Home » » Prema Ishq Kaadhal Review -Pik-Different Love Story

Prema Ishq Kaadhal Review -Pik-Different Love Story




చిత్రం: ప్రేమ ఇష్క్ కాదల్


నటీనటులు : హర్షవర్ధన్ రానే, శ్రీ విష్ణు, హరీష్ , వితిక, రీతూ వర్మ, శ్రీ ముఖి సింగర్ మధూ  తదితరులు
సంగీతం: శ్రవణ్

దర్శకత్వం: పవన్ సాధినేని
నిర్మాత: బెక్కం వేణుగోపాల్
విడుదల తేదీ: 06/12/2013

ప్రేమ ఇష్క్ కాదల్ బాషలు వేరైనా  అర్థం ఒక్కటే ప్రతి సినిమా లో ఒక ప్రేమ కధ  వుంటుంది ఈ సినిమా లో ముగ్గురు హీరోలు కాబట్టి మూడు ప్రేమ కధలు వున్నాయి  
1) ప్రేమ - శ్రీ విష్ణు-రీతూ వర్మ,
2) ఇష్క్- హర్షవర్ధన్ రానే-వితిక
3)  కాదల్ -హరీష్ - శ్రీ ముఖి


మొదటి కధ శ్రీ విష్ణు-రీతూ వర్మ (ప్రేమ)


రాయల్ రాజు(శ్రీ విష్ణు) సమీర(రీతూ వర్మ) లు విచిత్రం గ కలుస్తారు అనుకోకుండా ఒకే చోట పని చేస్తారు  మన రాయల్ రాజు మొదటి చూపులోనే సమీర ఫై మనసు పారేసుకుంటాడు . ఆమెకి దగ్గర అవుతాడు ఆమె తన భార్య అని ఫిక్స్ అవుతాడు  ఇంతకి రాయల్ రాజు రాయల్ గ పెళ్లి చేసుకున్నాడ లేదా  పల్లె టూరు  నుంచి వచ్చిన రాజు సమీర ను ఎలా ప్రేమలో పడేసాడు అది మిగిలిన కధ 
రెండో కధ హర్షవర్ధన్ రానే-వితిక (ఇష్క్)
కాఫీ షాప్  నడుపుకుంటూ ఎవరు లేనప్పుడు పాటలు పాడుకుంటూ గొప్ప సింగర్  అవ్వగలిగే లక్షణాలు వున్నా ఆ ప్రయత్నాలు చేయడు  రాండీ. తన కోసం ఆమె కాలేజీ లో షో చేయాలి అని  సరయు  రాండీ ని ఒప్పిస్తుంది అలా షో చేసిన రాండి అలియాస్ రణధీర్ మళ్ళి  షో లు చేసాడ లేదా గొప్ప గాయకుడు  అయ్యాడ లేదా సరయు రాండి ల ప్రేమ ఎలా చిగురించింది అన్నది మరో స్టొరీ 

మూడో  కధ హరీష్ - శ్రీ ముఖి  (కాదల్ )
ఇది తమిళ్ అమ్మాయి తెలుగబ్బాయి  ప్రేమ కధ  కాబట్టి  (కాదల్ ) అని పెట్టారు శ్రీముఖి తమిళ్ అమ్మాయి హరీష్ తెలుగబ్బాయి  అర్జున్(హరీష్ )  ఒక రేడియో లో పనిచేస్తూ వుంటాడు ప్రతి అమ్మాయిని వలలో వేసుకునే ప్లే బాయ్ అలాంటి ప్లే బాయ్ కన్ను శాంతి(శ్రీ ముఖి) మీద పడుతుంది ఆమెను ఎలాగయినా తన ప్రేమ లో పడేయాలి అని చూస్తూ వుంటాడు ఇంతలో శాంతి(శ్రీ ముఖి)  ఒక షాక్ ఇస్తుంది దాంతో వీరి కధ ఎటు మలుపు తిరిగింది అన్నది మిగిలిన కధ 
ఈ మూడు జంటల ప్రేమ కథలకు ముగింపేమిటో తెలుసుకోవాలంటే ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రం చూడాల్సిందే.

ఇక ప్లస్ అండ్ మైనస్ విషయానికి వస్తే 
ప్లస్ పాయింట్స్
హీరో విష్ణు అలియాస్ రాయల్ రాజు నటన ఫస్ట్ అండ్ బిగ్ ప్లస్ పాయింట్ తెలుగు సినిమా కి మరో మంచి నటుడు దొరికాడు  
సెకండ్ ప్లస్ పాయింట్ మ్యూజిక్  
ఇక మిగిలిన  నటులు కూడా బాగానే చేసారు 
హరీష్ అండ్ హర్ష వర్ధన్ వాళ్ళ పాత్రకి న్యాయం చేసారు 
చిన్న బడ్జెట్ సినిమా అనే ఫీలింగ్ రాకుండా  ప్రొడ్యూసర్ మంచి రిచ్ లుక్ ఇచ్చారు అందుకు వారిని అభినందించాలి 
సత్యం రాజేష్ ,జోష్ రవి  ప్రేక్షకులను బాగా అలరిస్తారు 
దేశీ గర్ల్ ఆల్బమ్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న సింగర్ మధూ ఈ సినిమాలో అర్జున్ కి బాస్ గా నటించారు చిన్న పాత్ర అయ్యిన బాగానే చేసారు 

మైనస్ పాయింట్స్ 


క్లైమాక్స్ సరిగా లేకపోవడం ఒక మైనస్ ఏంటి ఇలా వుంది సంథింగ్ మిస్సింగ్ అన్నటు వుంటుంది 

మరో పక్క 20 నిమిషాలు షార్ట్ ఫిలిం ని 2 గంటలా  పాటు సాగదిసారు ఏంటి ?అనిపిస్తుంది సెకండ్ హాఫ్  
 సైడ్ పాత్ర వేసిన ఒక నటి తప్పు చేస్తే ఏంటో అనుకోవచ్చు కానీ హీరొయిన్  తన ప్రమోషన్ కోసం తప్పు దారులు తొక్కడం అంత సమంజసం గా లేదు నువ్వు నీ కోసం తప్పు చేసావు నేను నా కోసం తప్పు చేశాను అని చెప్పి తను చేసింది కరెక్ట్ అని ఒప్పించడం బాగోలేదు శ్రీ ముఖి చేసిన శాంతి పాత్ర అంత గొప్ప గా లేదు 
కొన్ని సీన్స్ చాల రొటీన్ గా వున్నాయి డైరెక్టర్ సెకండ్ హాఫ్ మీద కొంచం ఇంట్రెస్ట్ పెట్టలసింది 

సాంకేతిక విభాగం పని తీరు చాల బాగుంది ముఖ్యం గా మ్యూజిక్ ఈ సినిమా కి మెయిన్ ప్లస్ మ్యూజిక్ అందించిన శ్రవణ్, ను అభినందించాలి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది 

డైలాగ్స్  బాగున్నాయి  
సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని చాల బాగా వర్క్ చేసాడు ప్రతి ఫ్రేం చాల ఫ్రెష్ గా వుంది 
చాల వరకు క్లీన్ ఎంటర్టైన్మెంట్  అందించిన పవన్ సదినేని కొంచం తడబడ్డాడు ఓవరాల్ గా మంచి మార్కులే కొట్టేసాడు 

తీర్పు (ప్రేమ ఫలించింద లేదా )



ఈ సినిమా ని ఈజీ గా ఒక సారి  చూడొచ్చు  కానీ అక్కడ అక్కడ బోర్ ఫీల్ అవుతారు 


తెలుగు సినిమాస్ రేటింగ్ : 3/5

సందీప్ 

Prema-ishq-kaadhal-Review-Prema-ishq-kaadhal-Ratings-Prema-ishq-kaadhal-different-love-story-Prema-ishq-kaadhal-web-ratings-Prema-ishq-kaadhal-Reviews-pavan-sadineni-Prema-ishq-kaadhal-Review-Pik-Reviews-Pik-Rating-Pik-news-Prema-ishq-kaadhal-hit-or-Flop-Telugucinemas.in-Review


Share this article :