Home » » Ginna Movie Pre Release Function

Ginna Movie Pre Release Function

 



‘జిన్నా’ చిత్రం ఢీ కంటే 10 రెట్లు ఎక్కువ విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను:  క‌లెక్ష‌న్ కింగ్ డా.మంచు మోహ‌న్ బాబు


విష్ణు మంచు టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘జిన్నా’. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను స్టార్ రైటర్ కోన వెంకట్ అందించారు.పాయ‌ల్ రాజ్‌పుత్‌, స‌న్నీలియోన్ హీరోయిన్స్‌. దీపావళి సందర్భంగా జిన్నా మూవీని అక్టోబర్ 21న వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఆదివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా జ‌రిగింది. క‌లెక్ష‌న్ కింగ్, న‌ట ప్ర‌పూర్ణ డాక్ట‌ర్ మంచు మోహ‌న్ బాబు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.  ఈ సంద‌ర్భంగా.. 


క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహన్ బాబు (Mohan Babu) మాట్లాడుతూ ‘‘అభిమానులంద‌రికీ, ప్రేక్ష‌కుల‌కు నా హృద‌య పూర్వ‌క‌ ధ‌న్య‌వాదాలు. 560కి పైగా సినిమాల్లో యాక్ట్ చేశాను. 75 సినిమాల‌ను నిర్మించాను. శివాజీగారి ఫంక్ష‌న్స్‌లో, మా అన్న‌య్య ఎన్టీఆర్‌గారి ఫంక్ష‌న్‌లో , నాగేశ్వ‌శ్వ‌ర రావుగారి ఫంక్ష‌న్‌లో కృష్ణ‌గారు, కృష్ణంరాజుగారు ఫంక్ష‌న్స్‌లో.. అబ్దుల్ క‌లామ్ మా ఇన్‌స్టిట్యూట్‌కి వ‌చ్చిన‌ప్పుడు ఆ ఫంక్ష‌న్‌లో కానీ.. ఎవ‌రూ న‌న్నెప్పుడూ ఇన్ని నిమిషాలు మాట్లాడాల‌ని చెప్ప‌లేదు. విష్ణు బాబు  మాత్రం ఈరోజు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి నాన్న ఈరోజు మీరు త‌క్కువ‌గా మాట్లాడాలి. 50 సంవ‌త్స‌రాల న‌ట జీవితం నాది. ఎక్కువ‌గా మాట్లాడుతుంటానా, పెద్ద‌వాళ్లు చెప్ప‌లేదే అనిపించింది. అప్ప‌టి రోజులు వేరు, ఇప్ప‌టి రోజులు వేరు (న‌వ్వుతూ..). హ‌నుమంతుడు సీత ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ప్పుడు ఏం చెప్పాడు. రావ‌ణాసురుడు ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ప్పుడు ఏం చెప్పాడ‌నేది ఎన్నో సంద‌ర్భాల్లో చెప్పాను. అలాగే మ‌న గురించి మ‌నం చెప్పుకోవాలి.


 కానీ నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు. బిడ్డ‌ల‌ను ప‌ది మందిలో పొగ‌డ‌కూడ‌ద‌నేది శాస్త్రం. విష్ణు ఎంత గొప్ప‌గా న‌టించాడ‌నేది సినిమాలో న‌టించిన వారు, టెక్నీషియ‌న్స్ చెప్పారు. నేను కొత్త‌గా చెప్ప‌నక్క‌ర్లేదు. ఆ భ‌గ‌వంతుని ఆశీస్సుల‌తో ఈ మూవీ అత్య‌ద్భుత‌మైన విజ‌యాన్ని సాధించాల‌ని, సాధిస్తుంద‌ని భావిస్తున్నాను. ఢీ త‌ర్వాత‌ 10 రెట్లు స‌క్సెస్ సాధించాలి. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని విధంగా రిస్కీ షాట్స్ చేశాడు. చాలా ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డ్డాడు. కాబ‌ట్టి ఈ సినిమా చాలా పెద్ద విజ‌యాన్ని అందుకోవాల‌ని కోరుకుంటున్నాను. నువ్వు బెస్ట్ హీరోవే కాదు, నీకు మంచి మ‌న‌స్సుంది. కాబ‌ట్టి నీకు కుటుంబంలోని వారితో పాటు అంద‌రి ఆశీస్సులుంటాయి. 


జిన్నా సినిమాకు మూల క‌థ‌ను అందించిన దేనికైనా రెఢీ ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర్ రెడ్డికి, ఆ క‌థైతే విష్ణుకి బావుంటుంద‌ని చెప్పిన కోన వెంక‌ట్‌కి, అలాగే ఛోటా కె.నాయుడు ఎంతో గొప్ప‌గా నా బిడ్డ‌ను సినిమాలో చూపించాడు. కోన వెంక‌ట్ రూపంలోనే ఆ భ‌గ‌వంతుడు మా కుటుంబానికి మంచి విజయాన్ని ఇవ్వాల‌ని పంపాడని అనుకుంటున్నాను. అనూప్ విష్ణు కోసం జిన్నా సినిమా చేశాడు.   అద్భుత‌మైన సంగీతాన్ని అందించాడు. నా మ‌న‌వ‌రాళ్లతో ఈ సినిమాలో చ‌క్క‌టి పాట పాడారు. నా బిడ్డ‌ల‌కు అవ‌కాశాన్ని ఇచ్చిన అనూప్‌కి థాంక్స్‌. అలాగే ద‌ర్శ‌కుడు సూర్య‌ సినిమా ఎంతో గొప్ప‌గా చిత్రీక‌రించాడు. కోన వెంక‌ట్ ఈ సినిమాకు త‌న పేరుని చెప్ప‌గానే నేను మ‌రో ఆలోచ‌న లేకుండా వెంట‌నే ఓకే చెప్పాను. త‌ను బాగా తీశాడు. త‌న‌కు ఓర్పు, స‌హ‌నం ఎక్కువ‌.  నేను కొన్ని సంద‌ర్భాల్లో క‌టువుగా మాట్లాడినా సినిమా కోస‌మేన‌ని న‌మ్మి, మంచి ఔట్ పుట్ కోసం క‌ష్ట‌ప‌డ్డ ద‌ర్శ‌కుడు సూర్య‌కు థాంక్స్‌. ఈ సినిమాతో త‌ను గొప్ప ద‌ర్శ‌కుడిగా ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. హీరోయిన్స్‌ స‌న్నీలియోన్‌, పాయ‌ల్ రాజ్‌పుత్ చ‌క్క‌గా న‌టించారు. అలాగే చ‌మ్మ‌క్ చంద్ర‌, వెన్నెల కిషోర్‌, గౌత‌మ్ రాజు ఇలా అంద‌రూ ఎంతో బాగా చేశారు. ఇద్ద‌రి కామెడీ ఎంతో బాగుంటుంది. చ‌మ్మ‌క్ చంద్ర ఇంత‌కు ముందు చేసిన సినిమాలు వేరు.. ఈ సినిమా వేరు. నా మ‌న‌వ‌రాళ్ల‌కి చంద్ర‌, వెన్నెల కిషోర్ కామెడీ గురించి మాట్లాడుకుంటున్నారు. అంత చ‌క్క‌గా చేశారు. నాకు ఇష్ట‌మైన కో డైరెక్ట‌ర్ ర‌మ‌ణ‌, నా త‌మ్ముడు న‌రేష్‌, ర‌ఘు బాబు అంద‌రూ మ‌న‌సు పెట్టి సినిమా చేశారు. అంద‌రికీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాల‌ని కోరుకుంటున్నాను. డైలాగ్స్ రాసిన‌, నందు, భాను మంచి పంచ్స్‌తో రాశారు. ఎడిట‌ర్ ఛోటా కె.ప్ర‌సాద్‌.. సినిమా ఎడిటింగ్‌లో చాలా సంద‌ర్భాల్లో మంచి విష‌యాల‌ను చెప్పాడు. ఏ సీన్ ఎలా ఉంది..ఎలా ఉండాల‌ని చెబుతూ మంచి ఎడిటింగ్ చేశాడు. ఈశ్వ‌ర్ రెడ్డి అయితే 300 జాన‌ప‌ద పాట‌ల‌ను అన్వేషించి జారు మిఠాయి సాంగ్‌ను తీసుకొచ్చాడు. ప్ర‌తి ఒక్క‌రూ ప్రేమ‌గా సినిమాలో న‌టించారు. పేరు పేరునా అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. 


హీరో విష్ణు మంచు మాట్లాడుతూ ‘‘జిన్నా సినిమా విషయంలో నేను ముందుగా కోన వెంక‌ట్‌గారికి థాంక్స్ చెప్పాలి. ఆయ‌న వ‌ల్లే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. త‌ర్వాత ఛోటాగారికి థాంక్స్ చెప్పాలి. ఆయ‌నతో ఎప్ప‌టి నుంచి ప‌ని చేయాల‌ని అనుకుంటుంటే ఈ సినిమాకు కుదిరింది. అనూప్‌కి స్పెష‌ల్ థాంక్స్‌. జిన్నా నా మ‌న‌సుకు ఎంతో ద‌గ్గ‌ర‌గా ఉండే సినిమా. నా కెరీర్‌లోనే బెస్ట్ మ్యూజిక్‌ని ఈ సినిమాకు ఇచ్చావ్‌. నా హార్ట్ బీట్స్ అయిన ఆరియానా, వివియానా ఈ సినిమాలో తొలిసారి పాట పాడారు. ఆ అవకాశం ఇచ్చినందుకు అనూప్‌కి థాంక్స్‌. నా మిత్రుడు, బ్ర‌ద‌ర్ అయిన ప్రేమ్ ర‌క్షిత్‌కి థాంక్స్‌. ఆయ‌న షూటింగ్‌లో ఉండి రాలేక‌పోయాడు. త‌నే ఈ సినిమాకు కాన్సెప్ట్ విజువ‌లైజేష‌న్ ఇచ్చారు. ప్ర‌తీ ఒక్కరికి పేరు పేరునా థాంక్స్‌. దివి చాలా ఇంపార్టెంట్ రోల్ చేసింది. అడిగిన వెంట‌నే ఒప్పుకున్నందుకు త‌న‌కు థాంక్స్‌. మా కంపెనీలోనే అవిడ్ అసిస్టెంట్‌గా ఉన్న ఛోటా కె ప్ర‌సాద్ ..ఈరోజు ఎడిట‌ర్ అయ్యారు. త‌న టాలెంటే ఇన్‌స్పిరేష‌న్‌. జారు మిఠాయి సాంగ్ ఇచ్చిన ఈశ్వ‌ర్ రెడ్డిగారికి థాంక్స్‌. నాగేశ్వ‌ర్ రెడ్డి స‌హా అంద‌రికీ థాంక్స్‌. చంద్ర , వెన్నెల కిషోర్ మంచి మార్కులు కొట్టేశారు. డైరెక్ట‌ర్ సూర్య‌కు థాంక్స్‌. 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 


హీరో విష్ణు మంచు మాట్లాడుతూ ‘‘జిన్నా సినిమా విషయంలో నేను ముందుగా కోన వెంక‌ట్‌గారికి థాంక్స్ చెప్పాలి. ఆయ‌న వ‌ల్లే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. త‌ర్వాత ఛోటాగారికి థాంక్స్ చెప్పాలి. ఆయ‌నతో ఎప్ప‌టి నుంచి ప‌ని చేయాల‌ని అనుకుంటుంటే ఈ సినిమాకు కుదిరింది. అనూప్‌కి స్పెష‌ల్ థాంక్స్‌. జిన్నా నా మ‌న‌సుకు ఎంతో ద‌గ్గ‌ర‌గా ఉండే సినిమా. నా కెరీర్‌లోనే బెస్ట్ మ్యూజిక్‌ని ఈ సినిమాకు ఇచ్చావ్‌. నా హార్ట్ బీట్స్ అయిన ఆరియానా, వివియానా ఈ సినిమాలో తొలిసారి పాట పాడారు. ఆ అవకాశం ఇచ్చినందుకు అనూప్‌కి థాంక్స్‌. నా మిత్రుడు, బ్ర‌ద‌ర్ అయిన ప్రేమ్ ర‌క్షిత్‌కి థాంక్స్‌. ఆయ‌న షూటింగ్‌లో ఉండి రాలేక‌పోయాడు. త‌నే ఈ సినిమాకు కాన్సెప్ట్ విజువ‌లైజేష‌న్ ఇచ్చారు. ప్ర‌తీ ఒక్కరికి పేరు పేరునా థాంక్స్‌. దివి చాలా ఇంపార్టెంట్ రోల్ చేసింది. అడిగిన వెంట‌నే ఒప్పుకున్నందుకు త‌న‌కు థాంక్స్‌. మా కంపెనీలోనే అవిడ్ అసిస్టెంట్‌గా ఉన్న ఛోటా కె ప్ర‌సాద్ ..ఈరోజు ఎడిట‌ర్ అయ్యారు. త‌న టాలెంటే ఇన్‌స్పిరేష‌న్‌. జారు మిఠాయి సాంగ్ ఇచ్చిన ఈశ్వ‌ర్ రెడ్డిగారికి థాంక్స్‌. నాగేశ్వ‌ర్ రెడ్డి స‌హా అంద‌రికీ థాంక్స్‌. చంద్ర , వెన్నెల కిషోర్ మంచి మార్కులు కొట్టేశారు. డైరెక్ట‌ర్ సూర్య‌కు థాంక్స్‌. 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను. నందు, భాను.. ప్రభుదేవా మాస్టర్‌కి స్పెష‌ల్‌ థాంక్స్‌’’ అన్నారు. 


క్రియేటివ్ ప్రొడ్యూసర్, రైట‌ర్ కోన వెంక‌ట్ మాట్లాడుతూ ‘‘జిన్నా సినిమాలో ఓ గోలిసోడా ఉంది. ఓ జారు మిఠాయి ఉంది. గోలి సోడా పాయల్ రాజ్‌పుత్ అయితే, జారు మిఠాయి స‌న్నీలియోన్‌. దీన్ని సినిమా అన‌టం కంటే, మా మోహ‌న్‌బాబు అన్న‌య్య నాపై పెట్టిన బాధ్య‌త‌. మోహ‌న్‌బాబుగారిని ఆఫీసులో క‌లిసిన త‌ర్వాత ఆయ‌న వ‌దినమ్మ‌కు ఫోన్ చేసి ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ చాలా కాల‌మైంది. ఈ రాక‌తో మా గుమ్మంలోకి విజ‌యం రావాలి అన్నారు. ఆ మాట‌ను చాలా బాధ్య‌త‌గా ఫీల్ అయ్యాను. ఆరోజు నుంచి ఈరోజు వ‌ర‌కు జిన్నా సినిమా కోసం అంద‌రం త‌పించాం. ప్ర‌తి యాక్ట‌ర్‌కి లైఫ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుంది. జిన్నా అనే సినిమా విష్ణు కెరీర్‌కి గొప్ప సెకండ్ ఇన్నింగ్స్ సినిమా అవుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడూ రెట్టింపుగానే ఉంటుంది. ఈ సినిమాకు అవ‌స‌ర‌మైన అస్త్రాల‌న్నీ ఆన్న‌య్య వాడేశారు. అందులో ఛోటా కె.నాయుడు, అనూప్ రూబెన్స్‌, స‌న్నీ లియోన్, పాయ‌ల్ రాజ్‌పుత్‌, చ‌మ్మ‌క్ చంద్ర అంద‌రూ అస్త్రాలుగా వాడాం. ఇవి కాకుండా మా చేతిలో మ‌రో బ్ర‌హ్మాస్త్రం ఉంది. అదే విష్ణు. త‌న కామెడీ టైమింగ్ ఏంటో నాకు తెలుసు. ఢీ త‌ర్వాత దేనికైనా రెడీ ప‌ని చేశాం. ఆ సినిమా త‌ర్వాత కాస్త గ్యాప్ వ‌చ్చింది. ఆ గ్యాప్‌ను ఈ సినిమాతో ఫిల్ చేశాడు విష్ణు. అలాగే మోహ‌న్ బాబుగారు మ‌మ్మ‌ల్ని ఎంతో గొప్ప‌గా ముందుకు న‌డిపించారు. ప్రేక్ష‌కులు మంచి కంటెంట్‌ను ఎప్పుడూ ఆద‌రించారు. ఇప్పుడు కూడా ఈ సినిమాను ఆద‌రిస్తార‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా డెఫ‌నెట్‌గా అంద‌రినీ శాటిస్‌ఫై, ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. సూర్య‌కు డైరెక్ట‌ర్‌గా గొప్ప భ‌విష్య‌త్తు ఇస్తుంది. అంద‌రూ గొప్ప‌గా చెప్పుకునే సినిమా అవుతుంది’’ అన్నారు.  


చిత్ర ద‌ర్శ‌కుడు ఈషాన్ సూర్య మాట్లాడుతూ ‘‘జిన్నా సినిమాను ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన మంచు ఫ్యాన్స్‌కి, ప్రేక్ష‌కుల‌కు, అతిథుల‌కు ధ‌న్య‌వాదాలు. ఈ మూవీ నాకు రావ‌టానికి ప్ర‌ధాన కార‌ణం కోనం వెంక‌ట్‌. మా గురువుగారు శ్రీనువైట్ల‌తో నేను ప‌ని చేస్తున్న‌ప్పుడు కోన‌గారు నా వ‌ర్కింగ్ స్టైల్ తెలుసు. అందువ‌ల్లే విష్ణుగారికి మంచి క‌థ‌ను త‌యారు చేసుకుని మోహ‌న్‌బాబుగారి సంస్థ‌లో సినిమా చేయాల‌నుకున్న‌ప్పుడు నా పేరుని ఆయనే సజెస్ట్ చేశారు. అందుకు ఆయ‌న‌కు థాంక్స్‌. మోహ‌న్‌బాబుగారికి నేనెవ‌రో తెలియ‌దు. విష్ణుగారికి నా గురించి కాస్త తెలుసు. నా గురించి ఏమీ తెలియ‌క‌పోయినా.. కోన‌గారికి మాట‌ను న‌మ్మి ఇంత పెద్ద సినిమాను నా చేతిలో పెట్టినందుకు మోహ‌న్‌బాబుగారికి శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. జిన్నా సినిమా క‌ల‌లాగా స్పీడుగా అయ్యింది. ప్ర‌తిదీ స‌ర్‌ప్రైజ్‌. తొలి రోజు నుంచి సినిమా పూర్త‌య్యే వ‌ర‌కు ఓ ప్ర‌శ్న కూడా వేయ‌కుండా మోహ‌న్ బాబుగారు నా వెంటే ఉండి స‌పోర్ట్ చేశారు. క‌ల‌లో కూడా ఊహించ‌ని విధంగా గొప్ప టెక్నీషియ‌న్స్‌ను ఇచ్చారు. ఛోటా కె.నాయుడు, అనూప్ రూబెన్స్, ప్ర‌భుదేవా, ప్రేమ్ ర‌క్షిత్‌, సెల్వ‌, కిచ్చ‌, రామ‌కృష్ణ , ఛోటా కె.ప్ర‌సాద్ వంటి గొప్ప టెక్నీషియ‌న్స్‌ను ఇచ్చారు. అలాగే గొప్ప న‌టీన‌టుల‌ను ఇచ్చారు. విష్ణుగారి పిల్ల‌లు ఆరియానా, వివియానా పాట పాడారు. ఆ పాట సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. స‌న్నీలియోన్‌, పాయ‌ల్ రాజ్‌పుత్ అద్బుతంగా న‌టించారు. స‌న్నీలియోన్ బెస్ట్ స‌ర్‌ప్రైజ్‌. ఇక జిన్నాగా విష్ణు మంచు అద‌ర‌గొట్టేశారు. గొప్ప క‌మిట్‌మెంట్ ఉన్న యాక్ట‌ర్‌. త‌న చుట్టూ ఉన్న వారిని ఆయ‌న చూసుకునే విధానం సూప‌ర్బ్‌. కామెడీ టైమింగ్ అద్బుతం. ఓ పాట‌లో స్టెప్ బాగా రావ‌టం కోసం 13 సార్లు చేశారంటే ఆయ‌న కమిట్‌మెంట్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. నాగేశ్వ‌ర్‌రెడ్డిగారికి, ఈశ్వ‌ర్ రెడ్డిగారు స‌హా సపోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. 


జి.నాగేశ్వ‌ర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘జిన్నా సినిమా రషెష్  చూశాను. సినిమా బ్లాక్ బస్టర్. ఎవ‌రూ డౌట్ పెట్టుకోన‌క్క‌ర్లేదు. స‌క్సెస్‌ను రీచ్ చేసే కెపాసిటీ విష్ణుకి పుష్క‌లంగా ఉంది. పోస్ట‌ర్స్‌పై వేసిన జిన్నా జాత‌ర అనే ట్యాగ్ రిలీజ్ త‌ర్వాత న‌వ్వుల జాత‌ర అని  అంద‌రూ అంటారు. త్వ‌ర‌లోనే జిన్నా బ్లాక్ బ‌స్ట‌ర్ జాత‌ర జ‌రుగుతుంది’’ అన్నారు. 


సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ ‘‘ఓరోజు కోన నా ద‌గ్గ‌రకు వ‌చ్చి నెక్ట్స్ మూడు నెల‌లు ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాను నువ్వు ఫ్రీగానే ఉంటావా అన్నాడు. నేను కూడా ఓకే చెప్పాను. త‌ను క‌థ చెప్పాడు. అద్భుతంగా ఉంది. సెకండాఫ్ అయితే ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది. విష్ణు నాకు చిన్న‌ప్ప‌టి నుంచి తెలుసు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌తో సినిమా చేయ‌లేదు. చేద్దామ‌నుకుని అత‌నితో కారులో బ‌య‌లుదేరాను. మ‌ధ్య‌లో ఉండ‌గా సినిమాకు నిర్మాత మోహ‌న్‌బాబు అని తెలిసింది. వెంట‌నే కారు ఆపేస్తే దిగిపోతాన‌ని అన్నాను. ఎందుకంటే.. నన్ను చూస్తే ఆయ‌న‌కు కోపం అని చెప్ప‌గానే.. అదేం కాద‌ని కోన‌.. న‌న్ను తీసుకెళ్లాడు. నేను ఆఫీసులోకి వెళ్ల‌గానే మోహ‌న్ బాబుగారు వ‌చ్చి న‌న్ను హ‌గ్ చేసుకున్నారు. నేను అది న‌మ్మ‌లేక‌పోయాను. అప్పుడు నేను ఆయ‌న్ని చూసిన కోణం త‌ప్పేమో అని అనుకున్నాను. నేను, ఆయ‌న గురువు దాస‌రిగారి ద‌గ్గ‌రి నుంచే వ‌చ్చాం. మా మ‌ధ్య ఏం మిస్ అండ‌ర్‌స్టాడింగ్ జ‌రిగిందో నాకు తెలియ‌దు. ఈ సినిమాకు కుదిరింది. సినిమా షూటింగ్ చేశాం. సినిమాకు ఏం కావాలో దాన్ని స‌మ‌కూర్చారు. అంత‌గా స‌పోర్ట్ చేశారు. విష్ణు టెక్నిక‌ల్‌గా సౌండ్‌. ఏమైనా అంటాడోన‌ని అనుకున్నాను. ఈ సినిమాకు ఏం మాట్లాడ‌కుండా వెళ్లిపొయేవాడు. త‌ను ఎంతో రిస్క్ చేసి సినిమా షూటంగ్ పూర్తి చేశాడు. త‌న‌కు సినిమాపై ఉన్న ప్యాష‌న్ ఏంటో తెలుసు. నేను విన్న‌ది వేరే.. నేను చూసింది వేరే. మా అంద‌రికీ ఈ  మూవీ ఫ్రౌడ్ మూమెంట్‌. డైరెక్ట‌ర్ సూర్య బావుండాలి. సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. కోన గురించి అంద‌రికీ తెలిసిందే. త‌న‌కు థాంక్స్‌. అనూప్‌.. బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా చూశాను. జిన్నా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని చెప్ప‌డానికి గ‌ర్వప‌డుతున్నాను’’ అన్నారు. 


ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు.


Share this article :