Home » » NBK Veera Simha Reddy Shooting in Anantapur

NBK Veera Simha Reddy Shooting in Anantapur

 నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ 'వీరసింహారెడ్డి' అనంతపురం షూటింగ్ షెడ్యూల్ రేపటి నుండి ప్రారంభం


 



నటసింహ నందమూరి బాలకృష్ణ, గోప్‌చంద్ మలినేని ల మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ వీరసింహారెడ్డి.  గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రేపటి నుండి అనంతపురం షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.  అనంతపురంలోని పెన్నా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఉరవకొండ, పెనుగొండ ఫోర్ట్ తదితర ప్రదేశాల్లో చిత్రానికి సంబధించిన కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు.


 


మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై భారీ ఎత్తున రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు.


 


బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌ లను అందించిన సంగీత సంచలనం ఎస్ థమన్ ఈ చిత్రానికిసంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.


 


మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎ ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.


 


ఇప్పటికే విడుదలైన టీజర్, టైటిల్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న 'వీరసింహారెడ్డి' 2023 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుంది.


 


నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు.


 


సాంకేతిక విభాగం:


 


కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: గోపీచంద్ మలినేని


నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్


బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్


సంగీతం: థమన్


డివోపీ: రిషి పంజాబీ


ఎడిటర్: నవీన్ నూలి


ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్


డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా


ఫైట్స్: రామ్-లక్ష్మణ్, వెంకట్


సిఈవో: చిరంజీవి (చెర్రీ)


కో-డైరెక్టర్: కుర్రా రంగారావు


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి


లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవివి


పబ్లిసిటీ: బాబా సాయి కుమార్


మార్కెటింగ్: ఫస్ట్ షో


పీఆర్వో: వంశీ-శేఖర్


Share this article :