Home » » G2 Event Held Grandly in Hyderabad

G2 Event Held Grandly in Hyderabad

 


జి2 నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. ‘జి2’ ని ఫ్రాంచైజ్ గా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తాం: జి 2 “ప్రీ విజన్’ లాంచింగ్ ప్రెస్ మీట్ లో హీరో అడివి శేష్




HIT-2 తో డబుల్ హ్యాట్రిక్ హిట్ ‌లను పూర్తి చేసిన ప్రామిసింగ్ యంగ్ హీరో అడివి శేష్ తన తదుపరి ప్రాజెక్ట్‌ గా గూఢచారి సీక్వెల్ అయిన G2 ని ఇటివలే అనౌన్స్ చేశారు. గూఢచారి ఇండియాలో సెట్ చేయగా, G2 ఇంటర్ నేషనల్ గా ఉండబోతోంది. ఈ చిత్రానికి కథను శేష్ స్వయంగా అందించారు. “మేజర్” ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్ ‌లను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్,  ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌ లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ రోజు నిర్వహించిన జి 2 ప్రెస్ మీట్ లో “ప్రీ విజన్” లాంచ్ చేశారు మేకర్స్. ప్రీ-విజన్ వీడియోలో  శేష్ ఇండియా నుండి ఆల్ప్స్ పర్వతాల వరకు వెళ్ళే గూఢచారి చివరి విజువల్స్ చూపించారు. ఆ తర్వాత G2లో శేష్ ఫస్ట్ లుక్‌ ని ప్రజంట్ చేశారు. 


 


ప్రెస్ మీట్ లో అడివి శేష్  మాట్లాడుతూ.. జి2 ని ఒక ఫ్రాంచైజ్ గా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలనే తపన వుంది. కొత్త దర్శకుడు వినయ్ కి చాలా గ్రేట్ విజన్ వుంది. తనకి గూఢచారి వరల్డ్ పై చాలా మంచి పట్టువుంది. మా నిర్మాతలు విశ్వప్రసాద్, అనిల్, అభిషేక్ గారికి కృతజ్ఞతలు. నేను ఏదడిగినా సమకూరుస్తారు. గూఢచారి సౌత్ ఇండియా స్పై సినిమాల ట్రెండ్ మళ్ళీ తీసుకొచ్చింది. జి 2 తో ఆల్ ఇండియా ఫ్రాంచైజ్ గా మారబోతుంది. జి2 నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. సిక్స్ ప్యాక్ చేసి షూటింగ్ మొదలుపెడతాం(నవ్వుతూ). జి2 కి శ్రీచరణ్ మ్యూజిక్ అందిస్తారు. ఈ చిత్రాన్ని ఐదు దేశాల్లో షూట్ చేయబోతున్నాం. జి 2 ఏ స్థాయిలో వుంటుందో ప్రేక్షకులకు చిన్న రుచి చూపించడానికి ప్రీవిజన్ ని లాంచ్ చేశాం. 2024లో జి2 రాక్ ది బాక్స్ ఆఫీస్’’ అన్నారు  


 


వినయ్ మాట్లాడుతూ.. గూఢచారి అనే వరల్డ్ చాలా యూనిక్. జి 2 ప్రేక్షకుకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. ప్రీ విజన్ కి శ్రీచరణ్ చాలా చక్కని సంగీతం అందించారు. మిగతా సాంకేతిక నిపుణులు కూడా చక్కని వర్క్ ఇచ్చారు. సినిమా అంచనాలకు మించి వుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన అడివి శేష్ కి , దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. తెలిపారు.


 


శశికిరణ్ తిక్క మాట్లాడుతూ.. గూఢచారి 2 కథ శేష్ చెప్పినపుడు ఈ కథకు వినయ్ దర్శకుడైతే బావుంటుందని నేను శేష్ ఇద్దరం బలంగా అనుకున్నాం. వినయ్ కి గూఢచారి వరల్డ్ అంతా తెలుసు. తనలో అద్భుతమైన ఫిల్మ్ మేకర్ వున్నాడు. జి 2 చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా అదే మాట చెప్తారు’’ అన్నారు.  


 


నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. గత ఏడాది 200 కోట్ల రూపాయిల సినిమాలని అందుకోవడంలో ప్రేక్షకులు, మీడియా ఎంతగానో సహకరించింది. ఈ యేడాది కూడా మీ సహకారం కావాలి. నిర్మాణంలోకి వచ్చిన కొత్తలో గూఢచారి చేశాం. కొత్త కంటెంట్ ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకాన్ని ఇచ్చిన చిత్రమిది. ఇప్పుడు మా నిర్మాణంలో దాదాపు 20 చిత్రాలు వున్నాయి. జి2 మాకు ఎంతో  ప్రత్యేకమైన సినిమా. పాన్ ఇండియా గా లాంచ్ చేసి పాన్ వరల్డ్ సినిమా స్థాయికి తీసుకువెళ్లాని భావిస్తున్నాం. జి సిరిస్ లో మరిన్ని సినిమాలు చేయాలనే ఆలోచన కూడా వుంది.  సందర్భంలో మరో విషయం చెప్పాలని భావిస్తున్నాను. అభిషేక్ అగర్వాల్ ది కాశ్మీర్ ఫైల్స్ ఆస్కార్ కి షార్ట్ లిస్టు అయ్యింది. అలాగే ఈ చిత్రానికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కూడా వరిచింది. ఈ సందర్భంగా వారికి అభినందనలు’’ తెలిపారు.


 


అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ..  .. జి2 పై భారీ అంచనాలు వున్నాయి. ఆ అంచనాలు అందుకునే భాద్యతని శేష్,  మేము తీసుకున్నాం. జి2 అద్భుతంగా వుండబోతుంది’’ అన్నారు.


 


అనిల్ సుంకర మాట్లాడుతూ..  గూఢచారి 1 కథ విన్నప్పుడు మామూలు నిర్మాత అయితే సినిమాకి20 కోట్ల బడ్జెట్ అవుతుందని శేష్ తో చెప్పాను. కానీ శేష్ అద్భుతంగా చేసి చూపించాడు. కేవలం శేష్ కావడం వలెనే ఆ బడ్జెట్ లో చేయగలిగాడు. ఇప్పుడు ఇప్పుడు జి 2 అంతకంటే భారీ బడ్జెట్ లో విజువల్ వండర్ గా వుండబోతుంది’’ అన్నారు


 


వివేక్ మాట్లాడుతూ .. దాదాపుగా 54 సినిమాలు చేశాను. సినిమా మేకింగ్ లో అన్నీ తెలుసు అనే గర్వం వచ్చినపుడు ఒకసారి శేష్ సినిమా చేస్తూ వుండాలి. మనకి ఏమీ రాదని తెలుస్తుంది(నవ్వుతూ) తన ఆలోచనలు కొత్తగా అవుట్ అఫ్ బాక్స్ గా వుంటాయి. ఈ సినిమా కూడా చాలా చాలా బావుంటుంది. గూఢచారి 1 ఒక ఎత్తు అయితే దానికి మించి జి 2 వుంటుంది’’ 


 


అబ్బూరి రవి మాట్లాడుతూ.. అడవి శేష్ తనని తాను ప్రతి క్షణం మార్చుకుంటూ గొప్పగా ఎదుగుతున్నాడు.  శేష్ టీం అంతా సినిమా అంటే కసితో వుంటారు. ఏదైనా సాధించాలనే తపనతో వుంటారు. గూఢచారి కి పని చేసిన వినయ్ జి 2 తో దర్శకుడిగా మారుతున్నాడు. తనలో అద్భుతమైన ప్రతిభ వుంది. మా టీంని ప్రోత్సహిస్తున్న విశ్వప్రసాద్ గారికి, అభిషేక్ గారికి,, అనిల్ సుంకర గారికి థాంక్స్. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా దానికి మించి అవుట్ పుట్ ఇస్తాం’’ అన్నారు  


 


శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ.. జి2 లో పార్ట్ కావడం ఎక్సయిటెడ్ గా వుంది. నేను చేసిన సినిమాలన్నిటిలో కంటే జి2 నేపధ్య సంగీతం డిఫరెంట్ గా వుంటుంది. ఇంటర్ నేషనల్ స్థాయిలో వుంటుంది’’అన్నారు


 


తారాగణం: అడివి శేష్


 


సాంకేతిక సిబ్బంది:


దర్శకుడు: వినయ్ కుమార్ సిరిగినీడి


కథ: అడివి శేష్


నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్


బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్


సంగీతం: శ్రీచరణ్ పాకాల


పీఆర్వో: వంశీ-శేఖర్


మార్కెటింగ్: ఫస్ట్ షో


Share this article :