Home » » Khalaposhakulu Trailer Launch

Khalaposhakulu Trailer Launch



 కరోన పీక్ స్టేజ్ లో ఉన్నా కూడా "కళాపోషకులు" సినిమాని పూర్తిచేసి రిలీజ్ చేస్తున్న నిర్మాత సుధాకర్ రెడ్డి గట్స్ కి హ్యాట్సాప్-ట్రైలర్ లాంఛ్ లో హీరో సుమన్!!


విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరో హీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై  చలపతి  పువ్వల ద‌ర్శ‌క‌త్వంలో యం. సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కళాపోషకులు’. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం డిసెంబర్11న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. హీరో సుమన్ ముఖ్య అతిధిగా విచ్చేసి 'కళాపోషకులు' ట్రైలర్ లాంఛ్ చేశారు. ప్రముఖ దర్శకుడు వి.సముద్ర, నిర్మాత డి.యస్.రావు ఆత్మీయ అతిధులుగా పాల్గొన్నారు. హీరో విశ్వ కార్తికేయ, హీరయిన్ దీప ఉమాపతి, చిత్ర దర్శకుడు చలపతి పువ్వుల, సీనియర్ నటి కృష్ణవేణి,  నటులు జ్వాల, చైతన్య, జబర్దస్త్ నవీన్, జెమిని సురేష్, బాష, చిన్ను, కెమెరామెన్ కళ్యాణ్ సమి, ఎడిటర్  సెల్వకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ ఎలెందర్ మహావీర్, పాల్గొనగా నిర్మాత సుధాకర్ రెడ్డి ఫ్లవర్   ప్లానెట్స్ తో అహ్వనం పలికారు.. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 18న విడుదల కానుంది.. 


ముఖ్యఅతిధి సుమన్ మాట్లాడుతూ... సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్ రామానుజం అంటే నాకు ఎంతో అభిమానం. ఆయనతో నా జర్నీ సక్సెస్ ఫుల్ గా సాగింది. వారి అబ్బాయి విశ్వకార్తికేయ హీరోగా నటించిన "కళాపోషకులు" సినిమా లో నేను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యాను. షూటింగ్ బిగినింగ్ నుండి ఈ చిత్రం గురించి అన్ని వివరాలు రామనుజం చెప్పేవాడు.. ఆయనకోసమే ఈ ఫంక్షన్ కి అటెండ్ అయ్యాను. ట్రయిలర్ చాలా బాగుంది. ఓవర్ గా కాకుండా అందరూ నేచురల్ గా యాక్ట్ చేశారు. కళ్యాణ్ ఫోటోగ్రఫీ, ఎలెందర్ మ్యూజిక్ సింప్లి సూపర్బ్.   విశ్వకార్తికేయను చిన్నప్పుడు  నుండి చూస్తున్నాను. బాల నటుడిగా ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాడు. ఇప్పుడు హీరోగా మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ మంచి ఈజ్ తో చేసాడు..తప్పకుండా ఇండస్ట్రీలో మంచి హీరోగా నిలబడతాడాని.. నాకు నమ్మకం ఉంది.. ఇక దర్శకుడు చలపతి పిసిరెడ్డి గారి స్కూల్ నుండి వచ్చాడు కాబట్టి ఈ సినిమాని వండర్ ఫుల్ గా తెరకెక్కించాడని భావిస్తున్నాను.. కరోన పీక్ స్టేజ్ లో వున్నా కూడా షూటింగ్ చేసిన  ఉన్న నిర్మాత సుధాకర్ రెడ్డి గట్స్ కి హ్యాట్సాప్.. ఎంతో మంది నటీ నటులకి టెక్నీషియన్స్ కి సహాయాన్ని అందించారు.. ఈ సినిమాకి వర్క్ చేసిన టీమ్ అందరికీ అభినందనలు.. అన్నారు.


ప్రముఖ దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ... ఈ సినిమా చూసాను. చాలా బాగుంది. ఇట్స్ ఎ ఔట్ అండ్ ఎంటర్టైనర్.. మా శిష్యుడు చలపతి చాలా అద్భుతంగా సినిమాని తెరకెక్కించాడు.. సుధాకర్ రెడ్డి ఫస్ట్ సినిమా అయినా మేకింగ్ వైజ్ గా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. కరోన కష్ట కాలంలో కళ గొప్పదని కళాకారులు చిత్రాన్ని నిర్మించారు. విశ్వకార్తికేయ ఎక్సలెంట్ గా చేసాడు. ఫ్యూచర్ లో గొప్ప స్టార్ అవుతాడు.. 18న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను...అన్నారు. 


ప్రముఖ నిర్మాత.. డి.యస్.రావ్ మాట్లాడుతూ... ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను లొకేషన్ కి వెళ్లి చూశాను.. హీరో, హీరోయిన్ పెయిర్ క్యూట్ గా వున్నారు.. పర్ఫెక్ట్ జోడి.. సినిమా చూశాను.. అందరూ ఎంజాయ్ చేసే విదంగా ఉంటుంది.. అన్నారు.


చిత్ర దర్శకుడు చలపతి పువ్వుల మాట్లాడుతూ... సీనియర్ దర్శకులు పిసి రెడ్డి గారి వద్ద వర్క్ చేసాను. కరోన క్రైసెస్ లో నాకు సహకరించిన టీమ్ అందరికీ థాంక్స్. నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసిన నిర్మాత సుధాకర్ రెడ్డి అన్నకు ధన్యవాదాలు. ఈచ్ అండ్ ఎవ్విరి ఫ్రెమ్ బ్యూటీఫుల్ గా తీర్చి దిద్దిన కళ్యాణ్, ఔట్ స్టాండింగ్ మ్యూజిక్ ఇచ్చిన ఎలెందర్ కి థాంక్స్.. మంచి సినిమాని బ్రతికించండి.. అన్నారు. 


నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ... ఇది నా  ఫస్ట్ ఫిల్మ్. చలపతి చాలా బాగా తీశాడు. ఎలెందర్ మ్యూజిక్, రీ-రికార్డింగ్ వండర్ ఫుల్ గా చేశాడు.. కళ్యాణ్ సమి విజువల్స్ సూపర్బ్ గా ఇచ్చారు.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్18న భారీగా రిలీజ్ చేస్తున్నాం.. అన్నారు. 


హీరో విశ్వకార్తికేయ మాట్లాడుతూ... సుమన్ గారి చేతులు మీదుగా ట్రయిలర్ రిలీజ్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ప్రతి ఒక్కరూ తమ సొంత సినిమాలా భావించి వర్క్ చేశారు.. చలపతి ఈ సినిమాని చాలా ఫాస్ట్ గా ఎక్కడ వేస్టేజ్ లేకుండా తెరకెక్కించాడు. ఒక బ్రదర్ లా మా ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది. ఇక నిర్మాత సుధాకర్ రెడ్డి కరోన టైంలో కూడా భయపడకుండా పర్మిషన్ తీసుకొని షూటింగ్ చేశారు.. ఆయన గట్స్ కి నిజంగా హ్యాట్సాప్. కళ్యాణ్ విజువల్స్, ఎలెందర్ మ్యూజిక్ సినిమాకి మేజర్ ఎస్సెట్ గా నిలిచాయి. టీమ్ అంతా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం.. కళాపోషకులు సినిమా ఆడియెన్స్ ని కడుపుబ్బా నవ్విస్తుందని గ్యారెంటీగా చెప్పగలను.. ఈ చిత్రాన్ని ఆదరించి సక్సెస్ చెయ్యాలని కోరుకుంటున్నాను.. అన్నారు.


 విశ్వకార్తికేయ, దీప ఉమాపతి జంటగా నటించిన ఈ చిత్రంలో భాష, చైతన్య, చిన్ను, జ్వాల, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్, చిట్టిబాబు, తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరామెన్: కళ్యాణ్ సమి,

ఎడిటర్: సెల్వ కుమార్, సంగీతం: ఎలేందర్ మహావీర్, పీఆర్ఓ: సాయి సతీష్, నిర్మాత, స్టొరీ: సుధాకర్ రెడ్డి.ఎం. స్క్రీన్ ప్లే-డైలాగ్స్- డైరెక్షన్: చలపతి పువ్వల.


Share this article :
 
Copyright © 2015. TeluguCinemas.in | Telugu Cinemas - All Rights Reserved
Thank You Visit Again