Home » » K Vijay Bhaskar Jilebi Shooting Completed

K Vijay Bhaskar Jilebi Shooting Completed

 కె. విజ‌య‌భాస్కర్,  ఎస్ఆర్కే ఆర్ట్స్ ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్  జిలేబి షూటింగ్ పూర్తి  



సూప‌ర్ హిట్ చిత్రాల ద‌ర్శకుడు కె. విజ‌య‌భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్  'జిలేబి'. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ ఆర్ కే ఆర్ట్స్ బ్యానర్ పై ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విజ‌య‌భాస్కర్ త‌న‌యుడు శ్రీ కమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తోంది.


ఇప్పటికే విడుదలైన 'జిలేబి' ఫస్ట్ లుక్ గ్లింప్స్  మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చేసుకుంది. బ్యాంకాక్ లో రెండు పాటలని గ్రాండ్ గా చిత్రీకరించారు. దీంతో షూటింగ్ అంతా పూర్తయింది. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.  


రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా, ఎం.ఆర్. వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

 


తారాగణం: శ్రీకమల్, శివాని రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి తదితరులు.


సాంకేతిక విభాగం:

దర్శకత్వం : కె. విజ‌య‌భాస్కర్

నిర్మాత: గుంటూరు రామకృష్ణ

బ్యానర్ : ఎస్ఆర్కే ఆర్ట్స్

సమర్పణ : అంజు అశ్రాని

సంగీతం: మణిశర్మ

డీవోపీ: సతీష్ ముత్యాల

ఎడిటర్ : ఎం.ఆర్ వర్మ

పీఆర్వో : వంశీ శేఖర్


Share this article :