Home » » Varun Tej Ghani First Punch Released

Varun Tej Ghani First Punch Released

గ్లింప్స్ ఆఫ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్  ‘గ‌ని’ ఫస్ట్ పంచ్... డిసెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదల వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ మెగాప్రిన్స్‌గా ప్రేక్ష‌కాభిమానుల‌ను మెప్పిస్తోన్న క‌థానాయ‌కుడు వ‌రుణ్‌తేజ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా చిత్రం `గ‌ని`. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. బుధ‌వారం ‘గ‌ని’  ఫ‌స్ట్ పంచ్ అంటూ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 

గ్లింప్స్‌ను గ‌మ‌నిస్తే.. బాక్సింగ్ రింగ్‌లో వ‌రుణ్ తేజ్‌ను బ్యాక్ నుంచి చూపించారు. అత‌ను బాక్సింగ్ ఆట‌గాళ్లు ధ‌రించే జెర్సీని ధ‌రించి ఉన్నాడు. దానిపై ‘గ‌ని’ అనే పేరు క‌న‌ప‌డుతుంది. వ‌రుణ్‌తేజ్ ఫేస్‌ను రివీల్ చేయ‌గానే అత‌ను ఫంచ్ విసురుతాడు. గ‌ని..క‌నివిని ఎరుగ‌ని అనే లైన్ బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తుంది. ఇది వ‌ర‌కు చిత్రాల‌కు భిన్నంగా వ‌రుణ్‌తేజ్ ఈ మూవీలో స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నాడు. డిసెంబ‌ర్ 3న ప్ర‌పంచ వ్యాప్తంగా ‘గ‌ని’ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ గ్లింప్స్ ద్వారా అనౌన్స్ చేశారు. 


ఈ సంద‌ర్భంగా నిర్మాత సిద్ధు ముద్ద మాట్లాడుతూ ‘‘డిఫ‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఇంట్రెస్ట్ చూపించే హీరో వ‌రుణ్ తేజ్‌గారు బాక్సింగ్ నేప‌థ్యం ఉన్న సినిమా కావ‌డం, మా డైరెక్ట‌ర్ కిర‌ణ్ కొర్ర‌పాటి క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పేశారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఈ సినిమాపై పెట్టిన ఎఫ‌ర్ట్స్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. విదేశాల‌కు వెళ్లి బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. తన లుక్ విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త వ‌హించారు. అలాగే మేం కూడా ఎక్కడా కాంప్ర‌మైజ్ కాలేదు. హాలీవుడ్ చిత్రం టైటాన్స్‌, బాలీవుడ్‌లో సుల్తాన్ వంటి చిత్రాల‌కు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన  హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ లార్నెల్ స్టోవ‌ల్‌, వ్లాడ్ రింబ‌ర్గ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేయ‌డం విశేషం. తెలుగు ఆడియెన్స్‌కు ఓ స‌రికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా సినిమాను భారీ రేంజ్‌లో నిర్మించాం. ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. డిసెంబ‌ర్ 3న ప్రపంచ వ్యాప్తంగా ‘గ‌ని’ చిత్రాన్ని భారీ రేంజ్‌లో విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు. 


బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 


నటీనటులు:

వ‌రుణ్ తేజ్‌, స‌యీ మంజ్రేక‌ర్‌, ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం:  కిర‌ణ్ కొర్ర‌పాటి 

నిర్మాత‌లు:  సిద్ధు ముద్ద‌, అల్లు  బాబీ

సినిమాటోగ్ర‌ఫీ:  జార్జ్ సి.విలియ‌మ్స్‌

మ్యూజిక్‌:  త‌మ‌న్‌.ఎస్‌

ఎడిటింగ్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌


Share this article :