Home » » Venkatadri Express Review ,Rating,Details-Telugucinemas.in

Venkatadri Express Review ,Rating,Details-Telugucinemas.in






సినిమా : వెంకటాద్రిఎక్స్ ప్రెస్ 
 విడుదల : 29 నవంబర్ 2013 
 నటీనటులు : సందీప్ కిషన్, రాకుల్ ప్రీత్ సింగ్…నగినీడు ,బ్రహ్మాజీ,సప్తగిరి తాగుబోతు రమేష్ 
 నిర్మాత : కిరణ్ 
 సంగీతం : రమణ గోగుల
 దర్శకుడు : మేర్లపాక గాంధీ 
 సినిమాటోగ్రఫీ :చోటా కే నాయుడు 
  బ్యానర్: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ 

స్నేహ గీతం ప్రస్థానం వంటి సినిమా లతో మంచి  గుర్తింపు తెచ్చుకున్న హీరో సందీప్ కిషన్ . అంచలంచలుగా మంచి కధలు యెన్నుకుంటూ హీరో గా తనకంటూ ఒక ప్రత్యేక శైలి ని సృష్టించుకున్నాడు సందీప్ . అతనికి  మంచి ఫైర్ ఉన్నప్పటికీ కొన్ని సినిమా లు ఆశించిన స్థాయిలో ఆడలేదు ఇప్పుడు వెంకటాద్రిఎక్స్ ప్రెస్ తో మరో సరి మనముందుకు వచ్చాడు  ఈ వెంకటాద్రిఎక్స్ ప్రెస్  ప్రయాణం ఫస్ట్ క్లాసు లో జరిగినంత సుఖం గా జరిగిందో లేక జెనరల్ కంపార్ట్ మెంట్ ప్రయాణం  లా కష్టం గా జరిందో తెలియాలి అంటే మీరు మాతో కాసేపు మా స్టేషన్ లో ఆగాలి 

ప్రయాణం వివరాలు (కధ): ఇది ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ రామ్మూర్తి(నాగినీడు) కుటుంభ కధ   ఈ మాస్టర్ క్రమశిక్షణ కి మారుపేరు . స్కూల్ లో రూల్స్ లాగానే ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు రూల్స్ పాటిస్తూ  క్రమశిక్షణ  గా వుండాలి అని కుటుంబ రాజ్యాంగం ఒక్క చట్టం తాయారు చేస్తారు . ఆ ఒక్క చట్టం ఏంటి అంటే 100 తప్పులు చేసిన వారిని ఇంటి నుంచి బహిష్క రించడం. మన హీరో సందీప్ రామ్మూర్తి గారి చిన్న కొడుకు . చిన్న కొడుకు కాబట్టి కొంచం అల్లరి ఎక్కువ వుంటుంది కదా . అలాంటి  అల్లరి తో మన హీరో 99 తప్పులు చేస్తాడు ఇంకో తప్పు చేస్తే ఇంట్లో నుండి పంపించేస్తారు అన్నభయం  తో సందీప్ జీవిస్తూ వుంటాడు .  ఇంతలో అన్నయ్య (బ్రహ్మాజీ) పెళ్లి ఫిక్స్ అవుతుంది . తిరుపతి లో పెళ్లి హీరో ఫ్యామిలీ తో  హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో తిరుపతికి బయలుదేరుతారు ? కానీ హీరో ఒక్కడే ట్రైన్ మిస్ అవుతాడు . అలా ట్రైన్ మిస్ అవ్వడానికి కారణం ఏంటి ? ఇంతకి సందీప్ కి ప్రార్ధన(హీరొయిన్ రాకుల్ ప్రీత్ సింగ్) ఎక్కడ కలిసింది . స్వతహాగా ఎక్కువ  దూకుడు తో వుండే సందీప్ 100వ తప్పు  చేసాడ ? తిరుపతి లో ఏం  జరిగింది ? ట్రైన్ మిస్ అయ్యిన వాడు తిరుపతి రైల్వే స్టేషన్ లో ఎలా ప్రత్యక్షమయ్యాడు అన్నది తెలుసు కోవాలి అంటే మీరు వెంకటాద్రిఎక్స్ ప్రెస్  ధియేటర్ టికెట్ కొన్ని ప్రయాణం చెయ్యాలి 

ప్రయాణికుల వివరాలు వారి పని తీరు : (ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ )

 ఆర్టిస్ట్ పెర్ ఫార్మెన్స్ : 

ముఖ్యం గా చెప్పుకోవలసింది సందీప్ కిషన్ యాక్టింగ్ గురించి ఈ సినిమా లో చాల ఇంప్రూవ్ అయ్యాడు ఎమోషనల్ సీన్స్ ని బాగా చేసాడు  డాన్స్ కొంచం మెరుగు పరచాలి 
ఇక రాకుల్ ప్రీత్ సింగ్ విషయానికి వస్తే  ఒక తెలుగు అమ్మాయిల చాల బాగా చేసింది మెలమెల్లగా అనే  పాట లో రాఘవేంద్ర రావు సినిమా లో హీరొయిన్ లా చాలా గ్లామరస్ గా కనిపించింది
సప్తగిరి తన నటన లో కడుపు చెక్కలయ్యేలా నవించాడు అదే నండి దస్తగిరి  . ఇక తాగుబోతు రమేష్ గురించి చెప్పాల్సిన పనే లేదు  నిలబడి నీళ్ళు ప్రతి ఒక్కడు తాగుతాడు రన్నింగ్ చేస్తూ రమ్  తాగే వాడె మగాడు వంటి డైలాగ్ లతో ఎప్పటి లాగానే అలరించాడు మంచి మార్కులు కొట్టేసాడు . 
బ్రహ్మాజీ ,నాగినీడు,వారి పాత్రలకు న్యాయం చేసారు  ఎం.ఎస్ నారాయణ, జయప్రకాశ్ రెడ్డి,జస్ట్ ఓకే అని పించారు 


సాంకేతిక విభాగం 
ఈ విభాగం విషయానికి వస్తే ముఖ్యం గా  మేచ్చుకోవలసింది దర్శకుడు మేర్లపాక గాంధీ ని ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన సినిమా లా మాత్రం లేదు ఎంతో అనుభవం వున్నా డైరెక్టర్ లా ఈ సినిమా ని తెరకెక్కించాడు కధ చిన్నదే అయినప్పటికీ ఆ కధ ను   ఫుల్  ఎంటర్ టైనింగ్ ఫార్మేట్ లో   ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు ట్రైన్ ఎపిసోడ్స్ చాల బాగా తెరకెక్కించాడు   
చోటా కే నాయుడు   సినిమాటోగ్రఫీ   బాగుంది 
చేసింది సినిమా లో  వున్నవి రెండు పాటలే అయిన రమణ గోగుల మంచి మ్యూజిక్ ఇచ్చారు 
ప్రొడ్యూసర్  జెమినీ కిరణ్ కూడా శక్తి వంచన లేకుండా కర్చుపెట్టారు బాగా రిచ్ గా సినిమా తీసారు 
డైలాగ్ లు  కూడా బాగా రాసాడు దర్శకుడు మేర్లపాక గాంధీ  
గౌతం రాజు  ఎడిటింగ్ కూడా బాగుంది 

మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్ ఉన్నంత బాగా సెకండ్ హాఫ్ వుండదు కొంచం బోర్ అనిపిస్తుంది ప్రతి సినిమా లోను ఈ బోర్ ఎక్కడో చోట కలుగు తుంది అది పెద్ద పట్టించు కునే పని లేదు 
 జెమినీ సురేష్ పాత్ర అంత గా పండలేదు డైనసోర్ కూర ,ఏనుగు బిర్యానీ ,పులి పలావ్ ఇలాంటివి సాధ్యం కావు ఫై గా పెళ్లి విందు లో అంటే  కచ్చితం గా సాధ్యం కాదు ఇలాంటి వి చేయించడానికి ప్రయత్నించడం హాస్యాస్పదం గా వుంది 


తీర్పు: 
ఇప్పుడు వస్తున్న సినిమా ల తో పోలిస్తే ఈ సినిమా మంచి సినిమా అని చెప్పక తప్పదు ఫస్ట్ హాఫ్ జర్నీ సూపర్   ఫాస్ట్ గా మంచి కంఫర్ట్ గా జరుగుతుంది సెకండ్ హాఫ్ కాస్త  స్లో గా వుంటుంది మీరు కొన్న టికెట్ తో కచ్చితం గా మంచి జర్నీ చేయగలరు అని నేను నమ్ముతున్నాను మీకు కావలసిన అన్ని సౌకర్యాలు అన్ని హంగులు ఈ వెంకటాద్రిఎక్స్ ప్రెస్  లో వున్నాయి మీరు  చేరవలసిన గమ్యం సునాయాసం గా సుఖం గా చేరుతారు ఓవర్ అల్ గా  ఈ వెంకటాద్రిఎక్స్ ప్రెస్ సినిమా పైసా వసూల్ సినిమా 
తెలుగుసినిమాస్ రేటింగ్ 3. 25/5 
రివ్యూ -సందీప్ 

Venkatadri Express short Review in English 

This venkatadri express movie is Good it is directed by M.Gandhi this is his Debut movie but he has given extra ordinary output and proved his stamina 
coming to sundeep kishan he performed well and improved a lot  but he can do better in Dances  
Rakul preeth singh  done female lead role in thismovie she look stunning and performed well 
chota k naidu camera work is good 
Tagubothu ramesh ,sapthagiri entertained audience with their performance 
M.s narayana ,Jayaprakash reddy roles not upto the mark 
Producer Gemini kiran production values are good 
Ramana gogula music is also good 
Compared to First half second half is slow 
Over all movie is Entertaining and paisa vasool movie 



Tags: venkatadri-express-Telugu-Movie-review-venkatadri-express-Cinema-review-Sundeep-Kishan-Gandhi-venkatadri-express-Film-Review-sandeep-kishan-rakul-preeth-singh-Venkatadri-Express-Movie-Review-Venkatadri-Express-Rating-Venkatadri-Express-public-talk-Venkatadri-Express-Film-news-Telugucinemas.in  
  




Share this article :