Home » » Tara Movie Launched

Tara Movie Launched

 ఘనంగా ప్రారంభమైన వి.ఆర్.పి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 4  చిత్రం "తార"



ఓ పది సంవత్సరాల బాలిక సినిమా తార కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని కష్టాలు అనుభవించింది. చివరికు తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకొంది అనే చిత్ర కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం "తార". వి.ఆర్.పి క్రియేషన్స్ పతాకంపై పి. పద్మావతి సమర్పణలో   కేరాఫ్ కంచర పాలెం ఫేమ్ కిషోర్ హీరో గా, సత్యకృష్ణ హీరోయిన్ గా, బేబీ తుషార, బేబీ నాగ హాసిని, మాస్టర్ హర్ష వర్ధన్, అజయ్ ఘోష్ నటీ నటులుగా యం.బి (మల్లి బాబు) ను దర్శకుడిగా పరిచయం చేస్తూ..  వెంకటరమణ పసుపులేటి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్-4 చిత్రం  "తార" సినిమా పూజా  కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాథ్ తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నివ్వగా, నటుడు, నిర్మాత సాయి వెంకట్  కెమెరా స్విచ్ ఆన్ చేశారు.గూడ రామకృష్ణ  ఫస్ట్ డైరెక్షన్ చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన  పాత్రికేయుల సమావేశంలో 


చిత్ర దర్శకుడు యం. బి (మల్లి బాబు) మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన దర్శకుల సంఘం అధ్యక్షులు కాశి విశ్వనాధ్ గారికి, సాయి వెంకట్, రామ కృష్ణారెడ్డి గార్లకు ధన్యవాదాలు. ఓ పది సంవత్సరాల బాలిక సినిమా తార కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని కష్టాలు అనుభవించింది చివరికు తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకొంది అనేదే ఈ చిత్ర కథాంశం. అన్ని వర్గాల  వారిని ఆకట్టుకునే విధంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 14 నుంచి  ఒంగోలు, విజయవాడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ తో సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం. మంచి కథను సెలెక్ట్ చేసుకొని మేము తీస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ  ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు

 


నిర్మాత పసుపులేటి వెంకటరమణ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా మా బానర్లో ఇది నాలుగవ సినిమా. ఈ సినిమాతో మా అబ్బాయి యం. బి (మల్లి బాబు) ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాను. మా గత చిత్రాలను ఆదరించినట్లే ఇప్పుడు తీస్తున్న "తార"  సినిమాను కూడా  ఆశీర్వదిస్తూ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు


కో ప్రొడ్యూసర్ సాయిమల్లి అరుణ్ రామ్ మాట్లాడుతూ.. దర్శకుడు యం. బి (మల్లి బాబు) కొత్త కథ, కథనం తో రూపొందించిన ఈ సినిమా  ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

 


జగన్  మాట్లాడుతూ.. టాలెంట్ ఉన్న ముగ్గురు పిల్లలను తీసుకొని ఈ పిల్లల జీవితాన్ని ఇతివృత్తంగా తెరకెక్కుతున్న మా చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.


బాక్స్ ఆఫీస్ అధినేత, పి.ఆర్ ఓ చందు రమేష్ మాట్లాడుతూ.. వి.ఆర్.పి క్రియేషన్స్ పతాకంపై తీసిన "జరిగినకథ'' సినిమా వందరోజులు ఆడింది. మిగతా రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు ఇదే బ్యానర్ లో వస్తున్న నాలుగవ సినిమాను మంచి కంటెంట్ తో, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో ఖర్చుకు  వెనుకడకుండా నిర్మిస్తున్న నిర్మాత పసుపులేటి వెంకటరమణ గారికి, మరియు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న యం. బి (మల్లి బాబు)ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారందరూ  మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలని అన్నారు.


నటీ నటులు :కిశోర్, సత్యకృష్ణ,

బేబీ తుషార, బేబీ నాగ హాసిని, మాస్టర్ హర్ష వర్ధన్,అజయ్ ఘోష్ తదితరులు


సాంకేతిక నిపుణులు

సమర్పణ :  శ్రీమతి పి.పద్మావతి

బ్యానర్ : వి ఆర్ పి క్రియేషన్స్

నిర్మాత : వెంకటరమణ పసుపులేటి

సహ నిర్మాత : సాయిమల్లి అరుణ్ రామ్

కథ,స్క్రీన్ ప్లే, మాటలు , దర్శకత్వం : యం.బి (మల్లి బాబు)    

కో డైరెక్టర్ : సి. పి. రెడ్డి

డి.ఓ. పి : పి. యస్. మణి కర్ణన్

పి.ఆర్ ఓ : రమేష్ చందు

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : లీలా ప్రసాద్


Share this article :