Home » » Sunder C Anthahpuram Releasing on December 31st

Sunder C Anthahpuram Releasing on December 31st

 తెలుగులో 'అంతఃపురం'గా వస్తున్న సుందర్ సి, ఆర్య, రాశీ ఖన్నాల 'అరణ్మణై 3'



సుందర్ సి, ఆర్య, రాశీ ఖన్నా, ఆండ్రియా హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ సినిమా 'అరణ్మణై 3'. హారర్ కామెడీగా రూపొందింది. ఇందులో సాక్షి అగర్వాల్, వివేక్, యోగిబాబు, మనోబాల ప్రధాన తారాగణం. సుందర్ సి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు 'అంతఃపురం' పేరుతో తీసుకొస్తోంది గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌. రెడ్ జైంట్ మూవీస్ ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో, అవని సినీమాక్స్ ప్రై.లి. ఖుష్బూ సమర్పణలో, బెంజ్ మీడియా ప్రై.లి. ఎ.సి.ఎస్. అరుణ్ కుమార్ సమర్పణలో సినిమాను విడుదల చేస్తోంది. డిసెంబర్ 31న 'అంతఃపురం' ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


తెలుగులో 'చంద్రకళ'గా విడుదలైన 'అరణ్మణై', 'కళావతి'గా విడుదలైన 'అరణ్మణై 2' సినిమాలు మంచి విజయాలు సాధించాయి. తమిళంలో 'అరణ్మణై 3'కి మంచి స్పందన లభించింది. దాంతో  ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి ఏర్పడింది. అంచనాలు ఉన్నాయి. తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన రాశీ ఖన్నా ఇందులో నటించడం స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఆమె రోల్, యాక్టింగ్ తమిళనాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. పైగా, రాశీ ఖన్నా నటించిన ఫస్ట్ హారర్ కామెడీ సినిమా ఇది. క్యూట్, బబ్లీ, పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్స్ చేసిన ఆమె... హారర్ కామెడీలో ఎలా చేసి ఉంటారో అని తెలుగు ఆడియన్స్ కూడా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.


సుందర్ సి మాట్లాడుతూ "మంచి సినిమాలు ఎప్పుడు వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. హారర్, కామెడీ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. విజువల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంటుందీ సినిమా. 'అంతఃపురం'లో‌ గ్రాండియర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నెల 31న సినిమా విడుదల చేస్తున్నాం. ప్రీ రిలీజ్ ఫంక్షన్, ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అని అన్నారు. 


ఈ చిత్రానికి ఎడిటింగ్: ఫెన్నీ ఒలీవర్, యాక్షన్: పీటర్ హెయిన్, సినిమాటోగ్రఫీ: యు.కె. సెంథిల్ కుమార్, మాటలు: ఎ. శ్రీనివాస మూర్తి, పాటలు: భువన చంద్ర, రాజశ్రీ సుధాకర్, నేపథ్య గానం: ఎస్పీ అభిషేక్, మ్యూజిక్: సత్య సి, సమర్పణ: ఉదయనిధి స్టాలిన్, ఎ.సి.ఎస్. అరుణ్ కుమార్, ఖుష్భూ, రచన, దర్శకత్వం: సుందర్ .సి.


Share this article :