Home » » Sridevi Shobhanbabu Pre Release Event Held Grandly

Sridevi Shobhanbabu Pre Release Event Held Grandly


చిరంజీవిగారి ఆశీస్సుల‌తో మా ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’ను మీ ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’గా ఫిబ్ర‌వ‌రి 18న రిలీజ్ చేస్తున్నాం.. సినిమా ఫ్యామిలీతో క‌లిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత‌లు సుష్మిత కొణిదెల‌, విష్ణు ప్ర‌సాద్‌



సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’. ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని సుష్మిత కొణిదెల‌, విష్ణు ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 18న విడుద‌ల చేస్తున్నారు. బుధ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. రిలీజ్ ట్రైల‌ర్‌, బిగ్ టికెట్‌ను ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో నాగ‌బాబు, హీరో సంతోష్ శోభ‌న్‌, హీరోయిన్ గౌరి జి.కిష‌న్‌, నిర్మాత‌లు సుస్మిత కొణిదెల‌, విష్ణు ప్ర‌సాద్, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ దిమ్మ‌ల , భాషా, మొయిన్‌, విజ‌య్ మాస్ట‌ర్‌, డాలీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ శ‌ర‌ణ్య పొట్ల‌ నిర్మాత సుస్మిత పిల్ల‌లు స‌మ‌ర‌, సంహిత త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా.. 


నాగ‌బాబు మాట్లాడుతూ ‘‘మా ఇంట్లో చాలా మంది హీరోస్ ఉన్నారు. కానీ ఎవ‌రూ నాకు ఇంత మంచి క్యారెక్ట‌ర్ ఇవ్వ‌లేదు. కానీ సుష్మిత ఈ సినిమాలో మంచి క్యారెక్ట‌ర్ ఇచ్చింది. అలాగే ఓ వెబ్ సిరీస్‌లోనూ మంచి పాత్ర ఇచ్చింది. త‌ను అనుకుంటే ఈవెంట్‌కు ఏ హీరో అయినా వ‌స్తారు. కానీ.. త‌ను అలా కాకుండా నార్మ‌ల్ ప్రొడ్యూస‌ర్‌లా అన్ని క‌ష్టాలు ప‌డుతూ ఎక్స్‌పీరియెన్స్ సంపాదించుకుంటూ ముందుకు వ‌స్తుంది. మా సుష్మిత త్వ‌ర‌లోనే మెగా ప్రొడ్యూస‌ర్ అవుతుంది. త‌న‌తో పాటు విష్ణుకి అభినంద‌న‌లు. విష్ణు .. మా హ‌నీ వెనుక అండ‌గా నిల‌బ‌డుతూ వ‌చ్చాడు. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ న‌న్ను క‌లిసిన‌ప్పుడు క‌థ విన్నాను. త‌న నెరేష‌న్ విన‌గానే ఎమోష‌న‌ల్ అయ్యాను. స్క్రీన్‌మీద‌కు అలాగే తీసుకు వ‌స్తాడా? అని అనిపించింది. ఇప్పుడుట్రైల‌ర్ చూస్తే త‌ను చ‌క్క‌గా డైరెక్ట్ చేశాడ‌నిపించింది. త‌న‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంటుంది. హీరో సంతోష్‌గారి నాన్న‌గారు శోభ‌న్ చాలా మంచి వ్య‌క్తి. ఆయ‌న వార‌సుడిగా శోభ‌న్ ముందుకు వ‌చ్చిన‌ప్పుడు గోల్కొండ హైస్కూల్‌లో అద్భుతంగా చేశాడు. న‌టుడిగా అప్ప‌టి నుంచి రాణిస్తున్నాడు. ఇక గౌరి చ‌క్క‌గా న‌టించింది. భాషా, మెయిన్‌, డాలీ వారి వారి పాత్ర‌ల్లో చ‌క్క‌గా ఒదిగిపోయారు. ఇక టెక్నిక‌ల్‌గా స‌పోర్ట్ చేసిన సినిమాటోగ్రాఫ‌ర్ సిద్ధార్థ్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ క‌మ్రాన్ స‌హా అంద‌రికీ అభినంద‌న‌లు’’ అన్నారు. 


హీరో సంతోష్ శోభ‌న్ మాట్లాడుతూ ‘‘‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమా సరదాగా గోల గోలగా ఉంటుంది. అచ్చ‌మైన తెలుగు సినిమా. ఫిబ్ర‌వ‌రి 18న వ‌స్తున్న ఈ సినిమాను మీ అంద‌రూ ఫ్యామిలీస్‌తో ఎంజాయ్ చేస్తారు. సుష్మిత అక్క‌కి థాంక్స్‌. మా టీమ్‌లో ఓ భాగంగా వ‌ర్క్ చేశారామె. ప్ర‌తి విష‌యంలోనూ గైడ్ చేశారు. అలాగే విష్ణుగారికి కూడా థాంక్స్‌. ప్ర‌శాంత్ నాకు చాలా క్లోజ్‌. త‌ను మంచి డైరెక్ట‌ర్ అవుతాడు. త‌న‌తో మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. గౌరి మంచి ఫ్రెండ్ అయ్యింది. ‘శ్రీదేవి శోభన్‌బాబు’లో కొత్త గౌరిని చూస్తాం. నాగ‌బాబుగారికి థాంక్స్‌. ఆయ‌న‌తో, రోహిణిగారితో వ‌ర్క్ చేయ‌టం వండ‌ర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. క‌మ్రాన్ బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నాతో పాటు వ‌ర్క్ చేసిన ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌’’ అన్నారు. 


నిర్మాత విష్ణు ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘‘శ్రీదేవి శోభన్‌బాబు’ ఫన్నీగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 18న ఫ్యామిలీతో క‌లిసి ఎంజాయ్ చేయండి. ఈ జ‌ర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. 


సుష్మిత కొణిదెల మాట్లాడుతూ ‘‘మా జి.కె.మోహన్‌గారు, శ‌ర‌త్ మరార్‌గారు, రైట‌ర్ సత్యానంద్‌గారికి, మా నాగ‌బాబు బాయ్‌కి ధ‌న్య‌వాదాలు. మ‌న లైఫ్‌లో మ‌నం ఎక్స్‌పీరియెన్స్ చేసే ట్రూ ఎమోష‌న్స్‌, రియ‌ల్ లైఫ్ ఫీలింగ్స్‌, మ‌న అమ్మ నాన్న‌తో గ‌డిపే క్ష‌ణాలు, స్నేహితులు స‌ర‌దాగా ఉన్న స‌మ‌యం. ప్రేమ‌లో ఉన్నప్పుడు ఉండే బ్యూటీఫుల్ మూమెంట్స్ అన్ని ఈ సినిమాలో ఉంటాయి. వీట‌న్నింటితో పాటు ఫెంటాస్టిక్ డ్రామా ఉంటుంది. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ సిన్సియ‌ర్‌గా మ‌న‌సు పెట్టి సినిమాను చేశారు. త‌న‌తో పాటు ఈ సినిమాకు ప‌ని చేసిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రూ అంతేలా మ‌న‌సు పెట్టి ప‌ని చేశారు. సంతోష్‌, గౌరి నాకు ఫ్యామిలీ మెంబ‌ర్స్‌లా స‌పోర్ట్ చేశారు. మా డీఓపీ సిద్ధార్థ్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ క్ర‌మాన్ స‌హా అంద‌రూ వారి బెస్ట్ ఇచ్చారు. ఇది మా బ్యాన‌ర్‌లో వ‌స్తున్న ఫ‌స్ట్ ఫీచ‌ర్ ఫిల్మ్‌. నాన్న‌గారి ఆశీస్సుల‌తో మా ‘శ్రీదేవి శోభన్‌బాబు’ని మీ ‘శ్రీదేవి శోభన్‌బాబు’గా ఫిబ్ర‌వ‌రి 18 థియేట‌ర్స్‌లోకి తీసుకొస్తున్నాం. అంద‌రూ సినిమాను ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. 


హీరోయిన్ గౌరి జి.కిషన్ మాట్లాడుతూ ‘‘‘శ్రీదేవి శోభన్‌బాబు’లో నన్ను శ్రీదేవిగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసిన డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్‌కి థాంక్స్‌. సుస్మిత‌గారికి, విష్ణుగారికి థాంక్స్‌. 96 సినిమా నాకు యాక్ట‌ర్‌గా లైఫ్ చేంజింగ్ మూవీ. అలాగే ఇప్పుడు తెలుగులో ‘శ్రీదేవి శోభన్‌బాబు’ లైఫ్ చేంజింగ్ మూవీ అనే చెప్పాలి. ఈ సినిమాలో యాక్ట్ చేయటం హ్యాపీగా ఫీల్ అయ్యాను. సంతోష్ శోభ‌న్ మంచి కో యాక్ట‌ర్‌గానే కాదు.. మంచి స్నేహితుడిగా స‌పోర్ట్ అందించారు. నాగ‌బాబుగారి కుమార్తె పాత్ర‌లో న‌టించాను. అలాగే రోహిణిగారికి థాంక్స్‌. తెలుగు ప్రేక్ష‌కులు నా 96 సినిమాను చూసిన‌ప్పుడు అద్భుతంగా ఆద‌రించారు. త‌ర్వాత జాను సినిమాలోనూ అలాంటి రెస్పాన్స్ వ‌చ్చింది. న‌న్నెప్పుడూ బ‌య‌ట వ్య‌క్తిగా చూడ‌లేదు. ఈ సినిమా నాకు మైల్ స్టోన్ అవుతుంద‌ని అనుకుంటున్నాను. సుష్మిత‌గారికి, విష్ణుగారికి థాంక్స్‌’’ అన్నారు. 


ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల మాట్లాడుతూ ‘‘‘శ్రీదేవి శోభన్‌బాబు’ జ‌ర్నీలో చాలా మంది స‌పోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్‌. ఫ్యామిలీ అంతా క‌లిసి చూసే చిత్ర‌మిది. నేను చిరంజీవిగారికి పెద్ద అభిమానిని. నేను ఆయ‌న్ని క‌ల‌వాల‌ని చాలా సార్లు అనుకునేవాడిని. అయితే బాగా చ‌దువుకుని మంచి పోజిష‌న్‌లోకి వెళ్లిన త‌ర్వాత వెళ్లి చిరంజీవిగారిని క‌లిస్తే ఆయ‌న కూడా సంతోష ప‌డ‌తార‌ని మా అమ్మ చెప్పింది. ఆ స‌మ‌యంలో నాకు సినిమా అనే ఆలోచ‌న వ‌చ్చింది. సినిమాల్లో డైరెక్ట‌ర్‌గా మారిన త‌ర్వాత అస‌లు చిరంజీవిగారిని క‌లుస్తానా? లేదా? అని అనుకున్న త‌ర్వాత అనుకోకుండా ఓరోజు కాఫీ షాప్‌లో సుష్మిత‌గారిని క‌లిశాను. ‘అక్కా నేను చిరంజీవిగారికి పెద్ద అభిమానిని. సినిమాల్లో ఇలా డైరెక్ట‌ర్‌గా ప్ర‌య‌త్నిస్తున్నాను’ అని చెప్పాను. అప్పుడామె నా నెంబ‌ర్ తీసుకున్నారు. ఐదు రోజుల్లో ఆమె నుంచి ఫోన్ వ‌చ్చింది. వెళ్లి క‌థ చెప్పాను. మ‌ళ్లీ చిరంజీవిగారికి చెప్ప‌మ‌ని అన్నారు. చిరంజీవి ఇంటికి వెళ్లి క‌లిశాను. తొలిసారి అప్పుడే ఆయ‌న్ని క‌ల‌వ‌టం. ఓ ఇంట్లో మ‌నిషిలా ప‌ల‌క‌రించారు. క‌థ విన్నారు. ఆయ‌న అభిమానిగా ప‌రిచ‌యం అయ్యాను. అంత మంచి అవ‌కాశాన్ని నాకు ఇచ్చిన సుష్మిత అక్క‌గారికి, విష్ణుగారికి థాంక్స్‌. ఎలాంటి సినిమా చేయాల‌ని అనుకున్న‌ప్పుడు అందంగా ఉండే ఓ తెలుగు సినిమా క‌థ‌ను చేద్దామ‌ని అనుకున్నాను. సుస్మిత‌గారికి న‌చ్చింది. అప్పుడు వైజాగ్, అన‌కాప‌ల్లిలో ఆడిష‌న్స్ చేసి అక్క‌డ కొంద‌రినీ సినిమాల్లో యాక్ట‌ర్స్‌గా తీసుకున్నాం. అంద‌రూ అద్భుతంగా చేశారు. సంతోష్ శోభ‌న్ మంచి స్నేహితుడు. త‌ను కాఫీకి పిల‌వ‌టంతోనే సుష్మిత‌గారిని క‌లిసే అవ‌కాశం ద‌క్కింది. అలాగే గౌరి గారికి థాంక్స్‌. 96 సినిమా చూసిన జాను క్యారెక్ట‌ర్ న‌చ్చి.. సినిమాలో త‌నని హీరోయిన్‌గా తీసుకోవాల‌ని చెప్ప‌గానే పెయిర్ చూడ‌టానికి బావుంటుంద‌ని సుష్మిత‌గారు చెప్పి ఓకే అన్నారు. సిద్ధార్థ్ రామ‌స్వామిగారు ఎంతో సీనియ‌ర్‌.. పెద్ద ఆర్టిస్టుల‌తో వ‌ర్క్ చేశారు. నేను కొత్త‌వాడినైనా నాకెంతో బాగా స‌పోర్ట్ చేశారు. అలాగే కమ్రాన్ అద్భుత‌మైన పాట‌ల‌ను అందించారు. అంద‌రూ బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చారు. కొత్త‌వాళ్లతో పాటు నాగ‌బాబుగారు, రోహిణిగారు పాత్ర‌లు ఆక‌ట్టుకుంటాయి. వారు గొప్ప న‌టులు. సినిమాలో వారి పెర్ఫామెన్స్ మెప్పిస్తాయి. సినిమా ఎమోష‌న్‌గా క‌నెక్ట్ అవుతుంది. ఫిబ్రవరి 18న ‘శ్రీదేవి శోభన్‌బాబు’ థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది ’’ అన్నారు. 


స‌మ‌ర మాట్లాడుతూ ‘‘‘శ్రీదేవి శోభన్‌బాబు’ టీమ్‌కి , గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్ మౌస్‌కి ఆల్‌ ది బెస్ట్’’ అన్నారు. 


సంహిత మాట్లాడుతూ ‘‘‘శ్రీదేవి శోభన్‌బాబు’ టీమ్‌కి అభినంద‌న‌లు. ఫిబ్ర‌వ‌రి 18న సినిమాను థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. 




న‌టీన‌టులు:


సంతోష్ శోభ‌న్‌, గౌరి జి.కిష‌న్‌, భాషా త‌దిత‌రులు


సాంకేతిక నిపుణులు:


బ్యాన‌ర్‌: గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

నిర్మాత‌లు: సుష్మిత కొణిదెల‌, విష్ణు ప్ర‌సాద్‌

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: శ‌ర‌ణ్య పొట్ల‌

మ్యూజిక్ : కమ్రాన్‌

సినిమాటోగ్ర‌ఫీ: సిద్ధార్థ్ రామ‌స్వామి

ఎడిట‌ర్‌: శ‌శిధ‌ర్ రెడ్డి

ఆర్ట్: ద‌త్తాత్రేయ‌

కాస్ట్యూమ్స్‌: సుస్మిత కొణిదెల‌

కో డైరెక్టర్‌: సుధీర్ కుమార్ కుర్రు



Share this article :