Latest Post

A3 Labels Production's directed by Bullet Bandi Laxman launched Today

 టోని కిక్, సునీత మారస్యార్ హీరో హీరోయిన్లుగా A3 లేబుల్స్ బ్యానర్‌పై బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో లాంఛనంగా ప్రారంభమైన  చిత్రం




టోని కిక్, సునీత మారస్యార్ హీరో హీరోయిన్లుగా A3 లేబుల్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ సన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమైంది.  బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో గిరీష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత చిన్నికృష్ణ క్లాప్ కొట్టగా, ఏఐ ప్లెక్స్ ప్రదీప్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రైటర్ వెలిగొండ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా...


చిన్నికృష్ణ మాట్లాడుతూ ‘‘ఏ 3 లేబుల్స్ బ్యానర్ పై ప్రదీప్, గిరీష్ గారు కలిసి సినిమాను నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కథలోని అరవై సీన్స్ ను నేను విన్నాను. రామ్, లక్ష్మణ్ కలిసి చేసిన ఆల్బమ్స్ సౌతిండియాలోనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. వారి ఆల్బమ్ లోని అల్లా హే అల్లా అనే పాటను కథగా మార్చి సినిమా తీస్తున్నారు. ఈ సినిమా తర్వాత బుల్లెట్ బండి లక్ష్మణ్ టాప్ మోస్ట్ డైరెక్టర్ గా నిలబడతారు. ఈ మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. టీమ్ ను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.  


రైటర్ వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘సినిమాను నమ్ముకుని, ప్రేమించి, కష్టపడితే ఎక్కడి వరకు రావచ్చు అనటానికి రామ్, లక్ష్మణ్ లే ఉదాహరణ. ప్రైవేట్ ఆల్బమ్స్ తో పాపులారిటీ సంపాదించుకుని ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోకి రావటం హ్యాపీ. వారు చేస్తున్న ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. నిర్మాతగారు కర్ణాటక నుంచి వచ్చి సినిమా చేస్తున్నారు. ఆయనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’


బోలే శావలి మాట్లాడుతూ ‘‘యూట్యూబ్ లో బుల్లెట్ బండి లక్ష్మణ్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టోని, సునీత, రామ్, లక్ష్మణ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుంది. అల్లా హే అల్లా కాన్సెప్ట్ నే సినిమాగా తీయాలనుకోవటం గొప్ప విషయం. సినిమా చేస్తున్న గిరీష్ కుమార్ గారిని అభినందిస్తున్నాను. ఎంటైర్ టీమ్ కు అభినందనలు’’ అన్నారు.


నిర్మాత గిరీష్ కుమార్ మాట్లాడుతూ ‘‘నాది కర్ణాటక. రామ్, లక్ష్మణ్ గారు చేసిన అల్లా హే అల్లా పాట వినగానే నచ్చింది. అందులో సోల్ బాగా కనెక్ట్ అయ్యింది. ఎంటైర్ టీమ్‌ను కలిసి మాట్లాడినప్పుడు వారు చెప్పిన విషయాలు ఎంతో నచ్చి సినిమా చేయాలనుకున్నాను. ఏ 3 లేబుల్స్ బ్యానర్ పై తొలి సినిమా చేస్తున్నాం. ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


హీరోయిన్ సునీత మారస్యార్ మాట్లాడుతూ ‘‘మా అల్లా హే అల్లా సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. ఆ థీమ్ తోనే ఇప్పుడు సినిమా చేయబోతున్నాం. మంచి కథ కుదిరింది. అప్పుడు ఇచ్చినట్లే ఇప్పుడు కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా టీమ్‌ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


హీరో టోని కిక్ మాట్లాడుతూ ‘‘మా డైరెక్టర్ బుల్లెట్ బండి లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఆయన చేసిన అల్లా హే అల్లా కాన్సెప్ట్ తోనే ఇప్పుడు సినిమాను స్టార్ట్ చేశాం. నన్ను నమ్మి నాకు హీరోగా అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, నిర్మాత గిరీష్ కుమార్ గారికి థాంక్స్’’ అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ ఎస్.కె. మాట్లాడుతూ ‘‘మా అల్లా హే అల్లా పాట నాలుగు నిమిషాలు.. దాన్ని రెండు కోట్ల మంది చూశారు. అదే కాన్సెప్ట్ తో రెండు గంటల పాటు చేయబోయే సినిమాను రెండు వందల కోట్ల మంది చూడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


సినిమాటోగ్రాఫర్ జనతా బబ్లూ మాట్లాడుతూ ‘‘సినీ రంగంలోకి అడుగు పెట్టటం మా అందిరకీ కొత్త. అయితే ప్యాషన్ తో వచ్చాం. లక్ష్మణ్ గారు తొలి సినిమా చేస్తున్నప్పటికీ మంచి కథను సిద్ధం చేశారు. నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, నిర్మాతకు ధన్యవాదాలు’’ అన్నారు.


రామ్ అద్నాన్ మాట్లాడుతూ ‘‘మా లక్ష్మణ్ మొదటిసారి డైరెక్షన్ చేస్తున్నారు. కథ వైవిధ్యంగా ఉంటుంది. అల్లా హే అల్లా పాటను హిట్ చేసిన ప్రేక్షకులు మా సినిమాను కూడా హిట్ చేస్తారనే నమ్మకం ఉంది. మాపై నమ్మకంతో సినిమాను నిర్మిస్తోన్న గిరీష్ గారికి థాంక్స్. సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు.


డైరెక్టర్ బుల్లెట్ బండి లక్ష్మణ్ మాట్లాడుతూ ‘‘సినీ ఇండస్ట్రీలోకి ఎప్పుడో వచ్చి ఇబ్బందులు పడి వెనక్కి వెళ్లిపోయాం. అయితే జానపద పాటలు ద్వారా ప్రేక్షకుల ఆదరణ పొందాం. నాలోని సినిమా కలను గుర్తించిన మా నిర్మాత గిరీష్ కుమార్ గారు సినిమా చేయటానికి ముందుకు వచ్చారు. ముందుగా ఆయనకు ధన్యవాదాలు. ఆయన రుణ తీర్చుకోలేనిది. ఇది వరకు నాలుగు నిమిషాల్లోని పాటలో ఓ కథను చెప్పే ప్రయత్నం చేశాను. ఇప్పుడు మా నిర్మాతగారు రెండు గంటల సినిమా చేయమని ముందుకు వచ్చారు. మా ప్రతీ పాట, మాట థియేటర్స్ కి ఆడియెన్స్ ను రప్పించేలా, వారి మనసు మెప్పించేలా ఉంటాయి. మా టీమ్ సంకల్ప బలం నా వెనుకుంది. నన్ను యూ ట్యూబ్ లో ఆదరించినట్లే సినిమాలోనూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


నటీనటులు:


టోని కిక్, సునీత మారస్యార్, తనికెళ్ళ భరణి, తోటపల్లి మధు, రాజ్ తిరణ్ దాస్, దసరా ఫేమ్ రియాజ్, నల్గొండ గద్దర్, కోటి యాదవ్, ధూమ్ ధాం టీం తదితరులు


సాంకేతిక వర్గం:  


నిర్మాణ సంస్థ - A3 లేబుల్స్, దర్శకత్వం - బుల్లెట్ బండి లక్ష్మణ్, నిర్మాత - గిరీష్ కుమార్, సినిమాటోగ్రఫీ - జనతా బబ్లూ, మ్యూజిక్ - మదీన్ ఎస్.కె, పాటలు - చంద్రబోస్, ఆర్ట్ - ప్రభాకర్ ఆర్.ఎల్.టీమ్, ప్రొడక్షన్ కంట్రోలర్స్ - కుమార్, దిలీప్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ - అంజి, వెంకట్ శౌర్య, రామ్ అద్నాన్, పోస్టర్ డిజైనర్ - సాగర్ ముదిరాజ్, పి.ఆర్.ఒ - వంశీ కాకా

Manamey Teaser is Unveiled

 విట్నెస్ ది మెస్మరైజింగ్ వరల్డ్- శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య, శ్రీరామ్ ఆదిత్య, హేషమ్ అబ్దుల్ వహాబ్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'మనమే' టీజర్ విడుదల



ప్రామిసింగ్ హీరో శర్వానంద్ ల్యాండ్‌మార్క్ 35వ చిత్రం 'మనమే'. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ అద్భుతంగా నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్, ప్రతి ప్రమోషనల్ మెటిరియల్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రోజు, మేకర్స్ ఈ చిత్రం టీజర్‌తో ముందుకు వచ్చారు, ఇది

'మనమే' మెస్మరైజ్ చేసే ప్రపంచంలోకి ఒక స్నీక్ పీక్.


ఇది పరస్పరం భిన్నమైన మనస్తత్వం ఉన్న ఇద్దరు వ్యక్తులు, వారి జర్నీలో ఊహించని అతిథి కథ. శర్వానంద్ హీరో పాత్రలో అమాయకంగా కనిపిస్తున్నారు కానీ కనిపిస్తున్నంత ఇన్నోసెంట్ కాదు. అతను జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి ఇష్టపడే ప్లేబాయ్. కృతి శెట్టి బాధ్యతాయుత అమ్మాయిగా కనిపించింది. పిల్లాడి పాత్రలో విక్రమ్ ఆదిత్య ఎంట్రీతో వారి జీవితాలు తలకిందులౌతాయి. పిల్లాడి రాక వారిని గందరగోళానికి గురిచేస్తుంది.


దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య న్యూ ఏజ్ కథతో వచ్చి హ్యూమరస్ గా ప్రజెంట్ చేశారు. మూడు పాత్రల మధ్య రిలేషన్ ని బయటపెట్టకుండా టీజర్‌ను స్మార్ట్ గా కట్ చేశాడు. త్వరలో విడుదల కానున్న థియేట్రికల్ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేశాడు.


మూడు పాత్రలు అందంగా వ్రాయబడ్డాయి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక పిల్లవాడి యొక్క సాధారణ మనస్తత్వాలను అద్భుతంగా చూపించారు. శర్వానంద్ ఉబెర్ కూల్‌గా కనిపించాడు. తన పాత్రలో ఆదరగొట్టారు. కృతి శెట్టి అందంగా ఉంది. తన పాత్రలో ఒదిగిపోయింది. కిడ్ విక్రమ్ ఆదిత్య అందరినీ ఆకట్టుకున్నాడు.


విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ VS కెమెరా పనితనం ప్రత్యేకంగా నిలుస్తుంది, విజువల్స్ వైబ్రెంట్, గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి. హేషమ్ అబ్దుల్ వహాబ్ తన అద్భుతమైన స్కోర్‌తో ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ డిజైన్ టాప్-క్లాస్‌గా ఉంది, అన్నింటిలో రిచ్‌నెస్ ఉంది. టీజర్ మనలోని ఆసక్తిని మరింత పెంచింది.


వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగ, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ టెక్నీషియన్ ప్రవీణ్ పూడి ఎడిటర్, జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రానికి డైలాగ్స్‌ని అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ అందించారు.


ఈ హాలిడే సీజన్‌లో 'మనమే' థియేటర్లలోకి రానుంది కాబట్టి ఈ వేసవి చాలా కూల్ గా ఉండబోతుంది. ఈ హోల్సమ్ ఎంటర్ టైనర్ అన్ని వర్గాలను సమానంగా ఆకర్షిస్తుంది.



తారాగణం: శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య


సాంకేతిక విభాగం:

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య

నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్

బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల

ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కృతి ప్రసాద్, ఫణి వర్మ

అసోసియేట్ ప్రొడ్యూసర్: ఏడిద రాజా

డైలాగ్స్: అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ

సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్

డీవోపీ : విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ VS

ఎడిటర్: ప్రవీణ్ పూడి

ఆర్ట్: జానీ షేక్

పీఆర్వో: వంశీ-శేఖర్

Tharun Bhascker Eesha Rebba Movie Announced

 తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, సజీవ్ ఎఆర్, ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ న్యూ మూవీ అనౌన్స్డ్, అక్టోబర్‌లో థియేట్రికల్ రిలీజ్



ఇప్పటికే పలు చిత్రాలలో తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌లో లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తుంది. సంజీవ్ ఎఆర్ దర్శకత్వం వహిస్తుండగా, సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, సాధిక్, ఆదిత్య పిట్టీ కలిసి ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ ఈరోజు అధికారికంగా అనౌన్స్ చేశారు.


రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ సినిమా మొదటి షూటింగ్ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పాల్గొంటోంది. ఈరోజు (ఏప్రిల్ 19) హీరోయిన్ ఈషా రెబ్బా పుట్టినరోజును సెట్స్‌ లో చిత్ర బృందం సెలబ్రేట్ చేసుకుంది. యూనిట్  విడుదల చేసిన స్టిల్‌లో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రూరల్ గెటప్‌లలో ఆకట్టుకున్నారు. తరుణ్ ఫార్మల్ డ్రెస్‌లో డీసెంట్‌గా కనిపిస్తుండగా, ఈషా సంప్రదాయ చీరను ధరించింది.


ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.


ఈ చిత్రానికి దీపక్ యెరగరా సినిమాటోగ్రాఫర్ కాగా, జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు. నంద కిషోర్ ఈమాని డైలాగ్ రైటర్.


తారాగణం: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, బ్రహ్మాజీ, శివన్నారాయణ, సురభి ప్రభావతి, బిందు చంద్రమౌళి, గోపరాజు విజయ్


సాంకేతిక సిబ్బంది:

దర్శకత్వం - సజీవ్ ఏఆర్

నిర్మాతలు - సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, సాధిక్, ఆదిత్య పిట్టీ

బ్యానర్స్- S ఒరిజినల్స్ & మూవీ వెర్స్

సంగీతం - జై క్రిష్

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ - దీపక్ యెరగరా

డైలాగ్స్ - నంద కిషోర్ ఈమాని

ఫైట్స్ - మల్లేష్, అంజి

క్రియేటివ్ ప్రొడ్యూసర్ - బాల సౌమిత్రి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - భువన్ సాలూరు, మథన్

సహ నిర్మాతలు - నవీన్ సనివరపు, అనుప్ చంద్రశేఖరన్

లైన్ ప్రొడ్యూసర్ - శ్రీనివాసరావు ఈర్ల

పీఆర్వో - వంశీ-శేఖర్


100 Million Streaming Minutes For Gaami

100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో ZEE5లో దూసుకెళ్తోన్న విశ్వక్ సేన్ ‘గామి’



ఎంటర్‌టైన్‌మెంట్‌ను నాన్ స్టాప్‌గా అందించటంలో ఎప్పుడూ ముందుండే వన్ అండ్ ఓన్లీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ZEE5. డిఫరెంట్ మూవీస్, సిరీస్‌లతో ఎంటైర్ ఇండియాలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా వినోదాన్ని అందిస్తోంది జీ 5. తాజాగా ‘గామి’ చిత్రంతో ZEE5 ప్రేక్షకులను అలరిస్తోంది.  మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధానపాత్రలో నటించారు. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ‘గామి’ సినిమా తెరకెక్కింది.  విధ్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ  మార్చి 8న థియేటర్స్‌లో విడుదలై సూపర్బ్ రెస్పాన్స్‌ను రాబట్టకుంది. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని జీ 5 ఏప్రిల్ 12 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. జీ 5లో స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి గామి దూసుకెళ్తోంది. డిఫరెంట్ కంటెంట్ ఉన్న ఈ చిత్రం ఆడియెన్స్‌కు అతి తక్కువ కాలంలో చేరువైంది. స్ట్రీమింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ ‘గామి’ చిత్రానికి రావటం విశేషం. 


‘గామి’ అంటే యాత్రికుడు.. కథ విషయానికి వస్తే .. హరిద్వార్‌లో ఉండే అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) వింత సమస్యతో బాధపడుతుంటాడు. అందుకనే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా శంకర్ తనున్న ప్రదేశాన్ని వీడి తన సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కాశీకి వెళతాడు. అక్కడ తన సమస్యకు పరిష్కారం దొరికే చోటు హిమాలయాలు అని తెలుస్తుంది. అక్కడ 36 ఏళ్లకు అరుదుగా దొరికే మాలి పత్రాలు కోసం శంకర్ అన్వేషిస్తూ బయలుదేరుతాడు. అదే సమయంలో అతనికి డాక్టర్ జాహ్నవి పరిచయం అవుతుంది. ఈ ప్రయాణంలో శంకర్ మనసులో చిత్ర విచిత్రమైన ఆలోచనలు, కలలు వస్తుంటాయి. ఓ పల్లెటూరుల్లో ఉండే దేవదాసి ఉమ, ఓ ప్రయోగశాలలో చిక్కుకుని తప్పించుకోవాలనుకునే ఓ యువకుడు కనిపిస్తుంటారు. అసలు వాళ్లకు శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? శంకర్ సమస్య ఏంటి? తన సమస్యకు శంకర్ పరిష్కారం కనుక్కున్నాడా? అనే విషయాలను దర్శకుడు తెరకెక్కించిన తీరు అభినందనీయం.


నరేశ్ కుమార్, స్వీకర్ అగస్తి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు విశ్వనాథ్ రెడ్డి, ర్యాంపి నందిగాం సినిమాటోగ్రఫీ  సినిమాను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. చక్కటి ఎమోషన్స్‌తో ఎప్పుడు ఏం జరుగుతుందా? అని ఆసక్తికరమైన కథనం, చక్కటి విజువల్స్ అన్ని ప్రేక్షకుడిని కట్టిపడేస్తున్నాయి ఇప్పుడు ఈ విజువల్, ఎమోషనల్ వండర్ జీ5 ద్వారా ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. 


జీ5 గురించి:

జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది.

Bhaje Vayu Vegam" Teaser Release Tomorrow

 యువి క్రియేషన్స్ సమర్పణలో హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న "భజే వాయు వేగం" సినిమా టీజర్ రేపు విడుదల




ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న సినిమా "భజే వాయు వేగం". ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.


ఇవాళ "భజే వాయు వేగం" సినిమా టీజర్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ సినిమా టీజర్ ను రేపు మధ్యాహ్నం 2.25 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో టీజర్ కూడా బాగుంటుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. "భజే వాయు వేగం" సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. థియేట్రికల్ రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు.


నటీనటులు - కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు


టెక్నికల్ టీమ్-

మాటలు: మధు శ్రీనివాస్

ఆర్ట్: గాంధీ నడికుడికర్

ఎడిటర్: సత్య జి

సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్

మ్యూజిక్ (పాటలు) - రధన్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - కపిల్ కుమార్

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్-శ్రీనివాస్)

కో ప్రొడ్యూసర్ - అజయ్ కుమార్ రాజు.పి

ప్రొడ్యూసర్: యూవీ కాన్సెప్ట్స్

దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి


Mahathi Entertainment Proudly Presents: "Lakshmi Kataksham" Trailer Released

ఓటుకు 5000 అంటూ, లక్ష్మీ కటాక్షం సినిమా ట్రైలర్ విడుదల



మహతి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుండి యు. శ్రీనివాసుల రెడ్డి, బి. నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే. పురుషోత్తం రెడ్డి నిర్మించిన ‘లక్ష్మీ కటాక్షం’ ట్రైలర్ విడుదల అయ్యింది. ఓపెనింగ్ లోనే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్స్ డేట్ నే సినిమాలో ఎలక్షన్ డేట్ లాగా అనౌన్స్ చేశారు, ప్రముఖ నటుడు డైలాగ్ కింగ్ సాయి కుమార్ తన పాతికేళ్ళ పొలిటికల్ కెరీర్ ను నిలబెట్టుకోవడం కోసం ఈ ఎలక్షన్ ను చాలా ప్రశ్టేజ్ గా తీసుకుంటాడు, మరో పక్క పోలీస్ ఆఫీసర్ ఎలాగైనా ఈ ఎలక్షన్ లో ఒక్క రూపాయి కూడా పంచకుండా చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ పోలీస్ బందోబస్త్ నుండి, తక్కువ టైంలో 100 కోట్లని, రెండు లక్షల మంది ఓటర్లకు, ఓటుకు 5000 చొప్పున ఎలా పంచుతారు అనే నేపధ్యంలో సినిమా కథ ఉండబోతున్నట్టు ట్రైలర్లో తెలుస్తుంది, కామెడీ తో పాటు హూకింగ్ డ్రామా కూడా ఉంది ఈ ట్రైలర్ లో.


ఒక పక్క సాయి కుమార్ కి ఎలక్షన్ ఫండ్ రావడం ఒక ఛాలెంజ్ అయితే, ఇంకో పక్క లాస్ట్ మినిట్ లో వచ్చిన ఫండ్ ఎలా పంచాలి అనేది ఇంకో ఛాలెంజ్, ఈ తరుణంలో చిరాకు పడి అన్ని దారులు మూసుకున్న సాయి కుమార్ లక్ష్మీ దేవిని ఎలక్షన్ ఫండ్ కటాక్షించమని డిమాండ్ చేస్తారు, లక్ష్మి దేవి ప్రత్యేక్షమవుతారు, ఇలాంటి విభిన్నమైన కథాంశాలతో సాగే ఈ ‘లక్ష్మీ కటాక్షం’ త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ సినిమాకి సూర్య రైటర్, డైరెక్టర్ గా వ్యవహరించారు. ట్రైలర్ లో డ్రామా పర్ఫెక్ట్ గా హైలైట్ అయ్యేలా మ్యూజిక్ అభిషేక్ రుఫుస్ అందించారు.


నటీ నటులు:

వినయ్

అరుణ్

దీప్తి వర్మ

చరిస్మా శ్రీకర్

హరి ప్రసాద్

సాయి కిరణ్ ఏడిద

ఆమనీ


సాంకేతిక నిపుణులు:

బ్యానర్: మహతి ఎంటర్టైన్మెంట్

నిర్మాతలు: యు. శ్రీనివాసుల రెడ్డి, బి. నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే. పురుషోత్తం రెడ్డి

రచన, డైరెక్టర్: సూర్య

మ్యూజిక్: అభిషేక్ రుఫుస్

డి ఓ పి: నని ఐనవెల్లి

ఎడిటర్: ప్రదీప్ జే

సౌండ్ డిజైన్: మురళీధర్ రాజు

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఆర్. రంగనాథ్ బాబు

పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను , ధీరజ్- ప్రసాద్ 

Sithara Entertainments MAD Square Movie Launched

 యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ 'మ్యాడ్'కి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్'ను ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్



యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎప్పుడూ ముందుంటుంది. ఎందరో యువ దర్శకులతో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ, వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటోంది. 'డీజే టిల్లు', 'మ్యాడ్', 'జెర్సీ', 'టిల్లు స్క్వేర్' వంటి అద్భుతమైన చిత్రాలను దీనికి ఉదాహరణలుగా చెప్పవచ్చు.


యువ నటీనటులు, సాంకేతిక నిపుణులతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన 'మ్యాడ్' చిత్రం 2023 అక్టోబరులో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్‌'ని రూపొందిస్తున్నారు.


'మ్యాడ్'తో రచయిత-దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకర్, సితార సంస్థ నిర్మించిన మరో భారీ బ్లాక్‌బస్టర్‌ మూవీ 'టిల్ స్క్వేర్‌'కి రచయితలలో ఒకరిగా పనిచేశారు. ఇప్పుడు, ఆయన తన విజయవంతమైన చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్‌'తో రాబోతున్నారు. 


'మ్యాడ్'లో నటించి మెప్పించిన యువ కథానాయకులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ల త్రయం ఈ సీక్వెల్ కోసం మళ్ళీ రంగంలోకి దిగారు. కథానాయికల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. మ్యాడ్ ఎంతలా నవ్వులు పంచిందో, దానికి రెట్టింపు వినోదం సీక్వెల్ ద్వారా అందించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.


'మ్యాడ్ నెస్' ఇంకా పూర్తి కాలేదు అని తెలిపిన మేకర్స్.. ఈసారి 'మ్యాడ్ నెస్' రెట్టింపు ఉంటుందని పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తే, ఈసారి కథానాయికల త్రయం చేసే అల్లరి.. థియేటర్లలో నవ్వుల సునామీ సృష్టించనుందని అర్థమవుతోంది.


ఇటీవల ఉగాది శుభ సందర్బంగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించింది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 'డీజే టిల్లు'కి సీక్వెల్‌ గా రూపొందిన 'టిల్లు స్క్వేర్' ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో.. 'మ్యాడ్'కి సీక్వెల్‌ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్' కూడా అంతటి విజయాన్ని సాధిస్తుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.


'మ్యాడ్ స్క్వేర్' సినిమా ప్రారంభోత్సవానికి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు కె.వి. అనుదీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడుకి స్క్రిప్ట్ అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.


అలాగే నిర్మాత సూర్యదేవర నాగవంశీ కుమార్తె మరియు ఆయన సోదరీమణులు హారిక సూర్యదేవర, హాసిని సూర్యదేవర కూడా 'మ్యాడ్ స్క్వేర్' ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గతంలో వారి చేతుల మీదుగా ప్రారంభమైన 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్', 'మ్యాడ్' చిత్రాలు ఘన విజయాలను సాధించాయి. 'మ్యాడ్ స్క్వేర్' సినిమాకి కూడా ఆ సెంటిమెంట్ కొనసాగి, ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర హారిక, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ మరియు సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.


'మ్యాడ్' కోసం పని చేసిన ప్రతిభ గల సాంకేతిక నిపుణులు 'మ్యాడ్ స్క్వేర్' కోసం కూడా పని చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి షామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.


ఈ చిత్రంపై నిర్మాతలు ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ సీక్వెల్‌తో ప్రేక్షకులకు థియేటర్లలో మ్యాడ్ మ్యాక్స్ వినోదాన్ని అందిస్తామని వాగ్దానం చేస్తున్నారు.


Krishna From Brindavanam Movie Launched

 ఆది సాయి కుమార్ నూతన చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ ప్రారంభోత్సవంలో దిల్ రాజు, అనిల్ రావిపూడి సందడి



లవ్ లీ యంగ్ హీరో ఆది సాయి కుమార్ మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చుట్టలబ్బాయ్‌ అంటూ దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో మంచి చిత్రాన్ని చేసిన ఆది సాయి కుమార్ మళ్లీ విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో సినిమాను చేస్తున్నారు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం నాడు కాకతీయ హిల్స్‌లోని వెంకటేశ్వరుడి సన్నిధిలో ఘనంగా జరిగాయి. పూజా కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు షాట్‌కు దిల్ రాజు గారు క్లాప్ కొట్టగా.. అనిల్ రావిపూడి గారు దర్శకత్వం వహించారు. ఇక స్క్రిప్ట్ అందజేస్తూ కెమెరాను సాయి కుమార్ గారు స్విచ్ ఆన్ చేశారు.


 చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘మా మూవీ ఓపెనింగ్‌కు వచ్చిన దిల్ రాజు గారికి, అనిల్ రావిపూడి గారికి థాంక్స్. చుట్టలబ్బాయ్ తరువాత మళ్లీ ఓ సినిమా చేయాలని నేను, వీరభద్రమ్ గారు ప్రయత్నించాం. ఇన్ని రోజులకు మంచి కథ, స్క్రిప్ట్ దొరికింది. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా అవుతుంది. కుటుంబమంతా కలిసి చూసి నవ్వుకునేలా ఉంటుంది. జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. క్రేజీ ఫెల్లో సినిమాలో నేను, దిగంగనా సూర్యవంశీ కలిసి నటించాం. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంలో నటిస్తున్నాం. ప్రేమ కావాలి, లవ్ లీ, సుకుమారుడు, ప్యార్ మే పడిపోయానే అంటూ అనూప్ రూబెన్స్ నాకు మంచి సాంగ్స్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మంచి పాటలు ఇస్తున్నారు. ఈ రోజు అనూప్ గారి పుట్టిన రోజు. మంచి టెక్నీషియన్లు, ఆర్టిస్టులతో రాబోతున్నాం. అన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామ’ని అన్నారు.


 దర్శకుడు వీరభద్రమ్ చౌదరి మాట్లాడుతూ.. ‘మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి గార్లకు థాంక్స్. చుట్టలబ్బాయ్ తరువాత సినిమా చేయాలని నేను, ఆది చాలా కథలు విన్నాం. ఇప్పటికి మాకు టైం, లక్ కలిసి వచ్చింది. మంచి కథ దొరికింది. ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. ఆది సరసన దిగంగనా సూర్యవంశీ నటిస్తున్నారు. హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మా సినిమాను నిర్మాతలు తూము నరసింహా, జామి శ్రీనివాసరావు  ఖర్చుకి ఏ మాత్రం వెనుకాడకుండా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించేందుకు ముందుకు వచ్చారు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్, రామ్ డైలాగ్స్, శ్యాం విజువల్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. మాకు అండగా నిలిచిన మీడియాకు థాంక్స్’ అని అన్నారు.


 సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి గారు ఎంత బిజీగా ఉన్నా అడిగిన వెంటనే వచ్చినందుకు థాంక్స్. వీరభద్రమ్ గారికి ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. మేం చేసిన చుట్టలబ్బాయ్ బాగా ఆడింది. ఆయన కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను తీస్తుంటారు. కృష్ణ ఫ్రమ్ బృందావనం కూడా ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రంగా ఉంటుంది. ఆదికి అనూప్ రూబెన్స్ ఎప్పుడూ కూడా బెస్ట్ ఆల్బమ్స్ ఇస్తూనే వచ్చారు. ఈ సినిమాలోనూ మంచి పాటలు ఉండబోతున్నాయి. ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాతలు మంచి కథతో చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


 దిగంగనా సూర్యవంశీ మాట్లాడుతూ..‘ఆది గారితో ఇది వరకు నేను క్రేజీ ఫెల్లో సినిమా చేశాను. మళ్లీ ఆది గారితో కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉంది. వీరభద్రమ్ గారు చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. ఇందులో నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.


నటీనటులు : ఆది సాయికుమార్, దిగంగనా సూర్యవంశీ, మురళీధర్ గౌడ్, 30 ఇయర్స్ పృధ్వీ, రఘు బాబు, అవినాష్, రచ్చ రవి, అశ్విని, శ్రీ దేవి, అలేక్య, స్నేహ, పద్మ, గిరిధర్, గోవర్ధన్, మాస్టర్ రిత్విక్, వెంకట్ నారాయణ, గురు రాజ్ తదితరులు


సాంకేతిక బృందం

బ్యానర్ : లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్

నిర్మాత: తూము నరసింహ, జామి శ్రీనివాస్

స్టోరీ,  స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్ చౌదరి

డీఓపీ. : శ్యామ్

సంగీతం. : అనూప్ రూబెన్స్

ఎడిటర్. : చోటా కె ప్రసాద్

డైలాగ్స్ : రాము మన్నార్

ఫైట్స్. : డ్రాగన్ ప్రకాష్, శంకర్

పీఆర్వో : సాయి సతీష్

Mangli's Latest Song "Lachhimakka" from Jithender Reddy Released

జితేందర్ రెడ్డి నుండి మంగ్లీ కొత్త పాట “లచ్చిమక్క” లిరికల్ సాంగ్ విడుదల



ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు.


గతంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గ్లింప్స్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. రీసెంట్ గానే విడుదల అయిన అ ఆ ఇ ఈ ఉ ఊ సాంగ్ మంచి ప్రేక్షక ఆదరణ పొందింది, ముఖ్యంగా యువతకి ఆ పాట బాగా నచ్చింది.  ఆ సాంగ్ కాలేజీ బ్యాక్ డ్రాప్ కాగా ఇప్పుడు విడుదలైన ఈ ‘లచ్చిమక్క’ సాంగ్ పెళ్లి బ్యాక్ డ్రాప్ లో ఉంది.  ఈ పాటకి గోపి సుందర్ మ్యూజిక్ అందించగా రాంబాబు గోసాల లిరిక్స్ రాశారు మరియు మంగ్లీ ఈ పాటని చాలా బాగా పాడారు. జితేందర్ రెడ్డి ఇంట్లో జరిగే పెళ్ళిలో సరదాగా సాగే ఒక పాటలా ఉంది. 1980' లో లొకేషన్స్ అన్ని కూడా చాలా నాట్యురల్ గా ఉన్నాయి. ఈ పాత ద్వార కథలో ట్విస్టులు ఉన్నట్టు అర్ధమవుతుంది


ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ముదిగంటి రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ: ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరుకు రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ అన్ని కూడా మంచి ఆదరణ పొందాయి. ప్రేక్షకులు కొత్త నిర్మాతలమైనా మన్నలిని ఇంత బాగా ఆదరిస్తున్నారు.  కంటెంట్ ఉంటె మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆ సినిమాని ఆదరిస్తారు అని మరో సారి నిరూపించారు. 


ప్రస్తుతం వస్తున్న కథలకి పూర్తి భిన్నంగా ఉంది ఈ జితేందర్ రెడ్డి. ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


నటీ నటులు : రాకేష్ వర్రే, వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్


టెక్నికల్ టీం :

డైరెక్టర్ : విరించి వర్మ

నిర్మాత :  ముదుగంటి రవీందర్ రెడ్డి

కో - ప్రొడ్యూసర్ : ఉమ రవీందర్

ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వాణిశ్రీ పొడుగు

డి ఓ పి : వి. ఎస్. జ్ఞాన శేఖర్

మ్యూజిక్ డైరెక్టర్ : గోపి సుందర్

పి ఆర్ ఓ : మధు VR

Pottel Teaser Launched by Sandeep Reddy Vanga

“పొట్టెల్” టీజర్ అద్భుతంగా వుంది. ఇలాంటి సినిమాలు తక్కువగా వస్తుంటాయి. సినిమాని తొలి రోజు చూడాలని ఎదురుచూస్తున్నాను: టీజర్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా



బ్లాక్ బస్టర్ మేకర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేసిన యువ చంద్ర కృష్ణ, సాహిత్ మోత్ఖూరి, NISA ఎంటర్టైన్మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ “పొట్టెల్” చిత్ర టీజర్

 

దర్శకుడు సాహిత్ మోత్ఖూరి తన మూడవ ప్రాజెక్ట్ పొట్టెల్ లో యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రలో అనన్య నాగెళ్ల మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. NISA ఎంటర్టైన్మెంట్స్పై నిశాంక్ రెడ్డి కుడితి మరియు ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్పై సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ చిత్రం ఆకర్షణీయమైన పోస్టర్ లు మరియు చార్ట్బస్టర్ పాటలతో తగినంత బజ్ని సృష్టించింది. ఈరోజు ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా టీజర్ ను విడుదల చేశారు.

 

టీజర్ సినిమా బ్యాక్ డ్రాప్ పై ఒక ఐడియా ని ఇస్తుంది. కుల వివక్ష ఉన్న మారుమూల తెలంగాణ గ్రామంలో యువ చంద్ర కృష్ణ తన కుమార్తెకు విద్య ద్వారా మంచి జీవితాన్ని అందించాలని కోరుకునే బాధ్యతగల భర్త మరియు తండ్రిగా కనిపిస్తాడు. పవిత్రమైన గొర్రె తప్పిపోయినప్పుడు గ్రామస్థులు అతనిపై దాడి చేయడంతో పరిస్థితులు మరింత క్లిష్టం గా మారుతాయి.


మంచి సందేశం ఉన్న ఒక ఆసక్తికరమైన కథను ఎంచుకున్న సాహిత్ మోత్ఖూరి దానిని ఆకర్షణీయంగా రూపొందించారు. అద్భుతమైన పెర్ఫార్మన్స్ లు మరియు సాంకేతిక నైపుణ్యంతో టీజర్ మొదటి నుండి చివరి వరకు గొప్పగా ఉంది.


యువ చంద్ర కృష్ణ అమాయకంగా, పాత్రకు తగినట్లుగా కనిపించారు. అతని భార్యగా అనన్య నాగళ్లకు ముఖ్యమైన పాత్ర లో కనిపించింది. అజయ్, పటేల్ గా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రను పోషించాడు,చివరిలో అతని పోతురాజు గెటప్ ప్రధాన హైలైట్ లలో ఒకటి గా నిలిచింది. ప్రతి పాత్రను చక్కగా తీర్చిదిద్దినట్టు ఈ టీజర్ లో కనిపిస్తుంది.

 

మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ సినిమా గ్రాఫ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళింది. శేఖర్ చంద్ర స్కోర్ కథనానికి ఇంటెన్సిటీని సమకూర్చింది. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని చూడాలనే ఆసక్తిని టీజర్ మరింత పెంచింది.


టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. సాహిత్ తో నాలుగేళ్ళుగా పరిచయం. ఈ కథ ఫోన్ లో చెప్పాడు. మొదటి రోజు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు. పొట్టెల్ టీజర్ చూస్తున్నపుడు.. ఇలాంటి కంటెంట్ మలయాళం సినిమాలో ఎక్కువగా చూస్తుంటాం. తెలుగులో ఇలాంటి సినిమాలు రావట్లేదని అనుకుంటాం. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. చిన్న, రూరల్ సినిమాలని ప్రోత్సహించండి. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. యువ చంద్ర కృష్ణ, అజయ్, జీవన్, నోయల్, ప్రియాంక, అనన్య అందరికీ ఆల్ ది బెస్ట్. సాహిత్ ఇది రెండో సినిమా. తన మొదటి సినిమా బంధం రేగడ్ నాకు చాలా ఇష్టం. . పొట్టెల్ టీజర్ చూసినప్పుడు తన ఆనుకున్న కథ తెరపైకి అద్భుతంగా తీసుకొచ్చారని అనిపించింది. అజయ్ గారి లుక్ టెర్రిఫిక్ గా వుంది. టీజర్ అందరినీ టీజ్ చేసిందని భావిస్తున్నాను. ఈ సినిమాని మొదటి రోజు చూడాలని ఎదురుచూస్తున్నాను. ఇది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు


హీరో యువ చంద్ర కృష్ణ మాట్లాడుతూ.. మా సినిమా ఈవెంట్ కి సందీప్ అన్న రావడం చాలా ఆనందాన్ని, బలాన్ని ఇచ్చింది. పొట్టెల్ మన మట్టికథ. మనకి దగ్గరగా వుండే సినిమా ఇది. స్క్రీన్ ప్లే లోని మ్యాజిక్ ప్రేక్షకులని అబ్బురపరుస్తుంది. మంచి ఎమోషన్ తో కూడుకున్న పక్కా కమర్షియల్ తెలుగు సినిమా ఇది. ఇందులో గంగా పాత్ర చేశాను. ఆ పాత్ర మనలో ఒకడిగా వుంటుంది. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా మరింతగా హత్తుకుంటుంది. గొప్ప స్ఫూర్తిని ఇచ్చే సినిమా ఇది. శేఖర్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అజయ్ అన్నని మరో లుక్ లో చూస్తారు. సాహిత్ వన్ మ్యాన్ షో ఇది చాలా హార్డ్ వర్క్ చేశారు. నిర్మాతలు చాలా ప్రేమించి ఈ సినిమా చేశారు. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు.  


అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. మీ అందరి స్పంధన చూస్తుంటే టీజర్ పెద్ద హిట్ అని అర్ధమౌతోంది. సందీప్ రెడ్డి వంగా గారు మా టీం అందరికీ పెద్ద ఎనర్జీ ఇచ్చారు. దర్శకుడు సాహిత్ చెప్పిన దాని కంటే వందరెట్లు అద్భుతంగా వుంది టీజర్. ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మా కెరీర్ లో ఇది ది బెస్ట్ సినిమా అవుతుంది.' అన్నారు.


దర్శకుడు సాహిత్ మోత్ఖురి మాట్లాడుతూ..సందీప్ అన్న టీజర్ లాంచ్ చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాకి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న ప్రణయ్, సందీప్ అన్నకి థాంక్స్. పొట్టెల్ ఎమోషనల్ రైడ్ కి తీసుకెళుతుంది. టీజర్ స్నీక్ పీక్ మాత్రమే. ఈ సినిమా విషయంలో మేమంతా చాలా గర్వంగా ఫీలౌతున్నాం. నిర్మాతలు చాలా గొప్పగా సపోర్ట్ చేశారు ఈ సినిమాలో నటించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' తెలిపారు.


అజయ్ మాట్లాడుతూ.. సాహిత్ చాలా అద్భుతమైన కథ చెప్పాడు. దాని కంటే అద్భుతంగా తీశాడు. టీంలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మంచి ఎమోషన్స్ తో వున్న కమర్షియల్ సినిమా ఇది. సాహిత్ పెద్ద దర్శకుడు అవుతాడు. ఇప్పతువరకూ నేను చేసిన పాత్రల్లో ఇది ది బెస్ట్ రోల్, సందీప్ గారు రావడం వలన టీజర్ రీచ్ మరో స్థాయికి వెళ్ళింది'' అన్నారు.


నిర్మాత నిశాంక్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు సందీప్ అన్న రావడం వెయ్యి ఏనుగుల బలం ఇచ్చింది. టీజర్ లాంచ్ చేసిన సందీప్ అన్నకి థాంక్స్. సురేష్ అన్నతో కలిసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయన నుంచి చాలా విలువైన విషయాలు నేర్చుకున్నాను. సాహిత్ నన్ను నిర్మాతని చేశాడు. చాలా గొప్ప సినిమా తీశాడు. మీ అందరికీ గుర్తిండిపోతుంది. అజయ్ అన్న అద్భుతంగా నటించారు. యువ చాలా మంచి హీరో అవుతాడు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది మట్టి నుంచి పుట్టిన కథ. ఈ సినిమాకి మీ అందరి ఆదరణ వుంటుందని ఆశిస్తున్నాను.


నిర్మాత సురేష్ కుమార్ మాట్లాడుతూ.. టీజర్ లాంచ్ చేసిన సందీప్ అన్నకి థాంక్స్. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. పొట్టెల్ సినిమా వెనుక సాహిత్ కృషి వుంది. తను లేకపోతే సినిమా లేదు. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్ అందరూ అద్భుతంగా నటించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. శేఖర్ చంద్ర నేపధ్య సంగీతం అదరగొట్టారు. తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది''అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

 

తారాగణం: యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ మరియు ఇతరులు.

 

సాంకేతిక సిబ్బంది:

రచయిత మరియు దర్శకుడు - సాహిత్ మోత్ఖురి

నిర్మాతలు - నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె

బ్యానర్లు - నిసా ఎంటర్టైన్మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్

సంగీత దర్శకుడు - శేఖర్ చంద్ర

సినిమాటోగ్రాఫర్ - మోనిష్ భూపతి రాజు

ఎడిటర్ - కార్తీక శ్రీనివాస్

గీత రచయిత - కాసర్ల శ్యామ్

ఆర్ట్ డైరెక్టర్ - నార్ని శ్రీనివాస్

ఫైట్స్ - పృథ్వీ, రబిన్ సుబ్బు

PRO - వంశీ- శేఖర్

డిజిటల్ మీడియా - హ్యాష్ ట్యాగ్ మనోజ్

 

Mirai Theatrical Release on 18th April, 2025 In 3D

 సూపర్ హీరో తేజ సజ్జా, కార్తీక్ ఘట్టంనేని, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సూపర్ యోధ చిత్రం అబ్బురపరిచే “మిరాయ్” టైటిల్ గ్లింప్స్  రామానాయుడు స్టూడియోలో డి. సురేష్ బాబు లాంఛ్ చేశారు.  2025 ఏప్రిల్ 18న  థియేట్రికల్ రిలీజ్(3డి లో)

 


టాలీవుడ్ లో విజయవంతమైన ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమ ప్రొడక్షన్ నెం. 36ని ప్రకటించింది, ఇందులో సూపర్ హీరో తేజ సజ్జ సూపర్ యోధ పాత్రను పోషిస్తున్నారు. ప్రతిభావంతులైన దర్శకుడు కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వం లో అభిరుచి ఉన్న నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈ రోజు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఒక గ్లింప్స్ గురువారంనాడు రామానాయుడు స్టూడియోలో డి. సురేష్ బాబు  విడుదల చేశారు.

 

ఈ చిత్రానికి ఫ్యూచర్ అనే అర్థం వచ్చేలా “మిరాయ్” అనే టైటిల్ పెట్టారు. టైటిల్ లోగో జపనీస్ ఫాంట్ లో రూపొందించబడింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో తేజ సజ్జ సూపర్ యోధా లుక్ లో చేతిలో యో (స్టాఫ్ స్టిక్)తో, బద్దలయ్యే అగ్నిపర్వతం పైన ఉగ్రంగా నిలబడి ఉన్నట్లు కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో, మనం గ్రహణాన్ని గమనించవచ్చు.

 

ఈ గ్లింప్స్ సినిమా నేపథ్యాన్ని తెలిపేలా ఉంది. ఇది అశోక రాజు మరియు అతని 9 రహస్యాల  ఆధారంగా రూపొందించబడింది. కళింగ యుద్ధం అశోకుని చరిత్రలో చెడ్డ గుర్తుగా మిగిలిపోయింది. ఆ పశ్చాత్తాపంలోనే దైవ రహస్యం వెల్లడైంది. అంటే మనిషిని దైవంగా మార్చే 9 గ్రంథాల అపారమైన జ్ఞానం. తరతరాలుగా వారిని రక్షించేందుకు 9 మంది యోధులను నియమించారు. అటువంటి జ్ఞానానికి గ్రహణం చేరుకుంటుంది. అప్పుడు గ్రహణాన్ని ఆపడానికి ఒక జన్మ పుడుతుంది. తరతరాలుగా ఇది అనివార్యమైన మహా యుద్ధం అంటూ బుద్ధ సన్యాసి నుండి వచ్చిన కథనం మనల్ని కట్టిపడేస్తుంది. ఇంతకు ముందు చూడని విజువల్ వండర్ లా ఈ చిత్రం ఉండబోతుంది అన్నట్టు తెలుస్తుంది

 

 ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్ మరియు పోస్ట్-ప్రొడక్షన్ పై కార్తీక్ ఘట్టంనేనికి ఉన్న గ్రిప్ ఏంటో గ్లింప్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. కథకు హిస్టారిక్ టచ్ ఉన్నప్పటికీ, అది ఎంగేజింగ్ గా చెప్పారు. అశోకుడి 9వ రహస్యానికి గ్రహణం రాకుండా ఆపడానికి వచ్చిన సూపర్ యోధగా తేజ సజ్జ ఎంట్రీ అద్భుతంగా ఉంది.తను కర్రసాము మరియు ఇతర పోరాటాలలో రాణించాడు. సూపర్ యోధాగా  సరిగ్గా నప్పుతూ అద్భుతమైన ప్రదర్శనతో ముందుకు వచ్చాడు. కథానాయికగా నటించిన రితికా నాయక్ కు మంచి పాత్ర లభించినట్టు తెలుస్తుంది

 

కార్తీక్ ఘట్టంనేని సినిమాటోగ్రఫీలో తన నైపుణ్యాన్ని చూపించి ప్రతి ఫ్రేమ్ డైమండ్ లా చూపించాడు. గౌర హరి తన అద్భుతమైన స్కోర్ తో కథనాన్ని మరింత ఇంటరెస్టింగ్ గా తీసుకువెళ్లాడు. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు ప్రపంచ స్థాయికి తక్కువ కాకుండా ఉన్నాయి, ఒక అంతర్జాతీయ సినిమా చూస్తున్న అనుభూతిని పొందుతాము. మిరాయ్ గ్లింప్స్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది మరియు తదుపరి అప్డేట్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది.

 

కార్తీక్ ఘట్టంనేని స్క్రీన్ ప్లే రాయగా మణిబాబు కరణం డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర తంగాల కాగా, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల. కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ కాగా, సుజిత్ కుమార్ కొల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

 

గ్లింప్స్ ద్వారా నిర్మాతలు మిరాయ్ ను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ మరియు చైనీస్ భాషల్లో ఏప్రిల్ 18న వేసవిలో 2D మరియు 3D వెర్షన్ లలో సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.


అనంతరం దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ, మిరాయ్ అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనం. దాన్ని కొందరు కాపాడుతుంటారు. ఇది సినిమా విడుదలయ్యాక మరింత బాగా అర్థమవుతుంది. ఈ కథ కోసం చాలా నేర్చుకుని నేను సినిమా చేస్తున్నా. హనుమాన్ కు ముందే ఈ సినిమా కథను తేజ కు చెప్పాను. పదేళ్ళుగా తనతో జర్నీ చేస్తున్నా. ఇదొక అద్భుతమైన సినిమాగా మలచబోతున్నాను అని అన్నారు.


చిత్ర నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ మాట్లాడుతూ, కార్తీక్ తో జర్నీ చాలా బాగుంది. తనకు ఓ విజన్ వుంది. ఈ సినిమాలో ప్రతి పైసా వెండితెరపై కనులపండువలా వుంటుంది. పాన్ వరల్డ్ గా సినిమాను చేయనున్నాం. తేజ సజ్జకు ముందు రికార్డ్ లను బద్దలు కొట్టే సినిమా మిరాయ్ వుంటుంది అని చెప్పారు.


డి. సురేష్ బాబు మాట్లాడుతూ, విశ్వ్రసాద్, కార్తీక్, తేజ ముగ్గురి డ్రీమ్ ఈ సినిమాతో నెరవేరుతుంది. సంగీత దర్శకుడు గౌరి సంగీతం చాలా నైస్ గా వుంది. అందరూ కలిసి వండరల్ ఫుల్  సినిమాను అందిస్తున్నారని గ్లింప్స్ చూస్తే తెలుస్తుంది అని అన్నారు.


తేజ సజ్జ మాట్లాడుతూ, హనుమాన్ తర్వాత రిలాక్స్ అయిపోయావా..అని చాలా మంది అడుగుతున్నారు. కానీ ప్రదీదీ జాగ్రత్తగా స్టెప్ వేయాలని తీసుకున్న నిర్ణయం ఈ సినిమా. ముందు సినిమాలు ఒక ఐడియాతో చేశాం.  ఈ సినిమా అయితే మాకున్న వనరులతో పెద్ద సినిమాగా చేయబోతున్నాం. ముందుగా గ్లింప్స్ విడుదలయింది. నన్ను యోధునిగా కార్తీక్ చూపించబోతున్నాడు. తనతో పదేళ్ళ జర్నీ వుంది. ఆయన విజన్ చాలా గొప్పగా వుంటుంది. విశ్వప్రసాద్ గారితో సినిమా చేయడం మరింత ఆనందంగా వుంది. ఇదే రామానాయుడు స్టూడియో నా కెరీర్ మొదలయింది. ఈరోజు ఇక్కడే గ్లిమ్ప్స్ విడుదల  చేయడం మరింత ఆనందంగా వుంది. ఆరునెలల క్రితమే ఈ సినిమాను మొదలు పెట్టాం. వచ్చే ఏడాది విడుదలనాడు గుడ్ ఫ్రైడే. నాకూ అందరికీ  గుడ్ ప్రైడ్ అవుతుందని ఆశిస్తున్నాను అని చెప్పారు.


నందిని రెడ్డి మాట్లాడుతూ, తేజ చాలా టాలెంటెడ్. సురేష్ బాబుగారి దగ్గర స్రిప్ట్, చిరంజీవిగారి దగ్గర కథను ఎలా సెలక్ట్ చేసుకోవాలో నేర్చుకున్నాడు. తనలోని గొప్ప క్వాలిటీతో మంచి సినిమాలు చేస్తున్నాడు. ఓ బేబీ నుంచి హనుమాన్ వరకు గమనిస్తున్నా తను సెల్ప్ మేడ్ స్టార్ అని అన్నారు.


అద్భుతం దర్శకుడు. మల్లిక్ రామ్ మాట్లాడుతూ, గ్లింప్స్ లో ప్రతీ షాట్ డిజైన్ బాగా చేశారు. తేజ మొదటి నుంచి కథల ఎంపికలో చాలా కేర్ తో చేస్తున్నాడు. విశ్వప్రసాద్ గారికి, గౌరవ్ హరి, నాగేంద్ర కలిసి అద్భుతమైన వండర్ ఇవ్వబోతున్నాను. హనుమాన్ త్వాత తేజ ఏ సినిమా చేయాలనుకుంటున్నప్పుడు కరెక్ట్ గా ఈ సినిమా కుదిరింది అని చెప్పారు.


 క్రిష్ణ చైతన్య మాట్లాడుతూ, హరి గౌర ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు. మిరాయ్ అద్భతమైన సినిమా అవుతుంది అన్నారు.


బేబీ నిర్మాత ఎస్.కె.ఎన్. మాట్లాడుతూ, మిరాయ్  సినిమా తేజకూ, విశ్వప్రసాద్ గారికి కలికితురాయిలా మిగులుతుంది. గ్లింప్స్ చూస్తే గర్వంగా అనిపించింది. తెలుగు సినిమా మరో మెట్టు ఎక్కింది. టాప్ స్టార్స్ ఇలాంటి సినిమాలు చేయడం మామూలే. అప్ కమింగ్ హీరో ఇలాంటి కథతో చేయడం విశేషం. విశ్వప్రసాద్ గారి తపన ప్రతి ప్రేమ్ లో కనిపిస్తుంది.  క్వాలిటీకి ్రపాధాన్యత ఇస్తారు. ఈ సినిమాను ఇంటర్ నేషనల్ స్థాయికి విశ్వప్రసాద్ తీసుకెళతారని తేజ చెప్పారు. గ్లింప్స్ విజువల్ పోయెట్రీ లా వుంది. ఈ సినిమాతో తేజ మరింత పెద్ద హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.


బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, గ్లింప్స్ చూస్తే చాలా ఆనందంగా వుంది. తేజ హార్డ్ వర్క్ ను ఏడేళ్ళ నుంచి  నేను చూస్తూనే వున్నాను. మిరాయ్ సినిమా మరింత స్థాయి పెరుగుతుందని భావిస్తున్నాను అన్నారు.


శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ, గ్లింప్స్ చూస్తే నెక్ట్స్ లెవెల్ లో వుంది. తేజ ఎంట్రీకి గౌరవ్ ఇచ్చిన ఆర్.ఆర్. బూజ్ బమ్స్ వచ్చేలా చేసింది. అన్నారు.


సాహు గారపాటి మాట్లాడుతూ, తేజ గ్రో అవడం చాలా ఆనందంగా వుంది. గ్లింప్స్ చూస్తే  హాలీవుడ్ సినిమా చూసినట్లుంది. అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు.

మరో నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ, విశ్వప్రసాద్ ప్రసాద్ గారి విజన్ ఇందులో కనిపింంచింది. నందిని గారు అన్నట్లు తేజ టాలెంటెడ్ పర్సన్. వరల్డ్ స్టయిల్ లో ఈ మూవీ వుంది.


వివేక్ కూచి భొట్ల మాట్లాడుతూ, ఓ బేబీ అప్పుడు తేజ. నాతో పది కోట్ల సినిమా వుందని చెప్పాడు. అలా జాంబిరెడ్డి చేశాడు. హనుమాన్ తో వందకోట్ల క్లబ్ లో చేరుకున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో కార్తీక్, విశ్వప్రసాద్ గారు తీసుకెలుతున్నారు. పాన్ ఇండియాలో పెద్దహిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.


ఆర్ట్.డైరెక్టర్   నాగేంద్ర తెలుపుతూ,  పీపుల్స్ మీడియాలో ఇంతకుముందు సినిమాలు చేశాను. ఈ సినిమా చాలా ఎంటర్ టైన్ చేస్తుంది.


సంగీత దర్శకుడు గౌరవ హరి మాట్లాడుతూ, హనుమాన్ కు పని చేశాను. మరలా ఈ సినిమాలో సంగీత పరంగా కొత్త డోర్ ఓపెన్ చేస్తుంది అన్నారు.


తారాగణం: సూపర్ హీరో తేజ సజ్జా, రితికా నాయక్

 

సాంకేతిక సిబ్బంది:

దర్శకుడు: కార్తీక్ ఘట్టంనేని

నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్

బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల

క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి

సంగీతం: గౌర హరి

ఆర్ట్ డైరెక్టర్: శ్రీనాగేంద్ర తంగాల

రచయిత: మణిబాబు కరణం

PRO: వంశీ-శేఖర్

మార్కెటింగ్: హాష్ ట్యాగ్ మీడియా

Teaser Of Raja Raveendar Starrer Family Entertainer 'Sarangadariya' Is Unveiled By Hero Sree Vishnu

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సారంగదరియా’ టీజర్‌ను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు



రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకం పై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సారంగదరియా’. సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. మే నెలలో సినిమాను విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే లెజెండ్రీ సింగర్ పాడిన ‘అందుకోవా...’ అనే ఇన్‌స్పిరేషనల్ సాంగ్ తో పాటు ‘నా కన్నులే..’ అనే  లిరికల్ సాంగ్స్ ను విడుదల చేయగా వాటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి. గురువారం  ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు సినిమా టీజర్ ను విడుదల చేసి చిత్రయూనిట్ కి అభినందనలు తెలియజేశారు.


టీజర్‌ను గమనిస్తే.. ఇది పక్కా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది. మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి.. తన భార్య, ఇద్దరు కొడుకులు, కూతురితో సంసారాన్ని వెల్లదీస్తుంటాడు. సమాజంలో పరువుగా బతికితే చాలు అనుకునే వ్యక్తికి తన కొడుకులు, కూతురు వల్ల ఇబ్బందులు వస్తాయి. సమాజం అతన్ని నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు ఆ కన్నతండ్రి ఏం చేశాడు.. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు.. అనే కథాంశంతో ‘సారంగదరియా’ చిత్రం రూపొందిందని టీజర్ ద్వారా స్పష్టమవుతుంది.


ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ ‘‘మా ‘సారంగదరియా’  టీజర్‌ను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణుగారికి ప్రత్యేక ధన్యవాదాలు. హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలుంటాయి. సినిమాను మే నెలలో విడుదల చేయాలనకుంటున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.


డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి(పండు )మాట్లాడుతూ ‘‘ మా మూవీ టీజర్ విడుదల చేసిన శ్రీవిష్ణుగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. దర్శకుడిగా ఇది నా తొలి చిత్రం.  ఒక మధ్యతరగతి ఫ్యామిలీ లో జరిగిన కొన్ని ఘర్షణల తో కథ ఉంటుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మే నెలలో ప్రేక్షకుల ముందుకు రావటానికి ప్రయత్నాలు చేస్తున్నాం’’ అన్నారు.



నటీనటులు: 

రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్,శివ చందు, యశస్విని,మొయిన్ ,మోహిత్,నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్, తదితరులు


సాంకేతిక వర్గం:


బ్యానర్ - సాయిజా క్రియేషన్స్, నిర్మాతలు - ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి, దర్శకత్వం - పద్మారావు అబ్బిశెట్టి (పండు), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అరుణాచల మహేష్, మాటలు - వినయ్ కొట్టి, ఎడిటర్ - రాకేష్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ - ఎం. ఎబెనెజర్ పాల్, సినిమాటోగ్రఫీ - సిద్ధార్థ స్వయంభు, పాటలు - రాంబాబు గోశాల, కడలి , అడిషనల్ రైటర్ - రఘు రామ్ తేజ్.కె, పి.ఆర్.ఒ - తుమ్మల మోహన్, చంద్ర వట్టికూటి.


Teaser Link - 




"Veera Dheera Sooran" Unveiled with a Powerful Teaser

 చియాన్ విక్ర‌మ్ 62వ చిత్రం ‘వీర ధీర శూరన్’... బర్త్ డే సందర్బంగా టైటిల్ టీజర్ విడుదల




విలక్ష‌ణ‌మైన సినిమాలు, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టమే కాకుండా జాతీయ ఉత్త‌మ న‌టుడిగానూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ చియాన్ విక్ర‌మ్‌. బుధ‌వారం ఆయ‌న పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. చియాన్ 62వ చిత్రానికి ‘వీర ధీర శూరన్’ అనే టైటిల్‌ను క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. త్వ‌ర‌లోనే తెలుగు టైటిల్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. ఎస్‌.జె.సూర్య‌, దుస‌రా విజ‌య‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.యు.అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.


‘వీర ధీర శూరన్’లో ప‌క్కా మాస్ అవ‌తార్‌లో చియాన్ విక్ర‌మ్ అభిమానుల‌ను మెప్పించ‌టం ఖాయంగా క‌నిపిస్తుంది. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే హీరో పేరు కాళి. త‌న‌కు ఓ కిరాణా షాప్ ఉంటుంది. అందులో త‌ను ప‌ని చేసుకుంటుంటాడు. అత‌నితో అంత‌కు ముందే దెబ్బ‌లు తిన్న విల‌న్స్ జీపులు, వ్యాన్స్ వేసుకుని అక్క‌డికి చేరుకుంటారు. త‌మ‌ను కొట్టింది కిరాణా షాప్‌లో ఉన్న హీరో అని క‌న్‌ఫ‌ర్మ్ అయితే అత‌న్ని చంపేయాల‌నేది వారి ఆలోచ‌న‌.. అయితే విల‌న్స్ జాడ‌ను హీరో ప‌సిగ‌ట్టేస్తాడు. అక్క‌డ ప‌ని చేసుకుంటూనే విల‌న్స్‌ను ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాడు. త‌మ‌ను కొట్టింది హీరో అని తెలియ‌గానే విల‌న్స్ క‌త్తులు తీసుకుని దాడి చేయ‌టానికి వస్తుంటారు. అంతే.. మ‌న క‌థానాయ‌కుడు అప్ప‌టి వ‌ర‌కు దాచి పెట్టిన తుపాకీ తీసుకుని ఓ విల‌న్ చెవికి గాయ‌మ‌య్యేట‌ట్లు కాల్చ‌డంలో దుండ‌గులు భ‌యంతో ప‌రుగులు తీస్తారు. షాప్‌లో ఉన్న క‌స్ట‌మ‌ర్ హీరో చేతిలోని గ‌న్ చూసి భ‌య‌ప‌డుతుంది. కానీ హీరో అదేమీ ప‌ట్టించుకోకుండా ఆమె కొన్న స‌రుకుల ఖ‌ర్చు ఎంత‌య్యిందనే విష‌యాన్ని చెప్ప‌టంతో షాపులోని లేడీ క‌స్ట‌మ‌ర్‌, ఓ ప‌క్క భ‌యం, మ‌రో ప‌క్క ఆశ్చ‌ర్యంతో నోరు వెల్ల‌బెట్టేస్తుంది.


 225 సెక‌న్ల పాటుండే  ‘వీర ధీర శూరన్’ టైటిల్ టీజ‌ర్‌లోనే అంత మాస్ ఎలిమెంట్స్ఉన్న‌ప్పుడు సినిమాలో ఇక ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక చియాన్ విక్ర‌మ్ మాస్ అవ‌తార్ కెవ్వు కేక అనిపించ‌టం ప‌క్కా అని తెలుస్తుంది. జి.వి.ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తేని ఈశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు.


న‌టీన‌టులు:

చియాన్ విక్ర‌మ్‌, ఎస్‌.జె.సూర్య‌, దుస‌రా విజ‌య‌న్ త‌దిత‌రులు



సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్ :  హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్‌, నిర్మాత‌:  రియా శిబు, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.యు.అరుణ్‌కుమార్‌, అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌:  రోని జ‌కారియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  అన్‌లిన్ లాల్‌, మ్యూజిక్‌:  జి.వి.ప్ర‌కాష్ కుమార్‌, సినిమాటోగ్ర‌ఫీ:  తేని ఈశ్వ‌ర్‌, ఆర్ట్‌:  సి.ఎస్‌.బాల‌చంద‌ర్‌, కాస్ట్యూమ్స్‌:  క‌విత‌.జె, పి.ఆర్‌.ఒ (తెలుగు):  సురేంద్ర నాయుడు- ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా).

Vadakkan Selected at The Prestigious  BIFFF

 అంతర్జాతీయ వేదికపై మలయాళీ మూవీ ‘వడక్కన్’



కిషోర్, శ్రుతి మీనన్ నటించిన వడక్కన్ మూవీ ప్రపంచ స్థాయి వేదికపై మెరిసింది. రసూల్ పూకుట్టి, కీకో నకహరా, బిజిబాల్, ఉన్నిఆర్ సంయుక్తంగా నిర్మించగా.. సాజీద్ ఎ దర్శకత్వంలో ఈ మూవీ వచ్చింది. బ్రస్సెల్స్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ (BIFFF )లో స్థానం సంపాదించుకుంది. ఆఫ్‌బీట్ మీడియా గ్రూప్ అనుబంధ సంస్థ ఆఫ్‌బీట్‌స్టూడియోస్ బ్యానర్‌పై వడక్కన్‌ను నిర్మించారు. ఈ చిత్రం ప్రాచీన ఉత్తర మలబార్ జానపద కథల నేపథ్యంలో సాగుతుంది.


మస్యాత్మకమైన వస్త్రాన్ని నేయడం ద్వారా అతీంద్రియ థ్రిల్లర్ రంగాల్లోకి లోతుగా పరిశోధిస్తుంది. తమ సినిమాకు ఇంతటి గుర్తింపు రావడంతో భ్రమయుగం, భూతకాలం దర్శకుడు రాహుల్ సదాశివన్ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఇలా పేర్కొన్నాడు. ‘వడక్కన్‌కి లభించిన అంతర్జాతీయ గుర్తింపు చాలా సంతోషకరమైనది. మలయాళ చిత్రసీమను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టడం ఎంతో గర్వంగా ఉంది’ అని అన్నారు.


ఆఫ్‌బీట్ మీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు & నిర్మాత,  జైదీప్ సింగ్  మాట్లాడుతూ.. ‘వడక్కన్‌తో ప్రపంచ స్థాయి కాస్ట్ & క్రూ మద్దతు ఉన్న గ్లోబల్ సెన్సిబిలిటీలతో హైపర్‌ లోకల్ కథనాలను చెప్పడం ద్వారా భారతీయ సినిమాని పునర్నిర్వచించడమే మా లక్ష్యం’ అని అన్నారు. వడక్కన్ ని ఈ సంవత్సరం కేన్స్‌లో మే నెలలో ప్రదర్శించనున్నారు. వడక్కన్ ని కన్నడ, తమిళం, తెలుగు భాషల్లోకి డబ్ చేయనున్నారు.

BSS11 Announced On Sri Rama Navami

 Bellamkonda Sai Sreenivas, Koushik Pegallapati, Sahu Garapati, Shine Screens Production No 8, #BSS11 Announced On Sri Rama Navami Evening



Hero Bellamkonda Sai Sreenivas who is busy with his 10th film signed another exciting project which was announced today, on the auspicious occasion of Sri Rama Navami. The dynamic and passionate producer Sahu Garapati, who is known for making commercial films with deeper emotions, announced the ambitious project, written and directed by Koushik Pegallapati, with an awe-inducing poster that depicts in-depth detailing that leaves an impression of a scary fairy tale.


What really grabs our attention is Lord Sri Rama is seen with a bow and arrow aiming at a monster in the sky. Someone performs shadow puppetry. We can also see a deserted forest, an antenna tower, and a hornet. It’s a perfect poster for Sri Rama Navami occasion.


After the sensational success of Bhagavanth Kesari, Shine Screens returns to the silver screen with this electrifying Horror Mystery that promises to offer an unforgettable cinematic experience. The film is poised to redefine the tale of Light vs. Dark with a modern narrative. 


The filmmaker assures to push the boundaries by offering a technically brilliant and visually exhilarating film with an original story that instills hope by invoking fear.


Smt. Archana presents Production No. 8 of Shine Screens banner. The makers roped in well-known technicians to take care of different crafts. Chinmay Salaskar will crank the camera, while B. Ajaneesh Loknath of Kantara fame provides the music. Manisha A Dutt is the production designer, whereas D Siva Kamesh is the art director. Niranjan Devaramane will edit the movie.


Creative Head G Kanishka and Co-Writer Darahas Palakollu form the creative backbone of this movie, each bringing their unique expertise to craft a film that promises to be a technical marvel.


The other details of the movie will be revealed soon.


Cast: Bellamkonda Sai Sreenivas


Technical Crew:

Written & Directed by - Koushik Pegallapati 

Producer - Sahu Garapati

Banner - Shine Screens

Presents - Smt. Archana

Music - B. Ajaneesh Loknath 

DOP - Chinmay Salaskar

Production Design - Manisha A Dutt

Art Director - D Siva Kamesh

Editor - Niranjan Devaramane

Co-Writer - Darahas Palakollu 

Creative Head - G Kanishka 

Co-Director - Lakshman Musuluri

PRO - Vamsi-Shekar

Publicity Designer - Ananth Kancherla

Marketing - First Show

Producer Akhilesh Kalaru Interview About Market Mahalakshmi

మా సినిమా "మార్కెట్ మహాలక్ష్మి" పెద్ద హిట్ అవుతుంది: ప్రొడ్యూసర్ అఖిలేష్ కలారు



బి2పి స్టూడియోస్ బ్యానర్ లో కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను వియస్ ముఖేష్ నిర్వహించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న థియేటర్ లో రిలీజ్ కానుంది. మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ ఉండగా, ఈ క్రమంలో ప్రొడ్యూసర్ అఖిలేష్ కలారు మీడియాతో ముచ్చటించి సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు.


1) మీ పేరు, మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్తారా? 

నా పేరు అఖిలేష్ కలారు. నేను ఇండియానాపోలిస్, USలో ఉంటున్నాను & ఫార్చ్యూన్ 500 కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను.


2) మీరు సినిమా లోకి రావడానికి ఇన్స్పిరేషన్ అండ్ రీజన్ ఏంటి? 


చిన్నప్పటి నుంచి సినిమాలంటే మక్కువ. సినిమా పరిశ్రమలో పనిచేయాలని అనుకున్నాను. కుటుంబ కమిట్‌మెంట్‌ల కారణంగా, నేను మొదట ఆ బాధ్యతలను పూర్తి చేసి, ఆపై నా అభిరుచిని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను.


3) డైరెక్టర్ ముఖేష్ మీకు ఎలా పరిచయం? & మార్కెట్ మహాలక్ష్మి మూవీ కి ప్రోడ్యుజ్ చేయాలి అని ఎందుకు అనుకున్నారు? 


దర్శకుడు విఎస్ ముఖేష్ నాకు దాదాపు రెండేళ్లుగా తెలుసు. ఆయన ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎలా వచ్చాడో నాకు తెలుసు. 100కి పైగా షార్ట్ ఫిల్మ్స్ తీసిన డైరెక్టర్. "మార్కెట్ మహాలక్ష్మి" కథను ఆయన చెప్పినప్పుడు, నేను దానిని ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నాను.


4) ఒక కొత్త డైరెక్టర్ నమ్మి ప్రోడ్యుజ్ చేస్తున్నందుకు మీకు రిస్క్ అనిపించలేదా? 

రిస్క్ లేని వ్యాపారం లేదు. దర్శకుడు ముఖేష్‌ స్క్రిప్ట్‌ని నమ్మి ఆ రిస్క్‌ నేను తీసుకున్నాను.


5) మార్కెట్ మహాలక్ష్మి కథ ఏంటి? ప్రేక్షకులని మీ కథ ఆకట్టుకుంటుంది అని అనుకుంటున్నారా? 


"మార్కెట్ మహాలక్ష్మి" కథ చాలా సింపుల్. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్‌వేర్ అబ్బాయి మధ్య సాగే ప్రేమకథ ఇది. మేము మా ప్రమోషన్‌లలో  ఒక మెయిన్ పాయింట్ నీ చెప్పలేదు. ఆ పాయింట్ 19వ తేదీన ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తుందని ఆశిస్తున్నాం.



6) మీరు US లో ఉంటూ, India లో షూటింగ్ ఎలా మేనేజ్ చేయగలిగారు? 


మొదట్లో నాకు ఆ డౌట్స్ ఉండేది ఇండియాలో షూటింగ్ మేనేజ్ చేస్తూ, ఇక్కడ యూఎస్ లో జాబ్ ఎలా మేనేజ్ చేయాలా అని. అయితే, మా చేతిలో మంచి టీమ్ ఉంది, డైరెక్టర్ ముఖేష్ వాళ్లని పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేశాడు. నా పని కొంచెం ఈజీ అయిపోయింది.


7) సినిమాలో హీరో & హీరోయిన్ తమ పాత్రలకి న్యాయం చేసారు అని అనుకుంటున్నారా?


నటీనటులు తమ పాత్రలకు 100% న్యాయం చేశారు. పార్వతీశం మరియు ప్రణీకాన్విక ఇద్దరూ తమ పాత్రల్లో జీవించారు. వారి కెమిస్ట్రీ చాలా బాగుంది.


8) సినిమా కంప్లీట్ అయ్యాక చూసి, పెద్ద ఆర్టిస్ట్ లతో వెళ్లి ఉంటె బాగుండు అని ఫీల్ అయ్యారా? 


పెద్ద నటీనటులతో ఈ సినిమా చేస్తే బాగుండేదని నాకెప్పుడూ అనిపించలేదు. పార్వతీశం, ప్రణీకాన్విక, అవినాష్, బాషా మరియు ఇతర నటీనటులు వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.


9) మొదట్లో మీకు ఏదయితే డైరెక్టర్ కథ చెప్పాడో అది పెర్ఫెక్ట్ గా డెలివరీ చేశాడా? 


నిజానికి దర్శకుడు ముఖేష్‌ నాకు చెప్పిన కథనే తెరపైకి తెచ్చారు. ముఖేష్ కథ చెప్పినప్పుడు నేను వారి పాత్రలను విజువలైజ్ చేసుకున్నాను. ఫైనల్ గా సినిమా చూసాక, నేను ఊహించిన వాటిని తెరపై చూసినట్టు అనిపించింది.


10) మీరు పెట్టిన డబ్బులు రికవరీ అవ్వుతుందని మీరు నమ్ముతున్నారా? 


నేను పెట్టుబడి పెట్టిన డబ్బును "మార్కెట్ మహాలక్ష్మి" రికవరీ చేస్తుందని నమ్ముతున్నాను. ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం చాలా కష్టం, కానీ మేము దానిని విజయవంతంగా పూర్తి చేసాము.  ఏప్రిల్ 19న విడుదల కూడా చేయబోతున్నాము. మా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుందన్న నమ్మకం ఉంది.


11) ఈ ఫ్రైడే వేరే సినిమాలతో పాటు, మీ సినిమా కూడా రీలిజ్ అవ్వుతుంది? మీ సినిమా హిట్ అవ్వుతుందని మీరు భావిస్తున్నారా? ఎందుకు? 


నాకు సినిమాలంటే ప్రాణం. ఈ శుక్రవారం ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి సినిమా నిర్మాతను ఆదరించాలని ప్రేక్షకులను కోరుతున్నాను. అందులో నా సినిమా మరింత విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను.


12) మీకు ఇది ఫస్ట్ మూవీ కదా? సినిమా ప్రోసెస్ ఏమైనా కొత్తగా అనిపించిందా? 


ఈ సినిమా పూజా కార్యక్రమం నుంచి షూటింగ్ ముగిసే వరకు ఫస్ట్ కాపీ వరకు చాలా నేర్చుకున్నాను. ఇది నాకు గొప్ప అవకాశం. ముఖేష్ సినిమా గురించి నాకు ప్రతిరోజూ అప్‌డేట్ చేస్తూ సపోర్టుగా నిలిచారు.


13) ఈ సినిమా తరువాత మీ ప్ల్యాన్ ఏంటి?


సినిమాలంటే చాలా ఇష్టం, ఎన్నో కష్టాలతో ఈ స్థాయికి చేరుకున్నాను. "మార్కెట్ మహాలక్ష్మి" కోసం మా టీమ్ అంతా చాలా కష్టపడ్డారు. గ్రాండ్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. మరిన్ని సినిమాలు నిర్మించి ఇండస్ట్రీలో ఒక ప్రముఖ స్థానం సాధించాలని ఆశిస్తున్నాను. 

Dream Catcher First Look Posters Unveiled

సి ఎల్ మోషన్ పిక్చర్స్  వారి “డ్రీం క్యాచర్  ” ఫస్ట్ లుక్ పోస్టర్స్  విడుదల !

డ్రీమ్ బేస్డ్ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ ! 



పోస్టర్స్ చూస్తుంటే కొత్త దర్శకుడి గా కొత్త నిర్మాణ సంస్థ తీసిన సినిమా అనిపించడం లేదని, హీరోగా  అందరు  కొత్త గా చేసిన ఈ సినిమా కి చాలా మంచి భవిష్యత్ ఉందని “డ్రీం క్యాచర్ ”  డ్రీమ్ బేసిడ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ .

ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదల వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖులు , బెస్ట్ విషెష్ తెలిపారు . 

సి ఎల్ మోషన్ పిక్చర్స్   పతాకంపై సందీప్ కాకుల ప్రొడ్యూసర్ గా మరియు నిర్మాణం సారధ్యం లో ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ , శ్రీనివాస్ రాంరెడ్డి  , ఐశ్వర్య హోలక్కల్ , సందీప్ కాకుల  నిర్మించిన “డ్రీం క్యాచర్ ” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల వేడుక హైద్రాబాద్ లోని ఫిలిం ఛాంబర్  లో ఘనంగా జరిగింది.

సందీప్ కాకుల  టాలెంటెడ్  డైరెక్టర్ తెలుగు తెరకు పరిచయమవుతుండడం సంతోషదాయకమని, ఫస్ట్ లుక్ లో, టీజర్ లో సక్సెస్ కళ ప్రస్పుటంగా కనిపిస్తోందని ఈ సందర్భంగా అతిధులు  పేర్కొన్నారు. “డ్రీం క్యాచర్ ” చిత్రాన్ని తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తనే  దర్శకుడిగా, మరియు ప్రొడ్యూసర్ గా  తెరకెక్కించానని, ఈ ఏడాది మంచి  చిత్రం గా  నిలిచే చిన్న చిత్రాల జాబితాలో సూపర్  చిత్రంగా మలచిన " డ్రీం క్యాచర్ " చిత్రం కచ్చితంగా చేరుతుందని, క్లైమాక్స్  చిత్రీకరించి తీరు చూస్తే హౌరా అనిపించే విధంగా ఉంటుంది అని చెప్పారు.   “డ్రీం క్యాచర్ ” చిత్రంలో నటించడం చాలా సంతృప్తినిచ్చిందని నటులు ప్రశాంత్ కృష్ణ, పేర్కొన్నారు. ఇందులో నటించే అవకాశం ఇచ్చిన దర్శకడు కి హీరోయిన్ అనీషా ధామ  కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రోహన్ శెట్టి మరియు ఛాయాగ్రహణం: ప్రణీత్ గౌతమ్ నంద తదితరులు పాల్గొని “డ్రీం క్యాచర్ ” ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు. నటి నటులు: ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ , శ్రీనివాస్ రాంరెడ్డి  , ఐశ్వర్య హోలక్కల్ ,  ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి… సాంకేతిక వర్గం: పి.ఆర్.ఓ: శ్రీపాల్ చొల్లేటి,  డి.ఐ: శ్రీనివాస్ మామిడి , వి.ఎఫ్.ఎక్స్: శ్రీకాంత్ శాఖమూరు , సంగీతం: రోహన్ శెట్టి  ఛాయాగ్రహణం: ప్రణీత్ గౌతమ్ నంద , కూర్పు: ప్రీతం గాయత్రి ,  నిర్మాత: సందీప్ కాకుల  రచన – దర్శకత్వం: సందీప్ కాకుల. 

Robinhood Worldwide Theatrical Release On December 20th

నితిన్, వెంకీ కుడుముల, మైత్రీ మూవీ మేకర్స్ రాబిన్హుడ్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 20న థియేట్రికల్ రిలీజ్



వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్హుడ్ లో హీరో నితిన్ మునుపెన్నడూ లేని తరహా పాత్రలో అద్భుతంగా కనిపించబోతున్నాడు. వెంకీ కుడుముల తన గెటప్ నుండి క్యారెక్టరైజేషన్ వరకు నితిన్ని పూర్తిగా డిఫరెంట్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు. అతన్ని దొంగగా పరిచయం చేసిన టీజర్ హాస్యభరితంగా ఉండగా, బర్త్ డే గ్లిమ్ప్స్ పూర్తి యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత స్థాయి నిర్మాణ, సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


ఇదిలా ఉండగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు. రాబిన్హుడ్ డిసెంబర్ 20న విడుదల కానుంది. క్రిస్మస్ సెలవులు, ఆ తర్వాత న్యూ ఇయర్ సెలవులు ఈ సినిమాకి కలిసి రానున్నాయి. కమర్షియల్ అంశాలే కాకుండా తగినంత వినోదాన్ని కలిగి ఉండే సినిమాకి ఇది సరైన విడుదల. రిలీజ్ డేట్ పోస్టర్ లో నితిన్ ముఖం లో ఇంటెన్సిటీ కలిగి ఉండి  స్పోర్ట్స్ బైక్పై మ్యాచో లా కనిపిస్తున్నాడు


నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రానికి నిర్మాతలు. సాయి శ్రీరామ్ లెన్స్మెన్, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.


నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


తారాగణం: నితిన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు


సాంకేతిక సిబ్బంది:

రచయిత, దర్శకుడు: వెంకీ కుడుముల

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్

నిర్మాతలు: నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్

CEO: చెర్రీ

సంగీతం: జివి ప్రకాష్ కుమార్

DOP: సాయి శ్రీరామ్

ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల

లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ బళ్లపల్లి

ఫైట్స్: రామ్-లక్ష్మణ్

పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న

PRO: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో 

Nara Rohit Sundarakanda First Look Unveiled

నారా రోహిత్ ల్యాండ్ మార్క్ 20వ చిత్రం “సుందరకాండ” ఫస్ట్ లుక్ విడుదల , సెప్టెంబర్ 6, 2024న థియేట్రికల్ రిలీజ్

 
హీరో నారా రోహిత్ ల్యాండ్ మార్క్ 20వ చిత్రం “సుందరకాండ”.దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి ను పరిచయం చేస్తూ సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొళ్ల, గౌతమ్ రెడ్డి మరియు రాకేష్ మహంకాళి నిర్మించిన వినోదభరితమైన రొమ్-కామ్ చిత్రం “సుందరకాండ”. ప్రతి వ్యక్తికి రిలేట్ అయ్యేలా జీవితం లో ఉండే అన్ని రకాల ఎమోషన్స్ ని చూపించే విధంగా ఈ చిత్రం ఉండబోతుంది
 
నారా రోహిత్ కూల్ అండ్ క్లాసీ అవతార్ లో చేతిలో కుండతో, మరో చేతిలో పుస్తకంతో ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా సినిమాకు సుందరకాండ అనే టైటిల్ ను మేకర్స్ ప్రకటించారు. పోస్టర్ లో కాలేజీ విద్యార్థులు వ్యతిరేక దిశలో నడుస్తున్నట్లు మనం చూడవచ్చు. ఈ సినిమా విడుదల తేదీని కూడా నిర్మాతలు ప్రకటించారు. ఇది గణేష్ చతుర్థి (సెప్టెంబర్ 7) సందర్భం గా సెప్టెంబర్ 6,2024 న ప్రేక్షకుల ముందుకి రానుంది.
 
సుందరకాండ హిందూ ఇతిహాసం రామాయణంలో ఐదవ పుస్తకం. సినిమాపై పాజిటివ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేసే ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించడానికి శ్రీరామ నవమి పర్వదినాన్ని సరైన సందర్భం గా భావించి మేకర్స్ ఈ రోజు టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేయడం జరిగింది        
 
వృతి వాఘని కథానాయికగా నటిస్తుండగా, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ కీలక పాత్రలు పోషించనున్నారు.
 
ప్రదీప్ ఎమ్ వర్మ సినిమాటోగ్రఫీ అందించగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత కాగా, రాజేష్ పెంటకోట ప్రొడక్షన్ డిజైనర్, రోహన్ చిల్లాలే ఎడిటర్.
 
తారాగణం: రోహిత్ నారా, వృతి వాఘని, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, కమెడియన్ సత్య, అజయ్, VTV గణేష్, అభినవ్ గోమతం, విశ్వంత్, రూపా లక్ష్మి, సునైనా, రఘు బాబు.
 
సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: వెంకటేష్ నిమ్మలపూడి
నిర్మాతలు: సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళ్లి
బ్యానర్: సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP)
DOP: ప్రదీష్ ఎం వర్మ
సంగీత దర్శకుడు: లియోన్ జేమ్స్
ఎడిటర్: రోహన్ చిల్లాలే
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ గుడ్డపు
ప్రొడక్షన్ డిజైనర్: రాజేష్ పెంటకోట
సాహిత్యం: శ్రీ హర్ష ఈమని
కాస్ట్యూమ్ డిజైనర్లు: హర్ష & పూజిత తాడికొండ
యాక్షన్ కొరియోగ్రఫీ: పృథ్వీ
డాన్స్ కొరియోగ్రఫీ: విశ్వ రఘు, యష్
VFX సూపర్వైజర్: నాగు తలారి, అశోక్ మోచర్ల
PRO: వంశీ-శేఖర్
డిజిటల్ - ప్రవీణ్ & హౌస్ ఫుల్ డిజిటల్


THANGALAAN Glimpse Unveiled

 స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్న "తంగలాన్" సినిమా నుంచి హీరో చియాన్ విక్రమ్ బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ రిలీజ్




చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ "తంగలాన్". ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ బ్యానర్స్ పై ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇవాళ చియాన్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ చెబుతూ "తంగలాన్" సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం విక్రమ్ ఎంతగా కష్టపడ్డాడో ఈ గ్లింప్స్ చూపించింది. అలాగే విక్రమ్ ఎలా తన పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఎలా మెస్మరైజ్ చేయబోతున్నాడో ఈ వీడియోతో తెలుస్తోంది. "తంగలాన్" సినిమా కోసం విక్రమ్ మారిపోయిన తీరు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది.


ఈ గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు పా. రంజిత్ మాట్లాడుతూ - "తంగలాన్" సినిమాను చరిత్రలో జరిగిన కొన్ని యదార్థ ఘటనల నేపథ్యంతో తెరకెక్కిస్తున్నాం. ఆ అడ్వెంచర్ స్టోరీని రూపొందించడంలో హీరో విక్రమ్ తో పాటు మూవీ టీమ్ నాకు ఎంతో సపోర్ట్ చేసింది. ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ జియో స్టూడియోస్ "తంగలాన్" సినిమా కోసం స్టూడియో గ్రీన్ తో చేతులు కలపడం సంతోషంగా ఉంది. జియో స్టూడియోస్ రాకతో మా సినిమా గ్లోబల్ ఆడియెన్స్ కు మరింతగా రీచ్ అవుతుందని ఆశిస్తున్నాం. హీరో విక్రమ్ "తంగలాన్" సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో ఈ గ్లింప్స్ మీకు చూపిస్తుంది. అన్నారు.


"తంగలాన్" సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగాఈ సినిమా రూపొందింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు వరల్డ్ వైడ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.



నటీనటులు - చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు


టెక్నికల్ టీమ్


సంగీతం - జీవీ ప్రకాష్ కుమార్

ఆర్ట్ - ఎస్ ఎస్ మూర్తి

ఎడిటింగ్ - ఆర్కే సెల్వ

స్టంట్స్ - స్టన్నర్ సామ్

పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

బ్యానర్స్ - స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్

నిర్మాత - కేఈ జ్ఞానవేల్ రాజా

దర్శకత్వం - పా రంజిత్