషి వుంది.  క్లారిటీ థీం అనేది చాలా ముఖ్యం. తులసీవనంలో ఆ క్లారిటీ వుంటుంది. అనిల్ నిజాయితీ తీయడం ఒక ఎత్తైయితే దానికి ఈటీవీ విన్ ప్రోత్సహించడం మరో గొప్ప విషయం. ఇది వారితో నా మొదటి అసోషియేషన్. వేరే భాషల నుంచి సినిమాలు వస్తున్నపడు తెలుగులో కూడా టికెట్లు తెగుతున్నాయి. కథలు బాగా చెబుతున్నారనే బ్రాండ్ ఆ పరిశ్రమలకు క్రియేట్ అయ్యింది. తెలుగులో దాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాలనేది నా కోరిక. ఇందులో ఈటీవీ విన్ ప్రధాన భూమిక పోషిస్తుందని ఆశిస్తున్నాను. దీని కోసమే తులసీవనం తప్పకుండా చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' తెలిపారు.


డైరెక్టర్ అనిల్ రెడ్డి మాట్లాడుతూ.. 'తులసీవనం' క్యూట్ రొమాంటిక్ కామెడీ. స్మరన్ అద్భుతమైన మ్యూజిక్ తో వేరే లెవల్ కి తీసుకెళ్ళారు. ఇది అందరూ రిలేట్ చేసుకునే కథ. ప్రేమ్ సాగర్ చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు.  రవితేజ గిరిజాల చాలా బ్రిలియంట్ గా ఎడిట్ చేశారు. ఈ సిరిస్ కి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నితిన్ సాయి ఈటీవీ టీంకి ధన్యవాదాలు. తరుణ్ ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. నేను తన దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశాను. ఫ్యామిలీల చూసుకునేవారు. తన స్ఫూర్తితోనే దర్శకుడినయ్యాను. తులసీవనం తప్పకుండా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.


నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ.. 'తులసీవనం' అందరూ రిలేట్ చేసుకునే సిరిస్. తరుణ్ గారితో ఇది మా తొలి అసోషియేషన్ కావడం ఆనందంగా వుంది. టీం అందరికీ థాంక్స్. మార్చి 21న తప్పకుండా చూడండి. సపోర్ట్ చేయండి' అన్నారు.


అక్షయ్ మాట్లాడుతూ...తులసీ లాంటి ఫ్రెండ్  స్నేహితులందరిలో ఉంటాడు. అందరూ రిలేట్ చేసుకునే కంటెంట్ ఇది. అనిల్ గారు అద్భుతంగా తీశారు. ఇలాంటి పాత్ర ఇచ్చిన ఆయనకు ధన్యవాదాలు. తరుణ్ గారు నాకు స్ఫూర్తి. ఈటీవీ విన్, యూనిట్ అందరికీ ధన్యవాదాలు. 21న తప్పకుండా తులసీ వనం చూడండి. మీ అందరినీ అలరిస్తుంది'' అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.


తారాగణం: అక్షయ్ లగుసాని, ఐశ్వర్య హోలక్కల్, వెంకటేష్ కాకమాను, విష్ణు  


నిర్మాతలు : స్వాగత్ రెడ్డి, నీలిత పైడిపల్లి, ప్రీతం దేవిరెడ్డి, అనిల్ రెడ్డి, సాయి జాగర్లమూడి, సాయికృష్ణ గద్వాల్, జీవన్ కుమార్, పవన్ కంది

దర్శకత్వం: అనిల్ రెడ్డి

డీవోపీ: ప్రేమ్ సాగర్

సంగీతం: స్మరన్

ఆర్ట్ డైరెక్టర్: అనురాగ్ రెడ్డి, హేమాన్వి దండు

ఎడిటర్: రవితేజ గిరిజాల

క్రియేటివ్ ప్రొడ్యూసర్: కళ్యాణ్ కుమార్

కాస్ట్యూమ్ డిజైనర్: అనూష పుంజాల

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షణ్ముఖ్ రావు, వెంకటేష్ కాకుమాను, చైతన్య గరికపాటి

సాహిత్యం: మనోజ్ కుమార్ జూలూరి, నిక్లేష్ సుంకోజీ

పోస్టర్ డిజైనర్: రాఘవేంద్ర


Hey Hello Namaste Song Launched From Patang

 ప‌తంగ్ చిత్రంలో హే.. హ‌లో.. న‌మ‌స్తే.. సాంగ్ అంద‌ర్ని ఆక‌ట్ట‌కుంటుంది: ప‌తంగ్ టీమ్  




ఇప్ప‌టి వ‌ర‌కు భార‌తీయ సినిమాలో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్ష‌కులు చూసి వుంటారు. కాని తొలిసారిగా ప‌తంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌తంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిష‌న్ సినిమాస్ ప‌తాకంపై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి ద‌ర్శ‌కుడు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్నారు. మ‌రికొంత మంది నూత‌న న‌టీన‌టుల‌తో పాటు ప్ర‌ముఖ సింగ‌ర్, న‌టుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం వేస‌విలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రంలోని హే హ‌లో.. న‌మ‌స్తే హైద‌రాబాద్‌కు స్వాగతం అంటూ కొన‌సాగే  లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేశారు. ఈ సాంగ్‌కు అంద‌రి నుండి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల స‌మావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సంద‌ర్భంగా హీరో వంశీ పూజిత్ మాట్లాడుతూ అందరం కొత్త‌వాళ్లం న‌టించిన చిత్ర‌మిది. జోస్ జిమ్మి సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ సాంగ్‌కు మంచి స్పందన వ‌స్తోంది. నేను హైద‌రాబాద్‌లో పుట్టి పెరిగిన ప‌క్కా హైద‌ర‌బాదీని. నేను న‌టిస్తున్న ఈ చిత్రంలో హైద‌రాబాద్ గురించి సాంగ్‌లో స్టెప్పులేయ‌డం ఎంతో ఆనందంగా వుంది. కొత్త‌వాళ్ల‌తో చేసిన మా  సినిమా కొత్త‌గా వుండ‌టంతో పాటు చాలా పెద్ద సినిమా క్వాలిటీతో వుంటుంది అన్నారు. మ‌రో క‌థానాయ‌కుడు ప్ర‌ణ‌వ్ కౌశిక్ మాట్లాడుతూ సాంగ్‌కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తుంది. ఈ సాంగ్‌లో హైద‌రాబాద్ లైఫ్‌, వైబ్ వుంది. ఈ సినిమాకు క‌థే హీరో. ఈ చిత్రానికి జోస్ జిమ్మి అద్భుత‌మైన పాట‌లు ఇచ్చాడు. యూత్ ఎన‌ర్జీతో కొన‌సాగే ఈ పాట ఆట సందీప్ కొరియోగ్ర‌ఫీ, శ్రీ‌మ‌ణి సాహిత్యం ఎంతో బ‌లానిచ్చాయి. పాట వింటూంటే అంద‌రిలో పాజిటివ్ వైబ్స్ క‌లుగుతాయి. త‌ప్ప‌కుండా మా ప‌తంగ్ చిత్రం అన్నివ‌ర్గాల వారిని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది అని తెలిపారు. శ్రీ‌మ‌ణి మాట్లాడుతూ అంద‌రం క‌లిసి చేసిన కొత్త ప్ర‌య‌త్న‌మిది. ఈ చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు ఎంతో ప్ర‌తిభ గ‌ల సంగీత ద‌ర్శ‌కుడు. ఈ సినిమా అంద‌రికి మంచి పేరును తీసుక‌వ‌స్తుంది అన్నారు. ఓ సాంగ్‌కు కొరియోగ్ర‌ఫీ చేయాలంటే మంచి ట్యూన్‌తో పాటు ఆక‌ట్టుకునే లిరిక్స్ కావాలి. అలాంటి జోష్ ఈ సాంగ్‌లో వుంది. అందుకే మంచి స్టెప్స్ కుదిరాయి. ఈ పాట‌ను శంక‌ర్ మ‌హాదేవ‌న్ చాలా అద్బుతంగా పాడారు అన్నారు. నా ప్ర‌తిభ నిరూపించుకోవ‌డానికి ఈ సినిమా మంచి అవ‌కాశంగా భావిస్తున్నాన‌ని సంగీత ద‌ర్శ‌కుడు జోస్ జిమ్మి తెలిపారు. ఈ స‌మావేశంలో క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ నాని బండ్రెడ్డి, హీరోయిన్‌ ప్రీతి ప‌గ‌డాల‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత నిఖిల్ కోడూరు, ద‌ర్శ‌కుడు ప్ర‌ణీత్, కాస్ట్యూమ్ డిజైన‌ర్: మేఘన త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Actress Anushree About Razakar

 ‘ర‌జాకార్’ చిత్రానికి, నా పాత్రకు ఇంత గొప్పగా ప్రశంసలు దక్కడం చాలా ఆనందంగా వుంది: నటి అనుశ్రీ    



'చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రజ‌లే సాయుధులై క‌ద‌న రంగంలోకి దూకి చేసిన పోరాటం.. ఇప్పటికీ స‌జీవం. అలాంటి కథను ‘ర‌జాకార్’ రూపంలో భావోద్వేగ‌భ‌రితంగా తెర‌పై చూపించిన ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన ఆనందాన్ని ఇచ్చింది. ఈ చిత్రంలో నా పాత్రకు వస్తున్న ఆదరణ చాలా సంతోషాన్ని ఇచ్చింది'' అన్నారు నటి అనుశ్రీ. బాబీ సింహా, మకరంద్ దేశ్ పాండే, అనుశ్రీ, అనసూయా, ప్రేమ, ప్రధాన పాత్రలో, యాట సత్యనారాయణ దర్శకత్వంలో, గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన చిత్రం 'ర‌జాకార్’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ నేపధ్యంలో ఇందులో కీలక పాత్ర పోషించిన అనుశ్రీ చిత్ర విశేషాలని పంచుకున్నారు.


‘ర‌జాకార్ ' చిత్రానికి వస్తున్న స్పంధన ఎలా అనిపిస్తుంది ?

ముందుకు ‘ర‌జాకార్' చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘ర‌జాకార్' ఈ నేల కథ. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా ఎమోషనల్ అవుతున్నారు. సినిమా చూస్తున్నపుడు ప్రేక్షకుల కళ్ళలో దేశభక్తి కనిపించింది. వందేమాతరం, భారత్ మాతాకీ జై అనే నినాదాలు థియేటర్స్ లో మార్మ్రోగడం చూసినప్పుడు ఇలాంటి సినిమాలో భాగం కావడం ఆనందంగా అనిపించింది. ఇంతమంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు యాట సత్యనారాయణ గారిని నిర్మాత గూడూరు నారాయణ రెడ్డిగారికి ధన్యవాదాలు.


మీ నేపధ్యం గురించి చెప్పండి? ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?

నేను బెంగళూరులో కాలేజ్ చదివాను. అక్కడే థియేటర్స్ గ్రూప్ లో కూడా ఒక సభ్యురాలిగా వున్నాను. అక్కడే నటనపై ఆసక్తి పెరిగింది. విభిన్న పాత్రలలో నటించడం, ఆ పాత్రలలో లీనం అవ్వడం నాకు చాలా నచ్చింది. కాలేజ్ పూర్తయిన తర్వాత నేను సివిల్స్ కి చదవాలని నాన్నగారు కోరుకున్నాను. దాదాపు మూడేళ్ళు చదువుల్లోనే వున్నాను. అయితే నటిని కావాలనే కోరిక బలంగా వుండేది. ఆ కలని నెరవేర్చడం కోసం హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ థియేటర్స్ వర్క్ షాప్స్ చేశాను. ఈ సినిమా లో పాత్ర కోసం దర్శకుడిని సంప్రదించాను. అప్పుడు ఆయన నిజాం భార్యగా నటించే పాత్ర కోసం వెదుకుతున్నారు. ఆ పాత్రకు నేను సరిపోతానని భావించారు.


ఈ పాత్ర చేయడం సవాల్ గా అనిపించిందా?

ఇందులో నిజాం భార్యగా కనిపించా.  చాలా బలమైన అదే సమయంలో సున్నితమైన పాత్ర ఇది. వాస్తవ పరిస్థితులని నిజాంకు తెలియజేసే ఆ పాత్ర. కథ చెప్పినపుడు నా పాత్ర సవాల్ గా అనిపించింది. అలాగే ఇందులో వున్న ఏకైక గ్లామర్ రోల్ నాదే. ఇలాంటి బలమైన కథ, పాత్రతో నా కెరీర్ ప్రారంభం కావడంతో నా కల నెరవేరినట్లయింది. ఈ పాత్ర కోసం మూడు నెలలు పాటు మెథడ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. మకరంద్ దేశ్ పాండే గారితో లుక్ టెస్ట్ చేసి ఓకే అనుకున్న తర్వాతే నన్ను ఎంపిక చేయడం జరిగింది. ఈ పాత్ర నా కెరీర్ గొప్పగా కలిసొస్తుందని భావిస్తున్నాను.  


ఇందులో చాలా మంది ప్రముఖ నటులతో నటించడం ఎలా అనిపించింది ?

'ర‌జాకార్ 'లో నటించడం చాలా గొప్ప అనుభవం. చాలా మంది ప్రముఖ నటులతో కలసిపని చేసే అవకాశం వుంది. బాబీ సింహ, రాజ్ అర్జున్ తో పాటు మకరంద్ దేశ్ పాండే లాంటి అద్భుతమైన యాక్టర్ తో స్క్రీన్ పంచుడవడం గొప్ప అనుభూతి. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.


మీ కుటుంబం నేపధ్యం ఏమిటి ? నటనపై ఆసక్తి ఎప్పుడు ఏర్పడింది ?

 నాన్న సిఏ. అమ్మ గృహిణి. నేను మోడలింగ్ నుంచి కెరీర్ మొదలుపెట్టాను. 2018లో చత్తీస్ ఘడ్ నుంచి మిస్ ఇండియా పోటిల్లో కూడా పాల్గొన్నాను. మా అమ్మ ఒకప్పుడు మోడలింగ్ కూడా చేసేవారు. అమ్మ నుంచి మోడలింగ్ పై ఆసక్తి ఏర్పడింది. అలాగే ముందుగా చెప్పినట్లు కాలేజ్ రోజుల నుంచే నటనపై ఆసక్తి వుండేది. నటనని చాలా ఆస్వాదిస్తాను.


భవిష్యత్ లో ఎలాంటి పాత్రలు చేయాలని వుంది ?

మంచి కథలో ఎలాంటి పాత్ర చేయడానికైన సిద్ధంగా వుంటాను. పాత్రలతో పాటు మంచి కథ, దర్శకుడు, టీం ముఖ్యం.


మీకు ఇష్టమైన హీరో, హీరోయిన్ ?

రణబీర్ కపూర్, రామ్ చరణ్ ల నటన అంటే చాలా ఇష్టం. రామ్ చరణ్ గారిలో ఇంటెన్స్ ఎమోషన్ ని చాలా ఇష్టపడతాను. హీరోయిన్స్ లో ప్రియాంక చోప్రా, అనుష్క శెట్టి, కీర్తి సురేష్ ఇష్టం. మహానటిలో కీర్తి గారి నటన అద్భుతం. భవిష్యత్ లో అలాంటి మంచి పాత్రలో కనిపించాలని కోరుకుంటాను. 

Gangs of Godavari is Releasing on 17th May!

 మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మే 17న విడుదల కానుంది!



మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన వైవిధ్యమైన పాత్రలు మరియు మాస్ పాత్రలతో తెలుగు సినీ ప్రేమికులలో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఎంతో ప్రతిభగల ఈ కథానాయకుడు ఇటీవల 'గామి'తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే మరో వైవిధ్యమైన సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు.


తాజాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడినందున, ఈ చిత్రాన్ని 2024 మే 17న వేసవి సెలవులకు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.


ఈ చిత్రంలో అందాల నటి నేహా శెట్టి కథానాయికగా నటిస్తుండగా, ప్రతిభగల నటి అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు. 1960 లలో గోదావరి జిల్లాలలో చీకటి ప్రపంచంలో సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన హింసాత్మక పాత్రలో విశ్వక్ సేన్ కనిపిస్తారు.


ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఆయన స్వరపరిచిన ఆల్బమ్ నుండి విడుదలైన ''సుట్టంలా సూసి'' మెలోడీ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాట యూట్యూబ్‌లో 48 మిలియన్ కి పైగా వ్యూస్‌ సాధించి, సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగేలా చేసింది. విశ్వక్ సేన్ అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు, నిర్మాతలు చిత్ర విడుదల తేదీని ఖరారు చేసి వారిలో ఉత్సాహం నింపారు.


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాకి వెంకట్ ఉప్పుటూరి, గోపీ చంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కృష్ణ చైతన్య ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు.


అనిత్ మధాడి కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తుండగా, పృధ్వీ యాక్షన్ సీక్వెన్స్‌ల బాధ్యత చూస్తున్నారు. ఈ వేసవిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందిస్తుందని నిర్మాతలు చాలా నమ్మకంగా ఉన్నారు.

Love Guru is set for Release on April 11,

 "లవ్ గురు" చూశాక మీ జీవితాల్లోని మహిళల్ని అర్థం చేసుకుంటారు - హీరో విజయ్ ఆంటోనీ



వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ.  ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న సినిమా "లవ్ గురు". ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. "లవ్ గురు" సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న  విడుదల చేయబోతున్నారు. ఇవాళ "లవ్ గురు" సినిమా ప్రెస్ మీట్ ను  హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో


హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ - దాదాపు 95 శాతం మందికి లవ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా అబ్బాయిలకు. గర్ల్స్ ను హ్యాండిల్ చేయడం అనేది అబ్బాయిలకు పెద్ద సమస్య. ఈ "లవ్ గురు" సినిమా చూస్తే గర్ల్స్ ను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. నేనే లవ్ గురులా ఆ పరిష్కారాలు చెబుతాను. ఈ సినిమాలో లీలా అనే అమ్మాయితో నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాను. ఆ సమస్యలను ఎలా ఎదుర్కొన్నాను అనేది ఫన్నీగా దర్శకుడు వినాయక్ సినిమాలో చూపించాడు. ఏప్రిల్ 11న రంజాన్ సందర్భంగా తెలుగు స్టేట్స్ లో సుమారు 500 నుంచి 600 థియేటర్స్ లో "లవ్ గురు" సినిమాను విడుదల చేయబోతున్నాం. నేను ఇప్పటిదాకా 12-13 సినిమాలు చేస్తే వాటిలో 8-9 సినిమాలకు భాష్యశ్రీ గారు వర్క్ చేశారు. బిచ్చగాడు సినిమా నుంచి ఆయన నాతో ట్రావెల్ చేస్తున్నారు. కథలోని సందర్భాన్ని మరింత అందంగా రాస్తారు. హీరోయిన్ మృణాళిని రవి తన క్యారెక్టర్ ను బాగా అర్థం చేసుకుని ఆకట్టుకునేలా పర్ ఫార్మ్ చేసింది. ఏడాది పాటు టైమ్ తీసుకుని మా డైరెక్టర్ మంచి స్క్రిప్ట్ ఇచ్చారు. అంతే బాగా తెరకెక్కించారు. ఆయన యాక్టర్ కూడా. ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కంటే లవ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రేమ అనేది యూనివర్సల్ గా ఎక్కడైనా ఒక్కటే. లవ్ గురు చూసిన తర్వాత పెళ్లైన వాళ్లు, కాని వాళ్లు తమ జీవితాల్లోని లేడీస్ ను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మా సినిమాటోగ్రాఫర్ ఫరూక్, మ్యూజిక్ డైరెక్టర్ భరత్ మంచి ఔట్ పుట్ ఇచ్చారు. వారికి థ్యాంక్స్ చెబుతున్నా. "లవ్ గురు" సక్సెస్ మీట్ లో మనమంతా మళ్లీ కలుద్దాం. అన్నారు.


డైరెక్టర్ వినాయక్ వైద్యనాథన్ మాట్లాడుతూ - శర్వానంద్ హీరోగా నటించిన ఒకే ఒక జీవితం సినిమాకు నేను డైరెక్షన్ టీమ్ లో వర్క్ చేశాను. అప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో మూడు నెలలు ఉన్నాను. ఆ టైమ్ లో తెలుగు ఇండస్ట్రీ ఆర్టిస్టులకు ఎంత విలువ ఇస్తుంది అనేది చూశాను. మా "లవ్ గురు" సినిమాతో ఇప్పుడు మళ్లీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. విజయ్ ఆంటోనీ గారి మూవీకి డైరెక్షన్ చేయడం ఒక మర్చిపోలేని విషయంగా భావిస్తాను. బిచ్చగాడు సినిమా తర్వాత అంతలా "లవ్ గురు" సినిమా కూడా ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ అవుతుంది. ఈ సినిమా విజయ్ ఆంటోనీ గారికి 2.0 అనుకోవచ్చు. మనమంతా లవ్ ను ఒక్కోలా ఎక్స్ ప్రెస్ చేస్తాం. ఆయన తన పద్ధతిలో ఎక్స్ ప్రెస్ చేశారు. ఇలాంటి క్యారెక్టర్ చేయడం విజయ్ గారికి కొత్త. అన్నారు.


హీరోయిన్ మృణాలిని రవి మాట్లాడుతూ - "లవ్ గురు" సినిమాలో లీలా అనే క్యారెక్టర్ లో మీ ముందుకు వస్తున్నాను. ఈ క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన హీరో, ప్రొడ్యూసర్ విజయ్ ఆంటోనీ గారికి థ్యాంక్స్. లీలా క్యారెక్టర్ లో నటించేందుకు నేను కలైరాణి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఈ పాత్రలో పర్ ఫెక్ట్ గా నటించేందుకు ఆ మేడమ్ ఇచ్చిన ట్రైనింగ్ ఎంతో ఉపయోగపడింది. విజయ్ ఆంటోనీని ఇప్పటిదాకా సీరియస్ క్యారెక్టర్స్ లో చూశారు. కానీ ఈ సినిమాలో రొమాంటిక్ గా చూస్తారు. అది స్క్రీన్ మీద చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత విజయ్ ఆంటోనీ గారికి గర్ల్ ఫ్యాన్స్ పెరుగుతారు. అలాగే రొమాంటిక్ స్క్రిప్ట్స్ కూడా చాలా వస్తాయి. నేను ఈ షూటింగ్ టైమ్ లో ఆయనను లవ్ గురులా భావించి సలహాలు తీసుకునేదాన్ని. నా బ్రేకప్ స్టోరీస్ ఆయనకు సరదాగా చెప్పేదాన్ని. ఇలా విజయ్ గారితో ఫన్ గా షూట్ జరిగింది. మా మూవీలో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఆకర్షణ అవుతాయి. నాకు ఈ మూవీ చేసే టైమ్ లో సపోర్ట్ చేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.


పాటలు, మాటల రచయిత  భాష్యశ్రీ మాట్లాడుతూ - "లవ్ గురు" సినిమాకు మంచి స్క్రిప్ట్ రాసుకున్నారు డైరెక్టర్ వినాయక్ గారు. ఆయన తప్పకుండా తెలుగులోనూ సినిమా చేస్తారు. ఇక్కడ వి.వి. వినాయక్ గారిలా పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. "లవ్ గురు" సినిమాలో విజయ్ ఆంటోనీ గారికి కొత్తగా ప్రెజెంట్ చేశాడు డైరెక్టర్. ఇప్పటిదాకా విజయ్ ఆంటోనీ గారిని మీరు చూడని విధంగా ఈ సినిమాలో ఉంటారు. ఆయన యాక్టింగ్ టాలెంట్ గురించి నేను చెప్పేదేముంది. ఈ సినిమాలో క్యారెక్టర్ లో అద్భుతంగా పర్ ఫార్మ్ చేశాడు. హీరోయిన్ మృణాళిని రవి మోడరన్ థాట్స్ ఉన్న అమ్మాయి క్యారెక్టర్ లో కనిపిస్తుంది. ఆమె కూడా ఆకట్టుకుంటుంది. "లవ్ గురు" సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వినాయక్, హీరో విజయ్ ఆంటోనీ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు ఇష్టపడే మూవీ అవుతుంది. అన్నారు.



నటీనటులు - విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి, వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు



టెక్నికల్ టీమ్


సినిమాటోగ్రఫీ - ఫరూక్ జే బాష

సంగీతం -భరత్ ధనశేఖర్

ఎడిటింగ్, నిర్మాత - విజయ్ ఆంటోనీ

బ్యానర్ - విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్

సమర్పణ - మీరా విజయ్ ఆంటోనీ

పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా

రచన దర్శకత్వం - వినాయక్ వైద్యనాథన్